సాక్షి, తాడేపల్లి: పబ్లిసిటీలో చంద్రబాబును మించిన వ్యక్తి మరొకరు ఉండరు. ఆయనకు పబ్లిసిటీ అంటే పిచ్చో ఇప్పటికే పలు సందర్భాల్లో చూశాం. పబ్లిసిటీ కోసం చంద్రబాబు ఏం చేయడానికైనా వెనుకాడరు. ఇక, తాజాగా అన్న క్యాంటీన్ల ప్రారంభం సందర్భంగా పెదబాబు, చినబాబు తమలోని నటనను బయటకు తీశారు. దీనికి సంబంధించిన వీడియోను వైఎస్సార్‌సీపీ ట్విట్టర్‌లో పోస్టు చేసింది.
కాగా, వైఎస్సార్‌సీపీ ట్విట్టర్ వేదికగా..‘అన్న క్యాంటీన్‌లో భోజనంపై ఎంత నమ్మకమో?. అర ఇడ్లీతో సరిపెట్టిన నారా లోకేష్.. రెండు చెంచాల రైస్‌తో మమ అనిపించిన చంద్రబాబు. భోజనంలో నాణ్యతని గాలికొదిలేసి.. పబ్లిసిటీలో తెలుగు తమ్ముళ్లు బిజీ. ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తూ టీడీపీ నేతలు పెత్తనం’ అంటూ వీడియోను పోస్టు చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు.
అన్న క్యాంటీన్‌లో భోజనంపై ఎంత నమ్మకమో?
అర ఇడ్లీతో సరిపెట్టిన @naralokesh.. రెండు చెంచాల రైస్‌తో మమ అనిపించిన @ncbn
భోజనంలో నాణ్యతని గాలికొదిలేసి.. పబ్లిసిటీలో తెలుగు తమ్ముళ్లు బిజీ
ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తూ టీడీపీ నేతలు పెత్తనం pic.twitter.com/Pkvq3BAG6x— YSR Congress Party (@YSRCParty) August 16, 2024
Comments
Please login to add a commentAdd a comment