
గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ కార్యాలయాలు, అన్నా క్యాంటీన్లపై టీడీపీ రంగులు వెయ్యటాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టు పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై బుధవారం ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది.
గతంలో గ్రామ సచివాలయలకు బ్లూ కలర్ వేయటంపై తీర్పు ఇచ్చినట్టు పిటిషనర్ తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. బ్లూ కలర్ తొలగించాలని ఆదేశాలు ఇచ్చిందని, రంగులు తొలగించటానికి సమయం పట్టగా కోర్టు ధిక్కరణ పిటిషన్ కూడా దాఖలైందని పిటిషనర్ తరపున న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
దీంతో అన్నా క్యాంటీన్లకు ఇంతకు ముందు ఏ కలర్ వేశారని హైకోర్టు ప్రశ్నించింది. అదేవిధంగా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ ఏపీ హైకోర్టు 6 వారాలకు వాయిదా వేసింది.

చదవండి: ఏపీ ప్రజల కళ్లల్లో కూటమి ‘ఇసుక’!