
సాక్షి, అన్నమయ్య జిల్లా: రాజంపేట అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమం రచ్చరచ్చగా మారింది. టీడీపీ నేతల కుమ్ములాటతో అధిపత్య పోరు బయటపడింది. పార్లమెంటు అధ్యక్షుడు జగన్మోహన్‌రాజు, ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం వర్గాల మధ్య తోపులాట జరిగింది. మేం ప్రారంభించాలంటే.. మేమంటూ ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది.
కత్తెరని లాక్కుని ప్రారంభోత్సవం చేసేందుకు ఇరువర్గాలు ప్రయత్నించాయి. పార్లమెంటు అధ్యక్షుడు జగన్మోహన్‌రాజు చొక్కా సుగవాసి వర్గీయులు పట్టుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఇదీ చదవండి: ఎల్లో మీడియాకు నటి కాదంబరీ జత్వానీ ఝలక్
మరో వైపు, అన్నక్యాంటీన్లను పైసా వసూల్ కేంద్రాలుగా చంద్రబాబు సర్కార్ మార్చేసింది. ప్రజల సొమ్మును దోచుకునేందుకు ప్లాన్ సిద్ధం చేసింది. అన్నా క్యాంటీన్లను ప్రభుత్వమే నిర్వహిస్తుందంటూ కలరింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. మాట మార్చేశారు. ఇన్నాళ్లు డబ్బాకొట్టి.. వాటికి టీడీపీ రంగులు వేసి ఆర్భాటం చేశారు. కానీ.. ఇప్పుడు ప్రజల నుంచి చందాలు సేకరణ అంటూ మాట్లాడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment