సాక్షి, అన్నమయ్య జిల్లా: వైఎస్సార్‌సీపీ నేత, అంగళ్లు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉమాపతిరెడ్డిని విచారణ పేరుతో మదనపల్లి తాలూకా పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారు. ఆయనను బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు.
అయితే, 2023లో చంద్రబాబుపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలంటూ పోలీసులు ఒత్తిడి చేస్తుండగా, ఈ కేసు విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఉమాపతిరెడ్డి తేల్చి చెప్పారు. పోలీసులు గత పది రోజులుగా ఇబ్బందులు పెడుతున్నారని.. విత్ డ్రా చేసుకోవాలంటూ బెదిరింపులకు దిగుతున్నారని ఉమాపతిరెడ్డి అన్నారు.
ముదివేడు ప్రాజెక్టును అడ్డుకున్న చంద్రబాబు తీరుపై ప్రశ్నించేందుకు రైతులు అందరూ వెళ్తే మాపై దాడి చేయాలని చంద్రబాబు ఆరోజు సూచించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కేసు విత్ డ్రా చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. ఈ కేసు విషయంలో చార్జిషీట్ వెంటనే వేయాలి. హైకోర్టులో పిటిషన్ వేశాను. అక్కడే తేల్చుకుంటా’’ అని ఉమాపతిరెడ్డి స్పష్టం చేశారు. పోలీసుల తీరుపై వైఎస్సార్‌సీపీ నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఎవరికోసం ఈ అవతారం?
Comments
Please login to add a commentAdd a comment