RAJAMPET
-
ఇంటికొచ్చి లింగ నిర్ధారణ పరీక్ష
కామారెడ్డి టౌన్: మొబైల్ వైద్య పరీక్షల ముసుగులో ఇంటి వద్దకే వచ్చి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ఓ వ్యక్తి పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన గురువారం కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన బల్ల రవీందర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో స్కానింగ్ సెంటర్లో పని చేస్తూ గర్భిణీలకు లింగనిర్ధారణ పరీక్షలు ఎలా చేయాలో నేర్చుకున్నాడు. ఓ గర్భిణి లింగనిర్ధారణ కేసులో ఆ ఆస్పత్రి రెండేళ్ల క్రితం సీజ్ కావడంతో రవీందర్ రాజంపేటలో స్వయంగా లింగనిర్ధారణ పరీక్షలు ప్రారంభించాడు. ఇందుకోసం ఓ మినీ స్కానింగ్ యంత్రాన్ని కొనుగోలు చేశాడు.వాస్తవానికి అతనికి స్కానింగ్ చేసే అర్హత లేదు. అయితే వారి కుటుంబ వృత్తి అయిన బీడీ కార్ఖానా ముసుగులో స్కానింగ్ పరీక్షలు ప్రారంభించాడు. రోజూ బీడీల గంప పేరుతో జిల్లావ్యాప్తంగా పలు గ్రామాల్లో పర్యటించి గర్భిణీలకు లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూ డబ్బులు దండుకుంటున్నాడు. చట్ట విరుద్ధంగా లింగ నిర్ధారణ చేస్తూ ఆడ, మగ శిశువు అని చెప్పి గర్భస్థ పిండాలను చిదిమేసేందుకు కారకుడయ్యాడు. కామారెడ్డి, గాంధారి, తాడ్వాయి, దోమకొండ, బీబీపేట, మాచారెడ్డి, సదాశివనగర్, ఎల్లారెడ్డి, బాన్సువాడ ఇలా చాలా మండలాలకు తన ద్విచక్ర వాహనంపై మినీ స్కానింగ్ యంత్రాన్ని తీసుకెళ్లి గర్భిణి ఇంటి వద్దనే లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నాడు.ఆడ పిల్లలుండి మగ పిల్లలు కావాలనుకునే వారి గురించి ఆరాతీస్తూ గుట్టుచప్పుడు కాకుండా రెండేళ్లుగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాడు. ఒక్కొక్కరి నుంచి రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నాడు. ఈ విషయమై ఫిర్యాదులు రావడంతో కామారెడ్డి సీసీఎస్ పోలీసులు బుధవారం అర్ధరాత్రి రవీందర్ ఇంటిపై దాడి చేసి అరెస్టు చేశారు. ఇంట్లో ఉన్న స్కానింగ్ యంత్రాన్ని స్వాధీనం చేసుకుని దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేస్తున్నారు. -
అన్న క్యాంటీన్లో తెలుగు తమ్ముళ్ల కుమ్ములాట
సాక్షి, అన్నమయ్య జిల్లా: రాజంపేట అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమం రచ్చరచ్చగా మారింది. టీడీపీ నేతల కుమ్ములాటతో అధిపత్య పోరు బయటపడింది. పార్లమెంటు అధ్యక్షుడు జగన్మోహన్రాజు, ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం వర్గాల మధ్య తోపులాట జరిగింది. మేం ప్రారంభించాలంటే.. మేమంటూ ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది.కత్తెరని లాక్కుని ప్రారంభోత్సవం చేసేందుకు ఇరువర్గాలు ప్రయత్నించాయి. పార్లమెంటు అధ్యక్షుడు జగన్మోహన్రాజు చొక్కా సుగవాసి వర్గీయులు పట్టుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.ఇదీ చదవండి: ఎల్లో మీడియాకు నటి కాదంబరీ జత్వానీ ఝలక్మరో వైపు, అన్నక్యాంటీన్లను పైసా వసూల్ కేంద్రాలుగా చంద్రబాబు సర్కార్ మార్చేసింది. ప్రజల సొమ్మును దోచుకునేందుకు ప్లాన్ సిద్ధం చేసింది. అన్నా క్యాంటీన్లను ప్రభుత్వమే నిర్వహిస్తుందంటూ కలరింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. మాట మార్చేశారు. ఇన్నాళ్లు డబ్బాకొట్టి.. వాటికి టీడీపీ రంగులు వేసి ఆర్భాటం చేశారు. కానీ.. ఇప్పుడు ప్రజల నుంచి చందాలు సేకరణ అంటూ మాట్లాడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. -
దిగడం సరే.. ఎక్కడమెలా!
రాజంపేట: ఒక రైలుకు ఒక స్టేషన్లో హాల్టింగ్ ఇస్తే.. ఆ రైలు అప్, డౌన్లకు హాల్టింగ్ ఉన్నట్లే.. అయితే గుంతకల్లు డీవోఎం(కోచ్) పేరిట విడుదలైన ఉత్తర్వులలో హాల్టింగ్స్ పై వింతవైఖరి శనివారం బట్టబయలైంది. పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కన్ఫ్యూజ్ హాల్టింగ్ ఆర్డర్స్ జారీ చేసి ప్రయాణికులను గందరగోళంలోకి నెట్టేశాయి. మోదీ పాలనలో అడ్డగోలుగా అధికారులు తీసుకుంటున్న వింత నిర్ణయాలతో కేంద్రం పేద, మధ్యతరగతి వారి నుంచి చెడ్డపేరు మూటకట్టుకుందనే విమర్శలున్నాయి. ఈ పరిస్థితి ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో రైల్వేపరంగా గుర్తింపు కలిగిన నందలూరు రైల్వేకేంద్రంలో చోటుచేసుకుంది. కడప నుంచి విశాఖకు (17487) తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలుకు నందలూరులో హాల్టింగ్ ఎత్తివేశారు. అయితే విశాఖ నుంచి తిరుపతికి వచ్చే తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలుకు నందలూరులో హాల్టింగ్ ఇచ్చారు. ఎక్కేందుకు వీలులేకుండా, వచ్చేందుకు వీలు కల్పించే హాల్టింగ్ ఇచ్చారు. అలాగే 17415 నంబరుతో నడిపించే తిరుపతి నుంచి కోల్హాపూర్‌కు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలుకు హాల్టింగ్‌ను ఎత్తివేశారు. అయితే కోల్హాపూర్ నుంచి తిరుపతికి వెళ్లే ఎక్స్‌ప్రెస్‌కు నందలూరు హాల్టింగ్‌ను ఇచ్చారు. ఈ విధంగా హాల్టింగ్స్ ఇవ్వడం విడ్డూరంగా ఉందని రైల్వే వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఓబులవారిపల్లె, రాజంపేటలో..ఓబులవారిపల్లెలో రైల్వే జంక్షన్లో నందలూరు రైల్వేకేంద్రం తరహాలోనే 17415 నంబరు గల తిరుపతి –కోల్హాపూర్, తిరుపతి–నిజాముద్దీన్, నిజాముద్దీన్–తిరుపతి మధ్య నడిచే (12793/12794) రైలుకు పూర్తిగా హాల్టింగ్ ఎత్తివేశారు. రాజంపేట రైల్వేస్టేషన్లో మధురై నుంచి లోకమాన్యతిలక్ (22102)కు హాల్టింగ్ ఎత్తేశారు. ఎక్కడానికి మాత్రమే హాల్టింగ్, దిగడానికి హాల్టింగ్ లేకుండా చేశారు. రాజంపేట పరిసర ప్రాంతాల నుంచి అనేక మంది కంటి ఆపరేషన్లకు మధురైకు వెళుతుంటారు. అదే రైల్లో తిరిగి తమ గమ్యాలకు చేరుకుంటున్నారు. వారు రైల్వే అధికారులు తీసుకున్న వింత నిర్ణయాలపై పెదవి విరిస్తున్నారు. ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్లో కాచిగూడ నుంచి చెంగల్పట్టుకు వెళ్లే (17652)రైలుకు హాల్టింగ్ ఎత్తివేశారు. -
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
రాజంపేట: కొత్తగా అన్నమయ్య జిల్లా ఆవిర్భవించిన తర్వాత జరుగుతున్న తొలి సార్వత్రిక ఎన్నికలు ఇవి. సిట్టింగ్ ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి ముచ్చటగా మూడోసారి వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర విభజనకు కారకుడు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి బీజేపీ అభ్యరి్థగా ఈయనపై పోటీలో ఉన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి పీవీ మిథున్‌రెడ్డి చేసిన అభివృద్ధి, ఆయన విజయావకాశాలు తదితర అంశాలపై ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు.. మీరు రాజంపేట స్థానం నుంచి ఎన్నోసారి పోటీ చేస్తున్నారు. మీ బలం ఏమిటి? మిధున్‌రెడ్డి : రాజంపేట నుంచి మూడోసారి పోటీ చేస్తున్నాను. ప్రజలతో పాటు పార్టీ క్యాడర్‌కు అండగా ఉంటా. పిలిస్తే పలుకుతా..చెబితే చేస్తాను. రెండుసార్లు రాజంపేట లోక్‌సభ ప్రజలు ఆశీర్వదించారు. మూడోసారి ఆశీర్వదిస్తే లోక్‌సభ నియోజకవర్గం అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషిచేస్తాను. ప్రజల అండదండలతో ఈ ఎన్నికల్లో ముందుకెళుతున్నాను. మీ ప్రత్యరి్థ, మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి, మీకు ఉన్న తేడా ఏమిటి మిధున్‌రెడ్డి: నేను లోకల్ లీడర్, కిరణ్‌కుమార్‌రెడ్డి గెస్ట్ పొలిటిíÙయన్. వస్తాడు. పనిచేసుకుంటాడు. హైదరాబాదుకు వెళ్లిపోతాడు. ఇది లోక్‌సభ పరిధిలోని ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు మళ్లీ సూట్‌కేసుతో హైదరాబాదుకు పంపించేందుకు జనం సిద్ధంగా ఉన్నారు. మీకున్న బలం ఏమిటి? ఏ విధంగా ఈ ఎన్నికల్లో గెలుస్తారని భావిస్తున్నారు మిధున్‌రెడ్డి: నాకున్న బలం ప్రజలు. జగనన్న ఆశయాలతో ముందుకెళుతున్నాను. ఈ ఎన్నికల్లో ఓటర్లు సంక్షేమం, అభివృద్ధినే చూస్తారు. మళ్లీ ఫ్యాన్ ప్రభంజనమే. జగనన్న ఎన్నికల సభలకు జ నం బ్రహ్మరథం పట్టారు. అందుకే కూటమిలో ఓటమి గుబులు పట్టుకుంది. రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఏ విధంగా అభివృద్ధి చేశారు. వచ్చే టర్మ్‌లో ఏం చేయనున్నారు మిధున్‌రెడ్డి: రూ.2400 కోట్లతో వాటర్గ్రిడ్స్ పూర్తి చేశాము. హంద్రీనీవా, గాలేరు–నగరి ప్రాజెక్టులను ముందుకు నడిపిస్తున్నాము. కడప–రేణిగుంట జాతీయ రహదారి నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చాను. రాయచోటి, పుంగనూరు, రైల్వేకోడూరు, పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె, రాజంపేట ప్రాంతాల్లో అభివృద్ధిని పరుగులు తీయించాము. అన్ని నియోజకవర్గాలలో ఆ ప్రాంత పరిస్ధితులను బట్టి అభివృద్ధి చేస్తున్నాం. రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శ పార్లమెంటరీ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్నదే నా సంకల్పం. తప్పకుండా దేవుడు, ప్రజల ఆశీస్సులతో నా సంకల్పం సిద్ధిస్తుందని ఆశిస్తున్నాను. రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో రైల్వే సమస్యల పరిష్కారానికి ఏ విధంగా కృషి చేశారు మిధున్‌రెడ్డి: ప్రదానంగా రైల్వేపరంగా ప్రసిద్ధి చెందిన నందలూరు రైల్వేకేంద్రంలో నూతన రన్నింగ్‌రూం మంజూరుకు కృషి చేశాను. బడ్జెట్లో కూడా ప్రకటించారు. రైల్వే పూర్వవైభవం కోసం ప్రత్యామ్నాయ పరిశ్రమ ఏర్పాటు చేయాలని లోక్‌సభలో కూడా ప్రస్తావించాను. ఎప్పటికప్పుడు నందలూరు రైల్వే అభివృద్ధి కోసం రైల్వేమంత్రి, రైల్వేబోర్డుకు వినతులు ఇస్తూనే ఉన్నాము. ఎన్నడూ లేని విధంగా ముంబై–రేణిగుంట రైలుమార్గంలోని రాజంపేట లోక్‌సభ పరిధిలో ఉన్న రైల్వే ప్రాంతాల్లో గేట్ల సమస్య లేకుండా ఆర్యూబీ(రోడ్ అండర్ బ్రిడ్జి)ల మంజూరుకు కృషి చేశాము. ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. రాజంపేట, పీలేరు రైల్వేస్టేషన్లను అమృత్‌లో ఎంపికకు కృషి చేశాను. అలాగే కరోనా ముందు ఏ వి«ధంగా హాలి్టంగ్ సౌకర్యం ఉండేదో అదే విధంగా ఉండేలా రైల్వే మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళ్లాను. జిల్లాకు సంబంధించిన అంశంపై చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలు సాధ్యమయ్యేవేనా మిధున్‌రెడ్డి: చంద్రబాబు రాజంపేటకు వస్తే ఒక మాట..రాయచోటికి వెళితే మరొక మాట, మదనపల్లెలో ఉంటే ఇంకో మాట ఇలా జనం చెవిలో పువ్వులు పెడతారు. అవి సాధ్యం కావని ప్రజలకు తెలుసు. బాబు మాటలను నమ్మే పరిస్థితిలో రాజంపేట జనం లేరు. ఊసరవెల్లి రాజకీయాలకు రాజంపేట ప్రజలు చెల్లుచీటి పలుకుతారు. మేము వచ్చే టర్మ్‌లో అన్నమయ్య ప్రాజెక్టును పూర్తి చేయిస్తాము. 18వ మెడికల్ కాలేజి రాజంపేటలో ఏర్పాటు చేస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. రాజంపేట వైఎస్సార్సీపీ లోక్‌సభ అభ్యరి్ధగా విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి మిధున్‌రెడ్డి: కచ్చితంగా జగనన్న సంక్షేమం, అభివృద్ధి నన్ను గెలిపిస్తాయి. దళితులు, ముస్లింలు, క్రైస్తవులు, బీసీల ఆశీర్వాదాలు నాకు పుçష్కలంగా ఉన్నాయి. ముస్లిం మైనారీ్టలకు సీఎం వైఎస్ జగన్ అంటే అభిమానం, ఆతీ్మయత ఉంది. పెద్దిరెడ్డి కుటుంబం పేదల పక్షాన నిలుస్తుందని అన్నమయ్య, చిత్తూరు జిల్లా వాసులందరికి తెలుసు. ఏ అవసరం ఉన్నా..నేనున్నా అంటూ ముందుకొచ్చే కుటుంబం ఏది అంటే పెద్దిరెడ్డి కుటుంబమే. దైవబలం, ప్రజాబలంతో అఖండ విజయం సాధిస్తానన్న నమ్మకం ఉంది. -
సీఎం జగన్ పంచులతో దద్దరిల్లిన రాజంపేట..
-
చంద్రబాబు కు అధికారం వస్తే "జిల్లా హెడ్ క్వార్టర్స్"
-
రాజంపేట లో అశేష ప్రజా స్పందన
-
పెత్తందార్ల కూటమిని వ్యతిరేకించండి: సీఎం జగన్
అన్నమయ్య జిల్లా, సాక్షి: చంద్రబాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమేనని.. పొరపాటున బాబుకు ఓటస్తే.. పథకాలు ముగింపేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గురువారం ఆయన అన్నమయ్య జిల్లా రాజంపేట రైల్వే కోడూరు రోడ్డులో ప్రచార సభలో మాట్లాడుతూ చంద్రబాబు.. మోదీ, అమిత్‌షాను తీసుకొచ్చి సభలు పెట్టించారు. ప్రత్యేక హోదా హామీ వస్తుందేమోనని ప్రజలు ఎదురుచూశారు.. వాళ్లు ప్రత్యేక హోదా హామీ ఇవ్వకుండా.. విమర్శించి వెళ్లిపోయారు’’ అంటూ సీఎం జగన్ మండిపడ్డారు.‘‘చంద్రబాబు అంతటి అవినీతిపరుడు దేశంలోనే లేడని మోదీ అన్నారు. కూటమిలో చేరగానే అదే నోటితో చంద్రబాబును పొగుడుతున్నాడు. చంద్రబాబు, దత్తపుత్రుడికి ఏం కావాల్లో అది మాత్రమే మాట్లాడారు. పెత్తందార్ల కూటమిని వ్యతిరేకించండి’’ అంటూ సీఎం జగన్ పిలుపునిచ్చారు.‘‘2014లో ఇదే కూటమి ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా?. చంద్రబాబు కూటమి.. పెత్తందార్ల కూటమి. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే.. వ్యతిరేకించారు. పెత్తందార్ల పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలా? 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చాం. 2 లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాం. అక్క చెల్లెమ్మలకు నేరుగా రూ.2 లక్షల 70 వేల కోట్లు అందించాం’’ అని సీఎం వివరించారు.గతంలో ఎప్పుడైనా ఇంత మంచి జరిగిందా?. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చాం. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం. 3వ తరగతి నుంచే టోఫెల్ క్లాసులు, సబ్జెక్ట్ టీచర్లు. ప్రభుత్వ స్కూళ్లలో 6వ తరగతి నుంచే డిజిటల్ బోధన. ఇంటర్నేషనల్ యూనివర్శిటీలతో సర్టిఫైడ్ కోర్సులు. పిల్లల చదువు కోసం తల్లులను పోత్సహిస్తూ అమ్మఒడి. విద్యారంగంలో జరిగిన విప్లవాలు.. గతంలో ఎప్పుడైనా జరిగాయా?. మహిళా సాధికారతకు అర్థం చెప్తూ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉన్నాం. మొదటిసారి మేనిఫెస్టో అనే పదానికి విశ్వసనీయత తీసుకొచ్చాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.⇒రాజంపేటలో అక్కచెల్లెమ్మల పేరిట 4వేల ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్, ఇళ్ల నిర్మాణం..⇒మరో 4 రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోంది..⇒జరగబోయే ఈ ఎన్నికలు పథకాల కొనసాగింపును నిర్ణయించేవి..⇒మీ జగన్ తీసుకొచ్చినన్ని పథకాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా?⇒ఈ తరహాలో పేదవాడి మీద ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో చూశారా? ⇒ప్రత్యేకహోదాను అమ్మేశారు, పెత్తందార్ల కూటమిని వ్యతిరేకించండి..⇒చంద్రబాబు ఎక్కడికి వెళ్తే అక్కడ దాన్ని జిల్లా కేంద్రం చేస్తా అంటున్నాడు..⇒రాజంపేట, మదనపల్లి, రాయచోటిలను జిల్లా కేంద్రం చేస్తానంటున్నాడు నమ్ముతారా?⇒రాజంపేటలో పింఛా డ్యాం ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తి చేశాం⇒అన్నమయ్య ప్రాజెక్ట్, గాలేరు-నగరి కాల్వ పనులు పూర్తి చేయాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి⇒రాజంపేట కేంద్రంగా అన్నమయ్య కాలేజ్‌ను యూనివర్శిటీగా తీర్చిదిద్దాం⇒మీ బిడ్డ తీసుకున్న నిర్ణయం రాజంపేట చరిత్రలో నిలిచిపోతుంది⇒అధికారంలోకి వచ్చిన తర్వాత రాజంపేటలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు -
సీఎం జగన్ మాస్ ఎంట్రీ @ రాజంపేట
-
నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
సాక్షి, అమరావతి: ప్రధాని మోదీ బుధవారం రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఆయన మధ్యాహ్నం 1:50 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 2.55 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా 3.45 గంటలకు రాజంపేట లోక్‌సభ పరిధిలో ఉన్న కలికిరిలో బహిరంగ సభలో పాల్గొంటారు.సాయంత్రం 6.25 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు చేరుకుంటారు. అక్కడ బందర్ రోడ్డులో ఇందిరాగాంధీ స్టేడియం వద్ద 7 గంటలకు రోడ్ షోను ప్రారంభించి, గంట పాటు బెంజ్ సర్కిల్ వరకు రోడ్ షో నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
దగాపడ్డ తమ్ముళ్లు!
రాజంపేట: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేతిలో రాజంపేట తమ్ముళ్లు మరోసారి దగాపడ్డారు. శుక్రవారం రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే టికెట్, గతంలో రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థ్ధిగా ఓడిపోయిన సుగవాసి బాలసుబ్రమణ్యంకు టికెట్ కేటాయించడంతో రాజంపేట టీడీపీ వర్గీయుల్లో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడ్డాయి. తాము ఆశించిన నేత, రాజంపేట టీడీపీ ఇన్చార్జి బత్యాల చెంగల్రాయుడుకు ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో పలువురు పార్టీ క్యాడర్లోని నేతలు రాజీనామాలు చేస్తామని అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేశారు. టీడీపీ కరపత్రాలను దగ్ధం చేశారు. తమనేత బత్యాల అభ్యర్థి కాకపోతే రాజంపేటలో టీడీపీ ఓటమి తధ్యమని తమ్ముళ్లు స్పష్టం చేశారు. రాజంపేట బత్యాల భవన్ వద్ద టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్య నిర్వాహక కార్యదర్శి మందా శ్రీనివాసులు హల్చల్ చేశారు. తమ నాయకుడు చెంగల్ రాయుడు కు రాజంపేట టీడీపీ టికెట్ రాకపోవడంతో మందా శీను మనస్థాపం చెందారు. తమ నాయకుడికి టికెట్ ఇవ్వాలని, లేని పక్షంలో ఆత్మహత్య చేసుకుంటానని భవనం పైకెక్కాడు. వెంటనే అప్రమత్తమైన టీడీపీ శ్రేణులు సముదాయించి కిందికి దించారు. కాగా రాజంపేట టికెట్‌ను టీడీపీ నుంచి బత్యాల చెంగల్రాయుడుతోపాటు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్రాజు, రాజంపేట వ్యవసాయమార్కెట్కమిటి మాజీ చైర్మన్ పోలి సుబ్బారెడ్డి, మరో నాయకుడు మేడా విజయశేఖర్‌రెడ్డి టికెట్ ఆశించినవారిలో ఉన్నారు. టీడీపీ పార్టీ ఆవిర్భావం రోజున వీరందరికి చంద్రబాబు షాక్ ఇచ్చారు. చతికిలపడ్డ ‘సేన’ రాజంపేటలో జనసేనకు టికెట్ దక్కుతుందన్న ఆశతో నియోజకవర్గంలో పలువురు జనసేన తరపున కార్యక్రమాలు చేపట్టారు. నందలూరుకు చెందిన యల్లటూరు శ్రీనువాసురాజు ఏకంగా తన ఉద్యోగ పదవికి వీఆర్ఎస్ ఇచ్చి మరీ జనసేనలో చేరారు. అలాగే కాపు సామాజికవర్గానికి చెందిన అతికారి దినేష్, మలిశెట్టి వెంకటరమణ టికెట్‌ను ఆశించి భంగపడ్డారు. అనుహ్యంగా తెరపైకి బాలసుబ్రమణ్యం.. రాజంపేట టీడీపీ టికెట్ సుగవాసి బాలసుబ్రమణ్యం కు కేటాయించడంతో టీడీపీ రాజకీయాలు వేడె క్కాయి. నాన్‌లోకల్‌ను రాజంపేటకు తీసుకొచ్చి మరి పోటీ చేయించడంపై టీడీపీ కేడర్ పెదవివిరుస్తోంది. -
ఆధ్యాత్మిక శోభ.. అజ‘రామ’రం
ఏకశిలపై వెలసిన ఆధ్యాత్మిక నగరి.. అందాల పురి.. ఆంధ్ర అయోధ్య ఒంటిమిట్ట కోదండ రామాలయం కొత్త కళతో మిలమిలా మెరిసిపోతోంది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని ఒంటిమిట్టకు అధికారిక గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ ఆలయ అభివృద్ధిని అటకెక్కించింది. వైఎస్సార్సీపీ అధికారం చేపట్టాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో ఇది అద్భుత క్షేత్రంగా ఆవిష్కృతమైంది. సుమనోహర మాడవీధులు, సుందర ఉద్యానవనాలతో అజరామర కోవెలై విరాజిల్లుతోంది. – సాక్షి, రాయచోటి రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు 2019 తర్వాత టీటీడీ ఆధ్వర్యంలో ఒంటిమిట్టలో సుమారు రూ.100 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను చేపట్టారు. ప్రధానంగా శాశ్వత కల్యాణ మండపంతోపాటు చుట్టూ ప్రహరీ నిర్మాణం, భక్తులకు విశ్రాంతి గదులు, వీవీఐపీల అతిథి గృహాలు, కొండపై పార్వేట మండపం, పుష్కరిణి, ఆలయ సమీపంలో రామసేతు కోనేరు ఆధునికీకరణ, రామాలయం చుట్టూ మాడవీధుల నిర్మాణాలు జరిగాయి. పచ్చదనంతో కూడిన ఉద్యాన వనాలతో కోవెల కొత్త అందాలు సంతరించుకుంది. ఆలయంలో ప్రత్యేకమైన బండరాయితో చప్టా ఏర్పాటైంది. గుడి వెలుపల మండపం నిర్మితమైంది. నూతన రథం సమకూరింది. ఆలయం చుట్టూ ఆక్రమణలు తొలగించారు. కొత్త రోడ్ల నిర్మాణాలతో ఏకశిలానగరం ముగ్ధమనోహరమై ఆకర్షిస్తోంది. క్షేత్రంలో జాంబవంతుడు, పోతన, హనుమంతుని విగ్రహాల ఏర్పాటుకూ వేగంగా సన్నాహాలు చేస్తున్నారు. శ్రీరామ ఎత్తిపోతల పథకంలో భాగంగా సోమశిల నుంచి ఒంటిమిట్ట చెరువుకు పైపులైన్ ద్వారా నీటిని అందించేలా చేపట్టిన పనులూ పూర్తయ్యాయి. పౌర్ణమి వెలుగులో స్వామి కల్యాణం ఒంటిమిట్టలో ఏటా శ్రీరామనవమిని పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ కోదండ రాముని కల్యాణ ఘట్టం పౌర్ణమి వెన్నెల్లో చంద్రుడి సాక్షిగా నిర్వహించడం ఆనవాయితీ. గతంలో కల్యాణ వేదిక అందుబాటులోలేక అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. సుమారు 60 ఎకరాల విస్త్రీర్ణంలో కల్యాణ వేదికకు స్థలాన్ని కేటాయించడంతోపాటు అందులో శాశ్వత మండప నిర్మాణాలు పూర్తి చేయడంతో ఏటా స్వామి కల్యాణం నిర్వహిస్తూ వస్తున్నారు. టీటీడీ ఆ«ధ్వర్యంలో మధ్యాహ్న సమయంలో భక్తులకు నిత్యాన్నదానాన్ని నిర్వహిస్తున్నారు. రెండో శనివారం తిరుమల లడ్డూ ప్రసాదాన్నీ విక్రయిస్తున్నారు. టీడీపీ హయాంలో అంతంత మాత్రమే 2014లో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయాన్ని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. 2015 సెపె్టంబరు 9న ఆలయాన్ని టీటీడీలో విలీనం చేశారు. తర్వాత కాలంలోనూ అభివృద్ధి పనులు అంత వేగంగా జరగలేదు. పైగా 2018లో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా స్వామి కల్యాణం రోజున ప్రకృతి విపత్తుతో అనేక దుష్పరిణామాలు చోటుచేసుకున్నాయి. కల్యాణం రోజు ఇంతటి అపశృతి చరిత్రలో ఎన్నడూ చూడలేదని స్థానికులు చెబుతున్నారు. 2014 నుంచి స్వామికి కల్యాణం రోజున పట్టు వ్రస్తాలు సమర్పించేందుకు స్వయంగా సీఎం హోదాలో అప్పటి టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చినా అభివృద్ధి దిశగా అంత ఆలోచనచేయలేదని విమర్శిస్తున్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రత్యేకంగా టీటీడీ అధికారుల ద్వారా అభివృద్ధి పనులను వేగవంతం చేసి పూర్తి చేసి భక్తులకు అన్ని వసతులూ కల్పించింది. అభివృద్ధితో కళకళ చిన్నతనం నుంచి చూస్తున్న ఒంటిమిట్ట శ్రీకోదండ రామాలయం గత నాలుగేళ్లలో నమ్మలేనంతగా మారిపోయింది. ఆలయాన్ని చూస్తుంటే కళ్లు చెదిరిపోతున్నాయి. ప్రభుత్వం బాగా అభివృద్ధి చేసింది. గుడి కళకళలాడుతోంది. భక్తులకు సకల వసతులూ సమకూరాయి. – శ్రీనివాసులు, ఒంటిమిట్ట రామయ్యకు రాజయోగం నేను కొన్నేళ్లు ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం చైర్మన్‌గా పనిచేశాను. ఇతిహాసాల్లోనూ ఒంటిమిట్ట రామయ్యకు చరిత్ర ఉంది. అంతటి ప్రాధాన్యం ఉన్న ఈ ఆలయం గురించి గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రస్తుత వైఎస్సార్ సీపీ సర్కారు హయాంలో రామయ్యకు రాజయోగం పట్టింది. చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చాక బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. – ముమ్మడి నారాయణరెడ్డి, పెన్నపేరూరు, ఒంటిమిట్ట మండలం అద్భుత క్షేత్రమైంది ఈ రామాలయం టీటీడీ ఆధ్వర్యంలో అద్భుత క్షేత్రంగా ఆవిష్కృతమైంది. భక్తులకు కావాల్సిన విడిది గృహం సమకూరింది. స్వామి శాశ్వత కల్యాణ వేదిక నిర్మితమైంది. పచ్చని నందన వనాలు కనువిందు చేస్తున్నాయి. వీవీఐపీ బిల్డింగ్, అన్నప్రసాద కేంద్రం, నూతనంగా నిర్మించిన పార్వేటి మండపంతో ఆలయం అభివృద్ధి బాటపట్టింది. పుష్కరిణి, రామాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చలవ రాతి బండలు, రామతీర్థం భక్తులను ఆకట్టు్టకుంటున్నాయి. – నటేష్ బాబు, డిప్యూటీ ఈఓ, ఒంటిమిట్ట -
మూడు ముక్కల టీడీపీకి మరో సంకటం
సాక్షి ప్రతినిధి, కడప: అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేతలకు కొత్త సంకటం వచ్చి పడింది. అసలే మూడు వర్గాలతో, నిత్యం కొట్లాటలతో సతమతమవుతున్న టీడీపీకి జనసేనతో పొత్తు కారణంగా కొత్తగా మరో గ్రూపు చేరింది. రాజంపేట టీడీపీని మరింత రగిలిస్తోంది. పొత్తులో భాగంగా రాజంపేట టికెట్ తమకేనంటూ జనసేన నేతలు ఘంటాపథంగా చెప్పడం టీడీపీ నేతలకు చిర్రెక్కిస్తోంది. రాజంపేట నియోజకవర్గంలో ఇప్పటికే టీడీపీలో మూడు ముక్కలాట నడుస్తోంది. ఇక్కడి నుంచి మరోసారి పోటీ చేయాలని టీడీపీ ఇన్చార్జి బత్యాల చెంగల్రాయుడు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈయన అభ్యర్థిత్వానికి పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్రాజు మోకాలడ్డుతున్నారు. బత్యాల నాన్ లోకల్ అభ్యర్థి, పోటీలో నిలిపినా నిరుపయోగమేనంటూ ప్రచారం చేస్తున్నారు. ఇంకోవైపు రాజంపేట ఎంపీగాకంటే అసెంబ్లీకి పోటీచేయాలని గంటా నరహరి ఉవ్విళ్లూరుతున్నారు. బత్యాల, జగన్‌మోహన్‌రాజులకు గట్టిగానే అడ్డం పడుతున్నారు. వీరు చాలదన్నట్టు తాజాగా పోలు సుబ్బారెడ్డి, మేడా విజయశేఖర్‌రెడ్డి రేసులోకి వచ్చారు. వీళ్ల మధ్య నిత్యం కొట్లాటలతో కేడర్ క్రమంగా తగ్గిపోతోంది. ఇప్పుడు పొత్తులో మాకే సీటంటూ జనసేన నేతలు రంగంలోకి వచ్చారు. రాజంపేట నియోజకవర్గం జనసేన ఇన్చార్జి మలిశెట్టి వెంకటరమణ టిక్కెట్ తనదేనంటున్నారు. మలిశెట్టికంటే తానే మెరుగైన అభ్యర్థి అంటూ అతికారి దినేష్ మరోపక్క ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ప్రభుత్వ ఉన్నతోద్యోగానికి వీఆర్ఎస్ ఇచ్చిన శ్రీనివాసరాజు తానే జనసేన అభ్యర్థినంటూ తెరపైకి వచ్చారు. టీడీపీ–జనసేన ఉమ్మడి అభ్యర్థిని తానేనంటూ విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. నేతల కొట్లాటలతో టీడీపీ, జనసేన వర్గాలు కకావికలవుతున్నాయి. మైదుకూరు, రాజంపేట నేతల పైరవీలు టీడీపీ–జనసేన పొత్తు పెట్టుకున్నా వైఎస్సార్ జిల్లాలో మైదుకూరు, అన్నమయ్య జిల్లాలో రాజంపేటని జనసేనకు అప్పగించవద్దని టీడీపీ నేతలు పైరవీలు ఆరంభించారు. వాస్తవంగా కాపు సామాజిక వర్గ ఓటర్లు గణనీయంగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే జనసేన అభ్యర్థులను నిలిపే అవకాశం బలంగా ఉంది. ఈ మేరకు ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో రాజంపేట, రైల్వేకోడూరు, మైదుకూరు ప్రాంతాల్లో మాత్రమే జనసేన సీట్లు కోరే అవకాశం ఉంది. రైల్వేకోడూరు ఎస్సీ రిజర్వుడ్ స్థానం కావడం, సరైన నాయకుడు లేకపోవడంతో రాజంపేట, మైదుకూరు సీట్లపై పట్టుబట్టనున్నారు. ఈ నేపథ్యంలో మైదుకూరులో మాజీ ఎమ్మెల్యే డీఎల్ రవీంద్రారెడ్డి జనసేన టికెట్‌పై పోటీ చేస్తారనే ప్రచారం ఉంది. -
అన్నమయ్య జిల్లా రాజంపేటలో టిడిపి నేతల దుర్మార్గం
-
నిమజ్జనంలో విషాదం.. చావును ఏరికోరి తెచ్చుకోవడం అంటే ఇదే!
సాక్షి, అన్నమయ్య: రాజంపేటలో శనివారం జరిగిన వినాయక నిమజ్జనంలో విషాదం చోటు చేసుకుంది. విన్యాసాలు చేయబోయి ఓ వ్యక్తి అనూహ్య రీతిలో ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. అప్పటిదాకా సంతోషంగా గంతులేసిన వ్యక్తి.. అరక్షణంలో రక్తపు మడుగులో పడిపోవడంతో అక్కడున్నవాళ్లంతా దిగ్భ్రాంతికి లోనయయారు. రాజంపేట పట్టణంలో శనివారం కిరణ్ అనే వ్యక్తి గణేష్ నిమజ్జనంలో పాల్గొన్నాడు. అయితే అప్పటికే ఫుల్‌గా తాగేసి ఉన్న కిరణ్.. రకరకాల విన్యాసాలు చేశాడు. ఈ క్రమంలో విగ్రహం తీసుకెళ్తున్న ట్రాక్టర్ బంపర్‌పై నుంచి దూకి విన్యాసం చేయాలనుకున్నాడు. అయితే.. ఆ ఊపులో తల సరాసరిగా రోడ్డుకు బలంగా తగిలింది. దీంతో స్పృహ కోల్పోయాడు. పక్కన ఉన్నవాళ్లు కడప ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉందని తిరుపతి ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ పరీక్షించిన వైద్యులు తలలో నరాలు దెబ్బ తిన్నాయని.. ఆపరేషన్ అవసరమని, పరిస్థితి ప్రమాదకరంగానే ఉందని చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తానికి మద్యం మత్తులో వినోదానికి పోయి.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు ఆ యువకుడు. -
రాజంపేటలో వాల్మికి విగ్రహావిష్కరణ
రాజంపేట: అన్నమయ్య జిల్లా రాజంపేట బైపాస్ వాల్మీకి సర్కిల్లో ఏర్పాటు చేసిన వాల్మీకి మహర్షి విగ్రహాన్ని అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, రాజంపేట ఎమ్మెల్యే మేడామల్లికార్జునరెడ్డి, జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమరనాథ్‌రెడ్డిలు ఆదివారం ఆవిష్కరించారు. ఎంపీ మాట్లాడుతూ వాల్మికుల సమస్యలపై లోక్‌సభలో ప్రస్తావించేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానన్నారు. వాల్మికుల సమస్యలను సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళతానని చెప్పారు. వాల్మికులను ఎస్టీలుగా గుర్తించాలని దశాబ్దాలుగా కోరుతున్నారన్నారు. ఎమ్మెల్యే మేడా మాట్లాడుతూ కృషి ఉంటే మనుషులు రుషులవుతారని చెప్పిన వాల్మికి అందరికీ ఆదర్శప్రాయుడన్నారు. జెడ్పీ చైర్మన్ ఆకేపాటి మాట్లాడుతూ రామాయణం ద్వారా ఈ ప్రపంచానికి సీతారామ,లక్ష్మణ, ఆంజనేయులను పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి, రామాయణం సృష్టికర్త వాల్మీకి మహర్షి అని కొనియాడారు. -
స్టార్ మిస్ టీన్ ఇండియాగా రాజంపేట అమ్మాయి
రాజంపేట: అన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందిన వక్కల గడ్డ విష్ణు చౌదరి, ఉత్తరల కుమార్తె ధనూషసాయి దుర్గాచౌదరి స్టార్ మిస్ టీన్ ఇండియాగా ఇంటెలిజెంట్ 2023కు విజేతగా నిలిచింది. ధనూషసాయి దుర్గాచౌదరి(15) విజయవాడ శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. రాజస్థాన్‌లో జరిగిన స్టార్ మిస్ టీన్ ఇండియా ఇంటెలిజెంట్‌లో పలు రాష్ట్రాల నుంచి పాల్గొన్న ఎంతో మందిని దుర్గా ఓడించింది. -
శివయ్య ప్రసాదం.. మూగజీవులకు ఆహారం
రాజంపేట టౌన్ (అన్నమయ్య జిల్లా): కార్తీక మాసం సందర్భంగా వందలాది మంది భక్తులు శివాలయాలకు తరలి వచ్చి దీపాలను వెలిగించి స్వామివారికి పండ్లను ప్రసాదంగా ఉంచుతారు. ఆ పండ్లను భక్తులు తమ వెంట తీసుకెళ్లకుండా అక్కడే ఉంచి వెళ్లిపోతారు. వందలాది మంది భక్తులు వదిలి వెళ్లే వివిధ రకాల పండ్లు పెద్ద సంఖ్యలో ఉంటాయి. ప్రధానంగా భక్తులు దీపాలను వెలిగించాక స్వామివారికి అరటి పండ్లను ప్రసాదంగా పెడతారు. ఒక్క రాజంపేట పట్టణంలోని శివాలయంలోనే కార్తీక సోమవారం రోజు ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులు స్వామివారికి ప్రసాదంగా పెట్టే అరటి పండ్లు వేల సంఖ్యలో ఉంటాయి. ఈ కారణంగా కొన్ని గంటల వ్యవధిలోనే ఆలయ ప్రాంగణమంతా వేల సంఖ్యలో అరటి పండ్లు పడి ఉంటాయి. అయితే ఈ పండ్లు నిరుపయోగమవుతున్నాయని పట్టణంలోని ఈడిగపాళెంకు చెందిన నరసింహా అనే ఎలక్ట్రీషియన్ గుర్తించాడు. పండ్లను మూగజీవులకు ఆహారంగా పెడితే ఒక రోజు అయినా అవి కడుపు నింపుకోగలవన్న ఆలోచన ఆయనలో తట్టింది. అనుకున్నదే తడవుగా తన షాపునకు చుట్టుపక్కల ఉండే చిరు వ్యాపారులు, దినసరి కూలీల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి, భక్తులు శివాలయ ప్రాంగణంలో ఎక్కడ పడితే అక్కడ వదిలిన అరటి పండ్లను ఏరుకొని మూగజీవులకు ఆహారంగా పెడతామని చెప్పాడు. వారు కూడా నరసింహా ఆలోచన సరైనదేనని భావించి కార్తీక మాసంలో భక్తులు శివాలయంలో స్వామివారికి ప్రసాదంగా పెట్టే అరటి పండ్లతో పాటు కొబ్బెర చిప్పలను మూగజీవులకు ఆహారంగా పెట్టేందుకు ముందుకు వచ్చారు. 2016వ సంవత్సరం నుంచి కరోనా సమయంలో మినహా ప్రతి ఏడాది కార్తీక మాసంలో నరసింహాతో పాటు చిరువ్యాపారులు, దినసరి కూలీలైన వెంకటనరసయ్య, రమణ, బీవీ సురేంద్ర, ఉమాశంకర్‌లు శివాలయంలోని అరటి పండ్లను గోతాల్లో వేసుకొని ప్రత్యేక వాహనంలో రాపూరు ఘాట్‌లో ఉండే కోతులకు ఆహారంగా పెడుతున్నారు. కార్తీక మాసంలో ప్రతి మంగళవారం ఈ చిరు వ్యాపారులు, దినసరి కూలీలు తమ పనులను సైతం మానుకొని ఆటో బాడుగను కూడా వారే భరించి మూగజీవులకు చేస్తున్న సేవకు పట్టణ వాసులచే ప్రసంశలు, అభినందనలు అందుకుంటున్నారు. రాపూరు ఘాట్‌లో కోతులు పెద్ద సంఖ్యలో ఉంటాయని, వాటికి ఎవరు కూడా ఆహారం పెట్టే పరిస్థితి ఉండదని అందువల్ల ప్రతి ఏడాది కార్తీకమాసంలో ఈసేవా కార్యక్రమం చేపడుతున్నట్లు వారు తెలిపారు. (క్లిక్ చేయండి: వెయ్యేళ్ల అన్నమయ్య ‘కాలి’బాట.. ఎక్కడుందో తెలుసా!) -
ఘనంగా ఎంపీ మిథున్‌రెడ్డి జన్మదిన వేడుకలు
కేవీపల్లె : రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి జన్మదిన వేడుకలను కేవీపల్లెలో ముందస్తుగా నిర్వహించారు. శనివారం జెడ్పీటీసీ సభ్యురాలు గజ్జెల శృతి ఆధ్వర్యంలో కేక్ ఏర్పాటు చేశారు. ఎంపీ మిథున్‌రెడ్డి కేక్ కట్ చేసి ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ ఛైర్మన్ ఇక్బాల్ అహ్మద్‌కు తినిపించారు. పీలేరు నియోజకవర్గం నుంచే గాక, రాయచోటి, పుంగనూరు, చంద్రగిరి నియోజకవర్గాల నుంచి వచ్చిన పలువురు నాయకులు, కార్యకర్తలు మిథున్‌రెడ్డికి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఏపీఎండీసీ, హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్లు హరీష్‌రెడ్డి, కారపాకుల భాస్కర్‌నాయుడు, ఏఎంసీ ఛైర్మన్ కడప గిరిధర్‌రెడ్డి, ఎంపీపీ ఈశ్వరమ్మ, జెడ్పీటీసీ గజ్జెల శృతి, నాయకులు గజ్జెల శీన్‌రెడ్డి, వెంకటరమణారెడ్డి, మల్లికార్జునరెడ్డి, పి. ద్వారకనాథరెడ్డి, ఆనందరెడ్డి, జయరామచంద్రయ్య, రామ్ప్రసాద్నాయుడు, సి.కె. యర్రమరెడ్డి, సిరి, సైఫుల్లాఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళా కండక్టర్ నిజాయితీ
రాజంపేట: రాష్ట్రరోడ్డు రవాణాసంస్థ రాజంపేట డిపోలో పనిచేస్తున్న సీ.మాధవి అనే కండక్టర్ తన నిజాయితీని చాటుకున్నారు. శనివారం తిరుపతి–రాజంపేట బస్సు సర్వీసులో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తిరుపతి నుంచి రాజంపేటకు వస్తుండగా కరకంబాడి వద్ద గూడూరుకు చెందిన పీ.శివప్రసాద్ రైల్వేకోడూరులో బస్సు ఎక్కారు. బస్సు దిగేటప్పుడు తన బ్యాగును మరిచిపోయారు.అందులో రూ.5లక్షల విలువ చేసే బంగారు నగలు ఉన్నాయి. టికెట్స్ కొట్టేందుకు వస్తున్న క్రమంలో అక్కడ ఉన్న బ్యాగ్‌ను కండక్టర్ గుర్తించింది ప్రయాణికులను విచారించింది. ఈలోగా బ్యాగును పొగొట్టుకున్న బాధితుడు రైల్వేకోడూరు కంట్రోల్ పాయింట్లో ఫిర్యాదు చేశారు. టికెట్‌ను బట్టి కండక్టరుకు ఫోన్ చేస్తే, డిపో వద్దకు వస్తే బ్యాగు ఇస్తామని తెలిపారు. బ్యాగ్‌ను డిపో మేనేజరు రమణయ్యకు అందచేశారు. డీఎం చేతులమీదుగా శివప్రసాద్‌కు కండక్టర్ అప్పగించారు. మాధవిని ఎన్ఎంయూ డిపో అధ్యక్షుడు శివయ్య, సెక్రటరీ రమణ, ఆన్ డ్యూటీ కంట్రోల్ చలపతి అభినందించారు. -
పవన్ కల్యాణ్ యాత్ర ఫ్లాప్
రాజంపేట(వైఎస్సార్ జిల్లా): జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ రాజంపేట నియోజకవర్గంలోని సిద్ధవటంలో శనివారం చేపట్టిన కౌలురైతు భరోసా యాత్ర బొమ్మ ప్లాప్ అయింది. షెడ్యూల్ ప్రకారం 1గంటకు చేరుకోవాల్సిన పవన్ కళ్యాణ్ 4 గంటలకు చేరుకున్నారు. ఆలస్యంగా ఆయన వచ్చినా ఓపెన్ గ్యాలరీలో జనం లేకపోవడం కనిపించింది. కేవలం మీడియా, మహిళల గ్యాలరీకే జనం పరిమితమయ్యారు. పాసులు ఇచ్చిన వారు మాత్రమే సభ ప్రాంగణం ముందున్న గ్యాలరీలో చేరుకున్నారు. సాధారణ జనం కోసం ఏర్పాటుచేసిన మైదానం జనం లేక బోసిపోయింది. గందరగోళంగా సభ.. పవన్ సభ గందరగోళంగా మారింది. 150పైగా కౌలురైతులు ఆత్మహత్య చేసుకున్నట్లుగా పదేపదే చెప్పారు. ఏ సంవత్సరం నుంచి అనేది లేకుండా కేవలం రాజకీయ ఉద్దేశ్యంతో ప్రభుత్వంపై బురదచల్లేందుకే అన్నట్లుగా సభ నిర్వహించారని విమర్శలు వెలువడ్డాయి. పవన్ ప్రసంగానికి స్పందన కనిపించలేదు. స్థానికేతరులు అధికంగా వచ్చారు. జనసేన సభకు టీడీపీ క్యాడర్ హాజరైంది. సిద్ధవటంలో టీడీపీ నేత అతికారి వెంకటయ్య, ఆయన తనయుడు దినేష్, తమ్ముడు అతికారి కృష్ణ తోపాటు సంబంధీకులు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. -
ఘనంగా తాళ్లపాక బ్రహ్మోత్సవాలు ప్రారంభం
రాజంపేట: పద కవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు జన్మస్థలి తాళ్లపాకలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ సిద్దేశ్వరస్వామి, శ్రీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సిద్దేశ్వరస్వామి ఆలయంలో ఉదయం పల్లకీసేవ నిర్వహించారు. ధ్వజారోహణ కార్యక్రమం చేపట్టారు. రాత్రి హంసవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. చెన్నకేశవస్వామి ఆలయంలో ఉదయం ధ్వజారోహణం నిర్వహించారు. రాత్రి శ్రీదేవి, భూదేవితో కలిసి చెన్నకేశవస్వామి శేషవాహనంపై ఊరేగారు. టీటీడీ అర్చకస్వాములు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. టీటీడీ సూపరిండెంట్ పి.వెంకటశేషయ్య, ఇన్స్పెక్టర్ బాలాజీ, గ్రామస్తులు పాల్గొన్నారు. -
Intercity Express Train: పట్టాలెక్కని పేదోడి రైలు
రాజంపేట: ఉమ్మడి వైఎస్సార్ జిల్లా వాసులకు తక్కువ ధరతో గమ్యాలను చేర్చే రైలుగా ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణికుల ఆదరణ దక్కించుకుంది. అలాంటి రైలిప్పుడు జిల్లా ప్రయాణికులకు దూరమయ్యేలా రైల్వేశాఖ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 57273/57274 నంబర్లతో కాకినాడ–తిరుపతి–హుబ్లీ (ఇంటర్సిటీ రైలు) ఉభయ జిల్లాల మీదుగా నడిచింది. అలాగే సీమవాసులు కోస్తా కారిడార్ ప్రయాణానికి ఈ రైలు అందుబాటులో ఉండేది. అన్ని వర్గాల ప్రజల ప్రయాణానికి అనుకూలంగా ఉన్న రైలును ఫస్ట్‌వేవ్ కరోనా సమయంలో రద్దు చేశారు. ఆ తర్వాత పునరుద్ధరణ విషయాన్ని పట్టించుకోలేదు. రెండు రాష్ట్రాల యాత్రికులకు సౌకర్యంగా.. ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ జిల్లాలైన అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలకు చెందిన యాత్రికులతోపాటు కర్ణాటక రాష్ట్రానికి చెందిన యాత్రికులకు సౌకర్యంగా ఈ రైలు నడిచింది. తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు తక్కువ ధరతో టికెట్ తీసుకొని ప్రయాణించే యాత్రికులపై రైల్వేబోర్డు శీతకన్ను వేసిందనే అపవాదును మూటకట్టుకుంది. సీమ జిల్లాలో పేద ప్రయాణికుల ఆదరణ పొందిన ఏకైక రైలు ఇంటర్సిటీ అని చెప్పుకోవచ్చు. ప్రజాసౌకర్యం కన్నా ఆదాయమే ప్రధానం అన్న విధంగా ఎన్డీఏ సర్కారు వ్యవహరిస్తోందని పలువురు విమర్శిస్తున్నారు. చదవండి: (CM YS Jagan: ఆదోని పర్యటనకు సీఎం జగన్) ఇంటర్ సిటీ దరిచేరని డెమో రేణగుంట–గుంతకల్లు మధ్య నడుస్తున్న డెమో ఎక్స్‌ప్రెస్ రైలుకు పెట్టిన ధరలతో పోలిస్తే ఇంటర్సిటీ మేలంటున్నారు ప్రయాణికులు. ఉదాహరణకు నందలూరు నుంచి కడపకు రూ.10నే. ఇప్పుడు ఎక్స్‌ప్రెస్ చార్జీతో డెమోను తీసుకొచ్చి రూ.30 తీసుకుంటున్నారు. ఒక వేళ రూ.30 టికెట్ తీసుకున్నా, స్టేషన్ నుంచి ఆటోకు రూ.20 కావడం మొత్తం మీద రూ.50 అవుతోంది. అలాంటప్పుడు బస్సులో వెళితే నేరుగా టౌన్లోకి వెళ్లవచ్చు కదా అనే భావనతో ప్రయాణికులు డెమో వైపు కన్నెత్తి చూడటం లేదని తెలుస్తోంది. 12 బోగీల ఫార్మిసన్‌తో నిత్యం రద్దీగా.. ఇంటర్సిటీ రైలు 12 బోగీల ఫార్మిసన్‌తో నిత్యం రద్దీగా నడిచేది. నందలూరులో కూడా ఈ రైలు క్రూ ఛేంజింగ్ ఉండేది. రెండు రిజర్వేషన్ బోగీలు కూడా ఉండేవి. ఉభయ జిల్లాలకు చెందిన వారు అనేక మంది కర్ణాటక ప్రాంతంలోని హుబ్లీ కేంద్రం వరకు రాకపోకలు సాగించేవారు. రెండు రాష్ట్రాల మధ్య తక్కువ ధరతో గమ్యానికి చేరుకొనేవారు. అందువల్ల ఈ రైలు ఎప్పుడైనా రద్దీతో నడిచేది. ఫుట్‌బోర్డు ప్రయాణం కొనసాగేది. అలాంటి రైలును ఇప్పుడు రైల్వేశాఖ కనుమరుగు చేసేలా తీసుకుంటున్న విధానాలపై ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. -
రెండేళ్ల తర్వాత పట్టాలపైకి ‘అరక్కోణం’
రాజంపేట: రెండేళ్ల తర్వాత అరక్కోణం రైలు పరుగులు తీయనుంది. ఈ రైలు (06401/06402) వచ్చేనెల 27 నుంచి పునఃప్రారంభంకానుంది. ఈమేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో అన్ని ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. అప్పటి నుంచి పల్లె ప్రయాణికులకు ఒక్క రైలు కూడా లేకుండాపోయింది. ప్రస్తుతానికి ఒక డెమో రైలు ప్రస్తుతం వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో నడుస్తోంది. 8 కార్ మెమూ రేక్తో మెమూ నడవనుంది. కడప వరకు అన్ని పల్లెలో స్టాపింగ్ అరక్కోణం నుంచి కడప వరకు అన్ని పల్లెలో స్టాపింగ్‌తో మెమూ రైలు నడుస్తోంది. అరక్కోణం, తిరుత్తణి, పొనపాడి,వెంకటనరసింహారాజుపేట, నగిరి, ఏకాంబరకుప్పం,వేపగుంట, పుత్తూరు, తడకు, పూడి, రేణిగుంట జంక్షన్ మీదుగా నడుస్తుంది. అక్కడి నుంచి మామండూరు, బాలపల్లె, శెట్టిగుంట, రైల్వేకోడూరు, అనంతరాజంపేట, ఓబులవారిపల్లె, పుల్లంపేట, రాజంపేట, హస్తవరం,నందలూరు, మంటపంపల్లె, ఒంటిమిట్ట, భాకరాపేట, కనుమలోపల్లె కడప వరకు నడుస్తుంది. చార్జీలు ఎక్స్‌ప్రెస్ తరహాలో ఉన్నప్పటికి అన్ని స్టేషన్లలో స్టాపింగ్ సౌకర్యం ఉండటం వల్ల కొంతమేర పల్లెప్రయాణికులకు ఊరట లభించింది. సమయం ఇలా.. మెమూ రైలు రేణిగుంటలో ఉదయం 8.50కి బయలుదేరుతుంది. నందలూరుకు 11 గంటలకు, కడపకు 11.45 గంటలకు చేరుతుంది. తిరుగుప్రయాణంలో సాయంత్రం 3.10 గంటలకు బయలుదేరి, 3.54 గంటలకు నందలూరుకు చేరుకుంటుంది. రైల్వేకోడూరుకు 5.48 గంటలకు, రేణిగుంటకు 5.45 గంటలకు చేరుకుంటుందని రైల్వేబోర్డు తెలి పింది. తమిళనాడు (సదరన్‌రైల్వే) లోని పుత్తూరుకు 6.21 గంటలకు, తిరుత్తిణికి 7గంటలకు, అరక్కోణానికి 7.35 గంటలకు చేరుకుంటుంది. -
ఒంటిమిట్ట.. రైలు ఆగేదెట!
రాజంపేట: రాష్ట్రంలో వైష్ణవ క్షేత్రంగా వెలుగొందుతున్న ఒంటిమిట్ట (ఏకశిలానగరం) కోదండరాముని భక్తులపై..స్టేషన్ అభివృద్ధిపై రైల్వే చిన్నచూపు ప్రదర్శిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు భద్రాచలం రామునిక్షేత్రంగా వెలుగొందింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ఒంటిమిట్ట ప్రముఖ క్షేత్రంగా భాసిల్లుతోంది. 2014లో ఏపీ ప్రభుత్వం దీనిని అధికారిక ఆలయంగా ప్రకటించింది. ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం విలీనం చేసుకుని వందకోట్లకుపైగా వ్యయంతో క్షేత్రాన్ని అభివృద్ధి చేసింది. అయితే రైల్వేశాఖ, రైల్వేమంత్రిత్వశాఖ ఒంటిమిట్టకు నలుదిశల నుంచి ప్రయాణికులు క్షేత్రానికి వచ్చేలా సౌకర్యాలు కల్పించడంలో వివక్షను ప్రదర్శించింది. ఒంటిమిట్టను గుర్తించని దక్షిణమధ్య రైల్వే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భద్రాచలం రైల్వేస్టేషన్‌ను గుర్తించినట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని ఒంటిమిట్ట రైల్వేస్టేషన్‌ను దక్షిణమధ్యరైల్వే గుర్తించలేదు. ముంబై–చెన్నై కారిడార్ రైలు మార్గంలో నడిచే ప్రతి రైలుకు ఒంటిమిట్టలో స్టాపింగ్ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అధ్యాత్మికవేత్తలు అంటున్నారు. ఒక సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఒంటిమిట్టను పరిగణలోకి తీసుకోలేదు. ఒంటిమిట్ట, భద్రాచలం రెండు పుణ్యక్షేత్రాలు దక్షిణమధ్యరైల్వేలోనే ఉండేవి. భద్రాచలం స్టేషన్‌కు ఇస్తున్న ప్రాధాన్యతను ఒంటిమిట్టకు ఇవ్వడంలేదంటే వివక్ష ప్రదర్శించినట్లేనని భక్తులు భావిస్తున్నారు. దూరప్రాంత భక్తులెలా వచ్చేది.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు ఒంటిమిట రామయ్య దర్శనానికి వస్తున్నారు. భద్రాచలం రోడ్ రైల్వేస్టేషన్ మీదుగా భక్తులు వచ్చేందుకు వీలుగా రైళ్లు నడుస్తున్నాయి. ఒంటిమిట్ట స్టేషన్ పేరుకు మాత్రమే ఉంది. ఇక్కడ డెమై రైలు తప్ప ఏ రైలుకు స్టాపింగ్ లేదు. నవ్యాంధ్ర ఏర్పడినప్పటి నుంచి ఒంటిమిట్ట స్టేషన్ అభివృద్ధి చేయాలంటూ ప్రజాప్రతినిధులు గళం విప్పుతున్నారు. అయినా రైల్వేశాఖలో ఎటువంటి స్పందన కనిపించలేదన్న విమర్శలున్నాయి. తాజాగా ఒంటిమిట్ట స్టేషన్‌కు ఎఫ్ఓబీకి బ్రేక్ ఒంటిమిట రైల్వేస్టేషన్లో డబుల్ ఫ్లాట్‌ఫాంలు ఉన్నాయి. భక్తులు, ప్రయాణికుల సౌకర్యార్ధ్యం ఫుట్ఓవర్ బ్రిడ్జిని(ఎఫ్ఓబీ) రైల్వేబోర్డు మంజూరు చేసింది. గుంతకల్ డివిజన్లో మూడుచోట్ల మంజూరు చేస్తే, అందులో ఒంటిమిట్ట ఒకటి కావడం గమనార్హం. సెకండ్ప్లాట్ఫాంకు వెళ్లాలన్నా, అటువైపు పల్లెలోకి వెళ్లాలన్న ఎఫ్ఓబీ నిర్మాణ ఆవశ్యకత ఉంది. నిధులు వెనక్కి వెల్లకుండా అధికారులు ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మించాలనే డిమాండ్ వినిపిస్తోంది. -
జంగిల్ సఫారీ.. ఆనందాల సవారీ
రాజంపేట: శేషాచలం అటవీ ప్రాంతమైన రాజంపేట–రాయచోటి అటవీ మార్గంలోని తుమ్మలబైలులో రె డ్ఉడ్ జంగిల్ సఫారీని 2010లో ఏర్పాటుచేశారు. ఇపుడు వనవిహారం పేరుతో రూ.10లక్షల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నారు. పర్యాటకులకు అనువుగా మారుస్తున్నారు. ఎర్రచందనం చెట్ల సముహంలో వనవిహారం ఆద్యంతం ఆహ్లాదకరంగా ఉంటుంది. సేద తీరేందుకు ఏర్పాటు చేసిన అతిథి గృహం, పిల్లలు ఆడుకోవడానికి నెలకొల్పిన పార్కు అదనపు ఆకర్షణగా ఉంటాయి. తెల్లదొరల కాలం నుంచే.... తెల్లదొరల కాలం నుంచి తుమ్మలబైలు అతిథిగృహాన్ని పర్యాటకపరంగా ఏర్పాటు చేసి ఉన్నారు. వేసవి విడిదిగా అక్కడే కాలం గడిపేవారు. అటవీ అందాలను ఆస్వాదించేందుకు వీలుగా తెల్లదొరలు సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం అవి కాలగర్భంలో కలిసిపోయాయి. తర్వాత అటవీశాఖ తుమ్మలబైలు ప్రాంతాన్ని రెడ్‌వుడ్ జంగిల్ సఫారీ పేరుతో అభివృద్ధి చేసి తొలిసారిగా శేషాచలం అటవీ అందాలను పర్యాటకులకు చూపించనున్నారు. శేషాచలం ఇలా.. రాజంపేట డివిజన్లో అరుదైన జంతువులకు నిలయమైన శేషాచలం అటవీ ప్రాంతం విస్తీర్ణం 82,500 ఎకరాల్లో ఉంది. ఎర్రచందనం విస్తారంగా కలిగి ఉన్న దీనిని కేంద్రంఇప్పటికే బయోస్పెయిర్‌గా ప్రకటించింది..ఈ ప్రాంత అందాలను పర్యాటకులు వీక్షించేలా ఎకో టూరిజం కింద రెడ్‌వుడ్ జంగిల్ సఫారీని రూపుదిద్దారు. ప్రధానంగా రెడ్‌వుడ్ జంగిల్ సఫారీలో చిరుత, ఎలుగుబండ్లు, నెమళ్లు, రోసికుక్కలు, అడవిపందులు, జింకలు, కొండగొర్రెలు, కణితులు ఉంటాయి. డిసెంబరు మాసంలో ఏనుగులు సంచరిస్తాయి. పర్యాటకులకు అనుకూలంగా.. అటవీ అందాలను వీక్షించేందుకు అనుకూలంగా రెడ్‌వుడ్ జంగిల్ సఫారీలో ఏర్పాట్లు చేశారు. దీని ముఖద్వారం నుంచి తుమ్మలబైలు బంగ్లా, చిల్డ్రన్స్ పార్కు, ఐరన్‌వాచ్‌టవర్, సేదతీరేందుకు సౌకర్యాలు, వాచ్‌టవర్‌ను ఏర్పాటుచేశారు. జంగిల్ సఫారీ వాహనం కూడా సిద్ధం చేస్తున్నారు. దెబ్బతిన్న రోడ్డును బాగు చేస్తున్నారు. రెడ్‌వుడ్ జంగిల్ సఫారీలో 30 కిలోమీటర్ల మేర అటవీ ప్రయాణం ఆహ్లాదకరంగా కొనసాగుతుంది. మల్లాలమ్మ కుంట సాకిరేవు ఏరియాలో నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఉన్నతాధికారులు సైతం.. నిత్యం బిజీగా విధులు నిర్వహించే జిల్లా ఉన్నతాధికారులు పర్యటించి ఊరటపడుతుంటారు. జిల్లా కలెక్టర్లు, వివిధ జిల్లా అధికారులు జంగిల్ సఫారీలో పర్యటించి ఆహ్లాదకర అటవీ అందాలను వీక్షించి మానసిక ఉల్లాసాన్ని గడుపుతున్నారు. వనవిహారం స్కీం.. వనవిహారం స్కీం కింద గత ఏడాది రూ.5 లక్షలతో అతిథిగృహం పునరుద్ధరించారు. ట్రీమచ్, రోడ్లు, మల్లెలమ్మ కుంట వద్ద అభివృద్ధి చేశారు. ఈ ఏడాది కూడా రూ.10లక్షలతో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఏనుగులు రాకుండా కంచెను ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకుల కోసం వసతి సౌకర్యాల ఏర్పాటుచేస్తున్నారు. పర్యాటకులు రూ.10 ప్రవేశ రుసుంతో సఫారీలో పర్యటించవచ్చు. అది కూడా సాయంత్రం 5గంటల వరకు తిరిగి బయటికిరావాల్సి ఉంటుంది. రెడ్‌వుడ్ జంగిల్ సఫారీ అభివృద్ధికి చర్యలు రూ.10లక్షలతో తుమ్మలబైలు అటవీ ప్రాంతంలో రెడ్‌వుడ్ జంగిల్ సఫారీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. ట్రీమచ్‌లు ఏర్పాటుచేశాం. ఏనుగులు రాకుండా కంచెను బలోపేతం చేస్తున్నాం. సోలార్ వెలుగులు తీసుకొచ్చాం. పర్యాటకులకు వసతి సౌకర్యాలు పునరుద్ధరిస్తున్నాం. రూ.3లక్షలతో జంగిల్ సఫారీ వాహనాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం. ఎర్రచందనం, జంతువుల గురించి పర్యాటకులకు తెలిసే సైన్‌బోర్డులు ఏర్పాటుచేస్తున్నాం. –నరసింహారావు, ఇన్చార్జి డీఎఫ్ఓ, రాజంపేట -
అరటికాయల మాటున ఎర్రచందనం స్మగ్లింగ్
రాజంపేట: కడప–రేణిగుంట జాతీయరహదారిలోని రామాపురం చెక్‌పోస్టు వద్ద అరటికాయల మాటున ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తుండగా అటవీ పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయాన్ని రాజంపేట ఫారెస్టు రేంజర్ నారాయణ శనివారం విలేకరులకు వెల్లడించారు. బొలోరో వాహనంలో అరటికాయల లోడు వస్తుండగా, ఆపి వాహనాలను తనిఖీ చేశామన్నారు. అందులో ఎర్రచందనం దుంగలు గుర్తించామన్నారు. ఇందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అదుపులో తీసుకున్నామన్నారు. దుంగలను వత్తలూరు నుంచి తీసుకువస్తున్నట్లుగా వారు తెలిపారన్నారు. ఆరు ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను కోర్టుకు హాజరుపరిచామన్నారు. పట్టుబడినవారిలో రాజంపేట మండలం డీబీఎన్పల్లెకు చెందిన కసిరెడ్డి నాగార్జునరెడ్డి, వత్తలూరుకు చెందిన రెడ్డయ్య, రాయచోటికి చెందిన వెంకటరమణల ఉన్నారన్నారు. కార్యక్రమంలో ఎఫ్ఎస్ఓ శ్రీనివాసులు, అటవీ సిబ్బంది అంజనాస్వాతి, సాయికుమార్ పాల్గొన్నారు. -
తొట్లు అమర్చి.. దాహార్తి తీర్చి
రాజంపేట: ఎండలు క్రమంగా పెరుగుతున్నాయి. వేసవిలోప్రజల దాహార్తి తీర్చేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతోంది. అడవిలో నీటి వనరులు ఎండిపోయి దాహంతో అలమటించే మూగజీవాలు గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి, అందుకే వాటి దాహార్తి తీ ర్చేందుకు అటవీశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. డివిజన్ పరిధిలో శేషాచలం 1.23లక్షల హెక్టార్లలో,పెనుశిల లక్ష్మీనరసింహ అభయారణ్యం 23వేలహెక్టార్లలో విస్తరించి ఉంది. అరుదైన జంతు జాలానికి నెలవు.. శేషాచలం అటవీ ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వం జీవ వైవిధ్య అటవీ ప్రాంతం(బయోస్పెయిర్)గా గుర్తించింది. ఇక్కడ ఎక్కడాలేని విధంగా అనేక రకాలైన వన్యప్రాణులు, జంతువులు ఉన్నాయి. వీటిని సంరక్షించాల్సిన బాధ్యత అటవీశాఖపై ఉంది. ఇందులో భాగంగా చిత్తూరు, తిరుమల, వైఎస్సార్ జిల్లా అడవుల్లోని జంతువుల సంరక్షణపై దృష్టి సారించారు. కాగా జిల్లాలో శేషాచలం, పెనుశిల, లంకమల్ల అభయారణ్యాలు ఉన్నాయి. అరుదైన జంతువులకు నిలయం శేషాచలం.. శేషాచలం విస్తీర్ణం 82,500 ఎకరాలు. 2010లో జీవ వైవిధ్య నెలవుగా గుర్తించారు. దేశంలో ఉన్న బయోస్పెయిర్ జాబితాలో శేషాచలం అడవి చేరింది. ఈ అటవీ ప్రాంతం చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలో విస్తరించింది. శేషాచలం అడవిలో పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, వివిధ రకాల పునుగుపిల్లలు, పక్షులు, ఎలుగుబంట్లు, జింకలు, తోడేళ్లు ఉన్నాయి. ఇవి ఆ యా ప్రాంతాల్లోని రోడ్లపైకి నీటి కోసం వస్తున్నాయి. 8 శేషాచలంలో సహజ వనరులు శేషాచలంలో సహజ వనరులు ఉన్నాయి. వర్షాకాలంలో నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ, వేసవిలో అరకొరగా అయినా నీటి వనరులు అందుబాటులో ఉంటాయి. పెనుశిల అభయారణ్యంలో కూడా సహజవనరులు ఉన్నట్లుగా అటవీ వర్గాలు భావిస్తున్నాయి. పది కుంటలు ఉన్నాయి. ఆరు చెక్‌డ్యాంలున్నాయి. నీటి ఎద్దడి నివారణలో భాగంగా ఇవి దోహదపడతాయి. నిరంతర పర్యవేక్షణ రాజంపేట, సానిపాయి, చిట్వేలి, రైల్వేకోడూరు రేంజ్‌లు ఉన్నాయి. బేస్‌క్యాంపులు ఏర్పాటు చేశారు. ఇందుకోసం 80 మంది ప్రొటెక్షన్ వాచర్లను నియమించారు. ఇక్కడ 25 కెమెరాలు అమర్చారు. వేసవిలో వన్యప్రాణులు దాహార్తికి అల్లాడిపోకుండా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. మూగజీవాల తాగునీటికి ప్రత్యేక ఏర్పాట్లు అడవిలోని వివిధ ప్రాంతాల్లో 12 మొబైల్ సాసర్పిట్లు ఏర్పాటు చేశారు. చెట్లకు ఉప్పుముద్దలు కట్టారు. దాహార్తి ఉన్న జంతువులు ఉప్పుముద్దలను నాకితే ఉపశమనం కలుగుతుంది. 2వేల నుంచి 3వేల లీటర్ల కెపాసిటీతో నీటి వనరులను వన్యప్రాణులకు అందుబాటులో ఉంచారు. ప్రత్యేక రక్షణ చర్యలు శేషాచలం అటవీ ప్రాంతంలో జంతువుల సంరక్షణకు ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటున్నాం. వేసవిలో వన్యప్రాణులు నీటి కోసం జనావాసాల్లోకి రాకుండా ఉండేందుకు 12 సాసర్పిట్లు, 12 మొబైల్ సాసర్పిట్లను ఏర్పాటు చేసి నీరు అందిస్తున్నాం. జంతువులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. –నరసింహారావు, ఇన్చార్జి డీఎఫ్ఓ, రాజంపేట -
ఒంటిమిట్ట రామయ్య కోసం.. టెంకాయ చిప్పతో ఊరూరా..భిక్షమెత్తి
భద్రాచలం రామయ్య కోసం గుడి నిర్మించి రామభక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు రామదాసు. అదే తరహాలో ఒంటిమిట్ట కోదండరాముని ఆలయ జీర్ణోద్ధరణ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మరో రామదాసు.. వావిలికొలను సుబ్బారావు. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం – రాజంపేట ఆంధ్రవాల్మీకిగా పేరుగడించిన వావిలికొలను సుబ్బారావు ఒంటిమిట్ట ఆలయ జీర్ణోద్ధరణకు విశేష కృషి చేశారు. ఈయన జనవరి 23, 1863న ప్రొద్దుటూరులో జన్మించారు. తండ్రి రామచంద్ర, తల్లి కనకమ్మ, భార్య రంగనాయకమ్మ. 1883లో ప్రొద్దుటూరు తాలుకా ఆఫీసులో గుమస్తాగా చేరి రెవిన్యూ ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొంది 1896 వరకు పనిచేశారు. ఆగస్టు 1, 1936లో మద్రాసులో పరమపదించారు. ఆలయ అభివృద్ధికే.. రాజులు ఒంటిమిట్ట ఆలయానికి ఇచ్చిన వందలాది ఎకరాల మాన్యాలు ఎవరికివారు భోంచేయగా రామునికి నైవేద్యం కరువైన స్థితికి కోదండరామాలయం వచ్చింది. జీర్ణదశకు చేరిన ఈ రామాలయంను ఉద్ధరించటానికి వావిలికొలను కంకణం కట్టుకున్నారు. టెంకాయచిప్పను చేతపట్టుకొని ఆంధ్రప్రదేశ్‌లో ఊరురా తిరిగి బిచ్చమెత్తారు. ఆ ధనంతో రామాలయంను పునరుద్ధరించారు. టెంకాయచిప్పలో ఎంతధనం పడినా ఏదీ తన కోసం ఉంచుకోకుండా రాయాలయ అభివృద్ధికే ఇచ్చేశారు. ►ఈయన రామాయణంతోపాటు శ్రీకృష్ణలీలామృతం, ద్విపద భగవద్గీత, ఆంధ్ర విజయం, దండకత్రయం, టెంకాయచిప్ప శతకం, పోతన నికేతన చర్చ, శ్రీరామనుతి, కౌసల్యా పరిణయం లాంటి ఎన్నో రచనలు కూడా చేశారు. ►వాల్మీకి సంస్కృత రామాయణంను 24వేల చందోభరిత పద్యాలుగా తెలుగులో రాశారు. ఆయన రాసిన రామాయణంను ఒంటిమిట్ట శ్రీరామునికి అంకితం ఇచ్చారు. అప్పుడు బళ్లారి రాఘవ అధ్యక్షతన జరిగిన సభలో మహాపండితులు వావిలికొలను సుబ్బారావుకు ఆంధ్రవాల్మీకి అని బిరుదు ప్రదానం చేశారు. -
హలీమ్ కు సలాం
రంజాన్ మాసం వచ్చిందంటే చాలు..ముస్లిం సోదరుల ఉపవాసదీక్షలు, ప్రత్యేక ప్రార్థనలు మాత్రమే కాదు. హైదరాబాద్ సంప్రదాయక వంటకమైన హలీం గుర్తుకువస్తుంది. ఒకప్పుడు కేవలం అక్కడికే పరిమితమైన ఈ వంటకం మెల్లమెల్లగా ఇతర ప్రాంతాలకు విస్తరించింది. ఇప్పుడు చిన్న చిన్న పట్టణాల్లో సైతం హలీం తయారీ కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. ఉపవాసదీక్షలు జరిగే నెలరోజులు పాటు ముస్లిం సోదరులే కాకుండా సాధారణ జనాలు సైతం ఈ రుచికి సలాం అంటున్నారు. రంజాన్ మాసం సందర్భంగా ఏర్పాటైన హలీం కేంద్రాలపై ప్రత్యేక కథనం. మదనపల్లె సిటీ/రాయచోటిటౌన్ / రాజంపేట టౌన్: హలీం వంటకం అరబ్ దేశమైన పర్షియా నుంచి హైదరాబాదుకు చేరుకుంది. ఆరో నిజాం నవాబు మహబూబ్ అలీఖాన్ తన సంస్థానంలో పోలీసు వ్యవస్థను బలోపేతం చేసేందుకు కీలకమైన సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి పర్షియా నుంచి ప్రత్యేక ఆహ్వానితులు వచ్చారు. రంజాన్ ఉపవాసదీక్షల్లో ఇఫ్తార్‌కు తయారుచేసే ప్రత్యేక వంటకం గురించి ప్రస్తావించారు. వెంటనే నవాబు షాహీ దస్తర్ ఖానా సిబ్బందిని పిలిపించి దానిని సిద్ధం చేయించారు. అదే హలీం. పర్షియా నుంచి పరిచయమై.. హైదరాబాదు మీదుగా నేడు అన్ని ప్రాంతాల్లో లొట్టలేసుకుంటూ ఆరగించే రంజాన్ వంటకంగా గుర్తింపు పొందింది. ►మదనపల్లెలోని బెంగళూరు బస్టాండులో జామియా మసీదు సమీపంలో రంజాన్ ప్రార్థనలకు వచ్చే ముస్లింసోదరులకు అందుబాటులో ఉండేలా 5 హలీం కేంద్రాలను ఏర్పాటుచేశారు. వీటిల్లో రుచికరమైన చికెన్హలీం రూ.100కు, మటన్ హలీం రూ.150కు లభిస్తోంది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటలవరకు అమ్మకాలు జరుగుతున్నాయి. ►రాజంపేటలోని ఆర్ఎస్రోడ్, మెయిన్‌రోడ్లలో హలీంసెంటర్లు ఏర్పాటు చేశారు. ఒక బాక్స్ రూ.200 నుంచి రూ.800 వరకు విక్రయిస్తున్నారు. ►రాయచోటిలో మొత్తం 13 హలీం సెంటర్లు ఉన్నాయి.ట్రంక్ సర్కిల్, దర్గా, బంగ్లా జుమ్మమసీదువద్ద, మదనపల్లెరోడ్డు, రవి, లక్ష్మీ హాల్ సమీపంలో, ఎస్ఎన్ కాలనీ తదితతర ప్రాంతాల్లో కేంద్రాలు నిర్వహిస్తున్నారు. మటన్‌తో కూడిన హలీం 250 గ్రాములు కప్పు రూ.200, చికెన్‌తో వండిన హరీన్ కప్పు రూ.110, హాప్ రూ.60లుగా విక్రయిస్తున్నారు. హలీం తయారీలో నిమగ్నుడైన వంట కార్మికుడు , హలీం కొనుగోలుకు ఆసక్తి కనపరుస్తున్న ప్రజలు 8 తయారీ ప్రత్యేకమే.. సంప్రదాయక వంటలతో పోలిస్తే హలీం తయారీ ఆద్యంతం ప్రత్యేకమే. దీనికి కనీసం 9 గంటల సమయం పడుతుంది. ఇందులో మటన్ లేదా చికెన్, గోధుమలు, అన్ని పప్పు లు, బాస్మతిబియ్యం, నెయ్యి, అల్లంవెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, యాలకులు, దాల్చినచెక్క, మిరియాలు, కొత్తిమీర, నూనె, డ్రై ఫ్రూట్స్ తదితర వస్తువులను వినియోగిస్తారు. ముందుగా గిన్నెలో మాంసం, నీటిని కలిపి బాగా ఉడికిస్తారు. అనంతరం గోధుమలు, బాస్మతిబియ్యం, పప్పులు, అల్లంవెల్లుల్లిపేస్ట్, మసాలాదినుసులు, పచ్చిమిర్చి బాగా ఉడికించి మెత్తగా దంచుతారు. సమపాళ్లలో నెయ్యి కలుపుతారు. వేడివేడిగా వేయించిన ఉల్లిపాయలు, నిమ్మ ముక్కతో పింగాణీ ప్లేటులో వడ్డిస్తారు. చికెన్ హలీంను హరీస్గా పిలుస్తారు. హలీం రుచికే కాదు. ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులోని పోషకాలు శరీరానికి మేలు చేస్తాయి. ఒక కప్పు హలీంలో 365 క్యాలరీలు, కొవ్వు నుంచి లభించే క్యాలరీలు 150 లభిస్తాయి. ’రుచి అమోఘం.... రంజాన్ మాసంలో దొరికే హలీం రుచి అద్భుతంగా ఉంటుంది. నోట్లో పెట్టగానే మెత్తగా, రుచిగా అనిపించే ఈ వంటకం ఆరోగ్యానికి ఉపయోగకరమని వైద్యులు చెప్పడంతో ప్రతి సంవత్సరం కచ్చితంగా తినడాన్ని అలవాటు చేసుకున్నాను. – మహమ్మద్‌ఖాన్, టీచర్, మదనపల్లె. హైదరాబాద్ నుంచి రప్పించాం హలీం తయారీ కోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వంటమాస్టర్లను రప్పించాం. ముఖ్యంగా ఉపవాసం ఉండేవారికి పోషక ఆహారమైన హలీంను రుచిగా, నాణ్యతగా అందించాలన్నదే ప్రధాన ఉద్దేశం. – షామీర్, వ్యాపారి,రాజంపేట శక్తివంతమైన ఆహారం హలీం శక్తివంతమైన ఆహారం. మాంసంతో పాటు అనేక రకాల పప్పుదినుసులతో తయారు చేయడం వల్ల ప్రొటీన్లు, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. చెక్క, లవంగాలు, ఉల్లిపాయలు ఉండటం వల్ల రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. – డాక్టర్ అశ్విన్‌చంద్ర, ఆకేపాడు పీహెచ్సీ, రాజంపేట మండలం -
నడిచే దైవం జానీబాషాసాహెబ్: ఆకలి తీర్చి.. నీడనిచ్చాడు
వైఎస్సార్‌జిల్లా (రాజంపేట టౌన్) : రాజంపేట పట్టణంలోని జానీబాషాపురం గ్రామం ఏర్పడటానికి ఓ ఆసక్తికరమైన వాస్తవిక నేపథ్యంవుంది. జానీబాషాపురం గ్రామ ప్రజల కథనం మేరకు వివరాలిలావున్నాయి. దాదాపు ఎనిమిది దశాబ్దాల క్రితం ప్రస్తుతం ఉన్న జానీబాషాపురం ప్రాంతానికి తమిళనాడు రాష్ట్రం సేలంకు చెందిన జానీమియా అలియాస్ జానీబాషాసాహెబ్ వచ్చాడు. తనకు తెలిసిన మంత్రాలు, నాటు వైద్యంతో జీవనం సాగించేవాడు. అయితే అప్పట్లో ఆ ప్రాంత ప్రజలు అత్యంత నిరుపేదలు కావడంతో జానీబాషాసాహెబ్ తన సంపాదనను ఖర్చు చేసి వారి కడుపునింపేవారు. అలాగే అక్కడి ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఉచితంగా వైద్యం చేసి వారి ఆరోగ్య సమస్యలను నయం చేసేవారు. ఈనేపథ్యంలో జానీబాషాపురం గ్రామానికి ప్రక్కనే ఉన్న తుమ్మల అగ్రహారంకు చెందిన షడదర్శనం సుబ్బయ్యశాస్త్రి, జానీబాషాసాహెబ్ మధ్య చక్కటి స్నేహం కుదిరింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకసారి షడదర్శనం సుబ్బయ్యశాస్త్రి కుమార్తె లక్ష్మీదేవి అనారోగ్యం భారీనపడటంతో సుబ్బయ్యశాస్త్రి ఆరోజుల్లోనే తన కుమార్తెకు పెద్దనగరాల్లో వైద్యం చేయించాడు. అయితే ఆమె ఆరోగ్యం కుదుటుపడలేదు. దీంతో సుబ్బయ్యశాస్త్రి జానీబాషాసాహెబ్కు తన కుమార్తె ఆరోగ్య పరిస్థితి గురించి తెలియచేసి వైద్యం అందించాల్సిందిగా కోరాడు. కుమార్తె ఆరోగ్యం కుదుటుపడితే తనకున్న భూమిలో కొంత ఇస్తానని జానీబాషాసాహెబ్కు చెప్పాడు. తనకు ఎలాంటి ప్రతిఫలం వద్దని నీకుమార్తె ఆరోగ్యం బాగుచేస్తానని సుబ్బయ్యశాస్త్రికి జానీబాషాసాహెబ్ మాటిచ్చాడు. జానీబాషాసాహెబ్ తనవైద్యంతో ఆమె ఆరోగ్యం కుదుటుపరిచాడు. సుబ్బయ్యశాస్త్రి ఇచ్చినమాట ప్రకారం 1943వ సంవత్సరంలో 3.2 ఎకరాల భూమిని జానీబాషాసాహెబ్ పేరిట రాసి ఇచ్చాడు. జానీబాషాసాహెబ్ ఆ భూమిని అక్కడున్న ప్రజలందరికి ఉచితంగా పంపిణీ చేశాడు. ఆ సలాన్ని ఎవరు కూడా విక్రయించకుండా వారు, వారి వారసులు మాత్రమే అనుభవించేలా రాతపూర్వకంగా రాయించాడు. దీంతో అక్కడి ప్రజలకు ఆయన దేవుడయ్యాడు. ఇందువల్లే ప్రతి ఏడాది జానీబాషాసాహెబ్ పేరిట ఉరుసు ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అంతేకాక తమ గ్రామానికి జానీబాషాసాహెబ్ అని నామకరణం చేశారు. కాలక్రమేనా ఆ గ్రామం జానీబాషాపురంగా మారింది. -
పల్లెకు వచ్చిన ప్రభుత్వం
(మోడపోతుల రామ్మోహన్, రాజంపేట) గ్రామం చుట్టూ పచ్చని పొలాలు, వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు. ఊరు పేరు చెన్నయ్యగారిపల్లె. వైఎస్ఆర్ జిల్లా రాజంపేట నుంచి నందలూరు మీదుగా గ్రామానికి చేరుకొనే సరికి ఉదయం 11 గంటలు అయింది. ముందుగా దళితవాడకు వెళ్లితే... ఇరువూరి సుబ్బన్న అనే పెద్దాయన ఎదుర య్యాడు. ’సాక్షి’ ఆయన్ని పలకరించగా ఇప్పుడు అంతా బాగుంది నాయనా..అన్ని సమస్యలు స్థానికంగానే పరిష్కారం అవుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. చెక్‌డ్యాంల నిర్మాణం జరగడంతో భూగర్భజలాలు పెరుగుతున్నాయన్నారు. ఒకప్పుడు గ్రామంలో లోఓల్టేజీ సమస్యతో కరెంటు సరఫరా సక్రమంగా ఉండేది కాదు...ఇప్పుడు రూ.2 కోట్ల వ్యయంతో నూతనంగా సబ్‌స్టేషన్ ఏర్పాటు జరిగింది. దీంతో గ్రామంలో ఆ సమస్య కూడా తీరిపోయింద న్నారు.అక్కడి నుంచి వెనక్కి వచ్చి ఆంజనేయసర్కిల్ వద్దకు వెళితే గురుమూర్తి కనిపించారు. ఆయన మాట్లాడుతూ హైస్కూలు స్థాయి విద్యను అందించేందుకు రూ.50 లక్షల వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణం చకచకా జరుగుతోందని చెప్పారు. గ్రామంలో విశాలమైన సిమెంట్ రోడ్లు ఏర్పడ్డాయన్నారు. సచివాలయ వ్యవస్థ రాక ముందు పట్టాదార్ పాస్ పుస్తకాలు, తహసీల్దారు, ఎంపీడీఓ, హౌసింగ్, వ్యవసాయ కార్యాలయాల్లో పనులకు మండల కేంద్రానికి పరుగు పెట్టాల్సివచ్చేది. వైద్య అవసరాలకు ఇదే పరిస్థితి. ఆటోలో శ్రమపడి వెళితే ఒక రోజులో పని అవుతుందనే నమ్మకం ఉండేది కాదు.ఇప్పుడు గ్రామ సచివాలయ వ్యవస్థతో ఇంటి వద్దకే సర్కారీ సేవలు అందుతున్నాయి. వైద్యకోసం మండల కేంద్రానికి వెళ్లే అవసరం లేకుండా గ్రామంలో ఆసుపత్రి నిర్మాణం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందేలా వలంటీర్లు కృషి చేస్తున్నారు. ఇంటి వద్దకే వచ్చి పింఛన్లు ఇస్తున్నారని గ్రామస్థులు చెప్పారు. ప్రభుత్వమే పల్లెకొచ్చినట్లు ఉందనే ఆనందం ప్రతివారిలో వ్యక్తమైంది. సాగుకు భరోసా నేను అయిదు ఎకరాల్లో సేద్యం చేస్తున్నాను. రైతు భరోసా కింద ఇచ్చిన ఆర్థిక సాయం ఎంతో ఆదుకుంది. నేరుగా సొమ్ము నా బ్యాంకు ఖాతాకే జమ కావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. విత్తనాల పంపిణీ వంటి పనులు అన్నీ మా ఊరిలోనే జరిగిపోతున్నాయి. –గుగ్గిళ్ల సుబ్రమణ్యం, రైతు ఆర్ధిక సాయం మరువలేనిది కరోనా విపత్కర పరిస్థితుల్లో సున్నా వడ్డీ కారణంగా అందిన ఆర్థికసాయం మా గ్రూపులోని సభ్యులకు ఎంతో ఉపయోగపడింది. లాక్డౌన్ సమయంలో అక్కచెల్లెమ్మలకు అందించిన సాయం మరువలేనిది. –వెంకటసుబ్బమ్మ -
నెల రోజులు వైఎస్సార్ జిల్లాలోనే..
గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన ఓ విద్యార్థిని రాజస్తాన్‌లో తాను చదువుకుంటున్న యూనివర్సిటీకి వెళ్లే క్రమంలో ఏపీలోని వైఎస్సార్ జిల్లాలో చిక్కుకుపోయింది. లాక్డౌన్ నేపథ్యంలో నెల రోజుల పాటు తెలిసిన వారి ఇంటివద్ద తలదాచుకున్న ఆ విద్యార్థిని చివరకు మంత్రి హరీశ్ చొరవతో ఇంటికి చేరుకుంది. వివరాలిలా ఉన్నాయి. గజ్వేల్ పట్టణానికి చెందిన ఆశా వర్కర్ లింగంపల్లి అమృతకు ముగ్గురు కుమార్తెలు. ఇందులో పెద్ద కుమార్తె స్వాతి రాజస్తాన్ అజ్మీర్‌లోని భగవంత్ యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ ఫైనలియర్ చదువుతోంది. సెలవుల నేపథ్యంలో మార్చిలో గజ్వేల్‌కు వచ్చింది. ఆ తర్వాత వైఎస్సార్ జిల్లా రాజంపేటలోని స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. రాజంపేటకు చేరుకోగానే, కరోనా వైరస్ ప్రభావం కారణంగా కళాశాలకు సెలవులు ఇచ్చారని స్నేహితుల ద్వారా తెలుసుకున్నది. దీంతో ఇంటికి తిరిగి వెళ్ళాలని భావించింది. ఇంతలోనే లాక్డౌన్ ప్రకటన రావడంతో రైళ్లు, బస్సులు, ఇతర వాహనాల రాకపోకలు నిలిచిపోయి అక్కడే చిక్కుకుపోయింది. దీంతో ఆమె తల్లి అమృత ఆందోళనకు గురైంది. తన కూతురిని ఇంటికి రప్పించడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో చివరకు ఈనెల 17న విషయాన్ని గజ్వేల్ పట్టణానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు కల్యాణ్కర్ నర్సింగరావుకు తెలియజేసింది. దీంతో నర్సింగరావు విద్యార్థిని ఇబ్బందిని మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకువెళ్లగా, స్పందించిన ఆయన వైఎస్సార్ జిల్లా పోలీసు అధికారులతో మాట్లాడి స్వాతి గజ్వేల్‌కు వచ్చేలా ఏర్పాట్లు చేయించారు. ఆమెతో పాటు అదే జిల్లాలో ఉన్న మరో 20 మంది హైదరాబాద్‌కు వచ్చేందుకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశారు. ఆదివారం స్వాతి గజ్వేల్‌కు చేరుకుంది. తన కూతురిని ఇంటికి రప్పించేందుకు కృషి చేసిన మంత్రి హరీశ్‌రావుకు విద్యార్థిని తల్లి అమృత కృతజ్ఞతలు తెలిపింది. -
టీడీపీ నేత బార్లో కల్తీ మద్యం!
సాక్షి, వైఎస్సార్ : జిల్లాలో టీడీపీ నేతకు చెందిన బార్లో కల్తీ మద్యం విక్రయం జోరుగా సాగుతుంది. రాజంపేటలోని తిరుమల బార్ అండ్ రెస్టారెంట్ పాచి, గడ్డి ఉన్న మద్యాన్ని విక్రయిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం మధ్యాహ్నం తిరుమల బార్లో బీర్ బాటిళ్లు కొనుగోలు చేసిన వ్యక్తులకు.. వాటిలో పెద్ద ఎత్తున పాచి, గడ్డి దర్శనం ఇచ్చాయి. దీనిపై వినియోగదారులు బార్ ఓనర్ పులిరాజును ప్రశ్నించారు. అయితే ఓనర్ మాత్రం ఈ మద్యం తాము అమ్మలేదని.. వినియోగదారులపై దుర్భాశలు ఆడారు. కల్తీ మద్యం విక్రయంపై వినియోగదారులు రాజంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాజంపేట డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి, అర్బన్ సీఐ శుభకుమార్, ప్రొహిబిషన్ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తులు మద్యం కొనుగోలు చేసిన సీసీటీవీ ఫుటేజ్ లభించింది. -
రాజంపేట జీవనచిత్రం మారనుందా
అన్నమయ్య ప్రాజెక్టు నిరంతర జలకళ సంతరించుకోనుందా.. రాజంపేట జీవనచిత్రం మారనుందా .. కొత్త ప్రతిపాదనలతో ఇది సాధ్యమేనంటున్నారు ఇంజినీరింగ్ అధికారులు..విద్యార్థులు.. తమ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చితే 70,000 ఎకరాలకు సాగునీరందుతుందని కుండబద్ధలుకొట్టి చెబుతున్నారు. జీఎన్ఎస్ఎస్ నుంచి ఎత్తిపోతల ద్వారా ఇది సాధ్యమేనంటున్నారు. తమ ఆలోచనలకు పదును పెట్టి ప్రాజెక్టు దిగువ భాగాన పాక్షిక సబ్‌సర్ఫేస్ డ్యామ్ నిర్మించాలనే ప్రతిపాదనలను ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్‌రెడ్డి ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డికి నివేదించారు. డీపీఆర్ సిద్ధం చేయాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం. సాక్షి, కడప : అన్నమయ్య ప్రాజెక్టులో నిత్యం నీరుండే పరిస్థితి కనిపించడంలేదు. ఒక ఏడాది నీరు కనిపిస్తే మరో రెండేళ్లు జలకళకు దూరమవుతోంది. దీని మీద ఆశలు పెట్టుకున్న రైతాంగానికి అండగా నిలబడలేకపోతోంది. ఏటా ఒకేతరహా నీరు నిల్వ ఉండేలా ఈ ప్రాజెక్టు ఉండాలంటే ఏం చేయాలి.. దీని పరిధిలో మరిన్ని ఎకరాలకు సాగు నీరందించాలంటే ఎలా..ఈ ప్రశ్నలకు సమాధానం తమ వద్ద ఉందని చెబుతున్నారు గతంలో ఇక్కడ నీటిపారుదల ఈఈగా పనిచేసిన రమేష్.. ఈ ప్రాజెక్టుపై ఆయ న తన పరిధిలోని ఇంజినీర్లతో కలిసి మెదడుకు పదును పెట్టారు. కేఎస్ఆర్ఎం, అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన కొందరు విద్యార్థులు ప్రాజెక్టు వర్కులో భాగంగా తమ వైవిధ్యమైన ఆలోచనలను ఇంజినీర్లతో పంచుకున్నారు. ఫలితంగా కొత్త ప్రతిపాదనలను ఆవిష్కరించగలిగారు. ప్రాజెక్టు ప్రస్తుతం ఇలా : అన్నమయ్య ప్రాజెక్టు నీటి కెపాసిటీ 2.24 టీఎంసీలు.1996 వరకు ఈ ప్రాజెక్టు చెయ్యేరు ప్రాజెక్టుగా(సీపీసీ) డివిజన్ కింద ఉండేది. తర్వాత అన్నమయ్య ప్రాజెక్టుగా మారింది.అన్నమయ్య ప్రాజెక్టుకు ఫించా,బాహుదానది,మాండవి నుంచి నీరు చేరేది. 2001లో ప్రాజెక్టు పూర్తయిన కొన్ని నెలలకే 5 గేట్లలో మొదటి గేటు కొట్టుకుపోయింది. నిపుణుల కమిటీ పరిశీలించి వెల్డింగ్ సరిగాలేదని పేర్కొంది. మళ్లీ 5 గేట్లను నిర్మించారు. 2012 వరకూ ఈ నిర్మాణ ప్రక్రియ కొనసాగింది. 2015 నవంబర్‌లో తొలిసారిగా ప్రాజెక్టుకు 2.01 టీఎంసీల నీరు చేరింది. 2016లో చుక్క నీరు కూడా రాలేదు. 2017లో 2.24 టీఎంసీల మేర నీరు చేరింది. గత ఏడాది నీరు లేక ప్రాజెక్టు జలకళ తప్పింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 1.55 టీఎంసీల నీరుంది.. కొత్త ప్రతిపాదనలు ఇలా: అన్నమయ్య ప్రాజెక్టులో నిరంతరం నీరుండేలా అధికారులు కొత్త ప్రతిపాదనలు తయారుచేశారు. ఈ ప్రతిపాదనల రూపకల్పనలో కేఎస్ఆర్ఎం, అన్నమాచార్య ఇంజనీరింగ్ విద్యార్థుల మేథస్సును కూడా వినియోగించుకున్నారు. ప్రాజెక్టు వర్క్‌లో భాగంగా విద్యార్థులు గత ఈఈ రమేష్ బృందంలో చేరి ఆలోచనలు పంచుకున్నారు. ప్రాజెక్టుకు జీఎన్ఎస్ఎస్ రెండోదశ ప్రధాన కాలువ కిలోమీటరు దూరంలో ఉంది. అక్కడి నుంచి ఎత్తిపోతల కింద ప్రాజెక్టుకు నీటిని తరలించే కోణంలో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 20 మీటర్ల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని తరలించవచ్చని అంచనాకు వచ్చారు. రోజుకు 800 క్యూసెక్కుల మేర 36 రోజులలో 2.4 టీఎంసీల నీటిని పంపింగ్ చేసి ప్రాజెక్టు సామర్ధ్యం మేర తరలించవచ్చని భావించారు. ఇప్పుడున్న 10,236 ఎకరాల ఆయకట్టుతోపాటు దిగువనున్న 12,500 ఎకరాలకు కూడా కొత్త ప్రతిపాదనల ద్వారా నీటి అందించవచ్చంటున్నారు. . ఇందుకు రూ.101 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వానికి నివేదించారు. 2.4 టీఎంసీలు నింపగలిగితే దిగువనున్న సుమారు వంద గ్రామాలకు తాగు, సాగునీరు అందుతుంది. దిగువకు నీటిని వదిలినపుడు ఆ ప్రాంతంలోని 36 ఊట కుంటలు ఎప్పుడూ నీటితో ఉండేలా 36 పాక్షిక సబ్ సర్ఫేజ్ డ్యాములను నిర్మించాలనేది కూడా కొత్త ప్రతిపాదనలో భాగం. సర్ఫేజ్ డ్యాముకు రెండు నుంచి మూడు కోట్ల రూపాయల వ్యయమవుంది. అంటే సుమారు రూ.94 కోట్లు అవసరమవుతాయి. 100 నుంచి 200 మీటర్ల లోతులో మూడు మీటర్ల వెడల్పుతో సర్ఫేజ్ డ్యాములను నిర్మించాల్సి ఉంటుంది. సైన్స్ కాంగ్రెస్‌లో ప్రశంస యోగి వేమన యూనివర్శిటీలో గతంలో జరిగిన సైన్స్ కాంగ్రెస్‌లో ఈ ప్రతిపాదనను ప్రవేశ పెట్టారు. అక్కడ ప్రశంసలు అందుకున్నాయి. ఇంజనీరింగ్ విద్యార్థుల మేధస్సును ఉపయోగించుకుని ఇలాంటి ప్రయత్నాలు చేయడంపై వ్రశంసల జల్లు కురిసింది. గతంలో ఈఈగా పనిచేసిన రమేష్ సాక్షితో మాట్లాడుతూ తమ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిశీలించి అభినందించారన్నారు. వీలైనంత త్వరలో డీపీఆర్ ప్రభుత్వానికి అందజేయాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. తాజా ప్రతిపాదన వల్ల రాజంపేట జీవన పరిస్థితులు మారిపోయే అవకాశాలున్నాయి. 2015 నవంబరులో ప్రాజెక్టు నుండి ఏడు వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లివ్వడంతో పండ్ల తోటల ద్వారా రూ. 400 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. నిరంతరం నీరు ఉంటే కోట్లాది రూపాయలు ఆదాయం వస్తుందన్నారు. 70వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చన్నారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేశాం కాలువల ఆధునీకరణకు రూ.32 కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేశాం. పాక్షిక సబ్ సర్ఫేజ్ డ్యాముల నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు పంపాం. జీఎన్ఎస్ఎస్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ప్రాజెక్టులను నింపే ప్రతిపాదన ప్రభుత్వానికి అందజేశాం. – రవి కిరణ్, ఈఈ, అన్నమయ్య ప్రాజెక్టు -
వేధింపులే ఆమెను బలిగొన్నాయా?
సాక్షి, వైఎస్సార్ కడప : రెక్కాడితేగాని డొక్కాడని బతుకు.. కష్టపడి తమ బిడ్డను చదివించుకుంటున్నారు. చదువులో రాణించి ఉజ్వల భవిష్యత్ పొందుతుందని కలగన్నారు. కానీ, కన్నబిడ్డ ఆకస్మికంగా బలవన్మరణానికి పాల్పడడంతో ఆ తల్లిదండ్రులు నిశ్ఛేష్టులయ్యారు . పుల్లంపేటలో మంగళవారం సాయంత్రం పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన అందరినీ కంటతడి పెట్టించింది. రాజంపేట పట్టణంలోని బీఎస్ హాల్ సమీపంలోని కొండపల్లి కృష్ణమోర్తి, గౌరి దంపతులు ఉంటున్నారు. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. తమ కుమార్తె లక్ష్మీప్రసన్న పుల్లంపేట ఆదర్శపాఠశాలలో పదో తరగతి చదువుతుంటే సంబరపడిపోయారు. చదివి పెద్ద ఉద్యోగం చేస్తుందని భావించారు. కానీ లక్ష్మీప్రసన్న గత కొంతకాలంగా చురుకుగా ఉండడం లేదు. ఆరా తీస్తే స్కూలులో చదువులో మార్కులు తదితర విషయాలపై ఉపాధ్యాయుడు శివ ఇబ్బంది పెడుతున్నాడని వాపోయేది. సహచరి విద్యార్థినిలకు చెప్పుకొని బాధపడేది. పలు సందర్భాలలో కుమార్తెను ఓదార్చేందుకు ఆమె తల్లి ప్రయత్నించి విఫలమైంది. ఏమైందో తెలియదు.. మంగళవారం సాయంత్రం స్కూలు ముగిసిన తర్వాత ఆ బాలిక తానుంటున్న హాస్టలు గదికి చేరుకుంది. గడియ వేసుకుంది. ఒంటిపైనున్న చున్నీతో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తర్వాత గదికి చేరుకున్న కొందరు విద్యార్థులు ఈ సంఘటన చూసి నివ్వెరపోయారు. స్కూలు వర్గాలకు చెప్పారు. కానీ అంతకుమునుపే పాఠశాలకు ఆ బాలిక తల్లి వచ్చింది. తన బిడ్డను ఓదార్చుదామని వచ్చినట్టు భోగట్టా. కానీ ఆమెను లోపలికి అనుమతించలేదు. దీంతో బయటే ఉండిపోయింది. తీరా హాస్టలు గదిలో కుమార్తె లక్ష్మీప్రసన్న తనువు చాలించిందని తెలుసుకున్న మృతురాలి తల్లి నిర్ఘాంతపోయింది. ఇలా అర్ధాంతరంగా ప్రాణం తీసుకోవడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. గుండెలవిసేలా రోదించింది. స్థలానికి రాజంపేట అర్బన్ సీఐ శుభకుమార్, పుల్లంపేట ఎస్ఐ వినోద్‌కుమార్, తహసీల్దార్ ఉమామహేశ్వర్, డాక్టర్ సానే శేఖర్, ఆర్జేడీ వెంకట కృష్ణారెడ్డి, డీఈఓ శైలజ, ఎంఈఓ రంగనాథయ్య తదితరులు చేరుకున్నారు. ఆత్మహత్యపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు ఎస్ఐ వినోద్‌కుమార్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలియజేశారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన లారీలు..ముగ్గురి దుర్మరణం
-
హైవే రక్తసిక్తం.. ఇంట్లోకి దూసుకెళ్లిన లారీలు..!
కడప–రేణిగుంట నేషనల్ హైవే రక్తసిక్తంగా మారింది. రాజంపేట మండలం ఊటుకూరు గ్రామంలో శనివారం రాత్రి జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా నలుగురికి గాయాలయ్యాయి. రెండు లారీలు వేగంగా వస్తూ ఢీకొని పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లాయి. ప్రమాదంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. గ్రామస్తులు ధర్నాకు దిగారు. సాక్షి, రాజంపేట: రాజంపేట రూరల్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఊటుకూరు గ్రామం వద్ద గుజరాత్‌కు చెందిన (జీజే06 ఏజెడ్1324) నంబరు గల కంటైనర్, చెన్నై నుంచి కడపకు వెళుతున్న ఐషర్ వాహనం (ఏపీ04యూఏ0459) అదుపుతప్పి ఢీకొన్నాయి. సమీపంలో ఉన్న రేకుల ఇంట్లోకి దూసుకెళ్లాయి. ఇంటిలో ఉన్న వృద్ధుడు గొళ్ల వెంకటనరసయ్య (60) దుర్మరణం చెందాడు. అలాగే ఐషర్ వాహనంలో ఉన్న చింతకొమ్మదిన్నెకు చెందిన ప్రతాప్(27), కడపకు చెందిన మహమ్మద్ (29) మృతిచెందారు. గాయపడిన మునీశ్వరరెడ్డి(చింతకొమ్మదిన్నె), రాజారెడ్డి(గోపాలపురం), పరమేశ్వరరెడ్డి (చింతకొమదిన్నె), గంగిరెడ్డి(చింతకొమ్మదిన్నె)ని చికిత్స కోసం రాజంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రిమ్స్‌కు తరలించారు. రాజంపేట రూరల్ సీఐ నరసింహులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. హైవేపై ధర్నాకు దిగిన ఊటుకూరు గ్రామస్తులు గ్రామస్తుల ధర్నా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందిన నేపథ్యంలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తాము కొన్నేళ్లుగా స్పీడ్ బ్రేకర్లు వేయాలని అధికారులను కోరుతున్నా పట్టించుకోలేదంటూ మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి ఆందోళన చేశారు. ఆర్డీఓ ధర్మచంద్రారెడ్డి, తహసీల్దారు రవిశంకర్‌రెడ్డి, స్థానిక వైఎస్సార్సీపీ నేత రేవరాజు శ్రీనివాసరాజు జోక్యం చేసుకొని సర్ధిచెప్పారు. సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ఎస్ఐలు హనుమంతు, వినోద్ ట్రాఫిక్ క్లియరెన్స్‌కు చర్యలు తీసుకున్నారు. ప్రమాదంపై ఆరా.. ఊటుకూరు వద్ద జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంపై ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. -
కుల రాజకీయాలతో అమాయకుల బలి
సాక్షి, కడప(నందలూరు) : రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు రాజంపేటలో కులరాజకీయాలు చేస్తూ అమాయకులను బలిచేస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా ఎస్సీసెల్ నేత పెనుబాల నాగసుబ్బయ్య ధ్వజమెత్తారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బత్యాల గత ఎన్నికల్లో పోటీ చేసినప్పటి నుంచి రాజంపేట నియోజకవర్గం ప్రశాంతత కోల్పోయిందన్నారు. ఈనెల 9న సోమవారం గువ్వల ఎల్లమ్మ పొలానికి సంబంధించి ప్రభుత్వం 1994లో 1158 సర్వేనెంబరులో 2.80 ఎకరాల సెంట్ల భూమికి సంబంధించి పాసుపుస్తుకాలు, వన్‌బీ ఇవ్వడం జరిగిందన్నారు. అప్పటి నుంచి ఆమెకు ఆర్థికస్తొమత లేక రాజకీయ అండదండలు లేక ఆ భూమిని అభివృద్ధి చేసుకోలేకపోయారన్నారు. ఈ మధ్య కాలంలో ఎల్లమ్మ కుమారుడు ఓబులేసు అనే వ్యక్తి ఈ పొలంలో గది నిర్మించుకున్నాడన్నారు. 10వ తేదీన బత్యాల వర్గీయులు కొండా సురేష్, మరి కొంతమంది బుల్డోజర్ సాయంతో గదిని ధ్వంసం చేశారన్నారు. బాధితుడిపై మచ్చుకత్తితో దాడి చేశారన్నారు. తల్లీకొడుకును పొలంలో నుంచి బయటకి తరుముకుంటూ వచ్చారన్నారు. దీంతో బాధితుడు భయపడి తహసీల్దారు కార్యాలయం వద్దకు వెళ్లి వైఎస్సార్సీపీ నాయకులకు మొరపెట్టుకున్నారన్నారు. తనతో పాటు మండెంనాగరాజు, ధనుంజనాయుడు , కాకిచంద్ర, భాస్కర్, నాని , మధు యాదవ్‌లు ఉన్నారన్నారు. టీడీపీకి చెందిన నాయకులు ఈ సంఘటనపై విచారణ చేయకుండా కేవలం ఒక సామాజికవర్గానికి కొమ్ముకాస్తూ కులాలను రెచ్చగొడుతూ శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తున్నారన్నారు. మేడా కుటుంబీకులను విమర్శించే హక్కులేదు ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేస్తూ మేడా కుటుంబాన్ని విమర్శించే హక్కు బత్యాలకు లేదని నాగసుబ్బయ్య అన్నారు. మేడా కుటుంబం ఎంత అభివృద్ధి చేస్తుందో ప్రజలు చూస్తున్నారన్నారు. బత్యాల ఇప్పటికైనా ఫ్యాక్షన్ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. వైఎస్సార్సీపీ నాయకులు వేల్పుల శైలకుమార్, పణతల గంగయ్య, ధనుంజ నాయుడు, శివ, మధు, హిమగిరి, గుండు మల్లికారుజనరెడ్డి్డ, అరిగెల నాని, హిమగిరి, రాజశేఖర్‌రెడ్డి విజయుడు, కొరివి బలరాం, గుండు మల్లికార్జునరెడ్డి, మధు, మండెం నాగరాజు, «గుండు జనార్దన్‌రెడ్డి, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. -
ప్రవాసులను ఆలోచింపజేస్తున్న ‘గల్ఫ్ బాబాయ్’
సాక్షి, కడప : కడప జిల్లా రాజంపేటకు చెందిన గిరిప్రసాద్ కాస కువైట్ కేంద్రంగా ‘గల్ఫ్ బాబాయి’ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ గల్ఫ్ సమస్యలపై తెలుగులో విషయాత్మక లఘు చిత్రాలు ప్రసారం చేస్తూ ప్రవాసులకు అవగాహన కల్పిస్తున్నారు. గిరిప్రసాద్ 20 ఏళ్లుగా కువైట్‌లో ఓ మీడియా కంపెనీలో ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. తనకున్న సాంకేతిక పరిజ్ఞానం, గల్ఫ్ జీవితాల పట్ల ఉన్న అవగాహనతో నాలుగేళ్ల క్రితం ‘గల్ఫ్ బాబాయి’ యూట్యూబ్ ఛానల్‌ను స్థాపించారు. కువైట్‌లోని 20 మంది తెలుగువారితో ఒక టీమ్ ఏర్పాటు చేసి వారినే ఆర్టిస్టులుగా చేసి అవగాహన, సందేశాత్మక, వినోదాత్మక షార్ట్ ఫిల్మ్‌లను రూపొందిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన 18 నిమిషాల నిడివిగల ‘సారాయి’ షార్ట్ ఫిల్మ్ నిజ జీవితాన్ని ఆవిష్కరించింది. గిరిప్రసాద్ కాస కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అందించిన ఈ ష్టార్ట్ మూవీ ‘గల్ఫ్బాబాయ్’ యూట్యూబ్ఛానల్లో ఉంది.https://www.youtube.com/ watch? v=63U5Ek_l9tM_ feature=youtu.be లింక్‌పై క్లిక్ చేసి ఈ మూవీని చూడవచ్చు. గల్ఫ్‌కు వెళ్లే ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రమిది. గతంలో విడుదల చేసిన చీటి పాటల మోసం, గల్ఫ్‌లో కొత్త కుర్రోడు లాంటి సందేశాత్మక షార్ట్ ఫిల్మ్‌లను కూడా ఈ ఛానల్లో చూడవచ్చు. -
అ‘విశ్రాంత’ ఉపాధ్యాయులు
‘సాయం చేయడానికి ఉండాల్సింది డబ్బు కాదు.. మంచి మనసు’ ఈ మాటలు అన్నది ఎవరో కాదు ప్రజా సేవకే తన జీవితం అంకితం చేసిన మదర్ థెరిస్సా. కొందరు చేసే సేవలను చూసినప్పుడు ఆమె చెప్పిన మాటలు అక్షరాల నిజమనిపిస్తుంది. ఉద్యోగ విరమణ పొందినా ముగ్గురు ఉపాధ్యాయులు తాము పని చేసిన పాఠశాలల్లోనే విద్యా బోధన చేస్తూ.. పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. సాక్షి, రాజంపేట టౌన్ : రాజంపేట మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తూ ఉద్యోగ విరమణ పొందిన ఇద్దరు హెచ్ఎంలు, ఓ రిటైర్డ్ ఉపాధ్యాయురాలు అవిశ్రాంతంగా పని చేస్తున్నారు. తాము పని చేసిన పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా విద్యను బోధిస్తూ సేవాతత్పరతను చాటుతున్నారు. రిటైర్డ్ అయ్యే చాలా మంది ఉపాధ్యాయులు శేష జీవితాన్ని తమ పిల్లలు, కుటుంబ సభ్యులతో ఎలా గడపాలో.. ముందే ప్రణాళికలు రూపొందించుకుంటారు. అయితే మండలంలోని తుమ్మల అగ్రహారానికి చెందిన రిటైర్డ్ హెచ్ఎం యు.సుబ్బరాయుడు, ఎగువగడ్డకు చెందిన రిటైర్డ్ హెచ్ఎం వనం ఎల్లయ్య, ఎగువగడ్డ ప్రాంతానికే చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయురాలు హెప్సీబ ఉద్యోగ విరమణ పొందినా తమ శేష జీవితాన్ని మాత్రం విద్యార్థులతోనే గడపాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివేది పేద విద్యార్థులు కావడంతో.. వారి ఉన్నతి కోసం తోడ్పడుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. గురువులకు వందనం రిటైర్డ్ హెచ్ఎం యు.సుబ్బరాయుడు తుమ్మల అగ్రహారంలోని ప్రాథమిక పాఠశాలలో పని చేస్తూ 2017లో ఉద్యోగ విరమణ పొందారు. వనం ఎల్లయ్య ఒకటో వార్డు ప్రాథమిక పాఠశాల, హెప్సీబ మండలంలోని వెంకటరాజంపేట ప్రాథమిక పాఠశాలలో పని చేస్తూ ఈ ఏడాది ఉద్యోగ విరమణ పొందారు. ఇప్పుడు అదే పాఠశాలల్లోని విద్యార్థులకు విద్యను అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. హెప్సీబ రాజంపేట పట్టణం నుంచి వెంకటరాజంపేటకు తన సొంత ఖర్చుతో ఆటోలో వెళ్లి విద్యార్థులకు బోధన చేస్తుండటం విశేషం. వీరికి వందనం అని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందనలు తెలుపుతున్నారు. దేవుడిచ్చిన వరం సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవమైనది. నాకు ఉపాధ్యాయ వృత్తి లభించడం భగవంతుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నా. అందువల్లే నేను ఉద్యోగ విరమణ పొందినా భగవంతుడు నాకు కల్పించిన ఈ అవకాశాన్ని పేద విద్యార్థుల ఉన్నతికి వినియోగిస్తున్నా. – యు.సుబ్బరాయుడు,రిటైర్డ్ హెచ్ఎం, టి.అగ్రహారం పేద విద్యార్థులతోనే శేష జీవితం రెండున్నర దశాబ్దాల పాటు పేద విద్యార్థులతో నా జీవితం సాగింది. శేషజీవితం కూడా వారితోనే కొనసాగించాలన్నదే నా కోరిక. అందువల్ల నేను రిటైర్డ్ అయినా పేద విద్యార్థులకు ఉచితంగా బోధించాలని నిర్ణయించుకున్నా. పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. – వనం ఎల్లయ్య, రిటైర్డ్ హెచ్ఎం, ఎగువగడ్డ, రాజంపేట శరీరం సహకరించినంత వరకు.. నేను వెంకటరాజంపేట ప్రాథమిక పాఠశాలలో తొమ్మిదేళ్లు ఉపాధ్యాయురాలిగా పని చేశాను. ఇక్కడి విద్యార్థులు, ప్రజలతో ఆత్మీయ అనుబంధం ఏర్పడింది. నాకు శరీరం సహకరించినంత వరకు ఈ గ్రామంలోని విద్యార్థులకు సేవ చేస్తా. – హెప్సీబ, రిటైర్డ్ ఉపాధ్యాయురాలు, ఎగువగడ్డ గొప్ప విషయం రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులు ఉచితంగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు విద్యను అందించాలని సంకల్పించడం చాలా గొప్ప విషయం. రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులు తమకు అందుబాటులో ఉండే పాఠశాలల్లో ఇలా బోధిస్తే విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది. – మేడా చెంగల్‌రెడ్డి, ఎంఈఓ, రాజంపేట -
రైల్వే ఎన్నికలకు రెడీ..!
సాక్షి, రాజంపేట: భారతీయ రైల్వేలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే రైల్వేకార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలకు యాజమాన్యం రెడీ అవుతోంది. ఈమేరకు ఎన్నికలకు సంబంధించి మెంబర్షిప్ వెరిఫికేషన్‌కు అన్ని జోనల్ జనరల్ మేనేజర్లకు రైల్వేబోర్డు డైరెక్టరు డి.మల్లిక్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈనేపథ్యంలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నిలకు రైల్వే యాజమాన్యం సన్నాహాలకు దిగినట్లే. రైల్వే బోర్డు ఆదేశాలతో ఆల్ ఇండియ రైల్వేమెన్ ఫెడరేషన్ (ఏఐఆర్ఎఫ్)కు అనుబంధంగా ఉన్న సౌత్‌సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే (ఎన్ఎఫ్ఐఆర్) సౌత్‌సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ నాయకత్వాలు జోన్, డివిజన్ల స్థాయిలో క్యాడర్‌ను సిద్ధం చేస్తోంది. ఆగస్టులో ఎన్నికలు : ఆగస్టులో భారతీయ రైల్వేలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల వేడి రాజుకోనున్నది. గుంతకల్ రైల్వే డివిజన్ పరిధిలో జిల్లా వరకు నందలూరు, కడప రైల్వేకేంద్రాలలో మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ సంఘ్ బ్రాంచీలు ఉన్నాయి. ఈ బ్రాంచిల పరిధిలో రైల్వే ఉద్యోగులు, కార్మికులు ఈ ఎన్నికల్లో తమతమ సంఘాలను గెలిపించుకునేందుకు పోటీపడనున్నారు. రైల్వేబోర్డు ఆదేశాలతో కార్మిక సంఘాల నేతలు ఇప్పటి నుంచి సన్నద్దులవుతున్నారు. 2013లో ఎన్నికలు : 2013 ఏప్రిల్‌లో భారతీయ రైల్వేలో గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో సౌత్‌సెంట్రల్ మజ్దూర్ యూనియన్ విజయఢంకా మోగించిన సంగతి విధితమే. ఆ ఎన్నికల్లో 46 శాతం ఓట్లను దక్కించుకుంది. జోన్ స్థాయిలో 86వేల ఓట్లలో 36వేల ఓట్లను ఎస్ఆర్ఎంయూ దక్కించుకుంది. ఎస్ఆర్ఎంయూ, సంఘ్‌కు సమానంగా వచ్చి రెండింటికి రిగ్నజైడ్ గుర్తింపు వచ్చింది. అయితే గుంతకల్ డివిజన్ స్థాయిలో ఎస్‌ఆర్‌ఎంయూకు 998 ఓట్ల మెజార్టీ వచ్చింది. సీక్రెట్ బ్యాలెట్ ద్వారా... రైల్వే గుర్తింపు కార్మికసంఘం ఎన్నికలు సీక్రెట్ బ్యాలెట్ ద్వారా పోలింగ్ నిర్వహించడం జరుగుతుంది. గత ఎన్నికల్లో కూడా ఇదే పద్ధతిలో నిర్వహించారు. కడప, నందలూరులో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వీటి పరిధిలో ఉన్న రైల్వే ఉద్యోగులు, కార్మికలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఈ ఎన్నికలు ఇరు కార్మికసంఘాలు ప్రతిష్టాతక్మంగా తీసుకోనున్నాయి. గుంతకల్ డివిజన్ పరిధిలో 14వేల సభ్యులు ఉన్నారు. ఈ యేడాది ఈ సంఖ్యలో 20వేలలోపు చేరనున్నదని రైల్వే వర్గాలు అంటున్నాయి. -
8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమౌతుంది
-
కడప జిలాలో టీడీపీకి గట్టి షాక్
-
అమరావతి రమ్మని నన్ను ఘోరంగా అవమానించారు
సాక్షి, కడప : మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనుండగా.. జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ తగిలింది. మాజీ కేంద్రమంత్రి, పార్టీ సీనియర్ నేత సాయిప్రతాప్ తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పారు. కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఆయన టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంతో పాటు, పార్టీలో తగిన గుర్తింపు లేనందున టీడీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు సాయి ప్రతాప్ వెల్లడించారు. కాగా రాజంపేట నుంచి ఆరుసార్లు ఎంపీగా ఎన్నికైన ఆయన రాజంపేట పార్లమెంట్ టికెట్ ఆశించి భంగపడ్డారు. యూపీఏ హయాంలో ఆయన కేంద్రమంత్రిగా కొనసాగిన విషయం తెలిసిందే. రాజంపేట నుంచి ఆరుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. వైఎస్సార్ మరణాంతరం సాయిప్రతాప్ 2016లో తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం విదితమే. ఈ సందర్భంగా సాయిప్రతాప్ కడపలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ...‘దిక్కుతోచని స్థితిలో నా ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి టీడీపీలో చేరడం జరిగింది. రాయలసీమ సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు మూడు లేఖలు ఇచ్చాను. కానీ ఇంతవరకు చంద్రబాబు దగ్గర నుంచి ఎలాంటి సమాధానం లేదు. టీడీపీలో ఉన్న ఈ మూడేళ్లు అజ్ఞాతంతో పాటు, అరణ్య వాసంలో ఉన్నట్లు ఉంది. నన్ను రాజంపేట పార్లమెంట్ ఇన్‌ఛార్జ్‌గా ఉండమన్నారు. కానీ నా పార్లమెంట్ పరిధిలో జరిగే ఎటువంటి పార్టీ కార్యక్రమాలపై నాకు సమాచారం ఇవ్వరు. ఇన్ఛార్జ్కు పార్లమెంట్ సీటు ఇస్తారేమో అనుకున్నా. నా అల్లుడు సాయి లోకేష్‌కు రాజంపేట పార్లమెంట్ టికెట్ అడగటం జరిగింది. కానీ నాకు మొండిచేయి చూపించారు. ఈరోజు టీడీపీలో పరిస్థితి నాకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. నన్ను అమరావతి రమ్మని పిలిచి ఘోరంగా అవమానించారు. చంద్రబాబు నన్ను చూసి పక్కకు మొహం తిప్పుకుని చూడనట్లు వ్యవహరించారు. టీడీపీలో సరైన విలువలు ఇవ్వలేదు. ఈ ఘటన నన్ను తీవ్రంగా కలచి వేసింది. డబ్బులు లేని వారికి టీడీపీలో స్థానం లేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి టీడీపీలో చంద్రబాబు అన్యాయం చేసారు. చంద్రబాబు తీరు వల్ల గత వారం రోజుల పాటు తీవ్ర మనోవేదనకు గురయ్యను. టీడీపీలో స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాలు చేశారు. సీనియర్ నాయకులకే విలువ లేని టీడీపీలో యువతరానికి విలువలు ఉంటాయా...? రెండు రోజుల్లో ఏ పార్టీలోకి వెళ్లేది భవిష్యత్ కార్యాచరణ తెలుపుతాను’ అని అన్నారు. -
కడప: రెండు నెలలు ఓపిక పట్టండి
సాక్షి,రాజంపేట: ‘‘రెండు నెలలు ఓపికపట్టండి.. అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది’’అంటూ వైఎస్సార్సీపీ రాజంపేట అసెంబ్లీ అభ్యర్థి మేడా మల్లికార్జునరెడ్డి భరోసా ఇచ్చారు. ఆదివారం రాత్రి రాజంపేట రూరల్ ఏరియాలోని ఎస్.ఎర్రబల్లి సర్కిల్లో వైఎస్సార్సీపీ జెండా రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డితో కలిసి ఎగురవేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రానున్నది వైఎస్సార్ పాలన అన్నారు. అన్ని వర్గాలకు మేలు జరిగే విధంగా సంక్షేమపాలన ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ వైఎస్సార్సీపీని అధికారంలోకి తెచ్చుకునేందుకు కృషిచేయాలన్నారు. అనంతరం ఎర్రబల్లికి చెందిన 35 కుటుంబాల వారికి కండువాలను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనరు పోలా శ్రీనివాసులురెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు ఆకేపాటి మురళీరెడ్డి, చొప్పాఎల్లారెడ్డి, సీనియర్ నాయకుడు కొండూరు శరత్‌కుమార్‌రాజు, మండల కన్వీనరు భాస్కరరాజు తదితరులు పాల్గొన్నారు. -
రాజన్న రాజ్యానికే రాజంపేట మద్దతు
రాజంపేట నియోజకవర్గంలో దివంగత వైఎస్సార్ హయాంలో శాశ్వత అభివృద్ధి జరిగింది. మాజీ ఎమ్మెల్యేలు కొండూరు ప్రభావతమ్మ, ఆకేపాటి అమర్నాథ్రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కింది. తాగు, సాగునీటి ప్రధానసమస్యలను తీర్చారు. అటువంటి రాజంపేటలో మళ్లీ రాజన్న రాజ్యానికే మద్దతు పలకనున్నారు. ఎమ్మెల్యేగా మేడా మల్లికార్జునరెడ్డి తనదైనశైలిలో అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజాసమస్యల పరిష్కారానికి కృషిచేశారు. 1952–55 కాలంలో ఈ నియోజకవర్గంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహించారు. 1952లో జరిగిన ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి పంజం నరసింహారెడ్డి , కాంగ్రెస్ తరఫున పోలా వెంకటసుబ్బయ్య గెలుపొందారు. 1955లో జరిగిన ఎన్నికలలో పార్థసారథి, పీవీ సుబ్బయ్య కాంగ్రెస్‌పార్టీ తరఫున పోటీచేసి చెరో 40వేలకుపైగా ఓట్లు సాధించి భారీ విజయం సాధించారు. 1962లో స్వతంత్ర అభ్యర్థిగా కొండూరు మారారెడ్డి 14,335 ఓట్లు సాధించి కాంగ్రెస్ అభ్యర్థి పార్థసారథిపై విజయం సాధించారు. 1967లో స్వతంత్ర అభ్యర్థిగా బండారు రత్నసభాపతి 35,845 ఓట్లతో గెలుపొందారు. 1972లో రెండోసారి కూడా ఈయన గెలుపొందారు. 1997 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కొండూరు ప్రభావతమ్మ గెలుపొందారు. 1978లోరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రభావతమ్మ పోటీ చేసి, స్వతంత్ర అభ్యర్థి సభాపతిపై విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తరువాత ఎన్టీఆర్ ప్రభంజనంలోనూ రాజంపేటలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రభావతమ్మ, టీడీపీ అభ్యర్థి సభాపతిపై గెలుపొందారు. ఇది రాష్ట్రంలో చారిత్రాత్మక ఘట్టం. 1989లో కాంగ్రెస్ టికెట్ దక్కని ప్రభావతమ్మ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయగా.. కాంగ్రెస్ అభ్యర్థి కె.మదన్‌మోహన్‌రెడ్డి విజయం సాధించారు. 1994, 1999లో టీడీపీ తరఫున పసుపులేటి బ్రహ్మయ్య గెలుపొందారు. 2004 జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రభావతమ్మ టీడీపీ అభ్యర్థి బ్రహ్మయ్య పై సుమారు 24వేల ఓట్లపై చిలుకు మెజార్టీతో గెలుపొందారు. 2009లో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి 12వేల మెజారిటీతో గెలుపొందారు. ఆతర్వాత జరిగిన ఉపఎన్నికల్లో ఆకేపాటి గెలుపొందారు. 2014లో మేడా మల్లికార్జునరెడ్డి విజయం సాధించారు. వైఎస్సార్సీపీ చేపట్టనున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితుడైన మల్లికార్జున రెడ్డి పార్టీలో చేరారు. బరిలో స్థానికేతరుడు టీడీపీ నుంచి ఈసారి రైల్వేకోడూరుకు చెందిన బత్యాల చెంగల్రాయుడును చంద్రబాబు బరిలోకి దింపారు. రాజంపేటకు ఎలాంటి సంబంధంలేని ఈయనపై పార్టీలో అసంతృప్తి నెలకొంది. స్థానిక నాయకత్వాన్ని కాదని బత్యాలను పోటీకి దింపారు. ఈ సారి ఎన్నడూలేని రీతిలో సామాజికవర్గరాజకీయాలు రాజంపేటలో రాజ్యమేలుతున్నాయి. మేడా వైపే.. రాష్ట్ర విభజన అనంతరం రాజంపేట తొలి ఎమ్మెల్యేగా మేడా మల్లికార్జునరెడ్డి గుర్తింపు పొందారు. ఎమ్మెల్యేగా రాజంపేటలో అభివృద్ధికి పెద్దపీట వేశారు. ఆంధ్ర భద్రాద్రిగా రామాలయానికి అధికారిక గుర్తింపుతోపాటు టీటీడీలో విలీనం చేయడంలో తనదైన పాత్ర పోషించారు. ఒంటిమిట్ట చెరువుకు సోమశిల జలాలను తీసుకొచ్చి జలకళను తెప్పించారు. పేదలకు ముఖ్య మంత్రి సహాయ నిధిని ఇప్పించడంలో కృషి చేశారు. నందలూరు మండల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చారు. సౌమ్యుడిగా పేరొందడంతో పాటు సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తిగా ప్రజల్లో మంచి గుర్తింపు పొందారు. నిరంతరం ప్రజలసమస్యలను పరిష్కరించడంలో ఐదేళ్లపాటు నిర్విరామంగా కృషిచేశారు. – మోడపోతుల రామ్మోహన్, సాక్షి, రాజంపేట -
కన్నప్ప జన్మస్థలిపై కనికరమేదీ!
సాక్షి, రాజంపేట : శ్రీకాళహస్తిలో దక్షిణకాశిగా విరాజిల్లుతున్న పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర ఆలయం. ఈ ఆలయంలోని శివలింగానికి పూజలు చేసి అపర శివభక్తునిగా నిలిచిన భక్తకన్నప్పది వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం ఊటుకూరు (ఊడుమూరు) గ్రామమని పెరియపురాణం ద్వారా వెలుగులోకి వచ్చింది. ఇక్కడున్న శివాలయంలో శివలింగానికి కన్నప్ప పూజించినట్లుగా చెబుతుంటారు. అపర శివభక్తుడు భక్తకన్నప్ప(తిన్నడు) జన్మస్థలంపై రాష్ట్ర ప్రభుత్వం అధికారముద్ర ఇంతవరకు పడలేదు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. జన్మస్థలం అభివృద్ధి గురించి శ్రీకాళహస్తి దేవస్థానం శీతకన్ను వేసిందని భక్తుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. తమిళనాడుకు చెందిన ఓ భక్తుడు పెరియపురాణం ద్వారా భక్తకన్నప్ప జన్మస్థలం రాజంపేట మండలంలోని ఊటుకూరు అని వెలుగులోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి గ్రామస్తులు దాతల సహకారంతో ఆలయాభివృద్ధికి నడుం బిగించారు. భక్త కన్నప్ప విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. భక్త కన్నప్ప జన్మ స్థలంలో ప్రతిష్టించిన కన్నప్ప విగ్రహం కన్నప్ప కాళహస్తికి ఎలావెళ్లాడు.. తిన్నడు(కన్నప్ప) ఒకనాడు అడవిలో పందిని వేటాడుతూ ఊటుకూరు నుంచి అటవీ ప్రాంతంలో స్వర్ణముఖి నది వరకు వెళ్లాడు. అక్కడ నేటి శ్రీకాళహస్తి దగ్గర శివలింగాన్ని దర్శించి, శివుని భక్తునిగా మారి పూజలు చేసేవాడు. తర్వాత పరమశివునికి తన రెండు కళ్లను సమర్పించి తన భక్తిని చాటుకున్నాడు. ఆయన భక్తికి మెచ్చి శివుడు కన్నప్పకి మోక్షమిచ్చాడు. మహాభక్తుడు కన్నప్ప ప్రతిష్టించిన శివలింగం జన్మ స్థలమైన ఊటుకూరు శివాలయంలో ఉంది. కన్నప్ప ఊహాచిత్రం అన్నమయ్యతో భక్త కన్నప్ప జన్మస్థలానికి అనుబంధం.. తాళ్లపాక అన్నమాచార్యులు తాత నారాయణయ్య చదువుకోవడానికి ఊటుకూరు(ఉడుమూరు)కు వచ్చారు. చదువు అబ్బక గురువు పెట్టే శిక్షలు భరించలేక చింతాలమ్మ గుడిలోని పుట్టలో చేయిపెట్టారు. పాము కరవలేదు కానీ, చింతాలమ్మ ప్రత్యక్షమైంది. శ్రీ వేంకటేశ్వరుని అనుగ్రహం వల్ల పరమభక్తుడు నీకు మనమడుగా పుడతాడని ఆశీర్వదించింది. ఆ నారాయణయ్య మనువడే అన్నమాచార్యులు. అన్నమయ్య తండ్రి నారాయణసూరి, తల్లి లక్కమాంబ. అన్నమయ్య కూడా ఊటుకూరులో చిన్నతనంలో విద్యాభ్యాసం చేశాడు. కలియుగ దైవం వేంకటేశ్వరునిపై 32వేల కీర్తనలు రచించి, పదకవితా పితామహడు పేరు తెచ్చుకొని ధన్యుడయ్యారు. చింతాలమ్మ అమ్మవారి విగ్రహం ఇప్పటికీ ఊటుకూరు శివాలయంలో ఉంది. -
సీనియర్లకు బాబు మొండిచేయి
అమరావతి : రాజంపేట పార్లమెంటు స్థానంపై గురువారం సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న సీనియర్ నేతలు పసుపులేటి బ్రహ్మయ్య, పాలకొండ రాయుడికి చంద్రబాబు మొండిచేయి చూయించారు. రాజంపేట సీటు కోసం ప్రయత్నిస్తూ ఇటీవలే పసుపులేటి బ్రహ్మయ్య గుండెపోటుకు గురైన సంగతి తెల్సిందే. రాజంపేట పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గ నేతలతో సంప్రదింపుల అనంతరం రాజంపేట అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడికి అవకాశం ఇస్తున్నట్లు వెల్లడించారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ జిల్లాలో టీడీపీ తరపున గెలిచిన ఏకైక అభ్యర్థి మేడా మల్లికార్జున్ రెడ్డే(రాజంపేట శాసనసభ స్థానం నుంచి). ఇటీవలే ఆయన పార్టీకి, పదవికి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరిన సంగతి తెల్సిందే. అలాగే రాయచోటిలో పార్టీ పుట్టిన నాటి నుంచి ఉన్న సీనియర్ నేత పాలకొండ రాయుడిని పక్కన పెట్టి ఈ సారి రమేష్ రెడ్డికి అవకాశం కల్పించారు. పీలేరు శాసనసభా స్థానం నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పుంగనూరు నుంచి అనూష రెడ్డి, రైల్వే కోడూరు నుంచి నరసింహ ప్రసాద్‌లకు సీట్లు కేటాయిస్తున్న చంద్రబాబు వెల్లడించారు. రాజంపేట పార్లమెంటు పరిధిలోకి వచ్చే మదనపల్లె, తంబాలపల్లె సీట్లపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. పార్టీ ఫిరాయించి వచ్చిన నేతలకు టీడీపీలో ప్రాధాన్యం ఇస్తున్నారని జిల్లాలో సీనియర్లు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఇటీవలే సీనియర్లు తమకు టిక్కెట్లు కేటాయించకపోతే ఇండిపెండెంటుగానైనా బరిలోకి దిగుతామని బాహాటంగా హెచ్చరించిన సంగతి తెల్సిందే. -
రాష్ట్రంలో దోపిడీ పాలన
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో దోపిడీ పాలన సాగుతోందని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి పేర్కొన్నారు. సీఎం చంద్రబాబును ప్రజలు ఛీ కొడుతున్నారని చెప్పారు. ‘నిన్ను నమ్మం బాబూ.. నమ్మంగాక నమ్మం’ అని అంతా ముక్తకంఠంతో నినదిస్తున్నారన్నారు. దివంగత వైఎస్సార్ ఆశయాల మేరకు సుపరిపాలన సాధించేందుకు టీడీపీకి రాజీనామా చేసినట్లు మేడా తెలిపారు. రాష్ట్రానికి తదుపరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనడంలో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. బడుగు, బలహీన వర్గాలను ఆదరించే సీఎంగా వైఎస్ జగన్ ముందుకు వెళ్తారని చెప్పారు. గురువారం హైదరాబాద్‌లో వైఎస్సార్ సీపీలో చేరిన అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఆరోజు నుంచి ఈరోజు వరకు ఒకటే మాట చెబుతున్నా. వైఎస్ జగన్ ఏపీకి కాబోయే సీఎం’ అని పేర్కొన్నారు. రాజంపేట, రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలని నిర్ణయించుకుని వైఎస్సార్ సీపీలో చేరానన్నారు. తాము టీడీపీ మాదిరిగా ప్రజాస్వామ్య విలువలు తెలియని వాళ్లం కాదని మేడా వ్యాఖ్యానించారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా.. వైఎస్సార్ సీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి టీడీపీ కొనుగోళ్లకు పాల్పడితే ఈరోజు దాకా వారి విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని మేడా పేర్కొన్నారు. ‘వైఎస్ జగన్ నాకు ఒకే మాట చెప్పారు. పార్టీలో చేరే ముందు టీడీపీ ద్వారా వచ్చిన అన్ని పదవులకు రాజీనామా చేసి రమ్మని కోరారు. ఈ నెల 22వ తేదీనే ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశా. ఈరోజు స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా పంపా’ అని మేడా వివరించారు. అన్ని వర్గాలకూ టీడీపీ దగా.. రాష్ట్రాన్ని సశ్యశ్యామలం చేసి అన్ని వరాలకు మంచి జరిగే పరిపాలన రావాలన్నది తన అభిమతమని మేడా చెప్పారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ప్రతి వర్గాన్ని దగా చేశారని ధ్వజమెత్తారు. రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగ యువత, కాపులు.. ఇలా అందరినీ టీడీపీ మోసగించిందన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లాలో వైఎస్సార్ సీపీ పదికి పది స్థానాలు గెలుస్తుందని ప్రకటించారు. రాజకీయంగా అనుభవజ్ఞుడైన మాజీ ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డితో కలసి రాజంపేట నియోజకవర్గంలో ముందుకు వెళ్తానని మేడా చెప్పారు. భారీగా తరలివచ్చిన మేడా అనుచరులు రాజంపేట శాసనసభ్యుడు మేడా మల్లికార్జునరెడ్డి వైఎస్సార్ సీపీలో చేరిక సందర్భంగా ఆయన అనుచరులు పెద్ద ఎత్తున తరలి రావడంతో హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం కిక్కిరిసింది. రాజంపేట నుంచి భారీగా వాహనాల్లో తరలి రావడంతో ట్రాఫిక్ స్తంభించింది. మేడాకు లోటస్‌పాండ్‌లో వైఎస్ జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగన్ ప్రతి ఒక్కరినీ సాదరంగా పలకరించారు. పార్టీలో చేరిన వారందరికీ తోడుగా ఉంటానని భరోసా ఇచ్చారు. అంతా కలసి మళ్లీ రాజన్న రాజ్యాన్ని తెచ్చుకుందామన్నారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్ జిల్లాలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక అభ్యర్థి మేడా మల్లికార్జునరెడ్డి కావడం గమనార్హం. కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులుతోపాటు మేడా రఘునాథ్‌రెడ్డి, మేడా విజయభాస్కర్‌రెడ్డి, పార్టీ నేతలు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీలోకి మేడా మల్లికార్జునరెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజంపేట శాసనసభ్యుడు మేడా మల్లికార్జునరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో అనుచరులతో కలిసి వైఎస్సార్సీపీలోకి వచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీలో కొందరు నేతల దుశ్చర్యలు చూడలేకపోయానని, తనను అన్యాయంగా పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఇదివరకే మేడా మల్లికార్జునరెడ్డి చెప్పారు. వైఎస్సార్సీపీ నుంచి రాజంపేట అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టినా కలిసి పనిచేస్తామన్నారు. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ జిల్లాలో పోటీ చేసి.. గెలిచిన ఏకైక టీడీపీ అభ్యర్థి మేడా మల్లికార్జునరెడ్డి. ఆయనతోపాటు రాజంపేట నుంచి భారీ ఎత్తున వచ్చిన ఆయన అనుచరులు వైఎస్సార్సీపీలో చేరారు. ప్రతి ఒక్కరినీ పలకరించిన వైఎస్ జగన్.. కండువాలు కప్పి వారిని పార్టీలో ఆహ్వానించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సందడి నెలకొంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశా: మేడా వైఎస్సార్సీపీలో చేరిన సందర్భంగా మేడా మల్లికార్జునరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేసినట్టు ఆయన వెల్లడించారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖను తాను పంపానని తెలిపారు. వైఎస్ జగన్‌తోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని చెప్పారు. గత నాలుగున్నరేళ్లుగా అమలు చేయని హామీలు ఇప్పుడు ఎలా చంద్రబాబు అమలు చేస్తారని మేడా ప్రశ్నించారు. ఎన్నికల నేపథ్యంలోనే చంద్రబాబు కొత్త వాగ్దానాలు ఇస్తున్నారని, ఆయన హామీలను ప్రజలు నమ్మబోరని పేర్కొన్నారు. గతవారం వైఎస్ జగన్‌తో భేటీ! వైఎస్సార్ సీపీ జిల్లా రాజంపేట నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ ప్రభుత్వ విప్ మేడా మల్లిఖార్జున రెడ్డి గత మంగళవారం వైఎస్ జగన్‌ను కలిసిన సంగతి తెలిసిందే. టీడీపీలో ఇమడలేకపోతున్నానని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతానని ఆయన వైఎస్ జగన్‌ను కోరారు. ఎమ్మెల్యే సహా అధికార పదవులన్నింటికీ రాజీనామా చేయాలని ఈ సందర్భంగా ఆయనకు వైఎస్ జగన్ సూచించారు. తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్టు కొని చంద్రబాబు విలువలు దిగజార్చారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలు, విశ్వసనీయత ముఖ్యమని పునరుద్ఘాటించారు. చదవండి: బాబును నమ్మితే రాష్ట్రం సర్వనాశనమవుతుంది : మేడా -
వారి ఉడత బెదిరింపులకు బెదరను: ఎమ్మెల్యే మేడా
-
వారి ఉడత బెదిరింపులకు బెదరను: ఎమ్మెల్యే మేడా
సాక్షి, రాజంపేట: వైఎస్ఆర్ జిల్లా రాజంపేట టిడిపిలో విభేదాలు భగ్గుమన్నాయి. స్థానిక ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డిని పిలవకుండానే మంత్రి ఆదినారాయణరెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో మేడా వర్గీయులు మంత్రిని నిలదీశారు. సమావేశాన్ని బహిష్కరించి నిరసన తెలిపారు. పొమ్మనలేక పొగబడుతున్నారంటూ మేడా వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డిని పార్టీ నుంచి బయటకు పంపేందుకు టీడీపీ అధిష్టానం తనదైన శైలిలో రాజకీయం ప్రారంభించింది. అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎంపిక చేసేందుకు నియోజకవర్గాల వారీగా చంద్రబాబునాయుడు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో రాజంపేట నియోజకవర్గ సమావేశం కూడా ఉంది. దీని కోసం నిన్న రాత్రి ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి తన అనుచరులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సమావేశాన్ని ఆసరాగా చేసుకుని ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ప్రచారం చేపట్టింది. అంతటితో ఆగకుండా ఆయన వ్యతిరేకులతో మంత్రి ఆదినారాయణరెడ్డి సారథ్యంలో రాజంపేటలోనే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి స్థానిక ఎమ్మెల్యే మేడాను పిలువలేదు. దీంతో ఆయన వర్గీయులు నేరుగా సమావేశం వద్దకు వెళ్లి.. మంత్రి ఆదినారాయణరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిని నిలదీశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు సమావేశం వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా టీడీపీ నేతలు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, రాజంపేటలో సమావేశం గురించి తనకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి స్పష్టం చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసిన వారితో కలిసి ఆదినారాయణరెడ్డి సమావేశం నిర్వహించారని, తనకు వ్యతిరేకంగా జిల్లా నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయమై సీఎం చంద్రబాబుతో భేటీ అవుతానని చెప్పారు. జిల్లా నేతల ఉడత బెదిరింపులకు తాను బెదరనని, కార్యకర్తలతో చర్చించి వారి నిర్ణయం మేరకు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. -
రాజంపేట టీడీపీలో వర్గవిభేదాలు
-
టీడీపీలో భగ్గుమన్న విభేదాలు..!
సాక్షి, వైఎస్సార్ జిల్లా: రాజంపేట టీడీపీలో వర్గవిభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. స్థానిక రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్‌రెడ్డిని పిలువకుండానే మంత్రి ఆదినారాయణరెడ్డి టీడీపీ శ్రేణులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి బ్రహ్మయ్య, మాజీ ఎమ్మెల్సీ బత్యాల తదితరులు హాజరయ్యారు. అయితే, ఈ సమావేశానికి తమ నేతను పిలువకపోవడంపై హాజరైన ఎమ్మెల్యే మేడా వర్గీయులు ఆగ్రహం వ్యక్తంచేశారు. కావాలనే తమ నాయకుడిని పిలువలేదని, పార్టీ నుంచి పొమ్మనలేక ఆయనకు పొగబెడుతున్నారని వారు ఆగ్రహం వక్తం చేశారు. తనకు అనుకూలుడైన నేతకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇప్పించడానికే ఆదినారాయణరెడ్డి ఈ సమావేశాన్ని ఏర్పాటుచేశారని మండిపడుతూ.. ఈ సమావేశాన్ని మేడా వర్గీయులు బహిష్కరించారు. -
ఆస్పత్రికి వెళితే..ఆయువు తీశారు..!
అది ఏ దిక్కూలేని దవాఖానా. అక్కడ వైద్యులు ఉండరు. సకాలంలో వైద్యం అందదు. కళ్లుతిరిగి పడిపోయిందని ఆస్పత్రికి తీసుకెళితే వృద్ధురాలి ఆయువు తీశారు. ప్రాణాలు పోతున్నా వైద్యం చేసేవారు కరవు అనేందుకు రాజంపేట ఏరియా ఆస్పత్రిలో శనివారం జరిగిన ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. అధికారులు, వైద్యుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజంపేట: ఆకేపాడు గ్రామపరిధిలోని రామిరెడ్డిగారిపల్లెకు చెందిన ఆవుల సుభద్రమ్మ (68) అనే వృద్ధురాలు సకాలంలో వైద్యం అందక ప్రాణాలు విడిచింది. ఈ సంఘటన శనివారం చోటుచేసుకుంది. బాధితుల వివరాల మేరకు... సుభద్రమ్మ కళ్లు తిరిగి కిందకిపడిపోయింది. ఆమెను రాజంపేట ఏరియా ఆసుపత్రి(వైద్యవిధానపరిష్)కు తీసుకెళ్లారు. అయితే ఆ సమయంలో డ్యూటీలో ఉన్న నర్స్ స్థానిక వైద్యునికి సమాచారం తెలియజేశారు. ఆయన వచ్చే సరికే వృద్ధురాలి పరిస్థితి విషమించింది. మృత్యుఓడిలోకి చేరుకుంది. వృద్ధురాలిని పరిశీలించి అక్కడి నుంచి వైద్యుడు వెళ్లిపోయారు. సకాలంలో వృద్ధురాలు ఆసుపత్రికి వచ్చినప్పటికి వైద్యం అందించలేకపోవడంతో బంధువులు ఆగ్రహించారు. అన్ని సౌకర్యాలు ఉంటాయనే (ట్రామాకేర్‌సెంటర్) ఉద్దేశంతో వృద్ధురాలిని తీసుకు వచ్చామని.. ఆస్పత్రి దుస్థితి తమకు తెలిసి ఉంటే తీసుకొచ్చేవాళ్లం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎదైనా కార్పొరేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లినా కాపాడుకునేవాళ్లమని మృతురాలి సంబంధీకులు వాపోయారు. కాల్డ్యూటీలు.. రాజంపేట ఏరియా హాస్పిటల్లో కాల్‌డ్యాటీలు అమలుచేస్తున్నారు. వైద్యులు, వైద్యసిబ్బంది కొరత సమస్య వెంటాడుతోంది. ఈ క్రమంలో కాల్‌డ్యాటీలు తెరపైకి వచ్చాయి. వైద్యుడు 10 నుంచి 15 నిమిషాల్లో వచ్చి చికిత్స చేసేలా నిర్ణయం తీసుకున్నారని ఆసుపత్రి వర్గాలు మరోవైపు చెబుతున్నాయి. అయితే కొందరు వైద్యులు జీవో ప్రకారం స్థానికంగా లేకపోవడం వల్లనే ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమైవుతాయనే ఆరోపణలు వెలువడుతున్నాయి. కాల్డ్యూటీలో రోగులు తమకు సహకరించాలని ముందస్తుగా సెంటర్లో ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు. ఆ లెక్కన చూస్తే శనివారం వృద్ధురాలని 12.15గంటలకు తీసుకొస్తే 12.40గంటలకు కానీ వైద్యం చేసేందుకు ఎవరూ రాలేదు. దీంతో వృద్ధురాలి కానరాని లోకాలకు చేరుకుంది. వైఎస్సార్సీపీ నేతల ఆందోళన వృద్ధురాలి మృతికి సకాలంలో వైద్య సేవలందించకపోవడమే కారణమని, ఇక్కడ వైద్యులు అందుబాటులో లేరని వైఎస్సార్సీపీ నేతలు మూకుమ్మడిగా ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ జిల్లా రైతు ప్రధానకార్యదర్శి గీతాల నరసింహారెడ్డి, నీనేస్తం అధ్యక్షుడు పెంచలయ్యనాయుడు, దళితనాయకులు దండుగోపి, ఆర్సీ పెంచలయ్య, సొంబత్తిన శ్రీనివాసులు, మాజీ సర్పంచి బుర్రునాగేశ్వరరావు, మాధవరం వల్లి, ఆకేపాడు గ్రామానికి చెందిన నాయకులు ట్రామా కేర్ సెంటర్ ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యవిధానపరిషత్ నిర్వహణ విఫలమయ్యిందని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వైద్యులు నిర్లక్ష్యంపై నిప్పులు చెరిగారు. మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి కృషితో ట్రామాకేర్సెంటర్ను తీసుకొచ్చారని, ఇప్పుడు టీడీపీ పాలనలో దిక్కులేని దవాఖానాగా మారిపోయిందని విమర్శించారు. ప్రాణాలు కాపాడలేని పెద్దాసుపత్రి ప్రాణాలు పోసేవిధంగా ఉండాలే కానీ, ప్రాణాలను కాపాడలేని విధంగా రాజంపేట పెద్దాసుపత్రి నిర్వహణ తీరు కనిపిస్తోంది. గతంలో చిన్నారి భవ్యశ్రీ మృతి సంఘటనలో చట్టపరమైన చర్యలు తీసుకుని ఉండి ఉంటే ఈ రోజు వృద్ధురాలి ప్రాణంపోయి ఉండేది కాదు. తాను ఎంతో కృషిచేసి ట్రామాకేర్‌సెంటర్ మంజూరు, ఓపీబ్లాక్ ఆధునీకరణ లాంటివిచేపడితే పేదలకు మెరుగైన వైద్యం అందుతుందని భావించాను. టీడీపీ పాలకుల వల్లే ఆస్పత్రికి ఈ దుస్థితి వచ్చింది. –ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, రాజంపేట డీసీహెచ్కు ఫోన్‌చేశాను.. అవ్వ అస్వస్థతకు గురికావడంతో రాజంపేట ఏరియా హాస్పిటల్‌కు తీసుకువచ్చాను. అయితే అందుబాటులో వైద్యులు లేరు. వైద్యుని కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. మృతిచెందినట్లుగా తెలిసి, ఇక్కడున్న పరిస్థితులను డీసీహెచ్కు ఫోన్ ద్వారా వివరించాను. పొంతనలేని సమాధానాలు చెప్పి, ఫోన్ కట్‌చేశారు. –ఆవుల విష్ణుకాంత్‌రెడ్డి, మృతురాలి మనవడు, ఆకేపాడు -
పుస్తకం కోసం వచ్చి.. మృత్యు ఒడికి..
రాజంపేట: రాజంపేట–రాయచోటి రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) స్పీడ్ బ్రేకర్ వద్ద శనివారం సాయంత్రం టిప్పర్ ఢీకొన్న సంఘటనలో ఇంటర్ విద్యార్థి యెద్దల రమేష్(17) దుర్మరణం చెందాడు. మృతుడు రైల్వేకోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం బావికాడిపల్లె రామాపురం నడిమ అరుంధతీవాడకు చెందిన చిన్నయ్య, లక్షుమ్మ దంపతులకు రెండవ కుమారుడు. రమేష్ రాజంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. తండ్రి జీవనోపాధి నిమిత్తం కువైట్‌కు వెళ్లాడు. విద్యార్ధి మృతితో రామాపురం నడిమ అరుంధతీవాడలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గైడ్ కోసం పట్టణంలోకి వచ్చి.. రమేష్, శ్యామ్‌కుమార్‌లు సైకిల్‌పై గైడ్ కొనుగోలు చేసేందుకు ఆర్వోబీ( రాయచోటి వైపు) నుంచి పట్టణంలోకి వచ్చారు. తిరిగి మళ్లీ కళాశాల వైపు వెళ్లే సమయంలో ఆర్వోబీ ఎక్కే సమయంలో అకస్మాత్తుగా వెనుకవైపు నుంచి రాయచోటి వైపు వెళుతున్న టిప్పర్ ఢీ కొంది. సైకిల్‌పై ఉన్న శ్యామ్‌కుమార్ ఎడమవైపు పడటంతో టిప్పర్ కింద పడకుండా తప్పించుకోగలిగాడు. అయితే రమేష్ మాత్రం టిప్పర్ వెనుక టైర్ల కింద పడటంతో తల నుజ్జునుజ్జు అయింది. అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. అరుంధతీవాడలో విషాద ఛాయలు... రామాపురం నడిమ అరుంధతీవాడలో ఇంటర్ విద్యార్థి రమేష్ మృతితో విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యార్థిని టిప్పర్ ఢీ కొని నేరుగా వెళ్లిపోతుండగా స్థానికులు వెంబడించారు. ఆర్వోబీ ఆవలివైపు టిప్పర్‌ను నిలిపివేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదం నుంచ బయటపడిన శ్యామ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రాజంపేట రూరల్ సీఐ నరసింహులు తెలిపారు. ఆదివారం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించనున్నారు. -
చిచ్చు పెట్టిన ఫొటో
సాక్షి, రాజంపేట : అన్న, తమ్ముడి మధ్య ఓ ఫొటో చిచ్చు పెట్టింది. ఈ సంఘటన శనివారం పట్టణంలోని బీఎస్ థియేటర్ సమీపాన ఉన్న ఓ ఇంటిలో చోటు చేసుకుంది. కరీముల్లా, షమీవుల్లా అన్నదమ్ముళ్లు. రంజాన్‌ను ఆ కుటుంబం సంతోషంగా జరుపుకొంది. ఇంతలోనే తమ్ముడు షమీ వుల్లా అన్న భార్య ఫొటో తీశారు. ఈ క్రమంలో అన్న కరీముల్లా అభ్యం తరం చెప్పారు. గొడవ వాతావరణం నెలకొంది. పైగా అనుమానం కలిగి ఉన్న అన్న తమ్ముడిపై కత్తితో దాడి చేశాడు. గాయపడిన తమ్ముడిని స్థానిక పెద్దాసుపత్రికి తరలించారు. ఈ విషయంపై సీఐ నరసింహులు మాట్లాడుతూ తమ్మునిపై అన్నకు అనుమానం ఉందని తెలిపారు. ఈ సందర్భంలో ఘర్షణ చోటుచేసుకుందని ఆయన పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. -
ఆర్టీసీ డ్రైవర్‌పై టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడి వీరంగం
-
టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడి వీరంగం..!
సాక్షి, రాజంపేట: వైఎస్సార్ జిల్లా రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి అనుచరుడు మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. రాజంపేటలో ఆర్టీసీ బస్సు ముందు తన వాహనాన్ని టీడీపీ ఎమ్మెల్యే మేడా అనుచరుడు మనోహర్‌రెడ్డి అడ్డంగా నిలిపేవాడు. దీంతో బస్సు డ్రైవర్ హారన్ కొట్టాడు. తన వాహనానికే హరన్ కొడతావా అంటూ మనోహర్‌రెడ్డి ఆగ్రహంతో ఊగిపోతూ.. ఆర్టీసీ బస్సు డ్రైవర్ మల్లికార్జున్‌పై దాడికి దిగాడు. రక్తం వచ్చేలా డ్రైవర్‌ను కొట్టాడు. దీంతో బస్సు డ్రైవర్ ఆస్పత్రిలో చేరాడు. దాడి సమయంలో నిందితుడు 84శాతం అల్కాహల్ సేవించి ఉన్నాడని రాజంపేట అర్బన్ పోలీసులు తెలిపారు. -
వైఎస్సార్సీపీలో చేరిన బొల్లినేని
సాక్షి, రాజాంపేట : వైఎస్సార్ జిల్లా తెలుగుదేశం అధికార ప్రతినిధిగా ఉన్న బొల్లినేని రామ్మోహన్నాయుడు శనివారం టీడీపీని వీడిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి తీరుపై కినుక వహించిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. తర్వాత తన అనుచరులతో చర్చించిన ఆయన సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి, సీనియర్ నాయకుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి సమక్షంలో బొల్లినేని పార్టీలో చేరారు. ఎంపీ మిథున్ రెడ్డి తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం తొలిసారి నియోజక వర్గంలో అడుగుపెట్టిన సందర్భంగా ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రాజంపేట మండలం మిట్టమీదపల్లి నుంచి భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. -
అవమానాలు భరించలేకే టీడీపీకి రాజీనామా
సాక్షి, రాజంపేట: వైఎస్సార్ జిల్లా రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి పార్టీని సర్వనాశనం చేస్తున్నాడని ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బొల్లినేని రామ్మోహన్నాయుడు ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే తీరుకు నిరసనగా తన పదవికీ, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలో జరుగుతున్న అవమానాలు భరించలేకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. శనివారం రాజంపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేగా మల్లికార్జునరెడ్డి గెలవడానికి కమ్మ సామాజిక వర్గం కృషి చేసిందని, అయితే ఆయన నాలుగేళ్లుగా కమ్మ వర్గీయులను పూర్తిగా అణగదొక్కారని విమర్శించారు. అధికారుల నుంచి పనులు చేయించుకునేందుకు ఎమ్మెల్యే వర్గీయులు చేస్తున్న వ్యవహారాలు నియోజకవర్గంలో అందరికీ తెలిసిందేనన్నారు. ఎమ్మెల్యే పేరుతో కొందరు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, అలాగే భూదందా, కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. రాజంపేట తహసీల్దారు నివసిస్తున్న అపార్టుమెంట్ అద్దె కూడా ఎమ్మెల్యే వర్గీయుల్లో కొందరు చెల్లిస్తున్నారంటే ఇక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు. -
కనీవినీ ఎరుగని బీభత్సం
రాజంపేట/ కడప అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో శుక్ర వారం రాత్రి వర్ష బీభత్సం స్థానికులను తీవ్ర భయాందోళన లకు గురి చేసింది. ఇలాంటి దుర్ఘటనను తాము గతంలో ఈ ప్రాంతంలో ఎప్పుడూ చూడలేదని చెబుతున్నారు. శుక్రవారం రాత్రి కోదండరామయ్య కల్యాణోత్సవం సందర్భంగా వర్షం, ఈదురు గాలుల ధాటికి వేదిక కూలి, చెట్లు విరిగిపడి నలుగురు భక్తులు మరణించిన సంగతి తెలిసిందే. 70 మంది గాయాల పాలయ్యారు. అధికారులు, పోలీసులు సైతం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. ముందస్తు చర్యలేవీ? శుక్రవారం సా.7 గంటల ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని సమాచారం ఉన్నప్పటికీ ముందస్తు చర్యలు లేకపోవ డంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులపై అసహనం వ్యక్తంచేశారు.ఎందుకు అప్రమత్తం కాలేకపోయారని ప్రశ్నిం చినట్లు సమాచారం. మరోవైపు ఒంటిమిట్టలో కల్యాణ వేదిక, రామాలయం పరిసర ప్రాంతాల్లో వర్ష బీభత్సం వల్ల జరిగిన నష్టంపై టీటీడీ విజిలెన్స్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈదురు గాలుల కారణంగా ఆలయ ధ్వజస్తంభంపైభాగంలో వంకరపోయింది. రామాలయం మూసివేత బలమైన ఈదురుగాలుల ధాటికి రామాల యంలో తాత్కాలిక నిర్మాణాలు కుప్పకూలాయి. దీంతో శనివారం భక్తులకు స్వామివారి దర్శనం సా. 4 గంటల వరకు లేకుండాపోయింది. సంప్రోక్షణ పేరుతో ఆలయ ద్వారాలను మూసివేసిశారు. కోదండ రాముడి ఆలయంలో కూలి పడ్డ చలువ పందిళ్లు తాత్కాలిక నిర్మాణాలవల్లే ప్రాణ నష్టం శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా తాత్కాలిక నిర్మాణాలు ఏర్పాటు చేసుకోవడంపై టీటీడీలో అంతర్మథనం కొనసాగుతోంది. ఏడాదికి ఒకసారి జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా ఒంటిమిట్టలో రూ.4.47 కోట్లతో తాత్కాలిక నిర్మాణాలు ఏర్పాటుచేశారు. అయితే, శాశ్వత నిర్మాణాల గురించి టీటీడీ పట్టించుకోకపోవడంవల్లే భక్తులు బలి కావాల్సి వచ్చిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా, రాములోరి కల్యాణోత్సవం సందర్భంగా వర్ష బీభత్సంవల్ల గాయపడిన వారు కోలుకుంటున్నారు. ఈ దుర్ఘటనలో దాదాపు 80 మంది గాయపడగా, వీరిలో 32మంది కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. తొక్కిసలాటలో కోడల్ని కోల్పోయాం ‘‘నా పేరు సాంబశివరావు. మాది కృష్ణా జిల్లా పెడన మండలంలోని తెలుగుపాలెం. నాతోపాటు నా భార్య అరుణకుమారి, కోడలు ఎం.మీనాతోపాటు ఐదుగురం వచ్చాం. కల్యాణోత్సవంలో స్వామివారిని చూస్తూ ఆనంద సాగరంలో మునిగిపోయాం. హఠాత్తుగా ఈదరుగాలులు, వర్షం ధాటికి స్తంభాలు నేలకూలాయి. కరెంటు పోయింది. బయట ఉన్న జనమంతా ఒక్కసారిగా లోపలికి తోసుకు రావడంతో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో నా కోడలు మీనా మృతి చెందింది. స్వామివారి కల్యాణోత్సవాన్ని వీక్షించి తలంబ్రాలు తీసుకుని ఇంటికి తిరిగి వెళ్లాల్సిన మేము మృతదేహాన్ని తీసుకుని వెళ్లాల్సి రావడాన్ని తట్టుకోలేకపోతున్నా’’. -
వైఎస్సార్ జిల్లాలో ఇంజనీరింగ్ విద్యార్థి దారుణ హత్య
-
విద్యుదాఘాతంతో యువతి మృతి
సాక్షి, రాజంపేట: విద్యుదాఘాతంతో ఓ యువతి మృతిచెందింది. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా రాజంపేట మండలం కొండాపూర్ పంచాయతీ పరిధిలోని శేర్‌శంకర్ తండాలో శనివారం జరిగింది. దీప్ల, ఆజల కుమార్తె రేణుక(19) స్నానం చేసేందుకు బాత్రూంలోకి వెళ్లింది. ఇంటి పైకప్పునకు ఉన్న ఇనుప చువ్వకు పక్కనే ఉన్న విద్యుత్ మెయిన్ వైరు తగలడంతో ఇంటికి కరెంట్ ప్రసారం జరుగుతోంది. ఇది గమనించని రేణుక బాత్రూంలో ఉన్న ఇనుప చువ్వను పట్టుకోవడంతో ఆమె విద్యుదాఘాతానికి గురైంది. తల్లిదండ్రులు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించగా వారికి కూడా షాక్ కొట్టింది. దాంతో పక్కింటి వారు పరుగున వచ్చి కట్టెతో కొట్టి విడిపించారు. రేణుక పరిస్థితి విషమంగా ఉండడంతో అంబులెన్స్‌లో కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతిచెందింది. -
రాజంపేటలో బ్రౌన్‌షుగర్ అమ్మకాలు...
సాక్షి, రాజంపేట : వైఎస్సార్ జిల్లా రాజంపేట పట్టణం బ్రౌన్‌షుగర్ క్రయవిక్రయాలకు అడ్డాగా మారింది. నిషేధిత బ్రౌన్‌షుగర్ అమ్ముతున్నారన్న సమాచారంపై పట్టణానికి చెందిన కొంతమంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. శనివారం రాత్రి కొంతమంది యువకులను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారన్న వార్తలు గుప్పుమన్నాయి. వారి వద్ద నుంచి బ్రౌన్‌షుగర్ కూడా లభ్యమైనట్లు తెలిసింది. కాగా ముగ్గురిని ముందుగా అదుపులోకి తీసుకొని విచారించినట్లు, ఆపై మరికొంతమందిని కూడా పోలీసులు విచారణ చేసినట్లుగా సమాచారం. అయితే పోలీసులు అదుపులో ఉన్న యువకులు పట్టణానికి చెందిన వారు కావడంతో పోలీసుస్టేషన్ వద్ద సంబంధీకులు మకాం వేశారు. దీన్ని బట్టి చూస్తే రాజంపేట పట్టణంలో బ్రౌన్‌షుగర్ అమ్మకాలు జరుగుతున్నాయనే వాదన బలపడుతోంది. స్థానికంగా గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు ఎక్కువ కావటంతో ఇతర ప్రాంతాల నుంచి మాదక ద్రవ్యాలను ఇక్కడికి తెప్పించి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని చెబుతున్నారు. స్థానికంగా డ్రగ్స్ వ్యాపారం సాగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందటంతో నిఘాను పెంచారు. శనివారం రాత్రి అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కిలో బ్రౌన్ షుగర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. -
జడ్జి ఎదుటే ఎస్సై వీరంగం
సాక్షి, కడప: వైఎస్ఆర్ కడప జిల్లా రాజంపేట కోర్టులో జడ్డి ఎదుటే ఓ ఎస్సై వీరంగం సృష్టించాడు. ఎర్ర చందనం రవాణా కేసు ముద్దాయి పెద్ద రెడ్డయ్య గురువారం కోర్టులో స్వచ్చందంగా లొంగిపోయాడు. దీంతో అక్కడే ఉన్న చిట్వేలి ఎస్సై నాయక్ అతనిపై చేయిచేసుకున్నాడు. ఆగ్రహించిన న్యాయమూర్తి ఆ ఎస్సైను సాయంత్రం లోపల కోర్టులో హాజరు పరచాలని డీఎస్పీని ఆదేశించారు. -
కలలు..కల్లలు
రైలుమార్గం ప్రారంభం: 2010 బడ్జెట్లో ఆమోదం: 2008 – 09 అంచనా వ్యయం: రూ.1000 కోట్లు రైలుమార్గం: 258 కిలోమీటర్లు నిర్మాణం : నాలుగుదశల్లో ... భూసేకరణ: రూ.199.92 కోట్లు బడ్జెట్: రూ.240 కోట్లు రాజంపేట: కడప–బెంగళూరు మధ్య రైలు మార్గానికి సరిగ్గా ఏడేళ్ల కిందట శంకుస్ధాపన రాయిపడింది. అప్పటి నుంచి భూసేకరణ..నిధుల లేమి తదితర అం శాలు వెంటాడుతున్నాయి. దీనికి మహానేత దివంగత వైఎస్ రాజఖరరెడ్డి 2008లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి 50 శాతం వాటా కేటాయించేలా చేశారు.ఆయన మరణాంతరం పనులునత్తనడకన సాగుతున్నాయి. ఈ రైలుమార్గం నిర్మాణానికి 2010 సెప్టెంబరు 1న అప్పటి రైల్వేశాఖ మంత్రి మునియప్ప శ్రీకారం చుట్టారు.దీనికి 2008–2009 బడ్జెట్లో ఆమోదం లభించింది. రూ.1000 కోట్ల అంచనావ్యయంతో పనులు ప్రారంభమయ్యాయి. 258 కిలో మీటర మేర నిర్మాణానికి 1,531 ఎకరాల భూమి సేకరించారు. ఐదేళ్లలో పూర్తిచేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. అయితే నేటికీ లక్ష్యం నెరవేరలేదు. రూ.100కోట్ల వ్యయంతో ఆర్‌ఐడీసీ రైల్నెట్వర్క్ విస్తరణలో భాగంగా రైల్వేశాఖ, రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంలో ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు ప్రణాళికలు, సమగ్ర నివేదికలు రూపొందిం చాయి. అందులో భాగంగా రూ.వందకోట్లతో రైల్ ఇన్ఫ్రాస్టక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటైంది.ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. ఆర్‌ఐడీసీలోకి కడప–బెంగళూరు రైలుమార్గాన్ని చేర్చారు. మొదటిదశలోనే..... కడప–బెంగళూరు రైలుమార్గాన్ని నాలు గుదశల్లో నిర్మాణం చేపట్టేలా నిర్ణయించారు. మొదటిదశలో రూ.153 కోట్లు కేటాయింపులు జరిగాయి. భూసే కరణకు సంబంధించి రూ.89కోట్లలో రూ.20కోట్లు వ్యయం చేశారు. ఈ దశలో 21.8కిలోమీటర్ల వరకు చేపట్టారు. 311.84 ఎకరాల భూమిని సేకరించారు. 54 చిన్నవి, ఆరుపెద్ద బ్రిడ్జిల నిర్మాణం చేపట్టారు. 199.2కోట్లు భూసేకరణ కోసం వ్యయంచేశారు. ముందుకుసాగని మిగిలిన దశలు.. రెండవదశలో పెండ్లిమర్రి–రాయచోటి, రాయచోటి టు ఊయ్యలపాడు (చిత్తూరు),మూడోదశలో మదనపల్లెరోడ్డు టు మదగట్ట (ఆంధ్రప్రదేశ్ సరిహద్దు) మదగట్ట టు ముల్బాగల్ (కర్ణాటక సరిహద్దు) నాలుగదశలో ముల్బాగల్ టు కోలార్ వరకు నిర్మా ణం చేపట్టేలా కడప–బెంగళూరు రైల్వేలైన్‌కు రూపకల్పన చేశారు. అయితే ఇది పూర్తి కావడానికి ఇంకెన్నాళ్లుపడుతుందోనని జిల్లావాసులు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. -
రాజంపేటలో ఇంట్లో పేలిన సిలిండర్
-
ప్రేమ కోసం వచ్చిన ప్రియుడు.. కానీ
– రైలు కింద పడి మృతి –పది రోజుల కిందటే గల్ఫ్ నుంచి వచ్చిన ప్రియుడు రాజంపేట: ఒకరు పెళ్లి కాని యువకుడు. మరొకరు పెళ్లై ముగ్గురు సంతానం ఉన్న వివాహిత. వారిద్దరూ ఇష్టపడ్డారు. ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఎక్కడెక్కడో తిరిగారు. చివరికి ఆదివారం రాజంపేట రైల్వేస్టేషన్ సమీపంలోని పట్టాలపై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు విడిచారు. మృతదేహాల వద్ద ఆధారాలను బట్టి రైల్వేపోలీసులు.. వారి వివరాలను సేకరించి, సంబంధీకులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి రేణిగుంట జీఆర్పీ సీఐ అశోక్‌కుమార్, మన్నూరు ఎస్ఐ మహేశ్‌నాయుడు, రైల్వే పోలీసులు చేరుకొని పరిశీలించారు. పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. ఖాజీపేట మండలంలోని సుంకేసులు గ్రామానికి చెందిన రాజోలి నాగార్జునరెడ్డి (26), కొమ్మలూరు గ్రామానికి చెందిన పుత్తా లక్ష్మీదేవి (26) కలిసి ఇళ్లు విడిచి వెళ్లారు. తన భార్య కనిపించడం లేదని ఖాజీపేట పోలీస్‌స్టేషన్‌లో మృతురాలి భర్త కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆమెకు ముగుర్గు సంతానం ఉన్నారు. పది రోజుల కిందట ప్రియుడు గల్ఫ్ నుంచి స్వదేశానికి రావడం జరిగింది. వీరిద్దరూ ఇంటి నుంచి బయట పడి తిరుపతి తదితర ప్రాంతాల్లో తిరిగారు. చివరికి రాజంపేట రైల్వేస్టేషన్ సమీపంలో ఆత్మహత్య చేసుకున్నారు. వీరి మృతదేహాలు ఛిద్రమయ్యాయి. గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి. పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం తర్వాత మృతుడి దేహాన్ని సంబంధీకులకు అప్పగించారు. కాని మృతురాలి దేహాన్ని తీసుకెళ్లడానికి వారి కుటుంబ సభ్యులు ఇష్టపడలేదని తెలిసింది. ఈ సంఘటనపై రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రాజంపేటలో మెడికో విద్యార్ధి ఆత్మహత్య
-
పెట్రోలు దొంగల అరెస్ట్
రాజంపేట రూరల్: గూడ్స్ వ్యాగిన్లు, ట్యాంకర్ల నుంచి పెట్రోలు, డీజిల్‌ను దొంగలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ రాజేంద్ర తెలిపారు. పెట్రోలు, డీజిల్‌ను దొంగలించే కనకయ్య, ఓబులమ్మను డీఎస్పీ తన కార్యాలయంలో విలేకరుల ఎదుట సోమవారం హాజరు పరిచారు. డీఎస్పీ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కడపలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రాంతానికి చెందిన కనకయ్యశెట్టి, అంగడివీధికి చెందిన పెద్దఓబులమ్మ గతంలో కడప రైల్వేస్టేషన్ దగ్గర ఆగే గూడ్స్ వ్యాగిన్ల నుంచి పెట్రోలు, డీజిల్‌ను దొంగలించి లారీలు, ఆటోలకు అమ్ముకుంటుండే వారు. ఇటీవల కాలంలో కడప రైల్వేస్టేషన్ దగ్గర నుంచి ఐఓసీ, హెచ్‌పీసీఎల్ కంపెనీలను ఎత్తివేసి భాకరాపేట వద్ద హెచ్‌పీసీఎల్ కంపెనీని స్థాపించి, అక్కడి నుంచే పెట్రోలు, డీజిల్‌ను ట్యాంకర్ల ద్వారా పెట్రోలు బంకులకు సరఫరా చేస్తున్నారు. పెట్రోలు, డీజిల్‌ను దొంగలించడానికి అలవాటు పడ్డ కనకయ్యశెట్టి, పెద్దఓబులమ్మ ట్యాంకర్ డ్రైవర్లు, క్లీనర్లకు డబ్బును ఎరగా చూపి.. హెచ్‌పీసీఎల్ కంపెనీ నుంచి బయటకు వచ్చిన ట్యాంకర్ల నుంచి అక్రమంగా తీసుకునే వారు. లారీలకు, ఆటోలకు పెట్రోల్ బంకుల్లో విక్రయించే ధర కంటే ఒకటి, రెండు రూపాయలకు తగ్గించి అమ్ముకునే వారు. కొందరు అందించిన సమాచారం మేరకు ఈ విషయంపై కూపీ లాగగా అక్రమ దందా వెల్లడైనట్లు డీఎస్పీ తెలిపారు. ఈ చోరీలో కనకయ్యశెట్టి రెండవ భార్య వెంకటసుబ్బమ్మ అలియాస్ బుజ్జమ్మ సహకారం కూడా ఉందని ఆయన పేర్కొన్నారు. అక్రమాలకు సహకరించిన గుంతకల్లుకు చెందిన ట్యాంకర్ల డ్రైవర్లు, క్లీనర్లు అయిన చంద్రశేఖర్, రఫిక్, ఆరీఫ్, ఎస్ఏ.ఖాదర్, ఖాదర్‌వలీ, మహమ్మద్, జిలానీ, అస్లాంబాషా, షఫి, అబ్దుల్‌రహిమాన్, వీరేష్, శివను అదుపులోకి తీసుకొని కోర్టుకు హాజరు పెట్టినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకురావడంలో ఒంటిమిట్ట సీఐ రవికుమార్, సిద్దవటం ఎస్ఐ అరుణ్‌రెడ్డి చాకచక్యంగా వ్యవహరించారని వివరించారు. -
రాజంపేటలో ముగిసిన ఎమ్మెల్సీ పోలింగ్
-
రాజంపేటలో ఎమ్మెల్సీ పోలింగ్ ప్రారంభం
-
12న రజకుల వివాహ పరిచయ వేదిక
కడప రూరల్ : ఈనెల 12వ తేదిన రాజంపేట పట్టణం రెడ్డివారివీధి శ్రీ చౌడేశ్వరిదేవి దేవస్థానంలో వివాహ పరిచయ వేదిక కమిటీ ఆధ్వర్యంలో రజక కులస్థుల ఉచిత వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేసినట్లు వేదిక నాయకులు యు.యానాదయ్య, చేలో రవి శనివారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవాలనే రజక సోదరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ వేదికకు హాజరయ్యే వారు వధూవరుల ఫుల్ఫోటో, పూర్తి సమాచారంతో హాజరు కావాలన్నారు. వివరాలకు 96427 10496 నెంబరులో సంప్రదించాలన్నారు. -
డ్యాన్సర్లతో ఏఎస్ఐ చిందులు..
-
పచ్చనేత ఇంటికి చేరిన జన్మభూమి సభ
రాజంపేట: రాజంపేట మున్సిపాలిటిలో జన్మభూమిసభల నిర్వహణ వివాదస్పదంగా మారుతోంది.గురువారం సుద్దగుంతలలో స్ధానిక టీడీపీ నేత ఇంటివద్ద జన్మభూమి సభను నిర్వహించారు. మున్సిపాలిటీకి చెందిన రెండవటీం నిర్వాహకులు మున్సిపాలిటీ టీపీఓ బాలాజి, టీపీఎస్ మధుసూదనరావురు నేతృత్వంలో కార్యక్రమం కొనసాగింది. మున్సిపాలిటి విడుదల చేసిన ప్రకటనలో 5వతేదీన ఎంపీపీ ఎలిమెంటరీ స్కూలులో సభను నిర్వహించాల్సి ఉంది. అయితే ఆ ప్రాంతానికి చెందిన ఓ టీడీపీ నేత ఇంటి వద్ద సభను నిర్వహించే విధంగా మున్సిపాలిటి అధికారులపై ఒత్తిడి తెచ్చారు. చేసేదేమిలేక ఆయన ఇంటి వద్ద జన్మభూమిసభను నిర్వహించారు. సభకు హాజరైన మహిళలు ఇదేమి విడ్డూరం అంటూ అసంతృప్తితో వెళ్లిపోయారు. దీనికి అధికారులు ఏ విధంగా అంగీకరించారో అర్థం కావడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సభకు ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, కమిషనరు రమణారెడ్డి, రాజంపేట ఏరియా ఆసుపత్రి కమిటి చైర్మన్ వడ్డెరమణ, జెబీ సభ్యులు గుల్జార్‌బాష, మల్లెల సుబ్బరాయుడు, డా.సుధాకర్, సంజీవరావు, అబుబకర్, చిదానంద్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
సుజనాచౌదరి సభలో మహిళల గగ్గోలు!
రాజంపేట/పుల్లంపేట: రాజంపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని పుల్లంపేట రెడ్డిపల్లె చెరువుకట్ట సమీపంలో శుక్రవారం వనం-మనం కార్యక్రమం నిర్వహించారు. దీనికి కేంద్రమంత్రి వై.సుజనాచౌదరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ముందువరుసలో ఉన్న మహిళలు ఒక్కసారిగా లేచి తమకు ప్రభుత్వపరంగా జరుగుతున్న నష్టాలు, అన్యాయాలపై నినాదాలతో నిరసన వ్యక్తంచేశారు. డ్వాక్రా రుణాలు మాఫీ కాలేదని , ఫించన్ రాలేదని, పని దినాలు కల్పించాలని, కరెంటు బిల్లులు కట్టలేకున్నామని మంత్రికి వినిపించేలా అరిచారు.అయితే వీరి గురించి పట్టించుకోకుండా సన్మాన ఆనందంలో మునిగిపోయారు. 50రోజుల పనిదినాలు కల్పిస్తాం: కలెక్టరు మహిళ కేకలు విని మంత్రి సుజనా వారి పరిస్థితి గురించి తెలుసుకోవాలని జిల్లా కలెక్టరు సత్యనారాయణను ఆదేశించారు. తమ అధికారి ద్వారా తెలుసుకున్న కలెక్టరు 50రోజులు పనిదినాలు కల్పిస్తామని చెప్పారు. అయినా మహిళలు సమాధానపడలేదు. కంటతడిపెట్టిన నిరుపేదమహిళ.. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని, పింఛను సౌకర్యం కల్పించాలని ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా ఫలితలేకుండాపోయిందని చిన్నఓరంపాడుకు చెందిన నిరుపేద మహిళ గంగమ్మ కంటతడిపెట్టింది. ఈమెను పలకరించే నాథుడు కనిపించలేదు. నియోజకవర్గంలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులను కూడా సభకు తీసుకొచ్చారు. మంత్రికి స్వాగతం పలికేందుకు గంటలతరబడి ఎండలో నిరీక్షించారు. కొంతమంది గ్రామీణ ప్రాంతానికి చెందిన మహిళలు మంత్రి సుజనా ప్రసంగిస్తున్న తరుణంలో సభ నుంచి వెళ్లిపోవడం కనిపించింది. ఉక్కుపరిశ్రమ ఏర్పాటుకు కృషి: సుజనా రాజంపేట: ప్రత్యేకప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి వై.సుజనాచౌదరి అభిప్రాపయడ్డారు. శుక్రవారం వైఎస్సార్ జిల్లా పుల్లంపేట మండలంలోని రెడ్డిపల్లె చెరువు కట్ట సమీపంలో వనం–మనం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప పవర్ఫుల్ జిల్లా అని కొనియాడారు.ఇక్కడ సహజవనరులు, ఖనిజాలు ఉన్నాయన్నారు. రైతులకు సాగునీరు అందించేందుకు సీఎం కృషిచేస్తున్నారన్నారు. పెద్దనోట్ల రద్దుతో ప్రజలు కష్టాలు పడుతున్నారు. కడపలో యోగివేమన విశ్వవిద్యాలయంలో సైన్స్ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపడతామన్నారు. జిల్లాలో ఉక్కుపరిశ్రమ స్థాపనకు కృషిచేస్తామన్నారు. సీఎం రమేష్, పౌరసరఫరాల అభివృద్ధిసంస్ధ చైర్మన్ లింగారెడ్డి, జిల్లా కలెక్టరు సత్యనారాయణ, శాసనమండలి నేత సతీష్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనువాసులరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పసుపులేటి బ్రహ్మయ్య, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి తదితరులు మాట్లాడారు. -
రాజంపేటలో ఘనంగా దసరా ఉత్సవాలు
-
రాజంపేటలో నకిలీ కోయదొరలు అరెస్ట్