
సాక్షి, రాజాంపేట : వైఎస్సార్ జిల్లా తెలుగుదేశం అధికార ప్రతినిధిగా ఉన్న బొల్లినేని రామ్మోహన్‌నాయుడు శనివారం టీడీపీని వీడిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి తీరుపై కినుక వహించిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. తర్వాత తన అనుచరులతో చర్చించిన ఆయన సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి, సీనియర్ నాయకుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి సమక్షంలో బొల్లినేని పార్టీలో చేరారు.
ఎంపీ మిథున్ రెడ్డి తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం తొలిసారి నియోజక వర్గంలో అడుగుపెట్టిన సందర్భంగా ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రాజంపేట మండలం మిట్టమీదపల్లి నుంచి భారీ బైక్ ర్యాలీ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment