సాక్షి, వైఎస్సార్ జిల్లా: రాజంపేట టీడీపీలో వర్గవిభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. స్థానిక రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్‌రెడ్డిని పిలువకుండానే మంత్రి ఆదినారాయణరెడ్డి టీడీపీ శ్రేణులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి బ్రహ్మయ్య, మాజీ ఎమ్మెల్సీ బత్యాల తదితరులు హాజరయ్యారు. అయితే, ఈ సమావేశానికి తమ నేతను పిలువకపోవడంపై హాజరైన ఎమ్మెల్యే మేడా వర్గీయులు ఆగ్రహం వ్యక్తంచేశారు. కావాలనే తమ నాయకుడిని పిలువలేదని, పార్టీ నుంచి పొమ్మనలేక ఆయనకు పొగబెడుతున్నారని వారు ఆగ్రహం వక్తం చేశారు. తనకు అనుకూలుడైన నేతకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇప్పించడానికే ఆదినారాయణరెడ్డి ఈ సమావేశాన్ని ఏర్పాటుచేశారని మండిపడుతూ.. ఈ సమావేశాన్ని మేడా వర్గీయులు బహిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment