సాక్షి, వైఎస్సార్ జిల్లా: బీజేపీ నేతల మధ్య వార్ మరింత ముదిరింది. తప్పుడు ఫిర్యాదు చేసిన వారిని చెప్పుతో కొడతానంటూ.. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌పై జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మండిపడ్డారు. జమ్మలమడుగులో ఆదినారాయణరెడ్డి అనుచరులు పేకాట క్లబ్బులు నడుపుతున్నారంటూ వారం క్రితం కలెక్టర్, ఎస్పీలకు సీఎం రమేష్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆది తీవ్రంగా స్పందించారు.
మావాళ్లు తప్పు చేస్తే చెప్పుతో కొడతా.. లేదంటే ఆరోపించిన వారిని చెప్పుతో కొడతానన్న ఆది.. ఇష్టం వచ్చినట్లు లేఖలు ఎవడైనా రాస్తాడా అంటూ వ్యాఖ్యానించారు. ఎక్కడో అనకాపల్లిలో ఉన్న సీఎం రమేష్‌కు ఇక్కడేం పని అంటూ ఆదినారాయణరెడ్డి ప్రశ్నించారు.
ఆయన లేఖ సినిమా కథలా ఉంది. మా నియోజకవర్గంలో ఉత్పత్తి చేసే ప్రతి దానిపై మాకు హక్కుంది. మీరెక్కడి నుంచో వచ్చి ఇక్కడ చేస్తానంటే కుదరదు’’ అంటూ ఆది మండిపడ్డారు. అదానీ హైడ్రో ఎనర్జీ ప్రాజెక్టు సబ్ కాంట్రాక్ట్ సీఎం రమేష్ పొందడంపై విమర్శలు గుప్పించారు. గతంలో ఆ కాంట్రాక్టు తమకే కావాలని అదానీ సైట్లోకి వెళ్లి ఆదినారాయణరెడ్డి వర్గీయులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: ఎల్లో మీడియా కొంపముంచిన చంద్రబాబు!
Comments
Please login to add a commentAdd a comment