Dissent
-
హిమాచల్ కాంగ్రెస్‌లో రగులుతున్న అసమ్మతి
సిమ్లా/చండీగఢ్: హిమాచల్ ప్రదేశ్‌లోని అధికార కాంగ్రెస్‌లో అసమ్మతి రోజురోజుకీ ముదురుతోంది. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు రాజిందర్ రాణా సారథ్యంలో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన విషయం తెలిసిందే. అనంతరం అసెంబ్లీలో జరిగిన ఓటింగ్‌కు గైర్హాజరైన వీరిని కాంగ్రెస్ పార్టీ అనర్హులుగా ప్రకటించింది. అదే ఎమ్మెల్యే రాజిందర్ రాణా శనివారం మరో బాంబు పేల్చారు. సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కూ వైఖరితో విసుగుచెందిన మరో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నట్లు చెప్పుకున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రులతోపాటు మరో తొమ్మిది మంది తనతో టచ్‌లో ఉన్నట్లు ఓ ఇంటర్వ్యూలో రాణా చెప్పారు. సీఎం సుక్కూను అబద్ధాల కోరుగా ఆయన అభివర్ణించారు. ఇలా ఉండగా, హిమాచ్ కేబినెట్ సమావేశంలో విధానపర అంశాలపై వాడీవేడి చర్చ అనంతరం మంత్రులు జగత్ నేగి, రోహిత్ ఠాకూర్ అర్ధంతరంగా బయటకు వెళ్లిపోయినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. -
జవహర్ తీరు.. కార్యకర్తల్లో బేజారు
కొవ్వూరు: తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కేఎస్ జవహర్‌కు మరోసారి అసమ్మతి సెగ తగిలింది. ఫ్లెక్సీల ఏర్పాటుపై దొమ్మేరు గ్రామంలో ఆ పార్టీ నాయకులు శుక్రవారం సమావేశమై ఆయనపై బహిరంగంగా విమర్శనా్రస్తాలు సంధించగా.. ఇప్పుడు అధిష్టానం పెద్దలకు శనివారం రాత పూర్వకంగా ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నవేళ టికెట్ ఖరారయ్యే అభ్యర్థుల జాబితాలో ఈయన పేరు పరిశీలనకు వచ్చిన తరుణంలో ఈ పరిస్థితి తలెత్తడం విశేషం. కొవ్వూరు పట్టణంలోని ఓ కల్యాణ మండపంలో శనివారం సాయంత్రం నిర్వహించిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో నియోజకవర్గ ద్విసభ్య కమిటీకి స్థానిక నాయకులు రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జవహర్ స్థానిక నాయకత్వాన్ని సంప్రదించకుండా నియోజకవర్గంలో కొందరికి పదవులు కట్టబెట్టారని, అధిష్టానం ఆదేశాలను కూడా లెక్క చేయకుండా కార్యక్రమాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జోన్–2 ఇన్చార్జి మందలపు రవి, నియోజకవర్గ పరిశీలకుడు గొర్రెల శ్రీధర్‌కు ఫిర్యాదు చేయగా, నియోజకవర్గ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దంటూ ఆదేశించారని, అయినప్పటికీ ఆయన నాయకుల మధ్య కలహాలు పెడుతున్నారని ఆరోపించారు. తన పుట్టిన రోజు సందర్భంగా స్థానిక నాయకుల ప్రమేయం లేకుండా నియోజకవర్గంలో జవహర్ శుక్రవారం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని చెప్పారు. ఇకపై కొవ్వూరు నియోజకవర్గంలో ఆయన ప్రమేయం లేకుండా చూడాలని కోరారు. ఈ సందర్భంగా జవహర్ అనుకూల, ప్రతికూల నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ పరిణామాలపై ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. -
కాంగ్రెస్‌లో ‘అయోధ్య’ చిచ్చు..!
న్యూఢిల్లీ: అయోధ్య రామమందిర అంశం పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చిచ్చు రేపుతున్నట్లు కనిపిస్తోంది. ఈ నెల 22న జరిగే రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై సొంత పార్టీ నేతల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా గుజరాత్‌కు చెందిన సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీజే చావ్డా రామ మందిరంపై పార్టీ వైఖరికి నిరసనగా తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన స్పీకర్‌కు తన రాజీనామాను కూడా సమర్పించడం సంచలనం రేపింది. చావ్డా రాజీనామాతో గుజరాత్ అసెంబ్లీలో కాంగ్రెస్ బలం కేవలం 15కు పడిపోయింది. మూడుసార్లు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన చావ్డా ఎన్నికల్లో బీజేపీ హవాను సైతం తట్టుకొని నిలబడ్డారు. రాజీనామా సందర్భంగా చావ్డా మాట్లాడుతూ ‘నేనెప్పుడూ అధికార పార్టీ విధానాల్లో లోపాలను ఎత్తి చూపడాన్ని బలంగా నమ్ముతాను. ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ ప్రధాని నరేంద్రమోదీని అనవసరంగా టార్గెట్ చేస్తోంది. బీజేపీ ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజారంజకంగా ఉన్నాయి’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలతో చావ్డా త్వరలో బీజేపీలో చేరతారనే పుకార్లు జోరందుకున్నాయి. ఇక గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంబరీశ్ దేర్ రామందిరంపై పార్టీ నిర్ణయాన్ని ఇటీవల ఎక్స్(ట్విటర్)లో తప్పుపట్టారు. ఈయనతో పాటు పోర్బందర్ ఎమ్మెల్యే గుజరాత్ పీసీసీ మాజీ చీఫ్ అర్జున్ మోత్వాడా కూడా రామమందిరంపై పార్టీ వైఖరిని బహిరంగంగానే విమర్శించారు. రాముని ప్రతిష్టాపన వేడుకకు దూరంగా ఉండాలనే నిర్ణయాన్ని పార్టీ తీసుకోకుండా ఉండాల్సిందని అన్నారు. मर्यादा पुरूषोत्तम भगवान श्री राम हमारे आराध्य देव हैं इसलिए यह स्वाभाविक है कि भारत भर में अनगिनत लोगों की आस्था इस नवनिर्मित मंदिर से वर्षों से जुड़ी हुई है।@INCIndia के कुछ लोगों को उस खास तरह के बयान से दूरी बनाए रखनी चाहिए और जनभावना का दिल से सम्मान करना चाहिए। (1/2) pic.twitter.com/elzFFyRHoe — Ambarish Der (@Ambarish_Der) January 10, 2024 भगवान श्री राम आराध्य देव हैं। यह देशवासियों की आस्था और विश्वास का विषय है। @INCIndia को ऐसे राजनीतिक निर्णय लेने से दूर रहना चाहिए था। pic.twitter.com/yzDTFe9wDc — Arjun Modhwadia (@arjunmodhwadia) January 10, 2024 కాగా, ఉత్తర్‌ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నేత ప్రమోద్ కృష్ణన్ అయితే ఒక అడుగు ముందుకు వేసి అయోధ్య రామ మందిర వేడుకపై కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం పార్టీకి ఆత్మహత్యా సదృశమని సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా అయోధ్య రాముని గుడి ప్రారంభోత్సవం లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్‌లో పడేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదీచదవండి.. అయోధ్యకు యూపీ ప్రభుత్వ విరాళమెంత -
Rajasthan Elections 2023: స్టయిల్ మారింది!
మూడేళ్ల నాటి విఫల తిరుగుబాటు. సీఎం కుర్చీలో ఉన్న ప్రత్యర్థి నుంచి చీటికీ మాటికీ సూటిపోటి మాటలు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించినా ఈసారి మాత్రం ప్రచారంతో సహా ఎందులోనూ పెద్దగా ప్రాధాన్యం దక్కని వైనం. అన్నింటినీ ఓపికగా సహిస్తూ సాగుతున్నారు రాజస్తాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్. అసమ్మతి నేతగా ముద్ర తప్ప తిరుగుబాటుతో సాధించిందేమీ లేకపోవడంతో ఈ యువ నేత తెలివిగా రూటు మార్చారు. అసమ్మతి రాగాలకు, సొంత ప్రభుత్వంపై విమర్శలకు ఫుల్స్టాప్ పెట్టారు. అవకాశం చిక్కినప్పుడల్లా అధిష్టానానికి విధేయతను చాటుకుంటూ వస్తున్నారు. విధేయత, వెయిటింగ్ గేమ్ అంతిమంగా తనను అందలమెక్కిస్తాయని ఆశిస్తున్నారు... రాజస్తాన్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికల వేళ పీసీసీ చీఫ్‌గా పార్టీ బరువు బాధ్యతలన్నింటినీ తన భుజాలపై మోశారు పైలట్. అన్నీ తానై వ్యవహరించి పార్టీని విజయ తీరాలకు చేర్చారు. ఆయనే సీఎం అని అంతా భావించారు. కానీ అధిష్టానం మాత్రం అనూహ్యంగా సీనియర్ అశోక్ గహ్లోత్‌కే పట్టం కట్టింది. కొంతకాలం తర్వాత చాన్సిస్తామన్న అధిష్టానం మాట తప్పడంతో పైలట్ ఆగ్రహించి 21 మంది ఎమ్మెల్యేలతో పైలట్ తిరుగుబాటుకు దిగడం, అగ్ర నేత రాహుల్‌గాంధీ జోక్యంతో వెనక్కు తగ్గడం చకచకా జరిగిపోయాయి. డిప్యూటీ సీఎంగిరీ, పీసీసీ చీఫ్ పదవి రెండూ ఊడటం మినహా ఆయన సాధించిందంటూ ఏమీ లేకపోయింది. అయినా వెనక్కు తగ్గలేదాయన. గహ్లోత్ ప్రభుత్వంపై బాహాటంగానే విమర్శలు ఎక్కుపెట్టడం, ధిక్కార స్వరం విని్పంచడం వంటివి చేస్తూనే వచ్చారు. ఈ ఏడాది మొదట్లో ఏకంగా సొంత ప్రభుత్వ పనితీరునే విమర్శిస్తూ ధర్నాకు దిగడమే గాక పాదయాత్ర తలపెట్టి సంచలనం సృష్టించారు. తీరు మారింది... కానీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పైలట్ తీరే పూర్తిగా మారిపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే సహనమూర్తిగా మారారు. ప్రచారంలో తనకు ముఖ్య బాధ్యతలేవీ అప్పగించకపోయినా పెద్దగా పట్టించుకోలేదు. పైగా గహ్లోత్ సర్కారుపై బీజేపీ విమర్శలను పైలట్ దీటుగా తిప్పికొడుతూ కాంగ్రెస్ నేతలనే ఆశ్చర్యపరుస్తున్నారు! అంతేగాక ఇటీవల గహ్లోత్ కుమారుడికి ఈడీ సమన్లను, పీసీసీ చీఫ్ గోవింద్‌సింగ్ నివాసంపై ఈడీ దాడులను కూడా పైలట్ తీవ్రంగా ఖండించారు. గహ్లోత్‌పై విమర్శలు, ఆరోపణలకు పూర్తిగా ఫుల్స్టాపే పెట్టడమే గాక ఆయనతో కలిసి పని చేసేందుకు సిద్ధమని సంకేతాలిచ్చారు. వాటిని గహ్లోత్ పట్టించుకోకపోయినా, చాన్స్ దొరికినప్పుడల్లా తనకు చురకలు వేస్తున్నా, పార్టీ పట్ల తన చిత్తశుద్ధిని పదేపదే ప్రశి్నస్తున్నా వ్యూహాత్మక మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. ఎన్నికల ప్రచారమంతా గహ్లోత్ వన్ మ్యాన్ షోగానే సాగుతున్నా ఇదేమని ప్రశ్నించడం లేదు. పార్టీ గెలిస్తే సీఎం పదవి డిమాండ్ చేస్తారా అని ప్రశ్నించినా అది అధిష్టానం తీసుకోవాల్సిన నిర్ణయమని ఆచితూచి బదులిస్తున్నారు. అదే సమయంలో, వ్యక్తిగత ప్రతిష్ట కోసం సీఎం కావాలన్న దుగ్ధ తనకు లేదంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్నారు. తద్వారా ఇటు గహ్లోత్‌కు, అటు అధిష్టానానికి ఇవ్వాల్సిన సంకేతాలు స్పష్టంగానే ఇస్తున్నారన్నది పరిశీలకుల అభిప్రాయం. ఫలిస్తున్న వ్యూహం! పైలట్ విధేయత వ్యూహం బాగానే ఫలిస్తోందంటున్నారు. గాంధీ త్రయం సోనియా, రాహుల్, ప్రియాంక కొద్ది రోజులుగా ఆయన అభిప్రాయానికి బాగా విలువ ఇస్తున్నారని పీసీసీ వర్గాలు కూడా అంగీకరిస్తున్నాయి. పైలట్ విధేయత, గహ్లోత్ గతేడాది చూపిన అవిధేయత రెండింటినీ అధిష్టానం బేరీజు వేసుకుంటోందని కూడా ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. సీఎంగిరీ వదులుకోవాల్సి వస్తుందనే కారణంతో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయాలన్న సోనియా ఆదేశాలను గహ్లోత్ బేఖాతరు చేయడం తెలిసిందే. ఆయన కోసం మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గత సెపె్టంబర్లో ఏకంగా తిరుగుబాటుకు సిద్ధపడటం అధిష్టానానికి తలవంపులుగా మారింది. ఈ నేపథ్యంలో ఐదేళ్లకోసారి అధికార పార్టీని మార్చేసే రాజస్థాన్‌లో ఈసారి కాంగ్రెస్ ఓడితే రాష్ట్ర పార్టీ పైలట్ చేతుల్లోకి రావచ్చు. నెగ్గితే మాత్రం సీఎం పీఠం కోసం గహ్లోత్, పైలట్ మధ్య పెనుగులాట తప్పకపోవచ్చు. అప్పుడు అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరం! – సాక్షి, నేషనల్ డెస్క్ -
కొలీజియం కాక.. కేంద్రం, న్యాయ వ్యవస్థ మధ్య ముదురుతున్న వివాదం
సుప్రీంకోర్టు కొలీజియం. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ నడుమ వివాదంగా మారిన అంశం. కొలీజియం వ్యవస్థను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకం, బదిలీల్లో తమ పాత్ర లేకపోవడం ఏమిటంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కొలీజియం వ్యవస్థే రాజ్యాంగ విరుద్ధమంటూ పలువురు కేంద్ర మంత్రులు బాహాటంగా గళం విప్పుతున్నారు. కొలీజియం సభ్యులేమో సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల నియామకానికి తాము సిపార్సులు మాత్రమే చేస్తామని, తుది నిర్ణయం కేంద్రానిదేనని అంటున్నారు. ఏమిటీ కొలీజియం...? సుప్రీంకోర్టు న్యాయమూర్తుతో పాటు దేశవ్యాప్తంగా హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తుల నియామకం, బదిలీలను సిఫార్సు చేయడానికి ఉద్దేశించినదే కొలీజియం వ్యవస్థ. సుప్రీంకోర్టు కొలీజియంలో ప్రధాన న్యాయమూర్తి, మరో నలుగురు అత్యంత సీనియర్ న్యాయమూర్తులు సభ్యులుగా ఉంటారు. న్యాయమూర్తుల నియామకం, బదిలీల విషయంలో కొలీజియంలో భిన్నాభిప్రాయాలు ఉంటే మెజార్టీ సభ్యులదే తుది నిర్ణయం. అయితే ప్రధాన న్యాయమూర్తిని తప్పనిసరిగా సంప్రదించి, ఆయన అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కొలీజియం తన సిఫార్సులను కేంద్రానికి పంపుతుంది. ఇక హైకోర్టు కొలీజియంలో ప్రధాన న్యాయమూర్తి, ఇద్దరు సీనియర్ మోస్ట్ న్యాయమూర్తులు సభ్యులు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సులు పంపుతుంది. ముఖ్యమంత్రి వాటిని కేంద్ర న్యాయ శాఖ మంత్రికి పంపిస్తారు. వాస్తవానికి రాజ్యాంగంలో కొలీజియం ప్రస్తావన లేదు. కొలీజియం చేసే సిఫార్సులపై కేంద్రం తన విచక్షణ మేరకు నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఒకే పేరును కొలీజియం రెండోసారి సిఫార్సు చేస్తే కేంద్రం ఆమోదించాల్సిందేనంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం గతంలో తీర్పు వెలువరించింది. రాజ్యాంగం ఏం చెబుతోంది? రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 ప్రకారం సుప్రీంకోర్టు జడ్జిలను రాష్ట్రపతి నియమించాలి. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను సంప్రదించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే సీజేఐ మినహా మిగతా నియామకాల్లో సీజేఐ అభిప్రాయం తెలుసుకోవాలి. ఆర్టికల్ 217 ప్రకారం హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో సీజేఐ, గవర్నర్, హైకోర్టు సీజేలను సంప్రదించాలి. ఏమిటీ వివాదం? 1950 నుంచి 1973 వరకూ కేంద్రం, సీజేఐ కలిసి చర్చించుకుని ఏకాభిప్రాయంతో న్యాయమూర్తులను నియమించే విధానముండేది. సుప్రీంకోర్టులో సీనియర్ మోస్ట్ న్యాయమూర్తిని సీజేఐగా నియమించడం ఆనవాయితీగా కొనసాగింది. 1973లో మాత్రం ముగ్గురు సీనియర్లను పక్కన పెట్టి జస్టిస్ ఎ.ఎన్.రేను సీజేఐగా అప్పటి ప్రభుత్వం నియమించింది. తర్వాత మరో సీజేఐ నియామకంలోనూ ఇలాగే జరగడం కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల మధ్య వివాదానికి దారితీసింది. న్యాయమూర్తుల నియామకంలో కార్యనిర్వాహక వ్యవస్థ కంటే న్యాయ వ్యవస్థకే ఎక్కువ అధికారాలుంటాయని ఫస్ట్ జడ్జెస్ కేసు (1981), సెకండ్ జడ్జెస్ కేసు (1993), థర్డ్ జడ్జెస్ కేసు (1998)ల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎలా ఏర్పాటైంది? పార్లమెంట్ చట్టంగానీ, రాజ్యాంగ విధివిధానాలు గానీ లేకుండానే మన దేశంలో 1993లో కొలీజియం వ్యవస్థ మొదలైంది. న్యాయమూర్తుల నియామకంలో ఆర్టికల్ 124(2)లో ఉన్న ‘సంప్రదింపుల అనంతరం’ అర్థాన్ని ‘సమ్మతించిన తర్వాత’గా మారుస్తూ తొమ్మిది మంది సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. తద్వారా న్యాయమూర్తుల నియామకం, బదిలీల అధికారం సీజేఐ నేతృత్వంలోని వ్యవస్థ అయిన కొలీజియానికి దక్కింది. ప్రత్యామ్నాయముందా? కొలీజియంకు ప్రత్యామ్నాయంగా నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్(ఎన్‌జేఏసీ)ని కేంద్రం తెరపైకి తెచ్చింది. ఇది స్వతంత్ర కమిషన్.దీనికి సీజేఐ చైర్‌పర్సన్‌గా ఉంటారు. మరో ఇద్దరు అత్యంత సీనియర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేంద్ర న్యాయ మంత్రి ఎక్స్–ఆఫీషియో సభ్యులుగా ఉంటారు. పౌర సమాజం నుంచి ఇద్దరు ప్రముఖులను సభ్యులుగా సీజేఐ, ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్ష నేతతో కూడిన కమిటీ నామినేట్ చేయాలి. ఈ ఇద్దరిలో కనీసం ఒకరు ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/మైనార్టీ లేదా మహిళ అయి ఉండాలి. రాజ్యాంగ (99వ సవరణ) చట్టం–2014, నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్స్‌మెంట్ కమిషన్ చట్టం (2014) ద్వారా ఎన్ఏజేసీని కేంద్రం ప్రతిపాదించింది. సంబంధిత బిల్లులు 2014లోనే పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందాయి. కానీ ఈ బిల్లుల రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్‌జేఏసీని కోర్టు కొట్టేసింది. అయితే న్యాయమూర్తుల ఎంపికకు కొలీజియం స్థానంలో కేంద్రం మరో వ్యవస్థను తీసుకొస్తే అభ్యంతరం లేదని ఇటీవలే స్పష్టం చేసింది. కొలీజియంలో ప్రభుత్వ నామినీలు సీజేఐకి కేంద్ర న్యాయ మంత్రి రిజిజు లేఖ న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో చీఫ్ జస్టిస్‌లు, జడ్జిలను నియమించే కొలీజియం వ్యవస్థలో ప్రభుత్వం నామినేట్ చేసేవారికి సైతం చోటుండాలని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు పునరుద్ఘాటించారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు ఆయన తాజాగా లేఖ రాశారు. ‘‘జడ్జిల నియామకంలో పారదర్శకత, జవాబుదారీతనం గురించి ప్రజలకు తెలియజేయడం అవసరం. అందుకే న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియలో ప్రభుత్వ ప్రతినిధులకు చోటు కల్పించాలి’’ అని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. కొలీజియం వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధమని కిరణ్ రిజిజు ఇటీవల విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోవడానికి కొలీజియమే కారణమని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో సీజేఐకి ఆయన లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. న్యాయ వ్యవస్థకు విషగుళిక: జైరామ్ రమేశ్ న్యాయ వ్యవస్థను పూర్తిగా ఆక్రమించుకొనేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేశ్ సోమవారం ఆక్షేపించారు. న్యాయ వ్యవస్థను భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించారు. సీజేఐకి రిజిజు లేఖను తప్పు పట్టారు. మంత్రి సూచన న్యాయ వ్యవస్థకు విషగుళిక అన్నారు. అయితే కొలీజియంలో సంస్కరణలు అవసరమేనని జైరాం అభిప్రాయపడ్డారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నా చేతుల్లో ఏం లేదు.. అశోక్ గహ్లోత్ కీలక వ్యాఖ్యలు!
జైపూర్: 90 మందికిపైగా ఎమ్మెల్యేల రాజీనామాతో రాజస్థాన్ కాంగ్రెస్‌లో సంక్షోభం తలెత్తింది. ఈ నేపథ్యంలో సీఎం అశోక్ గహ్లోత్ తన చేతుల్లో ఏమీలేదని, ఎమ్మెల్యేలంతా ఆగ్రహంతో ఉన్నారని అధిష్ఠానానికి చెప్పినట్లు సమాచారం. రాజస్థాన్ పరిణామాలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేకే వేణుగోపాల్‌తో గహ్లోత్ ఫోన్లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కేకే వేణుగోపాల్ మాత్రం దీన్ని ఖండించారు. అసలు గహ్లోత్‌తో తాను ఫోన్లో మాట్లాడలేదేని చెప్పారు. గహ్లోత్ తనుకు గానీ, తాను గహ్లోత్‌కు గానీ ఫోన్ చేయలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో తలెత్తిన సమస్యను అధిష్ఠానం వీలైనంత త్వరగా పరిష్కరిస్తుందని స్పష్టం చేశారు. రాజస్థాన్ కాంగ్రెస్‌లో ఆదివారం ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న అశోక్ గహ్లోత్.. సీఎంగా తప్పుకోవడానికి వీల్లేదని ఆయన వర్గానికి చెందిన 92 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. ఒకవేళ గహ్లోత్ రాజీనామా చేస్తే ఆయన స్థానంలో తమ వర్గానికి చెందిన నేతనే సీఎం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సచిన్ పైలట్‌ను మాత్రం సీఎం చేయవద్దని తేల్చిచెప్పారు. 2020లో పార్టీపై తిరుగుబావుటా ఎగురవేసి ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించిన ఆయనను సీఎం ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఈ విషయంపై పార్టీ అధిష్ఠానంతోనే చర్చిస్తామన్నారు. ఆదివారం సీఎల్పీ సమావేశానికి ముందే ఈ పరిణామం జరగడం కాంగ్రెస్ అధిష్ఠానాన్ని షాక్‌కు గురిచేసింది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న అశోక్ గహ్లోత్.. మొదట రాజస్థాన్ సీఎంగా కూడా కొనసాగుతానని చెప్పారు. అయితే రాహుల్ గాంధీ సహా పార్టీ సీనియర్ నేతలు ఒకరికి ఒకే పదవి అని ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను గుర్తుచేశారు. దీంతో అధ్యక్ష ఎన్నికకు నామినేషన్ వేయడానికి ముందే ఆయన సీఎం పదవికి రాజీనామా చేస్తారని, కొత్త సీఎంగా సచిన్ పైలట్ బాధ్యతలు చేపడతాని ప్రచారం జరిగింది. గహ్లోత్ వర్గం దీన్ని వ్యతిరేకించడంతో సంక్షోభ పరిస్థితి తలెత్తింది. చదవండి: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. 92 మంది ఎమ్మెల్యేల రాజీనామా -
ప్రగతిభవన్‌కు వికారాబాద్ పంచాయితీ!
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్లో రోజుకో జిల్లాకు సంబంధించిన అసమ్మతి రాజకీయం ప్రగతిభవన్‌కు చేరుకుంటోంది. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి టికెట్ ఇవ్వొద్దంటూ ఆ నియోజకవర్గ నేతలు బుధవారం ప్రగతిభవన్ మెట్లెక్కారు. తాజాగా వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్ ముఖ్య నేతలు తమ మధ్య విభేదాలు ఉన్నాయని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఈ నెల 16న వికారాబాద్ జిల్లా కొత్త కలెక్టరేట్, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయ భవనాలను ప్రారంభించి.. కొత్తగా మంజూరైన మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేయనున్నారు. తర్వా త బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో గురువారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, టీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, కాలె యాదయ్య (చేవెళ్ల), మహేశ్వర్‌రెడ్డి (పరిగి), రోహిత్‌రెడ్డి (తాండూరు), పట్నం నరేందర్‌రెడ్డి (కొడంగల్) భేటీ అయ్యారు. అయితే ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన భార్య, వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ సునీత ఈ సమావేశంలో పాల్గొనలేదు. సీఎంతో భేటీకి సంబంధించి పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన భార్య సునీతకు సమాచారం లేనందునే హాజరుకాలేదని సమాచారం. సబితకు సభ బాధ్యతలు వికారాబాద్ సభకు జన సమీకరణ, పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవానికి హాజరయ్యే కార్యకర్తలకు భోజన ఏర్పాట్లు తదితరాల అంశాలపై కేసీఆర్ పలు సూచనలు చేశారు. సీఎం పర్యటన ఏర్పాట్ల సమన్వయ బాధ్యతలను మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అప్పగించారు. తర్వాత సీఎంతో వికారాబాద్ జిల్లా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిసి భోజనం చేశారు. కేటీఆర్‌తో మహేందర్‌రెడ్డి భేటీ కేసీఆర్తోభేటీకి హాజరుకాని పట్నం మహేం దర్‌రెడ్డి.. గురువారం మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం భేటీకి వెళ్లకపోవడానికి కారణాలను చెప్పినట్టు తెలిసింది. వికారాబాద్, తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ల రాజీనామా చుట్టూ రాజకీయం జరుగుతోందని, కొత్త చైర్మన్ల ఎన్నిక కోసం ఆ రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేల ప్రోద్బలంతో తెరవెనుక మంత్రాంగం సాగుతోందని మహేందర్‌రెడ్డి వివరించినట్టు సమాచారం. మరికొన్ని మున్సి పాలిటీల్లోనూ ఈ పరిస్థితి ఉందని.. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో మున్సిపల్ చైర్పర్సన్ల రాజీనామా తలనొప్పులు తెచ్చిపెడుతుందని కేటీఆర్ చెప్పినట్లు తెలిసింది. చదవండి: కేంద్ర ఆర్థిక దిగ్బంధాన్ని ఎండగడదాం! -
టీఆర్ఎస్లో టికెట్ లొల్లి.. అసమ్మతి లేఖాస్త్రం.. చల్లార్చే యత్నం
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికను ఎదుర్కొనేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ సహా అన్ని రాజకీయ పార్టీలు సన్నాహాలు వేగవంతం చేస్తున్నాయి. అయితే అధికార పార్టీలో అసమ్మతి సెగ రాజుకుంటోంది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి టికెట్ ఇస్తే తాము ఆయనతో కలసి పనిచేసే పరిస్థితి లేదంటూ పార్టీకి చెందిన నియోజకవర్గ ముఖ్య నేతలు సుమారు పది మంది పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌కు ఇటీవల లేఖ రాశారు. తాజాగా బుధవారం మంత్రి జగదీశ్‌రెడ్డికి కూడా ఇదే విషయం తేల్చి చెప్పారు. పార్టీ పూర్తిగా దెబ్బతిందన్న నేతలు మునుగోడు ఉప ఎన్నికను సవాలుగా తీసుకుంటున్న టీఆర్ఎస్ అధిష్టానం మునుగోడు నేతల అసంతృప్తిని చల్లార్చేందుకు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా నియోజకవర్గానికి టీఆర్ఎస్ అసమ్మతి నేతలు బుధవారం హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితో భేటీ అయ్యారు. ప్రభాకర్‌రెడ్డి వైఖరితో నియోజకవర్గంలో టీఆర్ఎస్ పూర్తిగా దెబ్బతిందని, ఆయనకు మరోమారు పోటీకి అవకాశం ఇస్తే భారీ ఓట్ల తేడాతో ఓటమి ఖాయమని స్పష్టం చేశారు. ‘శ్మశానం చేసి రాజ్యమేలినట్లు’గా ఉంటుందని మంత్రికి చెప్పారు. అన్ని విషయాల్లోనూ కూసుకుంట్ల జోక్యం పెరిగిపోయిందని, కేడర్‌ను పట్టించుకోకుండా సొంత లావాదేవీల్లో మునిగి తేలుతున్నారని ఆరోపించినట్లు తెలిసింది. తొందరపడొద్దన్న మంత్రి అయితే ఉప ఎన్నిక ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని పార్టీ నేతలెవరూ తొందరపాటుగా వ్యవహరించవద్దని అసమ్మతి నేతలకు జగదీశ్‌రెడ్డి సూచించినట్లు సమాచారం. అన్ని కోణాల్లోనూ పరిశీలించిన తర్వాతే పార్టీ అభ్యర్థి విషయంలో నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. త్వరలో సీఎం కేసీఆర్‌తో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌తోనూ భేటీ జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఆయా భేటీల్లో పార్టీ అధిష్టానానికి తమ సమస్యలు వివరిస్తామని బుధవారం నాటి సమావేశానికి హాజరైన టీఆర్ఎస్ నేత ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని ఆఫీసర్స్ క్లబ్లో జరిగిన ఈ భేటీలో కర్నాటి విద్యాసాగర్, నారగోని రవికుమార్, నారాయణపురం, మునుగోడు, నాంపల్లి జడ్పీటీసీ సభ్యులు, చౌటుప్పల్ మాజీ జడ్పీటీసీ బుచ్చిరెడ్డి, చౌటుప్పల్ ఎంపీపీ, సింగిల్ విండో చైర్మన్, పార్టీ మండల కమిటీ మాజీ అధ్యక్షుడు, నారాయణపురం ఎంపీపీ, మునుగోడు, నాంపల్లి వైస్ ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు. మినిస్టర్స్ కార్వర్స్ టూ ప్రగతిభవన్ మంత్రుల నివాస సముదాయంలో సుదీర్ఘ భేటీ అనంతరం అసంతృప్త నేతలను వెంటబెట్టుకొని మంత్రి జగదీశ్ రెడ్డి ప్రగతిభవన్‌కు వెళ్లారు. అయితే అధికారిక కార్యక్రమాలతో కేసీఆర్ బిజీగా ఉండడంతో వారు ఆయనతో భేటీ అయ్యేందుకు అవకాశం దొరకలేదని తెలిసింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, పార్టీ జిల్లా ఇన్చార్జి తక్కలపల్లి రవీందర్ రావు అసమ్మతి నేతలతో సుమారు అరగంట పాటు భేటీ అయ్యారు. మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన పూర్తి సమాచారం సీఎం వద్ద ఉందని, స్థానిక పార్టీ నేతలు, కార్యకర్తల అభిప్రాయం తీసుకున్న తర్వాతే టీఆర్ఎస్ అభ్యర్థిని కేసీఆర్ ప్రకటిస్తారని వారు స్పష్టం చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన ప్రయోజనాల కోసమే ఈ ఉప ఎన్నిక తెచ్చారనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థిని కలసికట్టుగా గెలిపించుకోవాల్సిన బాధ్యత నియోజకవర్గ నేతలపైనే ఉంటుందని చెప్పారు. ఉప ఎన్నికకు సిద్ధం: జగదీశ్ మునుగోడు ఉప ఎన్నికకు టీఆర్ఎస్ సిద్ధంగా ఉందని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. ప్రజలు కూడా పార్టీ విషయంలో సానుకూలంగా ఉన్నారని చెప్పారు. ప్రగతిభవన్‌లో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఎవరిని అభ్యర్థిగా ప్రకటించినా పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి గెలిపించుకుంటామని చెప్పారు. తన పదవికి అర్ధాంతరంగా రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా మునుగోడును అభివృద్ధి చేయడంలో విఫలం అయ్యారని విమర్శించారు. తన స్వార్ధం కోసమే ఉప ఎన్నిక పరిస్థితి తెచ్చారన్నారు. మునుగోడులో గత నాలుగేళ్లలో కోల్పోయిన అభివృద్ధిని, రాబోయే ఎన్నికల్లో తెచ్చుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. నియోజకవర్గంలో పార్టీ నేతలు గ్రూపులుగా విడిపోయి సమావేశాలు నిర్వహిస్తున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని పేర్కొన్నారు. చదవండి: మునుగోడులో టీఆర్ఎస్కు ఊహించని షాక్! -
టీఎంసీ కార్యవర్గం రద్దు
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్‌లో నానాటికీ పెరిగిపోతున్న అసమ్మతిని, యువ–సీనియర్ విభేదాలను కట్టడి చేయడంపై పార్టీ చీఫ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దృష్టి సారించారు. అందులో భాగంగా పార్టీ కార్యవర్గాన్ని రద్దు చేశారు. దాని స్థానంలో 20 మందితో నూతన జాతీయ వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ శనివారం నిర్ణయం తీసుకున్నారు. వివాదానికి కేంద్ర బిందువుగా మారుతున్న మేనల్లుడు అభిషేక్ బెనర్జీతో పాటు పలువురు యువ, సీనియర్ నేతలకు స్థానం కల్పించారు. కొత్త కార్యవర్గాన్ని మమత త్వరలో ప్రకటిస్తారని సీనియర్ నాయకుడు పార్థ బెనర్జీ మీడియాకు తెలిపారు. భేటీలో అభిషేక్ కూడా పాల్గొన్నారు. తృణమూల్‌లో వృద్ధ, యువతరం నేతల మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. అభిషేక్ నాయకత్వంలో యువ నేతలు ‘ఒక వ్యక్తికి ఒకే పోస్టు’ నినాదాన్ని తెరపైకి తేవడం తెలిసిందే. జోడు పదవుల్లో ఉన్న పలువురు సీనియర్లు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. -
సయోధ్య సాధ్యమేనా..?
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న అసమ్మతికి చెక్ పెడుతూ కాంగ్రెస్ అధిష్టానం వ్యూహ రచన పూర్తి చేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు అనుసరించాల్సిన ప్రణాళికను హైకమాండ్ సిద్ధం చేసింది. అందులో భాగంగా పంజాబ్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ హరీష్ రావత్ కీలక ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ నాయకత్వంలోనే వచ్చే ఎన్నికల్లో పార్టీ పోరాడనున్నట్లు ఆయన గురువారం స్పష్టం చేశారు. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సంబంధించిన మరో కీలక నిర్ణయం తీసుకుంది. నవజోత్ సింగ్ సిద్ధూని పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా నియమించవచ్చని హరీష్ రావత్ సూచించారు. గతంలో సిద్ధూ, అమరీందర్ సింగ్ ఇద్దరూ ఒకరిపై ఒకరు బహిరంగంగానే మాటల యుద్ధం చేశారు. ఇద్దరి మధ్య నెలకొన్న అంతరాన్ని తగ్గించేందుకు పార్టీ హైకమాండ్ ఏర్పాటు చేసిన మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ప్యానెల్ పంజాబ్‌లో పర్యటించి ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలను సేకరించి నివేదికను హైకమాండ్‌కు సమర్పించింది. అనంతరం ఇరువురు నాయకులు పార్టీ పెద్దలతో వేరువేరుగా భేటీ అయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. 2022 అసెంబ్లీ ఎన్నికలలో కెప్టెన్ అమరీందర్ సింగ్ నాయకత్వంలోనే కాంగ్రెస్ పోరాడనుండగా, అదే సమయంలో నవజోత్ సింగ్ సిద్ధూకు కూడా పూర్తి గౌరవం ఇచ్చేలా ఒక వ్యూహాన్ని సిద్ధం చేశారు. పంజాబ్‌లో తిరిగి అధికారంలోకి రావడం ఎంత అవసరమో, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం భవిష్యత్ నాయకులను కాపాడటం కూడా అంతే ముఖ్యమని పార్టీ అధిష్టానం భావిస్తోంది. అందుకే నవజోత్‌సింగ్ సిద్ధూకి పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే యోచనలో ఉన్నట్లు తెలిసింది. పంజాబ్ కాంగ్రెస్‌లో నెలకొన్న గందరగోళానికి తెరదించేందుకు త్వరలో కీలక ప్రకటన జరగవచ్చని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పంజాబ్ కాంగ్రెస్‌కు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం ఫార్ములా సిద్ధం చేసిందని సమాచారం. ఒకవేళ నవజోత్‌సింగ్ సిద్ధూ పంజాబ్ పీసీసీ అధ్యక్షుడైతే, ఇద్దరు లేదా ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించే యోచనలో ఉంది. అదే సమయంలో ఇటీవల నవజోత్ సింగ్ సిద్దూ చేసిన ట్వీట్ పంజాబ్ రాజకీయాల్లో ప్రకంపనలను తీవ్రతరం చేసింది. ఈ నేపథ్యంలో అమరీందర్, సిద్ధూల మధ్య దూరాన్ని తగ్గించేందుకు సిద్ధూని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్‌గా చేయడంవల్ల పరిస్థితి ఇప్పుడు చల్లబడినప్పటికీ, రాబోయే రోజుల్లో గొడవ మరింత ముదిరే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల తర్వాత సిద్ధూ ముఖ్యమంత్రి కావాలని భావిస్తున్నందున అమరీందర్ విధేయులు ఎమ్మెల్యేలుగా గెలవాలని ఆయన కోరుకొనే పరిస్థితి ఉండదని తెలిపారు. ఎన్నికల సమయంలో టికెట్ల కేటాయింపులో తమ విధేయులకు ఎక్కువ టికెట్లు కోరుతూ ఎవరికి వారు పోటీపడే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. కానీ పంజాబ్‌లో సిద్ధూకి ఉన్న ప్రజాదరణ కారణంగా ఆయనను పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా నియమించాల్సిన పరిస్థితి కాంగ్రెస్ హైకమాండ్ ముందు నెలకొంది. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి రిస్క్ చేయదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ సైతం సిద్ధూపై దృష్టి సారించినందుకు వీలైనంత త్వరగా పరిస్థితిని చక్కదిద్దాలని హైకమాండ్ యోచిస్తోంది. -
త్రిపుర బీజేపీ సర్కార్‌లో అసమ్మతి
అగర్తలా: త్రిపుర రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంలో అసమ్మతి రగులుతోంది. సీఎం విప్లవ్‌కుమార్ దేవ్‌పై 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరేశారు. పార్టీ అధ్యక్షుడు నడ్డాను కలిసి తమ వాదన వినిపించేందుకు ఢిల్లీకి చేరుకున్నారు. అసమ్మతి ఎమ్మెల్యేల్లో రాష్ట్ర ఆరోగ్య శాఖ మాజీ మంత్రి సుదీప్‌రాయ్ బర్మన్ ఉన్నారు. రాష్ట్రంలో బీజేపీకి 36 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వారిలో 25 మంది మార్పును కోరుకుంటున్నారని, మంత్రివర్గాన్ని మార్చాలని వారు ఆశిస్తున్నారని అసమ్మతి ఎమ్మెల్యే ఒకరు చెప్పారు. సీఎం విప్లవ్‌కుమార్ దేవ్ అసమర్థ పాలన వల్ల త్రిపురలో బీజేపీ బలహీన పడుతోందని అన్నారు. నడ్డాతోపాటు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసేందుకు ప్రయత్నిస్తున్నామని మరో ఎమ్మెల్యే పేర్కొన్నారు. 60 అసెంబ్లీ స్థానాలున్న త్రిపురలో బీజేపీకి 36, దాని మిత్రపక్షం ఐపీఎఫ్‌టీకి 8, ప్రతిపక్ష సీపీఎంకు 16 మంది ఎమ్మెల్యేలున్నారు. -
ఫ్రకాశం జిల్లా అద్దంకి టీడీపీలో ముసలం
-
రాజంపేట టీడీపీలో వర్గవిభేదాలు
-
టీడీపీలో భగ్గుమన్న విభేదాలు..!
సాక్షి, వైఎస్సార్ జిల్లా: రాజంపేట టీడీపీలో వర్గవిభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. స్థానిక రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్‌రెడ్డిని పిలువకుండానే మంత్రి ఆదినారాయణరెడ్డి టీడీపీ శ్రేణులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి బ్రహ్మయ్య, మాజీ ఎమ్మెల్సీ బత్యాల తదితరులు హాజరయ్యారు. అయితే, ఈ సమావేశానికి తమ నేతను పిలువకపోవడంపై హాజరైన ఎమ్మెల్యే మేడా వర్గీయులు ఆగ్రహం వ్యక్తంచేశారు. కావాలనే తమ నాయకుడిని పిలువలేదని, పార్టీ నుంచి పొమ్మనలేక ఆయనకు పొగబెడుతున్నారని వారు ఆగ్రహం వక్తం చేశారు. తనకు అనుకూలుడైన నేతకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇప్పించడానికే ఆదినారాయణరెడ్డి ఈ సమావేశాన్ని ఏర్పాటుచేశారని మండిపడుతూ.. ఈ సమావేశాన్ని మేడా వర్గీయులు బహిష్కరించారు. -
ఉరిశిక్షపై జడ్జీల భిన్నాభిప్రాయాలు
న్యూఢిల్లీ: ఉరిశిక్షపై సుప్రీంకోర్టు ధర్మాసనంలోని న్యాయమూర్తులు బుధవారం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. నేరాలను నియంత్రించడంలో ఉరిశిక్ష విఫలమైందని ధర్మాసనంలోని ఓ న్యాయమూర్తి అభిప్రాయపడగా, మిగిలిన ఇద్దరు జడ్జీలు అత్యంత అరుదైన కేసుల్లో ఉరిశిక్ష వేయొచ్చని సుప్రీంకోర్టు గతంలోనే ఇచ్చిన తీర్పును సమర్థించారు. ముగ్గురిని హత్య చేసిన ఓ దోషికి ఛత్తీస్‌గఢ్ హైకోర్టు విధించిన మరణ శిక్షను యావజ్జీవ శిక్షగా మార్చడంలో మాత్రం జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ హేమంత్ గుప్తాల ధర్మాసనం ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఇచ్చిన తీర్పులో జస్టిస్ జోసెఫ్ తన అభిప్రాయం తెలుపుతూ ‘అత్యంత అరుదైన కేసుల్లోనే మరణ శిక్ష విధించాలని 1980లోనే సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కొన్ని కోర్టులు అనవసరంగా దోషులకు ఉరిశిక్ష వేస్తున్నాయి. శిక్షలకు సంబంధించి రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో ఉరిశిక్ష విఫలమైంది. ఉరి శిక్షను ఏ ఉద్దేశంతో ప్రవేశపెట్టారో ఆ ఉద్దేశంలోనే మనం దానిని చూడాల్సిన సమయం వచ్చింది. ఉరిశిక్ష ఉన్నంతకాలం.. ఆ కేసు ఉరిశిక్ష విధించదగ్గంత అత్యంత అరుదైన, హీనమైనదేనా కాదా అన్న విషయాన్ని నిర్ధారించాల్సిన భారీ బాధ్యత జడ్జీలపై ఉంటుంది. రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కును ఈ ఉరిశిక్ష హరిస్తుంది. కాబట్టి ఉరిశిక్షను విధించేటప్పుడు జడ్జీలు రాజ్యాంగానికి లోబడి అత్యంత జాగ్రత్తగా, కచ్చితంగా తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది’ అని అన్నారు. అయితే జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ హేమంత్ గుప్తాలు జస్టిస్ కురియన్ అభిప్రాయంతో విభేదించారు. 1980లోనే ఓ కేసులో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఉరిశిక్షను సమర్థించిందనీ, ఐపీసీలో ఉన్న ఉరిశిక్ష రాజ్యాంగబద్ధమైనదేనని స్పష్టం చేసిందని వారు పేర్కొన్నారు. అత్యంత అరుదైన కేసుల్లో ఉరిశిక్ష విధించొచ్చని నాడు సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందనీ, దీన్ని ఇప్పుడు మళ్లీ పునఃసమీక్షించాల్సిన అవసరం లేదని వారు అభిప్రాయపడ్డారు. -
గుంటూరు టీడీపీలో అసమ్మతి రాగం
-
చలమాపై సీరియస్
టీడీపీ మాచర్ల నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మారెడ్డి చలమారెడ్డిపై పార్టీలోని అసమ్మతి నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా భూ కబ్జాలకు పాల్పడుతున్నారని, వ్యతిరేకించిన వారిపై పార్టీ కార్యకర్తలు అని కూడా చూడకుండా దాడులు చేయిస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. గుంటూరు : మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశం ఇన్చార్జి కొమ్మారెడ్డి చలమారెడ్డిపై పార్టీలోని అసమ్మతి నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా భూ కబ్జాలకు పాల్పడుతున్నారని, వ్యతిరేకించిన వారిపై పార్టీ కార్యకర్తలు అని కూడా చూడకుండా దాడులు చేయిస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. ఆయన కుమారుడు కూడా అనేక అక్రమ వ్యవహారాల్లో తలదూర్చుతున్నారని పేర్కొన్నారు. ఈ సంఘటనల కారణంగా ఇన్చార్జిని మారుస్తారనే ప్రచారం ఎక్కువగా వినపడుతోంది. ఎద్దులబోడు కబ్జాకు యత్నం.. కొత్తపల్లి గ్రామ సమీపంలోని ఎద్దుల బోడులోగల 532 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారని, ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన కొద్ది నెలలకే ఈ ఆక్రమణలకు ప్రయత్నించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిసింది. ఈ వ్యవహారం మీడియా ద్వారా బయటకు పొక్కడంతో జిల్లా కలెక్టర్, పోలీసు యంత్రాంగం జోక్యంతో ఆక్ర మణల పర్వం నిలిచిపోయిందని పేర్కొన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడి.. మత్స్యకారులకు ఆ శాఖ అందజేయాల్సిన సైకిళ్ళను చలమారెడ్డి భవంతిలో గతంలో భద్ర పరిచారు. ఇందులో కొన్ని సైకిళ్ళు కనిపించకపోతే ఆ శాఖలో పనిచేసే చిరు ఉద్యోగిని బాధ్యుణ్ణి చేశారు. మున్సిపల్ కో-ఆప్షన్ ఎన్నిక సందర్భంగా తన మాట నెగ్గడం లేదని చలమారెడ్డి వర్గీయు లు టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి లక్ష్మారెడ్డి గదిలో నుంచి బయటకు రాని పరిస్థితి నెలకొంది. సమీప బంధువు అని చూడకుండా లక్ష్మారెడ్డిపై చలమారెడ్డి వర్గీయులు తీవ్ర స్థాయిలో దుర్భాషలాడినట్టు తెలిపారు. చలమారెడ్డి కుమారుడిపై కేసులు.. మాచర్ల మండలంలో సుగాలీల తగాదాలో చలమారెడ్డి కుమారుడు శ్రీనివాసరెడ్డి తల దూర్చడమే కాకుండా, విజయపురిసౌత్ ఎస్ఐ సమక్షంలోనే సుగాలీలను కులం పేరుతో దూషించాడు. ఈ ఘటనపై శ్రీనివాసరెడ్డిపై కేసు నమోదుకావడంతో పార్టీ ప్రతిష్టకు భంగం వాటిల్లినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. విజయపురిసౌత్లోనే ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టే టెండర్ల వ్యవహారంలో నరసరావుపేట సమీపంలోని లింగంగుంట్లలో గొడవ జరిగింది. టెండర్ తన వర్గీయులకే దక్కాలని టీడీపీ వర్గీయులైన కాంట్రాక్టర్లపై శ్రీనివాసరెడ్డి దాడి చేసి టెండర్ పత్రాలను లాక్కున్నాడు. ఈ సంఘటనపై నరసరావుపేట రూరల్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. స్వగ్రామంలో ఉనికిని కాపాడుకునేందుకు గ్రామ ఖాయిదా పాటల సాకుతో వెల్దుర్తి మండలం కండ్లకుంటలో చలమారెడ్డి చిచ్చు పెట్టారు. పాటల లెక్కలు చూడాలని స్థానికేతరులను వెంటబెట్టుకొని వెళ్ళి చలమారెడ్డి తగాదాకు కాలు దువ్వడం టీడీపీ, వైయస్సార్ సీపీ వర్గీయులు రాళ్ళదాడి ఘటనకు దారితీసింది. ఈ సంఘటన గురించి మాట్లాడేందుకు చలమారెడ్డి టీడీపీ నేతలను వెంటబెట్టుకొని ఇటీవల మాచర్ల వచ్చిన రూరల్ ఎస్పీ నారాయణనాయక్‌ను కలవగా ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. దాడులకు సహకరించడం సరికాదని ఎస్పీ చలమారెడ్డిపై అసంతృప్తిని వ్యక్తం చేయడం పత్రికల్లో ప్రచురితమైంది. పార్టీలో కొందరినే దగ్గరకు తీయడం వల్ల మరికొందరు పార్టీకి దూరమై వర్గ విభేదాలు ఏర్పడ్డాయి. చలమారెడ్డి వల్ల పార్టీ అప్రతిష్టపాలై, పార్టీకి చాలామంది దూరమవుతున్నారని కొన్ని సంఘటనలను ఉదహరిస్తూ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. -
కుదరని సయోధ్య
మేయర్ ఎంపికపై బెడిసికొడుతున్న వ్యూహం కాంగ్రెస్‌లో రాజుకుంటున్న అసమ్మతి జేడీఎస్‌తో పొత్తుకు సై అంటున్న సిద్ధు గ్రూప్ కూడదంటున్న పరమేశ్వర మద్దతుదారులు బెంగళూరు : మేయర్ ఎంపిక విషయంలో జేడీఎస్‌తో పొత్తు వ్యవహారం కాంగ్రెస్‌లో అసమ్మతిని రాజేస్తోంది. ఆ పార్టీలో మరోసారి సీఎం సిద్ధు గ్రూపు, కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ వర్గం అన్న వాఖ్యానాలు వినిపిస్తున్నాయి. జేడీఎస్‌తో పొత్తుకు సిద్ధు అండ్ కో మొగ్గు చూపిస్తుండగా పరమేశ్వర్ వర్గం వ్యతిరేకిస్తోంది. బీబీఎంపీ ఎన్నికల్లో 76 వార్డులను కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సంఖ్య బలంతో ఆ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ మేయర్ పదవిని దక్కించుకోవడం అసాధ్యం. దీంతో ఆ పార్టీ నాయకులు ముఖ్యంగా ‘సిద్ధరామయ్య అండ్ కో’ 14 వార్డులను గెలుచుకున్న జేడీఎస్‌తో పాటు ఆరుగురు స్వతంత్ర అభ్యర్థుల మద్దతు తీసుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. సీఎం సిద్ధరామయ్య తెర వెనక నుంచి మంత్రాంగం నడిపిస్తుండగా బెంగళూరుకు చెందిన బైరతీ బసవరాజు, మునిరత్నా, ఎస్టీ సోమశేఖర్ తెరముందు జేడీఎస్, స్వతంత్ర అభ్యర్థులను లాబీయింగే చేస్తున్నారు. ఈ ముగ్గురూ సీఎం సిద్ధరామయ్యకు అప్తులన్న విషయం బహిరంగ రహస్యమే. అయితే పరమేశ్వర్‌తో పాటు మూలతహా కాంగ్రెస్ పార్టీకు చెందిన కొందరు నాయకులు జేడీఎస్‌తో పొత్తుకు సమ్మతించడం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. రాజకీయాల్లో పొత్తులు సాధారణమే అయినా గత అనుభవాల దృష్ట్యా జేడీఎస్ స్నేహహస్తం ఇచ్చినట్లే ఇచ్చే తర్వాత ప్రతి విషయంలోనూ అడ్డుతగులుతుందని పరమేశ్వర్‌తో బాటు మిగిలిన కొంతమంది నాయకులు భావిస్తున్నారు. అంతేకాకుండా బీబీఎంపీ ఎన్నికల్లో ప్రజల తీర్పు బీజేపీకి అనుకూలంగా వచ్చినా అధికారం కోసం రాజకీయ బద్ధశత్రువైన జేడీఎస్‌తో కలవడం రాష్ట్రంలో పార్టీ పటిష్టతకు ఇబ్బంది కరంగా మారుతుందనేది వారి వాదన. ఇదే విషయమై పరమేశ్వర్, సిద్ధరామయ్య మధ్య శనివారం పొద్దు పొయిన తర్వాత ఫోన్లో స్వల్ప వాగ్వాదం జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాకుండా కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడైన తనతో సంప్రదించకుండా కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ పరమైన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం సరికాదు. ఈ విషయమై వారి నుంచి లిఖిత పూర్వకంగా సమాధానాన్ని కోరుతా, అవసరమైతే క్రమశిక్షణా చర్యలకు వెనకాడబోనని ఆయన తన సన్నిహితులతో పేర్కొన్నట్లు కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు చెబుతున్నారు. -
కాంగ్రెస్‌లో మరోసారి భగ్గుమన్న అసమ్మతి
సిద్ధరామయ్య వైఖరిపై ఎస్.ఎం.కృష్ణ పరోక్ష వ్యాఖ్యలు స్వరం కలిపిన బి.కె.హరిప్రసాద్ బెంగళూరు: కాంగ్రెస్ పార్టీలోని అసమ్మతి సెగలు మరోసారి భగ్గుమన్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అటు ప్రభుత్వంతో పాటు ఇటు పార్టీలోనూ అన్నీ తానై వ్యవహరిస్తున్న తీరుపై చాలా కాలంగా కాంగ్రెస్ సీనియర్ నేతల్లో అసమ్మతి చెలరేగుతూనే ఉంది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం.కృష్ణ గురువారమిక్కడ చేసిన వ్యాఖ్యలు ఇదే విషయాన్ని బలపరుస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి దేవరాజ్ అరస్ శత జయంతి వేడుకల సందర్భంగా గురువారమిక్కడి కేపీసీసీ కార్యాలయంలో నిర్విహించిన కార్యక్రమంలో ఎస్.ఎం.కృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....‘ఇప్పుడు నాకు 83ఏళ్ల వయస్సు, అయినా ఇప్పటికీ నేనింకా ఏదో నేర్చుకోవాల్సి ఉందనే భావిస్తుంటాను. అంతేకాదు నేను నేర్చుకోవాల్సింది కూడా చాలానే ఉంది. అయితే కొంత మంది మాత్రం నాకు అంతా తెలుసు, నేను ఎవరి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదంటూ ‘అహం బ్రహ్మాస్మి’ అంటూ ప్రవర్తిస్తున్నారు. పాలన సాగించే నేతలకు ఈ తరహా వైఖరి ఉండడం ఏమాత్రం సరికాదు’ అంటూ సిద్ధరామయ్య పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్యకాలంలో పార్టీ సీనియర్ నేతల అభిప్రాయాలను పట్టించుకోకుండా ముఖ్యమంత్రి సిద్దరామయ్య సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం, హైకమాండ్ కూడా సిద్ధరామయ్య వైఖరి పట్ల అభ్యంతరం చెప్పక పోవడంతో ఎస్.ఎం.కృష్ణ తన అసహనాన్ని ఈ విధంగా ప్రదర్శించారనేది రాజకీయ విశ్లేషకుల వాదన. ఇక ఇదే సందర్భంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి బి.కె.హరిప్రసాద్ సైతం ఎస్.ఎం.కృష్ణ వ్యాఖ్యలకు స్వరం కలిపారు. ‘కొంతమంది అధికారానికి రాక ముందు ‘సమానత్వం’ గురించి మాట్లాడతారు. కానీ అధికారం చేతికి వచ్చిన తర్వాత మాత్రం కేవలం తమ జాతి వరకు మాత్రమే పరిమితమౌతారు. అధికారం చేతికి వచ్చిన తర్వాత కేవలం తమ జాతి వరకు పరిమితమవడం ఎంతమాత్రం సరికాదు’ అంటూ సిద్ధరామయ్యపై చురకలు విసిరారు. ఇక సిద్ధరామయ్య వైఖరి పట్ల అసంతృప్తి కారణంగా బీబీఎంపీ ఎన్నికల ప్రచారానికి ఎస్.ఎం.కృష్ణ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఎన్నికల ప్రచారాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యే భుజాలకెత్తుకున్నారు. ఈ సందర్భంలో బీబీఎంపీ ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ పరాజయం పాలైతే సిద్ధరామయ్యపై అసంతృప్తి మరింత అధికమయ్యే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. -
పేట టీడీపీలో తిరుగుబాటు
ఎమ్మెల్యే అనితపై ధ్వజం మంత్రి గంటాపై విమర్శనాస్త్రాలు పాయకరావుపేటలో అసమ్మతి సమావేశం జిల్లా టీడీపీ అధ్యక్షుడు పప్పలతో భేటీ 14న సీఎం వద్ద పంచాయితీ విశాఖపట్నం: జిల్లా టీడీపీలో పుట్టిన ముసలం పదునెక్కుతోంది. టీడీపీని నిలువునా చీల్చేస్తోంది. గంటా, అయ్యన్నవర్గాలుగా కత్తులు నూరుతున్న టీడీపీ వర్గరాజకీయం రోడ్డున పడింది. అందుకు పాయకరావుపేట నియోజకవర్గం వేదికగా మారింది. జిల్లాలో మంత్రి గంటా వర్గంలో కీలకంగా ఉన్న పాయకరావుపేట ఎమ్మెల్యే అనితకు వ్యతిరేకంగా నియోజకవర్గ నేతలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. అసమ్మతివర్గం ప్రత్యేకంగా సమావేశమై తాడోపేడో తేల్చుకునేందుకు సంసిద్ధమయ్యారు. మంత్రి గంటా అండ చూసుకునే ఎమ్మెల్యే అనిత నేతలు, కార్యకర్తలకు విలువ ఇవ్వడం లేదని విరుచుకుపడ్డారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు పప్పల చలపతిరావుతో భేటీ అయి ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. అనితకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసేందుకు 14న సీఎం చంద్రబాబును కలవాలని నిర్ణయించుకున్నారు. పక్కా ప్రణాళికతో బయటపడ్డ టీడీపీ వర్గ విభేదాలు జిల్లాలో భవిష్యత్ రాజకీయ పరిణామాలకు సూచికగా నిలుస్తున్నాయి. పార్టీని ముంచుతున్న తీరు.. నియోజకవర్గ టీడీపీ నేతలు ఎమ్మెల్యే అనితకు వ్యతిరేకంగా అసమ్మతి గళం వినిపించారు. నాలుగు మండలాలకు చెందిన దాదాపు 150మంది పాయకరావుపేటలో మంగళవారం ప్రత్యేకంగా భేటీ అయి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నేతలు, కార్యకర్తలను ఎమ్మెల్యే గుర్తించడం లేదని విమర్శించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెడుతున్నారని విరుచుకుపడ్డారు. నక్కపల్లి మండలంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన ఒకే కుటుంబానికి నామినేటెడ్ పదవితోపాటు ఐదు పదవులు ఇచ్చిన విషయాన్ని ఉదాహరించారు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గంలో పార్టీ కనుమరుగైపోతుందని కూడా తేల్చిచెప్పారు. మంత్రి గంటాపై ధ్వజం మంత్రి గంటా అండదండలు చూసుకునే ఎమ్మెల్యే ఖాతరు చేయడం లేదని పలువురు నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ నుంచి వచ్చినవారికి ఎమ్మెల్యే పదవులు కట్టబెట్టడం వెనుక మంత్రి గంటా హస్తం ఉందని కూడా ఆరోపించారు. పీసీపీఐఆర్ ప్రాజెక్టును నియోజకవర్గంలో ప్రజలు వ్యతిరేకిస్తుంటే ఎమ్మెల్యే మాత్రం అధికారులతో కలసి బలవంతపు భూసేకరణకు సిద్ధపడటమేమిటని ప్రశ్నించారు. ఈ విషయంలో కూడా మంత్రి గంటా సూచనల మేరకే కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తాడోపేడో తేల్చుకుంటాం ఈ సమావేశం అనంతరం పాయకరావుపేట నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు యలమంచిలి వెళ్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు పప్పల చలపతిరావుతో భేటీ అయ్యారు. డీసీసీబీ డెరైక్టర్ గెడ్డం కన్నబాబు, గెడ్డం బుజ్జి, గొర్రెల రాజబాబు, గెడ్డం రమేష్, బొల్లం సూర్యచలపతి, దేవవరపు శివ, కొండయ్య, సీతారాం తదితరులు పప్పల చలపతిరావును కలిసి ఎమ్మెల్యే అనిత తీరుపై ఆయనకు ఫిర్యాదు చేశారు. వారిని శాంతింపజేయడానికి జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్రయత్నించినప్పటికీ వారు వెనక్కితగ్గలేదు. సీఎం చంద్రబాబుతో తమకు అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరారు. ఆయన వద్దే ఎమ్మెల్యే అనిత సంగతి తేల్చుకుంటామమన్నారు. దాంతో 14న సీఎం చంద్రబాబుతో కలిపిస్తానని చలపతిరావు వారికి హామీ ఇచ్చారు. నేతలు, కార్యకర్తలు కొంత శాంతించి సీఎం దృష్టికి తీసుకువెళ్లాల్సిన అంశాలపై కాసేపు చర్చించుకుని వెనుదిరిగారు. జిల్లా టీడీపీని ఓ కుదుపు కుదిపిన ఈ పరిణామం భవిష్యత్ పరిణామాలకు సంకేతంగా నిలుస్తోంది.