మరో 9 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారన్న కాంగ్రెస్ రెబల్ రాణా
సిమ్లా/చండీగఢ్: హిమాచల్ ప్రదేశ్‌లోని అధికార కాంగ్రెస్‌లో అసమ్మతి రోజురోజుకీ ముదురుతోంది. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు రాజిందర్ రాణా సారథ్యంలో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన విషయం తెలిసిందే. అనంతరం అసెంబ్లీలో జరిగిన ఓటింగ్‌కు గైర్హాజరైన వీరిని కాంగ్రెస్ పార్టీ అనర్హులుగా ప్రకటించింది. అదే ఎమ్మెల్యే రాజిందర్ రాణా శనివారం మరో బాంబు పేల్చారు.
సీఎం సుఖ్‌వీందర్ సింగ్ సుక్కూ వైఖరితో విసుగుచెందిన మరో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నట్లు చెప్పుకున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రులతోపాటు మరో తొమ్మిది మంది తనతో టచ్‌లో ఉన్నట్లు ఓ ఇంటర్వ్యూలో రాణా చెప్పారు. సీఎం సుక్కూను అబద్ధాల కోరుగా ఆయన అభివర్ణించారు. ఇలా ఉండగా, హిమాచ్ కేబినెట్ సమావేశంలో విధానపర అంశాలపై వాడీవేడి చర్చ అనంతరం మంత్రులు జగత్ నేగి, రోహిత్ ఠాకూర్ అర్ధంతరంగా బయటకు వెళ్లిపోయినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment