![Rebellion against CM Biplab Deb in Tripura - Sakshi](/styles/webp/s3/article_images/2020/10/13/TRIPURA.jpg.webp?itok=NuH-Uo4S)
అగర్తలా: త్రిపుర రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంలో అసమ్మతి రగులుతోంది. సీఎం విప్లవ్‌కుమార్ దేవ్‌పై 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరేశారు. పార్టీ అధ్యక్షుడు నడ్డాను కలిసి తమ వాదన వినిపించేందుకు ఢిల్లీకి చేరుకున్నారు. అసమ్మతి ఎమ్మెల్యేల్లో రాష్ట్ర ఆరోగ్య శాఖ మాజీ మంత్రి సుదీప్‌రాయ్ బర్మన్ ఉన్నారు. రాష్ట్రంలో బీజేపీకి 36 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వారిలో 25 మంది మార్పును కోరుకుంటున్నారని, మంత్రివర్గాన్ని మార్చాలని వారు ఆశిస్తున్నారని అసమ్మతి ఎమ్మెల్యే ఒకరు చెప్పారు. సీఎం విప్లవ్‌కుమార్ దేవ్ అసమర్థ పాలన వల్ల త్రిపురలో బీజేపీ బలహీన పడుతోందని అన్నారు. నడ్డాతోపాటు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసేందుకు ప్రయత్నిస్తున్నామని మరో ఎమ్మెల్యే పేర్కొన్నారు. 60 అసెంబ్లీ స్థానాలున్న త్రిపురలో బీజేపీకి 36, దాని మిత్రపక్షం ఐపీఎఫ్‌టీకి 8, ప్రతిపక్ష సీపీఎంకు 16 మంది ఎమ్మెల్యేలున్నారు.
Comments
Please login to add a commentAdd a comment