Rebellion
-
ఎన్నికల వేళ హరియాణాలో బీజేపీకి షాక్
చండీగఢ్: హరియాణా అసెంబ్లీకి అక్టోబర్ 5వ తేదీన జరగనున్న ఎన్నికలు అధికార బీజేపీలో కాక పుట్టిస్తున్నాయి. బుధవారం బీజేపీ ప్రకటించిన 67 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాలో తమ పేర్లు లేవనే ఆగ్రహంతో మంత్రి రంజిత్ సింగ్, ఎమ్మెల్యే లక్ష్మణ్‌దాస్ నాపాతోపాటు పార్టీ ఓబీసీ మోర్చా చీఫ్, మాజీ మంత్రి కరణ్ దేవ్ కాంబోజ్ తిరుగుబాటు ప్రకటించారు. మాజీ డెప్యూటీ ప్రధానమంత్రి దేవీ లాల్ కుమారుడైన రంజిత్ సింగ్ మంత్రి పదవికి, ఆ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. మద్దతుదారుల అభిప్రాయం మేరకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నానని, ఎన్నికల్లో స్వతంత్రుడిగా పోటీ చేస్తానని రంజిత్ సింగ్ గురువారం ప్రకటించారు. స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉన్న రంజిత్ సింగ్ లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. -
టీడీపీలో హాహాకారాలు
సాక్షి, అమరావతి/ఏలూరు (ఆర్‌ఆర్‌పేట)/ఆత్మకూరు రూరల్/అమలాపురం టౌన్/సాక్షి ప్రతినిధి, నెల్లూరు/సాక్షి ప్రతినిధి కర్నూలు: తెలుగుదేశం పార్టీలో ఆగ్రహ జ్వాలలు చల్లారడంలేదు. పొత్తులు, సమీకరణలు, ధన ప్రభావంతో సీట్లు గల్లంతైన సీనియర్ నేతలు చంద్రబాబు తీరుపై గతంలో ఎన్నడూ లేనివిధంగా దుమ్మెత్తిపోస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని ధ్వజమెత్తుతున్నారు. ప్రతిజిల్లాలోనూ అసమ్మతి తీవ్రస్థాయిలో రాజుకోవడంతో టీడీపీ అధినేత చంద్రబాబుకు ముచ్చెమటలు పడుతున్నాయి. 30కిపైగా నియోజకవర్గాల్లో సీట్లు రాని నేతలు టీడీపీ అభ్యర్థులను ఓడిస్తామని ప్రకటించడంతో బాబు తల పట్టుకుంటున్నారు. తాజాగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సీనియర్ నేత, మాజీ ఎంపీ మాగంటి బాబు తన అసంతృప్తిని వెళ్లగక్కారు. ఏలూరు ఎంపీ సీటును యనమల రామకృష్ణుడి అల్లుడు మహేశ్ కు కేటాయించడాన్ని తప్పు బట్టారు. చాలాఏళ్లుగా తమ సామాజికవర్గానికి కేటాయించే సీటును బీసీకివ్వడం సరికాదని, ఈ సీటును బీసీలకు ఇవ్వాలని ఎవరడిగారని ఆయన మంగళవారం రాత్రి చంద్రబాబును కలిసినప్పుడు ప్రశ్నించారు. తమకు కనీసం చెప్పకుండా తమ సీటును మార్చడం అవమానించడమేనని నిలదీశారు. బీసీల్లో యనమల కుటుంబం తప్ప మరొకరు దొరకలేదా? ఎక్కడో కడప నుంచి అభ్యర్థిని తీసుకురావడమేమిటీ అంటూ మాగంటి సంధించిన వరుస ప్రశ్నలకు చంద్రబాబు వద్ద సమాధానం లేదని సమాచారం. చంద్రబాబు ఎంత బుజ్జగించినా, ఎన్నికల తర్వాత రాజ్యసభ సీటు ఇస్తానని నమ్మబలికినా మాగంటి శాంతించలేదు. ఆయన తన దారి తాను చూసుకోవడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. చంద్రబాబును కలిసి బయటకు వచ్చిన వెంటనే బాబుపై నమ్మకం లేదని వ్యాఖ్యానించి కోపంగా వెళ్లిపోవడం దీనికి బలం చేకూరుస్తోంది. చంద్రబాబుతో చర్చలు ఆశాజనకంగా సాగలేదని పార్టీ శ్రేణులకు మాగంటి బాబు రాసినట్టు చెబుతున్న ఓ లేఖ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ♦ కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని ఆదోని, ఆలూరు, మంత్రాలయం, కోడుమూరు, నంద్యాల, డోన్ నియోజకవర్గాల్లో టికెట్లు దక్కని టీడీపీ ఇన్చార్జులు అసమ్మతిబావుటా ఎగురేశారు. ఆదోనిలో పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న మీనాక్షినాయుడు సీటును బీజేపీకి కేటాయించడంపై మండిపడుతున్నారు. తానుగానీ, తన తనయుడుగానీ ఇండిపెండెంట్‌గా బరిలో దిగాలని యోచిస్తున్నారు. ఆలూరులో టీడీపీ ఇన్చార్జి కోట్ల సుజాతమ్మ పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. కుటుంబానికి ఒకే సీటు అంటూ తనను పక్కన పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. మంత్రాలయంలో రాఘవేంద్ర, నందికొట్కూరులో గిత్త జయసూర్యకు టికెట్లు కేటాయించిన తర్వాత గెలుపు అవకాశాలు సన్నగిల్లాయని నివేదికలు అందడంతో ఈ సీట్లను మార్చే యోచనలో చంద్రబాబు ఉన్నట్టు సమాచారం. కోడుమూరులో ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డి, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి వర్గాల మధ్య టిక్కెట్ పంచాయతీ తెగలేదు. విష్ణు ప్రతిపాదించిన బొగ్గుల దస్తగిరి అభ్యర్థిత్వాన్ని కోట్ల వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆకేపోగు ప్రభాకర్‌కు టిక్కెట్ ఇవాల్సిందేనని పట్టుబట్టినా అధిష్టానం స్పందించకపోవడంతో ప్రచారంలో పాలుపంచుకోవడం లేదు. డోన్ ఇన్చార్జ్ మన్నే సుబ్బారెడ్డిని కాదని కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డికి టికెట్ ఇవ్వడంతో సుబ్బారెడ్డి సైలెంట్ అయ్యారు. ప్రచారంలో మాత్రం పాల్గొనడం లేదు. నంద్యాలలో భూమా బ్రహా్మనందరెడ్డి కూడా అభ్యర్థి ఫరూక్‌కు సహకరించడం లేదు. ♦ విజయనగరం జిల్లా చీపురుపల్లిలో పదేళ్లుగా పని చేస్తున్న కిమిడి నాగార్జునను కనీసం పరిగణన లోకి తీసుకోకుండా ఆ సీటును ఆయన బంధువు కళా వెంకట్రావుకు కేటాయించడంపై పార్టీ శ్రేణుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉన్నత స్థాయిలో ఉద్యోగం చేస్తున్న తనను బాబు తన అవసరం కోసం రాజకీయాల్లోకి తీసుకువచ్చి ఇప్పుడు కనీసం మాటమాత్రంగానైనా చెప్పకుండా పక్కకు తప్పించడంపై నాగార్జున కన్నీటి పర్యంతమయ్యారు. ♦ పెందుర్తి సీటును జనసేనకు కేటాయించడం, అక్కడ తన వ్యతిరేకి పంచకర్ల రమే‹Ùను ఆ పార్టీ నుంచి పోటీ చేయిస్తుండడాన్ని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి జీర్ణించుకోలేకపోతున్నారు.చంద్రబాబు తనను ఇంతలా మోసం చేస్తారని అనుకోలేదని ఆవేదన చెందుతున్నారు. కొన్నిరోజులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఆయన ఇక రాజకీయాల నుంచి విరమిస్తానని నిర్వేదం వ్యక్తం చేయడంపై పార్టీ శ్రేణులు ఆవేదన చెందుతున్నాయి. ♦ అనపర్తి సీటును తొలిజాబితాలోనే తనకు కేటాయించి.. అంతలోనే మళ్లీ బీజేపీకి ఇవ్వడంపై మండిపడుతున్న మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ♦ రాజంపేట సీటును పార్టీ శ్రేణులకూ తెలియని సుగవాసి సుబ్రహ్మణ్యంకి కేటాయించడంతో బత్యాల చెంగల్రాయుడు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. ♦హజ్ కమిటీ రాష్ట్ర మాజీ చైర్మన్ మోమిన్ అహమ్మద్ హుసేన్ బుధవారం తెలుగుదేశం పార్టీ క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేశారు. త్వరలో వైఎస్సార్ సీపీలో చేరనున్నట్లు ఆయన కర్నూలు జిల్లా ఆత్మకూరులోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. 30 ఏళ్లుగా టీడీపీలో క్రియాశీలకంగా పనిచేసిన హుసేన్ పలు కీలక పదవులలో సేవలందించారు. ఆయనతో పాటు టీడీపీ రాయలసీమ స్థాయి నాయకుడైన కుమారుడు మోమిన్ ముస్తఫా, స్థానిక మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్ అయిన మరో కుమారుడు ముఫ్తి కూడా టీడీపీకి రాజీనామా చేశారు. ♦ టీడీపీ కోవూరు నియోజకవర్గ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి బుచ్చిరెడ్డిపాళెం మండలం పెనుబల్లిలో బుధవారం నిర్వహించిన ప్రచారంలో పార్టీలోని వర్గవిభేదాలు బయటపడ్డాయి. ప్రచార రథమెక్కేందుకు యత్నించిన వవ్వేరు బ్యాంక్ మాజీ చైర్మన్ సూరా శ్రీనివాసులురెడ్డిని పోలంరెడ్డి దినేష్‌రెడ్డితో పాటు స్థానిక టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఆయన అనుచరులనూ మెడపట్టి తోసేశారు. మరొకరిని కాలితో తన్నడంతో కిందపడిపోయారు. దీంతో సూరాతోపాటు ఆయన అనుచరులు అవమానభారంతో వెనుదిరిగారు. సూరా ఇటీవలే టీడీపీలో చేరారు. ఆయన చేరికను పార్టీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నారు. ప్రశాంతిరెడ్డి కూడా అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూరాకు హుకుం జారీ చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే ప్రశాంతిరెడ్డి ప్రచారానికి ప్రజల నుంచి స్పందన కరువైంది. దీంతో ఆమె అర్ధాంతరంగా ప్రచారాన్ని ఆపేసి వెనుదిరిగారు. ళీ అనంతపురం అర్బన్ సీటును దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ అనే కొత్త వ్యక్తికి ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యే ప్రభాకరచౌదరి వర్గం బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ♦ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి శెట్టిబత్తుల రాజబాబు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి, జిల్లా అధ్యక్షుడికి ఫ్యాక్స్, వాట్సాప్‌ల ద్వారా బుధవారం పంపించారు. పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడినా తనకు న్యాయం జరగలేదని, జనసేనకు పట్టు ఉన్న అమలాపురాన్ని టీడీపీ చేతిలో పెట్టడమేమిటని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వివరించారు. -
డామిట్! కథ అడ్డం తిరిగింది.. నితీశ్‌ను తప్పించబోయి చిత్తయిన లలన్
న్యూఢిల్లీ/పట్నా: బిహార్‌లో అధికార కూటమి భాగస్వామి అయిన జేడీ(యూ)లో తెర వెనక ‘తిరుగుబాటు’కు ఎట్టకేలకు తెర పడింది. పారీ్టలో అధ్యక్ష మార్పు తప్పదన్న ఊహాగానాలే నిజమయ్యాయి. మీడియా కథనాలను నిజం చేస్తూ లలన్సింగ్ను తప్పించి పార్టీ అధ్యక్ష పగ్గాలను సీఎం నితీశ్‌కుమార్ లాంఛనంగా తన చేతుల్లోకి తీసుకున్నారు. శుక్రవారం జరిగిన పార్టీ జాతీయ కౌన్సిల్ భేటీ ఇందుకు వేదికైంది. పార్టీ అధ్యక్షునిగా నితీశ్ పేరును సభ్యులంతా ముక్త కంఠంతో సమర్థించారు. ఆ వెంటనే లలన్ రాజీనామా, అధ్యక్షునిగా నితీశ్ బాధ్యతల స్వీకరణ చకచకా జరిగిపోయాయి. అయితే ఈ పరిణామం వెనక నిజానికి చాలా పెద్ద కథే నడిచినట్టు తెలుస్తోంది. లలన్ తిరుగుబాటు యత్నమే దీనంతటికీ కారణమని సమాచారం. నితీశ్ స్థానంలో డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు లలన్ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టి చివరికి ఆయన ఉద్వాసనకు దారితీసినట్ చెబుతున్నారు! కొద్ది నెలల క్రితం నుంచే... ఆర్జేడీతో, ఆ పార్టీ చీఫ్ లాలుప్రసాద్ యాదవ్‌తో లలన్‌సింగ్ సాన్నిహిత్యం ఇప్పటిది కాదు. నితీశ్ కూడా దీన్ని చూసీ చూడనట్టే పోయేవారు. అయితే విశ్వసనీయ వర్గాల కథనం మేరకు... లాలు కుమారుడు తేజస్వికి సీఎం పదవి అప్పగించి నితీశ్ డిప్యూటీ సీఎంగా కొనసాగాలంటూ కొద్దికాలం క్రితం లలన్ ప్రతిపాదించారు. 18 ఏళ్లపాటు సుదీర్ఘంగా సీఎం పదవిలో కొనసాగినందున అధికార మహాఘట్బంధన్ సంకీర్ణంలో పెద్ద భాగస్వామి అయిన ఆర్జేడీకి సీఎం అవకాశమిస్తే బాగుంటుందని సూచించారు. దీన్ని నితీశ్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. లాలు–లలన్ ప్లాన్ నితీశ్ నిరాకరించినా తేజస్విని ఎలాగైనా సీఎం చేసేందుకు లాలు, లలన్ ఒక పకడ్బందీ ప్రణాళిక రూపొందించారు. అందులో భాగంగా జేడీ(యూ)ను చీల్చి కనీసం ఒక డజను మంది ఎమ్మెల్యేలను ఆర్జేడీలోకి పంపేందుకు లలన్ ఒప్పుకున్నారు. బదులుగా వచ్చే ఏప్రిల్‌లో ఆర్జేడీ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాన్ని ఆయనకిచ్చేలా అంగీకారం కుదిరింది. 243 మంది సభ్యుల బిహార్ అసెంబ్లీలో జేడీ(యూ)తో నిమిత్తం లేకుండా ప్రభుత్వ ఏర్పాటుకు తేజస్వికి కేవలం మరో ఏడుగురు ఎమ్మెల్యేల మద్దతు చాలు. కానీ 45 మంది జేడీ(యూ) ఎమ్మెల్యేల్లో డజను మందే పార్టీ ఫిరాయిస్తే వారిపై అనర్హత వేటు ఖాయం. తన అధ్యక్ష పదవి సాయంతో ఈ ముప్పు తప్పించేలా లలన్ ఎత్తే వేశారు. అందులో భాగంగా వారిని పార్టీ నుంచి ఆయనే సస్పెండ్ చేస్తారు. అప్పుడిక వారికి అనర్హత నిబంధన వర్తించదు. ఆనక 12 మంది ఎమ్మెల్యేలూ ఆర్జేడీకి మద్దతు పలికేలా, నితీశ్ సర్కారు కుప్పకూలి తేజస్వి గద్దెనెక్కేలా వ్యూహరచన జరిగింది. ఈ మేరకు 12 మంది జేడీ(యూ) ఎమ్మెల్యేలతో కొద్ది వారాల క్రితం లలన్ గుట్టుగా మంతనాలు కూడా జరిపారు. వారందరికీ మంత్రి పదవులు ఆశ చూపారు. ఆర్జేడీకి చెందిన స్పీకర్ అవధ్ బిహారీ చౌధరి ఇందుకు పూర్తిగా సహకరిస్తారని చెప్పారు. అయితే సదరు ఎమ్మెల్యేల్లో తన వీర విధేయుడైన సభ్యుడొకరు దీనిపై ఉప్పందించడంతో నితీశ్ అప్రమత్తమయ్యారు. సైలెంట్‌గా వారం క్రితం ‘ఆపరేషన్ లాలన్’కు తెర తీశారు. ఎమ్మెల్యేలతో పాటు పార్టీ నేతలందరితోనూ విడివిడిగా మాట్లాడి వారంతా తనకే విధేయులుగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. అలా పావులు కదుపుతూ శుక్రవారం కథను క్లైమాక్స్‌కు తెచ్చారు. విషయం అర్థమైన లాలన్‌సింగ్ అస్త్రసన్యాసం చేశారు. అధ్యక్ష పదవికి తానే నితీశ్ పేరును సూచించి తప్పుకున్నారు! -
వాగ్నర్ గ్రూప్ చీఫ్ హతం! ఇందులో నిజమెంత? అమెరికా సందేహాలు
వాషింగ్టన్: రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై తిరుగుబాటు చేసిన కిరాయి సైన్యం ‘వాగ్నర్ గ్రూప్’ అధినేత యెవ్గెనీ ప్రిగోజిన్ ఇప్పుడు ఎక్కడున్నారు? రష్యాలోనే ఉన్నారా? లేక పొరుగు దేశం బెలారస్లో తల దాచుకుంటున్నారా? తిరుగుబాటు తర్వాత పుతిన్‌తో ఆయన సమావేశమై తన చర్యలపై వివరణ ఇచి్చనట్లు వార్తలు వెలువడ్డాయి. అందులో నిజమెంత? ఇలాంటి ప్రశ్నలు జనం మదిలో మెదులుతున్నాయి. అయితే, పుతిన్ ఆదేశాలతో రష్యా అధికారులు ప్రిగోజిన్‌ను ఇప్పటికే అంతం చేసి ఉండొచ్చని లేక జైల్లో బంధించి ఉండొచ్చని అమెరికా మాజీ సైనిక ఉన్నతాధికారి జనరల్ రాబర్ట్ అబ్రామ్స్ చెప్పడం ఆసక్తికరంగా మారింది. పుతిన్‌తో ప్రిగోజిన్ భేటీ రష్యా ఆడిన డ్రామా అని ఆయన తేలి్చచెప్పారు. ప్రిగోజిన్‌ను ఇక బహిరంగంగా చూడటం అనుమానమేనన్నారు. వాగ్నర్ గ్రూప్ చీఫ్‌ను రష్యా అధికారులు చంపేసి అయినా ఉండాలి లేదా జైల్లో పెట్టయినా ఉండాలి లేదా ఎక్కడైనా దాచేసి ఉండాలి అని రాబర్ట్ అబ్రామ్స్ వెల్లడించారు. ప్రిగోజిన్ జూన్ 23న తన ప్రైవేట్ సైన్యంతో కలిసి పుతిన్‌పై తిరుగుబాటు చేయడం తెలిసిందే. కొందరు రష్యా సైనికాధికారుల అండతోనే ఆయన ఈ చర్యకు పాల్పడినట్లు వాదనలు వినిపించాయి. తిరుగుబాటు కొన్ని గంటల్లోనే ముగిసింది. ఆ తర్వాత జూన్ 29న ప్రిగోజిన్ తన వాగ్నర్ గ్రూప్ కమాండర్లతో కలిసి పుతిన్‌తో సమావేశమయ్యారని, ఇకపై రష్యా ప్రభుత్వానికి విధేయులుగా ఉంటామన్నట్టు వార్తలొచ్చాయి. ఉక్రెయిన్‌పై యుద్ధంలో ప్రిగోజిన్ సేవల దృష్ట్యా అతడికి పుతిన్ క్షమాభిక్ష ప్రసాదించినట్టు వార్తలొచ్చాయి. -
వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ బెలారస్లో కాదు.. రష్యాలోనే ఉన్నాడు
మిన్స్క్: రష్యా అధినేత పుతిన్‌పై స్వల్పకాలం తిరుగుబాటు చేసి, పెను సంచలనం సృష్టించిన కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్గెనీ ప్రిగోజిన్ ప్రస్తుతం రష్యాలోనే ఉన్నారని బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకశెంకో గురువారం చెప్పారు. ప్రిగోజిన్ ప్రస్తుతం సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలో ఆశ్రయం పొందుతున్నాడని తెలిపారు. ఉక్రెయిన్‌లో యుద్ధం కోసం రష్యా ప్రభుత్వం అందజేసిన నగదు, ఆయుధాలను వెనక్కిఇచ్చేసే ప్రయత్నంలో ప్రిగోజిన్ ఉన్నాడని వెల్లడించారు. వాగ్నర్ సైనిక దళాలు వారి క్యాంప్‌ల్లోనే ఉన్నాయని పేర్కొన్నారు. అయితే, ఆయా క్యాంప్‌లు ఎక్కడున్నాయనే విషయం లుకశెంకో బయటపెట్టలేదు. బెలారస్‌లోని తమ మిలటరీ స్థావరాలను ఉపయోగించుకోవాలని వాగ్నర్ సభ్యులకు సూచించామని, వారు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. సెయింట్ పీటర్స్బర్గ్ సిటీలో ప్రిగోజిన్ నివసిస్తున్నట్లు చెబుతున్న ఓ భవంతి ఫొటోలు, వీడియోలను రష్యా ఆన్లైన్ పత్రిక ఫోంటాకా బయటపెట్టింది. అయితే, ప్రిగోజిన్ ప్రస్తుతం రష్యాలోనే ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలేవీ లభించలేదు. పుతిన్ క్షమాభిక్ష పెట్టిన తర్వాత ప్రిగోజిన్ బెలారస్‌కు వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. -
సురోవికిన్ కూడా వాగ్నర్ సభ్యుడే
న్యూయార్క్: రష్యాలో వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు ఘటన అక్కడి మిలటరీలో లుకలుకలను ఒకటొకటిగా బయట పెడుతోంది. తాజాగా, రష్యా టాప్ మిలటరీ కమాండర్ జనరల్ సెర్గెయ్ సురోవికిన్ వాగ్నర్ గ్రూప్‌లో రహస్య వీఐపీ సభ్యుడని తెలిపే కొన్ని పత్రాలు దొరికినట్లు సీఎన్ఎన్ పేర్కొంది. వాగ్నర్ వీఐపీ సభ్యుడిగా సురోవికిన్ పేరు 2018లో నమోదైనట్లు అందులో తెలిపింది. ఆయనతోపాటు మరో 30 మంది రష్యా సీనియర్ మిలటరీ, ఇంటెలిజెన్స్ అధికారులు కూడా వాగ్నర్ వీఐపీ సభ్యులని పేర్కొంది. వాగ్నర్ సభ్యుడిగా సురోవికిన్ ఉన్నారనేందుకు కచ్చితమైన ఆధారాలేవీ లేనప్పటికీ, రష్యా సైనిక బలగాల్లోని చాలా మంది సీనియర్ అధికారులు వాగ్నర్ గ్రూప్‌తో దగ్గరి సంబంధాలు సాగించేందుకు అవకాశం ఉందని సీఎన్ఎన్ కథనం పేర్కొంది. ఇలాంటి దగ్గరి సంబంధాల వల్లే వాగ్నర్ కిరాయి సైనికులు రొస్తోవ్‌లోని కీలక మిలటరీ బేస్‌నుæ శ్రమ లేకుండా స్వాధీనం చేసుకోగలిగారన్న అనుమానా లున్నాయి. తిరుగుబాటు అనంతరం సురోవికిన్ కనిపించకుండా పోయారు. ప్రిగోజిన్ తిరుగుబాటు విషయం ఆయనకు తెలుసునంటూ న్యూయార్క్‌టైమ్స్ కథనం పేర్కొంది. ప్రిగోజిన్‌ను తిరుగుబాటు ఆపేయాలంటూ విడుదల చేసిన వీడియోలో సురోవికిన్ తడబడుతూ మాట్లాడుతున్నట్లు కనిపించారు. దీంతో, ఆయన మానసిక ఆరోగ్యంపైనా అనుమానాలున్నాయి. జనర ల్ ఆర్మగెడ్డాన్గా పిలుచుకునే సురోవికిన్ అధ్యక్షుడు పుతిన్‌కు నిన్నటిదాకా నమ్మినబంటు. తాజా పరిణామాలతోనూ ఆయన్ను పుతిన్ నమ్ముతారా అన్నది తేలాల్సి ఉంది. -
ఒక తిరుగుబాటు.. కొన్ని ప్రశ్నలు!
ఎస్. రాజమహేంద్రారెడ్డి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇప్పుడు దెబ్బతిన్న పులా? అలసిపోయిన పులా? దాదాపు రెండు దశాబ్దాలకుపైగా ఎదురులేని, తిరుగులేని నేతగా రష్యాను పరిపాలిస్తున్న పుతిన్‌ను ఉవ్వెత్తున ఎగసి అంతేవేగంగా నేలకరిచిన ఓ సాయుధ తిరుగుబాటు ఉక్కిరిబిక్కిరి చేసింది. నమ్మక ద్రోహాన్ని కూకటివేళ్లతో పెకిలించివేసే రికార్డు ఉన్న పుతిన్ ఈసారి ఎందుకో క్షమాభిక్షతో పేజీ తిప్పేశారు. రష్యాపై పుతిన్ పట్టు సడలుతోంది అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఎన్నో రహస్య యుద్ధాల్లో తన కనుసన్నల్లో కాలుదువి్వన వాగ్నర్ గ్రూప్సేనలు మడమతిప్పి తన మీదే తుపాకీ ఎక్కుపెట్టడం పుతిన్‌కు మింగుడు పడడం లేదు. వండివార్చే చెఫ్ నుంచి కిరాయి సేన చీఫ్‌గా అంచెలంచెలుగా ఎదిగిన యెవ్గెనీ ప్రిగోజిన్ తిరుగుబాటుకు తెగిస్తాడని పుతిన్ కలలో కూడా ఊహించలేదు. ఆయన తేరుకునేలోపే ప్రిగోజిన్ సేనలు రష్యాలో ఓ పట్టణాన్ని తమ అ«దీనంలోకి తీసుకోవడమే కాకుండా రాజధాని మాస్కో ముట్టడికి కదం తొక్కాయ అపారమైన సైనిక శక్తి, సాయుధ సంపత్తి కలిగి ఉన్న రష్యా ఈ కిరాయి సేనలను ఎందుకు నిలువరించలేకపోయిందో ఎవరికీ అర్థం కాని మిలియన్ డాలర్ల ప్రశ్న! తిరుగుబాటును ముందస్తుగా పసిగట్టలేనంత దుస్థితిలో రష్యా ఇంటెలిజెన్స్ వర్గాలు ఉన్నాయా? అన్న అనుమానం రాక మానదు. పుతిన్‌లో మునుపటి దూకుడు లేదనడానికి ఇది నిదర్శనం కాదా? అనవసరమైన రాజ్యకాంక్షకు దాసోహమని అందుబాటులో ఉన్న బలగాలన్నింటినీ ఉక్రెయిన్‌పై మోహరించడం తిరుగుబాటుకు కారణం కాదా? ఇంతకీ పుతిన్‌కు ఏమైంది? రాజకీయ విశ్లేషకులకు కూడా అర్థం కాని ప్రశ్న ఇదే. ఆయుధాలు ఇవ్వనందుకేనా? వంటవాడు గరిటె విసిరేసి తుపాకీ పడితే.. అతడే యెవ్గెనీ ప్రిగోజిన్ అవుతాడు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఇష్టమైన వంటకాలను రుచికరంగా వండి వడ్డించి ఆయనకు కుడిభుజంగా రూపాంతరం చెందిన ప్రిగోజిన్ హఠాత్తుగా పక్కల్లో బల్లెంలా తయారై 24 గంటలపాటు తన బాస్‌ను భయపెట్టేశాడు. పుతిన్‌కు ఇంతకాలం విధేయుడిగా మసలిన ప్రిగోజిన్‌కు ఎందుకు అంత కోపమొచి్చంది? ఉక్రెయిన్‌లో తన సారథ్యంలోని వాగ్నర్ గ్రూప్ సేనలు సాధించిన విజయాలను రష్యా సైన్యం వారి ఖాతాలో వేసుకోవడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. యుద్ధం గడుస్తున్న కొద్దీ కరిగిపోతున్న ఆయుధ నిల్వలు, మందుగుండు సామగ్రిని భర్తీ చేయకపోవడం ప్రిగోజిన్‌ను అసహనానికి గురిచేసింది. నిజానికి అతడి కోపమంతా రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగూ, చీఫ్ జనరల్ వాలెరీ గెరాసిమో పైనే. బఖ్ముత్ ప్రాంతంలో ఉక్రెయిన్ సేనలతో జరిగిన యుద్ధంతో తమకు కావాల్సిన ఆయుధాలను సరఫరా చేసేందుకు రష్యా ససేమిరా అనడమే తిరుగుబాటు అసలు కారణమని విశ్లేషకుల అంచనా. రష్యాకు ఆయువు పట్టయిన కీలక మిలటరీ స్థావరం రోస్తోవ్‌ను చేజిక్కించుకొని, అదే ఊపులో ప్రిగోజిన్ సేనలు మాస్కో వైపు కదలడంతో తిరుగుబాటు బహిర్గతమైంది. అయితే రష్యా వైమానిక దళం కమాండర్ జనరల్ సెర్గెయ్ సురోవికిన్కు ఈ తిరుగుబాటు వ్యూహం గురించి ముందే తెలుసని, అంతర్లీనంగా ఆయన మద్దతు ప్రిగోజిన్‌కు ఉందని భోగట్టా. అందుకే ఆయన మౌనంగా ఉండిపోయారని రష్యా నిఘా వర్గాల సమాచారం. రష్యా సైన్యంలో కీలక స్థానాల్లో ఉన్న మరికొందరు జనరల్స్ సైతం పుతిన్ వ్యవహార శైలి రుచించక ప్రిగోజిన్‌కు పరోక్షంగా మద్దతు ఇచ్చారన్న వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. వాగ్నర్ గ్రూప్ కిరాయి సేనల పరిస్థితేమిటి? సిరియా అంతర్యుద్ధంలో, 2014లో ఉక్రెయిన్ నుంచి క్రిమియాను హస్తగతం చేసుకొనే క్రమంలో జరిగిన పోరాటంలో క్రెమ్లిన్ తరపున ప్రిగోజిన్ పనిచేశాడు. అంతటి వీరవిధేయుడు తిరుగుబాటు నేపథ్యంలో పుతిన్‌కు బద్ధశత్రువుగా మారిపోయాడు. అయినప్పటికీ బెలారస్ అధ్యక్షుడి మధ్యవర్తిత్వంతో ప్రిగోజిన్ క్షేమంగా రష్యా పొలిమేరలు దాటి వెళ్లిపోయాడు. ఏ షరతులకు లోబడి క్రెమ్లిన్‌కు, ప్రిగోజిన్‌కు మధ్య సంధి కుదిరిందో ఇంకా బయటపడలేదు. సంధి కుదిర్చిన బెలారస్ అధ్యక్షుడు లుకòÙంకో కూడా దీనిపై ఏ ప్రకటనా చేయలేదు. పుతిన్ కూడా ఈ అంశంపై పెదవి విప్పలేదు. క్షమాభిక్ష పెడుతున్నానని మాత్రమే ప్రకటించాడు. పుతిన్ మునుపటి బలవంతుడు కాదు, బలహీనుడు అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించడం ఇక్కడ గమనార్హం. ప్రిగోజిన్ క్షమాభిక్షతో బయటపడినప్పటికీ అతడి సారథ్యంలోని వాగ్నర్ గ్రూప్ కిరాయి సైనికుల భవిష్యత్తు ఏమిటన్నది ఇంకా తేలలేదు. చెల్లాచెదురైపోతారా? లేక రష్యా సైన్యంలో విలీనమై ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగిస్తారా? అనేది వేచి చూడాల్సిందే. ఈ క్షమాభిక్ష తాత్కాలికమే! తిరుగుబాటును వెన్నుపోటుగా, దేశ ద్రోహంగా అభివరి్ణంచిన పుతిన్ అందుకు కారణమైన వాళ్ల అంతు చూస్తానంటూ బాహాటంగా ప్రకటించకపోవడం సామాన్య పౌరులకు సైతం విడ్డూరంగా అనిపించింది. బెలారస్ అధ్యక్షుడు లుకòÙంకో మధ్యవర్తిత్వంతో తిరుగుబాటు తిరుగుబాట పట్టినప్పటికీ, ప్రిగోజిన్‌కు, అతడి కిరాయి సేనలకు పుతిన్ క్షమాభిక్ష ప్రసాదించడం ఈ మొత్తం ఉదంతానికి యాంటీ క్లయిమాక్స్గానే చెప్పుకోవాలి. ఈ క్షమాభిక్ష తాత్కాలికమేనని, తిరుగుబాటుదారుల్లో ఏ ఒక్కరినీ పుతిన్ వదిలిపెట్టరనేది మరికొందరి వాదన. ఏది ఏమైనప్పటికీ పుతిన్ అధికార ప్రస్థానంలో ఇది మాయని మచ్చగానే మిగిలిపోతుంది. తిరుగుబాటు చల్లారిన తర్వాత పుతిన్ రెండుసార్లు జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆ రెండూ రికార్డు చేసి, ప్రసారం చేసినవే కావడం గమనార్హం. రష్యా ప్రజలను అవి పెద్దగా ఆకట్టుకోలేదు. ఇంత జరిగినా రష్యా ప్రజల్లో అధిక శాతం ఆయనకు మద్దతుగానే నిలవడం విశేషం. ఈ నేపథ్యంలో పుతిన్ ఉన్నట్టుండి బుధవారం జనం మధ్యలో ప్రత్యక్షమయ్యారు. వారితో కరచాలనాలు చేసి తానేమీ బెదిరిపోలేదనే సంకేతాలు పంపించారు. కొసమెరుపు.. తిరుగుబాటు జరిగి(జూన్ 23) వారం రోజులవుతోంది. 24 గంటల్లోనే ఈ తిరుగుబాటు చల్లారడం, బాధ్యుడైన ప్రిగోజిన్ స్వేచ్ఛగా రష్యా విడిచి వెళ్లడం జరిగిపోయింది. అయితే ప్రిగోజిన్ ఎక్కడ తలదాచుకున్నాడో ఎవరికీ అంతుబట్టడం లేదు. మరోవైపు తిరుగుబాటు సమాచారం ముందే తెలిసినా మౌనంగా ఉండిపోయిన రష్యా వైమానిక దళం కమాండర్ సెర్గెయ్ సురోవికిన్ కూడా మాయమైపోయాడు. ఆయన ఎక్కడున్నాడో ఇటు రష్యా నిఘా సంస్థకు గానీ, అటు ఆయన కుటుంబ సభ్యులకు గానీ సమాచారం లేదు. అవిధేయతను అణచివేయడంలో సిద్ధహస్తుడైన పుతిన్ వేట మొదలుపెట్టారా? ఏమో! ఏమైనా కావొచ్చు!! -
తిరుగుబాటు తర్వాత.. విరుచుకుపడ్డ పుతిన్
మాస్కో: తిరుగుబాటు.. తదనంతరం నాటకీయ పరిణామాల తర్వాత చల్లారిన సెగ.. ఈ క్రమంలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎక్కడా కనిపించకపోవడం సర్వత్రా చర్చకు దారి తీసింది. వేర్ ఈజ్ పుతిన్ అంటూ ఉక్రెయిన్, వెస్ట్రన్ మీడియా సంస్థలు పుతిన్‌ను ఏకిపారేశాయి. ఈ క్రమంలో సోమవారం మీడియా ముందుకు వచ్చిన ఆయన, పాశ్చాత్య దేశాలపై, ఉక్రెయిన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు నేపథ్యంలో రష్యాలో రక్తపాతం కోసం ఉక్రెయిన్, పాశ్చాత్య దేశాలు ఆశలు పెట్టుకున్నాయని, కానీ, ఆ ఆశలు గల్లంతు అయ్యాయని వ్యంగ్యంగా స్పందించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. రష్యన్లు ఒకరినొకరు చంపుకుంటుంటే.. ఉక్రెయిన్, పాశ్చాత్య మిత్రకూటమి చూసి సంతోషించాలనుకున్నాయి. కానీ, రక్తపాతం నివారించేందుకే తాము ప్రయత్నించామని పుతిన్.. ప్రపంచానికి వెల్లడించారు. రష్యా నేల రక్తంతో తడిసి ముద్దవ్వడం మాకిష్టం లేదు. అందుకే వాగ్నర్ పోరాటయోధులకు క్షమాభిక్ష ప్రసాదించాం. తిరుగుబాటు సమయంలో రష్యన్లు ప్రదర్శించిన దేశభక్తికి ప్రత్యేక కృతజ్ఞతలు అని పుతిన్ టీవీ ఛానెల్ ద్వారా ప్రసంగించారు. కీవ్‌లోని నియో నాజీలు, వాళ్లను పోషిస్తూ వస్తున్న పాశ్చాత్య మిత్రపక్షాలు.. ఇలా రష్యా శత్రువులంతా రష్యాలో సైనికులు ఒకరినొకరు చంపుకోవాలని బలంగా కోరుకున్నాయి. కానీ, భద్రతా బలగాలు ఆ పాచికను పారనివ్వలేదన్నారు. వాగ్నర్ గ్రూప్‌కు కూడా కొన్ని ఆప్షన్స్ ఇచ్చాం. తిరిగి సైన్యంతో కలిసి పని చేయడమా? బెలారస్‌కు వెళ్లిపోవడమా? రష్యాకే తిరిగి రావడమా? ఏదో ఒకటి ఎంచుకోవాలని చెప్పాం. జరిగిన పరిణామాల్ని.. ఏదో అంతర్జాతీయ పరిణామంగా చిత్రీకరించేందుకు పాశ్చాత్య మీడియా ప్రయత్నించింది. కానీ, ఇది రష్యా అంతర్గత వ్యవహారం మాత్రమేనని పుతిన్ మీడియా ద్వారా స్పష్టం చేశారు. ఇదీ చదవండి: పుతిన్‌తో పెట్టుకున్నావ్.. కిటికీల దగ్గర జాగ్రత్త! -
రష్యాలో జరిగినట్లుగా..చరిత్రలో తిరుగుబాటు చేసిన నాయకులు వీరే!
ప్రపంచమంతా ఏకతాటిపై నిలబడి యుద్దం వద్దన్నా లెక్కచేయక మంకుపట్టుతో ఉక్రెయిన్‌పై యుద్ధానికి కాలుదువ్వింది. చిన్న దేశం అయినా ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగితే ఇక అంతే అన్నారు అంతా. కానీ ఊహించని రీతిలో తనదైన వ్యూహంతో రష్యాకు చుక్కలు చూపించేలా ఉక్రెయిన్ సైన్యం యుద్ధం చేసింది. మమల్ని నిలవరించడం అసాధ్యం అని ఉక్రెయిన్ చెప్పకనే చెప్పింది రష్యాకి. ప్రతి ఉక్రెయిన్ పౌరుడు మాతృభూమి కోసం తమ చివరి రక్తపు బొట్టువరకు పోరాడి రక్షించుకుంటాం అని సగర్వంగా చెప్పి విస్మయపర్చింది. ఏడాదికిపైగా యుద్ధం జరగుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఇక రష్యాలో అంతకంతకు పెరిగిపోతున్న కోపం.. ఇక పంతం నెగ్గించుకునే వెర్రిలో ఎన్నో యుద్ధ నేరాలకు తెరతీసిందో చెప్పనవసరం లేదు. అయినా ఉక్రెయిన్‌ని నిలువరించలేక పోయింది. పైగా ఒకనొక సమయంలో సైన్యం వెనక్కి వెళ్లిపోయింది కూడా. ఇలా రసవత్తరంగా ఇరు దేశాల మధ్య యుద్ధం సాగుతున్న వేళ.. రష్యాకు ఊహించని రీతిలో షాక్ తలిలింది. ఉక్రెయిన్ యుద్ధంలోకి దింపిన కిరాయి సైన్యానికి చెందిన సంస్థ వాగ్నర్ గ్రూప్ గట్టి షాక్ ఇచ్చింది. రష్యా వెన్నులో బాకు దింపి తిరుగుబాటు జెండా ఎగరువేశారు వాగ్నర్ గ్రూప్ చీఫ్. తాను పెంచి పోషించిన కిరాయి సైన్యమే తనపై కత్తి దూయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు పుతిన్. ఇది అమానుషం, వెన్నుపోటు, అన్యాయం అంటూ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ యుద్ధంలో కీలకంగా వ్యవహరించింది ఈ కిరాయి సైన్యమే కావడంతో రష్యాకు తలనొప్పి తప్పేలాలేదు. ఇప్పటికే రష్యా ఈ యుద్ధంలో వేలాది సైనికులను పోగొట్టుకుంది. పెద్ద సంఖ్యలో సైనిక మొబైలేజేషన్ పేరిటతో రిక్రూట్మెంట్ చేసుకుంది. అలాగే ఈ కిరాయి సైన్యాన్ని కూడా దింపింది. ఒక పక్క ఆయుధాలు, సైనికుల కొరతతో సతమతమతున్న రష్యా గత్యంతరం లేక ఆ దేశ అధ్యక్షుడు పంతం నెరవేర్చడం కోసం వెనుతిరగలేక ఉక్రెయిన్‌తో పోరాడుతోంది. ఇలాంటి సమయంలో వాగ్నర్ గ్రూప్ రష్యాలో విధ్వంసం సృష్టించేందుకు రెడీ అవ్వడం పుండమీద కారం చల్లినట్టయింది. ఇదిలాఉంచితే.. రష్యాలో జరిగినట్లుగానే చరిత్రలో తిరుబాటు బాట పట్టి.. అధికారాన్ని చేజిక్కించుకున్న వాళ్లు ఉన్నారు. ఆ వివరాలు చూద్దాం.. తిరుగుబాటు జెండా ఎగరువేసి వెన్నుపోటు పొడిచిన నాటి నాయకులు.. ముమ్మర్ గడ్డాఫీ: పేద బెడౌయిన్ కుటుంబంలో జన్మించిన ముమ్మర్ గడ్డాఫీ లిబియ రాచరికం, దాని పాశ్చాత్య మద్దతుదారులను అసహ్యించుకుంటూ పెరిగాడు. సరిగ్గా ఆ రాచరికంలో పెరుగుతున్న బలహీనతను ఆసరాగా చేసుకుని అప్పటి జూనియర్ ఆర్మీ అధికారి కింగ్ ఇద్రిస్ దేశం వెలుపల ఉన్న సమయంలో తిరుగబాటు చేసి అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. అతను 42 సంవత్సారాల పాటు లిబియాను పాలించాడు. నెపోలియన్ బోనపార్టే నెపోలియన్ కూడా ఆ బాటలోనే నడిచాడు. అతను 1799లో ఫ్రెంచ్ విప్లవ సమయంలో తిరుగుబాటు బాటపట్టి ప్రముఖంగా ఎదిగాడు. ఈ క్రమంలోనే 1804 వరకు రిపబ్లిక్ మొదటి కాన్సుల్ అయ్యాడు. ఆ తర్వాత 1815 వరకు ఫ్రాన్స్ చక్రవర్తిగా పాలించాడు. ఫిడేల్ కాస్ట్రో క్యూబా విప్లవకారుడు జనరల్ ఫుల్జెన్సియో బాటిస్టాకు వ్యతిరేకంగా జూలై 26న మొదలైన గెరిల్లా యుద్ధంలో.. ఉద్యమానికి నాయకత్వం వహించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత 1959లో బాటిస్టాను పడగొట్టి.. క్యాస్ట్రో క్యూబా నాయకుడిగా అధికారాన్ని దక్కించుకున్నాడు. ఫుల్జెన్సియో బాటిస్టా క్యూబా అధ్యక్షుడిగా ఎన్నికై బాటిస్టా 1940 నుంచి 1944 వరకు పాలించాడు. అతను ప్రారంభంలో 1933 సార్జెంట్ల తిరుగుబాటులో భాగంగా అధికారంలోకి వచ్చాడు. అలాగే 1952 నుంచి 1959 వరకు క్యూబా విప్లవ సమయంలో ఓడిపోవడానికి ముందు యూఎస్ మద్దతు ఉన్న సైనిక నియంతగా కూడా పనిచేశాడు. పోల్‌పాట్ 1975లో, ఖైమర్ రూజ్ గెరిల్లాలు కంబోడియాలోని జనరల్ లోన్ నోల్ సైనిక ప్రభుత్వాన్ని పడగొట్టారు. ఆ సమయంలో పోల్ పాట్ నేతృత్వంలో ఒక మిలియన్ మందికి పైగా ప్రజలను చంపే తీవ్రవాద పాలన ప్రారభమయ్యింది. పోల్పాల్ 1976 నుంచి 1979 మధ్య కాలం వరకు ప్రధానమంత్రిగా చేశాడు. ఆ తర్వాత 1997లో తనని నాయకుడిగా తొలగించేంత వరకు కంబోడియాకు మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నాడు. వ్లాదిమిర్ లెనిన్ బోల్షెవిక్ పార్టీ నాయకుడు వ్లాదిమిర్ లెనిన్ నేతృత్వంలో వామపక్ష విప్లవకారులు రష్యాలోని అసమర్థమైన తాత్కాలిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటును ప్రారంభించారు. అతను 1917 నుంచి 1924 వరకు సోవియట్ రష్యాకు, అలాగే 1922 నుంచి 1924 వరకు సోవియట్ యూనియన్‌కు మొదటి ప్రభుత్వ అధిపతిగా పనిచేశాడు. ఫ్రాన్సిస్కో ఫ్రాంకో ఫ్రాన్సిస్కో ఫ్రాంకో స్పానిష్ అంతర్యుద్ధం సమయంలో రెండవ స్పానిష్ రిపబ్లిక్‌ను పడగొట్టడంలో జాతీయవాద దళాలకు నాయకత్వం వహించిన స్పానిష్ జనరల్. ఆ తర్వాత అతను 1939 నుంచి 1975 వరకు స్పెయిన్‌ను నియంతగా పరిపాలించాడు. కేథరీన్ ది గ్రేట్ కేథరీన్ ది గ్రేట్ 1762 నుంచి 1796 వరకు రష్యా చివరి ఎంప్రెస్ రెగ్నెంట్, అలాగే దేశంలో ఎక్కువ కాలం పాలించిన మహిళా నాయకురాలు. ఆమె భర్త పీటర్ III పదవీచ్యుతుడైన తర్వాత ఆమె అధికారంలోకి వచ్చింది. (చదవండి: రష్యాకి తగిలిన వాగ్నర్ సైన్యం షాక్‌కి..ప్రపంచ నాయకుల రియాక్షన్ ఎలా ఉందంటే..) -
ప్రవాసంలోకి ప్రిగోజిన్
మాస్కో: రష్యాలో ప్రైవేటు సైన్యం తిరుగుబాటు ముగిసింది. సైనిక నాయకత్వంపై తిరుగుబాటు బావుటా ఎగరేసి కొద్ది గంటల సేపు అల్లకల్లోలం సృష్టించిన ప్రైవేటు సైన్యం సంస్థ వాగ్నర్ చీఫ్ యెవెగినీ ప్రిగోజిన్ వెనక్కి తిరిగారు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు మద్దతుగా ఉన్న బెలారస్‌కు ప్రవాసం వెళ్లాలని ప్రయాణమయ్యారు. అయితే ఆయన బెలారస్ చేరుకున్నారో లేదో అన్న దానిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. సైనికులంతా ఎక్కడివారు అక్కడికే ఉక్రెయిన్ శిబిరాల్లోకి వెళ్లిపోవాలని ఆదేశించారు. బెలారస్ అధ్యక్షుడు మధ్యవర్తిత్వంతో ఈ సంక్షోభం టీ కప్పులో తుపానులా సమసిపోయింది. ఒప్పందం ప్రకారం ప్రిగోజిన్‌పై పెట్టిన కేసులన్నింటినీ వెనక్కి తీసుకున్నట్టు రష్యా ప్రభుత్వం ప్రకటించింది. ప్రిగోజిన్‌తో పాటు తిరుగుబాటులో పాల్గొన్న వాగ్నర్ సైనికులపై ఎలాంటి విచారణ జరపబోమని స్పష్టం చేసింది. వాగ్నర్ సైనికుల్ని కాంట్రాక్ట్ పద్ధతిలో సైన్యంలోకి తీసుకుంటామని రష్యా రక్షణ శాఖ ఆఫర్ ఇచి్చంది. రక్తపాతం వద్దు అనే.. ప్రిగోజిన్‌ను దేశద్రోహి, వెన్నుపోటుదారుడు అని అభివరి్ణంచిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అనూహ్యంగా ప్రిగోజిన్, అతని సైన్యాన్ని వదిలేయడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఒకవైపు ఉక్రెయిన్‌తో పూర్తి స్థాయి లో తలబడలేక అంతర్జాతీయంగా ఉన్న పరువును పోగొట్టుకున్న పుతిన్ ఇప్పుడు అంతర్గత సంక్షోభాలను తట్టుకునే స్థితిలో లేరని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘‘దేశంలో రక్తపాతం జరగకుండా చూడాలని, అంతర్గత పోరు కొనసాగితే ఎలాంటి ఫలితాలు వస్తాయన్న ఆందోళన కూడా ఆయనల ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో పుతిన్ ఎంత బలహీనంగా మారిపోయారంటే ఎలాంటి రిస్క్ చేయలేకపోతున్నారు’’అనే విశ్లేషణలు వినబడుతున్నాయి. మరోవైపు తిరుగుబాటు జరిగిన మర్నాడే రష్యా విదేశాంగ శాఖ ఉప మంత్రి ఆండ్రూ చైనా పర్యటనకు వెళ్లారు. చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్‌తో తాజా పరిణామాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో రష్యాకు చైనా మద్దతుగా ఉన్న విషయం తెలిసిందే. రష్యా రక్షణ వ్యవస్థపై నీలినీడలు ప్రిగోజిన్ తిరుగుబాటుతో రష్యా రక్షణ వ్యవస్థలో ఉన్న డొల్లతనం బయటపడింది. వాగ్నర్ గ్రూప్ సైనికులు రాత్రికి రాత్రి కొన్ని గంటల వ్యవధిలో రోస్తావో నగరంలోకి ఎలాంటి ఆటంకం లేకుండా ప్రవేశించారు. ప్రభుత్వ సైనికులతో ఘర్షణలు చెలరేగాయి. ఈ సమయంలో వాగ్నర్ సైనికులు చేసిన దాడుల్లో 39 మంది పైలెట్లు మరణించినట్లు తెలుస్తోంది. అమెరికాకి ముందే తెలుసు రష్యాపై ప్రిగోజిన్ తిరుగుబాటు చేస్తారని అమెరికా నిఘా సంస్థలు ముందే పసిగట్టాయని వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ కథనాలు ప్రచురించాయి. జూన్ మధ్యలో ప్రిగోజిన్ రష్యాపై తిరుగుబాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా నిఘా సంస్థలకు సమాచారం అందింది. వారం క్రితం నిర్ధారణగా తెలిసింది. తిరుగుబాటుకు ఒక్క రోజు ముందే రష్యాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయని అమెరికా ప్రభుత్వానికి నిఘా సంస్థలు నివేదిక ఇచ్చాయి. పుతిన్‌కు ఒకరోజు ముందే తిరుగుబాటు విషయం తెలుసని అమెరికా మీడియా అంటోంది. రష్యాలో పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ అధినేతలతో బైడెన్ ఫోన్లో మాట్లాడారు. తమ మద్దతు ఎప్పటికీ ఉక్రెయిన్‌కే ఉంటుందని పునరుద్ఘాటించారు. రష్యాలో తిరుగుబాటు జరిగినంత మాత్రాన తమ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండబోదని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ స్పష్టం చేశారు. -
గర్జించిన చెఫ్
ఉక్రెయిన్ సహా వివిధ దేశాల మిలటరీ ఆపరేషన్లలో రష్యా అధినేత పుతిన్‌కు అండదండగా ఉన్న ప్రైవేట్ సైనిక సంస్థ వాగ్నర్ చీఫ్ యెవ్గెనీ ప్రిగోజిన్ హఠాత్తుగా రష్యన్ సైన్యంపై తిరుగుబాటు చేయడానికి ఎన్నో కారణాలున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రలోవాగ్నర్ సంస్థకి తగిన గుర్తింపు రాలేదు. గుర్తింపు అంతా రక్షణ మంత్రి షొయిగు కొట్టేస్తున్నారని రగిలిపోతున్నారు. ఈ ఏడాది జనవరిలో ఉక్రెయిన్‌లో డొనెట్స్క్ ప్రాంతంలో సొలెడార్‌ను ఆక్రమించడంలో వాగ్నర్ సైనికులు ప్రాణాలు పణంగా పెడితే రష్యా రక్షణ శాఖ దానిని తమ ప్రతిభగా ప్రచారం చేసుకోవడం ప్రిగోజిన్ సహించలేకపోయారు. ఉక్రెయిన్‌లో ఇతర నగరాలు స్వా«దీనం చేసుకోవడానికి తాను సైన్యాన్ని సిద్ధం చేసినప్పటికీ రష్యా టాప్ జనరల్ వలెరి గెరసిమోవ్ మారణాయుధాల్ని సరఫరా చేయడంలో విఫలం కావడం కూడా ఆయనని అసహనానికి లోను చేసింది. రక్షణ మంత్రి షొయిగు ఆదేశాల మేరకు వాగ్నర్ సంస్థ సైనిక శిబిరాలపై జరిగిన దాడుల్లో వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో తిరుగుబాటుకు సిద్ధమయ్యానని ప్రిగోజిన్ విడుదల చేసిన వీడియోల్లో ఆగ్రహంతో ఊగిపోతూ చెబుతున్నారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని రష్యా సమరి్థంచుకునే స్థితిలో లేదని అందుకే మిలటరీ నాయకత్వాన్ని కూల్చేస్తామని వారి్నంగ్ ఇచ్చారు. ‘యుద్ధం అవసరం ఉంది. అందుకే సెర్గీ మార్షల్ అయ్యారు. ఆయన రెండో హీరోగా పతకాలు అందుకోవచ్చు. కానీ ఉక్రెయిన్ నిస్సైనీకరణ కు యుద్ధం అవసరం లేదు’అని ప్రిగోజిన్ చెబుతున్నారు. తాను చేస్తున్నది సైనిక తిరుగుబాటు కాదు, న్యాయ పోరాటమన్నది ప్రిగోజిన్ వాదనగా ఉంది. ఎవరీ ప్రిగోజిన్? ఒకప్పుడు అధ్యక్షుడు పుతిన్ దగ్గర చెఫ్. విదేశీ ప్రముఖులు ఎవరైనా వస్తే స్వయంగా గరిటె పట్టి వండి వడ్డించేవారు. ఇప్పుడు తుపాకీ పట్టుకొని ఎదురు తిరుగుతున్నారు. ఒక రెస్టారెంట్‌తో మొదలైన ఆయన ప్రయాణం ఒక దేశంపైనే తిరుగుబాటు చేసే స్థాయికి ఎదిగింది. ► 1961 జూన్ 1న లెనిన్గ్రాడ్ (ప్రస్తుతం సెయింట్ పీటర్స్బర్గ్)లో జని్మంచారు. ► టీనేజీలోనే దొంగతనాలు, దోపిడీలు చేసి 13 ఏళ్లపాటు జైల్లో ఉండి 1990లో బయటకు వచ్చాడు. ► జైలు నుంచి బయటకి వచ్చాక ఫుడ్ బిజినెస్ మొదలు పెట్టారు. ధనికులు ఉండే ప్రాంతంలో ఒక రెస్టారెంట్ ప్రారంభించారు. ► సంపన్నులతో పరిచయాలు పెంచుకొని వ్యాపారంలో ఎదిగారు. ► ప్రిగోజిన్‌కు చెందిన ఒక రెస్టారెంట్‌కు పుతిన్ వస్తూ ఉండడంతో ఆయనతో పరిచయమైంది. ఆ తర్వాత ప్రొగోజిన్ జీవితమే మారిపోయింది. ► అప్పట్లో రష్యా ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పుతిన్ ద్వారా రష్యా ప్రభుత్వం ఇచ్చే అధికారిక విందుల్ని ఏర్పాటు చేసే కాంట్రాక్ట్ లభించింది. ► 2001లో పుతిన్ అధ్యక్షుడయ్యాక ప్రభుత్వానికి చెందిన సైనిక, పాఠశాలల్లో ఫుడ్ కాంట్రాక్ట్‌లు కూడా ప్రిగోజిన్కే దక్కాయి. అధికారంలో ఉన్న వారితో ఎలా మెలగాలో ప్రిగోజిన్‌కు వెన్నతో పెట్టిన విద్య. ► 2006లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ రష్యాలో పర్యటించి విందుని ఆస్వాదించాక ప్రిగోజిన్‌ను ‘పుతిన్ చెఫ్’అని పిలిచారు. అప్పట్నుంచి అదే పేరు స్థిరపడింది. ► రష్యా సందర్శనకు విదేశీ ప్రముఖులు ఎవరు వచి్చనా పుతిన్‌తో వారు దిగిన ఫొటోల్లో ప్రొగోజిన్ తప్పనిసరిగా కనిపించేవారు. ఆతిథ్య రంగంలో కోట్లాది రూపాయల కాంట్రాక్ట్‌లు అతని సొంతమయ్యాయి. ► 2012లో ప్రభుత్వ స్కూళ్లకు కేటరింగ్ నడపడం కోసమే 105 కోట్ల రూబుల్స్ కాంట్రాక్ట్ దక్కింది. ► అలా వచి్చన డబ్బులతో ప్రిగోజిన్ వాగ్నర్ అనే కిరాయి సైన్యాన్ని ఏర్పాటు చేశారు. ► మొదట్లో వాగ్నర్ సంస్థ తనదేనని ఆయన బాహాటంగా చెప్పుకోలేదు. చిట్టచివరికి 2021లో వాగ్నర్ సంస్థ తనదేనని అంగీకరించారు. ► 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కి అనుకూలంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయించింది ప్రొగోజిన్ అనే అనుమానాలున్నాయి. అప్పట్నుంచి అమెరికా అతనిపై నిషేధం విధించింది. వాగ్నర్ సంస్థ ఏం చేస్తుందంటే..? ► 2014లో క్రిమియాని ఆక్రమించాలని పుతిన్ ప్రణాళికలు సిద్ధం చేసినప్పుడు యెవ్గెనీ ప్రిగోజిన్‌తో తానే ఈ సంస్థను ఏర్పాటు చేయించారన్న ప్రచారమైతే ఉంది. ► క్రిమియా ఆక్రమణలో తమ చేతికి మట్టి అంటకుండా ఉండడానికే ఈ ప్రైవేటు సైన్యాన్ని పుతిన్ రంగంలోకి దింపారన్న ప్రచారం ఉంది. ► రష్యాలో ప్రైవేటు సైన్యం చట్ట విరుద్ధం. అయినప్పటికీ రష్యా రక్షణ శాఖ కిరాయి సైన్యాన్ని చూసి చూడనట్టుగా వదిలేసేది. ► క్రిమియా తర్వాత తూర్పు ఉక్రెయిన్‌లో దాన్బాస్లో రష్యా అనుకూల వర్గానికి మద్దతుగా పని చేసి ఆ ఆపరేషన్‌లో విజయం సాధించింది.అలా వాగ్నర్ కార్యకలాపాలు విస్తరించాయి. ► సిరియాలో రష్యా అనుకూల బషర్ అల్ అసాద్ ప్రభుత్వాన్ని కాపాడడంలో కీలకంగా వ్యవహరించింది. ► లిబియా, మొజాంబిక్, మాలి, సూడాన్, ది సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, వెనెజులా ఇలా ఎక్కడ ఘర్షణలు అట్టుడికినా రష్యా జోక్యం ఉంటే అక్కడ తప్పకుండా వాగ్నర్ గ్రూప్ ప్రత్యక్షమయ్యేది. ► ఓ రకంగా వాగ్నర్ పుతిన్‌కు చెందిన కిరాయి సైన్య#గామారింది. ► ఈ గ్రూపులో మాజీ సైనికులే సభ్యులుగా ఉంటారు. బ్లూమ్‌బర్గ్ సంస్థ లెక్కల ప్రకారం ఈ గ్రూపులో 60 వేల మంది సైనికులు ఉన్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో కీలకం ఏడాదిన్నర క్రితం ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలు పెట్టినప్పట్నుంచి వార్నర్ సైనికులే కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఉక్రెయిన్‌పై రెండు వారాల్లో నెగ్గేస్తామన్న పుతిన్ భ్రమలు తొలగిపోవడంతో వాగ్నర్ సైనికులు మరింత దూకుడుగా ముందుకెళ్లారు. ప్రొగోజిన్ వారు తన సైనికులేనంటూ బహిరంగంగా అంగీకరించడమే కాకుండా యుద్ధాన్ని ముమ్మరం చేశారు. ౖ ఖైదీలను సైనికులుగా చేర్చుకున్నారు. ఈ యుద్ధంలో సంస్థకు చెందిన 50 వేల మంది పాల్గొన్నారు. కీలక నగరాల స్వా«దీనంలో వీరే ముందున్నారు. బఖ్ముత్æ కోసం జరిగిన పోరులో 20 వేల మంది మరణించారు. – సాక్షి నేషనల్ డెస్క్ -
రష్యాలో ప్రిగోజిన్ తిరుగుబాటుపై ఉక్రెయిన్ అధ్యక్షుడు ఏమన్నారంటే..?
యెవనిన్ ప్రిగోజిన్ నాయకత్వంలోని వాగ్నర్ సైన్యం తిరుగుబాటుతో రష్యా కష్టకాలంలో పడింది. ప్రిగోజిన్ అరెస్టును ఇప్పటికే ప్రకటించిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. అతన్ని దేశ ద్రోహిగా సంబోధించాడు. దీనిపై స్పందించిన ప్రిగోజిన్.. తాను నిజమైన దేశ భక్తుడనని చెప్పుకున్నారు. తన సైన్యం తిరుగుబాటుతోనే దేశంలో ప్రజా ఉద్యమం మొదలైందని చెప్పారు. అయితే.. రష్యాలో మొదలైన ఈ అంతర్యుద్ధాన్ని ఉద్దేశించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్పందించారు. చెడును కోరేవారు అందులో అంతమవుతారని అన్నారు. కాగా.. వాగ్నర్ సైన్యం తిరుగుబాటుతో ఇన్ని రోజులు ఉక్రెయిన్‌లో మోగిన బాంబుల మోతలు ఇక రష్యాలో వినిపిస్తున్నాయి. Prigozhin went on to say that Wagner forces fought in Africa and Ukraine while the Russian military leadership embezzled ammunition, weapons, and money needed by forces on the ground for their own gain. — The Kyiv Independent (@KyivIndependent) June 24, 2023 రష్యా సైన్యం వాగ్నర్ సైన్యం తిరుగుబాటును అణిచివేయడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో వాగ్నర్ సేన లక్ష్యంతో వోరోనెజ్ సమీపంలోని హైవేపై మిలిటరీ బాంబుల వర్షం కురిపించి. ఆ దృశ్యాలు స్థానికంగా భయానక వాతావరణాన్ని సృష్టించాయి. The moment of the explosion on the highway near #Voronezh. https://t.co/Fp9RJR9rey pic.twitter.com/B1Ieuh9yF2 — NEXTA (@nexta_tv) June 24, 2023 ప్రిగోజిన్ నాయకత్వంలోని వాగ్నర్ ప్రైవేటు సైన్యం ఇప్పటికే రస్తొవ్ దక్షిణ మిలటరీ ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నట్లు, అంతర్జాతీయ వ్యవహారాల ప్రధాన కార్యాలయాన్ని ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు తెలిపింది. కానీ అధికారంగా రష్యా సైన్యం ధ్రువీకరించలేదు. జిల్లా మిలిటరీ కార్యాలయంపై దాడి జరిగిన సమయంలో స్థానిక ప్రజలు పరుగులు పెడుతున్న దృశ్యాలు భయానక వాతావరణాన్ని సృష్టించాయి. There was an explosion near the headquarters of the Southern Military District in Rostov-on-Don - RT propaganda correspondent from the scene. pic.twitter.com/jNQdGkota0 — NEXTA (@nexta_tv) June 24, 2023 రోస్తోవ్ నగరాన్ని ఆక్రమించామని వాగ్నర్ సేన ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఓ పెద్ద ఆయిల్ స్థావరంపై దాడి జరిగింది. చమురు డిపోలో మంటలు చెలరేగగా.. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. వీటిని అదుపు చేయడానికి అగ్ని మాపక సిబ్బంది రంగంలోకి దిగారు. An oil depot near #Voronezh is on fire, according to local media outlets. pic.twitter.com/itgHw2c5zc — NEXTA (@nexta_tv) June 24, 2023 ఇదీ చదవండి: రష్యాలో సైన్యంపై పుతిన్ సన్నిహితుడి తిరుగుబాటు.. పాతిక వేలమంది చావడానికి రెడీ! -
ప్రిగోజిన్ ద్రోహి.. వెన్నుపోటు పొడిచాడు: పుతిన్
క్రెమ్లిన్: మాస్కో సహా రష్యా కీలక నగరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నవేళ.. వాగ్నర్ సైన్యం చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్‌పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మండిపడ్డాడు. తాజా పరిణామాల నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన పుతిన్.. ప్రిగోజిన్ రష్యాకు వెన్నుపోటు పొడిచాడని, అలాంటి ద్రోహులు ఫలితం అనుభవించక తప్పదని మండిపడ్డారు. రష్యా మిలిటరీపై ప్రిగోజిన్ తిరుగుబాటు ప్రకటన నేపథ్యంలో రష్యా రాజధాని మాస్కో సహా ప్రధాన నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది క్రెమ్లిన్. ఈ క్రమంలో అంతర్యుద్ధం తప్పదన్న ఊహాగానాల నడమ.. పుతిన్ శనివారం మధ్యాహ్నం మీడియా ముందుకు వచ్చారు. రష్యాలో అంతర్యుద్ధం జరగకుండా శాయశక్తులా అడ్డుకుంటానన్న ఆయన.. ప్రజలను ఉద్దేశించి ఐక్యత పిలుపు ఇచ్చారు పుతిన్. #UPDATE Russian President Vladimir Putin on Saturday acknowledged a "difficult" situation was unfolding in the southern city of Rostov-on-Don, where the Wagner mercenary group has taken control of key military sites in an effort to oust Russian military's top brass. pic.twitter.com/rC9QJXsGKB — AFP News Agency (@AFP) June 24, 2023 వాగ్నర్ తిరుగుబాటును రష్యాకు ఘోరమైన ముప్పుగా అభివర్ణించిన పుతిన్.. వ్యక్తిగత ఉద్దేశాలతోనే వాగ్నర్ చీఫ్ ద్రోహానికి పాల్పడ్డాడని పుతిన్ మండిపడ్డారు. రష్యా దక్షిణ నగరం రోస్తోవ్‌లో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగానే ఉందని.. పరిస్థితిని అదుపులోకి తెస్తామనే ఆశాభావం వ్యక్తం చేశారు. రష్యా వీపులో ప్రిగోజిన్ కత్తి దింపి వెన్నుపోటు పొడిచి ద్రోహానికి పాల్పడ్డాడని, దానిని శిక్ష అనుభవించక తప్పదని పుతిన్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. వాగ్నర్ పేరిట ప్రైవేట్ సైన్యం నడిపిస్తున్న ప్రిగోజిన్, గతంలో పుతిన్‌కు చాలా దగ్గరగా ఉండేవారు. అయితే గత కొంతకాలంగా రష్యా రక్షణతో ఆయనకు పడడం లేదు. ఈ తరుణంలోనే తమ గ్రూప్‌ను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులకు రష్యా మిలిటరీ పాల్పడుతోందని ఆరోపిస్తూ తిరుగుబాటు జెండా ఎగరేశారాయన. ఇప్పటికే పాతిక వేలమందితో కూడిన ఆయన సైన్యం రోస్తోవ్‌లో సెటిల్ అయినట్లు తెలుస్తోంది. #BREAKING Wagner chief 'betrayed' Russia out of 'personal ambition': Putin pic.twitter.com/pRzqpxSKcj — AFP News Agency (@AFP) June 24, 2023 ఇదీ చదవండి: ప్రిగోజిన్ ఒక దొంగ.. రోడ్ల మీద అమ్ముకుంటూ.. ఇప్పుడు ఇలా -
కాంగ్రెస్‌కు మరో షాక్.. రాజస్థాన్ ఇన్ఛార్జ్ రాజీనామా
జైపూర్: కాంగ్రెస్ పార్టీకి మరో సీనియర్ నేత షాక్ ఇచ్చారు. రాజస్థాన్ ఇన్ఛార్జ్ అజయ్ మాకెన్ తన పదవికి రాజీనామా చేశారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర రాష్ట్రంలోకి ప్రవేశించడానికి సరిగ్గా రెండు వారాల ముందే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అజయ్ మాకెన్ రాజీనామాతో పార్టీకి కొత్త చిక్కులు వచ్చిపడినట్లయింది. అయితే మాకెన్ రాజీనామాకు బలమైన కారణమే ఉన్నట్లు సన్నిహితులు తెలిపారు. సెప్టెంబర్‌లో సీఎం అశోక్ గహ్లోత్ వర్గానికి చెందిన నేతలు కొందరు పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న గహ్లోత్‌ను సీఎం పదవి నుంచి తప్పిస్తే అంగీకరించే ప్రసక్తే లేదని వారు తిరుగుబావుటా ఎగురవేశారు. దాదాపు 90 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని స్పీకర్ దగ్గరకు వెళ్లడం అప్పట్లో కలకలం రేపింది. వీరి కారణంగానే అశోక్ గహ్లోత్ కూడా కాంగ్రెస్ అధ్యక్ష బరి నుంచి తప్పుకున్నారు. తన వర్గం ఎమ్మెల్యేలు చేసిన పనికి క్షమాపణలు కూడా చెప్పారు. అయితే రాజస్థాన్ కాంగ్రెస్ తిరుగుబాటు వ్యవహారంలో ముఖ్యంగా ముగ్గురు నేతలు శాంతి ధరివాల్, మహేశ్ జోషి, ధర్మేంద్ర రాఠోడ్ కీలకంగా వ్యవహరించారు. వీరే సెప్టెంబర్ 25న కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశానికి డుమ్మాకొట్టి తిరుగుబాటు ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విషయంపైనే కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ ఈ ముగ్గురికి నోటీసులు కూడా పంపింది. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న అజయ్ మాకెన్ కూడా పార్టీ అధిష్ఠానికి ఇప్పటికే స్పష్టం చేశారు. చర్యలు లేకపోవడంతో.. కానీ ఇన్ని రోజులు గడుస్తున్నా.. ఆ ముగ్గురు నేతలపై పార్టీ అధిష్ఠానం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అజయ్‌మాకెన్ కలత చెందారని ఆయన సన్నిహితులు చెప్పారు. ఇక ఇన్‌ఛార్జ్‌గా ఉండి ఏం ప్రయోజనం అని భావించి రాజీనామా చేసినట్లు చెప్పారు. నవంబర్ 8నే రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంపారని వెల్లడించారు. అయితే ఖర్గే ఆయన రాజీనామాను అమోదించలేదని, పదవిలో కొనసాగాలని సూచించినట్లు తెలుస్తోంది. అనంతరం అజయ్ మాకెన్ వారం రోజులు వేచిచూసినప్పటికీ గహ్లోత్ వర్గం ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో ఆయన పదవి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సచిన్ పైలట్ కూడా రెండు వారాల క్రితమే రాజస్థాన్ కాంగ్రెస్‌లో అనిశ్చితికి తెరదించాలని డిమాండ్ చేశారు. పార్టీపై తిరుగుబావుటా ఎగురవేసిన గహ్లోత్ వర్గం ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కానీ అధిష్ఠానం నుంచి ఆ దిశగా ఎలాంటి అడుగు పడకపోవడంతోనే అజయ్ మాకెన్ రాజీనామా చేశారు. ఈ కారణంగానే ఆయన రాహుల్ భారత్ జోడో యాత్రకు సంబంధించిన సమీక్ష సమావేశాలకు కూడా దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: గుజరాత్లో ట్విస్ట్.. నామినేషన్ వేసేందుకు వెళ్లిన అభ్యర్థి కిడ్నాప్.. ఆ తర్వాత.. -
సైనికుల చేతిలో బుర్కినా ప్రెసిడెంట్ బందీ!
ఉగడుగు: బుర్కినా ఫాసో అధ్యక్షుడు రోచ్ మార్క్ క్రిస్టియన్ కబోరెను బంధించామని ఆ దేశంలో తిరుగుబాటు చేసిన సైనికులు ప్రకటించారు. అధ్యక్షుడిని ఎక్కడ దాచింది వెల్లడించలేదు. ఆదివారం సైనిక శిబిరాల వద్ద మొదలైన కాల్పుల కలకలం సోమవారం కూడా కొనసాగింది. అధ్యక్ష భవనం వద్ద చిన్నపాటి యుద్దం జరిగింది. రాజధానిలో తిరుగబాటు సైనికులు గస్తీ కాస్తున్నారు. తొలుత ఇది తిరుగుబాటు కాదని ఆ దేశ ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. కానీ చివరకు సైనికుల చేతికి ప్రెసిడెంటే బందీగా చిక్కారు. 2015 నుంచి బుర్కినాకు కబోరె అధిపతిగా ఉన్నారు. దేశంలో జరుగుతున్న ఉగ్రచర్యలతో మిలటరీ తీవ్రంగా నష్టపోతోంది. తమకు సరైన సదుపాయాలు లేవని సైనికులు అసంతృప్తిగా ఉన్నారు. ఇది చివరకు తిరుగుబాటకు దారితీసింది. తిరుగుబాటుకు ప్రజల్లో కూడా మద్దతు ఉన్నట్లు కనిపిస్తోందని రాజకీయ నిపుణులు తెలిపారు. -
కరీంనగర్ కాషాయ దళంలో కలవరం..
-
పంజాబ్ కాంగ్రెస్‌లో మళ్లీ సంక్షోభం.. సీఎం అమరీందర్‌పై తిరుగుబావుటా..
చండీగఢ్: పంజాబ్‌లో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. పంజాబ్‌లో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఒంటరవుతున్నట్లు తెలుస్తోంది. తాగాజా పంజాబ్ కాంగ్రెస్‌లో మళ్లీ సంక్షోభం తలెత్తింది. సీఎం అమరీందర్‌పై నమ్మకం పోయిందంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు తిరుగుబాటు ఎగరవేశారు. దీనిపై చర్చించడానికి నలుగురు మంత్రులు, 30 మంది ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. చదవండి: సోనియమ్మకు థాంక్స్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈ విషయంపై అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు బయల్దేరినట్లు సమాచారం. కాగా ఇటీవల పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన 62 మంది ఎమ్మెల్యేలు హాజరైన విషయం తెలిసిందే. దీంతో ముఖ్యమంత్రి బలం తగ్గినట్టు అప్పట్లో గుసగుసలు వినిపించాయి. చదవండి: వివాదంలో బీజేపీ నేత..ఇంటిలో అర్ధనగ్నంగా కూర్చుని -
పోరుబాటలో..!
కాబూల్: అందరినీ భయపెట్టే తాలిబన్లకే వణుకుపుట్టించే పంజ్‌షీర్ లోయ కేంద్రంగా తాలిబన్లపై తిరుగుబాటు సన్నాహాలు జరుగుతున్నాయి. కాబూల్‌కు ఉత్తరంగా ఉన్న మూడు నగరాలను స్వాధీనం చేసుకున్నామని, ఈ ప్రక్రియలో 60 మంది తాలిబన్ సైనికులు గాయపడడం లేదా మరణించడం జరిగిందని అఫ్గాన్ తిరుగుబాటు వర్గాలు ప్రకటించాయి. అఫ్గాన్ మాజీ రక్షణ మంత్రి జనరల్ బిస్మిల్లా మొహ్మది ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ‘‘తిరుగుబాటు బతికే ఉంది’’ అని, పుల్ ఎ హెసర్, డె ఎ సలాహ్, బను జిల్లాల్లో పోరాటం చేస్తున్నామని పంజ్‌షీర్ ప్రావిన్స్ పేరిట ఉన్న ట్విట్టర్ అకౌంట్ ప్రకటించింది. అఫ్గాన్ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న తాలిబన్లకు పంజ్‌షీర్ ఎప్పుడూ కొరకరాని కొయ్యగానే ఉంటోంది. ప్రస్తుతం ఇక్కడ తాలిబన్ వ్యతిరేక శక్తులు ఏకమౌతున్నట్లు తెలుస్తోంది. బను, హెసర్, సలాహ్ ప్రాంతాలు తాలిబన్ల చేతిలో నుంచి జారిపోయినట్లు తెలిసిందని ఇరాన్ జర్నలిస్టు తాజుద్దీన్ సౌరోష్ చెప్పారు. ఏమిటీ పంజ్‌షీర్? హిందూకుష్ పర్వత శ్రేణుల్లో కాబుల్‌కు ఉత్తరంగా పంజ్‌షీర్ ప్రావిన్స్ ఉంది. ఈ లోయ ప్రాంతంలో తజిక్ జాతికి చెందిన ప్రజలే అత్యధికం. పంజ్‌షీర్ అంటే సంస్కృతంలో ఐదు సింహాలు అని అర్థం. 11వ శతాబ్దంలో ఒకమారు వచ్చిన వరద నీటిని అడ్డుకొనేందుకు ఐదుగురు సోదరులు ప్రయత్నించడంతో ఈ ప్రాంతానికి పంజ్‌షీర్ అని పేరువచ్చింది. పేరుకు తగ్గట్టే అక్కడి ప్రజల్లో తెగింపు చాలా ఎక్కువ. గతంలో తాలిబన్ల పాలనను తుదముట్టించడంలోనూ ఈ ప్రాంతానిదే కీలకపాత్ర. అక్కడి ప్రజలను తాలిబన్లకు వ్యతిరేకంగా నడిపించడంలో అహ్మద్ షా మసూద్ కీలక పాత్ర పోషించారు. 1970–80లలో సోవియట్ రష్యా దండయాత్రను తిప్పికొట్టడంలో మసూద్ ముందున్నారు. తాలిబన్లు, ఆల్‌ఖైదాలు కలిసి నకిలీ విలేకరులుగా వచ్చి 2001 సెప్టెంబర్ 9న జరిపిన ఆత్మాహుతి దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. -
‘ఎల్జేపీ’లో తిరుగుబాటు
న్యూఢిల్లీ/పట్నా: బిహార్ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. దివంగత రామ్‌విలాస్ పాశ్వాన్ స్థాపించిన ‘లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ)’లో తిరుగుబాటు తలెత్తింది. పార్టీకి చెందిన ఆరుగురు ఎంపీల్లో ఐదుగురు పార్టీ నేత, రామ్‌విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్‌కు వ్యతిరేకంగా చేతులు కలిపారు. చిరాగ్ పాశ్వాన్ స్థానంలో ఆయన బాబాయి, హజీపూర్ ఎంపీ పశుపతి కుమార్ పరాస్‌ను పార్టీ నేతగా ఎన్నుకున్నారు. ఉపనేతగా మరో ఎంపీ మెహబూబ్ అలీ కైజర్‌ను ఎన్నుకున్నారు. లోక్‌సభలో ఎల్జేపీ నేతగా పరాస్‌ను ఎన్నుకున్నట్లు ఆదివారం రాత్రి వారు స్పీకర్ ఓం బిర్లాను స్వయంగా కలసి తెలియజేశారు. పరాస్‌ను ఎల్జేపీ పక్షనేతగా గుర్తిస్తూ సోమవారం లోక్‌సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్‌ను విడుదలచేసింది. పార్టీని తాను విచ్ఛిన్నం చేయలేదని, నిజానికి పార్టీని కాపాడానని పార్టీలో తిరుగుబాటు అనంతరం సోమవారం పశుపతి çపరాస్ వ్యాఖ్యానించారు. చిరాగ్ పాశ్వాన్‌కు, ఎల్జేపీకి ప్రత్యర్థి అయిన జేడీయూ నేత, సీఎం నితీశ్ కుమార్‌ను గొప్ప నాయకుడు, ప్రగతిశీల ముఖ్యమంత్రి అని పరాస్ ప్రశంసించారు. ఈ తిరుగుబాటు వెనుక ఆయన లేరన్నారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలో ఎల్జేపీ పోరాడిన తీరుపై 99% కార్యకర్తల్లో అసంతృప్తి ఉందన్నారు. పార్టీలోని సంఘ వ్యతిరేక శక్తుల కారణంగా పార్టీ నాశనమయ్యే స్థితికి చేరుకుందన్నారు. ఐదుగురు ఎంపీల తమ బృందం ఎన్డీయేలో కొనసాగుతుందన్నారు. ఈ తిరుగుబాటుపై చిరాగ్ పాశ్వాన్ స్పందించలేదు. బాబాయి నివాసం వద్ద గంటన్నర నిరీక్షణ! తన బాబాయిని కలుసుకునేందుకు చిరాగ్ సోమవారం స్వయంగా ఢిల్లీలోని ఆయన ఇంటికి వెళ్లారు. చిరాగ్ సోదరుడు (కజిన్), మరో ఎంపీ ప్రిన్స్ రాజ్ కూడా అదే నివాసంలో ఉంటున్నారు. అక్కడ గంటన్నర పాటు వేచిచూసిన తరువాత చిరాగ్ పాశ్వాన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అక్కడ చిరాగ్‌తో ఆయన బాబాయి పరాస్ కానీ, సోదరుడు ప్రిన్స్ రాజ్ కానీ కలవలేదని సమాచారం. ఆ సమయంలో పరాస్, ప్రిన్స్‌రాజ్ అక్కడ లేరని ఆ తరువాత అక్కడి సిబ్బంది తెలిపారు. చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంపై చాన్నాళ్లుగా ఎంపీలు పరస్, ప్రిన్స్ రాజ్, చందన్ సింగ్, వీణాదేవి, మెహబూబ్ అలీ కైజర్లు అసంతృప్తితో ఉన్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్‌కు వ్యతిరేకంగా నిలవడం రాష్ట్రంలో ఎల్జేపీని బాగా దెబ్బతీసిందని వారు విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. 2020లో తండ్రి రామ్‌విలాస్ పాశ్వాన్ హఠాన్మరణం అనంతరం పార్టీ అధ్యక్షుడిగా నాయకత్వ బాధ్యతలు చేపట్టిన చిరాగ్ పాశ్వాన్‌కు ప్రస్తుతం ఒంటరిగా మిగిలిపోయే పరిస్థితి నెలకొంది. పరాస్ వర్గం పార్టీ అధ్యక్ష పదవి నుంచి కూడా పాశ్వాన్‌ను తొలగించనున్నారని, ఆ తరువాత ఎన్నికల సంఘాన్ని కలిసి నిజమైన ఎల్జేపీ తమదేనని గుర్తించాలని విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం. త్వరలో కేంద్ర మంత్రివర్గంలోకి చిరాగ్ పాశ్వాన్‌ను తీసుకోనున్నారనే వార్తల నేపథ్యంలోనే, జేడీయూ సూచనల మేరకే ఈ తిరుగుబాటు జరిగిందని చిరాగ్ సన్నిహితులు ఆరోపించారు. కాగా, ఇది ఎల్జేపీ అంతర్గత వ్యవహారమని బీజేపీ వ్యాఖ్యానించింది. ఎన్డీయే నుంచి విడిపోయి అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినప్పటికీ.. చిరాగ్ పాశ్వాన్ ఎన్నడూ బీజేపీని, ప్రధాని మోదీని విమర్శించలేదు. -
Myanmar: మా పౌరులు మరణిస్తున్నారు..దయచేసి స్పందించండి
యాంగాన్: మయన్మార్‌లో సైన్యం అక్కడి ప్రజాస్వామిక ప్రభుత్వంపై ఫిబ్రవరిలో తిరుగుబావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. ఆంగ్ సాన్ సూచీతో పాటు పలువురు నేతలను నిర్బంధంలోకి తీసుకొని సైనిక పాలన ప్రకటించింది. సూచీపై పలు ఆరోపణలు చేస్తూ కేసులు పెట్టించింది. నాటి నుంచి ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. మయన్మార్‌లో జరుగుతున్న పరిణామాలపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. సాయుధ బలగాల దినోత్సవం రోజే మయన్మార్ సైన్యం రెచ్చిపోయింది. సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిపై తూటాల వర్షం కురిపించింది. రక్తపాతం సృష్టించింది. మయన్మార్ చరిత్రలోనే ఇది చీకటి రోజని ప్రజాస్వామ్య అనుకూలవాదులు, మానవతావాదులు పేర్కొన్నారు. మయన్మార్‌లోని ప్రముఖులు, నటులు, సోషల్ మీడియాను ప్రభావితం చేసేవారు, కీడాకారులు సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా తమ నిరసనను తెలిపారు. తాజాగా మయన్మార్ మిస్ యూనివర్స్ పోటీదారు తుజార్ వింట్ ఎల్విన్ ఆదివారం పోటీలో మాట్లాడుతూ.. మిలిటరీ తిరుగుబాటుకు వ్యతిరేకంగా స్పందించాలని ప్రపంచ దేశాలను కోరారు. "మయన్మార్‌లో జరిగే హింస గురించి మాట్లాడాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. సైన్యం తిరుగుబాటు చేసినప్పటి నుంచి దీనిపై స్పందిస్తున్నాను. మా ప్రజలు ప్రతిరోజూ మిలిటరీ దళాల కాల్పుల్లో చనిపోతున్నారు" అంటూ ఆమె బావోద్వేగానికి గురయ్యారు. ఫ్లోరిడాలోని హాలీవుడ్‌లోని సెమినోల్ హార్డ్ రాక్ హోటల్ & క్యాసినోలో జరిగిన ఫైనల్స్‌లో ఆమె కనిపించారు. కాగా తుజార్ వింట్ ఎల్విన్ మిస్ యూనివర్స్ పోటీ చివరి రౌండ్లో పాల్గొనలేదు. కానీ ఆమె ధరించిన ఆ దేశ జాతీయ దుస్తులకు గాను "బెస్ట్ నేషనల్ అవార్డ్"ను గెలుచుకుంది. ఆమె ఆ దుస్తులతో కవాతు చేస్తూ "మయన్మార్ కోసం ప్రార్థించండి" అనే ఒక ప్లకార్డ్ ప్రదర్శించారు. ఇక ఇప్పటివరకు 790 మంది భద్రతా దళాల కాల్లుల్లో మరణించగా.. 5,000 మందిని అరెస్టు చేసినట్లు, 4,000 మంది ప్రముఖులను అదుపులోకి తీసుకున్నట్లు అసిస్టెన్స్ అసోసియేషన్ ఫర్ పొలిటికల్ ఖైదీల కార్యకర్త బృందం తెలిపింది. (చదవండి: Myanmar Beauty Queen: దేశమాత స్వేచ్ఛ కోరి) -
బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు..
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీలో అంతర్గత రాజకీయాలు, అంతర్గత కుమ్ములాటలు సందర్భోచితంగా బహిర్గతమవుతుంటాయి. పశ్చిమ బెంగాల్లో మమతాబెనర్జీ వంటి మహిళానేతను ధీటుగా ఎదుర్కొని దేశవ్యాప్తంగా తమ సత్తా చాటుకోవాలని ఉవ్విళూరుతున్న కమలదళ పెద్దలకు, సొంత పార్టీలోని ఇతర రాష్ట్రాల మహిళానేతల ప్రణాళికలు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. 2018 ఎన్నికల్లో ఓటమి తర్వాత అధిష్టాన నిర్ణయాలతో రాజస్తాన్ రాజకీయాల్లో నిశ్శబ్దంగా ఉన్న వసుంధరా రాజే మరోసారి యాక్టివ్ అయ్యేందుకు ప్రణాళికలు సిద్ధంచేసుకుంటున్నారు. రాజస్తాన్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ గడువు ఉన్నప్పటికీ పార్టీలో మరోసారి తన పట్టును పెంచుకొనేందుకు, తన బలాన్ని హైకమాండ్ ముందు నిరూపించుకొనేందుకు వసుంధరారాజే ఏ అవకాశాన్ని వదులుకొనేందుకు సిద్ధంగా లేనట్లు కనిపిస్తున్నారు. అందులో భాగంగానే మార్చి 8న తన పుట్టినరోజున రాష్ట్రవ్యాప్తంగా దేవ్ దర్శన్ యాత్రను ప్రారంభించి తమ బలాన్ని నిరూపించుకోవాలని వసుంధరా రాజే సింధియా వర్గం నిర్ణయించింది. దీంతో రాబోయే రోజుల్లో రాజస్తాన్ బీజేపీలో పైచేయి సాధించే గొడవ తీవ్రతరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మౌన ముద్రలో వసుంధర.. ఇటీవల రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ వైఫల్యానికి మాజీ సీఎం వసుంధరారాజేపై విధేయత కారణంగా జిల్లాల్లో పార్టీకి సమాంతరంగా పార్టీ యూనిట్లు పనిచేయడమే కారణమని పలువురు బీజేపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలు జరిగిన 90 మున్సిపల్‌ల్లో బీజేపీ 38 గెలుచుకోగా, అధికార కాంగ్రెస్ పార్టీ 50 గెలుచుకుంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు వసుంధరా రాజేను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని ఆమె వర్గం నాయకులు అధిష్టాన పెద్దలపై ఒత్తిడి తెచ్చేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. 2019లో కమలదళం అధిష్టానం వసుంధరా రాజే అనుయాయులను పక్కనబెట్టి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సతీష్ పూనియాను నియమించడంతో పాటు, రాష్ట్ర నాయకులు గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ మేఘవాల్, కైలాష్ చౌదరి వంటి వారికి కేంద్ర ప్రభుత్వంలో మరింత ప్రాధాన్యత కల్పించినప్పటి నుంచి ఆమె మౌనముద్రలో ఉన్నారు. గతేడాది జూలైలో సీఎం గహ్లోత్‌కు వ్యతిరేకంగా సచిన్ పైలట్ తిరుగుబాటు చేసిన కారణంగా రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభ సమయంలోనూ ఆమె మౌనంగా ఉన్న కారణంగా కమలదళం ఆ సందర్భాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడంతో పూర్తిగా విఫలమైంది. కానీ మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో రాజే మద్దతుదారులు ఇప్పుడు ఆమె మళ్ళీ అధికార పార్టీని ధీటుగా ఎదుర్కోవడంలో ముందుండాలని కోరుకుంటున్నారు. గత ఆదివారం వసుంధరా రాజేకు గట్టి పట్టున్న కోటాలో జరిగిన ఒక అంతర్గత సమావేశానికి సింధియా వర్గ బీజేపీ ఎమ్మెల్యేలు హాజరై, 2023 ఎన్నికల్లో ఆమెను సీఎం అభ్యర్థిగా ప్రకటించేలా పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. అధికార గహ్లోత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో పార్టీని పునరుద్ధరించే సామర్థ్యం, ఛరిష్మా ఉన్న లీడర్ కేవలం వసుంధరా రాజే అని ఆమె వర్గ ఎమ్మెల్యేలు వాదిస్తున్నారు. ఏప్రిల్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ర్యాలీని నిర్వహించాలని, ఆ ర్యాలీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆహ్వానించాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజే మౌనంగా ఉన్న కారణంగా పార్టీకి తీరని నష్టం జరిగిందని నాయకులు అభిప్రాయపడుతున్నారు. మార్చి 8న ప్రారంభమయ్యే గోవర్ధన్ యాత్ర కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే యూనుస్ ఖాన్ సమన్వయం చేస్తారని రాజే వర్గం తెలిపింది. రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీలో దక్కని ప్రాధాన్యత.. సతీష్ పునియాను రాష్ట్ర అధ్యక్షుడిగా అధిష్టానం నియమించిన తర్వాత పార్టీలో అంతర్గత సమస్యలు బహిర్గతం అవుతున్నాయి. రాజే మనస్తత్వానికి ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెకు అధికార పగ్గాలు అప్పగించేందుకు అధిష్టానం ఇష్టపడదని, అధిష్టాన పెద్దలతో సఖ్యత లోపించినకారణంగా అంతర్గతంగా పరిస్థితులు సర్దుకోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే పార్టీలోని అంతర్గత సమస్యల కారణంగా రాజేను అధిష్టానం పక్కనబెట్టినప్పటికీ, రాష్ట్రంలో గహ్లోత్‌ను ఎదుర్కోగలిగి, ఓడించగలిగే బలమైన నాయకులు ఎవరూలేరనే అంశాన్ని అధిష్టానం అంగీకరించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. కమలదళం పెద్దలతో వసుంధరా రాజేకు మధ్య ఏమాత్రం సత్సంబంధాలు లేని కారణంగా ఇటీవల ఏర్పాటైన రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీలో ఆమె వర్గానికి ఏమాత్రం ప్రాధాన్యత దక్కలేదు. రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అశోక్ పర్నామి సహా రాజే సన్నిహితులు అనేకమందిని పక్కనబెట్టి కేవలం 14మందికి మాత్రమే అవకాశం కల్పించడాన్ని సింధియా వర్గం జీర్ణించుకోలేకపోతోంది. అయితే 2012, 2018ల్లో జరిగిన పరిణామాల సమయంలో అధిష్టానంపై పైచేయి సాధించిన పరిస్థితులు ప్రస్తుతం లేవన్న విషయాన్ని వసుంధరా రాజే అర్థంచేసుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. మద్య నిషేధాన్ని కోరుతూ ప్రచార యాత్ర మధ్యప్రదేశ్‌లో అధికారంలో ఉన్న సొంత పార్టీ ప్రభుత్వాన్ని అడ్డంపెట్టుకొని పార్టీ అధిష్టానాన్ని ఇరుకున పెట్టేందుకు బీజేపీ సీనియర్ నేత ఉమాభారతి రంగంలోకి దిగుతున్నారు. రాష్ట్రంలో పూర్తిస్థాయి మద్యపాన నిషేధం చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె మార్చి 8న ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. దీంతో కమలదళ పెద్దలకు మరో తలనొప్పి ఎదురుకానుంది. ఇప్పటికే మద్యపాన నిషేధం విషయంలో నిర్ణయం తీసుకోకపోవటంపై సొంత పార్టీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌పై ఆమె ఆరోపణలు చేశారు. మరోవైపు గత నెల 21న పార్టీ పాలిత అన్ని రాష్ట్రాల్లో మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉమాభారతి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్‌లో జరిగిన విపత్తు నేపథ్యంలో కేంద్రప్రభుత్వ విధానాలపై నేరుగా దాడి చేశారు. మోదీ ప్రభుత్వ మొదటి పదవీకాలంలో జల వనరులు, నదీ అభివృద్ధి, గంగా పునరుజ్జీవన శాఖ మంత్రిగా గంగానది, దాని ప్రధాన ఉపనదులపై విద్యుత్ ప్రాజెక్టులను తాను వ్యతిరేకించారని ఉమాభారతి ఇటీవల వ్యాఖ్యానించారు. అందుకే పార్టీ హైకమాండ్‌కు సవాలు విసురుతూ ఆమె రాష్ట్రవ్యాప్తంగా మద్యపాన నిషేధ అంశాన్ని ప్రచారాస్త్రంగా చేసుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్‌తో వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నప్పటికీ, పార్టీ అధిష్టానం తనను పక్కనపెట్టేయడాన్ని ఉమాభారతి జీర్ణించుకోలేకపోతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
త్రిపుర బీజేపీ సర్కార్‌లో అసమ్మతి
అగర్తలా: త్రిపుర రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంలో అసమ్మతి రగులుతోంది. సీఎం విప్లవ్‌కుమార్ దేవ్‌పై 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరేశారు. పార్టీ అధ్యక్షుడు నడ్డాను కలిసి తమ వాదన వినిపించేందుకు ఢిల్లీకి చేరుకున్నారు. అసమ్మతి ఎమ్మెల్యేల్లో రాష్ట్ర ఆరోగ్య శాఖ మాజీ మంత్రి సుదీప్‌రాయ్ బర్మన్ ఉన్నారు. రాష్ట్రంలో బీజేపీకి 36 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వారిలో 25 మంది మార్పును కోరుకుంటున్నారని, మంత్రివర్గాన్ని మార్చాలని వారు ఆశిస్తున్నారని అసమ్మతి ఎమ్మెల్యే ఒకరు చెప్పారు. సీఎం విప్లవ్‌కుమార్ దేవ్ అసమర్థ పాలన వల్ల త్రిపురలో బీజేపీ బలహీన పడుతోందని అన్నారు. నడ్డాతోపాటు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసేందుకు ప్రయత్నిస్తున్నామని మరో ఎమ్మెల్యే పేర్కొన్నారు. 60 అసెంబ్లీ స్థానాలున్న త్రిపురలో బీజేపీకి 36, దాని మిత్రపక్షం ఐపీఎఫ్‌టీకి 8, ప్రతిపక్ష సీపీఎంకు 16 మంది ఎమ్మెల్యేలున్నారు. -
రాజస్థాన్ రాజకీయాలు
-
గహ్లోత్ గట్టెక్కినట్టే!
జైపూర్/న్యూఢిల్లీ: రాజస్తాన్ రాజకీయ సంక్షోభాన్ని ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ తట్టుకుని నిలిచినట్లే కనిపిస్తోంది. సోమవారం వేగంగా జరిగిన పరిణామాల్లో... గహ్లోత్ వెనక చాలినంత మంది ఎమ్మెల్యేలుండటం... సచిన్ పైలట్‌కు బాసటనిచ్చిన వారి సంఖ్య పలచనైపోవటం వంటివి కనిపించాయి. దీంతో అశోక్ గహ్లోత్ కాసింత కులాసాగా కనిపించారు. సీఎల్పీ సమావేశానంతరం ఎమ్మెల్యేలను రిసార్టుకు తరలిస్తూ విజయ చిహ్నాన్ని కూడా చూపించారు. మరోవంక.. తిరుగుబాటు బావుటా ఎగరేసిన పీసీసీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ కూడా మెత్తబడ్డారని సమాచారం. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీతో పాటు పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా పైలట్‌తో చర్చించారని... గహ్లోత్‌పై ఫిర్యాదులేమైనా ఉంటే.. సానుకూలంగా పరిష్కరిస్తామని ఆయనకు హామీ ఇచ్చారని సమాచారం. సీనియర్ నేతలు చిదంబరం, అహ్మద్ పటేల్, కేసీ వేణు గోపాల్ కూడా పైలట్‌తో మాట్లాడటంతో ఆయన కాస్త మెత్తబడ్డారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎల్పీ భేటీకి 106 మంది? రాజస్తాన్‌లో ప్రభుత్వాన్ని కూల్చే కుట్రకు సంబంధించి స్టేట్మెంట్ కావాలంటూ రాజస్తాన్ పోలీస్ విభాగం తనకు నోటీసులివ్వటంతో పైలట్ ఆగ్రహం చెంది సీఎం గహ్లోత్‌పై తిరుగుబాటు చేయడం తెలిసిందే. తదనంతర పరిణామాల్లో తన వెంట 30 మంది ఎమ్మెల్యేలున్నారని కూడా ప్రకటించారాయన. ఈ నేపథ్యంలో ఉదయం జైపూర్‌లో కాంగ్రెస్ శాసనసభా పక్షం (సీఎల్పీ) భేటీ అయింది. దీనికి ఎందరు హాజరయ్యారన్నది స్పష్టంగా తెలియకపోయినా... 106 మంది వరకూ వచ్చినట్లు సీఎల్పీ ప్రకటించింది. అంటే ఒక్క సచిన్ పైలట్ మినహా అందరూ తమతోనే ఉన్నారనే సంకేతాలిచ్చే ప్రయత్నం చేసింది. అయితే దీనికి హాజరైన వారిలో కాంగ్రెస్ సభ్యులే కాక సర్కారుకు మద్దతిస్తున్న ఇతర పార్టీల వారూ ఉన్నట్లు సీఎల్పీ వర్గాలు చెప్పాయి. మొత్తానికి ఈ భేటీకి హాజరైన ఎమ్మెల్యేలంతా ముఖ్యమంత్రి గహ్లోత్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించడమే కాక ప్రభుత్వాన్ని, పార్టీని బలహీన పర్చేందుకు ప్రయత్నించే సీఎల్పీ సభ్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. పైలట్ పేరును ప్రస్తావించకుండా.. ఓ తీర్మానాన్ని సైతం ఆమోదించారు. ‘సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంపై సీఎల్పీ సంపూర్ణ విశ్వాసం ప్రకటిస్తోంది. ముఖ్యమంత్రిగా గహ్లోత్ నాయకత్వాన్ని ఏకగ్రీవంగా సమర్ధిస్తోంది’అని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందంటూ బీజేపీపై ఆ తీర్మానంలో ధ్వజమెత్తారు. అనంతరం, ఎమ్మెల్యేలను అక్కడి నుంచి నేరుగా జైపూర్ దగ్గర్లోని ఫెయిర్మాంట్ రిసార్ట్‌కు తరలించారు. వారితో పాటు సీఎం గహ్లోత్ కూడా అక్కడికి వెళ్లారు. తన ప్రభుత్వానికి ఢోకా లేదని, మెజారిటీ ఎమ్మెల్యేలు తన వైపే ఉన్నారని ఈ సందర్భంగా గహ్లోత్ చెప్పారు. విశ్వాసం కోల్పోయింది రాజస్తాన్‌లో అశోక్ గహ్లోత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా విశ్వాసం కోల్పోయిందని, ఆ పార్టీ ఇక అధికారంలో కొనసాగకూడదని బీజేపీ డిమాండ్ చేసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా సచిన్ పైలట్‌కు బయటి నుంచి మద్దతు ఇస్తారా? అని రాజస్తాన్ బీజేపీ చీఫ్ సతీశ్ పూనియాను ప్రశ్నించగా.. అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని, స్థానిక పరిస్థితులను బేరీజు వేస్తూ.. పార్టీ కేంద్ర నాయకత్వం ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాంగ్రెస్‌లో సమర్ధులైన యువ నాయకులను ఎప్పుడూ నిర్లక్ష్యం చేస్తుంటారని వ్యాఖ్యానించారు. మెజారిటీని చూపాల్సింది అసెంబ్లీలో.. ఇంట్లో కాదు! సీఎల్పీ భేటీ నిర్వహించి, మెజారిటీ సభ్యుల మద్దతుందని సీఎం గహ్లోత్ పేర్కొనడంపై పైలట్ వర్గం స్పందించింది. మెజారిటీని అసెంబ్లీలో నిరూపించుకోవాలని, ఇంట్లో కాదని వ్యాఖ్యానించింది. అలాగే, పైలట్ బీజేపీలో చేరబోవడం లేదని స్పష్టం చేసింది. 106 మంది ఎమ్మెల్యేల మద్దతుందని గహ్లోత్ వర్గ నేతలు చెప్పడాన్ని పైలట్‌కు సన్నిహితులైన పార్టీ నేతలు తప్పుబట్టారు. మెజారిటీ ఉంటే.. ఎమ్మెల్యేలను గవర్నర్ వద్దకు తీసుకువెళ్లాలి కానీ, రిసార్ట్‌కు కాదని ఎద్దేవా చేశారు. నేడు మళ్లీ సీఎల్పీ కాంగ్రెస్ శాసనసభాపక్షం నేడు మరోసారి భేటీ కానుంది. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న హోటల్లోనే ఆ సమావేశం జరుగుతుందని సీనియర్‌నేత సూర్జెవాలా వెల్లడించారు. ఆ భేటీకి రావాలని, అన్ని అంశాలపై అక్కడ స్వేచ్ఛగా చర్చించుకోవచ్చని తిరుగుబాటు నేత సచిన్ పైలట్‌కు సూచించారు. భేటీకి ఆహ్వానిస్తూ పైలట్‌కు, అసంతృప్త ఎమ్మెల్యేలకు లేఖలు పంపించామన్నారు. పైలట్ వెనుక ఎందరు? 200 మంది సభ్యులున్న రాజస్తాన్ అసెంబ్లీలో కాంగ్రెస్ సొంత బలం 107. స్వతంత్రులు 13 మంది, సీపీఎం–2 కలిపితే ఇప్పటిదాకా 122 మంది మద్దతుంది. 72 మంది సభ్యులున్న బీజేపీకి ఆరెల్పీ, ఆరెల్డీ నుంచి నలుగురి మద్దతుంది. ఇద్దరు బీటీపీ ఎమ్మెల్యేలు ప్రస్తుతానికి తటస్థంగా ఉన్నారు. సోమవారం నాటి సమావేశానికి సచిన్ పైలట్‌తో పాటు ఆయనకు సన్నిహితులైన కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. అయితే వీరి సంఖ్య 10 కూడా ఉండదని, కాబట్టి గహ్లోత్ సర్కారుకు ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేమీ లేదని సీఎల్పీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ నేతలపై ఐటీ దాడులు జైపూర్‌లో సీఎల్పీ భేటీకి కొన్ని గంటల ముందు కాంగ్రెస్ నేతలు రాజీవ్ అరోరా, ధర్మేంద్ర రాథోడ్‌లకు సంబంధమున్న పలు వాణిజ్య సంస్థలపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. జైపూర్, ఢిల్లీ, ముంబై, కోట నగరాల్లోని ఆయా సంస్థల కార్యాలయాల్లో పన్ను ఎగవేత కేసులకు సంబంధించి ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. జైపూర్‌లోని ఆమ్రపాలి జ్యువెలర్స్ షోరూమ్‌లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సంస్థ రాజస్తాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాజీవ్ అరోరాకు చెందినదిగా తెలుస్తోంది. ఇదంతా బీజేపీ కుట్ర అని కాంగ్రెస్ ఆరోపించింది. ఐటీ, ఈడీ, సీబీఐ బీజేపీ అనుబంధ విభాగాలుగా మారాయని రణ్‌దీప్ సూర్జేవాలా విమర్శించారు. -
తారాస్థాయికి చేరిన రాజస్తాన్ రాజకీయ సంక్షోభం