చండీగఢ్: హరియాణా అసెంబ్లీకి అక్టోబర్ 5వ తేదీన జరగనున్న ఎన్నికలు అధికార బీజేపీలో కాక పుట్టిస్తున్నాయి. బుధవారం బీజేపీ ప్రకటించిన 67 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాలో తమ పేర్లు లేవనే ఆగ్రహంతో మంత్రి రంజిత్ సింగ్, ఎమ్మెల్యే లక్ష్మణ్‌దాస్ నాపాతోపాటు పార్టీ ఓబీసీ మోర్చా చీఫ్, మాజీ మంత్రి కరణ్ దేవ్ కాంబోజ్ తిరుగుబాటు ప్రకటించారు.
మాజీ డెప్యూటీ ప్రధానమంత్రి దేవీ లాల్ కుమారుడైన రంజిత్ సింగ్ మంత్రి పదవికి, ఆ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. మద్దతుదారుల అభిప్రాయం మేరకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నానని, ఎన్నికల్లో స్వతంత్రుడిగా పోటీ చేస్తానని రంజిత్ సింగ్ గురువారం ప్రకటించారు. స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉన్న రంజిత్ సింగ్ లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment