Ranjit Singh
-
ఎన్నికల వేళ హరియాణాలో బీజేపీకి షాక్
చండీగఢ్: హరియాణా అసెంబ్లీకి అక్టోబర్ 5వ తేదీన జరగనున్న ఎన్నికలు అధికార బీజేపీలో కాక పుట్టిస్తున్నాయి. బుధవారం బీజేపీ ప్రకటించిన 67 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాలో తమ పేర్లు లేవనే ఆగ్రహంతో మంత్రి రంజిత్ సింగ్, ఎమ్మెల్యే లక్ష్మణ్‌దాస్ నాపాతోపాటు పార్టీ ఓబీసీ మోర్చా చీఫ్, మాజీ మంత్రి కరణ్ దేవ్ కాంబోజ్ తిరుగుబాటు ప్రకటించారు. మాజీ డెప్యూటీ ప్రధానమంత్రి దేవీ లాల్ కుమారుడైన రంజిత్ సింగ్ మంత్రి పదవికి, ఆ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. మద్దతుదారుల అభిప్రాయం మేరకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నానని, ఎన్నికల్లో స్వతంత్రుడిగా పోటీ చేస్తానని రంజిత్ సింగ్ గురువారం ప్రకటించారు. స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉన్న రంజిత్ సింగ్ లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. -
డేరా బాబా నిర్దోషి.. 2002 నాటి కేసులో సంచలన తీర్పు
చంఢీగఢ్: గుర్మీత్ రాం రహీం సింగ్(డేరా బాబా)ను భారీ ఊరట లభించింది. 2002లో జరిగిన డేరా సచ్చా సౌదా మాజీ అధికారి రంజిత్ సింగ్ హత్య కేసులో పంజాబ్, హర్యానా హైకోర్టు డేరా బాబాను మంగళవారం నిర్దోషిగా ప్రకంటించింది. ఈ హత్యకేసులో డేరా బాబాతో పాటు.. జస్బీర్ సింగ్, సబ్దిల్ సింగ్, క్రిషన్ లాల్, అవతార్ సింగ్‌లకు సీబీఐ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయితే సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం విధించిన శిక్షను డేరా బాబా హైకోర్టులో సవాల్ చేశారు. ఇవాళ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో రంజిత్ సింగ్ హత్య కేసులో డేరా బాబా 21 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత నిర్దోషిగా తేలారు.హర్యానాలోని సిర్సాలో ఉన్న డేరా సచ్చా సౌదా ఆశ్రమం మాజీ అధికారి రంజిత్ సింగ్. ఆయన జూలై 10, 2002న హత్యకు గురయ్యారు. ఈ హత్యపై కురుక్షేత్రలోని తానేసర్ పోలీసు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 2003లో ఈ హత్యకేసును విచారణ దర్యాప్తు చేయాలని చంఢీగఢ్ హైకోర్టు సీబీఐ ఆదేశించింది. ఈ కేసులు డేరా బాబాతో పాటు మరో నలుగురిపై చార్జ్‌షీట్ దాఖలు చేసి విచారణ చేపట్టింది. అనంతరం డేరా బాబాతో మరో నలుగురికి సీబీఐ ప్రత్యేక కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. -
మాజీ మేనేజర్ హత్య కేసులో దోషి డేరా బాబా
చండీగఢ్: డేరా సచ్చా సౌదా మాజీ మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసులో డేరా అధిపతి గుర్మీత్ రామ్‌రహీమ్ సింగ్‌ను దోషిగా సీబీఐ ప్రత్యేక కోర్టు తేల్చింది. తన ఇద్దరు శిష్యురాళ్లపై అత్యాచారానికి పాల్పడినందుకు 2017లో 20 ఏళ్ల జైలు శిక్ష పడటంతో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అలియాస్ డేరాబాబా ప్రస్తుతం రొహ్‌తక్‌లోని సునరియా జైలులో ఉన్నాడు. పంచ్‌కులలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రంజిత్ సింగ్ కేసుపై శుక్రవారం విచారణ జరిపింది. ఈ కేసులో క్రిషన్ లాల్, జస్బీర్ సింగ్, అవ్తార్ సింగ్, సబ్దిల్లను కూడా దోషులుగా తేల్చినట్లు సీబీఐ స్పెషల్ ప్రాసిక్యూటర్ హెచ్‌పీఎస్ శర్మ తెలిపారు. ఈ కేసు తీర్పు ఈ నెల 12వ తేదీన వెలువడనుందని వివరించారు. డేరా ప్రధాన కార్యాలయంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్న తీరుపై బయటకు వచ్చిన ఒక ఆకాశరామన్న ఉత్తరం వెనుక రంజిత్ సింగ్ హస్తం ఉన్నట్లు డేరా చీఫ్ అనుమానించాడని, ఆ నేపథ్యంలోనే 2002లో అతడు హత్యకు గురయ్యాడని సీబీఐ తన చార్జిషీట్లో పేర్కొంది. రామ్‌చందర్ ఛత్రపతి అనే జర్నలిస్ట్ హత్య కేసులోనూ రెండేళ్ల క్రితం డేరాబాబాకు కోర్టు జీవిత ఖైదు విధించింది. చదవండి: (సరిహద్దుల్లో మరోసారి బరితెగించిన చైనా) -
పాక్‌లో దుశ్చర్య: మహారాజా రంజిత్‌సింగ్ విగ్రహం ధ్వంసం
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్లో కొందరు యువకులు రెచ్చిపోయారు. సిక్కుల ఆరాధ్య దైవం మహారాజ రంజిత్‌సింగ్ విగ్రహాన్ని మూడోసారి పగులగొట్టి వారి విద్వేషాన్ని మరోసారి చాటుకున్నారు. ఈ ఘటన పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని లాహోర్ కోటలో జరిగింది. లాహోర్ కోట సమీపంలో ప్రతిష్టించిన రంజిత్ సింగ్ విగ్రహాన్ని తాజాగా మంగళవారం కూల్చివేశారు. తెహ్రీక్-ఇ-లబైక్ (టీఎల్ఎఫ్) అనే రాడికల్ గ్రూప్ సభ్యులు విగ్రహంపై దాడి చేసి ధ్వంసం చేశారు. సిక్కుల ఆరాధ్య దైవం రంజిత్‌సింగ్. ఆయన లాహోర్ రాజధానిగా సిక్కు రాజ్యాన్ని ఏర్పాటుచేశాడు. ఆయన జ్ఞాపకార్థం లాహోర్ కోట సమీపంలో 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని 180వ వర్ధంతి సందర్భంగా 2019 జూన్‌లో ఆవిష్కరించారు. ఇప్పటికే రెండుసార్లు రంజిత్‌సింగ్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో రెండు నెలల కిందట కొత్తగా ఏర్పాటుచేశారు. ఈ విగ్రహాన్ని వాల్డ్సిటీ ఆఫ్ లాహోర్ అథారిటీ (డబ్ల్యూసీఎల్ఏ) ఆధ్వర్యంలో యూకేకు చెందిన సిక్కు హెరిటేజ్ ఫౌండేషన్ నిర్మించింది. తాజాగా మరోసారి విగ్రహం ధ్వంసం చేయడంపై సిక్కు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విగ్రహానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదవండి: ప్రేమించి పెళ్లాడి ఉగ్రవాదిగా మారిన భారత డెంటిస్ట్.. జైల్లోనే చదవండి: మొదలైన తాలిబన్ల అరాచకం: ఇంటింటికెళ్లి నగదు లూటీ TLP worker pulling down Ranjit Singh's statue at the Lahore Fort. The statue had previously been vandalized by TLP workers on at least two different occasions in the past. pic.twitter.com/IMhcZmPj7e — Ali Usman Qasmi (@AU_Qasmi) August 17, 2021 -
రంజిత్‌సింగ్‌ను అనర్హుడిగా ప్రకటించండి
న్యూఢిల్లీ: నకిలీ పత్రాలను సమర్పించి ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ ఎమ్మెల్యే రంజిత్‌సింగ్‌ను వెంటనే అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. గోకుల్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన రంజిత్ సింగ్ తాను ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తిగా నకిలీ పత్రాలను సమర్పించారని ఆప్ ఆరోపించింది. ప్రజా ప్రాతినిథ్య చట్టం ప్రకారం ఆయన శాసనసభ్యత్వాన్ని వెంటనే రద్దు చేస్తూ అనర్హుడిగా ప్రకటించాలని ఆప్ డిమాండ్ చేసింది. నకిలీ పత్రాలను సమర్పించడం ద్వారా రంజిత్‌సింగ్ కేవలం ఎన్నికల సంఘాన్ని మాత్రమే కాకుండా ప్రజలను కూడా మోసగించాడని ఆప్ ఆరోపించింది. ఇటువంటివారిపై చర్య తీసుకోకుండా వదిలేస్తే అది రానున్న రోజుల్లో రాజకీయాల్లో తీవ్ర సమస్యగా మారే అవకాశముందని ఆప్ హెచ్చరించింది. బీజేపీ రాజకీయాలకు రంజిత్‌సింగ్ ఎన్నికల ఓ ఉదాహరణగా చెప్పవచ్చని ఎద్దేవా చేసింది. దీనిపై బీజేపీ తన వైఖరి ఏమిటో వెంటనే వెల్లడించాలని డిమాండ్ చేసింది. -
బొగ్గు ఫైళ్లు వెతకండి: కేంద్రం
న్యూఢిల్లీ: బొగ్గు బ్లాకుల కేటాయింపులకు సంబంధించిన ఫైళ్లు కన్పించకుండా పోవడంపై రాజకీయ దుమారం చెలరేగిన నేపథ్యంలో.. వీలైనంత త్వరగా ఆ ఫైళ్లు ఎక్కడ ఉన్నాయో గుర్తించాల్సిందిగా అన్ని ప్రభుత్వ శాఖలకు ఆదేశాల ందాయి. కోల్ ఇండియా లిమిటెడ్‌తో పాటు దాని అనుబంధ సంస్థ సెంట్రల్ మైన్ ప్లానింగ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ (సీఎంపీడీఐ)కు కూడా మాయం అయిన ఫైళ్లు వెతకాలనే ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే శాస్త్రిభవన్, లోక్‌నాయక్ భవన్లలోని బొగ్గు శాఖకు చెందిన రికార్డు గదుల్లో ఫైళ్ల కోసం గాలింపు కొనసాగుతోంది. 1993-2005 మధ్యకాలంలో 45 బొగ్గు గనుల కేటాయింపునకు సంబంధించిన ఫైళ్ల కోసం గాలింపు కొనసాగుతున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. వీటిలో స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి (1993) సంబంధించిన రెండు ఫైళ్లు, కేటాయింపులు పొందడంలో విఫలమైన కంపెనీలకు సంబంధించిన 157 దరఖాస్తులు ఉన్నట్లు తెలిపాయి. అనేక ఇతర ఫైళ్లు కూడా మాయమైనవాటిలో ఉన్నాయని సమాచారం. 257 ఫైళ్లు కావాలి: సీబీఐ ఇలావుండగా బొగ్గు బ్లాకుల కేటాయింపు కుంభకోణంపై కొనసాగుతున్న దర్యాప్తు నిమిత్తం 257 ఫైళ్లు అందజేయాల్సిందిగా సీబీఐ బొగ్గు శాఖను కోరింది. వీటిలో 150 వరకు 1993-2005 మధ్యకాలంలో కేటాయించిన 45 బ్లాకులకు సంబంధించిన ఫైళ్లు ఉన్నాయి. 2006-09 మధ్యకాలంలో కేటాయింపులకు సంబంధించి సీబీఐ నమోదు చేసిన 13 ఎఫ్ఐఆర్లకు సంబంధించిన ఫైళ్లు కూడా కన్పించకుండా పోయినవాటిలో ఉన్నాయని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. కుంభకోణానికి సంబంధించిన ఫైళ్లు ఇవ్వాలని గత మేలోనే బొగ్గు శాఖకు రాసినా స్పందన లేదని సీబీఐ డెరైక్టర్ రంజిత్‌సింగ్ చెప్పారు.