న్యూఢిల్లీ: బొగ్గు బ్లాకుల కేటాయింపులకు సంబంధించిన ఫైళ్లు కన్పించకుండా పోవడంపై రాజకీయ దుమారం చెలరేగిన నేపథ్యంలో.. వీలైనంత త్వరగా ఆ ఫైళ్లు ఎక్కడ ఉన్నాయో గుర్తించాల్సిందిగా అన్ని ప్రభుత్వ శాఖలకు ఆదేశాల ందాయి. కోల్ ఇండియా లిమిటెడ్‌తో పాటు దాని అనుబంధ సంస్థ సెంట్రల్ మైన్ ప్లానింగ్ డిజైన్ ఇన్‌స్టిట్యూట్ (సీఎంపీడీఐ)కు కూడా మాయం అయిన ఫైళ్లు వెతకాలనే ఆదేశాలు జారీ అయ్యాయి.
ఈ నేపథ్యంలోనే శాస్త్రిభవన్, లోక్‌నాయక్ భవన్లలోని బొగ్గు శాఖకు చెందిన రికార్డు గదుల్లో ఫైళ్ల కోసం గాలింపు కొనసాగుతోంది. 1993-2005 మధ్యకాలంలో 45 బొగ్గు గనుల కేటాయింపునకు సంబంధించిన ఫైళ్ల కోసం గాలింపు కొనసాగుతున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. వీటిలో స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి (1993) సంబంధించిన రెండు ఫైళ్లు, కేటాయింపులు పొందడంలో విఫలమైన కంపెనీలకు సంబంధించిన 157 దరఖాస్తులు ఉన్నట్లు తెలిపాయి. అనేక ఇతర ఫైళ్లు కూడా మాయమైనవాటిలో ఉన్నాయని సమాచారం.
257 ఫైళ్లు కావాలి: సీబీఐ
ఇలావుండగా బొగ్గు బ్లాకుల కేటాయింపు కుంభకోణంపై కొనసాగుతున్న దర్యాప్తు నిమిత్తం 257 ఫైళ్లు అందజేయాల్సిందిగా సీబీఐ బొగ్గు శాఖను కోరింది. వీటిలో 150 వరకు 1993-2005 మధ్యకాలంలో కేటాయించిన 45 బ్లాకులకు సంబంధించిన ఫైళ్లు ఉన్నాయి. 2006-09 మధ్యకాలంలో కేటాయింపులకు సంబంధించి సీబీఐ నమోదు చేసిన 13 ఎఫ్‌ఐఆర్‌లకు సంబంధించిన ఫైళ్లు కూడా కన్పించకుండా పోయినవాటిలో ఉన్నాయని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. కుంభకోణానికి సంబంధించిన ఫైళ్లు ఇవ్వాలని గత మేలోనే బొగ్గు శాఖకు రాసినా స్పందన లేదని సీబీఐ డెరైక్టర్ రంజిత్‌సింగ్ చెప్పారు.
బొగ్గు ఫైళ్లు వెతకండి: కేంద్రం
Published Wed, Aug 21 2013 1:00 AM | Last Updated on Sat, Sep 15 2018 3:51 PM
Advertisement