Coal India Ltd
-
వేసవి కాలంలో కరెంటు కోతలు తప్పవా..?
ధరలను పెంచలేకపోతే బొగ్గు ఉత్పత్తి పడిపోవచ్చని ప్రభుత్వ మైనర్ కోల్ ఇండియా లిమిటెడ్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. బొగ్గు ఉత్పత్తి పడిపోతే విద్యుత్ సహ ఇతర ఆధారిత రంగాలలో సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ప్రపంచంలోని అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారు అయిన కోల్ ఇండియాలో జీతాలు పెరగడం, డీజిల్ అధిక ధరల నుంచి సంస్థ ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. ధరలు పెంచకపోతే కంపెనీలోని కొన్ని యూనిట్లు మనుగడ సాగించడం కష్టం అని ఛైర్మన్ ప్రమోద్ అగర్వాల్ తెలిపారు. దీర్ఘకాలిక సరఫరా ఒప్పందాలలో భాగంగా కోల్ ఇండియా బొగ్గు ధరలను పెంచడానికి ప్రభుత్వ మద్దతు అవసరం. దేశంలో కరెంట్ ధరలు పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుంది. దేశంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి కావాల్సిన 70 శాతం బొగ్గును కోల్ ఇండియా ఉత్పత్తి చేస్తుంది. గత ఏడాది బొగ్గు ఉత్పత్తి పడిపోవడంతో విద్యుత్ ప్లాంట్ల వద్ద బొగ్గు నిల్వలు పడిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడ్డాయి. గత ఏడాది సెప్టెంబర్ నెలలో విద్యుత్ ప్లాంట్ల వద్ద బొగ్గు నిల్వలు కనిష్టస్థాయి నుంచి పెరిగినప్పటికీ, అవి ఇప్పటికీ ఏప్రిల్ 2020లో గరిష్ట నిల్వలలో మూడవ వంతు మాత్రమే ఉన్నాయి. వేసవి సమీపిస్తున్న కొద్దీ దేశంలో విద్యుత్ ఉత్పత్తికి డిమాండ్ పెరుగుతుంది. ఈ సమయంలో కోల్ ఇండియా బొగ్గు ఉత్పత్తి నిలిపివేస్తామని ప్రకటించడం ఆందోళన కలిగించే విషయం. (చదవండి: ఎలక్ట్రానిక్ చిప్స్ తయారీ కోసం వేదాంత గ్రూపు భారీగా పెట్టుబడులు..!) -
ఈ 3 దిగ్గజ కంపెనీలకూ క్యూ4 షాక్
గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో సాధించిన ఫలితాలు నిరాశ పరచడంతో ఇన్వెస్టర్లు ఈ మూడు కంపెనీల కౌంటర్లలో అమ్మకాలకు ఆసక్తి చూపుతున్నారు. జాబితాలో ఆటో విడిభాగాల దిగ్గజం భారత్ ఫోర్జ్, పీఎస్‌యూ దిగ్గజం కోల్ ఇండియా, రియల్టీ కంపెనీ శోభా లిమిటెడ్ ఉన్నాయి. వెరసి ఈ కౌంటర్లు 11-5 శాతం మధ్య పతనమయ్యాయి. వివరాలు చూద్దాం.. భారత్ ఫోర్జ్ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో భారత్ ఫోర్జ్ రూ. 68.6 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2018-19) క్యూ4లో రూ. 324 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 35 శాతం క్షీణించి రూ. 1742 కోట్లకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో భారత్ ఫోర్జ్ షేరు 11 శాతం కుప్పకూలి రూ. 314 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 309 వరకూ జారింది. కోల్ ఇండియా కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో కోల్ ఇండియా నికర లాభం 23 శాతం క్షీణించి రూ. 4638 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం 4 శాతం వెనకడుగుతో రూ. 25,597 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో కోల్ ఇండియా షేరు 5.5 శాతం పతనమై రూ. 135 వద్ద ట్రేడవుతోంది. శోభా లిమిటెడ్ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో శోభా లిమిటెడ్ నికర లాభం సగానికిపైగా క్షీణించి రూ. 51 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం రూ. 1422 కోట్ల నుంచి రూ. 928 కోట్లకు వెనకడుగు వేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో శోభా లిమిటెడ్ షేరు 5 శాతం పతనమై రూ. 216 వద్ద ట్రేడవుతోంది. -
కోల్ ఇండియా లాభం రూ. 4,434 కోట్లు
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2013-14) జనవరి-మార్చి(క్యూ4)లో ప్రభుత్వ రంగ కోల్ ఇండియా రూ.4,434 కోట్ల నికర లాభాన్ని సాధించింది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 5,414 కోట్లతో పోలిస్తే ఇది 18% తక్కువ. బొగ్గు నాణ్యతకు సంబంధించి మరో ప్రభుత్వ దిగ్గజం ఎన్టీపీసీతో ఏర్పడ్డ వివాద పరిష్కారానికి రూ. 876.5 కోట్లను కేటాయించడంతో లాభాలు ప్రభావితమైనట్లు కంపెనీ పేర్కొంది. ఇదే కాలానికి ఆదాయం నామమాత్ర వృద్ధితో రూ. 19,998 కోట్లకు చేరింది. అంతక్రితం రూ. 19,905 కోట్లు నమోదైంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన పూర్తి ఏడాదికి(2013-14) నికర లాభం రూ. 17,356 కోట్ల నుంచి రూ. 15,112 కోట్లకు క్షీణించింది. ఇక ఆదాయం రూ. 68,303 కోట్ల నుంచి రూ. 68,810 కోట్లకు నామమాత్రంగా పెరిగింది. దేశీయ బొగ్గు ఉత్పత్తిలో కోల్ ఇండియాకు 80% వాటా ఉంది. కాగా, గతేడాదిలో 462.53 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. అయితే 482 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. ఫలితాల నేపథ్యంలో బీఎసీలో షేరు 2% నష్టంతో రూ.374 వద్ద ముగిసింది. -
బొగ్గు ఫైళ్లు వెతకండి: కేంద్రం
న్యూఢిల్లీ: బొగ్గు బ్లాకుల కేటాయింపులకు సంబంధించిన ఫైళ్లు కన్పించకుండా పోవడంపై రాజకీయ దుమారం చెలరేగిన నేపథ్యంలో.. వీలైనంత త్వరగా ఆ ఫైళ్లు ఎక్కడ ఉన్నాయో గుర్తించాల్సిందిగా అన్ని ప్రభుత్వ శాఖలకు ఆదేశాల ందాయి. కోల్ ఇండియా లిమిటెడ్‌తో పాటు దాని అనుబంధ సంస్థ సెంట్రల్ మైన్ ప్లానింగ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ (సీఎంపీడీఐ)కు కూడా మాయం అయిన ఫైళ్లు వెతకాలనే ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే శాస్త్రిభవన్, లోక్‌నాయక్ భవన్లలోని బొగ్గు శాఖకు చెందిన రికార్డు గదుల్లో ఫైళ్ల కోసం గాలింపు కొనసాగుతోంది. 1993-2005 మధ్యకాలంలో 45 బొగ్గు గనుల కేటాయింపునకు సంబంధించిన ఫైళ్ల కోసం గాలింపు కొనసాగుతున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. వీటిలో స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి (1993) సంబంధించిన రెండు ఫైళ్లు, కేటాయింపులు పొందడంలో విఫలమైన కంపెనీలకు సంబంధించిన 157 దరఖాస్తులు ఉన్నట్లు తెలిపాయి. అనేక ఇతర ఫైళ్లు కూడా మాయమైనవాటిలో ఉన్నాయని సమాచారం. 257 ఫైళ్లు కావాలి: సీబీఐ ఇలావుండగా బొగ్గు బ్లాకుల కేటాయింపు కుంభకోణంపై కొనసాగుతున్న దర్యాప్తు నిమిత్తం 257 ఫైళ్లు అందజేయాల్సిందిగా సీబీఐ బొగ్గు శాఖను కోరింది. వీటిలో 150 వరకు 1993-2005 మధ్యకాలంలో కేటాయించిన 45 బ్లాకులకు సంబంధించిన ఫైళ్లు ఉన్నాయి. 2006-09 మధ్యకాలంలో కేటాయింపులకు సంబంధించి సీబీఐ నమోదు చేసిన 13 ఎఫ్ఐఆర్లకు సంబంధించిన ఫైళ్లు కూడా కన్పించకుండా పోయినవాటిలో ఉన్నాయని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. కుంభకోణానికి సంబంధించిన ఫైళ్లు ఇవ్వాలని గత మేలోనే బొగ్గు శాఖకు రాసినా స్పందన లేదని సీబీఐ డెరైక్టర్ రంజిత్‌సింగ్ చెప్పారు.