ఈ 3 దిగ్గజ కంపెనీలకూ క్యూ4 షాక్‌ | Bharat Forge- Coal India- Sobha ltd down on weak Q4 | Sakshi
Sakshi News home page

ఈ 3 దిగ్గజ కంపెనీలకూ క్యూ4 షాక్‌

Published Mon, Jun 29 2020 3:22 PM | Last Updated on Mon, Jun 29 2020 3:22 PM

Bharat Forge- Coal India- Sobha ltd down on weak Q4 - Sakshi

గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో సాధించిన ఫలితాలు నిరాశ పరచడంతో ఇన్వెస్టర్లు ఈ మూడు కంపెనీల కౌంటర్లలో అమ్మకాలకు ఆసక్తి చూపుతున్నారు. జాబితాలో ఆటో విడిభాగాల దిగ్గజం భారత్‌ ఫోర్జ్‌, పీఎస్‌యూ దిగ్గజం కోల్‌ ఇండియా, రియల్టీ కంపెనీ శోభా లిమిటెడ్‌ ఉన్నాయి. వెరసి ఈ కౌంటర్లు 11-5 శాతం మధ్య పతనమయ్యాయి.  వివరాలు చూద్దాం..

భారత్‌ ఫోర్జ్‌
కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో భారత్‌ ఫోర్జ్‌ రూ. 68.6 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2018-19) క్యూ4లో రూ. 324 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 35 శాతం క్షీణించి రూ. 1742 కోట్లకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో భారత్‌ ఫోర్జ్‌ షేరు 11 శాతం కుప్పకూలి రూ. 314 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 309 వరకూ జారింది.

కోల్‌ ఇండియా
కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో కోల్‌ ఇండియా నికర లాభం 23 శాతం క్షీణించి రూ. 4638 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం 4 శాతం వెనకడుగుతో రూ. 25,597 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో కోల్‌ ఇండియా షేరు 5.5 శాతం పతనమై రూ. 135 వద్ద ట్రేడవుతోంది. 

శోభా లిమిటెడ్‌
కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో శోభా లిమిటెడ్‌ నికర లాభం సగానికిపైగా క్షీణించి రూ. 51 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం రూ. 1422 కోట్ల నుంచి రూ. 928 కోట్లకు వెనకడుగు వేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో శోభా లిమిటెడ్‌ షేరు 5 శాతం పతనమై రూ. 216 వద్ద ట్రేడవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement