sobha
-
నేటి నుంచి జీ–20 వ్యవసాయ సదస్సు
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్: ఈ ఏడాది జీ–20 సమావేశాల్లో భాగంగా సోమవారం హైదరాబాద్‌లో ‘వాతావరణ ప్రతికూలతలను తట్టుకోగల వ్యవసాయం’అనే అంశంపై చర్చలు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ ‘ది డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఎడ్యుకేషన్’, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖలు సెప్టెంబర్ 4, 6 తేదీల మధ్య జరగనున్న ఈ చర్చలకు కేంద్రమంత్రి శోభా కరంద్లాజే హజరు కానున్నారు. హైదరాబాద్ విమానాశ్రయం సమీపంలోని నోవాటెల్ హోటల్లో 100 మంది దేశ, విదేశీ ప్రతినిధులు వ్యవసాయ పరిశోధనలు, ప్రతికూల వాతావరణాన్ని తట్టుకోగల వ్యవసాయ పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం అంశాలపై చర్చలు జరపనున్నారు. జీ–20 సమావేశాల్లో భాగంగా మంగళవారం ప్రతినిధులు భారత వ్యవసాయ పరిశోధన సమాఖ్యకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్‌ను సందర్శించనున్నారు. విదేశీ ప్రతినిధులకు దేశ సంస్కృతిని పరిచయం చేసే ఉద్దేశంతో వారిని హైదరాబాద్‌లోని శిల్పారామానికి తీసుకెళ్లనున్నట్లు నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం ప్రతినిధులందరూ ఐసీఏఆర్ క్రిడాలోని పరిశోధన క్షేత్రంలో పంటలను, వాటి నిర్వహణ పద్ధతులను పరిశీలించనున్నారు. -
ఆ నలభై నిమిషాల్లో ఏం జరిగింది..?
మిర్యాలగూడ అర్బన్ : మిర్యాలగూడ పట్టణంలో శనివారం రాత్రి వెలుగులోకి వచ్చిన యువతి అనుమానాస్పద మృతి మిస్టరీ వీడలేదు. పట్టణంలోని సుందర్‌నర్‌కు చెందిన దండగల వెంకన్న అలివేలు దంపతుల కుమార్తె దండగల శోభ(18) డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కొంత కాలంగా పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రిసెప్సనిస్టుగా పనిచేసిన శోభ పరీక్షలు ఉండటంతో ఇంటి వద్దనే ఉండి చదువుకుంటోంది. ఈ క్రమంలో ఏమైందో ఏమో గాని శనివారం రాత్రి 7:40 గంటల సమయంలో బైపాస్‌రోడ్డు వెంట ఉన్న వైష్ణవి అపార్ట్మెంట్ వద్దకు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లింది. ఈ దృశ్యం బైపాస్‌రోడ్డు వెంట ఉన్న ఖలీల్ దాబా ఎదురుగా ఉన్న సీసీ కెమరాల్లో రికార్డు కాగా ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వైష్ణవి అపార్ట్మెంట్లోని రెండవ అంతస్తు వరకు శోభ చేరుకున్నట్లుగా సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. కూపీ లాగుతున్న పోలీసులు కాగా, వైష్ణవి అపార్ట్మెంట్లోకి శనివారం రాత్రి 7.40 గంటలకు చేరుకున్న శోభ మరో 40నిమిషాల అనంతరం రెండో అంతస్తు నుంచి కిందపడింది. అయితే, అపార్ట్‌మెంట్‌కు శోభ ఎందుకు వెళ్లింది? ఎవరితో మాట్లాడింది.? 40నిమిషాల్లో ఏం జరిగింది. అనే అంశాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు. కాగా, శోభ తన సెల్‌ఫోన్ ఇంట్లోనే వదిలి వెళ్లింది. ఘటన తర్వాత పోలీసులు సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఐదు నెలల కాల్‌డేటా సేకరించే పనిలో ఉన్నారు. కాగా, కూతురు మృతిపై అనుమానాలున్నాయని శోభ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అపార్ట్మెంట్లో తమకు తెలిసిన వారు ఎవరూ లేరని పేర్కొన్నారు. కాగా, ఆది వారం మధ్యాహ్నం శోభ మృతదేహానికి ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించగా అంత్యక్రియలు పూర్తిచేశారు. శోభ మృతి విషయం తెలుసుకున్న వారి బంధువులు ఆస్పత్రి వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వన్‌టౌన్ ఎస్ఐ శ్రీనునాయక్ తెలిపారు. -
చలించిపోయిన సీఎం కేసీఆర్ సతీమణి
సాక్షి, హైదరాబాద్ : కరీంనగర్ జిల్లాలో కుటుంబ యజమాని మృతి చెందడంతో రోడ్డున పడ్డ నిరుపేద కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభమ్మ చేయుతనిచ్చారు. లక్ష రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించి ఆ మొత్తాన్ని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు పంపించి బాధిత కుటుంబానికి అందజేసి ఆదుకోవాలని సూచించారు. దీంతో ఎమ్మెల్యేతోపాటు టీఆర్ఎస్ నాయకులు రామడుగు మండలం తిర్మలాపూర్ గ్రామాన్ని సందర్శించి అనారోగ్యంతో చనిపోయిన నిరుపేద కమటం తిరుపతి కుటుంబాన్ని పరామర్శించారు. కాగా తిరుపతి ఇల్లు ఇటీవల కురిసిన వర్షాలకు కూలిపోవడంతో అతని భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు ప్రస్తుతం మున్నూరు కాపు భవన్లో తలదాచుకుంటున్నారు. ఈ వార్త మీడియాలో రావడంతో సీఎం సతీమణి స్పందించి ఆర్థిక సహాయం ప్రకటించారు. అలాగే ఆమె సూచనతో ఎమ్మెల్యే వారి కుటుంబ సభ్యులను పరామర్శించి లక్ష రూపాయలు, మిగిలిన దాతలు అందించిన 2 లక్షల రూపాయలతో కలిపి మొత్తం మూడు లక్షలు ఆర్థిక సహాయం అందించారు. అంతేకాకుండా డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు చేస్తామని, వారి పిల్లలకు గురుకుల పాఠశాలలో చదివిస్తామని హామీ ఇచ్చారు. వారి పిల్లలకు చదువు పూర్తయ్యేవరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. -
శోభా- మజెస్కో.. షేర్ల జోరు
ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 367 పాయింట్లు జంప్‌చేసి 39,341కు చేరగా.. నిఫ్టీ 95 పాయింట్లు బలపడి 11,598 వద్ద ట్రేడవుతోంది. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో మెరుగైన పనితీరు ప్రదర్శించనున్న అంచనాలతో రియల్టీ అభివృద్ధి సంస్థ శోభా లిమిటెడ్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోపక్క సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు ప్రతిపాదించిన వార్తలతో ఐటీ సేవల మధ్యస్థాయి కంపెనీ మజెస్కో లిమిటెడ్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు షేర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. శోభా లిమిటెడ్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో త్రైమాసిక ప్రాతిపదికన అమ్మకాల పరిమాణం 37 శాతం పెరిగినట్లు శోభా లిమిటెడ్ తాజాగా వెల్లడించింది. దాదాపు 8.92 చదరపు అడుగులను విక్రయించినట్లు పేర్కొంది. విలువ ప్రకారం అమ్మకాలు 41 శాతం పుంజుకున్నట్లు తెలియజేసింది. ఒక్కో చదరపు అడుగుకి సగటున రూ. 7,737 ధర లభించినట్లు తెలియజేసింది. గత ఐదు త్రైమాసిక ధరలతో పోలిస్తే ఇది అధికమని వివరించింది. దీంతో శోభా షేరు ఎన్ఎస్ఈలో తొలుత 14 శాతంపైగా దూసుకెళ్లింది. రూ. 273 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం 10.3 శాతం లాభంతో రూ. 264 వద్ద ట్రేడవుతోంది. మజెస్కో లిమిటెడ్ ఈక్విటీ షేర్ల బైబ్యాక్నకు ప్రతిపాదించినట్లు ఐటీ కన్సల్టింగ్ కంపెనీ మజెస్కో లిమిటెడ్ పేర్కొంది. ఈ ప్రతిపాదనను పరిశీలించేందుకు కంపెనీ బోర్డు గురువారం(8న) సమావేశంకానున్నట్లు వెల్లడించింది. సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టీసీఎస్ సైతం ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ను ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. బైబ్యాక్ ప్రతిపాదనపై బుధవారం(7న) బోర్డు నిర్ణయం తీసుకోనున్నట్లు టీసీఎస్ ఇటీవల వెల్లడించింది. కాగా.. బైబ్యాక్ వార్తలతో మజెస్కో షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 861 సమీపంలో ఫ్రీజయ్యింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకావడం గమనార్హం! -
ఈక్లర్క్స్- శోభా.. హైజంప్
వరుసగా నాలుగో రోజు మార్కెట్లు జోరు చూపుతున్నాయి. సెన్సెక్స్ లాభాల ట్రిపుల్ సెంచరీ సాధించి 36,400ను తాకగా.. నిఫ్టీ 136 పాయింట్లు బలపడి 10,700ను అధిగమించింది. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల ప్రభావంతో సాఫ్ట్వేర్ సేవల కంపెనీ ఈక్లర్క్స్ సర్వీసెస్, రియల్ ఎస్టేట్ సంస్థ శోభా లిమిటెడ్ కౌంటర్లు వెలుగులోకి వచ్చాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఈక్లర్క్స్ సర్వీసెస్ సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు ఐటీ సేవల దిగ్గజం ఈక్లర్క్స్ సర్వీసెస్ ప్రతిపాదించింది. ఈ అంశంపై నేడు బోర్డు నిర్వహిస్తున్న సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలియజేసింది. రీసెర్చ్ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ బైబ్యాక్ కోసం కంపెనీ రూ. 200-250 కోట్లవరకూ వెచ్చించే వీలున్నట్లు అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఈక్లర్క్స్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. ఎన్ఎస్ఈలో తొలుత ఈ షేరు 11 శాతం దూసుకెళ్లి రూ. 528కు చేరింది. ఆపై కొంత మందగించింది. ప్రస్తుతం 7.5 శాతం ఎగసి రూ. 513 వద్ద ట్రేడవుతోంది. గతేడాది షేరుకి రూ. 1500 ధరలో 1.75 మిలియన్ షేర్లను ఈక్లర్క్స్ బైబ్యాక్ చేసింది. ఇందుకు రూ. 262 కోట్లను వెచ్చించింది. ఈక్లర్క్స్‌లో మార్చికల్లా ప్రమోటర్లకు 50.76 శాతం వాటా ఉంది. శోభా లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి క్వార్టర్లో అమ్మకాల పరిమాణం గతేడాది క్యూ4(జనవరి-మార్చి)తో పోలిస్తే 70 శాతం జంప్‌చేసినట్లు రియల్టీ కంపెనీ శోభా లిమిటెడ్ తాజాగా వెల్లడించింది. ఇందుకు ఆన్లైన్ టెక్నాలజీ, సొంత వ్యాపార విధానాలు, శోభా బ్రాండుపట్ల విశ్వాసం వంటి అంశాలు దోహదం చేసినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం శోభా షేరు ఎన్ఎస్ఈలో 5.5 శాతం జంప్‌చేసి రూ. 236 వద్ద ట్రేడవుతోంది. గత క్యూ4లో కంపెనీ నికర లాభం సగానికిపైగా తగ్గి రూ. 51 కోట్లకు పరిమితంకాగా.. మొత్తం ఆదాయం సైతం రూ. 1422 కోట్ల నుంచి రూ. 928 కోట్లకు క్షీణించింది. -
ఈ 3 దిగ్గజ కంపెనీలకూ క్యూ4 షాక్
గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో సాధించిన ఫలితాలు నిరాశ పరచడంతో ఇన్వెస్టర్లు ఈ మూడు కంపెనీల కౌంటర్లలో అమ్మకాలకు ఆసక్తి చూపుతున్నారు. జాబితాలో ఆటో విడిభాగాల దిగ్గజం భారత్ ఫోర్జ్, పీఎస్‌యూ దిగ్గజం కోల్ ఇండియా, రియల్టీ కంపెనీ శోభా లిమిటెడ్ ఉన్నాయి. వెరసి ఈ కౌంటర్లు 11-5 శాతం మధ్య పతనమయ్యాయి. వివరాలు చూద్దాం.. భారత్ ఫోర్జ్ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో భారత్ ఫోర్జ్ రూ. 68.6 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2018-19) క్యూ4లో రూ. 324 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 35 శాతం క్షీణించి రూ. 1742 కోట్లకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో భారత్ ఫోర్జ్ షేరు 11 శాతం కుప్పకూలి రూ. 314 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 309 వరకూ జారింది. కోల్ ఇండియా కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో కోల్ ఇండియా నికర లాభం 23 శాతం క్షీణించి రూ. 4638 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం 4 శాతం వెనకడుగుతో రూ. 25,597 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో కోల్ ఇండియా షేరు 5.5 శాతం పతనమై రూ. 135 వద్ద ట్రేడవుతోంది. శోభా లిమిటెడ్ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో శోభా లిమిటెడ్ నికర లాభం సగానికిపైగా క్షీణించి రూ. 51 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం రూ. 1422 కోట్ల నుంచి రూ. 928 కోట్లకు వెనకడుగు వేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో శోభా లిమిటెడ్ షేరు 5 శాతం పతనమై రూ. 216 వద్ద ట్రేడవుతోంది. -
జలముంటేనే జంగల్‌కు కళ
సాక్షి, హైదరాబాద్: అడవుల్లోని జంతువుల కోసం ఏర్పాటు చేసిన సోలార్ పంపుసెట్లు, సాసర్ పిట్ల వద్ద నిత్యం నీటి నిల్వలు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను పీసీసీఎఫ్ ఆర్.శోభ ఆదేశించారు. వివిధ జిల్లాల్లో అటవీ ప్రాంతాలను గ్రిడ్లుగా విభజించి, సహజ నీటి వనరులు లేని చోట కృత్రిమ వసతి ఏర్పాటుకు ఆదేశాలిచ్చినట్టు తెలిపారు. నీటి నిల్వలు సమృద్ధిగా ఉన్నచోట వన్యప్రాణులు స్వేచ్ఛగా సంచరిస్తున్నట్టు అటవీశాఖ ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్‌లు, సీసీటీవీ కెమెరాలకు చిక్కినట్టు తెలిపారు. వేసవిలో వన్యప్రాణుల వేట కోసం వేటగాళ్లు ఉచ్చులు ఏర్పాటు చేసే అవకాశాలున్నందున, ఆయా ప్రాంతాల్లో ఫుట్ పెట్రోలింగ్ చేయాలని, నీటి వసతుల వద్ద ప్రతిరోజూ ఈ తరహా చెకింగ్ ఉండాలని ఆదేశించారు. వేసవి నేపథ్యంలో చేపట్టాల్సిన సమ్మర్ యాక్షన్ ప్లాన్‌పై శుక్రవారం అరణ్య భవన్ నుంచి జిల్లా అధికారులతో పీసీసీఎఫ్ ఆర్.శోభ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎండాకాలంలో టైగర్ రిజర్వ్‌లతో పాటు అన్ని అటవీ ప్రాంతాల్లో జంతువుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, నీటి వసతి ఏర్పాటు అంశాలను సమీక్షించారు. క్షీణించిన అటవీ ప్రాంతాలు, బోడి గుట్టలపై ఉపాధి హామీ పనుల అనుసంధానంతో వేసవిలో కందకాల తవ్వకం చేపట్టాలని, వానాకాలంలో నీటి నిల్వలకు అవి తోడ్పడతాయన్నారు. విధులు, అభివృద్ధి్ద పనుల నిర్వహణలో అధికారులు, సిబ్బంది అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటా మని పీసీసీఎఫ్ హెచ్చరించారు. క్షేత్రస్థాయి సిబ్బంది, బీట్ ఆఫీసర్లు తమకు కేటాయించిన అటవీ బీట్లకు రెగ్యులర్‌గా వెళ్తున్నారా లేదా అన్న దాన్ని నోట్కామ్ యాప్ ఫొటోల ద్వారా ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో అదనపు పీసీసీఎఫ్‌లు లోకేష్ జైస్వాల్, డోబ్రియల్, స్వర్గం శ్రీనివాస్, ఎంసీ పర్గెయిన్, సిధానంత్ కుక్రేటీ, ఓఎస్డీ ఎ.శంకరన్, చంద్రశేఖర్‌రెడ్డి, సునీతా భగవత్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
యశోదా ఆస్పత్రిలో చేరిన కేసీఆర్ భార్య
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భార్య శోభ జర్వంతో బాధపడుతున్నారు. దాంతో ఆమెను చికిత్స నిమిత్తం మంగళవారం యశోదా ఆస్పత్రిలో చేర్పించారు. కాగా వాతావరణంలో వచ్చిన మార్పు వల్ల జ్వరం వచ్చి ఉంటుందని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ముగ్గురు ‘గాంధీ’ల నాయకత్వం కావాలి!
న్యూఢిల్లీ: ప్రియాంక గాంధీ త్వరలో రాజకీయాల్లో క్రియాశీలం కానున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో.. ‘గాంధీ కుటుంబం అంతా రాజకీయాల్లో ఉండాలని దేశమంతా కోరుకుంటోంది. ముగ్గురు గాంధీలు(సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ) పార్టీలో నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని పార్టీలో అంతా కోరుకుంటున్నారు’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి శోభ ఓఝా గురువారం పేర్కొన్నారు