ధరలను పెంచలేకపోతే బొగ్గు ఉత్పత్తి పడిపోవచ్చని ప్రభుత్వ మైనర్ కోల్ ఇండియా లిమిటెడ్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. బొగ్గు ఉత్పత్తి పడిపోతే విద్యుత్ సహ ఇతర ఆధారిత రంగాలలో సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ప్రపంచంలోని అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారు అయిన కోల్ ఇండియాలో జీతాలు పెరగడం, డీజిల్ అధిక ధరల నుంచి సంస్థ ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. ధరలు పెంచకపోతే కంపెనీలోని కొన్ని యూనిట్లు మనుగడ సాగించడం కష్టం అని ఛైర్మన్ ప్రమోద్ అగర్వాల్ తెలిపారు.
దీర్ఘకాలిక సరఫరా ఒప్పందాలలో భాగంగా కోల్ ఇండియా బొగ్గు ధరలను పెంచడానికి ప్రభుత్వ మద్దతు అవసరం. దేశంలో కరెంట్ ధరలు పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుంది. దేశంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి కావాల్సిన 70 శాతం బొగ్గును కోల్ ఇండియా ఉత్పత్తి చేస్తుంది. గత ఏడాది బొగ్గు ఉత్పత్తి పడిపోవడంతో విద్యుత్ ప్లాంట్ల వద్ద బొగ్గు నిల్వలు పడిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడ్డాయి. గత ఏడాది సెప్టెంబర్ నెలలో విద్యుత్ ప్లాంట్ల వద్ద బొగ్గు నిల్వలు కనిష్టస్థాయి నుంచి పెరిగినప్పటికీ, అవి ఇప్పటికీ ఏప్రిల్ 2020లో గరిష్ట నిల్వలలో మూడవ వంతు మాత్రమే ఉన్నాయి. వేసవి సమీపిస్తున్న కొద్దీ దేశంలో విద్యుత్ ఉత్పత్తికి డిమాండ్ పెరుగుతుంది. ఈ సమయంలో కోల్ ఇండియా బొగ్గు ఉత్పత్తి నిలిపివేస్తామని ప్రకటించడం ఆందోళన కలిగించే విషయం.
(చదవండి: ఎలక్ట్రానిక్ చిప్స్ తయారీ కోసం వేదాంత గ్రూపు భారీగా పెట్టుబడులు..!)
Comments
Please login to add a commentAdd a comment