coal production
-
కష్టానికి తగ్గ ఫలితం
సింగరేణి (కొత్తగూడెం): వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకునేందుకు సింగరేణి కార్మికులకు ఆ సంస్థ ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా సుమారు రెండు నెలల సమయం ఉంది. 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకోగా, గత పది నెలల్లో 53.73 మిలియన్ టన్నుల ఉత్పత్తి మాత్రమే నమోదైంది. మిగిలిన 18.27 మిలియన్ టన్నులను మార్చి 31లోగా ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా సింగరేణి వ్యాప్తంగా ఉన్న 18 ఓపెన్ కాస్ట్ గనులు, 24 భూగర్భ గనులతో పాటు సీహెచ్‌పీ (కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్)లను కేటగిరీ 1, 2గా విభజించారు. ఆయా పని ప్రాంతాల్లో రానున్న రెండు నెలల్లో సెలవులు తీసుకోకుండా నెలకు 20 మస్టర్లు చేసే కార్మికులకు ప్రోత్సాహకాలు ఇస్తామని యాజమాన్యం ప్రకటించింది. ప్రోత్సాహకాలు ఇలా... » భూగర్భ గనుల్లో నెలకు 20 వేల టన్నుల కంటే ఎక్కువ బొగ్గు ఉత్పత్తి చేసే గనులను కేటగిరి – 1గా పరిగణిస్తారు. వీటిలో 100 నుంచి 104 శాతం ఉత్పత్తి జరిగితే, అక్కడ పనిచేసే కార్మికులకు రెండు నెలల్లో రూ.1,500 ప్రోత్సాహకంగా ఇస్తారు. 105 నుంచి 109 శాతం ఉత్పత్తి చేస్తే రూ.2 వేలు, 110 శాతం కంటే అధికంగా ఉత్పత్తి చేసిన వారికి రూ.2,500 చెల్లిస్తారు. » భూగర్భ గనుల్లో 20 వేల టన్నుల కంటే తక్కువ ఉత్పత్తి చేసే గనులను కేటగిరీ–2గా పరిగణిస్తారు. వీటిలో 100 నుంచి 104 శాతం ఉత్పత్తి చేస్తే రూ.1,200 ప్రోత్సాహం ఇస్తారు. 105 నుంచి 109 శాతం ఉత్పత్తి చేస్తే రూ.1,700.. 110 కంటే అధికంగా ఉత్పత్తి చేస్తే రూ.2,200 చొప్పున సంస్థ చెల్లించనుంది. » రోజుకు 30 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే ఓపెన్ కాస్ట్ గనులను కేటగిరీ–1గా పరిగణిస్తారు. వీరు 100 నుంచి 104 శాతం ఉత్పత్తి చేస్తే రూ.1,500 ప్రోత్సాహం ఇస్తారు. 105 నుంచి 109 శాతం ఉత్పత్తి చేస్తే రూ.2 వేలు, 110 శాతం కంటే అధికంగా చేసిన వారికి రూ.2,500 ప్రోత్సాహకంగా చెల్లిస్తారు. »కేటగిరీ–2లో రోజుకు 30 వేల టన్నుల కంటే తక్కువ ఉత్పత్తి చేసే ఓసీలు ఉన్నాయి. వీటిల్లో 100 నుంచి 104 శాతం ఉత్పత్తి చేస్తే రూ.1,200.. 105 నుంచి 109 శాతం ఉత్పత్తి చేస్తే రూ.1,700, 110 శాతం కంటే అధికంగా ఉత్పత్తి చేస్తే రూ.2,200 చెల్లించనున్నారు. »రోజుకు 8 రేక్‌లు (32 వేల టన్నులు) రవాణా చేసే సీహెచ్పీలను కేటగిరీ–1గా, అంతకంటే తక్కువ రవాణా చేసేవాటిని కేటగిరీ–2గా పరిగణిస్తారు. ఈ రెండు కేటగిరీల్లోని ఉద్యోగులకు రవాణాకు అనుగుణంగా ప్రోత్సాహక నగదు చెల్లించాలని యాజమాన్యం నిర్ణయించింది.రక్షణ, హాజరుతో లక్ష్యసాధన సింగరేణి యాజమాన్యం రెండు నెలల కోసం కేటగిరీ – 1, 2లను ప్రకటించింది. ఆయా కేటగిరీల్లో పనిచేస్తున్న అన్ని రకాల ఉద్యోగులు(సర్పేస్, అండర్ గ్రౌండ్) లక్ష్యాల సాధనకు కృషి చేయాలి. ఇదే సమయాన రక్షణ సూత్రాలు పాటిస్తూ హాజరు శాతం తగ్గకుండా పనిచేస్తే ప్రోత్సాహకాలు అందుకోవచ్చు. – శాలేం రాజు, కొత్తగూడెం ఏరియా జీఎం అందరికీ పని కల్పిస్తే ఫలితం భూగర్భగనుల్లో చాలా మంది ఉద్యోగులకు మైనింగ్ అధికారులు పని ప్రదేశాలను చూపెట్టడం లేదు. దీంతో ఖాళీగా ఉండి వెనుదిరుగుతున్నారు. అలాగే, మైన్స్ కమిటీ అలంకారప్రాయంగా మారింది. కొందరు గనుల మేనేజర్లు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండానే వాట్సాప్ నివేదికలు ఇస్తారు. ఇలాంటివి సరిచేస్తే లక్ష్యాలను సాధించవచ్చు. – రియాజ్ అహ్మద్, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శిసమస్యల పరిష్కారానికి సమరం» సింగరేణి అధికారుల కార్యాచరణ » వెంటనే డైరెక్టర్ల నియామకానికి డిమాండ్గోదావరిఖని: తమ సమస్యలను పరిష్కరించడంతోపాటు.. అనిశ్చితికి కారణమైన డైరెక్టర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలనే డిమాండ్‌తో సింగరేణి అధికారులు సమరానికి సిద్ధమయ్యారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని సీఎంవోఏఐ కార్యాలయంలో సమావేశమైన అధికారుల సంఘం నేతలు.. భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేశారు.మొత్తం 11 ఏరియాలకు చెందిన సుమారు 2,500 మంది అధికారులు ఇందులో భాగస్వాములవుతున్నారు. తొలుత ఏరియా జీఎంలకు వినతిపత్రాలు అందజేసి, రోజూ సాయంత్రం జీఎం కార్యాలయాల ఎదుట సమావేశమై ప్రణాళిక రూపొందించుకోవాలని నిర్ణయించారు. ఈమేరకు శనివారం జీఎంలకు వినతిపత్రాలు అందజేశారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఫెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే(పీఆర్పీ) చెల్లించాలని కోరుతున్నారు. ప్రధాన డిమాండ్లు ఇవే.. » గతేడాది రావలసిన పీఆర్పీ (పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే) చెల్లించాలి » కీలకమైన డైరెక్టర్ ప్రాజెక్టు అండ్ ప్లానింగ్, డైరెక్టర్ ఆపరేషన్ పోస్టులు భర్తీ చేయాలి » ఏడేళ్ల పీఆర్పీతోపాటు 2007 – 2014 వరకు బకాయిలు చెల్లించాలి » పదోన్నతుల విధానాన్ని సరిచేయాలి » ఎస్సీడబ్ల్యూఏ నుంచి అధికారిగా పదోన్నతి పొందిన వారికి ఈ–2 నుంచి ఏడాదికే ఈ–3 ఇవ్వాలి » ఎన్సీడబ్ల్యూఏ నుంచి ఈ–1కు వచ్చే జేఎంవో, జేటీవో అధికారులకు ఈ–5 వరకు పదోన్నతి విధానాన్ని వర్తింపజేయాలి » ఈ–6 గ్రేడ్ ఏడేళ్లు దాటిన వారికి డీజీఎంగా పదోన్నతి కలి్పంచాలి » డీపీసీ (డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ) ఏడాదిలో రెండు ఏర్పాటు చేయాలి » ఎఫ్ఎంఎంసీ (ఫస్ట్‌క్లాస్ మైన్ మేనేజ్మెంట్) సరి్టఫికెట్ ఉండి 12 ఏళ్ల సరీ్వసు నిండిన వారికి ఎస్వోఎం హోదా ఇవ్వాలి » కన్వేయన్స్, హెచ్‌వోడీ వాహనాలకు, ఆఫీస్ కార్యాలయాలకు ఏసీ సౌకర్యం కలి్పంచాలి » సత్తుపల్లి ఏరియాలో మాదిరిగా మూడు బెడ్రూంలతో కూడిన నూతన క్వార్టర్లు నిర్మించాలి » ఉద్యోగ విరమణ చేసేవారికి చెల్లింపుల్లో ఆటంకం లేకుండా సీడీఏ నిబంధనలు మార్చాలి » కాలపరిమితితో విచారణలు పూర్తిచేయాలి » కోల్ ఇండియాలో మాదిరిగా టీఏ, డీఏ నిబంధనలు అమలు చేయాలి » రిటైర్డ్ అధికారులకు మెడికల్ బిల్లు పరిమితి పెంచాలి » కోల్ ఇండియా మాదిరిగా హోదా ఇవ్వాలి » ఖాళీలను పూరించాలి, పదోన్నతులు కల్పించాలిప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం పదోన్నతులు, పీఆర్పీ చెల్లింపులో అధికారులకు అన్యాయం జరిగింది. మా సమస్యల పరిష్కారం కోసం ఐక్య కార్యాచరణకు సిద్ధమయ్యాం. సమస్యలు పరిష్కారం కాకుంటే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. – పొనుగోటి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు, సీఎంవోఏఐ -
సింగరేణి.. సినర్జీ
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/గోదావరిఖని: తెలంగాణ కొంగు బంగారం సింగరేణి సంస్థ కీర్తి దశదిశలా వ్యాపిస్తోంది. వందేళ్లకు పైగా బొగ్గు ఉత్పత్తికే పరిమితమైన సింగరేణి.. ఇప్పుడు బహుముఖంగా విస్తరిస్తోంది. థర్మల్, సోలార్, రియల్టీ.. ఇలా బహుముఖంగా విస్తరిస్తూ సింగరేణి సినర్జీగా మారుతోంది. ఈ సంస్థ ఏటా డిసెంబర్ 23న సింగరేణి డే జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో సింగరేణి సంస్థ అభివృద్ధిపై సాక్షి ప్రత్యేక కథనం.. థర్మల్‌తో మొదలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు దగ్గర 1870లో మొదలైన బొగ్గు తవ్వకం.. ఆ తర్వాత గోదావరి లోయ ప్రాంతాలకు విస్తరించింది. అయితే, 1920 డిసెంబర్ 23న సింగరేణి కాలరీస్ పేరుతో లాంఛనంగా ఈ సంస్థ ప్రారంభమైంది. ప్రస్తుతం 18 ఓపెన్‌కాస్ట్, 22 భూగర్భ గనుల్లో బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సంస్థ పరిధిలో 39,600 మంది కారి్మకులు పని చేస్తున్నారు. సింగేణి బొగ్గులో 80 శాతం మేరకు థర్మల్ విద్యుత్ కేంద్రాలకే సరఫరా అవుతోంది. బయట సంస్థలకు బొగ్గు సరఫరా చేయడంతో పాటు సొంతంగా విద్యుత్ తయారు చేయాలని 2010లో సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు 1,200 మెగావాట్ల సామర్థ్యంతోæ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (ఎస్టీపీపీ) మంచిర్యాల జిల్లా జైపూర్‌లో 2016లో ప్రారంభమైంది. అనతి కాలంలోనే థర్మల్ విద్యుత్ ఉత్పత్తితో అనేక రికార్డులు ఎస్టీపీపీ సొంతమయ్యాయి. దీంతో ఇక్కడే మరో 800 మెగావాట్ల కొత్త ప్లాంట్ నిర్మాణం మొదలుపెట్టింది. ఎస్టీపీపీ నుంచి వచ్చిన సానుకూల ఫలితాల కారణంగా కొత్తగా రామగుండంలో 1,600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి అడుగులు వేస్తోంది. ఒడిశాలోని నైనీలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత అక్కడ కూడా 1,200 మెగావాట్ల సామర్థ్యంతో పిట్ హెడ్ థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణానికి ప్రణాళిక సిద్ధమైంది. నెట్ జీరో దిశగా.. సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తిలో భాగంగా 2018లో తొలిసారిగా రామగుండం 3 ఏరియాలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‌ను సింగరేణి ప్రారంభించింది. ఆ తర్వాత సంస్థ విస్తరించిన 11 ఏరియాల పరిధిలో విరివిగా సోలార్ ప్లాంట్లు ఏర్పాటుచేస్తోంది. ప్రస్తుతం సంస్థ సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 272 మెగావాట్లకు చేరుకుంది. మరో 22 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఇది కూడా అందుబాటులోకి వస్తే సింగరేణి సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 810 మిలియన్ యూనిట్లకు చేరుకుంటుంది. మరోవైపు 750 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను సంస్థ ఉపయోగిస్తోంది. దీంతో అతి త్వరలో నెట్ జీరో సంస్థగా సింగరేణి మారనుంది. మరో 250 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. ఫ్లోటింగ్ సోలార్ మంచిర్యాల జిల్లా జైపూర్‌లో ఉన్న వాటర్ రిజర్వాయర్‌పై 15 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్‌ను 2023 జనవరిలో సంస్థ ప్రారంభించింది. త్వరలోనే మానేరు జలాశయం (300 మెగావాట్లు), మల్లన్నసాగర్ (2 ్ఠ250 మెగావాట్లు) మొత్తంగా కొత్తగా మరో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ల స్థాపనకు సంస్థ సిద్ధమవుతోంది. మరిన్ని ప్రయోగాలు రామగుండం, ఇల్లెందులో సుమారు 600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్లు నెలకొల్పేందుకు ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసింది. మందమర్రిలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. మణుగూరు ఏరియాలో జియో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేస్తోంది. థార్ ఏడాది ప్రాంతంలో సోలార్, విండ్ పవర్ ప్లాంట్ల స్థాపన విషయంలో రాజస్థాన్ ప్రభుత్వంతో సంపద్రింపులు జరుపుతోంది. ఇవే కాకుండా లిథియం మైనింగ్‌పై కూడా సింగరేణి దృష్టి సారించింది. రియల్టీ రంగంలో అడుగు పెడుతూ గోదావరిఖనిలో రూ.12 కోట్లు, కొత్తగూడెంలో రూ.4.5 కోట్ల వ్యయంతో కమర్షియల్ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి సిద్ధమవుతోంది. గ్రీన్హైడ్రోజన్, అమ్మోనియం నైట్రేట్ తయారీ, కార్బన్ డై యాక్సైడ్ నుంచి మిథనాల్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటోంది. కొత్తగూడెంలో వెంకటేశ్ గని, ఇల్లందులో జవహర్ గని తవ్వకానికి అనుమతులు సాధించింది. పెరుగుతున్న కాంట్రాక్టీకరణ.. సింగరేణిలో ఏటా పరి్మనెంట్ కారి్మకుల సంఖ్య తగ్గుతోంది. 1990కి ముందు రెగ్యులర్ కార్మికుల సంఖ్య సుమారు 1.20 లక్షలకు పైగా ఉంటే.. ఈ ఏడాది 39,600కు పడిపోయింది. ఇదే సమయంలో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ కారి్మకుల సంఖ్య 30 వేలకు పెరిగింది. ఈ ఏడాది సంస్థ 2,165 ఉద్యోగాలను భర్తీ చేసింది. ఇందులో 798 ఎక్స్టర్నల్, 1,367 కారుణ్య నియామకాలు ఉన్నాయి. కార్మికుల డిపెండెంట్ల వయోపరిమితిని 40 ఏళ్లకు పెంచటంతో దాదాపు 200 మందికి తక్షణమే లబ్ధి చేకూరింది. సివిల్, ఓవర్ బర్డెన్, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో 80 శాతానికి పైగా స్థానికులకు అవకాశం కల్పించారు. పంచ్ ఎంట్రీ పద్ధతి ద్వారా అడ్రియాల గని జీవితకాలాన్ని మరో 30 ఏళ్లకు పెంచారు. రూ.కోటి ప్రమాద బీమా కారి్మకులకు సింగరేణి సంస్థ రూ.కోటి ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తోంది. ఈ మేరకు గత ఫిబ్రవరి 27న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీతో ఒప్పందం చేసుకుంది. కాంట్రాక్టు కారి్మకుడికి కుటుంబానికి రూ.30 లక్షల పరిహారం అందించేలా ఒప్పందం చేసుకుంది. రామగుండం, మందమర్రిలో నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ సెంటర్లు ఏర్పాటు చేసింది. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు రూ.40 కోట్లు కేటాయించి శిక్షణ ఇవ్వాలని నిర్ణయిచింది. కారి్మకుల పిల్లలకు సీబీఎస్ఈ విధానంలో విద్యాబోధన చేసేందుకు ఆర్జీ–2, శ్రీరాంపూర్ ఏరియాల్లోని సింగరేణి పాఠశాలలను ఎంపికచేశారు. కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు కొత్తగూడెం, గోదావరిఖని ఏరియా ఆస్పత్రులను ఆధునీకరిస్తోంది. గుండె వ్యాధిగ్రస్తుల కోసం క్యాథ్‌ల్యాబ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సొంతంగా 10 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తోంది. రూ.796 కోట్ల లాభాల వాటా సింగరేణి ఈ ఏడాది సాధించిన లాభాల్లో రూ.796 కోట్లను ఉద్యోగులకు వాటాగా అందించింది. కంపెనీ చరిత్రలోనే ఇది అత్యధికమని అధికారులు పేర్కొంటున్నారు. ఈ సారి కాంట్రాక్టు కారి్మకులకూ రూ.5 వేల చొప్పున అందజేశారు. -
ప్రభుత్వ రంగం సిగలో విరిబోణి సింగరేణి
సింగరేణికి ప్రభుత్వ రంగంలో 103 ఏండ్లు వచ్చాయి. మరో 150 ఏండ్లకు సరిపడా నిక్షేపాలున్నాయి. 10 వేల మిలయన్ టన్నులకు పైగా ఇప్పటికే గోదావరి తీరంలో గుర్తించిన నల్లబంగారం ఉన్నది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలు వల్ల సంస్థ భవిష్యత్తుకు ప్రమాదం వచ్చి పడింది. మళ్ళీ అస్తిత్వం కోసం, ప్రభుత్వ రంగంలో నిలదొక్కు కోవడం కోసం యూనియన్లకు, రాజకీయ పార్టీ లకు అతీతంగా పోరు బాట పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడి కార్మికుల, అధికారుల సమష్టి కృషితో నిల దొక్కుకున్న ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులూ, వారి కుటుంబ సభ్యులూ ముందు వరుసలో నిలబడ్డారు. తెలంగాణ కోసం 42 రోజులు సమ్మె చేశారు. ఇప్పుడు భవిష్యత్తు కోసం పోరాడుతున్నారు. దేశంలోనే ప్రభుత్వ రంగంలో మొట్ట మొదటి సంస్థగా సింగరేణి ఆవిర్భవించింది. దేశానికి స్వాతంత్రం రాకముందు నుంచే సింగరేణి ప్రభుత్వ రంగంలో ఉన్నది. 1889లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించిన సింగరేణికి 134 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉంది. 1920 డిసెంబరు 23న సింగరేణి లిమిటెడ్ కంపెనీగా మారింది. రాష్ట్రం 51 శాతం.. కేంద్రం 49 శాతం వాటాతో సంస్థ పబ్లిక్ సెక్టార్ కంపెనీగా ఉంది. 1990 దశకంలో రెండుసార్లు దాదాపు ఖాయిలా జాబితాలో పడి బయటకు వచ్చిన మొట్ట మొదటి ప్రభుత్వ రంగసంస్థ సింగరేణి ఒక్కటే. ఈ సంవత్సరం డిసెంబర్ 23 నాటికి ‘సింగరేణి లిమిటెడ్’ సంస్థగా మారి 103 సంవ త్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం ఇది. సంస్థ నష్టాల నుంచి బయటపడి 1998 నుంచి లాభాల్లోకి వచ్చింది. సింగరేణి 2001–02 నుంచి కార్మికులకు తన నికర లాభాల నుంచి వాటా బోనస్‌ను చెల్లిస్తూ వస్తోంది. భారతదేశంలోని ప్రభుత్వరంగ సంస్థలలో ఎక్కడా కూడా లాభాలలో వాటా బోనస్‌ను ఉద్యోగులకు పంచి ఇస్తున్న సంస్థ లేదు. డిపెండెంట్ ఎంప్లాయి మెంట్‌ను కూడా అనారోగ్యంగా ఉన్న కార్మికుల ఇన్ వ్యాలి డేషన్ అనంతరం రెండు సంవత్సరాల మిగులు సర్వీసు నిబంధన మేరకు కొనసాగిస్తున్నారు. సింగరేణి సొంతంగా మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద ఏర్పాటు చేసిన 1,200ల మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి రాష్ట్రానికి విద్యుత్తును అందిస్తూ 50 శాతం రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీరుస్తున్నది. దీని వల్ల సంస్థకు ప్రతి ఏటా నాలుగు వందల కోట్ల రూపాయల లాభాలు వస్తు న్నాయి. సోలార్ విద్యుత్ రంగంలోనూ అడుగు పెట్టి 300 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో ఇప్పటికే సగం వరకు సౌర విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. మరో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి రంగం సిద్ధం చేశారు. డిపెండెంటు, ఇతర కేట గిరీల కింద మొత్తంగా 9 వేల వరకు ఉద్యోగాలను సింగరేణి గడిచిన 7 సంవత్సరాలలో యువతకు కల్పించడం జరిగింది. ఉద్యోగులకు సొంత గృహం నిర్మించుకోవడానికి బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం, ఇంటింటికీ ఏసీలు పెట్టు కునే అవకాశం కల్పించింది సంస్థ. ఐతే కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చి అమలు చేస్తున్న ‘ప్రైవేటీకరణ చట్టం’ వల్ల ప్రైవేట్ మల్టీ నేష నల్స్తో కలిసి ఫీజులు చెల్లించి వేలంలో పాల్గొంటే తప్ప కొత్త బొగ్గు బ్లాకులు సింగరేణికి కేటాయించే పరిస్థితి లేదు. అటు కోల్ ఇండియా దుఃస్థితి కూడా ఇలాగే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు డివిడెండ్లు, పన్నులు, రాయల్టీల పేరిట ప్రతి సంవత్సరం ఆరు వేల కోట్ల రూపాయలు చెల్లిస్తున్నా సింగరేణికి వేలంలో పాల్గొంటే తప్ప ఇప్పుడు కొత్త బ్లాక్‌లు వచ్చే పరిస్థితి లేదు. బొగ్గు బ్లాక్‌ల కోసం గత ఏడాది 72గంటల సమ్మె కూడా చేశారు. ఈ పోరు ఇంకా కొనసాగు తూనే ఉంది. ఈ విషయాన్ని కొత్తగా ఎంపికైన ఆ ప్రాంత ప్రజా ప్రతి నిధులూ, కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్‌గా తీసు కోవాలి. లేకపోతే సంస్థ భవిష్యత్తు ఇరకాటంలో పడుతుంది. సింగరేణి అంటే తెలంగాణకు గుండెకాయ లాంటిది. వేలాది మందికి భవిష్యత్తులో ఉపాధి కల్పించే తల్లి లాంటిది. అలాంటి సంస్థను ప్రభుత్వరంగంలో కాపాడు కోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. స్వాతంత్య్రానికి ముందు నుంచి ప్రభుత్వరంగంలో ఉన్న సింగరేణిలో కార్మిక సంఘాలకు కూడా దశబ్దాల పోరాట చరిత్ర ఉంది. హక్కుల కోసం 1936లో ‘ఉబాసి లాల్ ఫాసి’ అనే కార్మికుడి నేతృత్వంలో 13 రోజులు సమ్మె జరిగిన దాఖలాలున్నాయి. 1945 నుంచి కార్మిక సంఘాల కార్యకలాపాలు, పోరాటాలు కొనసాగు తున్నాయి. 1998 నుంచి దేశంలోని ఎక్కడా కూడా బొగ్గు సంస్థలలో లేని విధంగా యూనియన్ గుర్తింపు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 27న యూనియన్ గుర్తింపు ఎన్నికలు ఉన్నాయి. 7వ సారి ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అలాంటి సింగ రేణిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. సింగరేణి లాభాలలో ఉంది నిజమే. అయితే సంస్థకు రావాల్సిన బకాయిలు వసూలు కాకపోవడంతో క్యాష్ రిచ్ కంపెనీ కాలేక పోతున్నది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి ఎలాగూ బడ్జెటరీ మద్దతు లేదు. బొగ్గు విద్యుత్ సరఫరా చేసిన వేల కోట్ల బకాయీలనైనా అవి చెల్లించాలి. అందుకు తెలంగాణ ప్రజా ప్రతినిధులు చిత్తశుద్ధి, నిజాయితీతో కృషి చేయాలి. - ఎం.డి. మునీర్ - వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ ‘ 99518 65223 (నేడు సింగరేణి ఆవిర్భావ దినోత్సవం -
రికార్డు సృష్టించిన సింగరేణి.. చరిత్రలోనే తొలిసారి..
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కాలరీస్ కంపెనీ 2022-23 ఆర్థిక సంవత్సరంలో తన చరిత్రలోనే అత్యధికంగా 32,830 కోట్ల రూపాయల అమ్మకాలను (టర్నోవర్) సాధించి రికార్డు సృష్టించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం(2021-22)లో సాధించిన 26,619 కోట్ల రూపాయల టర్నోవర్‌పై 23 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. తెలంగాణ ఏర్పాటుకు ముందు (2013-14)లో సింగరేణి సాధించిన 12,000 కోట్ల టర్నోవర్ తో పోల్చితే ఇది 173 శాతం అధికం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సింగరేణి సాధించిన ప్రగతికి ఇది నిదర్శనంగా పేర్కొనవచ్చు. ఈ వివరాలను సంస్థ ఛైర్మన్ ఎండీ ఎన్. శ్రీధర్ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడిస్తూ.. సింగరేణి ఉద్యోగులకు, అధికారులకు, కార్మిక సంఘాల నాయకులకు తన అభినందనలు తెలిపారు. తెలంగాణ ఏర్పడినప్పుడు 50 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి మాత్రమే ఉండగా.. ఇప్పుడు 10 కొత్త గనులను ప్రారంభించుకోవడంతోపాటు సింగరేణి థర్మల్, సోలార్ విద్యుత్ రంగాల్లో కూడా ప్రవేశించడంతో ఈ అభివృద్ధి సాధ్యమైంది. గత ఎనిమిదేళ్ల కాలంలో దేశంలో ఇంత భారీ టర్నోవర్ వృద్ధిని సాధించిన సంస్థ సింగరేణే కావడం విశేషం. బొగ్గు అమ్మకాలలో 25 శాతం.. విద్యుత్ అమ్మకాలలో 13 శాతం వృద్ధి.. సింగరేణి సంస్థ 2022-23లో సాధించిన ఈ టర్నోవర్ లో బొగ్గు అమ్మకాల ద్వారా 28, 459 కోట్లు, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ద్వారా జరిపిన విద్యుత్ అమ్మకం ద్వారా 4,371 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించడం కూడా ఆల్‌టైం రికార్డుగా ఉంది. అంతకు ముందు ఏడాది(2021-22) సాధించిన 22740 కోట్ల రూపాయల బొగ్గు అమ్మకాలతో పోల్చితే సింగరేణి ప్రస్తుతం 25 శాతం వృద్ధిని నమోదు చేసింది. అలాగే విద్యుత్ అమ్మకాల్లో 2021-22లో జరిపిన 3,879 కోట్ల టర్నోవర్‌తో పోల్చితే ప్రస్తుతం 13 శాతం వృద్ధిని నమోదు చేసింది. బొగ్గు, విద్యుత్ అమ్మకాలు కలిపి మొత్తమ్మీద 2021-22 కన్నా 23 శాతం వృద్ధిని సింగరేణి సంస్థ 2022-23 లో నమోదు చేసి సరికొత్త రికార్డును లిఖించింది. -
Singareni: బొగ్గు ఉత్పత్తిలో వీరే కీలకం..
సింగరేణి(కొత్తగూడెం): దక్షిణ భారతదేశానికి తలమానికంగా విరాజిల్లుతున్న సింగరేణి సంస్థ ఆవిర్భవించి నేటికి 134 సంవత్సరాలు కావస్తోంది. ప్రారంభంలో బొగ్గు తవ్వకానికే పరిమితమైన సింగరేణి.. క్రమంగా తెలంగాణ సహా ఏడు రాష్ట్రాల్లో విద్యుత్, సిమెంట్, పేపర్‌తో పాటు మరెన్నో పరిశ్రమలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాటు తోడ్పాటునందిస్తోంది. లక్షలాది మంది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తోంది. సింగరేణి ఖాళీ స్థలాల్లో 300 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసి రోజుకు 10 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేసి ప్రభుత్వ గ్రిడ్‌కు అందిస్తూ ఏడాదికి రూ.120 కోట్లు ఆర్జిస్తోంది. అంతేకాక అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ తన వంతు పాత్ర పోషిస్తోంది. నూతన టెక్నాలజీతో ఉత్పత్తి.. 1889లో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించిన సింగరేణి సుమారు 59 సంవత్సరాల పాటు మ్యాన్ పవర్ ద్వారా బొగ్గు ఉత్పత్తి చేసింది. ఆ తర్వాత 1948లో జాయ్ లోడర్ షటిల్ కార్‌ను, 1950లో క్యాప్ ల్యాంప్‌లు, 1951లో ఎలక్ట్రికల్ కోల్ డ్రిల్స్, 1953లో ఎలక్ట్రిక్ క్యాప్ ల్యాంప్స్, 1954లో ప్లేమ్ ప్రూఫ్ ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్లను వినియోగిస్తూ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచింది. 1975లో ఓపెన్‌కాస్ట్ గనులు, 1961లో రెస్క్యూ టీమ్‌ల ఏర్పాటు, 1979లో సైడ్ డిశ్చార్జ్ లోడర్, 1981లో లోడ్ హ్యాండ్ డంపర్స్ 1983లో లాంగ్ వాల్మైనింగ్, 1986లో వాకింగ్ డ్రాగ్‌లైన్, 1989లో ఫ్రెంచ్ బ్లాస్టింగ్ గ్యాలరీ మెథడ్ ఏర్పాటు చేసుకుంది. గనుల్లో కార్మికుల నడకను తగ్గించేందుకు 1990లో మ్యాన్ రైడింగ్ చైర్ లిఫ్టింగ్ పద్ధతిని కొత్తగూడెం ఏరియాలోని వీకె–7షాఫ్ట్‌లో ఏర్పాటు చేసింది. 1994లో ఇన్పుట్ క్రషింగ్ కన్వేయర్ యంత్రాలను ప్రవేశ పెట్టింది. ఇలా అనేక రకాల నూతన టెక్నాలజీని వినియోగించి కార్మికులకు రక్షణతో పాటు అధిక బొగ్గు ఉత్పత్తికి అడుగులు వేసింది. బొగ్గు ఉత్పత్తిలో వీరే కీలకం.. ►ఫేస్ వర్కర్లు: బొగ్గు తీసే ప్రదేశంలో వీరు కీలక పాత్ర పోషిస్తారు. ఇందులో ఆపరేటర్లు, కోల్ కట్టర్లు, సపోర్ట్మెన్లు ఉంటారు. ► లైన్మెన్లు: ఉత్పత్తిలో ప్రధానమైన ఎస్డీఎల్, సీఎమ్మార్ యంత్రాలు నడిచేందుకు వీలుగా ట్రాక్‌లు వేయడం వీరి ప్రధాన విధి. ► కన్వేయర్ ఆపరేటర్లు: బొగ్గును బయటికి తీసేందుకు అవసరమైన బెల్ట్‌ను నడుపుతారు. ► పంప్ ఆపరేటర్లు: బొగ్గుతీసే క్రమంలో భూమి పొరల నుంచి వచ్చే నీటిని ఎప్పటికప్పుడు బయటకు పంపిస్తారు. ► ఫిట్టర్లు: పని చేస్తున్న క్రమంలో మోటార్లు, యంత్రాలు మరమ్మతులకు గురైతే తక్షణమే రిపేర్ చేసి, పని ఆగకుండా చూస్తారు. ► ఎలక్ట్రీషియన్లు: గనుల్లో 24 గంటలూ విద్యుత్ అంతరాయం లేకుండా చూడడం వీరి ప్రధాన విధి. పంపులకు, మోటార్లకు నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తుండాలి. ► టెండాల్స్: బరువైన యంత్రాల విడి భాగాలను గనిలోకి చేర్చి, వాటిని బిగించే సమయంలో ఫిట్టర్లకు సహాయపడుతుంటారు. ► హాలర్ డ్రైవర్లు: బొగ్గు ఉత్పత్తికి, గనిలోని యంత్ర విభాగాలకు అంతరాయం కలగకుండా చూస్తుంటారు. ► జనరల్ మజ్దూర్లు: టెక్నికల్ సిబ్బంది ఎవరైనా విధులకు హాజరు కాకుంటే వారి స్థానంలో పనిచేసే వారికి వీరు తోడుగా ఉంటూ సహకరిస్తుంటారు. ► ఎలక్ట్రికల్, మైనింగ్ సూపర్వైజర్లు: గనిలో ఉత్పత్తికి సంబంధించిన పనులకు కార్మికులను పురమాయించడం, రక్షణ నిబంధనలను కార్మికులకు వివరిస్తూ, ఉత్పత్తికి అవసరమైన మెటీరియల అందిస్తుంటారు. వీరిని జూనియర్ అధికారులు అంటారు. ► సూపర్వైజర్లు, ఎలక్ట్రిక్ మెకానిక్‌లు: గనిలో ఎలక్ట్రికల్, యంత్రాలను నిత్యం పర్యవేక్షిస్తుంటారు. పని సమయంలో అవి ఆగకుండా చూడాల్సిన బాధ్యత వీరిదే. ► మైనింగ్ సర్దార్, ఓవర్మెన్లు: బొగ్గు పొరల్లో డ్రిల్లింగ్ వేసి, వాటిలో పేలుడు పదార్థాలతో బ్లాస్టింగ్ చేస్తేనే బొగ్గు వస్తుంది. ఆ తరువాత రూఫ్ సురక్షితంగా ఉందా లేదా అని పరిశీలించే బాధ్యత వీరిదే. అక్కడ పనిచేసే కార్మికులకు సైతం వీరే విధులు కేటాయిస్తుంటారు. ► అసిస్టెంట్ మేనేజర్లు: గనిలో అవసరమైన పనులను పర్యవేక్షించేవారు. ► ఇంజనీర్లు: యంత్రాల పర్యవేక్షణ, పనితీరు, రక్షణ చర్యలు, పనుల పర్యవేక్షణ, పనులకు సంబంధించిన రిపోర్టును ఉన్నతాధికారులకు అందించేవారు. ► రక్షణాధికారి : గనుల్లో కార్మికులు, ఉద్యోగుల రక్షణ వీరి విధి. ఎవరికైనా ప్రమాదం జరిగితే తక్షణమే వారికి అవసరమైన సహాయక చర్యలు చేపడతారు. ► వెంటిలేషన్ ఆఫీసర్: గనుల్లో గాలి, వెలుతురు, తాగునీటి సదుపాయం ఏర్పాటు చేయడం, ప్రమాదాలు జరుగకుండా చూడడం వీరి బాధ్యత. ► సర్వేయర్: గనిని ప్రణాళిక ప్రకారం నడిపించి, బొగ్గు నిక్షేపాల గుర్తింపు, వాటిని ఏవిధంగా తీస్తే కంపెనీకి ఉపయోగకరంగా ఉంటుందో గమనించి అధికారులకు వివరించడం, కార్మికులకు పనులు పురమాయించడం వీరి విధి. ► ఆన్ షెట్టర్: గనిలోకి కార్మికులు, అధికారులను సిస్టమ్ ప్రకారం లోనికి పంపే యంత్రాన్ని(కేజీ) ఆపరేట్ చేస్తుంటారు. ► వైండింగ్ ఇంజన్ ఆపరేటర్: గనిలో అత్యంత ముఖ్యమైన వారు వైండింగ్ ఇంజన్ ఆపరేటర్లు. కేజీ గనిలోకి వెళ్లాలన్నా.. లోనికి వెళ్లిన కేజీ బయటకు రావాలన్నా వీరే కీలకం. ► గని మేనేజర్: గని మొత్తం ఈ అధికారి ఆధీనంలో ఉంటుంది. గనికి కావాల్సిన ప్రతి మెటీరియల్‌ను ఏరియా స్టోర్స్ నుంచి తెప్పించడం, వాటి కేటాయింపు బాధ్యతలను పర్యవేక్షించడం, కార్మికులకు విధులు కేటాయించడంతో పాటు గని పర్యవేక్షణంతా ఈ అధికారిదే. గుండెకాయలా కార్పొరేట్ సింగరేణి సంస్థకు కార్పొరేట్ కార్యాలయం గుండెకాయలా పనిచేస్తోంది. ఇందులో ప్రధానంగా ఐదుగురు డైరెక్టర్లు, 53 మంది జీఎంలు విధులు నిర్వహిస్తుంటారు. సింగరేణి వ్యాప్తంగా ఉన్న గనులు, డిపార్ట్మెంట్లను మానిటరింగ్ చేస్తుంటారు. మొత్తంగా చూస్తే సంస్థలో 43 వేల మంది కార్మికులు, 2,400 మంది అధికారులు పని చేస్తున్నారు. మరో 10 లక్షల కుటుంబాలకు ఈ సంస్థ పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. (క్లిక్ చేయండి: అక్షరదీపాలు.. నల్లసూరీళ్లు) -
ఆ 4 నెలలే ఎంతో కీలకం
సాక్షి, హైదరాబాద్: బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడానికి ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలి ఉన్న ఆ 4 నెలలు ఎంతో కీలకమని సింగరేణి సంస్థ చైర్మన్, ఎండీ ఎన్.శ్రీధర్ తెలిపారు. ఒడిశాలోని నైనీ బ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తిని సకాలంలో చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న 700 లక్షల టన్నులకుగానూ రోజుకు కనీసం 2.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా జరపాలని, లక్ష్యాలను రోజువారీగా సాధించడానికి కచ్చితమైన ప్రణాళికతో ముందుకు పోవాలని సూచించారు. శుక్రవారం హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి ఆయన సంస్థ డైరెక్టర్లు, అడ్వైజర్లు, అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో ఉత్పత్తి లక్ష్యాల సాధనపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. విద్యుత్ వినియోగం పెరిగిన నేపథ్యంలో బొగ్గుకు డిమాండ్ క్రమంగా పెరుగుతోందని, ఉత్పత్తి అయిన బొగ్గును వినియోగదారులకు అందించడం కోసం తగినన్ని రేకులను సమకూర్చుకోవడానికి కోల్ మూమెంట్ శాఖ రైల్వే వారిని సమన్వయపరచుకుంటూ ముందుకువెళ్లాలని శ్రీధర్ సూచించారు. సమావేశంలో డైరెక్టర్(ఆపరేషన్స్, పర్సనల్) ఎస్.చంద్రశేఖర్, డైరెక్టర్ (పి అండ్ పి, ఫైనాన్స్), డైరెక్టర్ (పి అండ్ పి, ఫైనాన్స్ ఎన్. బలరామ్, డైరెక్టర్ (ఈ అండ్ ఎం) డి.సత్యనారాయణరావు, అడ్వైజర్ డి.ఎన్.ప్రసాద్ (మైనింగ్), ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్) జె.ఆల్విన్ జీ.ఎం. (కో ఆర్డినేషన్) ఎం.సురేశ్, జీఎం (మార్కెటింగ్) కె. సూర్యనారాయణ, జీఎం (సీపీపీ) సీహెచ్. నర్సింహారావు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని ఏరియాల జీఎంలు, కార్పొరేట్ జీఎంలు పాల్గొన్నారు. -
సింగరేణి సిగలో ఒడిశా నైనీ
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ కేంద్రంగా బొగ్గు వెలికితీస్తున్న సింగరేణి సంస్థ తొలిసారిగా ఇతర రాష్ట్రాల్లోనూ ఉత్పత్తికి సిద్ధమైంది. ఒడిశాలోని నైనీ బ్లాక్‌లో బొగ్గు ఉత్పత్తికి తాజాగా సింగరేణికి గ్రీన్‌సిగ్నల్ లభించింది. గతేడాది డిసెంబర్ 1న కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ(ఎంఓఈఎఫ్) నుంచి నైనీ బ్లాకుకు పర్యావరణ అనుమతులు లభించగా, తాజాగా బుధవారం అటవీ అనుమతులు సైతం లభించాయి. ఒడిశాలోని చెండిపాడ, కంకురుపల్ రిజర్వ్ ఫారెస్టుతో పాటు విలేజ్ ఫారెస్టుకు సంబంధించిన 783.275 హెక్టార్ల అటవీ భూములను ఈ గనికి కేంద్ర పర్యావరణ శాఖ కేటాయించింది. దీంతో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించేందుకు కీలక అనుమతులన్నీ లభించినట్టయింది. మరో మూడు నెలల్లో నైనీలో సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి ప్రారంభించనుంది. తెలంగాణ బయట శ్రీకారం.. దక్షిణ భారతదేశంలో బొగ్గు ఉత్పత్తి చేస్తున్న ఏకైక సంస్థగా వందేళ్లకుపైగా రికార్డు సింగరేణి సంస్థ సొంతం. బ్రిటీష్ హయాంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లెందులో మొదలైన బొగ్గు ఉత్పత్తి.. ఆ తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగ ర్, వరంగల్ జిల్లాలకు విస్తరించింది. పెరుగుతున్న అవస రాలను దృష్టిలో ఉంచుకుని ఇ తర రాష్ట్రాల్లోని బొగ్గు నిక్షేపాలపై సింగరేణి దృష్టి సారించింది. 912 హెక్టార్లలో తవ్వకాలు మంచిర్యాల జిల్లా జైపూర్‌లో 1,200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాకును 2016లో కేంద్రం కేటాయించింది. ఒడిశాలోని అంగూల్ జిల్లాలో చంఢీపాద, కంకురూప గ్రామాల సమీపంలోని 912 హెక్టార్లలో నైనీ బొగ్గుబ్లాకు విస్తరించి ఉండగా, అందులో 783.275 హెక్టార్ల అటవీ భూములున్నాయి. నిబంధనల ప్రకారం ఒడిశాలోని అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా.. తెలంగాణలోని ఖమ్మం, కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో 794.63 హెక్టార్ల భూమిని అటవీ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సి ఉంది. ఏడాదికి పది మిలియన్ టన్నులు.. నైనీ బ్లాకులో మొత్తం 340 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. తొలిదశలో సర్ఫేస్ మైనర్ యంత్రాలతో ఓపెన్ కాస్ట్ మైనింగ్ విధానం ద్వారా బొగ్గు వెలికి తీయనున్నారు. ఈ ఓపెన్ కాస్ట్ గనుల జీవితకాలం 38 నుంచి 40 ఏళ్ల పాటు ఉంటుందని అంచనా. వార్షిక ఉత్పత్తి సామర్థ్యం పది మిలియన్ టన్నులుగా ఉంది. బొగ్గు ఉత్పత్తి కోసం సింగరేణి సంస్థ నుంచి 100 మంది ఉద్యోగులను నైనీకి తీసుకెళ్తారు. మరో 2,400 మందిని అక్కడ కాంట్రాక్టు పద్ధతిలో నియమించనున్నారు. స్థానికంగా పరిస్థితులు అనుకూలిస్తే మరో ఉపరితల గని కూడా ఏర్పాటు చేసే యోచనలో సింగరేణి ఉంది. శుభ పరిణామం.. – ఎస్.చంద్రశేఖర్, డైరెక్టర్(పా), సింగరేణి సంస్థ ఆరేళ్లుగా నైనీ బ్లాక్‌లో స్టేజీ–1, 2 అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాం. ఎట్టకేలకు బుధవారం పర్యావరణ శాఖ అనుమతి లభించడం శుభ పరిణామం. మరో 3–4 నెలల్లో నైనీబ్లాక్‌లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభిస్తాం. 2023 మార్చి 31 నాటికి సుమారు 3 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసేలా ప్రయత్నిస్తాం. కేంద్ర ప్రభుత్వం, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే రానున్న కాలంలో అక్కడ మరికొన్ని బ్లాక్‌లు ప్రారంభిస్తాం. -
సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
సింగరేణి(కొత్తగూడెం)/గోదావరిఖని: ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సింగరేణిలో రోజుకు 1.24లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వర్షాలు ప్రారంభమైన రెండుమూడ్రోజుల్లో నామమాత్రంగా బొగ్గు ఉత్పత్తి సాగినా, ఆ తర్వాత ఓవర్‌బర్డెన్ వెలికితీత పూర్తిగా నిలిచిపోయింది. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లోని 25 భూగర్భగనులు, 20 ఓపెన్‌కాస్ట్ (ఓసీ) గనుల్లో వర్షాకాలం కారణంగా తగ్గించిన లక్ష్యం మేరకు రోజుకు 1.84 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరగాల్సి ఉంది. కానీ, ఓసీల్లో 45 వేల టన్నులు, భూగర్భగనుల్లో 15 వేల టన్నుల ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది. సింగరేణి వ్యాప్తంగా రోజుకు 14 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగింపు కూడా స్తంభించిపోయింది. కొత్తగూడెం ఏరియా నుంచి రోజుకు సుమారు 32 వేల టన్నుల బొగ్గు రవాణా జరగాల్సి ఉండగా, రోజుకు 8 వేల టన్నుల బొగ్గునే రవాణా చేస్తున్నారు. మొత్తంగా గత వారం నుంచి సింగరేణి పరిధిలో 9.92 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం వాటిల్లగా, వారంలో రూ.300 కోట్ల మేర ఆదాయం మేర నష్టం జరిగినట్లు చెబుతున్నారు. సింగరేణి వ్యాప్తంగా నాలుగు రోజుల్లో 730 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
గుడ్‌న్యూస్: మెరుగుపడ్డ బొగ్గు ఉత్పత్తి
న్యూఢిల్లీ: దేశంలో బొగ్గు ఉత్పత్తి 2021–22 ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం పెరిగి 777 మిలియన్ టన్నులుగా (ఎంటీ) ఉన్నట్టు కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. వేసవి ఎండల నేపథ్యంలో విద్యుత్‌కు డిమాండ్ అనూహ్యంగా పెరుగుతుండడం గమనార్హం. దీంతో బొగ్గు నిల్వల కొరతపై వార్తలు వస్తున్న క్రమంలో మంత్రి చేసిన ప్రకటనకు ప్రాధాన్యం నెలకొంది. 2020–21 సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి 716 మిలియన్ టన్నులుగా ఉన్నట్టు మంత్రి గుర్తు చేశారు. బొగ్గు సరఫరా 18 శాతం పెరిగి 818 మిలియన్ టన్నులుగా నమోదైంది. బొగ్గు గనుల్లో భద్రతకు సంబంధించి స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ వివరాలు వెల్లడించారు. బొగ్గు గనుల్లో భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యమని చెప్పారు. భద్రతా చర్యల అమలు విషయంలో నిధుల కొరత రాకుండా చూసుకోవాలని కోరారు. గతేడాది అక్టోబర్‌లోనూ బొగ్గు నిల్వలు తగ్గిపోవడం తెలిసిందే. చదవండి: అక్టోబర్ నుంచే దేశంలో బొగ్గు కొరత: ఇంధనశాఖ కార్యదర్శి శ్రీధర్ -
బొగ్గు ఉత్పత్తిలో ఏపీఎండీసీ కీలక ముందడుగు
సాక్షి, అమరావతి: ప్రభుత్వరంగ సంస్థగా ఉన్న ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ (ఏపీ ఎండీసీ) మరో మైలురాయిని అధిగమించింది. జాతీయ స్థాయిలో సింగరేణి, కోల్ ఇండియాల సరసన ఇతర రాష్ట్రాల్లో వాణిజ్య సరళిలో బొగ్గు ఉత్పత్తి చేస్తున్న మూడో ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తింపును సాధించింది. మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లా సుల్యారీ బొగ్గుగనిని దక్కించుకున్న ఏపీఎండీసీ మార్చి 10వ తేదీ నుంచి ఈ గనిలో వాణిజ్య సరళిలో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించింది. 2007లోనే కేంద్రప్రభుత్వం ఈ బొగ్గుగని ఏపీఎండీసీకి కేటాయించినా, వివిధ కారణాల వల్ల మైనింగ్ కార్యక్రమాలు మాత్రం ప్రారంభం కాలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత సుల్యారీ కోల్ మైన్స్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బొగ్గు ఉత్పత్తికి ఎదురవుతున్న ఆటంకాలను పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ప్రాజెక్ట్ ప్రారంభమయ్యేందుకు ప్రభుత్వపరంగా ఏపీ ఎండీసీకి అవసరమైన ప్రోత్సాహాన్ని అందించడంతో గత ఏడాది ఆగస్టు నెలలో సుల్యారీలో బొగ్గు వెలికితీత పనులకు శ్రీకారం చుట్టారు. ఓవర్ బర్డెన్ పనులు పూర్తి చేసుకుని తాజాగా వాణిజ్య సరళి బొగ్గు ఉత్పత్తిని విజయవంతంగా ప్రారంభించడం ద్వారా ఏపీఎండీసీ తన విస్తరణలో కీలక ముందుడుగుగా వేసింది. సీఎం వైఎస్ జగన్ చొరవతోనే ఈ విజయం: మంత్రి పెద్దిరెడ్డి సీఎం వైఎస్ జగన్ విజన్ వల్లే ఏపీఎండీసీ ఇతర రాష్ట్రాల్లో కూడా విజయవంతంగా తన మైనింగ్ కార్యక్రమాలను నిర్వహించే సామర్థ్యాన్ని సాధించిందని రాష్ట్ర భూగర్భ గనులు, పీఆర్అండ్ఆర్డీ, గ్రామసచివాలయాల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. 2007లోనే ఏపీ ఎండీసీ మధ్యప్రదేశ్ లో సుల్యారీ బొగ్గుగనిని దక్కించుకున్నప్పటికీ 2019 వరకు ఒక్క అడుగు కూడా బొగ్గు ఉత్పత్తి విషయంలో ముందుకు పడలేదని అన్నారు. సీఎం జగన్ ఈ ప్రాజెక్ట్‌ను ఒక సవాల్‌గా తీసుకుని అటు కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ, ఇటు మధ్యప్రదేశ్ ప్రభుత్వాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూ బొగ్గు గనిలో ఉత్పత్తి ప్రారంభమయ్యేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారని అన్నారు. నేడు సుల్యారీలో వాణిజ్యసరళిలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కావడానికి సీఎం చేసిన కృషి కారణమని, ఈ సందర్బంగా సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోనే మైనింగ్ కార్యక్రమాలకు పరిమితమైన ఏపీఎండీసీ జాతీయ స్థాయిలో పెద్దపెద్ద సంస్థలతో పోటీగా బొగ్గు ఉత్పత్తి రంగంలో నిలబడటం, నిర్ధేశిత లక్ష్యాలను సాధించే దిశగా అడుగులు వేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏపీఎండీసీ విసి అండ్ ఎండీ విజి వెంకటరెడ్డి, ఇతర అధికారులు, కార్మికులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభినందించారు. ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని సాధించేందుకు, ప్రభుత్వ రంగ సంస్థల నైపూణ్యాలను పెంచుకుంటూ జాతీయ స్థాయిలో తమ కార్యక్రమాలను విస్తరింప చేసుకునేందుకు ప్రభుత్వం అవసరమైన ప్రోత్సాహాన్ని పూర్తిస్థాయిలో అందిస్తోందన్నారు. జార్ఘండ్ లోని బ్రహ్మదియా కోల్ బ్లాక్‌ను సైతం 2021లో ఏపీఎండీసీ పలు ప్రైవేటు సంస్థలతో పోటీ పడి బిడ్డింగ్ లో దక్కించుకుందన్నారు. అత్యంత నాణ్యమైన కోకింగ్ కోల్ ను ఈ బ్లాక్ నుంచి ఉత్పత్తి చేసేందుకు ఎపిఎండిసి ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించిందని తెలిపారు. ఉక్కు కర్మాగారాల్లో వినియోగించే ఈ కోకింగ్ కోల్ ను ఏపీఎండీసీ ద్వారా ఉత్పత్తి చేయడం వల్ల మన రాష్ట్ర అవసరాలకు ఇతర ప్రాంతాల నుంచి కోకింగ్ కోల్ ను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదని తెలిపారు. రాష్ట్రంలో బొగ్గుగనులతో పాటు ఇరత మేజర్ మినరల్స్ విషయంలోనూ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వరంగ సంస్థ ఏపీఎండీసీ ద్వారా మైనింగ్ కార్యక్రమాలను నిర్వహింపచేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. బొగ్గు ఉత్పత్తి ద్వారా ఏటా రూ.1200 కోట్లు ఆదాయం.. మధ్యప్రదేశ్‌లోని సుల్యారీ బొగ్గు గని నుంచి ఏటా 5 మిలియన్ టన్నుల బొగ్గును ఏపీఎండీసీ ఉత్పత్తి చేస్తుందని సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ విజి వెంకటరెడ్డి తెలిపారు. రూ.2వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఏపీఎండీసీ ఈ బొగ్గుగనిలో ఉత్పత్తి ప్రారంభించిందని, సాలీనా రూ.1200 కోట్ల రూపాయల ఆదాయం ఈ బొగ్గు గని ద్వారా లభిస్తుందన్నారు. మొత్తం 110 మిలియన్ టన్నులు బొగ్గు నిల్వలు ఈ గని పరిధిలో ఉన్నాయని, కనీసం 22 సంవత్సరాల పాటు బొగ్గు ఉత్పతి జరుగుతుందని వెల్లడించారు. అంతేకాకుండా ప్రస్తుతం నిర్ణయించిన 5 మిలియన్ టన్నులను మించి అదనంగా మరో రెండు మిలియన టన్నుల బొగ్గును కూడా ప్రతిఏటా వెలికితీసే అవకాశం ఉందని, ఈ మేరకు సంస్థ సామర్థ్యంను కూడా పెంచుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ నెల 10 తేదీ నుంచి వాణిజ్య సరళిలో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించామని, ఈ బొగ్గులో 25 శాతం సూక్ష్మా, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) లకు కేటాయిస్తామని, మిగిలింది విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు విక్రయిస్తామని తెలిపారు. ఎంఎస్ఎంఈ లకు బొగ్గు విక్రయాలకు సంబంధించి ఈ నెల 17వ తేదీన ఎం-జంక్షన్ ద్వారా ఈ-ఆక్షన్ కూడా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. విజయవంతంగా బొగ్గు ఉత్పత్తి సాధనలో పనిచేసిన సంస్థ ఉద్యోగులు, కార్మికులను అభినందించారు. -
వేసవి కాలంలో కరెంటు కోతలు తప్పవా..?
ధరలను పెంచలేకపోతే బొగ్గు ఉత్పత్తి పడిపోవచ్చని ప్రభుత్వ మైనర్ కోల్ ఇండియా లిమిటెడ్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. బొగ్గు ఉత్పత్తి పడిపోతే విద్యుత్ సహ ఇతర ఆధారిత రంగాలలో సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ప్రపంచంలోని అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారు అయిన కోల్ ఇండియాలో జీతాలు పెరగడం, డీజిల్ అధిక ధరల నుంచి సంస్థ ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. ధరలు పెంచకపోతే కంపెనీలోని కొన్ని యూనిట్లు మనుగడ సాగించడం కష్టం అని ఛైర్మన్ ప్రమోద్ అగర్వాల్ తెలిపారు. దీర్ఘకాలిక సరఫరా ఒప్పందాలలో భాగంగా కోల్ ఇండియా బొగ్గు ధరలను పెంచడానికి ప్రభుత్వ మద్దతు అవసరం. దేశంలో కరెంట్ ధరలు పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుంది. దేశంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి కావాల్సిన 70 శాతం బొగ్గును కోల్ ఇండియా ఉత్పత్తి చేస్తుంది. గత ఏడాది బొగ్గు ఉత్పత్తి పడిపోవడంతో విద్యుత్ ప్లాంట్ల వద్ద బొగ్గు నిల్వలు పడిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడ్డాయి. గత ఏడాది సెప్టెంబర్ నెలలో విద్యుత్ ప్లాంట్ల వద్ద బొగ్గు నిల్వలు కనిష్టస్థాయి నుంచి పెరిగినప్పటికీ, అవి ఇప్పటికీ ఏప్రిల్ 2020లో గరిష్ట నిల్వలలో మూడవ వంతు మాత్రమే ఉన్నాయి. వేసవి సమీపిస్తున్న కొద్దీ దేశంలో విద్యుత్ ఉత్పత్తికి డిమాండ్ పెరుగుతుంది. ఈ సమయంలో కోల్ ఇండియా బొగ్గు ఉత్పత్తి నిలిపివేస్తామని ప్రకటించడం ఆందోళన కలిగించే విషయం. (చదవండి: ఎలక్ట్రానిక్ చిప్స్ తయారీ కోసం వేదాంత గ్రూపు భారీగా పెట్టుబడులు..!) -
Singareni: ఆ‘గని’.. సమ్మె
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్రంలో నాలుగు బొగ్గు గనులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణి కార్మికులు చేపట్టిన సమ్మె రెండో రోజు శుక్రవారం కూడా విజయవంతమైంది. విధులను బహిష్కరించిన కార్మికులు పలుచోట్ల నిరసనలు చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రోడ్డుపై వెళుతున్న ప్రయాణికులను ఆపి పూలు ఇచ్చి సమ్మెకు మద్దతు తెలపాలని వేడుకున్నారు. సమ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా 11 ఏరియాలు, నాలుగు రీజియన్ల పరిధిలోని 25 ఓపెన్ కాస్టులు, 20 భూగర్భ గనులు బోసిపోయాయి. డంపర్లు, డోజర్లు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో గనులన్నీ నిర్మానుష్యంగా మారాయి. మొదటి, రెండో షిఫ్టుల్లో మొత్తం 34,753 మంది కార్మికులు విధులకు హాజరు కావాల్సి ఉండగా 29,300 మంది గైర్హాజరయ్యారు. భూగర్భ గనుల్లో పని చేసే అత్యవసర సేవల సిబ్బంది 4,709 మంది మాత్రమే విధులకు వచ్చారు. మరోవైపు 13,701 మంది కాంట్రాక్ట్ కార్మికుల్లో 4,340 మంది గైర్హాజరై సమ్మెకు మద్దతు తెలిపారు. రెండు రోజుల సమ్మెతో 4 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. దీంతో సంస్థకు సుమారు రూ.160 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఇటు కార్మికులు సైతం వేతన రూపంలో రూ.40 కోట్లు నష్టపోయారు. బొగ్గు రవాణాపై ఎఫెక్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణి ఉత్పత్తి చేస్తున్న బొగ్గు తెలంగాణతో పాటు ఏపీ, ఛత్తీస్‌గఢ్, హరియాణా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లో ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాలకు, సిమెంట్, ఐరన్, హెవీ వాటర్ ప్లాంట్, సిరామిక్స్, ఫార్మా, ఆగ్రో తదితర నాన్ పవర్ కంపెనీలకు రవాణా అవుతుంది. తెలంగాణలోని ప్రతిరోజూ 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుంది. ఇందులో ప్రతి రోజూ 1.30 లక్షల టన్నుల బొగ్గు ఇతర రాష్ట్రాలకు రవాణా అవుతుంది. 70 వేల టన్నుల బొగ్గును రాష్ట్ర అవసరాలకు వాడుతుంటారు. రెండు రోజుల సమ్మెతో ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన 2.40 లక్షల టన్నుల బొగ్గు రవాణాకు బ్రేక్ పడింది. 15న కేంద్రమంత్రితో చర్చలు.. సింగరేణి కార్మికులు చేపట్టిన సమ్మెను విరమింపజేసేందుకు కేంద్రం విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే రీజినల్ లేబర్ కమిషనర్ సమ్మెకు ముందే పలుమార్లు కార్మిక సంఘ నేతలతో హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. సమ్మె కొనసాగుతున్నా సంఘ నేతలతో చర్చలు జరిపారు. మొత్తం 12 డిమాండ్లతో సమ్మె చేపట్టగా, వాటిలో రాష్ట్రంలో నాలుగు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ మినహా మిగిలిన డిమాండ్లను దశల వారీగా పరిష్కరించేందుకు సింగరేణి సిద్ధమైంది. ప్రధానమైన బ్లాకుల ప్రైవేటీకరణ డిమాండ్ విషయంలో యాజమాన్యం ఎలాంటి హామీ ఇవ్వలేదు. దీంతో అధికారులు, కార్మిక సంఘ నేతలతో ఏర్పడిన జేఏసీ బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లద్ జోషితో చర్చించేందుకు ఈనెల 15, 16 తేదీల్లో ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమైంది. ఇందులో సింగరేణి సంస్థ నుంచి డైరెక్టర్ (పీఏడబ్ల్యూ) బలరాంనాయక్, జీఎం (పర్సనల్) ఆనందరావు, యూనియన్ నాయకులు వెంకట్రావ్ (టీబీజీకేఎస్), వాసిరెడ్డి సీతారామయ్య (ఏఐటీయూసీ), జనక్ ప్రసాద్ (ఐఎన్టీయూసీ), రాజిరెడ్డి (సీఐటీయూ), రియాజ్ (హెచ్ఎంఎస్), మాధవన్నాయక్ (బీఎంఎస్) ఢిల్లీలో జరిగే చర్చల్లో పాల్గొననున్నారు. -
5 ఏరియాలు టాప్, మరో ఆరు ఏరియాల్లో వెనుకంజ
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరం (2021 – 2022)లో 70 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని నిర్ధేశించుకుంది. అయితే ఏప్రిల్ నుంచి జూన్ వరకు మొదటి మూడు మాసాల్లో 16.44 మిలియన్ టన్నుల లక్ష్యానికి 15.56 మిలియన్ టన్నుల ఉత్పత్తి (95%)నే సాధించగలిగింది. మొత్తంగా ఐదు ఏరియాల్లో వంద శాతం ఉత్పత్తి సాధించగా, మిగిలిన ఆరు ఏరియాలు వెనుకంజలో ఉన్నట్లు అధికారిక గణాంకాల్లో వెల్లడించారు. కొత్తగూడెం రీజియన్‌లోని కొత్తగూడెం ఏరియా 29.75 లక్షల టన్నుల లక్ష్యానికి 29.76 (100%) టన్నులు, ఇల్లందు ఏరియా 14.71 లక్షల టన్నుల లక్ష్యానికి 15.44 లక్షల (105%) టన్నులు, మణుగూరు ఏరియా 26.72 లక్షల టన్నుల లక్ష్యానికి 32.97 (123%) సాధించి సింగరేణివ్యాప్తంగా అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఇక రామగుండం రీజియన్‌లోని రామగుండం–2 ఏరియాలో 19.35 లక్షల టన్నుల లక్ష్యానికి 19.87 లక్షల (103%) టన్నులు, రామగుండం–3 ఏరియా 14.80 లక్షల టన్నుల లక్ష్యానికి 15.38 లక్షల (104%) ఉత్పత్తి సాధించాయి. వెనుకబడిన ఆరు ఏరియాలు ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఏరియాల వారీ ఉత్పత్తి వివరాలను సింగరేణి తాజాగా వెల్లడించింది. మణుగూరు, ఇల్లెందు, రామగుండం–3, 2, కొత్తగూడెం ఏరియాలు లక్ష్యానికి మించి ఉత్పత్తి సాధించాయి. రామగుండం–1 ఏరియాలో పరిస్థితి మెరుగ్గానే ఉన్నా, మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, భూపాలపల్లి, ఆండ్రియాల ఏరియాలు వెనుకబడ్డాయి. ఆండ్రియాలలోనైతే 37 శాతం లక్ష్యాన్నే సాధించడం గమనార్హం. జూన్‌లో 102% ఉత్పత్తి సింగరేణిలో గడిచిన జూన్‌లో 20 ఓపెన్‌కాస్ట్ గనులు, 25 భూగర్భ గనుల్లో 51.83 లక్షల టన్నుల లక్ష్యానికి 52.71 లక్షల టన్నులు అంటే 102% ఉత్పత్తి సాధించింది. ఇందులోనూ కేవలం ఆరు ఏరియాల్లో వంద శాతం ఉత్పత్తి సాధించగా, మిగిలిన ఐదు ఏరియాలు వెనుకబడ్డాయి. ఇందులో రామగుండం–3 ఏరియా (139%) అగ్రస్థానంలో నిలిచింది. అయితే, జూన్‌తో పాటు త్రైమాసికం కలిపి పరిశీలిస్తే కొత్తగూడెం రీజియన్‌లోని మణుగూరు టాప్‌గా నిలిచింది. ఈ ఏరియాలో త్రైమాసికం ఉత్పత్తి 26,72,000 టన్నుల లక్ష్యానికి 32,79,877 టన్నులు అంటే 123%, జూన్‌లో 8,96,000 టన్నుల లక్ష్యానికి 11,83,879 (132%) టన్నుల ఉత్పత్తి సాధించి సింగరేణి వ్యాప్తంగా అగ్రస్థానంలో, ఇతర ఏరియాలకు ఆదర్శంగా నిలిచింది. వెనకబడిన ఏరియాల్లో పనితీరు మారాలి త్రైమాసిక, నెలవారీ ఉత్పత్తి సాధనలో వెనకబడిన ఏరియాల్లో తీరుమారాలి. రోజు, నెలవారీ, వార్షిక లక్ష్యాల సాధనకు కృషి జరగకపోతే బాధ్యులపై వేటు తప్పదు. బొగ్గు ఉత్పత్తిలో అధికారులు, సూపర్వైజర్లు, కార్మికులు అంకితభావంతో పనిచేయాలి. – ఎన్.శ్రీధర్, సింగరేణి సీఅండ్ఎండీ -
కరీంనగర్: సింగరేణి ఓపెన్‌కాస్ట్‌లో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి
-
వంద మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తే లక్ష్యం
సాక్షి, సింగరేణి(కొత్తగూడెం): సింగరేణిలో రానున్న నాలుగేళ్లలో ప్రస్తుతం సాధిస్తున్న 65 మిలియన్ టన్నుల బొగ్గు లక్ష్యాన్ని 100 మిలియన్ టన్నులు సాధించేందుకు అధికారులు, కార్మికులు సమిష్టిగా సాధించేందుకు కృషి చేస్తానని సింగరేణి సంస్థ నూతన డైరెక్టర్ ఎలక్ట్రికల్ అండ్ మెకానిక్ (ఈఅండ్ఎం) దొగ్గ సత్యనారాయణరావు తెలిపారు. డైరెక్టర్ ఈఅండ్ఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారి ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2015లో సింగరేణిలో సీఅండ్ఎండీగా శ్రీధర్ బాధ్యతలు చేపట్టిన తరువాత సంస్థను అభివృద్ధిలోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. ఆయన సూచనలు, సలహాలతో రూ.490 కోట్ల లాభాల్లో ఉన్న సింగరేణి అయిదేళ్లలో రూ.1700 కోట్ల ఆదాయాన్ని సాధించినట్లు తెలిపారు. వాటిలో రూ.కోట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల రూపంలో చెల్లించటమే కాకుండా కార్మికులకు 28శాతం వాటా కింద రూ.494 కోట్లను చెల్లించటం జరిగిందన్నారు. దీనిలో సీఅండ్ఎండీ పాత్ర కీలకం అన్నారు. బొగ్గు ఉత్పత్తి, రవాణాలో వివిధ రాష్ట్రాల్లో బొగ్గు పరిశ్రమలతోపాటు మహారత్న కంపెనీలకు దీటుగా పనిచేసి పలువురి ప్రశంసలు పొందిందన్నారు. ఇటువంటి సంస్థలో తనకు డైరెక్టర్‌గా అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇప్పటిì వరకు బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామిగా విరాజిల్లుత్ను సింగరేణి.... విద్యుత్ రంగంతో పాటు సోలార్ పవర్లో తనవంతు సత్తాను చూపనుందని, ఇందుకోసం మూడు స్టేజీలలో సింగరేణి వ్యాప్తంగా వివిధ ఏరియాల్లో దశలవారీగా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని, దానిలో భాగంగా నవంబర్ నాటికి మొదటి దశ పనులు పూర్తై సింక్రనైజేషన్ అవుతుందని ఆకాంక్షించారు. మిగతా రెండు దశల పనులు కూడా రానున్న రెండేళ్లలో పూర్తికానున్నామయని వివరించారు. కరోనా వైరస్ వచ్చిన తరువాత దేశం 23.4 శాతం అభివృద్ధిలో వెనుకంజలో ఉన్నట్లు ఆర్థికవేత్తలు ప్రకటించారని, ఈ ప్రభావం సింగరేణిపై కూడా పడిందని చెప్పారు. ఈక్రమంలో సంస్థ సుమారు 17 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి వెనుకంజలో ఉందని, ఈ నష్టాన్ని తోటి డైరెక్టర్లు , కిందిస్థాయి ఉద్యోగులతో చర్చించి బ్యాలెన్స్ చేసేందుకు తనవంతు సహాయ సహకారాలు అందిస్థానన్నారు. బొగ్గు అక్రమ రవాణాను అరికట్టేందుకు వెహికిల్ ట్రాకింగ్ సిస్టమ్ (వీటీఎస్) విధానాన్ని బలోపేతం చేసి నిఘా వ్యవస్దను పటిష్టం చేయనున్నట్లు చెప్పారు. సత్తుపల్లి–కొత్తగూడెం రైల్వేలైన్ పనులను వేగవం తం చేసి, బొగ్గు లారీల ద్వారా జరిగే ప్రమాదాలను నివారింపజేస్తామన్నారు. ఉత్పత్తి పెంచాలి.. ఇల్లెందు: సింగరేణి నూతన డైరెక్టర్ (ఈఅండ్ఎం) గా బాధ్యతలు చేపట్టిన డి.సత్యనారాయణ సింగరేణి పుట్టినిల్లైన ఇల్లెందు ఏరియాలో మంగళవారం పర్యటించారు. ఏరియా జీఎం పి.వి. సత్యనారాయణ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం డైరెక్టర్ మాట్లాడుతూ ఏరియాలో ఉత్పత్తి, ఉత్పాదకత పెంచాలన్నారు. కోవిడ్ దృష్ట్యా బొగ్గు కొనుగోలు కొంత తగ్గినా ఇప్పుడు బొగ్గుకు డిమాండ్ పెరుగుతుందని, ఉత్పత్తితో పాటు రవాణాను కూడా పెంచాలని సూచించారు. అనంతరం జేకేఓసీ సమీపంలోని సోలార్ ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు. ఆయన వెంట అధికారులు జానకిరామ్, సీహెచ్. లక్ష్మీనారాయణ, నర్సింహరావు ఉన్నారు. మళ్లీ అవాంతరం ‘కేటీపీఎస్’లో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి పాల్వంచ: కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్)5 దశ కర్మాగారంలో విద్యుత్ ఉత్పత్తికి అవాంతరం ఏర్పడుతోంది. బీహెచ్ఈఎల్ ఆధ్వర్యంలో 250 మెగవాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన 9వ యూనిట్లో ఆధునికీకరణ ముగిసి, సింక్రనైజేషన్ చేసినప్పటికీ చిక్కులు వీడట్లేదు. ఉత్పత్తి తరచూ నిలిచిపోతుందడటంతో జెన్కో సంస్థకు కోట్లాది రుపాయల నష్టం ఏర్పడుతోంది. నాలుగు రోజుల కిందట కర్మాగారంలో అధిక వైబ్రేషన్స్(ప్రకంపనలు) రావడంతో ఉత్పత్తిని నిలిపివేశారు. బీహెచ్ఈఎల్ సంస్థకు సమాచారం అందించి మరోమారు మరమ్మతులు చేపట్టారు. 5వ దశ కర్మాగారంలోని 9, 10యూనిట్ల ఆధునికీకరణ పనులను గత జూన్ 8వ తేదీన చేపట్టారు. వివిధ రాష్ట్రాలకు చెందిన వందలాది మంది టెక్నీషియన్లతో యుద్ధ ప్రాతిపదికన పనులు చేసి గత ఆగష్టు 12న సింక్రనైజేషన్ చేసి ఉత్పత్తిని రాష్ట్ర గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. అయితే టర్బైన్‌లో సాంకేతిక సమస్యతో ఉత్పత్తి పలుమార్లు నిలిచింది. తాజాగా బేరింగ్లు మార్చేందుకు భూపాలపల్లిలోని కేటీపీపీ నుంచి తెప్పించారు. మంగళవారం 250 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 10వ యూనిట్లో బాయిలర్ ట్యూబ్ లీకేజీ ఏర్పడి యూనిట్‌ను నిలిపివేశారు. మొత్తంగా 500 మెగావాట్ల ఉత్పత్తి ఆగింది. త్వరలోనే అందుబాటులోకి.. 9వ యూనిట్లో అధిక ప్రకంపనల కారణంగా బీహెచ్ఈఎల్ సంస్థ టెక్నీషియన్ల ద్వారా మరమ్మత్తులు చేయిస్తున్నాం. ఆధునికీకరణ తర్వాత కొన్ని కారణాలతో సమస్యలు వస్తున్నాయి. వాటిని పరిష్కరిస్తే ఇక ఎలాంటి ఇబ్బందులు ఉండవు. – కె.రవీంద్ర కుమార్, సీఈ, కేటీపీఎస్ 5,6 దశలు -
‘బొగ్గు’లో సంస్కరణల బాజా
న్యూఢిల్లీ: దేశీయంగా బొగ్గు ఉత్పత్తి పెంచడంతో పాటు మరింతగా పెట్టుబడులు ఆకర్షించే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంది. గనులు, ఖనిజాలు (అభివృద్ధి, నియంత్రణ) చట్టం 1957, బొగ్గు గనులు (స్పెషల్ ప్రొవిజన్స్) చట్టం 2015లో సవరణలను సవరిస్తూ ప్రత్యేక ఆర్డినెన్స్‌కు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం.. బొగ్గుయేతర సంస్థలు కూడా బొగ్గు గనుల బిడ్డింగ్‌లో పాల్గొనవచ్చు. అలాగే, అంతిమంగా బొగ్గు వినియోగంపైనా ఆంక్షలు ఉండవు. కేంద్ర క్యాబినెట్ భేటీ అనంతరం బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ విషయాలు వెల్లడించారు. నిర్దేశిత నిబంధనలకు అనుగుణంగా కనీస అర్హత గల ఏ కంపెనీ అయినా బొగ్గు గనుల వేలంలో పాల్గొనవచ్చు. ఈ కొత్త నిబంధనల కింద జనవరిలోనే తొలి విడత వేలం నిర్వహించనున్నట్లు బొగ్గు శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ జైన్ చెప్పారు. మొదటి విడతలో 40 బొగ్గు బ్లాకుల దాకా వేలం వేయనున్నట్లు వివరించారు. మరోవైపు, మార్చి 31తో మైనింగ్ లీజు ముగిసిపోయే ముడి ఇనుము, ఇతర ఖనిజాల గనుల వేలాన్ని గడువులోగా నిర్వహించే ప్రతిపాదనకు కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. కోల్ ఇండియాకూ మద్దతు ఉంటుంది.. అవకతవకల ఆరోపణల కారణంగా.. 2014లో సుప్రీం కోర్టు 204 బొగ్గు బ్లాకుల కేటాయింపును రద్దు చేసింది. అయితే, అంతిమంగా వినియోగించే అంశానికి సంబంధించి పరిమితుల కారణంగా వాటిలో కేవలం 29 బ్లాకులను మాత్రమే వేలం వేయడం జరిగింది. తాజాగా ఆంక్షలను ఎత్తివేయడంతో మిగతా బ్లాకుల వేలానికీ మార్గం సుగమం అవుతుందని జోషి చెప్పారు. ఈ రంగంలో పోటీని పెంచేందుకు, బొగ్గు దిగుమతులను తగ్గించుకునేందుకు, ప్రభుత్వ రంగ కోల్ ఇండియా గుత్తాధిపత్యాన్ని తగ్గించేందుకు కూడా ఈ చర్యలు ఉపయోగపడనున్నట్లు జైన్ చెప్పారు. అలాగని కోల్ ఇండియా ప్రాధాన్యాన్ని తగ్గించే యోచనేదీ లేదని, దాన్ని మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. 2023 నాటికి 1 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు దానికి తగినన్ని బ్లాక్‌లు కేటాయించడం జరుగుతుందని పేర్కొన్నారు. మరోవైపు, 334 నాన్–క్యాప్టివ్ ఖనిజ గనుల లీజు ఈ ఏడాది మార్చి 31తో ముగిసిపోనుంది. ఇవి మూతబడితే దాదాపు 60 మిలియన్ టన్నుల ముడి ఇనుము కొరత ఏర్పడవచ్చని జోషి తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఉత్పత్తికి కోత పడకుండా గడువులోగా ఖనిజాల గనుల వేలాన్ని కూడా నిర్వహించాలని.. బిడ్డింగ్‌లో గెలుపొందిన సంస్థకు ఇతరత్రా అటవీ, పర్యావరణ అనుమతులు కూడా బదలాయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. దీని వల్ల రెండేళ్ల సమయం ఆదా అవుతుందని, ఎలాంటి అవరోధాలు లేకుండా ఉత్పత్తి యథాప్రకారంగా కొనసాగుతుందని చెప్పారు. అత్యంత భారీ సంస్కరణలు: ప్రధాన్ వాణిజ్య అవసరాల కోసం బొగ్గు ఉత్పత్తి చేసేందుకు 2018లో ప్రైవేట్ కంపెనీలకూ అనుమతినిచ్చినప్పటికీ.. బొగ్గుపరిశ్రమయేతర సంస్థలను వేలంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించలేదు. తాజా మార్పుచేర్పులు బొగ్గు పరిశ్రమలో అత్యంత భారీ సంస్కరణలని చమురు, ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభివర్ణించారు. కేంద్ర నిర్ణయాన్ని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ సీఎండీ సజ్జన్ జిందాల్ స్వాగతించారు. ‘ఏటా 15 బిలియన్ డాలర్లకు పైగా ఉంటున్న బొగ్గు దిగుమతులను తగ్గించుకోవడానికి గణనీయంగా ఉపయోగపడుతుంది. చమురు ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గుల తరుణంలో.. ఇంధన రంగంలో భారత్ స్వయం సమృద్ధికి తోడ్పడుతుంది‘ అని జిందాల్ చెప్పారు. అంతిమ వినియోగంపై ఆంక్షల ఎత్తివేత నిర్ణయం.. దేశీయంగా బొగ్గు నిల్వల వెలికితీతకు, మరిన్ని విదేశీ సంస్థలు ఇన్వెస్ట్ చేసేందుకు తోడ్పడగలదని పరిశ్రమల సమాఖ్య సీఐఐ ప్రెసిడెంట్ విక్రమ్ కిర్లోస్కర్ చెప్పారు. బొగ్గు మైనింగ్ ఆర్డినెన్స్‌ను ఉక్కు పరిశ్రమ స్వాగతించింది. బొగ్గు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు, ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇది తోడ్పడగలదని ఇండియన్ స్టీల్ అసోసియేషన్ పేర్కొంది. ఈ సంస్కరణల ఊతంతో దేశీ ఉక్కు పరిశ్రమ .. అంతర్జాతీయ స్థాయిలో మరింతగా పోటీపడగలదని తెలిపింది. నీలాచల్ ఇస్పాత్ విక్రయానికీ గ్రీన్‌సిగ్నల్.. ఉక్కు సంస్థ నీలాచల్ ఇస్పాత్ నిగమ్ (ఎన్ఐఎన్ఎల్)లో ఆరు ప్రభుత్వ రంగ సంస్థల వాటాల వ్యూహాత్మక విక్రయానికి కూడా కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఈ విషయాన్ని తెలిపారు. ఎన్ఐఎన్ఎల్లో ఎంఎంటీసీ, ఎన్ఎండీసీ, బీహెచ్ఈఎల్, ఎంఈసీవోఎన్, ఐపీఐసీవోఎల్, ఒడిషా మైనింగ్ కార్పొరేషన్లకు వాటాలు ఉన్నాయి. మరోవైపు, నీలాచల్ ఇస్పాత్‌లో వాటాల విక్రయ ప్రతిపాదనను ఉక్కు రంగ కార్మికుల సమాఖ్య ఎస్‌డబ్ల్యూఎఫ్‌ఐ ఖండించింది. భూషణ్ స్టీల్, ఆధునిక్ స్టీల్ వంటి ప్రైవేట్ రంగ సంస్థలు మూతబడుతుంటే ప్రభుత్వ రంగంలోని సంస్థలు మెరుగ్గానే పనిచేస్తున్నాయని ఎస్‌డబ్ల్యూఎఫ్‌ఐ వర్కింగ్ ప్రెసిడెంట్ పి.కె. దాస్ చెప్పారు. వాటాల విక్రయ ప్రతిపాదనలను ప్రభుత్వం వెనక్కి తీసుకోకుంటే కార్మికులు సమ్మెకు దిగేందుకు సిద్ధమని తెలిపారు. -
రిటైర్మెంట్ రోజే బెనిఫిట్స్
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థలో రిటైౖరైన ఉద్యోగికి ఎటువంటి జాప్యం లేకుండా చివరి రోజే టర్మినల్ బెనిఫిట్స్ అందజేయాల్సి ఉందని, ఈ విషయంలో ఇంకా స్పష్టమైన ఆదేశాలిస్తామని సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ పేర్కొన్నారు. సంస్థ పరిధిలోని ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించడంతో పాటు 30 మంది స్పెషలిస్టు వైద్యులను ఇటీవల నియమించామని చెప్పారు. హైదరాబాద్‌లోని సింగరేణిభవన్‌లో బుధవారం గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాలు, అధికారుల సంఘంతో జరిగిన 36వ జాయింట్ కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాలు, అధికారుల సంఘాల సూచనలపై ఆయన సానుకూలంగా స్పందించారు. ఖాళీల భర్తీలో అర్హులైన సింగరేణి ఉద్యోగులకు 60 శాతం అవకాశం కల్పించడం, కొత్త బూట్లు, ఆర్వో మంచినీటి ప్లాంట్ల ఏర్పాటు వంటి అనేక సమస్యలపై వారంలోగా డైరెక్టర్ల స్థాయిలో చర్చించి సానుకూలంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఐదేళ్లలో అద్భుత ప్రగతి ఈ ఏడాది లాభాల బోనస్ చెల్లింపుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ఐదేళ్లుగా లాభాల బోనస్ ప్రకటించిన మాదిరిగానే ఈ సారి కూడా మెరుగైన స్థాయిలో ప్రకటించబడుతుందని శ్రీధర్ స్పష్టం చేశారు. దేశంలో మరే ఇతర ప్రభుత్వ సంస్థల్లో కూడా సింగరేణి స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలు అమలు జరగడం లేదని, ఇవి ఇలాగే కొనసాగించాలంటే సంస్థను అభివృద్ధి పథంలో నడిపించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా భూగర్భ గనుల్లో నష్టాలు భారీగా తగ్గించాలని, ఓసీ గనుల్లో యంత్రాల వినియోగం, పనిగంటలు పెరగాలని సూచించారు. దీనికి కార్మిక సంఘాలు కూడా తమ వంతు బాధ్యతగా కార్మికులకు అవగాహన కలిగించాలని కోరారు. సంస్థ గత ఐదేళ్లలో అద్భుత ప్రగతిని సాధించిందనీ, రానున్న కాలంలో కూడా లక్ష్యాల మేర కంపెనీని అభివృద్ధి చేస్తే రెట్టింపు సంక్షేమ ఫలాలు అందుకోగలమని, దీనికి కార్మిక సంఘాలు, అధికారులు, సిబ్బంది సమష్టిగా కృషిచేస్తూ, సహకరించాలని కోరారు. సింగరేణి భవిష్యత్తు ప్రణాళికలను ఈ సందర్భంగా ఆయన కార్మిక నేతలకు వివరించారు. సీఎం కేసీఆర్ సహకారంతో ఇతర రాష్ట్రాల్లో బొగ్గు బ్లాకులు చేపట్టి లాభదాయక మైనింగ్ ద్వారా లాభాలను ఆర్జించడానికి పథకాలు రూపొందిస్తున్నామని చెప్పారు. రూ.50 వేల కోట్ల టర్నోవర్.. 5 వేల కోట్ల లాభాలు రానున్న ఐదారేళ్ల కాలంలో 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి, 2,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని సాధించడానికి, తద్వారా 50 వేల కోట్ల టర్నోవర్, 5 వేల కోట్ల లాభాలను ఆర్జించడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, తద్వారా మహారత్న హోదా కూడా లభించి మరిన్ని మెరుగైన అభివృద్ధి అవకాశాలు పొందనున్నామని శ్రీధర్ వివరించారు. గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడు బి.వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, ప్రాతినిధ్య సంఘం అధ్యక్షుడు వై.గట్టయ్య, కార్యదర్శి ఎం.రంగయ్య, అధికారుల సంఘం అధ్యక్షుడు రమేశ్, కార్యదర్శి ఎన్.వి.రాజశేఖర్‌లు పలు అంశాలను సీఎండీ దృష్టికి తీసుకొచ్చారు. వాటిపై ఆయన సానుకూలంగా స్పందిస్తూ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని హామీనిచ్చారు. సమావేశంలో సంస్థ డైరెక్టర్లు ఎస్.శంకర్, ఎస్.చంద్రశేఖర్, భాస్కర్‌రావు, బలరాం తదితరులు పాల్గొన్నారు. -
నిత్యం 1.25 లక్షల టన్నుల బొగ్గు తరలింపు
సాక్షి, హైదరాబాద్: బొగ్గు ఉత్పత్తి, ఎగుమతులను భారీగా పెంచేందుకు దక్షిణ మధ్య రైల్వే, సింగరేణి బొగ్గు గనుల సంస్థలు నడుంబిగించాయి. సంయుక్త కార్యాచరణకు సిద్ధమయ్యాయి. సింగరేణి గనుల నుంచి దక్షిణ మధ్య రైల్వే నిత్యం లక్ష టన్నుల బొగ్గును వివిధ ప్రాంతాలకు రవాణా చేస్తోంది. సరుకు రవాణానే రైల్వేకు ఆయువుపట్టు అయినందున బొగ్గు తరలింపుపై దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక దృష్టి సారిస్తోంది. బొగ్గు తరలింపురూపంలో దక్షిణ మధ్య రైల్వే భారీ ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. ఇప్పుడు నిత్యం జరుగుతున్న లక్ష టన్నుల రవాణాను మరో 25 వేల టన్నుల మేర పెంచాలని భావిస్తోంది. సత్తుపల్లిలో గనిని ప్రారంభించనున్నందున అక్కడికి ప్రత్యేక రైల్వే లైన్‌ను నిర్మిస్తున్నారు. భద్రాచలం నుంచి సత్తుపల్లి వరకు 53 కి.మీ. మేర నిర్మితమయ్యే ఈ లైన్‌ను దక్షిణ మధ్య రైల్వే–సింగరేణి సంస్థలు సంయుక్తంగా చేపడుతున్నాయి. ఇందుకు అవసరమయ్యే 340 హెక్టార్ల భూమి సేకరణకు గాను రూ.95 కోట్లను రైల్వే శాఖ భరిస్తోంది. లైన్ నిర్మాణానికి అవసరమయ్యే రూ.600 కోట్లను సింగరేణి భరిస్తోంది. యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న ఈ పనులు వచ్చే సంవత్సరం పూర్తికానున్నాయి. ఆ వెంటనే కొత్త గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి, సరఫరాను ఈ రెండు సంస్థలు ప్రారంభించనున్నాయి. దీంతో బొగ్గు సరఫరాలో నిత్యం అదనంగా 25 వేల టన్నుల సామర్థ్యం కలుగుందని రైల్వే ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ఇది అటు సింగరేణి, ఇటు రైల్వే పురోగతికి కొత్త బాటలు వేస్తుందని అభిప్రాయపడ్డారు. ఇక నుంచి 3 గంటల్లోనే లోడింగ్.... ప్రస్తుతం సింగరేణి గనుల నుంచి నిత్యం దాదాపు 20 నుంచి 25 వరకు సరుకు రవాణా రైళ్లు బొగ్గును తరలిస్తున్నాయి. కానీ, పాత పద్ధతుల్లో బొగ్గు లోడింగ్ జరుగుతుండటంతో ఈ సామర్థ్యాన్ని పెంచటం సాధ్యం కావటం లేదు. ఒక్కో రేక్ (రైలు) బొగ్గు లోడింగ్‌కు 12 నుంచి 18 గంటల సమయం పడుతోంది. వ్యాగన్లను నిలిపి అక్కడి నుంచి ఇంజిన్ వెళ్లిపోతుంది. లోడింగ్ తర్వాత మరో ఇంజిన్ కోసం చూడాల్సిన పరిస్థితి ఉం టోంది. దీంతో వేగంగా లోడింగ్ జరిగేలా తాజాగా 2 సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. జూలై ఒకటి నుంచి ఇది అమలులోకి రానుంది. దీని ప్రకారం ఇంజిన్‌తో కూడిన రేక్ రాగానే వెంటనే లోడ్ చేసి పంపించాలి. ఇంజిన్‌ను మరో చోటికి పంపి, లోడింగ్ తర్వాత మరో ఇంజిన్ కోసం ఎదురు చూసే పనిలేకుండా, రేక్ రాగానే కేవలం 3 గంటల్లో లోడింగ్ పూర్తి చేసి పంపాలనేది ఒప్పంద సారాంశం. దీనివల్ల బొగ్గు రవాణా మరింత పెరిగి రెండు సంస్థలకు లాభం జరుగుతుందని అధికారులు చెబుతున్నా రు. శుక్రవారం రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ శివప్రసాద్, ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ జాన్ ప్రసాద్, సింగరేణి కాలరీస్ కం పెనీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ జె.ఆల్విన్ ఈ ఒప్పందంలో పాల్గొన్నారు. -
రూ.27,467 కోట్ల పన్నులు!
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థ గత ఐదేళ్లలో వివిధ రకాల పన్నుల రూపంలో రూ.27,467 కోట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించింది. 2014–19 మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.13,105 కోట్లు, కేంద్రానికి రూ.14,362 కోట్లను పన్నులు, ఇతర రూపాల్లో చెల్లించింది. గత ఐదేళ్లలో సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి, అమ్మకాలు, లాభాల్లో గణనీయ వృద్ధి సాధించడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించాల్సిన పన్నులు కూడా భారీగా పెరిగాయి. ఐదేళ్లలో రెట్టింపైన పన్నులు వివిధ సంస్థల మాదిరిగానే సింగరేణి కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలురకాల పన్నులు, డివిడెండ్ల రూపంలో సొమ్ము చెల్లిస్తుంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యాట్, స్టేట్ జీఎస్టీ, కాంట్రాక్టు ట్యాక్స్, ఎంట్రీ ట్యాక్స్, రాయల్టీ వంటి 9 రకాల పన్నులు చెల్లిస్తోంది. కేంద్రానికి డివిడెండ్‌తో పాటు సెంట్రల్ జీఎస్టీ, సర్వీస్ ట్యాక్స్, కస్టమ్స్ డ్యూటీ, స్వచ్ఛ భారత్ సెస్, కృషి కల్యాణ్ సెస్, జీఎస్టీ కాంపెన్సేషన్ సెస్, క్లీన్ ఎనర్జీ సెస్, ఎన్ఎంఈటీ వంటి 21 రకాల పన్నులను ఏటా చెల్లిస్తోంది. 2014–15లో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1,996.58 కోట్లు, కేంద్రానికి రూ.1,863.11 కోట్లు కలిపి మొత్తం రూ.3,859.69 కోట్లు చెల్లించింది. 2018–19లో రాష్ట్రానికి రూ.3,348.4 కోట్లు, కేంద్రానికి రూ.3,680.45 కోట్లు కలిపి మొత్తం రూ.7,028.85 కోట్లు చెల్లించింది. ఏ పన్ను ఎంత? గత ఐదేళ్ల కాలంలో సింగరేణి రాయల్టీల రూపంలో రూ. 8,678.82 కోట్లను రాష్ట్ర ఖజానాకు చెల్లించింది. రూ.1,240.67 కోట్ల వ్యాట్, రూ.485.33 కోట్ల సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, రూ.342.05 కోట్ల స్టేట్ జీఎస్టీ, రూ.78.83 కోట్ల వర్క్ కాంట్రాక్టు ట్యాక్స్, రూ.66.94 కోట్ల ఎంట్రీ ట్యాక్స్ చెల్లించింది. దీనికి అదనంగా డివిడెండ్ల రూపంలో రాష్ట్రానికి ఐదేళ్లలో రూ.420.66 కోట్లు చెల్లించింది. కేంద్రానికి చెల్లిస్తున్న వాటిలో క్లీన్ ఎనర్జీ సెస్‌దే అగ్రస్థానం. గత ఐదేళ్లలో రూ.4,864.41 కోట్ల క్లీన్ ఎనర్జీ సెస్ చెల్లించింది. రూ.4,095.86 కోట్ల జీఎస్టీ కాంపెన్సేషన్ సెస్, రూ.2,441.56 కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్, రూ.986.64 కోట్ల సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, రూ.395.73 కోట్ల సర్వీస్ ట్యాక్స్, రూ.342.05 కోట్ల సెంట్రల్ జీఎస్టీ, రూ.201.37 కోట్ల స్టోయింగ్ ఎక్సైజ్ డ్యూటీ, రూ.124.42 కోట్ల కస్టమ్స్ డ్యూటీ చెల్లించింది. దీనికి అదనంగా గత ఐదేళ్లకు కేంద్రానికి రూ.402.6 కోట్ల డివిడెండ్లను చెల్లించింది. 6 జిల్లాల అభివృద్ధికి రూ.1,844 కోట్లు సింగరేణి గనులు విస్తరించిన 6 జిల్లాల్లోని సమీప గ్రామాల అభివృద్ధి కోసం డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ట్రస్ట్ కార్యక్రమం కింద సింగరేణి సంస్థ 2016–17 నుంచి 2019 ఏప్రిల్ వరకు రూ.1,844 కోట్లు సంబంధిత జిల్లా ప్రభుత్వ యంత్రాంగానికి చెల్లించింది. -
సింగరేణిలో ప్రమాదాలను నివారిస్తాం
సాక్షి, హైదరాబాద్: సింగరేణిలో జరిగే ప్రమాదాలను శూన్య స్థాయికి తెచ్చేందుకు కృషిచేయాలని అధికారులకు, కార్మికులకు సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన సింగరేణి సంస్థ 45వ త్రైపాక్షిక రక్షణ సమీక్షా సమావేశంలో డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ, గుర్తింపు సంఘాల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బొగ్గు ఉత్పత్తి, రవాణా లో వృద్ధిరేటుతో పురోగమిస్తున్న సంస్థను ప్రమాదరహితంగా రూపుదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి గనిలో మ్యాన్ రైడి రగ్ సిస్టంలను ఏర్పాటు చేశామని, అందరికీ తేలికపాటి ఎల్ఈడీ క్యాపు ల్యాంపులను సమకూర్చామని తెలిపారు. ఓ.సి.గనుల్లో ఓ.బి (ఓవర్ బర్డెన్) డంపు సామర్థ్యంపై సిస్రో (ఆస్ట్రేలియా కంపెనీ)తో అధ్యయనం చేయిస్తున్నామని, భూగర్భ గను ల్లో రక్షణ పెంపుదలకు తగిన శిక్షణ, సూచనల కొరకు సిమ్టార్స్ (ఎస్ఐఎమ్టీఆర్ఎస్) సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు వివరించారు. ప్రమాదాలు జరుగుతున్న విభాగాలను, పరిస్థితులను గమనించి అక్కడ తీసు కోవాల్సిన రక్షణ చర్యలపై ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. రక్షణ అనేది యాజమాన్య బాధ్యతే కాదని, ప్రతి కార్మికుడు, ప్రతి అధికారి బాధ్యత అన్నారు. రక్షణ సూత్రాలు పాటిస్తూ, జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మాత్రమే ప్రమాదాలను నివారించి శూన్య స్థానానికి తీసుకురాగలమని పేర్కొన్నారు. డిప్యూటీ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (సౌత్ సెంట్రల్ జోన్) విద్యాపతి మాట్లాడుతూ, సింగరేణి సంస్థ తీసుకొంటున్న రక్షణ చర్యలు ప్రశంసనీయమన్నారు. టెక్నాజీలతో ఇక్కడి అధికారులు, కార్మికులు బాగా పనిచేస్తూ బొగ్గు ఉత్పత్తిని పెంచుతున్నారని, ప్రమాదాలనూ శూన్య స్థాయికి తెచ్చేందుకు కృషి చేయాలన్నారు. గుర్తింపు కార్మిక సంఘం (టీబీజీకేఎస్) అధ్యక్షుడు బి.వెంకట్రావు మాట్లాడుతూ, సింగరేణి యాజమాన్యం రక్షణకు కట్టుబడి పనిచేస్తున్నప్పటికీ దురదృష్టవశాత్తు ఏటా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. వీటి నివారణకు కార్మిక సంఘాలు చేస్తున్న సూచనలను సానుకూలంగా పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని, కార్మికులు కూడా భద్రతతో పనిచేయాలని సూచించారు. -
పెథాయ్ తుపాన్: నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి
సాక్షి, వరంగల్ / ఖమ్మం : పెథాయ్ తుపాన్ ప్రభావం వలన రాష్ట్రంలోని పాత వరంగల్, ఖమ్మం జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పాత వరంగల్ జిల్లాలోని ఏటూరు నాగారం, కన్నాయిగూడెం, మంగపేట, వాజేడు, వెంకటాపురం మండలాల్లో రాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తోన్న వర్షాలకు రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. మిరప పూతలు రాలిపోయి, దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని వాపోతున్నారు. జనగామా జిల్లా పాలకుర్తి మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం... జిల్లాలోని వైరా మండలంలో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాల వల్ల అన్నదాతలు భారీగా నష్టపోయారు. అశ్వరావుపేట మండలంలో అత్యధికంగా 80 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మధిర నియోజకవర్గ వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో ఇల్లందులోని జేకే 5 ఓసీ, కోయగూడెంలోని కేఓసీలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇవేకాక వర్షం కారణంగా సత్తుపల్లి నియోజకవర్గంలోని జేవీఆర్ సింగరేణి ఓపెన్ కాస్ట్లో సుమారు 5 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆంటకం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా జిల్లాలో పలుచోట్ల వరి, మొక్కజొన్న, ధాన్యం తడిసి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భధ్రాద్రి కొత్తగూడెం... పెథాయ్ తుపాన్ కారణంగా పినపాక నియోజకవర్గంతో పాటు అశ్వాపురం, మణుగూరు గుండాల మండలాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. దాంతో పలు చోట్ల వరి ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని.. ప్రభుత్వం తక్షణమే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. కరీంనగర్.. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మురుసు కమ్ముకుంది. చలి గాలులతో జనం వణికిపోతున్నారు. హుజురాబాద్, సైదాపూర్, శంకరపట్నం మండలాలలో చిరుజల్లులు పడుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలో చిరుజల్లులతో కూడిన ఓ మోస్తారు వర్షం కురిసింది. మంథని వ్యవసాయ మార్కెట్లో ధాన్యం తడిసిపోయింది. మార్కెట్‌ను ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు సందర్శించారు. రైతులకు టార్పాలిన్ కవర్లు ఇవ్వకపోవడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘దక్షిణ భారతంలో ఏకైక బొగ్గు ఉత్పత్తి సంస్థ’
సాక్షి, హైదరాబాద్: దక్షిణ భారతదేశంలోనే సింగరేణి ఏకైక బొగ్గు ఉత్పత్తి సంస్థగా ఉందని సింగరేణి జీఎం (కో–ఆర్డినేషన్, సీపీఆర్ఓ, స్ట్రాటజిక్ ప్లానింగ్) ఆంథోనిరాజా అన్నారు. వివిధ జిల్లాల్లో గ్రూప్–1 ట్రైనీలుగా శిక్షణ పొందుతున్న వారికి శుక్రవారం సింగరేణి భవన్లో సంస్థపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సింగరేణి బొగ్గు ఉత్పత్తి విధానాన్ని, బొగ్గు ద్వారా వివిధ రాష్ట్రాల థర్మల్ విద్యుత్ అవసరాలను తీరుస్తున్న విధానాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సింగరేణి పరిసర ప్రాంతాల ప్రజల కోసం సంస్థ చేస్తున్న సామాజిక, సేవా కార్యక్రమాలపై వారికి అవగా హన కల్పించారు. కార్యక్రమంలో డీజీఎం వెంకటేశ్వర్లు, డీజీఎం(ఎఫ్ఏ)రాజేశ్వర్‌రావు, డిప్యూటీ మేనేజర్ దుండే వెంకటేశం పాల్గొన్నారు. -
బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి సత్తా
సాక్షి, హైదరాబాద్: బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి సంస్థ సత్తా చాటింది. మే నెల బొగ్గు ఉత్పత్తి వివరాలను శుక్రవారం సింగరేణి యాజమాన్యం వెల్లడించింది. మే నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికీ బొగ్గు ఉత్పత్తిలో ముందు నిలిచిందని సంస్థ సీఎండీ శ్రీధర్ పేర్కొన్నారు. బొగ్గు రవాణాలో 11.6 శాతం, ఓబీ తొలగింపులో 20 శాతం వృద్ధితో 51 లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించామన్నారు. గతేడాది మే నెలలో 52.4 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేయగా, ఈ ఏడాది 58.4 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి 11.61 శాతం వృద్ధి నమోదు చేశామని తెలిపారు. గతేడాది 31.29 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించిన సంస్థ ఈ ఏడాది 37.63 మిలియన్ క్యూబిక్లను తొలగించి రికార్డు స్థాయిలో 20.3 శాతం వృద్ధిని నమోదు చేసిందన్నారు. గతేడాది 50 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తే ఈ ఏడాది 51 లక్షల టన్నులు చేసినట్లు శ్రీధర్ వెల్లడించారు. బొగ్గుతో పాటు విద్యుదుత్పత్తిలోను సంస్థ ముందుంది. -
కల్యాణిఖని ఓసీపీ సిద్ధం
- సింగరేణి ఖాతాలోకి మరో ఓపెన్‌కాస్ట్ - ఈ నెలాఖరులోగా ఉత్పత్తి ప్రారంభం ∙లక్ష్యం ఏటా 2 మిలియన్ టన్నులు సాక్షి, మంచిర్యాల: సింగరేణి ఖాతాలోకి మరో ఓపెన్‌కాస్ట్ గని చేరింది. మంచిర్యాల జిల్లా లోని మందమర్రి ప్రాంతంలో ప్రతిపాదించిన కల్యాణిఖని ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు పనులు శరవేగంతో సాగుతున్నాయి. ఈ నెలాఖరులోగా గని నుంచి బొగ్గు ఉత్పత్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీంతో సింగరేణిలో ఓపెన్‌కాస్ట్ గనుల సంఖ్య 19కి చేరనుంది. భూగర్భ గనుల స్థానంలోనే.. సింగరేణి మందమర్రి ఏరియాలో సోమ గూడెం 1, 1ఏ, 3 గనులతోపాటు కల్యాణిఖని 2, 2ఏ పేరుతో భూగర్భ గనులు ఉండేవి. భూగర్భగనుల ద్వారా బొగ్గు వెలికితీతతో నష్టాలు వస్తుండడంతో వీటిని 2006–07లోనే మూసివేసి ఓపెన్‌కాస్ట్ గనిని తేవాలని సంస్థ నిర్ణయించింది. ఓపెన్కాస్ట్లపై స్థానికంగా వ్యతిరేకత ఎదురవడం, భూ సమస్య, 1/70 గిరిజన చట్టం నేపథ్యంలో ప్రణాళికా బద్ధంగా సోమగూడెం 1వ గనితోపాటు కేకే 2 గని జీవితకాలాన్ని తగ్గించి మూసివేసింది. కాసిపేట ఓపెన్‌కాస్ట్ పేరుతో కొత్త గనికి అంకురార్పణ చేసేందుకు జరిగిన ప్రయత్నాలను స్థానికులు వ్యతిరేకించారు. దీంతో 2013లో మందమర్రి ఏరియాలోని కల్యాణిఖని–2 వద్ద ప్రజాభిప్రాయం చేపట్టి, కళ్యాణిఖని ఓపెన్‌కాస్ట్‌కు శ్రీకారం చుట్టింది. 945 హెక్టార్ల భూమి అవసరం కల్యాణిఖని ఓపెన్‌కాస్ట్ కోసం ప్రస్తుతం సింగరేణి సంస్థ అధీనంలో 246.17 హెక్టార్ల భూమి ఉండగా, మరో 250 హెక్టార్ల వరకు భూసేకరణ ద్వారా స్వాధీనం చేసుకుంది. మరో 250 హెక్టార్ల వరకు స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. పలు వివాదాల నేపథ్యంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న 500 హెక్టార్ల భూమిలో పనులు ప్రారంభించాలని నిర్ణయించి, మార్చి 24న భూమిపూజ చేశారు. ప్రస్తుతం ఓబీ (మట్టి) తొలగింపు పనులు శరవేగంగా సాగుతున్నాయి. కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ నిర్మాణం పూర్తయింది. కల్యాణిఖని ఓపెన్‌కాస్ట్ ప్రొఫైల్.. ఓపెన్‌కాస్ట్ కోసం అవసరమైన భూమి: 945.21 హెక్టార్లు గని విస్తీర్ణం: 799.98 హెక్టార్లు ముంపు గ్రామాలు: కాసిపేట మండలంలోని దుబ్బగూడెం, గొండుగూడెం గని జీవిత కాలం: 19 సంవత్సరాలు బొగ్గు నిల్వలు: 45.32 మిలియన్ టన్నులు భూగర్భం ద్వారా తీసిన బొగ్గు: సోమగూడెం –1, 1ఏ, 3, కె.కె–2, 2 ఏ ద్వారా 10.25 మిలియన్ టన్నులు తీయాల్సిన బొగ్గు: 30.54 మి.టన్నులు బొగ్గు గ్రేడ్ : జీ–10 ఉత్పత్తి లక్ష్యం: ఏటా 2 మిలియన్ టన్నులు పెట్టుబడి: రూ. 417.33 కోట్లు బొగ్గు, మట్టి వెలికితీత రేషియో: 1:12 బొగ్గు లభించే లోతు: 15 నుంచి 250 మీ. గనిలో తీసే మట్టి (ఓబీ): 365.49 మిలియన్ క్యూబిక్ మీటర్లు -
రవాణాలో 6.7 శాతం వృద్ధి
గోదావరిఖని/రుద్రంపూర్: 2017–18 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి నిర్దేశించుకున్న 660 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధన దిశగా యాజమాన్యం ముందుకెళుతోంది. ప్రణాళిలతో నెలవారీ లక్ష్యాలను అధిగమిస్తోంది. మే లో 50.5 లక్షల టన్నుల ఉత్పత్తి చేసి.. గత ఏడాది ఇదే నెలలో సాధించిన దాన్ని కన్నా 2.85 శాతం వృద్ధిని సాధించింది. ఇక బొగ్గు రవాణాలో కూడా 6.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది మేలో 49.2 లక్షల టన్నులు రవాణా చేయగా.. ఈ ఏడాది 52.5 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేయడం గమనార్హం. ఓపెన్‌కాస్ట్ గనుల్లో ఓవర్ఒర్డెన్ తొలగింపులో ఏకంగా 21.57 శాతం వృద్ధిని సాధించి ఆశ్చర్యానికి గురిచేసింది. 2016 ఇదే నెలలో 274 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ను వెలికితీయగా.. ఈ ఏడాది 333 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీని తొలగించింది. ఎండాకాలంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలు గరిష్ట స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి. కనుక ఈ కేంద్రాలకు బొగ్గు సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా చూడాలని సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ ఇచ్చిన ఆదేశాల మేరకు అన్ని ఏరియాల్లో ఉత్పత్తి, రవాణాను గరిష్ట స్థాయిలో జరిపారు. తద్వారా సింగరేణి ద్వారా బొగ్గును కొనుగోలు చేస్తున్న థర్మల్ విద్యుత్ కేంద్రాలు తమ సామర్థ్యం మేరకు బొగ్గును వినియోగించి.. తగినంత గ్రౌండ్ స్టాకును కూడా నిల్వ చేసుకున్నాయి. బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓవర్ బర్డెన్ తొలగింపులో మేలో సాధించిన ప్రగతిపై సీఎండీ ఎన్.శ్రీధర్ అన్ని ఏరియాల అధికారులు, కార్మికులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఇకపై ప్రతి నెలా స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. -
ఆదిలోనే మందగించిన ఉత్పత్తి
ఏప్రిల్‌లో ఆశించిన స్థాయిలో వెలికితీయని బొగ్గు ► ఆరు డివిజన్లలో లక్ష్యానికి దూరంగా... ► తొమ్మిది శాతంతో సరిపెట్టుకున్న అడ్రియాల సింగరేణిలో 2017–18 ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఆరంభంలోనే బొగ్గు ఉత్పత్తి మందగించింది. మొత్తం 11 డివిజన్లకు గాను ఐదు డివిజన్లలో మాత్రమే లక్ష్యానికి అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి సాధించగా.. మిగిలిన ఆరు డివిజన్లలో ఆశించిన మేర బొగ్గును వెలికితీయలేకపోయారు. ఇందులో భూపాలపల్లి డివిజన్ 121 శాతంతో ముందుండగా.. అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు ఏరియాలో కేవలం తొమ్మిది శాతం మాత్రమే బొగ్గును వెలికితీయడం గమనార్హం. గోదావరిఖని: సింగరేణి సంస్థలో 2016–17 ఆర్థిక సం వత్సరంలో 66 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని నిర్దేశించగా... ఆపసోపాలు పడి 61 మిలి యన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని వెలికితీశారు. అంటే బొగ్గు ఉత్పత్తి వస్తుందనుకున్న పలు ప్రాజెక్టుల నుంచి ఆశించిన మేర బొగ్గును వెలికితీయకపోవడంతో ఈ ప్రభావం సింగరేణి బొగ్గు ఉత్పత్తి లక్ష్యంపై పడింది. ఈ పరిణామాలను గుణపాఠాలుగా నేర్చుకుని 2017–18 ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్ నెల నుంచే నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించేందుకు ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు సాగాల్సిన యంత్రాంగం వెలికితీసిన ఉత్పత్తిని పరిశీలిస్తే ఆ మేరకు శ్రమించినట్టు కనిపించడం లేదు. ఐదు డివిజన్లలో లక్ష్యసాధన... సింగరేణి పరిధిలోని భూపాలపల్లి డివిజన్ ఏప్రిల్ నెలలో 121 శాతం బొగ్గు ఉత్పత్తితో ముందు వరుసలో ఉంది. ఇక్కడ భూగర్భ గనులతో పాటు ఓసీపీలలో ప్రణాళికాబద్ధంగా ఉత్పత్తి చేయడంతో ఇది సాధ్యమైంది. భూపాలపల్లిలో రోజువారీ బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 7,244 టన్నులుగా నిర్ణయిస్తే...10,945 టన్నులను వెలికితీశారు. అంటే నెలవారీగా పరిశీలిస్తే 1,73,856 టన్నుల లక్ష్యానికి గాను 2,11,148 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేశారు. ఇక బెల్లంపల్లి డివిజన్లో 106 శాతం, మణుగూరు డివిజన్లో 105 శాతం, ఆర్జీ–3 డివిజన్లో 104 శాతం, ఆర్జీ–1 డివిజన్లో వందశాతం బొగ్గు ఉత్పత్తి చేయగలిగారు. అడ్రియాలలో అత్యల్పంగా... రామగుండం రీజియన్ పరిధిలో సుమారు రూ. 1200 కోట్ల పెట్టుబడితో నెలకొల్పిన అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు నుంచి ఏప్రిల్ నెల ప్రారంభంలోనే ఆశించిన ఫలితాలు కానరాలేదు. అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు చరిత్రలోనే ఒక నెలలో కేవలం తొమ్మిది శాతం మేర మాత్రమే బొగ్గు ఉత్పత్తిని వెలికితీయడం గమనార్హం. ఈ గనిలో రోజుకు 10,592 టన్నుల లక్ష్యం నిర్ణయించగా...కేవలం 1067 టన్నులు మాత్రమే వెలికితీశారు. నెలవారీగా చూస్తే 2,54,208 టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను 21,920 టన్నులు మాత్రమే ఉత్పత్తి చేశారు. అంటే ఈ గని కోసం పెట్టుబడి అధికంగా పెట్టినా...ఆశించిన ఫలితాలు రాకపోవడంపై యాజమాన్యం ప్రత్యేక దృష్టి పెట్టి కారణాలను అన్వేషించాల్సి ఉంటుంది. ఇక కొత్తగూడెం డివిజన్లో 88శాతం, ఇల్లెందులో 43 శాతం, ఆర్జీ–2 డివిజన్లో 85శాతం, మందమర్రి డివిజన్లో 71 శాతం, శ్రీరాంపూర్ డివిజన్లో 88 శాతం బొగ్గు ఉత్పత్తి చేశారు. బొగ్గు ఉత్పత్తిపై పాలనా ప్రభావం? సింగరేణిలో మొత్తంగా వార్షిక సంవత్సరం ప్రా రంభ నెలలోనే 86శాతం బొగ్గు ఉత్పత్తి చేయడం పై పరిపాలనాపరమైన ఇబ్బందులు తలెత్తా యా? అనే అంశం చర్చకు దారితీస్తోంది. ఓ వైపు సింగరేణి సంస్థ రథసారధి, సీఎండీ పదవిలో ఉన్న ఎన్.శ్రీధర్‌కు పదవీ కాలాన్ని పొడిగించకపోవడం, కొత్త ప్రాజెక్టులు, వాటి తీరుతెన్నులపై పరిశీలన చేసే డైరెక్టర్ (ప్రాజెక్ట్సు, ప్లానింగ్) నెల రోజులుగా లేకపోవడం, ఆపరేషన్స్ డైరెక్టర్‌గా వ్యవహరించిన రమేషకుమార్ ఏప్రిల్ నెలాఖరులో పదవీవిరమణ పొందడంతో సంస్థలో పర్యవేక్షణ లోపించిందని కార్మిక సంఘాలు వాదిస్తున్నా యి. మే నెలలోనైనా బొగ్గు ఉత్పత్తికి ప్రత్యక్ష సం బంధమున్న డైరెక్టర్ (పీపీ), డైరెక్టర్ (ఆపరేషన్స్) పదవులను ప్రభుత్వం భర్తీచేస్తేనే నిర్దేశిం చిన బొగ్గు ఉత్పత్తి సాధ్యమవుతుందని సింగరేణియులు భావిస్తున్నారు. -
సింగరేణి నుంచి సౌరవిద్యుత్తు
- 275 మెగావాట్లు లక్ష్యంగా ప్రణాళిక - 11 ఏరియాల్లో స్థలాల ఎంపిక పూర్తి - గ్రిడ్ సమస్య తొలిగితే మరింత విద్యుత్ - రెండువేల మెగావాట్ల దిశగా సింగరేణి సాక్షి, భూపాలపల్లి: బొగ్గు ఉత్పత్తితో మొదలు పెట్టి థర్మల్ విద్యుత్ వరకు వచ్చిన సింగరేణి సంస్థ మరో అడుగు వేయనుంది. 2019–20 లోగా కనీసం 240 మెగావాట్ల సౌర్య విద్యు త్తు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 800 మెగావాట్లకు పెంచే అవకాశం ఉంది. థర్మల్ విద్యుత్ కేంద్రాల ద్వారా వెలువడు తున్న కాలుష్యం కారణంగా కేంద్రం సరికొత్త నిబంధనలు రూపొందించింది. థర్మల్ విద్యు త్ ఉత్పత్తి చేసే సంస్థలు తమ ఉత్పత్తి సామ ర్థ్యంలో 20 శాతం విద్యుత్‌ను సంప్రదాయే తర వనరులైన గాలి, సోలార్, గ్యాస్ ద్వారా ఉత్పత్తి చేయాలి. సింగరేణి సంస్థ మంచి ర్యాల జిల్లా జైపూర్‌లో 1,200 మెగావాట్ల సామర్థ్యం కలిగిన థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్వహిస్తోంది. కేంద్ర నిబంధనల ప్రకారం ఈ ప్లాంటు సామర్థ్యంలో 20 శాతం అంటే 240 మెగావాట్ల విద్యుత్‌ను 2019–20 లోగా తప్పనిసరిగా కాలుష్య రహిత విధానంలో ఉత్పత్తి చేయాలి. దీంతో సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై సింగరేణి సంస్థ దృష్టి సారించింది. సింగరేణి పరిధిలో ప్రతీ ఏరియాలో 25 మెగా వాట్ల వంతున 11 ఏరియాలకు కలిపి 275 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తికి ప్రణాళిక రూపొందించారు. ఇందుకు ప్రతీ ఏరియాలో ఒకే చోట ఐదెకరాల స్థలాన్ని గుర్తించాల్సిందిగా అన్ని ఏరియాలకు ఆదే శాలు వెళ్లాయి. వీటికి అనుగుణంగా స్థలా లను ఎంపిక చేసి సింగరేణి సంస్థ బిజినెస్ వింగ్‌కు పంపారు. సౌర విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేయడం కష్టం. ఈ గ్రిడ్ సమస్యకు పరిష్కారం లభిస్తే మరింత విద్యుత్ సాధించవచ్చు. మొత్తంగా సింగరేణి 2 వేల మెగావాట్ల దిశగా దూసుకెళ్తోంది. -
సింగరేణిలో సూపర్‌క్రిటికల్ ప్లాంట్
- జైపూర్‌లో 800 మెగావాట్ల థర్మల్ పవర్‌ప్లాంటుకు అనుమతి - డీపీఆర్ సిద్ధం చేస్తున్న సింగరేణి సంస్థ - 2015 మార్చి 3నే మూడో యూనిట్‌కు శంకుస్థాపన చేసిన సీఎం - ఇక 2,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా ఎస్టీపీపీ సాక్షి, మంచిర్యాల: బొగ్గు ఉత్పత్తిలో దేశంలో అగ్రగామిగా కొనసాగుతూ విద్యుత్ ఉత్పత్తిలోకి అడుగుపెట్టిన సింగరేణి సంస్థ మరో మైలురాయిని చేరుకోబోతుంది. జైపూర్‌లోని సింగరేణి థర్మల్ పవర్‌ప్లాంటు (ఎస్టీపీపీ) మూడో యూనిట్ ద్వారా 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు లభించినట్లు సమాచారం. తద్వారా ఎస్టీపీపీ విద్యుత్ ఉత్పత్తి 2,000 మెగావాట్లకు చేరుకోబోతుంది. తొలుత 1,800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి (ఒక్కో యూనిట్లో 600 మెగావాట్ల చొప్పున మూడు యూనిట్లు) లక్ష్యంగా ప్రారంభమైన ఈ ప్రాజెక్టులో ఇప్పటికే రెండు యూనిట్ల ద్వారా 1,200 మెగా యూనిట్ల ఉత్పత్తి సాగుతోంది. 100 శాతం పీఎల్ఎఫ్ (పవర్ లోడ్ ఫ్యాక్టర్)తో ఉత్పత్తి సాగిస్తున్న ఎస్టీపీపీకి 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ నిర్మాణానికి అడ్డంకులు తొలగితే సింగరేణి మరో రికార్డును సొంతం చేసుకున్నట్టే. తద్వారా దేశంలో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేసే çసూపర్ క్రిటికల్ పవర్ ప్రాజెక్టుల్లో ఎస్టీపీపీ కూడా చేరనుంది. 800 మెగావాట్లతో పవర్‌ప్లాంట్ జైపూర్ సింగరేణి థర్మల్ పవర్‌ప్లాంటు (ఎస్టీపీపీ) విస్తరణలో భాగంగా 2015మార్చి 3న మూడో యూనిట్ ప్లాంటుకు సీఎం కల్వ కుంట్ల చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేశారు. మూడో ప్లాంటును రూ.3,570కోట్ల వ్యయం తో మరో 600మెగా వాట్లతోనే థర్మల్ పవర్ ప్లాంటు ఏర్పాటు చేయాలని భావించారు. అయితే, కేంద్ర ప్రభుత్వం పర్యావరణ ఇబ్బం దులు తలెత్తకుండా చిన్నచిన్న పవర్ ప్లాంట్ల ఏర్పాటును నిరోధిస్తూ 800 మెగావాట్ల సూపర్‌క్రిటికల్ పవర్ప్లాంట్లను నిర్మించేలా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు దేశంలో ఇప్పటికే సూపర్ క్రిటికల్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాలు పలు రాష్ట్రాల్లో ప్రారంభమయ్యా యి. అందులో భాగంగానే సింగరేణి సంస్థ నిర్మించే మూడో దశ పవర్‌ప్లాంట్ సామర్థ్యం 800 మెగావాట్లకు అనుమతి లభించినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుకు అన్ని అనుమతులు మంజూరు చేసినట్లు ఓ అధికారి తెలిపారు. ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ రావడంతో మూడో యూనిట్ డీపీఆర్(డిటెల్ ప్రాజెక్టు రిపోర్టు) సిద్ధం చేస్తున్నారు. సింగరేణి సంస్థ ముందస్తు ఆలోచనతో గతంలోనే థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు కోసం 2200 ఎకరాల భూసే కరణ చేపట్టింది. దీంతో మూడో యూనిట్ నిర్మాణం సులభతరం కానుంది. రెండు యూ నిట్ల నిర్మాణాలతో పోల్చితే మూడో యూనిట్ నిర్మాణం వ్యయం తగ్గనుంది. విద్యుత్ ఉత్పత్తి కి బొగ్గు, నీరు అవసరం కాగా, ఈ రెండు వనరులు ఎస్టీపీపీకి అందుబాటులో ఉన్నాయి. బొగ్గు రవాణా కోసం రైల్వే లైన్ నిర్మాణం కూడా ప్రారంభించ బోతున్నారు. ఇక షెట్పల్లి గోదావరి నది నుంచి టీఎంసీ, కోటపల్లి మండలం దేవులవాడ నుంచి రెండు టీఎంసీల నీరు తరలిస్తున్నా రు. పవర్‌ప్లాంటులో రెండ్లు రిజర్వాయర్లు నిర్మించారు. బొగ్గు, నీరు అందుబాటులో ఉండడం ఖర్చు తగ్గడంతో పాటు సులభతరం కానుంది. మొదటి సారిగా 2011లో.. 127 ఏళ్లుగా బొగ్గు ఉత్పత్తితో దేశంలోని థర్మల్ విద్యుత్తు, పారిశ్రామిక రంగానికి ఆయువుప ట్టుగా నిలిచిన సింగరేణి సంస్థ 2011లో జైపూర్‌లో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు ప్లాంట్ల ద్వారా మొదటిసారిగా విద్యుత్ ఉత్పత్తి రంగంలోకి అడుగుపెట్టింది. రూ.8,250 కోట్ల వ్యయంతో నిర్మించిన 1,200 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం గల ఈ ప్లాంట్లను ఆగస్టు 2016లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిం చారు. ఈ రెండు ప్లాంట్ల నుంచి పూర్తిస్థాయి పవర్ లోడ్ ఫ్యాక్టర్‌తో 100 శాతం విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండడం రికార్డు. ఇప్పటి వరకు 4,246 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఎస్టీపీపీ ద్వారా ఉత్పత్తి చేయగా, అందులో 3,941 మిలియన్ యూనిట్లు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాలకే వినియోగించినట్లు సంస్థ చెబుతోంది. -
ఆర్జీ–1 గనులకు ఇసుక కొరత
► ఆశించిన స్థాయిలో రవాణా కాని బూడిద ► బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం గోదావరిఖని : సింగరేణి ఆర్జీ–1 డివిజన్ పరిధిలోని భూగర్భగనులకు ఇసుక కొరత ఏర్పడింది. దీంతో ఆయాగనుల్లోని పని స్థలాల్లో బొగ్గును వెలికితీసిన తర్వాత నింపేందుకు ఇసుక లేకపోవడంతో బూడిదను, ఓసీపీ మట్టి నుంచి వెలికితీసిన ఇసుక నింపుతున్నారు. కానీ 5వేల క్యూబిక్ మీటర్ల బూడిద, మట్టి నుంచి తీసిన ఇసుక అవసరం ఉండగా 1500 క్యూబిక్ మీటర్ల మేరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీనికారణంగా బొగ్గు ఉత్పత్తి కుంటుపడుతోంది. ఆర్జీ–1 ఏరియాలో జీడీకే 1వ గని, జీడీకే 2,2ఏ గ్రూపు గని, జీడీకే 5వ గని, జీడీకే 11వ గనిలో బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు. ఈ గనుల్లో ఒకనెల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 1.56 లక్షల టన్నులు నిర్ణయిస్తే 1.35 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి మాత్రమే వెలికి తీస్తున్నారు. గడిచిన 2016 ఏప్రిల్ నుంచి 2017 జనవరి వరకు పరిశీలిస్తే భూగర్భగనుల్లో కేవలం 78 శాతం బొగ్గు ఉత్పత్తి మాత్రమే జరిగింది. యాంత్రీకరణతోనే బొగ్గు ఉత్పత్తి ప్రస్తుతం ఆర్జీ–1లోని అన్ని గనుల్లో యాంత్రీకరణతోనే బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు. జీడీకే 1వ గనిలో ఎస్డీఎల్ యంత్రాలు, జీడీకే 2,2ఏ గనిలో ఎస్డీఎల్ యంత్రాలు, జీడీకే 5వ గనిలో ఎల్‌హెచ్‌డీ యంత్రాలు, జీడీకె 11వ గనిలో ఎల్‌హెచ్‌డీ యంత్రాలతో కంటిన్యూయస్ మైనర్ యంత్రం ద్వారా బొగ్గును వెలికి తీస్తున్నారు. ఈ గనుల ద్వారా రోజుకు సుమారు ఐదు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తే గనుల్లో ఏర్పడిన ఖాళీ ప్రదేశాల్లో అంతేమొత్తంలో పైకప్పులు కూలకుండా ఇసుక నింపాలి. ఇసుక కొరతతో ఇబ్బందులు... అయితే ప్రస్తుతం ఆర్జీ–1 గనుల్లో 5 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను సాండ్ స్టోవింగ్ ద్వారా నింపాల్సి ఉండగా అందుకనుగుణంగా ఇసుక లభించడం లేదు. దీంతో చాలా గనుల్లో వర్కింగ్ ప్లేస్‌లను అభివృద్ధి చేయకుండా బొగ్గు వెలికితీయడం లేదు. గోదావరినదిలో మేడిపల్లి ఓసీపీ సమీపంలో సింగరేణికి ఇసుక క్వారీ ఉన్నప్పటికీ పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు రాలేదు. గతంలో వెలికితీసిన జల్లారం క్వారీ ప్రస్తుతం మూసివేయడంతో సింగరేణి యాజమాన్యం అనివార్యంగా బూడిదపై ఆధారపడుతోంది. అయితే కుందనపల్లి సమీపంలోని బాటమ్ యాష్ (బూడిద)ను ఉపయోగించాలని భావించినా అది గనుల్లో నింపడానికి సరిపోవడం లేదని అధికారులు భావిస్తున్నారు. అందువల్ల ప్లాంట్‌లోనే విడుదలైన బాటమ్యాష్ను నేరుగా తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనికితోడు మేడిపల్లి ఓసీపీ వద్ద మట్టి నుంచి ఇసుకను తీసే ఓబీ ప్రాసెస్డ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయగా ఇందులో కూడా ఆశించిన ఫలితం కానరావడం లేదు. మొత్తం రోజుకు ఐదు వేల క్యూబిక్ మీటర్ల బూడిద గానీ, ఇసుక గానీ అవసరం ఉంటే ఈ రెండు కలిపి 1,500 క్యూబిక్ మీటర్లు కూడా రావడం లేదు. ఈ పరిస్థితుల్లో భూగర్భ గనుల నుంచి ఆశించిన మేర బొగ్గు ఉత్పత్తి రావడంపై ఆశలు పెట్టుకోవద్దని స్థానిక అధికారులు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లే పనిలో నిమగ్నమైనట్టు సమాచారం. -
రెండు గనులకు ఒక్కరే..!
► జీడీకే–2, 2ఏ గనులపై పర్యవేక్షణ కరువు ► ప్రమాదాలకు దారితీస్తున్న యాజమాన్య వైఖరి గోదావరిఖని : సింగరేణి రామగుండం రీజియన్ ఆర్జీ–1 డివిజన్ లోని జీడీకే–2, 2ఏ గనులు వేర్వేరుగా బొగ్గు ఉత్పత్తి చేస్తున్నా...వాటిని ఒకే గ్రూపు కిందకు తీసుకువచ్చి ఒక్కరే అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. దీంతో అధికారులపై ఒత్తిడి పెరిగి ఈ గనులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించే పరిస్థితి లేకుండా పోతున్నది. తదనుగుణంగా కార్మికులు అభ్రతతకు లోనవుతుండగా...రక్షణ చర్యలు లేక ప్రమాదాలకు గురవుతున్నారు. ఆర్జీ–1 డివిజన్ లో జీడీకే–2వ గనిలో వెయ్యికిపైగా, జీడీకే–2ఏ గనిలో 700 మంది వరకు కార్మికులు పనిచేస్తున్నారు. గతంలో ఈ రెండు గనులు వేర్వేరుగా పనిచేసేవి. ప్రతీ గనికి మేనేజర్, వెల్ఫేర్ ఆఫీసర్, వెంటిలేషన్ ఆఫీసర్, సేఫ్టీ ఆఫీసర్ తదితర విభాగాలకు అధికారులు వేర్వేరుగా ఉండేవారు. 2009లో ఈ రెండు గనులను ఒక్కటిగా చేసి ఒకే గ్రూపు మైన్ గా మార్పు చేశారు. అయితే జీడీకే–2వ గనికి, జీడీకే–2ఏ గనికి భూగర్భంలో టన్నెల్ ఏర్పాటు చేయకపోవడంతో ఈ గనుల్లోకి కార్మికులు వేర్వేరుగా వెళ్లి పనిచేస్తున్నారు. జీడీకే–2వ గనిలో 9 ఎస్డీఎల్ యంత్రాల ద్వారా రోజుకు 1200 టన్నుల బొగ్గు ఉత్పత్తి, జీడీకే–2ఏ గనిలో ఆరు ఎస్డీఎల్ యంత్రాల ద్వారా 800 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు. రెండు గనుల్లో కార్మికులు పనిచేస్తున్నా అధికారులు ఒక్కరే కావడంతో గనుల్లో ఏర్పడే సమస్యలను పరిశీలించేందుకు వారికి అనుకూల సమయం లభించడం లేదు. 2013లో రెండు గనులకు సంబంధించి గని మేనేజర్లను, వెల్ఫేర్ ఆఫీసర్లను, వెంటిలేషన్ ఆఫీసర్లను నియమించాలని కార్మిక సంఘాలు పలు కమిటీల సమావేశాలలో యాజమాన్యాన్ని కోరినా పట్టించుకున్న పాపానపోలేదు. ఈ క్రమంలో అధికారుల పర్యవేక్షణ లోపం, పని ఒత్తిడి కారణంగా పనిస్థలాలపై ప్రత్యేక దృష్టి పెట్టకపోవడంతోనే శుక్రవారం తెల్లవారుజామున జీడీకే–2ఏ గనిలో సైడ్ బొగ్గు కూలిన ప్రమాదంలో సపోర్ట్మెన్లు ముస్కె ఓదెలు, పైడిపల్లి రాజయ్య తీవ్రంగా గాయపడ్డారు. ఇదే ఘటనలో వై.వెంకటస్వామి, తిప్పర్తి స్వామి, డి.శంకరయ్యకు స్వల్పగాయాలయ్యాయని కార్మిక సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఇసుక నింపకపోవడంతోనే.. – హెచ్ఎంఎస్ జీడీకే–2ఏ గనిలోని ఒకటో సీమ్ ఇరవైమూడున్నర లెవల్, 40 డిప్ ప్రాంతంలో జరుగుతున్న పనులపై అండర్ మేనేజర్ పర్యవేక్షణ లేదని, గతంలో వెలికితీసిన బొగ్గు ప్రాంతంలో సరిగ్గా ఇసుక నింపకపోవడం మూలంగానే బొగ్గు వదులుగా మారి పనిచేస్తున్న సపోర్ట్‌మెన్ కార్మికులపై సైడ్ బొగ్గు పడిందని హెచ్ఎంఎస్ నాయకులు ఆరోపించారు. ప్రమాదం జరిగిన తర్వాత యూనియన్ ఉపాధ్యక్షులు యాదగిరి సత్తయ్య, షబ్బీర్ అహ్మద్, జూపాక రాజయ్య, కాటిక శ్రీనివాస్ తదితరులు పనిప్రదేశం వద్దకు వెళ్లి పరిశీలించారు. పనిస్థలంలో పక్కనున్న బొగ్గు కూలకుండా రక్షణ చర్యలు చేపడుతున్నప్పటికీ సరిగ్గా ఇసుక నింపకపోవడం వల్లనే కదలికలు ఎక్కువగా ఏర్పడి బొగ్గు కూలిందని వారు పేర్కొన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
సింగరేణి వెలుగుల రికార్డులు
విద్యుత్ ఉత్పత్తితో పాటు బొగ్గు తవ్వకాలు, రవాణాల్లోనూ రికార్డు సింగరేణి చరిత్రలో మంచిర్యాల జిల్లాకు ప్రత్యేక స్థానం బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్య సాధన దిశగా సింగరేణి కార్మికులు మంచిర్యాల : జైపూర్ సింగరేణి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు (ఎస్టీపీపీ) రాష్ట్రానికి వెలుగులు పంచడంలో రికార్డు సాధించింది. మంచిర్యాల జిల్లాలో సింగరేణి రూ.8,500 కోట్ల వ్యయంతో నిర్మించిన థర్మల్ ప్రాజెక్టు.. ఉత్పత్తి ప్రారంభించిన ఏడు నెలల్లోనే ఏకంగా 1980 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసింది. పూర్తిగా రాష్ట్ర విద్యుత్ అవసరాల కోసమే ఉద్దేశించబడిన ఈ ప్రాజెక్టు నుంచి గజ్వేల్‌లోని పవర్‌గ్రిడ్‌కు ఏకంగా 1821 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను అనుసంధానం చేసి రికార్డు సృష్టించింది. జైపూర్‌లోని సింగరేణి విద్యుత్ ప్రాజెక్టులో మూడు ప్లాంట్ల నుంచి 600 మెగావాట్ల చొప్పున ఉత్పత్తి లక్ష్యం కాగా, ప్రస్తుతం రెండు ప్లాంట్లలో ఉత్పత్తి జరుగుతోంది. 2015 జూన్ నెల నుంచి ఈ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి ప్రారంభమైంది. 28 మిలియన్ యూనిట్ల సగటుతో ప్రతిరోజూ ఈ ప్లాంట్ల నుంచి విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఇక్కడ ఉత్పత్తి అయిన విద్యుత్ రాష్ట్ర అవసరాలను తీర్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. తెలంగాణ జెన్కోకు విద్యుత్ సరఫరా చేసే థర్మల్ ప్రాజెక్టుల్లో చెప్పుకోదగ్గ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్‌లోని 11 యూనిట్ల నుంచి 1720 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అవుతుండగా, రామగుండం థర్మల్ ప్రాజెక్టులోని పురాతనమైన ఒక ప్లాంట్ నుంచి 63.5 మెగావాట్లు జెన్కోకు వెళుతోంది. ఇక రెండు ప్లాంట్లతో 1200 మెగావాట్ల కెపాసిటీతో జూన్‌లోనే ఉత్పత్తి ప్రారంభించిన జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ఏడు నెలల కాలంలోనే ఏకంగా 1980 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించడం గమనార్హం. కాగా.. ఇకపై కూడా పూర్తి సామర్థ్యంతో థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభించి, రాష్ట్ర అవసరాలకు అందించేందుకు అధికారులు, సిబ్బంది కృషి చేయాలని సింగరేణి సీఎండీ ఎన్. శ్రీధర్ ఈ సందర్భంగా అధికారులు, సిబ్బందికి సూచించారు. డిసెంబర్ నెల బొగ్గు ఉత్పత్తి, రవాణాల్లో ఆల్‌టైం రికార్డు మంచిర్యాల జిల్లాలోని జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తిలో దూసుకుపోతుంటే.. బొగ్గు తవ్వకాలు, రవాణాల్లో కూడా ఈ సంస్థ డిసెంబర్ నెలలో రికార్డు సాధించింది. ఇందులో సైతం మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలోని బెల్లంపల్లి కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (సీహెచ్‌పీ), మందమర్రి నుంచి 164 రైల్వే వ్యాగన్ బండ్లు(రేకులు) లోడ్ చేయడం గమనార్హం. డిసెంబర్ నెలకు నిర్దేశించుకున్న బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 52.78 లక్షల టన్నులు కాగా, కంపెనీ 59.52 లక్షల టన్నులు (113 శాతం) ఉత్పత్తి చేసింది. సింగరేణి చరిత్రలో ఇప్పటి వరకు గత డిసెంబర్ 2015లో సాధించిన 57.40 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తే అత్యధిక రికార్డు కాగా, 2016 డిసెంబర్లో 59.52 లక్షల టన్నులతో పాత రికార్డులను అధిగమించింది. అలాగే బొగ్గు రవాణాలో కూడా 2015 డిసెంబర్ (54.42 లక్షల టన్నులు) కన్నా 2016 డిసెంబర్లో 59.84 టన్నుల బొగ్గు రవాణా చేసి రికార్డు సృష్టించింది. రైల్వే వ్యాగన్ల రేకులు లోడ్ చేయడంలో మంచిర్యాల, బెల్లంపల్లితో పాటు రుద్రంపూర్ (కొత్తగూడెం) 207 రేకులు, జీడీకే 1–129, ఓసీ–3 155 రేకులు ఉన్నాయి. బొగ్గు ఉత్పత్తి వార్షిక లక్ష్యాన్ని చేరుకునేందుకు కూడా సింగరేణి కార్మికులు ఈ మూడు నెలలు శ్రమించాలని ఈ సందర్భంగా సీఎండీ శ్రీధర్ సూచించారు. -
ఆర్జీ–1లో పుంజుకుంటున్న బొగ్గు ఉత్పత్తి
గోదావరిఖని : ఆర్జీ–1 ఏరియాలో గతంతో పోల్చుకుంటే బొగ్గు ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోందని సీజీఎం సీహెచ్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఆదివారం జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నడూ లేని విధంగా ఆర్జీ–1 ఏరియాలోని జీడీకే 1వ గనిలో గడిచిన డిసెంబర్లో 106 శాతం, జీడీకే 5వ గనిలో 105 శాతం, మేడిపల్లి ఓసీపీలో 117 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించామన్నారు. జీడీకె 11వగనిలో కంటిన్యూయస్ మైనర్ ద్వారా బొగ్గు ఉత్పత్తి వెలికితీయడం ప్రారంభమైందని, మేడిపల్లి ఓసీపీలో కూడా మరింత ఎక్కువగా బొగ్గు ఉత్పత్తి రానుందన్నారు. ఈ నేపథ్యంలో రానున్న మూడునెలల్లో ఆర్జీ–1 ఏరియాకు నిర్దేశించిన 62 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించగలుగుతామని దీమా వ్యక్తం చేశారు. మేడిపల్లి ఓసీపీ గడిచిన తొమ్మిది నెలల కాలంలో వంద శాతం బొగ్గు ఉత్పత్తి చేసి ముందు వరుసలో ఉందన్నారు. జీడీకే 1 సీఎస్పీ నుంచి గత నవంబర్ నెలలో 122 ర్యాక్‌ల ద్వారా బొగ్గు రవాణా చేస్తే...డిసెంబర్లో 128 ర్యాక్‌ల ద్వారా బొగ్గు రవాణా చేశామని, ఇది సీఎస్పీ చరిత్రలో ఉత్తమమైన ప్రతిభ అని ఆయన ప్రకటించారు. జి–5 గ్రేడ్ బొగ్గు రవాణాకు చర్యలు... సింగరేణి సంస్థ తమిళనాడులోని జెన్ కో సంస్థతో చేసుకున్న ఒప్పందం మేరకు భూపాలపల్లి డివిజన లో లభించే జి–5 గ్రేడ్ బొగ్గును గోదావరిఖనికి లారీల ద్వారా తెప్పించి ఇక్కడి జీడీకె–1 సీఎస్పీ నుంచి రైల్వే వ్యాగన్ల ద్వారా పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సీజీఎం సిహెచ్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఇటీవల జి–5 గ్రేడ్ బొగ్గు రవాణాకు ట్రయల్ రన్ నిర్వహించామని, ముందుగా ఒక ర్యాక్(సుమారు 4 వేల టన్నుల బొగ్గు)నింపడానికి ఆరు గంటల సమయం పట్టిందని, ఆ తర్వాత పలు చర్యలు తీసుకోవడంతో ఆ సమయం మూడు గంటలకు తగ్గిందన్నారు. మరో వారం రోజుల్లో తమిళనాడుకు పూర్తి స్థాయిలో జి–5 గ్రేడ్ బొగ్గు రవాణా చేయనున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో ఎస్ఓటు సీజీఎం ఎ.సుధాకర్‌రెడ్డి, హన్మంతరావు, సాయిరామ్, రాజేశ్వరరావు, సూర్యనారాయణ, మంచాల శ్రీనివాస్, రమేశ్, గంగాధర్, ప్రకాశ్ పాల్గొన్నారు. -
సమ్మె సక్సెస్
కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసించిన కార్మిక, ఉద్యోగ సంఘాలు మూతపడిన వాణిజ్య, వ్యాపార, విద్యా సంస్థలు స్తంభించిన రవాణా వ్యవస్థ సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి న్యూశాయంపేట : కేంద్రం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో సమ్మె విజయవంతమైంది. దేశంలోని పది ప్రధాన కార్మిక సంఘాలు, కేంద్ర ప్రభుత్వ రంగంలోని సుమారు 20 ఉద్యోగ సంఘాల ఫెడరేషన్లు, ఉద్యోగ సంఘాలు ఐక్యంగా సమ్మెకు దిగాయి. పన్నెండు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందుంచి ఈ సమ్మెలో పాల్గొన్నాయి. ఈ సమ్మెలో బీజేపీ అనుబంధ బీఎంఎస్ మినహా సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, టీడీపీ తదితర పార్టీల అనుబంధ కార్మి సంఘాలు సమ్మెలో పాల్గొన్నాయి. సమ్మె ప్రభావంతో బ్యాంకులు, వాణిజ్య, వ్యాపార, విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రవేటు కార్యాలయాలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ఆటో కార్మిక సంఘాలు కూడా సమ్మెలో పాల్గొన్నాయి. రవాణా వ్యవస్థ స్తంభించింది. బస్సులు నడవకపోవడంతో ప్రైవేటు వాహనాల వారు ప్రయాణికుల నుంచి అధిక మెత్తంలో డబ్బులు వసూలు చేశారు. బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడంతో లావాదేవీలు నిలిచిపోయాయి. సినిమా హాళ్లు మూతపడ్డాయి. కార్మికుల ర్యాలీలు, ధర్నాలో పలు పార్టీల నేతలు పాల్గొని సంఘీభావం తెలిపారు. ప్రధానంగా.. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, కనీస వేతనం రూ.18వేలు ఇవ్వాలని, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దుచేసి ఇప్పుడున్న ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని, అసంఘటిత, వ్యవసాయ కార్మికులకు సామాజిక భద్రతతో పాటు, కేంద్ర ప్రభుత్వ స్కీముల్లో పనిచేస్తున్న వారిని కార్మికులుగా గుర్తించాలని, ప్రభుత్వరంగ సంస్థల్లో వాటా అమ్మకాలను నిలిపివేయాలని, రక్షణ, బ్యాంకు, ఇన్సూరెన్స్ తదితర రంగాల్లో ఎఫ్‌డీఐలను అనుమతించొద్దని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొన్నాయి. నిలిచిన బొగ్గు ఉత్పత్తి సింగరేణి భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 1, 2, 5, 6, ఓసీపీ, కేఎల్పీ గనుల్లో ఉత్పత్తి పూర్తిగా స్తంభించింది. కేవలం అత్యవసర సర్వీసులలో పనిచేసే కార్మికులు మాత్రమే వి«ధులకు హాజరయ్యారు. ఏరియాలో ఒకరోజు ఉత్పత్తి 12వేల టన్నులు పూర్తిగా నిలిచిపోయి రూ.3 కోట్ల నష్టం వాటిల్లింది. -
గోదారి పరవళ్లు
మొదటి ప్రమాద హెచ్చరిక జారీ జిల్లా వ్యాప్తంగా వర్షాలు భూపాలపల్లి ఓసీపీలో చేరిన నీరు.. నిలిచిన బొగ్గు ఉత్పత్తి హన్మకొండ గడిచిన రెండు వారాలుగా కమ్ముకున్న మబ్బులు ఆదివారం చిరుజల్లులు కురిపించాయి. భారీ వర్షం కాకున్నా ఉదయం నుంచి రాత్రి వరకు చినుకులు పడడంతో రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. జిల్లా వ్యాప్తంగా 1.3 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా భూపాలపల్లిలో 4.6 సెంటీమీటర్లు, చిట్యాల, ఏటూరునాగారం, తాడ్వాయి మండలాల్లో 3 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. మరోవైపు ఎనిమిది మండలాల్లో వర్షపు జాడ లేదు. జిల్లా కేంద్రం లో 1.5 సె.మీ. సగటు వర్షపాతం నమోదైంది. పోటెత్తిన గోదావరి ఏటూరునాగారం : ఎగువ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద పోటెత్తి పొంగి ప్రవహిస్తోంది. రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి నీటి మట్టం 9 మీటర్లకు చేరుడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 9.90 మీటర్లకు చేరితో రెండో, 11 మీటర్లకు చేరి తే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తామని అధికారులు తెలిపారు. గోదావరి ఉప్పొంగడంతో జీడివాగులో నీటిమట్టం పెరిగి రామన్నగూడెం- రాంనగర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భూపాలపల్లిలో కురుస్తు న్న వర్షాల కారణంగా ఓపెన్‌కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సోమవారం కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. -
ఐదేళ్లలో 28 కొత్త గనులు
► రాష్ట్ర అవసరాల మేరకు బొగ్గు ఉత్పత్తి ► ఏటా పది శాతం వృద్ధి రేటుతో ముందుకు ► కార్మికుల సంక్షేమంపై దృష్టి ► రాష్ర్ట అవతరణ వేడుకల్లో సీఎండీ శ్రీధర్ కొత్తగూడెం(ఖమ్మం) : రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి చేయడానికి రానున్న ఐదేళ్ల కాలంలో సింగరేణి సంస్థ 28 నూతన గనులను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి ఆ దిశ గా ముందుకు సాగుతోందని సీఎండీ నడిమిట్ల శ్రీధర్ అన్నా రు. స్థానిక ప్రకాశం స్టేడియంలో గురువారం కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ అమరుల త్యాగాల ఫలితంగానే ప్రత్యేక రాష్ర్టం సాధించుకున్నామని, బంగారు తెలంగాణ నిర్మాణమే వారికి నిజమైన నివాళి అని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పాటైన అనతి కాలంలోనే దేశంలో నంబర్ వన్‌గా దూసుకుపోతోందన్నారు. ప్రభుత్వం మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి ప్రాజెక్టులు చేపట్టి సాగు, తాగునీటి అవసరాలు తీర్చడానికి కృషి చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రగతికి విద్యుత్ కీలకమని, అందుకే దామరచర్ల, మణుగూరు ప్రాంతాల్లో పవర్ ప్రాజెక్టులు నిర్మిస్తోందని, వీటితోపాటు అనేక కొత్త పరిశ్రమ లు రాష్ట్రానికి వస్తున్నాయని పేర్కొన్నారు. వీటన్నింటికీ తగి నంత బొగ్గు అందించాల్సిన అవసరం ఉన్నందున ఏటా పది శాతం వృద్ధి రేటును నిర్దేశించుకుని సింగరేణి ముందుకు సాగుతోందని చెప్పారు. సింగరేణి చేపట్టిన 1200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులో త్వరలో ఉత్పత్తి ప్రారంభించి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా రాష్ట్రానికి అంకితం చేయనున్నట్లు తెలిపారు. కంపెనీ బొగ్గు ఉత్పత్తిపైనే కాకుండా కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమంపై దృష్టి సారించిందన్నా రు. మీకోసం-మీ చెంతకు కార్యక్రమం ద్వారా కార్మికవాడల్లోని సమస్యలు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య పరిరక్షణకు సూపర్‌స్పెషాలిటీ వైద్య శిబిరాలు, నిరుద్యోగ యువతకు జాబ్‌మేళాలు నిర్వహించి 11వేల మందికి ప్రైవేట్ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించామని పేర్కొన్నారు. సంస్థలో ఖాళీగా ఉన్న 5వేల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని, నియామక ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందని చెప్పారు. కంపెనీలో చేపట్టే అభివృద్ధి పనులకు ఎక్స్‌లెన్స్ అవార్డు ఇన్ కాస్ట్ మేనేజ్మెంట్-2015 సాధించామని, రానున్న రోజుల్లో సింగరేణిని దేశంలోనే నంబర్ వన్ బొగ్గు వనరు కంపెనీగా తీర్చిదిద్దడానికి కార్మికులు, అధికారులు సమష్టిగా కృషి చేయాలని సూచించారు. తొలుత రుద్రంపూర్‌లోని తెలంగాణతల్లి విగ్రహానికి పూల మాలలు వేశారు. అనంతరం అమరవీరులకు నివాళులర్పిం చారు. వేడుకల్లో వివిధ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో సింగరేణి డెరైక్టర్లు బిక్కి రమేష్‌కుమార్, అడికె మనోహర్‌రావు, పవిత్రన్కుమా ర్, జీఎం పర్సనల్ ఎ.ఆనందరావు, టీబీజీకేఎస్ అధ్యక్షుడు ఆకునూరి కనకరాజు తదితరులు పాల్గొన్నారు. ‘ఆహ్వానించి అవమానించారు’ రాష్ర్ట ఆవిర్భావ వేడుకలకు పిలిచి తమను అవమానించారని ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్ నాయకులు ఆరోపించారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ ఫంక్షన్ కు ఏఐటీయూసీ అధ్యక్షుడు గట్టయ్యను ఆహ్వానించి ప్రొటోకాల్ ప్రకారం కూర్చోబెట్టకుండా పర్సనల్ విభాగం అధికారి ఒకరు వెనక్కి పంపారన్నారు. అలాంటప్పుడు కార్యక్రమాని కి ఎందుకు పిలవాలని మండిపడ్డారు. ఐఎన్టీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.వెంకట్రావ్‌ను సైతం స్టేజీపైకి పిలవలేదని, ఇందుకు బాధ్యులపై చర్య తీసుకోవాలని హెచ్ఎం ఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్‌అహ్మద్ డిమాండ్ చేశారు. సింగరేణి భవన్లో.. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సింగరేణి జీఎం(లా) కె.తిరుమలరావు ముఖ్య అతిథిగా పాల్గొన్ని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏజీఎం(ఫైనాన్స్) జి.వెంకటరమణ, డీజీఎం(పర్సనల్) ఎం.డి.సాజిద్ తదితరులు పాల్గొన్నారు. ఎస్టీపీపీలో.. జైపూర్(ఆదిలాబాద్) : రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పుస్కరించుకుని జైపూర్‌లోని సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టులో సింగరేణి డెరైక్టర్ రమేశ్‌బాబు(ఈఅండ్ఎం) జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం పలు సాంస్కృతిక పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అంతకు ముందు మండల కేంద్రం నుంచి పవర్ ప్రాజెక్టు వరకు తెలంగాణ రన్ నిర్వహించారు. కార్యక్రమంలో పవర్ప్రాజెక్టు ఈడీ సంజయ్కుమార్సూర్, జీఎం సుధాకర్‌రెడ్డి, ఏజీఎంలు శ్యామ్‌సుందర్, నర్సింహారెడ్డి, డీజీఎం నవీన్‌కుమార్, మధన్మోహన్, శ్రీనివాస్, పర్సనల్ మేనేజర్లు సాయికృష్ణ, చారి, లక్ష్మణ్‌రావు, సింగరేణి ఉద్యోగులు పాల్గొన్నారు. -
తెలంగాణ వెలుగులు
బొగ్గు ఉత్పత్తిలో నూతన రికార్డు రిక్రూట్మెంట్లతో కొలువుల జాతర కంపెనీ పనితనానికి అవార్డుల పంట స్వరాష్ట్రం ఏర్పడిన రెండేళ్లలో సింగరేణి కంపెనీలో అనేక మార్పులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సింగరేణిలో అనేక మార్పులు చోటుచేసుకున్నారుు. ఈ రెండేళ్ల కాలంలో సీఎండీ శ్రీధర్ ఆధ్వర్యంలో కంపెనీ పురోగతిలో పయనిస్తోంది. బొగ్గు ఉత్పత్తితో పాటు కార్మికుల సంక్షేమంపై యాజమాన్యం దృష్టి సారించింది. ప్రధానంగా భూగర్భగనుల్లో బొగ్గు ఉత్పత్తి వ్యయం తగ్గించడం, రాష్ట్ర విద్యుత్ అవసరాలకు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి పెంచడానికి కావలసిన నూతన గనుల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించింది. కార్మికుల మెరుగైన ఆరోగ్యం కోసం సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరాలు నిర్వహించింది. చాలా కాలం తర్వాత ఉద్యోగ నియూమకాలు చేపట్టింది. నిరుద్యోగులకు ఉద్యోగ మేళాలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించింది. విద్యుత్ ఉత్పత్తి రంగంలో అడుగిడిన సంస్థ జైపూర్‌లో చేపట్టిన థర్మల్ పవర్ ప్రాజెక్టు ఉత్పత్తి దశకు చేరుకుంది. కంపెనీ మెరుగైన పనితనంతో పలు అవార్డులను దక్కించుకుంది. రాష్ర్ట అవతరణ దినత్సోవాన్ని పురస్కరించుకొని ఈ రెండేళ్లలో సింగరేణిలో చోటుచేసుకున్న ముఖ్య ఘట్టాలపై కథనం. - గోదావరిఖని(కరీంనగర్) రికార్డు స్థాయి ఉత్పత్తి సింగరేణిలో 2013-14లో 50.47 మిలియన్ టన్నులు, 2014-15లో 52.54 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి కాగా 2015- 16లో 60.38 మిలియన్ టన్నుల రికార్డు(18 శాతం అదనం) ఉత్పత్తితో చరిత్ర తిరగరాసింది. కంపెనీ రూ.వెయ్యి కోట్ల లాభాలకు చేరింది. తెలంగాణ ఇంక్రిమెంట్ సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం కార్మికుల కు ఆగస్టు 2014న ప్రత్యేక ఇంక్రిమెంట్ ప్రకటించారు. 62 వేల మంది కార్మికుల జీతభత్యా లు రూ.604 నుంచి రూ.2,200 పెరిగాయి. డిపెండెంట్లకు పరిహారం పెంపు గనుల్లో చనిపోయిన కార్మికుల డిపెండెంట్లకు, మెడికల్ అన్‌ఫిట్ అయిన కార్మికుల వారసులకు ఉద్యోగాలు వద్దనుకుంటే ఇంతకాలం ఇస్తూ వచ్చిన రూ.5 లక్షల పరిహారాన్ని రూ.12.5 లక్షలకు పెంచారు. మే 2015 నుంచి సింగరేణిలో అమలు చేస్తున్నారు. 3000 ఉద్యోగాలు కొత్త రిక్రూట్మెంట్ మరచిపోయిన కంపెనీలో తెలంగాణ ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు నోటిఫికేష న్ల ద్వారా 3,000 ఉద్యోగులు భర్తీ చేసింది. మెడికల్ కొలువులు ఐదేళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న 3,100 మంది మెడికల్ డిపెండెంట్ కార్మికులకు సీఎం కేసీఆర్ అవకాశం కల్పించారు. సెప్టెంబర్ 2014 నుంచి పెండింగ్‌లో ఉన్న వారందరికీ ఉద్యోగాలు వచ్చాయి. లాభాల్లో పెరిగిన వాటా కంపెనీ లాభాల్లో కార్మికులకు చెల్లించే వాటా 2013-14 ఆర్థిక సంవత్సరానికి ముందు 18 శాతం ఉండగా 20 శాతానికి పెంచి చెల్లించారు. 2015-16 ఆర్థిక సంవత్సరం ఒక శాతం పెంచి 21 శాతం చెల్లించారు. మ్యాచింగ్ గ్రాంట్ రూ.20 లక్షలు గనుల్లో ప్రమాదం వల్ల కార్మికుడు మృతి చెందితే గతంలో కార్మికుడికి కేవలం రూ.5 లక్ష లు ఎక్స్‌గ్రేషియా సంస్థ ఇచ్చేది. తాజాగా మ్యా చింగ్ గ్రాంట్ కింద రూ.20 లక్షలు పొందే అవకాశం కల్పించింది. గనిలో ఇతర కారణాలతో మృతిచెందే కార్మికులకు రూ.15 లక్షల మ్యాచిం గ్ గ్రాంట్ చెల్లింపు విధానం నవంబర్ 2015 నుంచి అమలవుతోంది. సన్మాన ఖర్చుల పెంపు ఉద్యోగ విరమణ పొందిన కార్మికుల సన్మాన ఖ ర్చులను రూ.900నుంచి రూ.3,500లకు పెం చారు. అలవెన్సుల్లో 50శాతం, ఇన్సెంటివ్స్ పెరిగారుు. ‘సూపర్ స్పెషాలిటీ’ శిబిరాలు సింగరేణి కార్మికులకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి తేవడానికి యాజమాన్యం, ఆయా వైద్యులతో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. 18,500 మంది కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. సమస్యలున్న రోగులను హైదరాబాద్‌లో అత్యుత్తమ వైద్యం అందించారు. విద్యుత్ కాంతులు కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక సింగరేణి సంస్థ ఆధ్వర్యంలోని జైపూర్‌లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం సామర్థ్యాన్ని 1200 మెగావాట్ల నుంచి 1800 మెగావాట్లకు పెంచారు. మరికొద్ది రోజు ల్లో 1200 మెగావాట్ల విద్యుత్ వెలుగులు తెలంగాణ రాష్ట్రంలో విరజిమ్మనున్నాయి. ‘ఆణిముత్యాలు’ సింగరేణి కార్మికుల పిల్లలకు ఉపా ధి, ఉద్యోగ అవకాశాలు చూపేం దుకు ‘ఆణిముత్యాలు’ కార్యక్ర మం చేపట్టారు. సుమారు 40 కంపెనీల ద్వారా జాబ్ మేళా నిర్వహించి కంపెనీ వ్యాప్తంగా 4వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. ప్రత్యేక అవార్డులు కంపెనీ పనితనం మెరుగు పడడంతో 2015 ఫిబ్రవరి 24న టాప్ ఆస్సెన్సీ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ అవార్డు, అదే ఏడాది ఏప్రిల్ 20న దుబాయిలో గోల్డెన్ పికాక్ అవార్డు, 2016 మే 1న బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డు, మే 28న న్యూఢిల్లీలో జాతీయ స్థాయి ఎక్సలెన్స్ ఇన్ కాస్ట్ మేనేజ్మెంట్ అవార్డు లభించింది. సింగరేణి పత్రిక, వీడియో చిత్రాలకు సైతం జాతీయ స్థాయి ఉత్తమ బహుమతులు వచ్చారుు. -
సింగరేణికి సన్‌స్ట్రోక్
తగ్గుతున్న కార్మికుల హాజరు శాతం ఓపెన్‌కాస్టు ప్రాజెక్టుల్లో విపరీతమైన వేడి బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం ఒకవైపు మండుతున్న ఎండలు. మరో వైపు విపరీతమైన వడగాల్పులు. మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి కాలుబయటపెట్టలేని పరిస్థితి. వీటికి తోడు బొగ్గు ఉత్పత్తిలో కీలకంగా ఉపయోగపడే భారీ యంత్రాల్లో ఏసీలు పనిచేయడం లేదు. ఓసీల్లో అధిక వేడికి యంత్రాలు సైతం అగ్నిప్రమాదాలకు గురవుతున్నారుు. దుమ్ము, ధూళితో ఊపిరి సలపని పరిస్థితి. దీంతో కార్మికుల హాజరు శాతం తగ్గి బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం పడుతోంది. కొత్తగూడెం(ఖమ్మం) : సింగరేణి బొగ్గు గనులు విస్తరించి ఉన్న కోల్‌బెల్ట్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఓపెన్‌కాస్టు ప్రాజెక్టుల కారణంగా కార్మిక ప్రాంతాల్లో వేడి ఎక్కువగా ఉంటోంది. పగటివేళ వడగాలుల తీవ్రత కారణంగా విధులకు వెళ్లడానికి కార్మికు లు జంకుతున్నారు. భూగర్భగనుల్లో రోజుకు మొదటి, రెండవ, నైట్ షిఫ్టుతోపాటు ప్రీషిఫ్టులు నడుస్తున్నారుు. మొదటిషిఫ్టు కార్మికులు ఉద యం 6 గంటలకు, రెండో షిఫ్టు మధ్యాహ్నం 2 గంటలకు, నైట్‌షిఫ్ట్ రాత్రి 10 గంటలకు, ప్రీషిఫ్ట్ కార్మికులు ఉదయం 9 గంటలకు విధులకు వెళ్లాల్సి ఉంటుంది. మధ్యాహ్నం షిఫ్టు కార్మికులు విధులకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. తీవ్రమైన ఎండ, వడగాల్పు ల కారణంగా అలిసిపోరుు పనులు చేయలేని పరిస్థితులు నెలకొంటున్నారుు. ఓసీలపై తీవ్ర ప్రభావం అసలే ఎండులు మండుతున్నారుు. ఓపెకాస్టు ల్లో బయటికన్నా రెండు డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది. అటు బొగ్గు వేడి, ఇటు వడగాలులు తట్టుకోలేని విధంగా ఉంటున్నారుు. పైగా యూజమాన్యం కల్పించిన ఉపశమన చర్యలు ఏమాత్రం సరిపోవడం లేదు. బొగ్గు ఉత్పత్తికి ఉపయోగపడే భారీ యంత్రాలు, వాహనాల్లో ఏసీలు సక్రమంగా పనిచేయడంలేదు. కొన్ని పాత యంత్రాల్లో పూర్తిగా పనిచేయడం లేదు. దీంతో మధ్యాహ్నం షిఫ్టు కార్మికు లు విధులకు వెళ్లాలంటే ధైర్యం చేయలేక పోతున్నారు. కొందరు కార్మికులు అనారోగ్యాని కి గురవుతామనే భయంతో విధులకు గైర్హాజరవుతున్నారు. దీంతో బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం పడుతోంది. ఉత్పత్తిలో వెనుకబాటు మే నెలలో ఓపెన్‌కాస్టు గనులు ఉత్పత్తిలో వెనుకబడి ఉన్నాయి. కంపెనీ వ్యాప్తంగా ఈనెల ఒకటి నుంచి 15వ తేదీ వరకు 24.45 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయూల్సి ఉండగా 23.3 లక్షల టన్నుల ఉత్పత్తి నమోదైంది. భూగర్భగనుల్లో 12.2 లక్షల టన్నులకు 11.5 లక్షల టన్ను లు, ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుల్లో 19.26 లక్షల టన్నుల కు 18.50 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగింది. ముఖ్యంగా ఒక ఓసీలో ఒక షిఫ్టునకు సుమారు 300 మంది కార్మికులు విధులు నిర్వర్తించాల్సి ఉండగా ఈనెలలో ఎండల తీవ్రత అధికంగా ఉండడం వల్ల 20 నుంచి 30 మంది గైర్హాజరవుతున్నట్లు తెలుస్తోంది. 45 రోజుల్లో 9లక్షల టన్నుల వెనుకబాటు ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన ఏప్రిల్ ఒకటి నుంచి మే 15వ తేదీ వరకు కంపెనీ వ్యాప్తంగా 75లక్షల టన్నులకు 67 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి జరిగింది. భూగర్భగనుల్లో 16 లక్షల టన్నులకు 13 లక్షల టన్నులు, ఓపెన్‌కాస్టుల్లో 50లక్షల టన్నులకు 54 లక్షల టన్నుల ఉత్పత్తి నమోదైంది. మొత్తం 11 ఏరియాల్లో కేవలం 3 ఏరియాలు మాత్రమే ఇప్పటివరకు 100 శాతం బొగ్గు ఉత్పత్తి నమోదు చేయగలిగాయి. -
వారసత్వ ఉద్యోగాల సాధనకు సంతకాల సేకరణ
శ్రీరాంపూర్ : వారసత్వ ఉద్యోగాల సాధన కోసం ఏఐటీయూసీ సంతకాల సేకరణ చేపట్టింది. ఆయూనియన్ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ డివిజన్లోని అన్ని గనులపై ఈ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన బ్రాంచీ కమిటీల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో బ్రాంచీ సెక్రెటరీలు ల్యేగల శ్రీనివాస్, కొట్టె కిషన్‌రావు, ఎస్కే బాజీసైదాలు పాల్గొని మాట్లాడారు. ఈ నెల 13 వరకు సంతకాల సేకరణ చేసి ఆదే రోజు గని మేనేజర్లకు మెమోరాండం అందించనున్నట్లు తెలిపారు. 27న గనులపై ధర్నాలు నిర్వహిస్త్తున్నట్లు తెలిపారు. తాము గెలిస్తే వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని టీఆర్ఎస్, టీబీజీకేఎస్ ఎన్నికల్లో కార్మికులకు హామీలిచ్చి తీరా ఇప్పుడు మోసం చేశాయన్నారు. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొత్తగా 5 భూగర్భ గనుల్లో అవుట్ సోర్సింగ్ ప్రవేశపెడుతున్నారని దీన్ని నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సారి బొగ్గు ఉత్పత్తి సాధించినందుకు గాను ప్రతి కార్మికుడికి గోల్డ్ కాయిన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వేరువేరుగా ఆయా గనులపై జరిగిన నిరసన కార్యక్రమాల్లో ఆయూనియన్ బ్రాంచీ నాయకులు కాంపెల్లి నర్సయ్య, భీంరాజు, కృష్ణమూర్తి, సంఘం సదానందం, వేణుమాదవ్, బొంగోని శంకర్, మేక శ్రీను, వీరమల్లు, రాజేందర్, కోడి వెంకటేశం, పెద్దన్నలు పాల్గొన్నారు. -
నిప్పుల కొలిమి
42 డిగ్రీలకు చేరువలో కోల్‌బెల్ట్ ఉష్ణోగ్రతలు ఎండ వేడి, వడగాలులతో కార్మికులు విలవిల కార్మికుల హాజరు శాతంపై పడుతున్న ప్రభావం మంచిర్యాల సిటీ (ఆదిలాబాద్) : సింగరేణి బొగ్గుగనులు విస్తరించి ఉన్న కోల్‌బెల్ట్ ఏరియూలో రోజురోజుకూ ఉష్ణోగ్రత లు పెరిగి పోతున్నాయి. ఇప్పటికే రామగుం డం, కొత్తగూడెం రీజియన్లలో 41.5 డిగ్రీలు, బెల్లంపల్లి రీజియన్‌లో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో 50 డిగ్రీ లు దాటే అవకాశమూ లేకపోలేదు. మొదటి షిఫ్టు విధులు ముగించుకొని వచ్చే కార్మికులు మధ్యాహ్నం రెండు గంటలకు ఇంటికి బయలు దేరుతారు. అదే సమయానికి రెండో షిఫ్టు డ్యూటీకి వెళ్లే కార్మికులు సైతం ఇంటి నుంచి బయలు దేరుతారు. ఈ సమయంలో కార్మికు లు వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఎక్కువ గా ఉన్నాయి. ముఖ్యంగా ఓపెన్‌కాస్ట్ గనుల్లో పనిచేసే కార్మికులు విపరీతమైన ఎండ, వడ గాడ్పులతో విలవిల్లాడుతున్నారు. సింగరేణి వ్యాప్తంగా ఉన్న ఓపెన్‌కాస్ట్, భూగర్భగనుల్లో 58వేల మంది కార్మికులు, అధికారులు కలిసి పనిచేస్తున్నారు. రోజూ మొదటి, రెండు షిఫ్టు ల్లో 45వేల మంది వరకు హాజరవుతున్నారు. తగ్గుతున్న హాజరు శాతం బొగ్గు, దుమ్ము కారణంగా గనుల పరిసర ప్రాంతాలు సాధారణ స్థారుు కంటే ఒకటి రెండు డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది. ఓపెన్‌కాస్ట్ గనుల్లో అరుుతే వేడిమి మరింత అధికం. ఎండ వేడిని తట్టుకోలేక ఓసీల్లో కార్మికుల హాజరు శాతం కొంత మేరకు తగ్గుతోంది. ఉదయం పది గంటల వరకే 36 డిగ్రీలు నమోదవుతున్న ఉష్ణోగ్రత మధ్యాహ్నం ఒంటి గంట వరకు 41.5 డిగ్రీల కు చేరుకుంటోంది. దీంతో కార్మికులు వేడిని తట్టుకోలేక సెలవులను వినియోగించుకోవ డానికి మొగ్గుచూపుతున్నారు. నివారణ చర్యలు అంతంతే ఓసీల్లో పనిచేస్తున్న కార్మికులకు వడదెబ్బ తగలకుండా అధికారులు తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం సరిపోవడంలేదు. బొగ్గు పొరలు వేడెక్కకుండా ఉండేందుకు బొగ్గు బెంచీలను నీటితో నింపుతున్నారు. నీరు లభించని గనుల్లో బొగ్గు పొరలను మట్టితో కప్పి ఉంచుతున్నారు. ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుల దారుల్లో స్ప్రింకర్ల ద్వారా నీటిని చల్లించి వేడిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నా ఆశించిన ఫలితాలు లభించ డం లేదు. గతంలో కంటే ఎండలు అధికంగా ఉన్న నేపథ్యంలో వేసవి ఉపశమన చర్యలు తక్షణమే అవసరం మేరకు చేపట్టాలి. లేని పక్షంలో కార్మికల హాజరు శాతంపై మరింత ప్రభావం చూపే అవకాశాలు ఉన్నారుు. పర్యావరణంపై దృష్టిపెడితేనే ఫలితం భూగర్భ, ఓపెన్‌కాస్ట్ గనులతోపాటు సింగరేణి కాలనీల్లో అధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలను మరింత పెరగకుండా ఉండేందుకు సింగరేణి యాజమాన్యం మొక్కలను నాటింది. అరుుతే వాటి పరిరక్షణపై పూర్తి స్థారుులో దృష్టి సారించకపోవడంతో ప్రయోజనం లేకుండా పోతోంది. యూజమాన్యం 2002లో అటవీశాఖను ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 1872.5 ఎకరాల్లో సుమారు రెండు కోట్ల నీలగిరి, వెదురు, కానుగ తదితర మొక్కలను నాటింది. ఏరియూల వారీగా కొత్తగూడెంలో 240, ఇల్లెందులో 115, మణుగూరులో 40, ఆర్జీ-1లో 502.50, ఆర్జీ-2లో 115, ఆర్జీ-3లో 95, భూపాలపల్లిలో 260, శ్రీరాంపూర్‌లో 215, బెల్లంపల్లిలో 205, మందమర్రిలో 85 ఎకరాల్లో మొక్కలు నాటారు. వీటిని పూర్తి స్థారుులో పరిరక్షించుకుంటే పర్యావరణాన్ని కాపాడుకోవడంతోపాటు అధిక వేడి నుంచి ఉపశమనం పొందవచ్చు. -
లక్ష్యానికి చేరువలో..
► బొగ్గు ఉత్పత్తిలో దూసుకుపోతున్న సింగరేణి ► మూడు రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగింపు ► శ్రీరాంపూర్, బెల్లంపల్లి డివిజన్లు ముందంజ ► అట్టడుగున మందమర్రి శ్రీరాంపూర్ : ఉత్పత్తిలో ఈ ఆర్థిక సంవత్సరం సింగరేణి తమ లక్ష్యానికి చేరువలో ఉంది. మూడు రోజుల్లో ముగియనున్న ఆర్థిక సంవత్సరంలో మిగతా లక్ష్యాన్ని కూడా పూర్తి చేసి వంత శాతం సాధించేలా ముందుకు కదులుతున్నారు. సింగరేణి చరిత్రలో కంపెనీ వ్యాప్తంగా వార్షిక ఉత్పత్తి లక్ష్యం 60.03 మిలియన్ టన్నులుగా నిర్దేశించారు. కాగా.. ఆదివారం నాటికి 59.59 మిలియన్ టన్నులు సాధించడం విశేషం. మరో మూడు రోజుల్లో 4 లక్షల 40 వేల టన్నుల లక్ష్యాన్ని సాధించాల్సి ఉంది. సోమవారం, మంగళవారాల ఉత్పత్తితో 100 శాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ లెక్కన రెండు రోజుల ముందే కంపెనీ వార్షిక లక్ష్యం సాధించే అవకాశాలూ లేకపోలేదు. ఇదిలా ఉంటే జిల్లాలోని బెల్లంపల్లి రీజియన్‌లోని శ్రీరాంపూర్, బె ల్లంపల్లి డివిజన్లు 100 శాతం ఉత్పత్తి లక్ష్యాలను నమోదు చేసుకుంటుండగా.. మందమర్రి మాత్రం చాలా వెనుకడి ఉంది. డివిజన్ల వారీగా.. బెల్లంపల్లి డివిజన్లో మొత్తం 3 ఓసీపీలు, ఒక భూగర్భ గని ఉంది. ఇందులో ఈ నెల 31 నాటికి నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యం 62.60 లక్షల టన్నులు ఉండగా ఈ నెల 27 నాటికి 64.12 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించి 104 శాతం లక్ష్యాన్ని నమోదు చేసుకొంది. దీంతో రీజియన్‌లోనే వార్షిక ఉత్పత్తి ముందే సాధించిన డివిజన్‌గా నిలిచింది. శ్రీరాంపూర్ డివిజన్‌ను పరిశీలిస్తే అధిక భూగర్భ గనులు ఉన్నాయి. మొత్తం 9 భూగర్భ గనులు, ఒక ఓసీపీ ఉంది. ఈ డివిజన్లో నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యం 53.95 లక్షల టన్నులు. ఇందులో 53.51 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించారు. సోమవారం, మంగళవారం ఉత్పత్తి కలిపితే 100 శాతం ఉత్పత్తి నమోదు కానుంది. దీంతో ఇది కూడా ముందస్తుగా ఉత్పత్తి సాధించే అవకాశాలు ఉన్నాయి. ఆర్కే న్యూటెక్‌లో షార్ట్‌వాల్ టె క్నాలజీ నిలిచిపోకుంటే వారం ముందే 100 శాతం ఉత్పత్తిని నమోదు చేసుకునే అవకాశం ఉండేదని అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే మందమర్రి డివిజన్ బొగ్గు ఉత్పత్తిలో అధ్వానంగా ఉంది. ఈ డివిజన్లో మొత్తం 6 భూగర్భ గనులు, ఒక ఓసీపీ ఉంది. ఏటా ఉత్పత్తి లక్ష్య సాధనలో ఈ డివిజన్ వెనుకంజలోనే ఉంటోంది. ఈ సారి కూడా అదేబాటన ఉంది. వార్షిక ఉత్పత్తి లక్ష్యం 27 లక్షల టన్నులు కాగా.. ఇప్పటికి 16.47 లక్షలు మాత్రమే సాధించింది. దీంతో 62 శాతం ఉత్పత్తిని మాత్రమే నమోదు చేసుకొంది. కంపెనీలోనే అన్ని డివిజన్ల కంటే ఉత్పత్తి లక్ష్యంలో వెనుకబడిన డివిజన్‌గా మందమర్రి నిలిచింది. -
ఉత్పత్తిలో దూసుకెళ్తున్న నూతన ప్రాజెక్టు
ఓసీపీ-3 ఫేజ్-2లో ఆశాజనకంగా బొగ్గు ఉత్పత్తి పుష్కలంగా బొగ్గునిల్వలతో అధికారుల్లో ఆనందం యైటింక్లయిన్‌కాలనీ : సింగరేణిలో పురుడుపోసుకున్న నూతన ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు ఉత్పత్తి లక్ష్యాల సాధనలో దూసుకపోతోంది. సింగరేణి సంస్థ రామగుం డం డివిజన్-2 పరిధిలోని ఓసీపీ-3 ప్రాజెక్టు ఫేజ్-2లో గతేడాది నవంబర్ 23న డెరైక్టర్ మనోహర్‌రావు చేతుల మీదుగా ప్రారంభోత్స వం జరుపుకొని అనతికాలంలోనే బొగ్గు ఉత్పత్తిలో దూసుకపోతోంది. ఇప్పటివరకు 25లక్షల ఓబీ లక్ష్యానికి గాను 23.80లక్షల క్యూబికల్ మీటర్ల ఓబీ వెలికితీశారు. 5లక్షల టన్నుల లక్ష్యానికి గాను 3.11లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసి నిర్ధేశిత లక్ష్యాల సాధనలో ముందంజలో ఉన్నారు. కొత్త ప్రాజెక్టు ప్రారంభానికి తోడు బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉండటంతో అధికారులు, ఉద్యోగులు ఉత్సాహంగా పనిచేస్తున్నా రు. బొగ్గు ఉత్పత్తికి తగినట్లుగా కోల్యార్డును ఏర్పాటు చేసి తీసిన బొగ్గు నిల్వలను భద్రపరుస్తున్నారు. పూర్తి ఉత్పత్తి లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు సాగుతుండటంతో పేజ్-2 ప్రాజెక్టు పనితీరు పూర్తిస్థాయిలో సంతృప్తి కరంగాఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వందశాతం ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తున్నాం.. ఓసీపీ-3 పేజ్-2లో వంద శాతం ఉత్పత్తి ల క్ష్యాలను సాధిస్తున్నాం. నూతన ప్రాజెక్టు అనగానే ముందుగా భయపడినప్పటికి అన్నీ సజావుగానే కొనసాగుతున్నాయి. ఓబీ వెలికితీ, బొగ్గు ఉత్పత్తిలో ముందంజలో ఉన్నాం. ఈఏడాది మార్చి చివరినాటికి ప్రాజెక్టుకు కేటాయించిన ఉత్పత్తి ల క్ష్యాలను సాధిస్తాం. - జీఎం విజయపాల్‌రెడ్డి -
సింగరేణికి భారమవుతున్న బొగ్గు
కొనుగోలుకు వినియోగదారుల విముఖత పేరుకుపోతున్న నిల్వలు యైటింక్లయిన్‌కాలనీ : బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతో అగ్రభాగాన ఉన్న సింగరేణి సంస్థకు వినియోగదారుల నుంచి బొగ్గు కష్టాలు మొదలయ్యాయి. నిర్దేశిత లక్ష్యాల సాధనలో ఉత్సాహంగా ముందుకు సాగుతున్న సింగరేణికి బొగ్గు వినియోగదారుల నుంచి అనుకున్నంత స్పందన లభించడంలేదు. దీంతో తీసిన బొగ్గు సకాలంలో రవాణా జరగక సంస్థవ్యాప్తంగా నిల్వలు పేరుకపోతున్నాయి. సింగరేణి సంస్థతోపాటు కోలిండియాలో బొగ్గు ఉత్పత్తి పెరిగిపోవడంతో వినియోగదారులకు బొగ్గు పుష్కలంగా అందుతోంది. దీంతో కోల్‌లింకేజీ కన్నా అదనపు బొగ్గు కొనుగోలు చేసేందుకు వినియోగదారులు వెనకడుగు వేస్తున్నారున్నారు. గతంలో కోలిండియా బొగ్గు ఉ త్పత్తి తక్కువగా ఉండటంతో సింగరేణి బొగ్గుకు డిమాండ్ ఉండేది. అయితే కోలిండియాలో కూ డా ప్రస్తుతం బొగ్గు ఉత్పత్తి పెరగడంతో బొగ్గు నిల్వలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో సింగరేణి బొగ్గు కొనుగోలు చేసేందుకు వినియోదారుల నుంచి పెద్దగా స్పందన లభించడం లేదు. లింకేజీకన్నా అదనంగా కొనుగోలు చేసిన వినియోగదారులు ఇప్పుడు ససేమిరా అంటున్నారు. ఓసీపీ సీహెచ్పీల వద్ద, కోల్యార్డుల్లో బొగ్గు నిల్వలు గుట్టలుగా పేరుక పో తున్నాయి. భూపాల్పల్లి పవర్‌ఫ్లాంట్ ప్రారంభమైతే ఇంత బొగ్గు నిల్వలు పెరిగేవి కాదంటున్నారు. ఈక్రమంలో వేచి చూసే ధోరణితో యాజమాన్యం ముందుకు సాగుతోంది. మొదటి వారం నుంచి పెరుగుతున్న నిల్వలు ఫిబ్రవరి మొదటి వారం నుంచి బొగ్గు నిల్వలు పెరిగిపోతున్నాయి. సింగరేణి వ్యాప్తంగా ఐదు మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు పేరుకపోయాయి. అయితే కోలిండియాలో అంచనాలకు మించి బొగ్గు ఉత్పత్తి పెరిగిపోయింది. దీంతో కోలిండియాకు మన బొగ్గు ఎగుమతి తగ్గింది. వినియోగ దారులు కోల్లింకేజీకన్నా అదనంగా బొగ్గు కొనుగోలు చేయడం లేదు. భూపాల్పల్లి విద్యుత్ ప్లాంట్ ప్రారంభమైతే ఇంత ఇబ్బంది ఉండదు. మార్చిలో బొగ్గురవాణా ఊపందుకుంటుంది.- ప్రాజెక్టు అండ్ ప్లానింగ్డెరైక్టర్మనోహర్రావు -
భూగర్భగనుల్లో పుంజుకున్న ఉత్పత్తి
గోదావరిఖని(కరీంనగర్) : భూగర్భగనుల్లో బొగ్గు ఉత్పత్తి పుంజు కుంటోంది. పెరిగిన యంత్రాల వినియోగం, కార్మికులకు కంపెనీ ప్రకటించిన ప్రోత్సాహకా లు ఇందుకు దోహదం చేస్తున్నారుు. సంస్థ పరిధిలో మొత్తం 31 భూగర్భ గనులుండగా గతంలో కొన్ని మాత్రమే నూరుశాతం ఉత్పత్తి సాధించేవి. డిసెంబర్ నెలలో 12 గనుల్లో వంద శాతానికి పైగా బొగ్గు ఉత్పత్తి జరిగింది. నవంబర్‌తో పోల్చితే లక్ష్యానికి మించి బొగ్గు వెలికితీశారు. బెల్లంపల్లి రీజియన్ శ్రీరాంపూర్ ఏరియూ పరిధిలోని భూగర్భ గనులన్నీ ఉత్పత్తి లో పరుగులు తీస్తున్నాయి. జనవరిలో మిగతా గనుల్లో సైతం ఉత్పత్తి పెంచడానికి యాజమా న్యం అవసరమైన చర్యలు చేపట్టింది. పెరిగిన యంత్ర వినియోగం నష్టాలను తగ్గించి, లాభాలను పెంచుకోడానికి యూజమాన్యం కేవలం యాంత్రీకరణపై ఆధారపడి బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. కంపెనీ వ్యాప్తం గా 21 భూగర్భ గనుల్లో 155 ఎస్డీఎల్, మరో 10 భూగర్భ గనుల్లో 31 ఎల్‌హెచ్‌డీ యంత్రా లు కలిసి రోజుకు 20వేల టన్నుల పైబడి బొగ్గు ఉత్పత్తి చేస్తున్నాయి. వార్షిక లక్ష్యాల సాధనకు ఇన్సెంటివ్ వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించడానికి యూజమాన్యం మార్చికి నాలుగు నెలల ముందు నుంచి ఇన్సెంటివ్స్ ప్రకటిస్తోంది. ఈ ఏడాది 60.03 మిలియన్ టన్నుల లక్ష్యం చేరుకోవడానికి గాను గత ఏడాది ప్రకటించిన ఇన్సెంటివ్ బోనస్ మొత్తాన్ని పెంచింది. అంతే కాకుండా ఎన్.శ్రీధర్ సీఎండీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఉత్పత్తి, కార్మిక సంక్షేమం పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అలాగే కంపెనీ విషయంలో కార్మికులకు అవగాహన కల్పించడంలో సఫలీకృతులయ్యూరు. డిసెంబ ర్ నాటికి 43 మిలియన్ టన్నుల రికార్డు స్థాయిలో ఉత్పత్తి నమోదైంది. మిగిలిన మూడు నెలల్లో భూగర్భ గనులతోపాటు ఓసీపీల నుంచి 17 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేపట్టేందుకు నవంబర్ నుంచి ప్రత్యేక ఇన్సెంటివ్ను ప్రకటించగా సత్ఫలితాలు ఇస్తున్నట్లు కనిపిస్తోంది. 75 శాతం పనితీరుతో ఒక రకంగా.. వంద శాతం పనితీరుతో మరొక రకంగా ఇన్సెంటివ్ పెంచడంతో కార్మికులు, ఉద్యోగులు ఉత్సాహంగా పనిచేస్తున్నారు. -
భారీ వర్షాలతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
-
భారీవర్షాలతో బొగ్గుఉత్పత్తికి అంతరాయం
కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా మంథని డివిజన్లోని 20 అటవీ ప్రాంతాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 7.7 సెంటీమీటర్ల వర్షపాతం ఉండగా, జిల్లాలోని ధర్మపురిలో 21.8 సెం.మీ, సారంగాపూర్‌లో 21.3 సెం.మీ, మల్యాలలో 19.4 సెం.మీ, జగిత్యాల 16 సెం.మీ, రాయ్కల్ లలో 17 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఎడతెరపి లేకుండా ఓపెన్ కాస్ట్ నిల్వల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. -
సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
కరీంనగర్: దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణి కార్మికులు విధులకు హాజరుకాకపోవడంతో బుధవారం బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు కూడా సమ్మెలో పాల్గొనటంతో గోదావరిఖని డిపో నుంచి బస్సులు బయటికి రాలేదు. అన్ని పార్టీల అనుబంధ సంఘాలు సమ్మెకు పిలుపునివ్వడంతో కార్మికులు కూడా విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. -
బొగ్గు రవాణా పెంచాల్సిందే!
ఆదాయం పెంపునకు దక్షిణ మధ్య రైల్వే ప్రయత్నాలు హైదరాబాద్: సింగరేణిలో కొత్త బ్లాకులు అందుబాటులోకి వచ్చి బొగ్గు ఉత్పత్తి పెరగటంతో అదనంగా 15 శాతం వరకు బొగ్గు రవాణా చేయాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. త్వరలో అందుబాటులోకి రానున్న భూపాలపల్లి థర్మల్ పవర్ ప్లాంటుకు ప్రతిరోజూ ఒక ర్యాక్ చొప్పున బొగ్గు సరఫరా చేయాలని నిర్ణయించింది. బొగ్గు, సిమెంటు రవాణా మరింతగా పెంచే ఉద్దేశంతో మంగళవారం దక్షిణ మధ్య రైల్వే జీఎం సక్సేనా ఆయా సంస్థల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఇటీవల దక్షిణ మధ్య రైల్వే ఆదాయం మందగించడంతో ప్రధాన ఆదాయ వనరు అయిన సరుకు రవాణపై దృష్టి సారించింది. రైల్వే ద్వారా సురక్షితంగా రవాణా చేయొచ్చని, అందుకే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాల్సిన అవసరం లేదని సంస్థల ప్రతినిధులకు ద.మ.రైల్వే అదనపు జనరల్ మేనేజర్ ఉమేశ్ సింగ్ సూచించారు. గత ఆర్థిక సంవత్సరం 9 మిలియన్ టన్నులను మించి సరుకు రవాణా చేశామని, ఈసారి అది పెరుగుతుందని చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ ఝా పేర్కొన్నారు. మరింత మెరుగ్గా వ్యవహరించేందుకు రైల్వేలో ఇ-డిమాండ్ రిజిస్ట్రేషన్, ఈ-పేమెంట్‌ను విస్తృతం చేస్తున్నట్టు చీఫ్ కమర్షియల్ మేనేజర్ లక్ష్మీనారాయణ తెలిపారు. -
విదేశీ గనుల కోసం వేట
కొత్తగూడెం(ఖమ్మం) : బొగ్గు ఉత్పత్తిలో 120 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన సింగరేణి సంస్థ ఇప్పటికే గోదావరిలోయ పరివాహక ప్రాంతంతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాలలో బొగ్గు గనులను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం విదేశాలలోనూ బొగ్గు గనులను సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది. ఈ మేరకు ఆస్ట్రేలియా, ఇండోనేషియా, దక్షిణాప్రికా, మొజాంబిక్ దేశాలలో గనులను చేపట్టేందుకు ఈఓఐ(ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్) అందించాలని సంస్థ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పాటైన టీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిపై సమీక్ష నిర్వహించింది. దేశంలోని ఇతర ప్రాంతాలతోపాటు విదేశాలలో సైతం బొగ్గు గనులను నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ఈ మేరకు సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ నడిమిట్ల శ్రీధర్ విదేశాలలో గనుల ఏర్పాటుపై, అక్కడున్న పరిస్థితులను అవగాహన కల్పించుకునేం దుకు సింగరేణి అధికారులు, కార్మిక సంఘాల నాయకులతో కూడిన బృందాన్ని గత ఏడాది డిసెంబర్లో విదేశాలకు పంపించారు. ఆ తర్వాత సీఎండీ స్వయంగా దక్షిణాప్రికా పర్యటన చేసి అక్కడున్న పరిస్థితులను పరిశీలించి వచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో దక్షిణాప్రికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, మొజాంబిక్ దేశాలలో బొగ్గు గనుల ఏర్పాటుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని నిర్థారించుకుని అక్కడ గనుల ఏర్పాటుకు ప్రయత్నాలను మమ్మురం చేశారు. ఏడాదికి రెండు మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యం సింగరేణి సంస్థ విదేశాలలో చేపట్టే గనులు 50 మిలి యన్ టన్నుల నిక్షేపాలు కలిగి, ఏడాదికి రెండు మిలి యన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న గనులను తీసుకోవాలని నిర్ణయించుకుంది. దీంతోపాటు అవసరమైతే 51 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. గనులను అమ్మే కంపెనీ లు తప్పనిసరిగా యాజమాన్య హక్కులను కలిగి ఉండటంతోపాటు బొగ్గు అమ్మకానికి సంబంధించిన అన్ని హక్కులు కలిగి ఉండాలని సూచించింది. జూన్ 10వ తేదీలోగా ఆయా దేశాలలోని గనుల యాజమానులు వాటా అమ్మకానికి సంబంధించిన ఈఓఐను అందించాలని కోరింది. ఏది ఏమైనా మరో ఏడాదిలో గా విదేశాలలో గనులను నిర్వహించాలని సింగరేణి యాజమాన్యం సంకల్పించి ముందుకు సాగుతోంది. -
బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించిన సింగరేణి
గోదావరిఖని : సింగరేణి సంస్థ 2014-15 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన అంతర్గత 52.50 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించింది. కేంద్ర ప్రభుత్వం 55 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించగా, దానిని సాధించే అవకాశాలు లేకపోవడంతో సింగరేణి సంస్థ 52.50 మిలియన్ టన్నుల అంతర్గత ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానిని అధిగమించింది. మార్చి 31వ తేదీ నాటికి 52.53 మిలియన్ టన్నులను వెలికితీసి లక్ష్యాన్ని దాటింది. సింగరేణి గనుల్లో భాగంగా వున్న 11 డివిజన్లలో కొత్తగూడెం 134 శాతం, మణుగూర్ 122 శాతం, రామగుండం-3 118 శాతం, శ్రీరాంపూర్ 104 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించాయి. రామగుండం-1 డివిజన్ 96 శాతం, రామగుండం-2 డివిజన్ 84 శాతం, భూపాలపల్లి 89 శాతం, బెల్లంపల్లి 69 శాతం, మందమర్రి 78 శాతం, ఇల్లెందు 94 శాతం, అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు 30 శాతం బొగ్గును వెలికితీశాయి. 2015-16లో 60.03 మిలియన్ టన్నుల లక్ష్యం సింగరేణి సంస్థ ఏటా 10 శాతం బొగ్గు ఉత్పత్తిని పెంచేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా 2015-16 ఆర్థిక సంవత్సరంలో 60.03 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఏప్రిల్ నుంచే బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించే దిశగా అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సీఎండీ శ్రీధర్ ఆదేశించినట్లు సమాచారం. -
భూగర్భ గనులపై సింగరేణి దృష్టి
కొత్తగూడెం(ఖమ్మం) : సింగరేణి సంస్థలోని భూగర్భగనుల్లో బొగ్గు ఉత్పత్తి వ్యయం రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో ఆయూ గనులు నష్టాల్లో ఉన్నాయి. కంపెనీ వ్యాప్తంగా 11 ఏరియాల్లో 34 భూ గర్భ గనులు ఉన్నాయి. వాటిలో ఎల్‌హెచ్‌డీ, ఎస్డీఎల్, కంటిన్యూయస్ మైనర్ వంటి భారీ యంత్రాల ద్వారా బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు. భూగర్భ గనుల్లో కార్మికుల వినియోగం ఎక్కువగా ఉండటం, యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగించకపోవడం ఈ పరిస్థితులకు కారణంగా యూజమాన్యం అంచనా వేసింది. భూ గర్భ గనిలో సగటున ఒక టన్నుబొగ్గు ఉత్పత్తికి రూ.4,071 ఖర్చవుతుండగా విక్రయించేది రూ.2,419లకు. దీనినిబట్టి చూస్తే టన్నుకు రూ.1,652 నష్టం వాటిల్లుతోంది. ఈ ఆర్థిక సం వత్సరంలో డిసెంబర్ వరకు భూగర్భ గనులపై రూ.1,151 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం భూగర్భ గనుల్లో ఉన్న పరిస్థితిని మార్చేందుకు సింగరేణి సీఎండీ శ్రీధర్ ప్రణాళికలు రూపొం దిస్తున్నారు. ఇప్పటికే మల్టీ డిపార్ట్మెంట్ టీం పేరు తో ఫిబ్రవరి 12 నుంచి 18వ తేదీ వరకు అన్ని ఏరియాల్లోని గనులు, డిపార్ట్మెంట్ల వద్ద కార్మికులకు అవగాహన కల్పించారు. ఉత్పత్తి, ఉత్పాదకతల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరిం చి దానిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కార్మికులకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా వివరించారు. భూగర్భ గనుల్లో ఉత్పాదక స్థాయి ప్రస్తుతం ఉన్నదానికంటే ఒక్క శాతం పెరిగినా నష్టంలో రూ.26.33 కోట్లు తగ్గించుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఓపెన్‌కాస్టు గనుల్లో నూ షావెల్స్ వినియోగం ఒక్కశాతం పెరిగినా రూ.8.5 కోట్ల నష్టం నుంచి బయటపడవచ్చు. కార్మికులు, సూపర్వైజర్లు, అధికారులు పనివిధానాన్ని మెరుగుపర్చుకుని అవసరం మేరకు కృషి చేయూలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. ఉత్పత్తిని పెంచేందుకు భూగర్భ గనుల్లో ఎస్డీఎల్, ఎల్‌హెచ్‌డీ యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని యోచిస్తున్నారు. భూగర్భ గని కార్మికులు, మెషనరీ షిఫ్టు కార్మికులు రోజుకు కనీసం ఆరు గంటలు పనికి వినియోగించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. కార్మికులు గైర్హాజరు శాతాన్ని తగ్గించుకోవాలని, యంత్రాలను పూర్తిగా వినియోగించుకోవాలని సీఎండీ శ్రీధర్ విజ్ఞప్తి చేస్తున్నారు. ఏది ఏమైనా సింగరేణిలో భూగర్భ గనుల ద్వారా వచ్చే నష్టాన్ని పూడ్చుకునే చర్యలకు యాజమాన్యం పూనుకుంది. -
పెరగనున్న విద్యుత్ చార్జీలు
బొగ్గుపై పర్యావరణ అనుకూల ఇంధన సెస్సును బడ్జెట్లో టన్నుకు రూ. 100 నుంచి రూ. 200కు రెట్టింపు చేయడం.. విద్యుత్ చార్జీల పెంపునకు దారి తీయనుంది. తాజా పరిణామంతో ప్రభుత్వ రంగ బొగ్గు ఉత్పత్తి దిగ్గజం కోల్ ఇండియాపై రూ. 5,000 కోట్ల మేర భారం పడనుంది. దీన్ని అది విద్యుత్ ఉత్పత్తి సంస్థలపై.. అవి అంతిమంగా వినియోగదారులకు బదలాయించనున్నాయి. ఫలితంగా విద్యుత్ చార్జీలు యూనిట్‌కు కనీసం 4 పైసల మేర ప్రభావం పడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
కోల్‌బెల్ట్ కుతకుత
ఉత్పత్తి కోసం అధికారుల ఉరుకులాట మరో పక్క కాంట్రాక్ట్ కార్మికుల నిరవధిక సమ్మె కొనసాగుతున్న వీఆర్ఎస్ డిపెండెంట్ల ఆందోళన విద్యుత్ కోసం బొగ్గు ఉత్పత్తి పెంచాలని ప్రభుత్వ ఒత్తిడి శ్రీరాంపూర్(ఆదిలాబాద్) : సింగరేణిలో ప్రస్తుత వాతవారణం వేస వి ఎండలను తలపిస్తోంది. ఎన్నడూ లేని విధంగా పరిస్థితులు చోటుచేసుకున్నారుు. ఒక వైపు వార్షిక లక్ష్యం.. మరో వైపు కార్మికుల ఆం దోళనలు.. ఒక దాని తరువాత మరొక సమస్య వచ్చి పడుతుండడంతో అధికార యంత్రాంగం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. సింగరేణి యూజమాన్యం ఈ ఆర్థిక సంవత్సరం(2014-15) ముందుగా 55 మిలియన్ టన్నుల వార్షిక లక్ష్యాన్ని పెట్టుకుంది. జనవరి నాటికి నిర్ధేశించిన లక్ష్యానికి 4 మిలియన్ టన్నుల లోటు ఉండటంతో లక్ష్యాన్ని 52.2 మి లియన్ టన్నులకు కుదించారు. దీనిని సాధిం చాడనికి అధికారులు పడరాని పాట్లు పడుతున్నారు. అన్ని ఏరియాలు 100 శాతం ఉత్పత్తి సాధించాలని సీఎండీ శ్రీధర్ ఆదేశాలు జారీ చేయడంతో ఉరుకులు పరుగుల మీద పనులు చేరుుస్తున్నారు. మరో వైపు వేసవిలో విద్యుత్ సమస్య అధికమయ్యే పరిస్థితులు ఉండడంతో పవర్ ప్లాంట్లకు సరిపడా బొగ్గు సరఫరా చేయూలని ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోంది. ఈ విషయమై స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగి పవర్ ప్రాజెక్టులను సందర్శిం చి ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు సూచనలిస్తున్నారు. దీంతో నిన్న మొన్నటి వరకు కూల్‌గా ఉన్న డెరైక్టర్లు ఏరియాల వారీగా పరుగులు తీస్తున్నారు. మల్టీ డిపార్టుమెంట్ కమిటీలు వా రం రోజులపాటు గనులపై సమావేశాలు పె ట్టించి కార్మికులకు సంస్థ స్థితిగతులను వివరిం చారు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి నెల రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో అన్ని ఏరియాల అధికారులకు కార్పొరేట్ నుంచి ఎప్పటికి కప్పుడు అందుతున్న ఆదేశాలు అధికారుల్లో వేడి పుట్టిస్తున్నారుు. ‘కాంట్రాక్ట్’ సమ్మెతో మరింత జఠిలం ఉత్పత్తికి కీలక సమయంలో కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెకు దిగడం మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా తయూరైంది యూజ మాన్యం పరిస్థితి. వారు హైపవర్ కమిటీ వేతనాల కోసం నిరవధికంగా సమ్మె చేస్తుండడంతో ఆ ప్రభావం ఉత్పత్తిపై పడుతోంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి యూజమాన్యం తోపాటు ముఖ్యంగా ఓపెన్‌కాస్టుల్లో ఓబీ కాం ట్రాక్టర్లు చేయని ప్రయత్నమూ లేదు. ఒక వైపు నాయకులతో చర్చలు జరుపుతూనే కార్మికుల ను అనుకూలంగా మల్చుకుని పనులు చేరుుం చడానికి తంటాలు పడుతున్నారు. పోలీసు బలగాలను మోహరించి విధులకు ఆటంకం కలుగకుండా చూస్తున్నారు. కాంట్రాక్టర్తు తమ వద్ద ఉండే వారితో ఓబీ వాహనాలు నడిపించడానికి చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి స్థానిక కాంట్రాక్ట్ కార్మికులు విఫలయత్నం చేస్తున్నారు. మరో వైపు సమ్మెకు సైతం మద్ద తు తెలుపడంతో సమ్మె దీర్ఘకాలికంగా మారే అవకాశాలు కనిపిస్తున్నారుు. వీఆర్ఎస్ డిపెండెంట్ల దీక్షలు ఇదిలా ఉంటే రెండు నెలలుగా వీఆర్ఎస్ డిపెండెంట్లు తమకు ఉద్యోగాలు కల్పించాలనే డిమాండ్‌తో ఆందోళనలు చేస్తున్నారు. జీఎం కార్యాలయాల ఎదుట టెంట్లు వేసి దీక్షలు కొనసాగిస్తున్నారు. గోదావరిఖనిలో దీక్ష శిబిరాన్ని యాజమాన్యం పోలీసులతో కూల్చి వేయడంతో ఒక్క సారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది. భూపాలపల్లిలో వీఆర్ఎస్ డిపెం డెంట్లు చేసిన రాస్తారోకో ఉద్రిక్తంగా మారడంతో పోలీసు యంత్రంగా వెంటనే స్పందిం చింది. చివరికి శాంతి యుతంగా పాదయాత్ర చేస్తున్న నేతలను సైతం శ్రీరాంపూర్ వంటి ఏరియాల్లో అరెస్టు చేశారు. వీరు రోజుకో నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. గుర్తింపు సంఘంపై విమర్శల వెల్లువ పర్మనెంట్ కార్మికులపై ఉత్పత్తి పేరుతో కొద్ది రోజులుగా పని భారం పెరిగినా గుర్తింపు సం ఘం టీబీజీకేఎస్ నేతలు పట్టించుకోవడంలేద నే విమర్శలు వెల్లువెత్తుతున్నారుు. ఇక కాంట్రా క్ట్ కార్మికుల, వీఆర్ఎస్ డిపెండెంట్ల సమస్యలు ఎలా తీరుస్తారని పెదవి విరుస్తున్నారు. ఆ సం ఘంలో నెలకొన్న గ్రూపుల కారణంగా యాజ మాన్యంతో తమ బాగోగులు చర్చించే దిక్కులేకుండా పోరుుందని మండిపడుతున్నారు. ప్రతి పక్ష సంఘాలు సైతం ఉనికి కాపాడుకోవడానికి పాకులాడుతున్నాయని అంటున్నారు. -
రోజుకు 2 లక్షల టన్నులు
గోదావరిఖని : సింగరేణి వ్యాప్తంగా రోజుకు రెండు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా పని చేయాలని ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ ఎన్.శ్రీధర్ సూచించారు. సీఎండీగా బాధ్యతలు స్వీకరించాక మొదటిసారిగా అన్ని ఏరియాల జీఎంలు, డెరైక్టర్లతో ఉత్పత్తి, ఉత్పాదకతపై సోమవారం గోదావరిఖని ఆర్జీ-1 జీఎం కార్యాలయంలో సమీక్షించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణి సంస్థ కీలక భూమిక పోషించాలని అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత అధికంగా ఉందని, కొరత తీర్చి 24 గంటలపాటు విద్యుత్ సరఫరా చేయాల్సిన అవసరముందన్నారు. మూడు, నాలుగేళ్లలో 8,300 మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్ ప్లాంట్లు ఏర్పడే అవకాశముందని, ఇందుకోసం ఏటా 10 శాతం అదనంగా బొగ్గు ఉత్పత్తి పెంచేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ప్రస్తుతం 16 ఓపెన్‌కాస్ట్‌లు, 32 భూగర్భ గనుల ద్వారా ప్రస్తుతం రోజుకు 1.60 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తున్నామని, దీన్ని 2 లక్షల టన్నులకు పెంచాలని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన 55 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధనకు రోజువారీ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు నిర్ణయించామని తెలిపారు. గనుల వారీగా లక్ష్యం నిర్దేశించుకోవాలని సూచించారు. ఇందుకు కార్మికులు, అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని అన్నారు. నూతన ప్రాజెక్టులైన బెల్లంపల్లి ఓసీపీ-2, జేవీఆర్ ఓసీపీ, ఆర్కేపీ ఓసీ, అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి పెంచాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. సమీక్షలో డెరైక్టర్లు ఎస్.వివేకానంద, బి.రమేశ్‌కుమార్, ఎ.మనోహర్‌రావు, పి.రమేశ్‌బాబు, సీపీఅండ్‌పీ చీఫ్ జనరల్ మేనేజర్ కేజే అమర్నాథ్, కార్పొరేట్ జనరల్ మేనేజర్లు జె.నాగయ్య, బి.కిషన్‌రావు, ఆంటోని రాజా, సీహెచ్ విజయారావు, ఎం.వసంత్‌కుమార్, వి.విజయ్‌పాల్‌రెడ్డి, పి.ఉమామహేశ్వర్, జీవీ రెడ్డి, సీహెచ్ నర్సింహారెడ్డి, జె.రామకృష్ణ, జె.సాంబశివరావు, ఎస్.శరత్‌కుమార్, డాక్టర్ కె.ప్రసన్నసింహా, ఎం.కృష్ణమోహన్, సీహెచ్ వరప్రసాద్, పి.రవిచంద్ర, ఎల్.బాలకోటయ్య, ఎ.ఆనందరావు, కె.బసవయ్య, ఏరియా సీజీఎంలు, జీఎంలు పాల్గొన్నారు. -
జైపూర్ వరకు ఫోర్‌లేన్ నిర్మాణం
శ్రీరాంపూర్ : శ్రీరాంపూర్ ఓసీపీ చౌరస్తా నుంచి జైపూర్ పవర్ ప్లాంటు వరకు ఉన్న రోడ్డును విస్తరించి నాలుగు లేన్ల రహదారిగా మారుస్తున్నామని శ్రీరాంపూర్ సీజీఎం సీహెచ్ వెంకటేశ్వర్రావు తెలిపారు. శనివారం తన చాంబర్లో ఉత్పత్తి వివరాల కోసం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. పవర్ ప్రాజెక్టు అవసరాల కోసం నిత్యం వాహనాల రాకపోకలు అధికంగా ఉంటాయని దీని కోసం ప్రస్తుతం ఉన్న రోడ్డును వెడల్పు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకుగాను కంపెనీ రూ.19 కోట్లను ప్రభుత్వ జాతీయ రహదారుల శాఖకు ఇచ్చామని, వారి ఆధ్వర్యంలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతాయన్నారు. 108 శాతం ఉత్పత్తి శ్రీరాంపూర్ ఏరియాలో అక్టోబర్‌లో 108 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించగా ఏరియా ఉత్పత్తిలో నాలుగో స్థానంలో ఉందన్నారు. గత నెల వరకు 114 శాతం ఉత్పత్తి నమోదైన శ్రీరాంపూర్ ఓసీపీలో సమస్య రావడం వల్ల లక్ష్యాన్ని సాధించలేదన్నారు. ఓబీ కోసం భూ సమస్య రావడం వల్ల గత నెల కంటే 1.25 లక్షల టన్నుల ఉత్పత్తి తగ్గింద ని చెప్పారు. గతేడాదితోపోల్చితే ఈ యేడు 30 శాతం ప్రమాదాలు తగ్గాయన్నారు. సింగరేణి స్థలాల్లో అక్రమ నిర్మాణాలు అనుమతించమన్నారు. సింగరేణి మైనింగ్ అవసరాల కోసం ఫారెస్టు శాఖ నుంచి లీజు తీసుకుందని మళ్లీ తిరిగి భూమి అప్పగించాల్సి ఉంటుందని తెలిపారు. సమావేశంలో ఎస్ఓటు సీజీఎం సత్యనారాయణ, డీజీఎం(ఐఈడీ) ఫణి, డీజీఎం(పర్సనల్) శర్మ, పీఎం కిరణ్‌కుమార్ ఉన్నారు. ఏరియాలో 76 శాతం ఉత్పత్తి రెబ్బెన : గత అక్టోబర్‌లో బెల్లంపల్లి ఏరియాలోని గనులు 76 శాతం బొగ్గు ఉత్పత్తిని సాధించాయని ఏరియా జనరల్ మేనేజర్ రాంనారాయణ తెలిపారు. శనివారం గోలేటిలోని కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఉత్పత్తి వివరాలు వెల్లడించారు. అక్టోబర్‌లో ఏరియా లక్ష్యం 5,32,400 టన్నులు కాగా 4,05,740 టన్నులు సాధించి 76శాతం నమోదు చేశాయన్నారు. బెల్లంపల్లి ఓసీపీ-2 ఎక్స్‌టెన్సన్ ఓసీపీలో అక్టోబర్ లోనే ఉత్పత్తి ప్రారంభం కావాల్సి ఉండగా అబ్బాపూర్ గ్రామానికి పునరావాసం కల్పించిన తర్వాత ఉత్పత్తి ప్రారంభిస్తామన్నారు. అలాగే డోర్లి-2 ఓసీపీలో సైతం ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభం కాకపోవటంతోనే నెల వారీ లక్ష్యాన్ని సాధించలేకపోయామని తెలిపారు. సమావేశంలో డీజీఎం పర్సనల్ చిత్తరంజన్కుమార్, డీవైపీఎం రాజేశ్వర్, ఐఈడీ యోహాన్ పాల్గొన్నారు. -
ఏమోనయా..?!
కొత్త గనులు.. ఆ మాటెత్తితే చాలు.. ఏమో.. ఎప్పటికి ప్రారంభమవుతాయో..! అనే సందేహం సింగరేణివ్యాప్తంగా వ్యక్తమవుతోంది. గతంలో ప్రతిపాదించిన వాటికి అనుమతులు రావడంలో జాప్యం చోటు చేసుకుంటుండడంతో నూతన ప్రాజెక్టుల ఏర్పాటు ప్రశ్నార్థకంగా మారుతోంది. - కొత్తగూడెం (ఖమ్మం) - కొత్త గనుల ఏర్పాటుపై సర్వత్రా సందేహం.. - పెండింగ్‌లో 21 ప్రాజెక్టులు.. - పదేళ్లుగా అనుమతుల కోసం నిరీక్షణ - ప్రారంభమైతే మరో 39 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి అవకాశం రోజురోజుకూ పెరుగుతున్న కరెంట్ వినియోగం, అందుకు అనుగుణంగా జల విద్యుత్ ఉత్పత్తి లేకపోవడం.. థర్మల్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటు అవసరాన్ని సూచిస్తున్నాయి. అదీగాక, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం తీవ్ర విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో సర్కారు కొత్త థర్మల్ పవర్ స్టేషన్ల ఏర్పాటుకు మొగ్గు చూపితే, వాటికి సరిపడా బొగ్గును కూడా ఉత్పత్తి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుతం సింగరేణి సంస్థ ఆధీనంలో 15 ఓపెన్ కాస్ట్ గనులు, 34 భూగర్భ గనులు ఉన్నాయి. వీటి ద్వారా ఏడాదికి 54మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. అయితే, కొత్తగా థర్మల్ విద్యుత్ కేంద్రాలు నెలకొల్పితే.. వాటికి సరిపడా బొగ్గును అందించాలంటే నూతన గనుల ఏర్పాటు తథ్యమని సింగరేణి యాజమాన్యం పదేళ్ల కిందటే సూచించింది. దాదాపు 21 ప్రాజెక్టులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి సర్కారుకు నివేదించింది. కారణాలేమిటో గానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి నేటికీ ఒక్కదానికి కూడా అనుమతులు రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం సైతం అనుమతుల అంశాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. భూ సేకరణే సమస్యా? అనుమతుల సంగతేమిటో గానీ, కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుకు కావలసిన భూ సేకరణ సింగరేణికి సవాల్‌గా మారింది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేసినప్పటికీ స్థానిక సమస్యల కారణంగా నూతన గనుల ఏర్పాటుకు యాజమాన్యం ఆచీతూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. పెండింగ్‌లో ఉన్న 21 ప్రాజెక్టుల్లో 13 ఓపెన్ కాస్టు గనులే. వీటిని నెలకొల్పే ప్రదేశంలోని ప్రజలను మరోచోటికి తరలించాల్సి ఉంటుంది. అక్కడి ప్రజలు స్వచ్ఛందంగా అంగీకరిస్తేనే భూ సేకరణ సులువవుతుంది. పరిహారం విషయంలో స్థానికుల డిమాండ్, సర్వే నిర్వహణలో జాప్యం ఇతరత్రా ఎదురయ్యే సమస్యలతో భూసేకరణ సింగరేణికి ఒకింత భారంగా మారుతోంది. కొంగొత్త ఆశలు..! పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ లభిస్తే... అదనంగా 39.31 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది. అదే క్రమంలో ఇటు సింగరేణిలోనూ, అటు థర్మల్ విద్యుత్ కేంద్రాల్లోనూ ఉద్యోగావకాశాలు ఏర్పడుతాయి. ఫలితంగా నిరుద్యోగ సమస్య తీరడంతో పాటు రాష్ట్రం విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించనుంది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు వచ్చేలా చూడాల్సిన అవసరం ఉంది. -
బొగ్గు ఉత్పత్తికి వర్షం దెబ్బ
శ్రీరాంపూర్ : జిల్లాలో శనివారం కురిసిన వర్షంతో బొగ్గు ఉత్పత్తి తీవ్ర విఘాతం కలిగింది. రోజంతా కురిసిన వర్షం వల్ల బెల్లంపల్లి రీజియన్‌లోని మూడు డివిజన్లలో గల 4 ఓసీపీల్లో సుమారు 18 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి బ్రే క్ పడింది. టన్నుబొగ్గు ధర సుమారు రూ.2 వేల చొప్పున లెక్కేసినా సింగరేణికి సుమారు రూ.మూడున్నర కోట్ల ఉత్పత్తి నష్టం వాటిల్లింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో క్వారీలో మైనింగ్ ఆపరేషన్స్‌ను పూర్తిగా నిలిపివేశారు. టిప్పర్లను, డంపర్లను క్వారీ నుంచి ఉపరితలానికి తరలించారు. క్వారీలో చేరిన వర్షపు నీటిని ఎప్పటికప్పుడు అధిక సామర్థ్యం గల పంపులతో బయటికి తోడేస్తున్నారు. ఇదిలా ఉంటే ఓసీపీల్లో ఓబీ పనులు చేసే కాం ట్రాక్టర్లు కూడా పనులు పూర్తిగా నిలిపివేశారు. అన్ని ఓసీపీల్లో ఓవర్ బర్డెన్ మట్టి పనులు ఆగిపోయాయి. అయితే భూగర్భ గనుల్లో ఉత్పత్తికి ఎలాంటి ఆటకం లేదు. ఇదీ పరిస్థితి బెల్లంపల్లి డివిజన్ పరిదిలో మూడు ఓసీపీలు ఉన్నాయి. డొర్లి 1, డొర్లి 2, కైరీగూడ ఉండగా ఇందులో డొర్లి 2లో ఓబీ సమస్యతో కొంత కాలంగా పనులు ఆపేశారు. మిగిలి రెండు ఓసీపీలను పరిశీలిస్తే డొర్లి 1 ఓసీపీ నెలవారి ఉత్పత్తి లక్ష్యం 1.18 లక్షల టన్నులుగా ఉంది. రోజు వారిగా రావాల్సిన 4 వేల టన్నుల బొగ్గు వర్షంతో పూర్తిగా ఆగిపోయింది. కైరిగూడ ఓపీపీలో నెలవారి ఉత్పత్తి లక్ష్యం 1.75 లక్షల టన్నులుగా ఉంది. దీంతో రోజు వారిగా సాధించాల్సిన 5500 టన్నుల ఉత్పత్తికి విఘాతం కలిగింది. ఇక మందమర్రి ఏరియాలో ఉన్న ఏకై క ఆర్కేపీ ఓసీపీ 1లో రోజు వారీ ఉత్పత్తి 2,500 టన్నులు పూర్తిగా నష్టపోయింది. శ్రీరాంపూర్‌లోని ఎస్సార్పీ ఓసీపీలో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. నెలవారీ ఉత్పత్తి లక్ష్యం 1.8 లక్షల టన్నులు కాగా వర్షంతో రోజు వారీగా ఉత్పత్తి చేయాల్సిన 6 వేల టన్నులకు బ్రేక్ పడింది. దీంతో బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని ఈ నాలుగు ఓసీపీల్లో కలిపి మొత్తం 18 వేల టన్నుల బొగ్గు వర్షంతో ఉత్పత్తి రాకుండా పోయింది. దీంతో సుమారు రూ.3.6 కోట్ల నష్టం కంపెనీకి వాటిల్లింది. కాగా, ఉపరితలంలో స్టాక్ చేసిన బొగ్గును తరలించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇదిలా ఉండగా వర్షం పూర్తిగా తగ్గి కనీసం 3 గంటల పొడి వాతవరణం ఉంటేనే ఓసీల్లో ఉత్పత్తి పునరుద్ధరణ సాధ్యమవుతుందరి అధికారులు పేర్కొంటున్నారు. -
బొగ్గు ఉత్పత్తికి బ్రేక్
శ్రీరాంపూర్ : సమగ్ర కుటుంబ సర్వేతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి బ్రేక్ పడింది. సర్వే సందర్భంగా కార్మికులు ఇంటి వద్దే ఉండాలని యాజమాన్యం మంగళవారం వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది. దీంతో కార్మికులు విధులకు హాజరుకాకపోవడంతో మైనింగ్ ఆపరేషన్స్ నిలిచాయి. భూగర్భ గనులు, ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా ఆగిపోయింది. జిల్లా పరిధిలో బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ డివిజన్లు ఉన్నాయి. ఈ మూడింటిని కలిపి బెల్లంపల్లి రీజియన్ అంటారు. ఈ రీజియన్ పరిధిలో మొత్తం 15 భూగర్భ గనులు, 4 ఓసీపీలు ఉన్నాయి. ఇందులో సుమారు 23 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. రీజియన్‌లోని గనుల్లో ఒక్క రోజు బొగ్గు ఉత్పత్తి సుమారు 30 వేల టన్నులు ఉంటుంది. సమగ్ర కుటుంబ సర్వేతో ఈ ఉత్పత్తిని సింగరేణి నష్టపోయింది. తద్వారా సుమారు రూ.4.5 కోట్ల నష్టం వాటిల్లింది. వేతనంతో కూడిన సెలవు ఇవ్వడంతో కంపెనీపై రూ.3 కోట్ల వేతన భారం పడింది. కాగా, రీజియన్ నుంచి సుమారు 1500 మంది ఉద్యోగులను కంపెనీ ఎన్యూమరేటర్లుగా పంపింది. మొదటిసారి.. సింగరేణిలో మొదటి సారిగా కార్మికులకు వేతనంతో కూడిన సెలవును యాజమాన్యం ప్రకటించింది. పండుగ సందర్భంగా ఇచ్చే సెలవును యాజమాన్యం ప్రభుత్వ కార్యక్రమాల కోసం ఇవ్వడం ఇదే ప్రథమం. సర్వే కోసం కార్మికులు చాలా మంది ఇంటి వద్దే ఉన్నారు. ఇతర ప్రాంతాల కార్మికులు, అధికారులు స్వస్థలాలకు తరలివెళ్లారు. సమ్మె వాతావరణం.. కార్మికులు రాక గనులపై సమ్మె వాతావరణం కనిపిం చింది. మ్యాన్‌రైడింగ్, టబ్బులు, తట్టాచెమ్మస్ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. బొగ్గుపెళ్ల కూడా బయటికి రా లేదు. గనుల ముందు ఉన్న హోటళ్లూ మూసి ఉన్నా యి. సెక్యూరిటీ సిబ్బంది, పంప్ ఆపరేటర్లు వంటి అత్యవసర సిబ్బంది కొందరే విధుల్లో ఉన్నారు. ఓసీపీల్లోనూ ఓవర్‌బర్డెన్ మట్టి పనులు నిలిచిపోయాయి. సీహెచ్‌పీలు, డిపార్ట్మెంట్లు, వర్క్‌షాపుల్లోనూ ఇదే పరిస్థితి. దూర ప్రాంతాలకు బొగ్గు రవాణా చేసే లారీలు ఉత్పత్తి లేక యార్డుకే పరిమితమయ్యాయి. ఇబ్బంది పడ్డ కార్మికులు..... సర్వే సందర్భంగా కార్మికుల్లో కొందరు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అక్కడక్కడ కొందరు బినామీ పేర్లతో కంపెనీలో పనిచేస్తున్నారు. చాలా ఏళ్ల నుంచి పనిచేస్తున్నప్పటికీ ప్రస్తుత సర్వేలో ఏ పేరు చెప్పాలో తెలియక ఇబ్బంది పడ్డారు. గతంలో డిపెండెంట్ ఉద్యోగాలు కొ నుక్కొని చేస్తున్నవారు, వేరే కులంతో పనిచేస్తున్నవారు ఇక్కట్లకు గురయ్యారు. అంతేకాకుండా కొత్తగా క్వార్టర్లు వచ్చినవారు, క్వార్టర్లు మారినవారు పాత అడ్రస్ వద్దకు వెళ్లి సర్వేలో వివరాలు నమోదు చేసుకోవడం ఇబ్బందిగా మారింది. ఇంటి నంబర్ కుదరకపోవడం, ఎన్యూమరేటర్ల వద్ద పాత పేర్లు ఉండడంతో కొంత గందరగోళ పరిస్థితి తలెత్తింది. క్వార్టర్‌కు ఒకే నంబర్ ఇవ్వడం, ఇంటి మొత్తాన్ని ఒకే యూనిట్‌గా రాసుకోవడంతో పలువురు కార్మికులు ఇబ్బందులు పడ్డారు. -
రక్తార్పణం
శ్రీరాంపూర్ : సింగరేణి గనులు ప్రమాదాలకు చిరునామాగా మారుతున్నాయి. అనేక ప్రమాదాలు పైకప్పు కూలడం వల్ల జరుగుతున్నాయి. దీంతో చాలా మంది కార్మికులు మృత్యువాత పడుతున్నారు. మరికొందరు తీవ్ర గాయాలపాలై జీవచ్ఛవాలుగా మారుతున్నారు. కాగా, కార్మికులు బొగ్గు ఉత్పత్తి చేస్తూ లోపలికి వెళ్తున్న కొద్ది పైకప్పు కూలకుండా సపోర్టు పెడతారు. గతంలో చెక్కదిమ్మలు కట్టేవారు. ఇటీవలి కాలంలో రూఫ్బోల్టులు వేస్తున్నారు. ఇవి కూడా ఆరు ఫీట్ల పైనుంచి పొర విడుచుకుంటూ వచ్చినా రక్షణ ఇవ్వడం లేదు. ఒత్తిడి ఒక్కసారి పెరిగితే రూఫ్‌బోల్టు ఊడివచ్చి రూఫ్పాల్గా మారుతుంది. రూఫ్పాల్ ఎప్పుడు జరుగుతుందో తెలుసుకునే సాంకేతిక పరిజ్ఞానం సింగరేణి వద్ద లేదు. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానం అందబాటులోకి రాలేదు. కూలడానికి కొన్ని సెకన్ల ముందు వచ్చే శబ్దాలు విని కార్మికులు పరుగెత్తి ప్రాణాలు కాపాడుకోవడం ఒక్కటే మార్గం. క్షణ కాలంలో జరిగే ఈ ప్రమాదాల్లో కొద్ది మంది మాత్రమే బతికే అవకాశం ఉంది. అయితే అక్కడ ప్రమాదంగా మారుతుందని ఇండికేషన్ ఇచ్చే పరికరాలు ఉన్నాయి. లోడ్సెల్ అనే పరికరం ద్వారా పైకప్పు ఒత్తిడి ఎంత ఉందో కొలుస్తారు. ఒత్తిడి పెరుగుతూ వస్తే ప్రమాద స్థలంగా(ఫాల్ట్ ఏరియా)గా గుర్తించి ప్రత్యేక రక్షణ చర్యలు చేపడతారు. ప్రధానంగా పర్యవేక్షణ లోపం ప్రమాద స్థలంలో పని చేసేటప్పుడు కార్మికులు స్వీయ రక్షణ తీసుకోవడం అవసరం. అలాగే కార్మికులను ప నులకు పురమాయించేటప్పుడు సింగరేణి అధికారులు కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ, అలా చేయడం లేదు. ప్రమాదకరంగా ఉన్న పనిస్థలాల్లో బొగ్గు వెలికితీత నిపుణులైన అధికారుల సమక్షంలో జరగాలి. దీనికి సరిపడా సూపర్వైజర్లు ఉండాలి. కానీ సింగరేణి వ్యాప్తంగా 600 ఓవర్‌మెన్, సర్దార్ల కొరత ఉంది. దీనికితోడు ఉత్పత్తి లక్ష్య సాధన కోసం అధికారులు పోటీపడుతూ పనులు చేయిస్తున్నారు. రేజింగ్ తక్కువగా వస్తే పరుగెత్తించి పనులు చేయిస్తున్నారు. అంతేకాకుండా రక్షణ కోసం సేఫ్టీ సిబ్బందిని, సూపర్వైజర్లను ఇవ్వమని అడిగితే అధికారులు సవాలక్ష కారణాలు చెబుతున్నారు. సేఫ్టీ ఆఫీసర్లు, మేనేజర్లు గనిలోకి దిగి పూర్తిస్థాయిలో పర్యవేక్షించడం లేదు. సేఫ్టీ సమావేశాలు కూడా మొక్కుబడిగా సాగుతున్నాయి. ఫేస్ వర్కర్లకు స్థానం కల్పించాల్సిన చోట ఎక్కడో సర్ఫేస్‌లో పని చేసే నాయకులు సేఫ్టీ కమిటీల్లో ఉంటున్నారు. కార్పొరేట్ స్థాయి సేఫ్టీ సమావేశం జరగక రెండేళ్లు అవుతుంది. సేఫ్టీ వీక్ కూడా నిర్వహించడం లేదంటే యాజమాన్యానికి కార్మికులపై ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుంది. నష్టపరిహారాల చెల్లింపుల్లో అన్యాయం ఎంత నష్టపరిహారం ఇచ్చిన చనిపోయిన కార్మికుడు లేని లోటు ఆ కుటుంబానికి పూడ్చనిది. అయితే వారికి ఆదుకోవడానికి ఇచ్చే ఆర్థిక సహాయం కూడా అధ్వానంగా ఉంది. గని ప్రమాదాల్లో మృతి చెందిన కార్మికుని కుటుంబానికి యాజమాన్యం రూ.6 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తుంది. ఇది కూడా విధుల్లో ఉన్నప్పుడు ప్ర మాదం జరిగితేనే. అదే గుండెపోటుతో, గాలి అందక ఊపిరి ఆగి చనిపోతే ఇవ్వడం లేదు. గాయాలై చనిపోతేనే ఎక్స్‌గ్రేషియా అంటున్నారు. ఈ వివక్ష దేశంలో ఎక్కడ లేదని కార్మికులు మండి పడుతున్నారు. వైజాగ్ స్టీల్‌ప్లాంటులో బాయిలర్ పేలి కార్మికులు చనిపోయిన ఘటనలో యాజమాన్యం ఒక్కో కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించింది. హెచ్పీసీఎల్లో రూ. కోటి నష్టపరిహారం చెల్లించారు. ఏటా రూ.400 కోట్ల లాభాలు సాధించి పెడుతున్న కార్మికులకు ఇచ్చేది కేవలం రూ.6లక్షలే. కార్మికుడు మృతిచెందినప్పుడు కార్మిక సంఘాలు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని శవంతో బైఠాయించి శవరాజకీయాల చేయడానికి యూనియన్ నేతలు పనికి వస్తున్నారని కార్మికులు మండిపడుతున్నారు. కార్మికుడు చనిపోయిన తరువాత మరుసటి రోజు వెళ్లి కనీసం ఆ కుటుంబ బాగోగులు కూడా తెలుసుకోరు. ఎన్నికల్లో తాము గెలిస్తే వైజాగ్ త రహాలో ఎక్స్‌గ్రేషియా ఇప్పిస్తామని టీబీజీకేఎస్ నేతలు బీరాలు పలికారు. తీరా గెలిచిన తరువాత మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడానికి మాత్రమే యాజమాన్యం ముందుకు వచ్చింది. దీనికి ప్రాతినిధ్య సంఘాలు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్ఎమ్మెస్లు అడ్డుపడ్డాయి. కార్మికుల నుంచి సగం డబ్బులు వసూలు చేసి ఇస్తే యాజమాన్యం సగం కలిపి ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ వద్దని ఎక్స్‌గ్రేషియానే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే జాతీయ సంఘాలని చెప్పుకొనే సంఘాలు దీనిపై కోలిండియాలో ఎందుకు సాధించుకురావడం లేదని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఎక్స్‌గ్రేషియా ఇచ్చే అధికారం సింగరేణికి ఉందని.. కాదు ప్రభుత్వమే ఆదేశించాలని.. కాదు ఇది దీనికి కోలిండియాలోనే ఒప్పందం చేసుకోవాలని ఒక సంఘంపై మరో సంఘం ఆరోపించుకుంటూ రాజకీయ పబ్బం గడుపుతున్నాయి. ఎంత సేపు ఇతర సంఘాన్ని వైఫల్యం చెందించి వచ్చే ఎన్నికల నాటికి బలపడాలన్నదే అన్ని సంఘాల ఎత్తుగడ తప్ప ఐక్యంగా పోరాడి ఎక్స్‌గ్రేషియా సాధించాలని చిత్తశుద్ధి ఏమాత్రం లేదు. ఏది ఏమైన అటు యాజమాన్యం కార్మికుల ప్రాణాలకు రక్షణ ఇవ్వకపోవడం, ఇటు సంఘాలు మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి ముందుకు రాకపోవడంతో నల్లసూర్యుల కుటుంబాలు చీకటి మయం అవుతున్నాయి. -
బండ కింద బతుకులు
బెల్లంపల్లి : భూగర్భంలో పనిచేస్తున్నకార్మికుల ప్రాణాలకు రక్షణ లేదు. బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతపై చూపిస్తున్న శ్రద్ధ అధికారులు గనుల్లో రక్షణ చర్యలపై చూపడం లేదు. కనీస రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో కార్మికులు ప్రమాదాల భారినపడుతున్నారు. మందమర్రి ఏరియా శాంతిఖని గనిలో కార్మికులు ప్రతికూల పరిస్థితుల మధ్య విధులు నిర్వహిస్తున్నారు. పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం ఎవరికి సంభవిస్తుందోననే అభద్రతాభావం కార్మికుల్లో వ్యక్తమవుతోంది. గత శనివారం రెండో షిప్ట్‌లో 2 డీప్ 55 లెవల్ వద్ద సపోర్టు పనులు నిర్వహిస్తుండగా ఆకస్మికంగా పైకప్పు కూలింది. ఈ ఘటనలో ఓవర్‌మెన్ మీన సుదర్శన్ ఎడమ కాలుకు తీవ్రమైన గాయాలు తగలగా, బ్రహ్మేశ్వర్రావు అనే బదిలీ ఫిల్లర్ కార్మికుడికి స్వల్ప గాయాలయ్యాయి. ఆ క్షణంలో ఏఎం యంత్రం మరమ్మతులకు రావడంతో పక్కకు వెళ్లిన మరో నలుగురు కార్మికులు తృటిలో ప్రాణాల నుంచి బయటపడ్డారు. బొగ్గు అధికోత్పత్తి సాధనే లక్ష్యంగా పని చేస్తున్న అధికారులు ప్రకృతికి విరుద్దంగా భూగర్భంలో పని చేస్తున్న కార్మికుల ప్రాణాల మీదికి వస్తున్నా పట్టింపు చేయడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రక్షణ టీంకే రక్షణ లేదు.. భూగర్భంలో బొగ్గు వెలికితీతకు రక్షణ చర్యలు పటిష్టవంతంగా చేపట్టాల్సి ఉంటుంది. కార్మికులు పనిస్థలాలకు వెళ్లే ముందస్తుగానే రక్షణ టీం సపోర్టు పనులు నిర్వహించాలి. పైకప్పు కూలకుండా డబ్ల్యుస్ట్రాఫ్ రూఫ్ బోల్ట్‌తో బిగించి కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత రక్షణ టీంపైనే ఉంటుంది. ప్రెస్లీ ఎక్స్పోజ్డ్(బొగ్గు వెలికితీత తర్వాత ఏర్పడిన ఖాళీ స్థలం)లో రక్షణ పనులు నిర్వహించే సపోర్టు టీం సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటోంది. సపోర్టు పనులు చేపట్టే ముందు రక్షణ టీం ఖాళీ ప్రదేశంలో దాటు లేదా దిమ్మె, ఫోర్ఫోలింగ్ను ఏర్పాటు చేసుకొని సపోర్టు పనులు ప్రారంభించాల్సి ఉండగా అలాంటి పద్ధతులు శాంతిఖని గనిలో నిర్వహించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు. ఈ విధానం కొంత కాలం నుంచి గనిలో చేపట్టడం లేదు. ఈ కారణంగానే రక్షణ టీంకు రక్షణ లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అడపాదడపా పైకప్పు కూలి గాయాలపాలవుతున్నారు. పర్యవేక్షణ లేని డీజీఎంఎస్ భూగర్భ గనుల్లో రక్షణ చర్యలపై పర్యవేక్షణ నిర్వహించే డెప్యూటీ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ(డీజీఎంఎస్) పత్తా లేకుండా పోయారు. మైన్స్ యాక్టు ప్రకారం ప్రతి ఆరు నెలలకోసారి డీజీఎంఎస్ గనులను తనిఖీ చేయాల్సి ఉండగా ఇటీవలి కాలంలో నిర్లక్ష్యం విహ స్తున్నారు. మైనింగ్ ఇన్స్పెక్టర్లు గనుల వైపు కన్నెత్తి చూడటం లేదు. పర్యవేక్షణ నిర్వహించడం లేదు. ఏదో ఏడాదికోసారి అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గనిలో దిగి రక్షణ చర్యలను నిశితంగా పర్యవేక్షించాల్సిన అధికారులు నిర్లిప్తంగా పర్యవేక్షిస్తుండటంతో సింగరేణి అధికారులు చిత్తశుద్ధితో సేఫ్టీ పనులు చేపట్టలేకపోతున్నట్లు తెలుస్తోంది. వర్క్‌లేని... వర్క్‌మన్ ఇన్స్పెక్టర్లు మైనింగ్ ఇన్స్పెక్టర్లే కాకుండా గని స్థాయిలో ఏర్పాటు చేసిన వర్క్‌మెన్ ఇన్స్పెక్టర్లు కూడా సపోర్టు పనులను పర్యవేక్షించాల్సి ఉంటుంది. గనిలో వర్క్‌మెన్ ఇన్స్పెక్టర్లు వారానికో రోజు సేఫ్టీ పనులను తనిఖీ చేసి రిపోర్టు తయారు చేయాల్సి ఉంటుంది. చాలా మట్టుకు గని ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే వీరు పని చేయాల్సి ఉండటం వల్ల ఉన్నతాధికారుల సూచనల మేరకే రిపోర్టులు తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. సేఫ్టీ విషయంలో వర్క్‌మన్ ఇన్స్పెక్టర్లు సూచనలు, సలహాలు ఇచ్చిన ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు. వర్క్‌మన్ ఇన్స్పెక్టర్లకు స్వయం ప్రతిపత్తి లేకపోవడంతో నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నారు. ఆ రకంగా గనిలో కార్మికుల ప్రాణాలకు రక్షణ లేనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రక్షణ చర్యలకు ప్రాధాన్యత ఇవ్వకపోతే భవిష్యత్‌లో ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితులు ఉంటాయని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
రాష్ట్ర విద్యుత్ అవసరాలకు సరిపడా బొగ్గు ఉత్పత్తి చేయాలి
సింగరేణి సీఎండీ సుతీర్థ భట్టాచార్య భూపాలపల్లి : తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ అవసరాలకు సరిపడా బొగ్గును ఉత్పత్తి చేసేందుకు అధికారులు, కార్మికులు కృషి చేయాలని సింగరేణి సంస్థ సీఎండీ సుతీర్థ భట్టాచార్య అన్నారు. భూపాలపల్లి ఏరియాలో శనివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టును సందర్శించి అందులో మట్టి తవ్వకాల తీరుతెన్నులు, బొగ్గు ఉత్పత్తి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఇసుక తయారీ కేంద్రానికి చేరుకుని మట్టి నుంచి ఇసుకను వేరు చేసే విధానాన్ని పరిశీలించారు. ఏరియాలో ఇసుక కొరత ఉన్న దృష్ట్యా భూగర్భ గనులకు సరిపడా ఇసుకను తయారీ చేయాలని చెప్పారు. తర్వాత స్థానిక అతిథి గృహంలో వివిధ విభాగాల అధికారులతో సమావేశమై పలు సూచనలు, సలహాలు అందజేశారు. చెల్పూరు కేటీపీపీ రెండో దశ వచ్చే ఏడాది ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెప్పారు. అయితే మొదటి, రెండు దశలకు సరిపడా బొగ్గును అందించాలంటే ఏరియాలోని ఓపెన్‌కాస్ట్, తాడిచర్ల బ్లాక్ పనులను మరింత వేగవంతం చేయాలని సూచించారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా చూసేందుకు సింగరేణి తనవంతు పాత్ర పోషించాలని కోరారు. అధికారులు, కార్మికులు రక్షణతో కూడిన ఉత్పత్తి, ఉత్పాదకతను సాధించేందుకు కృషి చేయాలని అన్నారు. సీఎండీ వెంట సంస్థ డెరైక్టర్లు విజయ్‌కుమార్, మనోహర్, రమేష్‌కుమార్, రమేష్‌బాబు, ఆయా విభాగాల అధికారులు, సీజీఎంలు, జీఎంలు ఉన్నారు. -
గాలి రాక.. బురద తీయక..!
బెల్లంపల్లి : ప్రకృతికి విరుద్ధంగా భూగర్భంలోకి వెళ్లి కార్మికులు బొగ్గు ఉత్పత్తి కోసం నరకయాతన పడుతున్నారు. తీవ్రమైన వేడితో సతమతమవుతున్నారు. ఎడతెగని ఉరుపులు, మోకాలులోతు బురదలో విధులు నిర్వహించడానికి అష్టకష్టాలు పడుతున్నారు. బురదలో జారిపడి రోజుకో ప్రమాదానికి గురవుతున్నారు. పని స్థలాలను మెరుగుపర్చి, కనీస సదుపాయాలు కల్పించాల్సిన గని అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. కార్మికులపై పనిభారం పెంచి ‘దొర’తనాన్ని ప్రదర్శిస్తున్నారు. కార్మికుల పక్షాన నిలవాల్సిన గుర్తింపు సంఘ నాయకులు పట్టింపు లేని ధోరణిని ప్రదర్శిస్తున్నారు. మందమర్రి ఏరియా పరిధిలోని శాంతిఖని గని కార్మికులు బొగ్గు ఉత్పత్తిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ గనిలో సుమారు 700 మంది వరకు కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. రోజుకు సగటున సుమారు 200 టన్నుల వరకు బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. గని భూగర్భంలో పని స్థలాలు సరిగా లేక కార్మికులు ఎన్నో వ్యయప్రయాసాలకు గురవుతున్నారు. గనిలోని భౌగోళిక పరిస్థితులు ప్రతికూలంగా ఉండటంతో కార్మికులు సరిగా విధులు నిర్వహించలేకపోతున్నారు. గర్మీతో సతమతం శాంతిఖని నార్త్ట్రంక్-4 డిప్ 50 లెవల్ నుంచి 55 లెవల్ వరకు పని స్థలాల్లో గాలి సరఫరా జరగడం లేదు. అక్కడ విధులు నిర్వహించడానికి కార్మికులు రోజు ఎంతో సాహసం చేయాల్సి వస్తోంది. గాలిలో తేమశాతం పెరిగి తీవ్రమైన వేడి, ఉక్కపోతతో కార్మికులు విధులు నిర్వహించలేని పరిస్థితులు ఉన్నాయి. ఫ్యాన్లు నామమాత్రంగా ఉండటం వల్ల కార్మికులకు అంతగా ప్రయోజనం లేకుండా పోతోంది. భరించలేని వేడి వల్ల కార్మికులు విధులు నిర్వహిస్తూనే కింద పడిపోయి అస్వస్థతకు గురవుతున్నారు. గనిపైకప్పు నుంచి ఎడతెరిపి లేకుండా ఉరుపులు(నీటిధార) పడుతుండటంతో కార్మికులు తడుస్తున్నారు. ఎనిమిది గంటలు నిరంతరంగా తడవడం వల్ల శారీరక సమస్యలు ఏర్పడుతున్నాయి. అనేక మంది కార్మికుల కాలి వేళ్లకు పుండ్లై నడవలేకపోతున్నారు. గజ్జల్లో దురద ప్రబలి ఇబ్బందులకు గురవుతున్నారు. బురదలో తప్పని తిప్పలు గనిలోని పని స్థలాల వద్ద ఎప్పుడు విపరీతమైన బురద ఉండటంతో కార్మికులు ఎన్నో బాధలు పడుతున్నారు. రోజు ఒకరిద్దరు కార్మికులు బురదలో అదుపు తప్పి కింద పడిపోతున్నారు. గాయాలు తగిలి ఆస్పత్రిపాలవుతున్నారు. గనిలోని 50 లెవల్ నుంచి 55 లెవల్ వరకు మోకాలులోతు బురద ఉంది. ఆ బురదలో కాలుతీసి కాలు పెట్టే పరిస్థితులు లేవు. కార్మికులు జారిపడుతున్న సంఘటనలు నిత్యకృత్యంగా చోటు చేసుకుంటున్నా నివారణ చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. పెరిగిన పని భారం గనిలో సదుపాయాల కల్పనలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న అధికారులు పనిభారం పెంచి కార్మికులను తీవ్ర వేదనకు గురి చేస్తున్నారు. క్షణం తీరిక లేకుండా కార్మికులతో పనులు చేయించుకుంటున్నారు. పెరిగిన పని ఒత్తిడిని కార్మికులు తట్టుకోలేకపోతున్నారు. పని భారం పెంచిన అధికారులు సేద తీర్చుకోవడానికి కార్మికులకు కనీసం ఐదు నిమిషాలు కూడా వెసులుబాటు కల్పించడం లేదు. చెప్పినట్లు పని చేయని కార్మికులకు అధికారులు వార్నింగ్ లేఖలు, చార్జిషీట్లు జారీ చేస్తున్నారు. తోటి కార్మికుల ముందు మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. పట్టింపు ఏది? కార్మికుల వెన్నంటి ఉండి సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకునే కార్మిక సంఘ ప్రతినిధులు గనిలో లేకుండా పోయారు. గుర్తింపు సంఘ నాయకులు కొందరు ఉచితంగా మస్టర్లు పడి ఇంటికి వెళ్లడమే కాని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై యాజ మాన్యంతో సంప్రదించి పరిష్కరించేందుకు చొరవ తీసుకోవడం లేదు. గనిలో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు దోహదపడాల్సిన కార్మిక నాయకులు అవేమి పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో అధికారులది ఇష్టారాజ్యంగా మారింది. ఇప్పటికైనా గుర్తింపు సంఘ నాయకులు సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. -
కొత్త రాష్ర్టంలో విద్యుత్ లోటు
శ్రీరాంపూర్, న్యూస్‌లైన్ : జూన్ 2న అవతరిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి సింగరే ణి జీవగర్ర కానుంది. కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తరువాత తెలంగాణ ఎదుర్కొనే మొదటి సమస్య విద్యుత్. తెలంగాణలోని విద్యుత్ సంస్థల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ రాష్ర్ట అవ సరాలకు సరిపోవడం లేదు. 4 వేల మెగావాట్ల విద్యుత్ లోటు ఏర్పడుతుందని రాష్ట్ర విభజన సందర్భంగా ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈ లోటు తీర్చాల్సిన బాధ్యత సింగరేణిపై పడింది. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి పెంచడానికి ముడిసరుకైన బొగ్గు ఉత్పత్తి పెంచాలని సింగరేణిపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం సూచనప్రాయంగా సింగరేణికి ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ఏర్పడ్డ తరువాత ఏర్పడే 4 వేల మెగావాట్ల లోటు తీరాలంటే సింగరేణి అదనంగా ఏడాదికి సుమారు మరో 18 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం పేర్కొంటోంది. ఈ బొగ్గు కొత్త విద్యుత్ సంస్థలతోపాటు, కెపాసిటీ పెంచే పాత సంస్థలకు అవసరం పడుతుంది. ఇదిలాఉంటే గడిచిన 2013-14 ఆర్థిక సంవత్సరంలో సంస్థ 54.3 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని నిర్ధేశించుకున్న అందులో కేవలం 50.4 మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి చేసింది. ఏటా వార్షిక బొగ్గు ఉత్పత్తిలో 60 శాతం బొగ్గు విద్యుత్ సంస్థలకే సరఫరా చేయడం జరుగుతున్నది. కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన సింగరేణిలో 35 భూగర్భ గనులు, 15 ఓసీపీలు ఉన్నాయి. 65 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. సాలీనా 50 మిలియన్ టన్నుల పైబడి బొగ్గు ఉత్పత్తి అవుతున్నది. 2012-13లో 53.4 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరిగింది. తరువాత సంవత్సరం తగ్గింది. కారణం గనులు పాతపడటంతో బొగ్గు నిక్షేపాలు లోతుల్లోకి వెళ్లి ఉత్పత్తికి ప్రతికూలంగా మారుతున్నాయి. అంతేకాకుండా కొత్త భూగర్భ, ఓసీపీలకు అనుమతుల్లో జాప్యం జరుగడం వల్ల బొగ్గు ప్రాజెక్టులు మొదలు కాక ఉత్పత్తి క్రమేపి తగ్గుతూ వస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం 55 మిలియన్ టన్నుల లక్ష్యం ఉంది. కొత్త రాష్ట్రంలో 18 మిలియన్ టన్నుల బొగ్గును అధనంగా సరఫరా చేయడం తప్పని సరైంది. ఇంత భారీ మొత్తం ఉత్పత్తి చేయాలంటే కొత్త గనులు తవ్వాల్సిందే. దీని కోసం యాజమాన్యం ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టింది. విద్యుత్ సమస్య వాకిట్లో ఉన్న దృష్ట్యా త్వరితగతిన బొగ్గు ఉత్పత్తి పెంచాలంటే ఓసీపీలకే ప్రాధాన్యత ఇవాల్సి వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. కనీసం 6 నుంచి 8 కొత్త ఓసీపీలు ఏర్పాటు చేయడానికి రూపకల్పన చేస్తున్నారు. ఇప్పటికే ప్రతిపాదనలో ఉన్న ఓసీపీలు.. తాడిచెర్ల, భూపాలపల్లి ఓసీపీ-2, శ్రావణ్‌పల్లి, మహేదేవ్‌పూర్, ఆర్జీ ఓసీపీ 3 ఫేజ్ 2, జీవీఆర్ ఓసీపీ 2 వంటి పలు ప్రాజెక్టులను వేగవంతం చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. మరి కొన్ని భూగర్భ గనులు ఇదిలా ఉంటే దీనితోపాటు మరి కొన్ని భూగర్భ గనులు కూడా అవసరం ఉంది. శాంతిఖని, మందమర్రి షాఫ్ట్‌బ్లాక్, ఆర్కేపీ షాఫ్ట్‌బ్లాక్, కేకే 5 విస్తరణ, కాసిపేట 2 ఇంక్లైన్, గుండాల వంటి గనులు వేగవంతంగా తవ్వాలని భావిస్తున్నారు. కొత్తగా మొదలైన అడ్రియాల ప్రాజెక్టు నుంచి కూడా బొగ్గు ఉత్పత్తిని ఘననీయంగా పెంచుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడింది. భవిష్యత్‌లో సింగరేణి మరిన్ని ప్లాంట్లు కొత్త రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు విద్యుత్ సమస్యలు తీరాలంటే సింగరేణి కూడా రాబోయే రోజుల్లో మరికొన్ని పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దీనికి కొత్త ప్రభుత్వం నుంచి బడ్జెట్ సపోర్టు తప్పని సరి అని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. సింగరేణి సొంతంగా జైపూర్‌లో 1,200 మెగావాట్ల విద్యుత్ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నది. ఇకపై దీని సామర్థ్యం పెంచుకోవాల్సి ఉందని యాజమాన్యం భావిస్తుంది. అదే విధంగా రామగుండం బీ పవర్హౌజ్నుంచి 60 మెగావాట్ల విద్యుత్ వస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతానికి ఉన్న ప్రాజెక్టులకు కెపాసిటి పెంచుతూ అదనపు యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలని విద్యుత్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. వీటితోపాటు ప్రభుత్వానికి చెందిన రామగుండం ఎన్టీపీసీ, భూపాలపల్లి, పాల్వంచ ఇంకా ఇతర జెన్కో పరిధిలోని ప్లాంట్లను విస్తరించుకోవాల్సిన అవసరం ఉందని విద్యుత్ రంగ నిపుణులు భావిస్తున్నారు. విద్యుత్ అవసరాల కోసం కొత్త ప్రాజెక్టులు తప్పని సరి తెలంగాణలో 4 వేల మెగావాట్ల లోటు ఉంది. ఈ లోటు తీరాలంటే ఉన్న విద్యుత్ కంపెనీలకు, కొత్త వాటికి డిమాండ్‌కు తగ్గట్లు బొగ్గు ఉత్పత్తిని పెంచాలి. ఇప్పుడు ఉత్పత్తి చేస్తున్న ఉత్పత్తి కంటే మరో 18 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అధనంగా చేయాలి. దీనికి 6 నుంచి 8 ఓసీపీలు త్వరితగతిన మొదలు పెట్టాలి. మరికొన్ని భూగర్భ గనులు తవ్వాల్సి ఉంది. కొత్త ప్రాజెక్టులు చేపట్టితేనే డిమాండ్‌కు తగ్గ బొగ్గు ఉత్పత్తి చేయగలుగుతాము. -
బొగ్గు ఉత్పత్తిపై ఎన్నికల ప్రభావం
భూపాలపల్లి, న్యూస్‌లైన్ : స్థానిక సంస్థలు, సా ర్వత్రిక ఎన్నికల ప్రభావం సింగరేణిలో బొగ్గు ఉత్పత్తిపై తీవ్రంగా పడింది. దీంతో కంపెనీ వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాల్లో మణుగూరు మినహా ఇతర ఏరియాలు గత నెలలో నిర్ధేశిత లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయి. ఏప్రిల్ 6న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు, 30న సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. వివిధ రాజకీయ పార్టీల నాయకులు నిర్వహించిన గేట్ మీటింగ్‌లు, ప్రచారంలో కొందరు కార్మికులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొనడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సంస్థ వ్యాప్తంగా 40,34,000 టన్నుల బొగ్గు వెలికితీయాల్సి ఉండగా 23,72,542 టన్నులు(59 శాతం) మాత్రమే నమోదైంది. కొత్తగూడెంలో 59 శాతం, ఇల్లెందులో 60, మణుగూరులో 106, రామగుండం-3లో 93, అడ్రియాలలో 35, భూపాలపల్లిలో 27, రామగుండం-1లో 61, రామ గుండం-2లో 33, బెల్లంపల్లిలో 13, మందమర్రిలో 30, శ్రీరాంపూర్‌లో 93 శాతం బొగ్గు ఉత్పత్తి జరిగింది. భూపాలపల్లిలో.. భూపాలపల్లి ఏరియాలో 3,03,700 టన్నులకు 82,440 టన్నుల(27 శాతం) ఉత్పత్తి జరిగింది. కేటీకే-1 గనిలో 41వేల టన్నులకు 22,286 టన్నులు, కేటీకే-2లో 34,200 టన్నులకు 17,110 టన్నులు, కేటీకే-5లో 41వేల టన్నులకు 19,313 టన్నులు, కేటీకే-6లో 23,900 టన్నులకు 13,804 టన్నులు, కేఎల్పీలో 13,592 టన్నులకు 5,285 టన్నులు, ఓపెన్‌కాస్ట్‌లో 1,50,000 టన్నులకు 4,643 టన్నుల ఉత్పత్తి నమోదైంది. ఏరియాలోని భూగర్భ గనులలో 1,53,692 టన్నులకు 77,797 టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగింది. -
సింగరేణికి ‘సమ్మక్క’ దెబ్బ
శ్రీరాంపూర్, న్యూస్‌లైన్ : సింగరేణి బొగ్గు ఉత్పత్తికి సమ్మక్క-సారలమ్మ జాతర పోటు తగిలింది. జాతర సందర్భంగా బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలుగుతోంది. నాలుగైదు రోజులుగా సింగరేణి వ్యాప్తంగా కార్మికుల హాజరుశాతం తగ్గింది. దీంతో రోజువారీగా సంస్థకు 30 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నష్టం వాటిల్లుతోంది. ప్రతి గనిలో 20 నుంచి 25 శాతం మంది కార్మికులు జాతర కోసం వెళ్లారు. రెండేళ్ల కోసారి జాతర సందర్భంగా కం పెనీకి ఈ ఐదు రోజులు గండమే. పెద్ద ఎత్తున కార్మికుల కుటుంబాలు మొక్కులు తీర్చుకోవడానికి మొదటికి(మేడారం)కు వెళ్తున్నారు. దీంతో భారీగా హాజరుశాతం పడిపోవడంతో యాజమాన్యం ఆందోళన చెందుతోంది. పని స్థలాల్లో యంత్రాలు బంద్ బొగ్గు ఉత్పత్తి ప్రభావం అధికంగా భూగర్భ గనులపై పడింది. కార్మికుల సంఖ్య తక్కువగా ఉండటంలో కొన్ని గనుల్లో వచ్చిన సంఖ్య ఆధారంగా కొన్ని మిషన్లు నడుపుతున్నారు. దీంతో కొన్ని పనిస్థలాలు బంద్ అవుతున్నాయి. బుధ, గురువారం, శుక్రవారం కూడా చాలా గనుల్లో ఇదే పరిస్తితి ఉంటుంది. దీనికి తోడు సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్టర్లు సమ్మె చేయడంతో కాంట్రాక్ట్ కార్మికులు కూడా విధులు లేక ఉన్నారు. దీంతో సివిల్ డిపార్టుమెంట్లో నిర్మాణ పనులు కూడా ఆగిపోయాయి. దీని ప్రభావం పరోక్షంగా కంపెనీపై పడింది. నేరుగా ఉత్పత్తిపై లేకున్నా పర్మినెంట్, కాంట్రాక్టు కార్మికులు లేక చాలా డిపార్టుమెంట్లు బోసిపోతున్నాయి. ఇప్పటికే 5 మిలియన్ టన్నుల లోటు సింగరేణి కంపెనీ వ్యాప్తంగా 5 మిలియన్ టన్నుల లోటు ఉంది. దీనికి జాతర తోడవడంతో మరింత పెరుగుతోంది. రోజు కార్మికుల హాజరు శాతం 20 నుంచి 25 శాతం తగ్గుతోంది. కంపెనీ రోజు వారి ఉత్పత్తి లక్ష్యం 2.10 లక్షల టన్నులు ఉండగా సాధారణ రోజుల కంటే కూడా జాతర వల్లే 30 వేల వరకు తక్కువగా వస్తున్నది. జిల్లా వ్యాప్తంగా ఉత్పత్తి చూస్తే శ్రీరాంపూర్ డివిజన్ రోజు వారి లక్ష్యం 22,621 గాను 17,044 టన్నులు వస్తుండగా, మందమర్రి ఏరియాలో 10,788కి గాను 7,017, బెల్లంపల్లిలో 23,397కు గాను 18,012 టన్నులు వస్తుంది. సాధారణ రోజుల్లో రీజియన్ సరాసరి తీసుకుంటే 90 శాతం వరకు వస్తుంటే ఇప్పుడు 65 శాతం వరకే జాతర వల్ల వస్తుంది. కాగా, 15వ తేదీ నాటికి సమ్మక్క సారలమ్మలు వనం వెళ్లిన తరువాతే కంపెనీ ఉత్పత్తి చక్కబడనుంది. -
బొగ్గుబిడ్డలకు భరోసా ఇద్దాం
రామకృష్ణాపూర్(ఆదిలాబాద్), న్యూస్‌లైన్ : చెమటను రక్తంగా మార్చి భూగర్భంలోంచి బొగ్గు వెలికితీసి దేశానికి వెలుగులు పంచుతున్న గని కార్మికుల శమ్ర వెలకట్టలేనిది.. వారికి వేతనం ఇస్తున్నాం కదా.. అని అనుండొచ్చు. కంపెనీలో కోల్ఫిల్ల ర్లు.. కోల్కట్టర్లు.. ట్రామర్లు.. టింబర్‌మన్లు.. బదిలీ ఫిల్లర్లు.. ఇలా వివిధ కేటగిరీలకు చెందిన కార్మికులు బొగ్గు ఉత్పత్తి కోసం శ్రమిస్తున్నారు. ప్రతీ కార్మికుడి వయసు 58 సంవత్సరాలు వచ్చే సరికి ఉద్యోగ విరమ ణ చేయాలన్న విషయం తెలిసిందే. ఉద్యోగంలో చేరిన నాటి వ్యక్తి విధుల నుంచి విరమించుకునే సమయం లో అతడి పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలి. ప్రకృతికి విరుద్ధమైన వాతావరణంలో శుశ్కించిన శరీరం.. రోగాలు రొప్పులే మిగులుతాయి. బతికున్నంత కాలం ఇంటిల్లిపాది సేవ చేయాల్సిందే. ఇది ఆరోగ్యానికి సంబంధించిన విషయం.. ఆర్థిక పరమైన మరో సమస్య కూడా ఉంది. ఉద్యోగ విరమణ చివరి దశలో చాలా మంది ఆరోగ్యం సహకరించక పూర్తి స్థాయిలో మస్టర్లు నిండడం లేదు. దీంతో అటు వేతనంతోపాటు పింఛను తగ్గి నష్టపోవాల్సి వస్తోంది. ఈ వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు. రక్తాన్ని ధారబోసి న శ్రామికుడి బతుక్కి భరోసా లేని ఈ పరిస్థితుల్లో నల్ల సూర్యులుగా కీర్తించే బొగ్గు బిడ్డలకు ఏమీ చేయలేమా..? వ్యక్తిగతంగా అధికారులు ఏమీ చేయలేక పోవచ్చు.. యాజమాన్య పరంగా అవకాశం ఉంది. అందుకోసం చిత్తశుద్ధితో కృషి చేసే వారు కావాలి. ఇదీ ప్రత్యామ్నాయం ఉద్యోగ విరమణకు దగ్గరున్న వారికి చివరి ఏడాది అండగా నిలవాలని ఎందరి నుంచో విజ్ఞప్తులు వస్తున్నాయి. ఇన్నాళ్లూ కంపెనీకి చేసిన సర్వీసును గుర్తించి చివరి ఏడాది యాక్టింగ్ విధులు అప్పగిస్తే బాగుంటుం దన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా చేయడం వల్ల కార్మికుల్లో మానసిక ధైర్యాన్ని కల్పించి నట్లవుతుందని పేర్కొంటున్నారు. అంతే కాకుండా ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుంది. రిటైరయ్యే కార్మికులకు చివరి పది నెలల సగటు వేతనాన్ని ఆధారంగా చేసుకుని పింఛన్ నిర్ణయమవుతుంది. అసలే వయసు మళ్లీ.. శరీరం సహకరించక తరచూ విధులకు గైర్హాజరయ్యే కార్మికులకు ఇది శాపంగా మారుతోంది. దీనిమూలంగా అటు వేతనం నష్టపోవడంతోపాటు పింఛన్ ఆశించిన విధంగా పొందలేకపోతున్నారు. జీవితాన్ని సంస్థకు ధారపోసినా ఆశించిన పింఛన్‌కు నోచుకోక పోతున్నామనే ఆందోళన వారిని బతికున్నం త కాలం వేధిస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో కేటగి రీకి నష్టం వాటిల్లకుండా ఉద్యోగ విరమణ చివరి సంవత్సరంలో కార్మికులకు శ్రమకు గుర్తింపుగా కనీ సం యాక్టింగ్ పనులు ఇచ్చి ఆదుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. గుర్తింపు సంఘం చొరవ అవసరం ఉద్యోగ విరమణ పొందే.. పొందుతున్న కార్మికులకు అండగా నిలవాల్సిన గురుతర బాధ్యత గుర్తింపు కార్మిక సంఘంపైనే అధికంగా ఉందని కార్మికులు అంటున్నారు. ఇది కార్పొరేట్ స్థాయిలో చేయాల్సిన నిర్ణయం కావడంతో గుర్తింపు కార్మిక సంఘం తలచుకుంటే సాధ్యమేనని అంటున్నారు. కొందరు సింగరేణి అధికారులు సైతం ‘నిజమే ఈ ప్రతిపాదనతో కార్మికులకు ఎంతో మేలు జరుగుంది.. ప్రయోజనం కూడా ఉంటుంది.. అయితే ఈ పని రికగ్నైజ్డ్ యూనియన్ మాత్రమే చేయగలుగుతుంది’ అని ఓ ఉన్నతాధికారి పేర్కొనడం గమనార్హం. ఎందుకంటే ఆరోగ్య సమస్య లు, ఇతర కారణాల రీత్యా కార్మికులకు యాక్టింగ్ విధులు ఇచ్చే అధికారం గని అధికారులకు లేదు. ఒక వేళ ఇచ్చినా నెల రోజులకు మించదు. యాజమాన్యం నిర్ణయిస్తేనే సాధ్యమవుతుంది. ఇందుకోసం కార్మికుల శ్రేయస్సు కోరే గుర్తింపు కార్మిక సంఘం నడుంబిగించి ప్రతిపాదనను కంపెనీ వద్దకు తీసుకెళ్లి ఒప్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జేబీసీసీఐలో చర్చించాలి ఉద్యోగ విరమణకు దగ్గరలో ఉన్న కార్మికుల కు వేతనాలు నష్టపోకుండా లైట్‌జాబ్ ఇవ్వా లి. దశాబ్దాలుగా వారు చేసిన హార్డ్‌వర్క్‌ను గుర్తించాల్సిన అవసరం ఉంది. కొన్ని సందర్భాల్లో మెడికల్ అన్‌ఫిట్ అయినవారికి కూడా సూటబుల్ జాబ్ ఇవ్వటం లేదు. సీనియర్ కార్మికులకు లైట్‌జాబ్ లేదా యాక్టింగ్ ఇచ్చే విషయమై జేబీసీసీఐలో చర్చించాలి. జాతీయ సంఘా లు కూడా ఈ విషయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. - కెంగెర్ల మల్లయ్య, టీబీజీకేఎస్ అధ్యక్షుడు అన్యాయం జరుగుతోంది రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్న సీనియర్ కార్మికులకు బేసిక్ తగ్గకుండా సూటబుల్ జాబ్ ఇవ్వా లి. పని చేయలేని పరిస్థితిలో ఉన్న వారిని అన్‌ఫిట్ చేయాలి. రెండు సంవత్సరాలు లేదు కదా అని కంపెనీ అన్‌ఫిట్ చేయట్లేదు. ఏళ్ల తరబడి సంస్థకు సేవలందించిన కార్మికులకు అన్యాయం జరుగుతోంది. వారి తరఫున హెచ్ఎంఎస్ పోరాటం సాగిస్తుంది. - రియాజ్‌అహ్మద్, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి చేసిన సర్వీస్‌ను గుర్తించాలి ఉద్యోగ విరమణ పొందనున్న కార్మికులకు కొంతకాలం పాటు యాక్టింగ్ ఇస్తే మంచిది. గుర్తింపు కార్మిక సంఘం దీన్ని సాధించేం దు కు కృషి చేయాలి. రిటైర్ అవుతున్న వారు సంతోషంగా దిగిపోతే బాగుంటుంది. కార్మికు ల బాగోగుల కోసం ఏఐటీయూసీ ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటుంది. - వాసిరెడ్డి సీతారామయ్య, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి -
మళ్లీ చీకటి రోజులు
రాష్ట్రంలో పరిశ్రమలకు మళ్లీ విద్యుత్ కోతలు ప్రారంభమయ్యాయి. కరెంటు కోతలు ఎత్తివేస్తున్నట్టు ప్రకటించి పట్టుమని నెల రోజులు కాకముందే మళ్లీ విద్యుత్ కటకటలు మొదలయ్యాయి. సోమవారం నుంచే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అధిక విద్యుత్ వినియోగవేళల్లో (పీక్ అవర్స్) పరిశ్రమలకు కోతలు అమలు చేయడం ప్రారంభించారు. ఈ సమయంలో కేవలం లైటింగ్ లోడుకు (లైట్లు వెలిగించడానికి) మాత్రమే అనుమతించారు. ఈ విద్యుత్ కోతలు ఎప్పటివరకు కొనసాగుతాయనేది చెప్పలేమని ఇంధనశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు ఇప్పటికే గృహ అవసరాలకు విద్యుత్ కోతలు అమలవుతున్న సంగతి తెలిసిందే. గ్రేటర్ హైదరాబాద్‌లో రోజుకు 3 గంటల చొప్పున విద్యుత్ కోతలు విధిస్తున్నారు. జిల్లా కేంద్రాల్లో 5 గంటలు, మండల కేంద్రాలు, మునిసిపాలిటీల్లో 7 గంటలు, గ్రామాల్లో ఏకంగా 12 గంటల చొప్పున విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. వ్యవసాయానికీ రోజుకు 2-3 గంటలకు మించి విద్యుత్ సరఫరా కావడం లేదు. బొగ్గు ఎఫెక్ట్... ఇటీవల కురిసిన భారీవర్షాల దెబ్బకు ఒడిశాలోని తాల్చేరు గనిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. దీంతో రాష్ట్రంలోని ఎన్టీపీసీ రామగుండం, సింహాద్రి యూనిట్లకు బొగ్గు సరఫరాకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఫలితంగా ఎన్టీపీసీ యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోయింది. విశాఖ సమీపంలోని ఎన్టీపీసీ సింహాద్రిలో మొదటి యూనిట్లో బొగ్గు లేక విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. రెండో యూనిట్లో సాంకేతిక సమస్యల వల్ల ఉత్పత్తి జరగడం లేదు. మూడు, నాలుగు యూనిట్లలో కూడా బొగ్గు ఇబ్బందులతో పూర్తిస్థాయిలో ఉత్పత్తి జరగడం లేదు. ఎన్టీపీసీకి చెందిన రామగుండంలోని యూనిట్లలోనూ ఇదే పరిస్థితి. మొత్తం మీద సుమారు 1,200 మెగావాట్ల విద్యుత్ తగ్గిపోయింది. మరోవైపు శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని పూర్తిస్థాయిలో చేయడం లేదు. రానున్న రోజులకు నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేవలం కొద్ది సమయం మాత్రమే విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నామని జెన్కో వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఎన్టీపీసీ యూనిట్లకు సింగరేణి నుంచి బొగ్గు సరఫరాకు చర్యలు తీసుకోవడం ద్వారా విద్యుత్ కోతలను తగ్గించే అవకాశమున్నా ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి. కోతలతో వరుస మూతలు... పరిశ్రమలకు విద్యుత్ కోతల వల్ల రాష్ట్రంలో పరిశ్రమల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 2011 అక్టోబరులో మొదలైన విద్యుత్ కోతలు మొన్నటి జూలై వరకూ కొనసాగాయి. దాని ఫలితంగా చాలా పరిశ్రమలు మూతపడ్డాయి. గత ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కాసింత ఊపిరిపీల్చుకున్న పరిశ్రమలకు మళ్లీ విద్యుత్ కోతలు ప్రారంభమవటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల వల్ల వేలాది పరిశ్రమలు మూతపడుతున్నాయని స్వయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నివేదిక తేటతెల్లం చేసింది. 2013 ఏప్రిల్ 1 నుంచి 2013 జూన్ 30 వరకు ముగిసిన మొదటి త్రైమాసికంలో రాష్ట్రవ్యాప్తంగా 6,499 పరిశ్రమలు మూతపడ్డాయి. 2013 మార్చి 31 నాటికి రాష్ట్రంలో మూతపడిన పరిశ్రమల సంఖ్య 12,982 ఉండగా.. కేవలం మూడు నెలల కాలంలో అంటే 30 జూన్ 2013 నాటికి ఈ సంఖ్య 19,481కు చేరుకుంది. అంటే రోజుకు 72 యూనిట్ల చొప్పున మూతపడుతున్నాయన్నమాట. అదేవిధంగా ఈ పరిశ్రమలకు వివిధ బ్యాంకులు ఇచ్చిన రుణాలు రూ. 833 కోట్ల నుంచి రూ. 1,256 కోట్లకు పెరిగింది. అంటే రూ. 423 కోట్ల మేర రుణాలు నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ)గా మిగిలిపోయాయన్నమాట.