వారసత్వ ఉద్యోగాల సాధనకు సంతకాల సేకరణ
శ్రీరాంపూర్ : వారసత్వ ఉద్యోగాల సాధన కోసం ఏఐటీయూసీ సంతకాల సేకరణ చేపట్టింది. ఆయూనియన్ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ డివిజన్‌లోని అన్ని గనులపై ఈ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన బ్రాంచీ కమిటీల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో బ్రాంచీ సెక్రెటరీలు ల్యేగల శ్రీనివాస్, కొట్టె కిషన్‌రావు, ఎస్‌కే బాజీసైదాలు పాల్గొని మాట్లాడారు. ఈ నెల 13 వరకు సంతకాల సేకరణ చేసి ఆదే రోజు గని మేనేజర్లకు మెమోరాండం అందించనున్నట్లు తెలిపారు.
27న గనులపై ధర్నాలు నిర్వహిస్త్తున్నట్లు తెలిపారు. తాము గెలిస్తే వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని టీఆర్‌ఎస్, టీబీజీకేఎస్ ఎన్నికల్లో కార్మికులకు హామీలిచ్చి తీరా ఇప్పుడు మోసం చేశాయన్నారు. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొత్తగా 5 భూగర్భ గనుల్లో అవుట్ సోర్సింగ్ ప్రవేశపెడుతున్నారని దీన్ని నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సారి బొగ్గు ఉత్పత్తి సాధించినందుకు గాను ప్రతి కార్మికుడికి గోల్డ్ కాయిన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వేరువేరుగా ఆయా గనులపై జరిగిన నిరసన కార్యక్రమాల్లో ఆయూనియన్ బ్రాంచీ నాయకులు కాంపెల్లి నర్సయ్య, భీంరాజు, కృష్ణమూర్తి, సంఘం సదానందం, వేణుమాదవ్, బొంగోని శంకర్, మేక శ్రీను, వీరమల్లు, రాజేందర్, కోడి వెంకటేశం, పెద్దన్నలు పాల్గొన్నారు.