కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా మంథని డివిజన్లోని 20 అటవీ ప్రాంతాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 7.7 సెంటీమీటర్ల వర్షపాతం ఉండగా, జిల్లాలోని ధర్మపురిలో 21.8 సెం.మీ, సారంగాపూర్లో 21.3 సెం.మీ, మల్యాలలో 19.4 సెం.మీ, జగిత్యాల 16 సెం.మీ, రాయ్కల్ లలో 17 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఎడతెరపి లేకుండా ఓపెన్ కాస్ట్ నిల్వల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.