
సాక్షి, హైదరాబాద్: దక్షిణ భారతదేశంలోనే సింగరేణి ఏకైక బొగ్గు ఉత్పత్తి సంస్థగా ఉందని సింగరేణి జీఎం (కో–ఆర్డినేషన్, సీపీఆర్‌ఓ, స్ట్రాటజిక్ ప్లానింగ్) ఆంథోనిరాజా అన్నారు. వివిధ జిల్లాల్లో గ్రూప్–1 ట్రైనీలుగా శిక్షణ పొందుతున్న వారికి శుక్రవారం సింగరేణి భవన్‌లో సంస్థపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సింగరేణి బొగ్గు ఉత్పత్తి విధానాన్ని, బొగ్గు ద్వారా వివిధ రాష్ట్రాల థర్మల్ విద్యుత్ అవసరాలను తీరుస్తున్న విధానాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
సింగరేణి పరిసర ప్రాంతాల ప్రజల కోసం సంస్థ చేస్తున్న సామాజిక, సేవా కార్యక్రమాలపై వారికి అవగా హన కల్పించారు. కార్యక్రమంలో డీజీఎం వెంకటేశ్వర్లు, డీజీఎం(ఎఫ్‌ఏ)రాజేశ్వర్‌రావు, డిప్యూటీ మేనేజర్ దుండే వెంకటేశం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment