సాక్షి, హైదరాబాద్: బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి సంస్థ సత్తా చాటింది. మే నెల బొగ్గు ఉత్పత్తి వివరాలను శుక్రవారం సింగరేణి యాజమాన్యం వెల్లడించింది. మే నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికీ బొగ్గు ఉత్పత్తిలో ముందు నిలిచిందని సంస్థ సీఎండీ శ్రీధర్ పేర్కొన్నారు. బొగ్గు రవాణాలో 11.6 శాతం, ఓబీ తొలగింపులో 20 శాతం వృద్ధితో 51 లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించామన్నారు.
గతేడాది మే నెలలో 52.4 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేయగా, ఈ ఏడాది 58.4 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి 11.61 శాతం వృద్ధి నమోదు చేశామని తెలిపారు. గతేడాది 31.29 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించిన సంస్థ ఈ ఏడాది 37.63 మిలియన్ క్యూబిక్‌లను తొలగించి రికార్డు స్థాయిలో 20.3 శాతం వృద్ధిని నమోదు చేసిందన్నారు. గతేడాది 50 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తే ఈ ఏడాది 51 లక్షల టన్నులు చేసినట్లు శ్రీధర్ వెల్లడించారు. బొగ్గుతో పాటు విద్యుదుత్పత్తిలోను సంస్థ ముందుంది.
Comments
Please login to add a commentAdd a comment