కోల్‌బెల్ట్ కుతకుత | the production of the officers | Sakshi
Sakshi News home page

కోల్‌బెల్ట్ కుతకుత

Published Sat, Feb 28 2015 12:51 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM

the production of the officers

ఉత్పత్తి కోసం అధికారుల ఉరుకులాట
మరో పక్క కాంట్రాక్ట్ కార్మికుల నిరవధిక సమ్మె
కొనసాగుతున్న వీఆర్‌ఎస్ డిపెండెంట్ల ఆందోళన
విద్యుత్ కోసం బొగ్గు ఉత్పత్తి పెంచాలని ప్రభుత్వ ఒత్తిడి

 
శ్రీరాంపూర్(ఆదిలాబాద్) : సింగరేణిలో ప్రస్తుత వాతవారణం వేస వి ఎండలను తలపిస్తోంది. ఎన్నడూ లేని విధంగా పరిస్థితులు చోటుచేసుకున్నారుు. ఒక వైపు వార్షిక లక్ష్యం.. మరో వైపు కార్మికుల ఆం దోళనలు.. ఒక దాని తరువాత మరొక సమస్య వచ్చి పడుతుండడంతో అధికార యంత్రాంగం ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

సింగరేణి యూజమాన్యం ఈ ఆర్థిక సంవత్సరం(2014-15) ముందుగా 55 మిలియన్ టన్నుల వార్షిక లక్ష్యాన్ని పెట్టుకుంది. జనవరి నాటికి నిర్ధేశించిన లక్ష్యానికి 4 మిలియన్ టన్నుల లోటు ఉండటంతో లక్ష్యాన్ని 52.2 మి లియన్ టన్నులకు కుదించారు. దీనిని సాధిం చాడనికి అధికారులు పడరాని పాట్లు పడుతున్నారు. అన్ని ఏరియాలు 100 శాతం ఉత్పత్తి సాధించాలని సీఎండీ శ్రీధర్ ఆదేశాలు జారీ చేయడంతో ఉరుకులు పరుగుల మీద పనులు చేరుుస్తున్నారు. మరో వైపు వేసవిలో విద్యుత్ సమస్య అధికమయ్యే పరిస్థితులు ఉండడంతో పవర్ ప్లాంట్‌లకు సరిపడా బొగ్గు సరఫరా చేయూలని ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోంది. ఈ విషయమై స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగి పవర్ ప్రాజెక్టులను సందర్శిం చి ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు సూచనలిస్తున్నారు. దీంతో నిన్న మొన్నటి వరకు కూల్‌గా ఉన్న డెరైక్టర్లు ఏరియాల వారీగా పరుగులు తీస్తున్నారు. మల్టీ డిపార్టుమెంట్ కమిటీలు వా రం రోజులపాటు గనులపై సమావేశాలు పె ట్టించి కార్మికులకు సంస్థ స్థితిగతులను వివరిం చారు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి నెల రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో అన్ని ఏరియాల అధికారులకు కార్పొరేట్ నుంచి ఎప్పటికి కప్పుడు అందుతున్న ఆదేశాలు అధికారుల్లో వేడి పుట్టిస్తున్నారుు.
 
‘కాంట్రాక్ట్’ సమ్మెతో మరింత జఠిలం

ఉత్పత్తికి కీలక సమయంలో కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెకు దిగడం మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా తయూరైంది యూజ మాన్యం పరిస్థితి. వారు హైపవర్ కమిటీ వేతనాల కోసం నిరవధికంగా సమ్మె చేస్తుండడంతో ఆ ప్రభావం ఉత్పత్తిపై పడుతోంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి యూజమాన్యం తోపాటు ముఖ్యంగా ఓపెన్‌కాస్టుల్లో ఓబీ కాం ట్రాక్టర్లు చేయని ప్రయత్నమూ లేదు. ఒక వైపు నాయకులతో చర్చలు జరుపుతూనే కార్మికుల ను అనుకూలంగా మల్చుకుని పనులు చేరుుం చడానికి తంటాలు పడుతున్నారు. పోలీసు బలగాలను మోహరించి విధులకు ఆటంకం కలుగకుండా చూస్తున్నారు. కాంట్రాక్టర్తు తమ వద్ద ఉండే వారితో ఓబీ వాహనాలు నడిపించడానికి చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి స్థానిక కాంట్రాక్ట్ కార్మికులు విఫలయత్నం చేస్తున్నారు. మరో వైపు సమ్మెకు సైతం మద్ద తు తెలుపడంతో సమ్మె దీర్ఘకాలికంగా మారే అవకాశాలు కనిపిస్తున్నారుు.
 
వీఆర్‌ఎస్ డిపెండెంట్ల దీక్షలు


ఇదిలా ఉంటే రెండు నెలలుగా వీఆర్‌ఎస్ డిపెండెంట్లు తమకు ఉద్యోగాలు కల్పించాలనే డిమాండ్‌తో ఆందోళనలు చేస్తున్నారు. జీఎం కార్యాలయాల ఎదుట టెంట్లు వేసి దీక్షలు కొనసాగిస్తున్నారు. గోదావరిఖనిలో దీక్ష శిబిరాన్ని యాజమాన్యం పోలీసులతో కూల్చి వేయడంతో ఒక్క సారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది. భూపాలపల్లిలో వీఆర్‌ఎస్ డిపెం డెంట్లు చేసిన రాస్తారోకో ఉద్రిక్తంగా మారడంతో పోలీసు యంత్రంగా వెంటనే స్పందిం చింది. చివరికి శాంతి యుతంగా పాదయాత్ర చేస్తున్న నేతలను సైతం శ్రీరాంపూర్ వంటి ఏరియాల్లో అరెస్టు చేశారు. వీరు రోజుకో నిరసన కార్యక్రమం చేపడుతున్నారు.

గుర్తింపు సంఘంపై విమర్శల వెల్లువ

పర్మనెంట్ కార్మికులపై ఉత్పత్తి పేరుతో కొద్ది రోజులుగా పని భారం పెరిగినా గుర్తింపు సం ఘం టీబీజీకేఎస్ నేతలు పట్టించుకోవడంలేద నే విమర్శలు వెల్లువెత్తుతున్నారుు. ఇక కాంట్రా క్ట్ కార్మికుల, వీఆర్‌ఎస్ డిపెండెంట్ల సమస్యలు ఎలా తీరుస్తారని పెదవి విరుస్తున్నారు. ఆ సం ఘంలో నెలకొన్న గ్రూపుల కారణంగా యాజ మాన్యంతో తమ బాగోగులు చర్చించే దిక్కులేకుండా పోరుుందని మండిపడుతున్నారు. ప్రతి పక్ష సంఘాలు సైతం ఉనికి కాపాడుకోవడానికి పాకులాడుతున్నాయని అంటున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement