భూగర్భగనుల్లో పుంజుకున్న ఉత్పత్తి
గోదావరిఖని(కరీంనగర్) : భూగర్భగనుల్లో బొగ్గు ఉత్పత్తి పుంజు కుంటోంది. పెరిగిన యంత్రాల వినియోగం, కార్మికులకు కంపెనీ ప్రకటించిన ప్రోత్సాహకా లు ఇందుకు దోహదం చేస్తున్నారుు. సంస్థ పరిధిలో మొత్తం 31 భూగర్భ గనులుండగా గతంలో కొన్ని మాత్రమే నూరుశాతం ఉత్పత్తి సాధించేవి. డిసెంబర్ నెలలో 12 గనుల్లో వంద శాతానికి పైగా బొగ్గు ఉత్పత్తి జరిగింది. నవంబర్‌తో పోల్చితే లక్ష్యానికి మించి బొగ్గు వెలికితీశారు. బెల్లంపల్లి రీజియన్ శ్రీరాంపూర్ ఏరియూ పరిధిలోని భూగర్భ గనులన్నీ ఉత్పత్తి లో పరుగులు తీస్తున్నాయి. జనవరిలో మిగతా గనుల్లో సైతం ఉత్పత్తి పెంచడానికి యాజమా న్యం అవసరమైన చర్యలు చేపట్టింది.
పెరిగిన యంత్ర వినియోగం
నష్టాలను తగ్గించి, లాభాలను పెంచుకోడానికి యూజమాన్యం కేవలం యాంత్రీకరణపై ఆధారపడి బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. కంపెనీ వ్యాప్తం గా 21 భూగర్భ గనుల్లో 155 ఎస్‌డీఎల్, మరో 10 భూగర్భ గనుల్లో 31 ఎల్‌హెచ్‌డీ యంత్రా లు కలిసి రోజుకు 20వేల టన్నుల పైబడి బొగ్గు ఉత్పత్తి చేస్తున్నాయి.
వార్షిక లక్ష్యాల సాధనకు ఇన్సెంటివ్
వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించడానికి యూజమాన్యం మార్చికి నాలుగు నెలల ముందు నుంచి ఇన్సెంటివ్స్ ప్రకటిస్తోంది. ఈ ఏడాది 60.03 మిలియన్ టన్నుల లక్ష్యం చేరుకోవడానికి గాను గత ఏడాది ప్రకటించిన ఇన్సెంటివ్ బోనస్ మొత్తాన్ని పెంచింది. అంతే కాకుండా ఎన్.శ్రీధర్ సీఎండీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఉత్పత్తి, కార్మిక సంక్షేమం పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అలాగే కంపెనీ విషయంలో కార్మికులకు అవగాహన కల్పించడంలో సఫలీకృతులయ్యూరు. డిసెంబ ర్ నాటికి 43 మిలియన్ టన్నుల రికార్డు స్థాయిలో ఉత్పత్తి నమోదైంది. మిగిలిన మూడు నెలల్లో భూగర్భ గనులతోపాటు ఓసీపీల నుంచి 17 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేపట్టేందుకు నవంబర్ నుంచి ప్రత్యేక ఇన్సెంటివ్‌ను ప్రకటించగా సత్ఫలితాలు ఇస్తున్నట్లు కనిపిస్తోంది. 75 శాతం పనితీరుతో ఒక రకంగా.. వంద శాతం పనితీరుతో మరొక రకంగా ఇన్సెంటివ్ పెంచడంతో కార్మికులు, ఉద్యోగులు ఉత్సాహంగా పనిచేస్తున్నారు.