Underground Mining
-
అక్రమ క్వారీలపై మైనింగ్‌శాఖ దాడులు
పలమనేరు: కుప్పం నియోజకవర్గం గుడుపల్లె మండలంలో అక్రమంగా నిర్వహిస్తున్న క్వారీలపై మైనింగ్‌శాఖ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. వారం రోజులుగా మూడు ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టిన అధికారులు బుధవారం రూ.50లక్షల విలువైన 164 గ్రానైట్ దిమ్మెలను సీజ్ చేశారు. ఒక కంప్రెషర్ వాహనాన్ని స్వాధీనం చేసుకుని గుడుపల్లె పోలీసులకు అప్పగించారు. భూగర్భగనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి ఆదేశాల మేరకు దాడులు నిర్వహిస్తున్నట్లు మైనింగ్ ఏడీ వేణుగోపాల్ తెలిపారు. -
ఇబ్బంది లేకుండా 'ఇసుక'
సాక్షి, అమరావతి: ఇసుక కోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా కోరినంత సరఫరా చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే నెలాఖరు నుంచి ఎక్కడా ఇసుక లేదనే మాట లేకుండా అడిగినంత అందించాలని నిర్ణయించింది. రాజకీయ జోక్యానికి ఏమాత్రం తావులేకుండా అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఇసుక అందించనుంది. అనుభవం, అర్హత కలిగిన పెద్ద సంస్థలకు ఇసుక నిర్వహణ బాధ్యతలను అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. ఇసుక సరఫరా సంస్థలను పారదర్శకంగా ఎంపిక చేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మెటల్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎంఎస్టీసీ)కి అప్పగించింది. రాష్ట్రంలోని 13 జిల్లాలను మూడు విభాగాలుగా విభజించి వేర్వేరుగా బిడ్లు స్వీకరించి ఇసుక సరఫరా సంస్థలను ఎంపిక చేసేందుకు సాంకేతిక కసరత్తు పూర్తి చేసిన ఎంఎస్టీసీ టెండర్ ప్రకటన జారీ చేసింది. ఆసక్తి చూపిన సంస్థలతో సోమవారం రాత్రి ప్రీ బిడ్ సమావేశం నిర్వహించింది. ప్రీ బిడ్ సమావేశంలో వ్యక్తం చేసిన ప్రతి సందేహాన్ని నివృత్తి చేసేలా త్వరలో రాతపూర్వకంగా సమాచారం ఇస్తామని ఎంఎస్టీసీ ప్రతినిధి ‘సాక్షి’కి తెలిపారు. 4న టెక్నికల్ బిడ్ల స్వీకరణ ఫిబ్రవరి 4వతేదీ మధ్యాహ్నం మూడు గంటల్లోగా టెక్నికల్ బిడ్లు సమర్పించాలని ఎంఎస్టీసీ పేర్కొంది. ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఎంఓయూ మేరకు ఇసుక సరఫరా సంస్థల ఎంపిక కోసం రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి వేర్వేరుగా బిడ్లు ఆహ్వానిస్తూ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలను ఒక రీచ్‌గానూ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలను మరో రీచ్‌గానూ, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలను మూడో రీచ్‌గానూ టెండర్లు స్వీకరించనుంది. అర్హతలు, టర్నోవర్, అనుభవం వివరాలను టెండర్ దరఖాస్తులో పొందుపరిచారు. రూ.25 లక్షలు (జీఎస్టీ కాకుండా) చెల్లించి దరఖాస్తు ఫారాలను ఎవరైనా పొందవచ్చు. ఇందులో విధి విధానాలు, నిబంధనలు స్పష్టంగా పేర్కొన్నారు. టెక్నికల్ బిడ్లను ఎంఎస్టీసీ పరిశీలించిన అనంతరం నిర్దేశిత ప్రమాణాలు కలిగిన సంస్థలను అర్హమైనవిగా ప్రకటిస్తుంది. అర్హత సాధించిన సంస్థలు ఫైనాన్షియల్ బిడ్లకు సాంకేతిక బిడ్లలో అర్హత సాధించిన సంస్థలను ఫైనాన్షియల్ బిడ్లకు ఆహా్వనిస్తారు. మూడు జోన్లకు అధిక మొత్తానికి కోట్ చేసి (హెచ్ – 1)గా నిలిచిన సంస్థలను సక్సెస్ బిల్ బిడ్డర్లుగా నిర్ణయించి రాష్ట్ర భూగర్భ గనులశాఖ సంచాలకులకు తెలియచేస్తారు. ఆయా సంస్థలతో సంచాలకులు ఒప్పందం చేసుకోనున్నారు. నిర్ణయించిన డిపాజిట్ చెల్లించడంతోపాటు నిబంధనలన్నీ పాటించిన సంస్థలకు ఇసుక సరఫరా బాధ్యతలు అప్పగిస్తారు. ఆయా ప్రాంతాల పరిధిలో ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ప్రజలకు కోరినంత ఇసుకను ఆయా సంస్థలు రీచ్‌లు/ స్టాక్ పాయింట్లలో అందించాలి. ఈ మేరకు ఇసుకను అందుబాటులో ఉంచే బాధ్యత ఈ సంస్థలపై ఉంటుంది. నచ్చిన రీచ్‌లో తీసుకోవచ్చు.. ప్రజలు తమకు నచ్చిన రీచ్/నిల్వ కేంద్రం వద్దకు వెళ్లి నాణ్యతను స్వయంగా పరిశీలించి అక్కడికక్కడే డబ్బు చెల్లించి రసీదు తీసుకుని అద్దె/ సొంత వాహనాల్లో ఇసుక తీసుకెళ్లవచ్చు. పరిమాణంపై ఎలాంటి పరిమితులు ఉండవు. ఆన్లైన్ బుకింగ్ స్థానంలో ఆఫ్‌లైన్ విధానం ఉంటుంది. సర్వర్ మొరాయించడం, ఆన్లైన్ ఇబ్బందులు, సిఫార్సులకు తావుండదు. ఎడ్ల బండ్లలో ఉచితమే నదీ పరిసర ప్రాంతాల ప్రజలు సొంత అవసరాల కోసం ఎడ్ల బండ్లలో ఇసుకను ఉచితంగా తీసుకెళ్లే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణం, ప్రభుత్వం నిర్మించే సహాయ పునరావాస కాలనీల ఇళ్లకు కూపన్ల ద్వారా ఉచితంగా ఇసుక తీసుకెళ్లవచ్చు. ఇసుక కొరత లేకుండా ప్రభుత్వం ఇప్పటికే 500 రీచ్‌లను గుర్తించింది. వీటికి వేగంగా అన్ని రకాల అనుమతులు తెచ్చే పనిలో అధికారులున్నారు. ప్రకాశం, ధవళేశ్వరం బ్యారేజీల్లో జలవనరులు, భూగర్భ గనుల శాఖలు డ్రెడ్జింగ్ ద్వారా ఇసుకను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. బ్యాతమెట్రిక్ సర్వే ద్వారా ఇక్కడ భారీగా ఇసుక నిల్వలున్నట్లు గుర్తించారు. -
బొగ్గు గనిలో ప్రమాదం, 16 మంది మృతి
బీజింగ్: చైనాలోని భూగర్బ బొగ్గు గనిలో పనిచేస్తున్న 16 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. నైరుతి చైనాలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. కన్వేయర్ బెల్ట్ కాలిపోవడంతో పెద్ద ఎత్తున కార్బన్ మోనాక్సైడ్ విడుదలైందని, దీంతో గనిలో పనిచేస్తున్న 16 మంది ఊపిరాడక మృతి చెందారని చైనా అధికారిక వార్తా సంస్థ జింగ్వా పేర్కొంది. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదని తెలిపింది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని గిజియాంగ్ జిల్లా యంత్రాంగం సోషల్ మీడియాలో వెల్లడించింది. కాగా, ప్రమాదం జరిగిన చోఘింగ్ ఎనర్జీ సంస్థ ప్రభుత్వం అధీనంలో నడుస్తోంది. భద్రత కరువు చైనాలో బొగ్గు గనుల్లో ప్రమాదాల సాధారణమైపోయాయి. భద్రతా పరమైన నిఘా లేకపోవడం, అధికారుల వైఫల్యం కారణంగా ఎంతోమంది అమాయకులు, మైనర్లు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. గత డిసెంబర్లో జరిగిన ఓ బొగ్గుగని, గ్యాస్ పేలుడు ఘటనలో 14 మంది మైనర్లు మృతి చెందారు. 2018 డిసెంబర్లో ఇదే చోఘింగ్ ఎనర్జీ సంస్థలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు మైనర్లు మృతి చెందారు. 2018 అక్టోబర్‌లో షాన్‌డోంగ్ జిల్లాలో జరిగిన మరో బొగ్గు గని ప్రమాదంలో 21 మైనర్లు ప్రాణాలు విడిచారు. బొగ్గు పెళ్లలు విరిగిపడంతో బయటకు రాలేక 22 మంది చిక్కుకు పోగా.. ఒకరిని మాత్రమే రక్షించగలిగారు. (చదవండి: కరోనాని కట్టడి చేయకపోతే.. 20 లక్షల మంది బలి) -
అండర్‌గ్రౌండ్ గనుల్లో ఆధునిక యంత్రాలు
► ఎస్డీఎల్స్ స్థానంలో కంటిన్యూయస్ మైనర్లు? ► ఉత్పత్తి లక్ష్యాలు సాధించేందుకు ‘ఆధునికత’పై దృష్టి పెట్టిన సింగరేణి గోదావరిఖని(కరీంనగర్) : రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు అవసరాలు రోజురోజుకూ పెరుగుతున్నారు. అందుకు అనుగుణంగా ఉత్పత్తి లక్ష్యాలను పెంచుతున్న సింగరేణి యూజమాన్యం లక్ష్యాలను చేరుకోవడానికి ఆధునిక యం త్రాలను వినియోగించాలని ఆలోచిస్తోంది. అందులో భాగంగా భూగర్భగనుల్లో ప్రస్తుతం వినియోగిస్తున్న ఎస్డీఎల్ లాంటి యంత్రాల తో టార్గెట్లు చేరుకోలేమని గ్రహించిన కంపెనీ వాటి స్థానంలో కంటిన్యూయస్ మైనర్ యం త్రాలను ప్రవేశపెట్టాలని చూస్తోంది. ప్రసుతం సింగరేణి వ్యాప్తంగా ఉన్న భూగర్భగనుల ద్వారా రోజుకు 44వేల టన్నుల బొగ్గు వెలికితీయాలని లక్ష్యంగా నిర్ణయించారు. అరుుతే 32వేల టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. కంపెనీ వ్యాప్తంగా 156 ఎస్డీఎల్(సైడ్ డంపర్ లోడర్) యంత్రాలు వినియోగంలో ఉన్నాయి. వీటి ద్వారా సరాసరిగా రోజుకు 20వేల టన్నుల బొగ్గు వెలికి తీయూల్సి ఉండగా 15వేల టన్నుల వరకు వస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి జూన్ 7 వరకు ఎస్డీఎల్ యంత్రాలకు నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యం 11,37,664 టన్నులు కాగా 9,57,760 టన్నులు మాత్రమే వెలికితీశారు. యంత్రాల పనితీరు సరిగ్గా లేకపోవ డం వల్లే ఆశించిన ఉత్పత్తి రావడం లేదనేది స్పష్టమవుతోంది. తరుచూ మరమ్మతులకు రావడం, నిర్వహణ సరిగా లేకపోవడం, స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉండకపోవడం, ఆయి ల్ లీకేజీలు పెరిగిపోవడం, వైబ్రేషన్స్ అధికం కావడం ఇందకు కారణంగా తెలుస్తోంది. పనిస్థలాల్లో యంత్రం బొగ్గును తీసుకుని తిరిగి బెల్ట్‌పై పోసేందుకు వీలుగా మూల మలుపులు అనువుగా లేవు. యంత్రాన్ని నడిపించే ఆపరేట ర్ కూర్చోవడానికి సీట్ అనుకూలంగా లేక వెన్నుపూస సమస్యలు ఎక్కువై ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు ఎస్డీఎల్ యంత్రానికి ఉన్న బకెట్ ద్వారా ఒక ట్రిప్పునకు ఒకటి నుంచి ఒకటిన్నర టన్ను మాత్రమే బొగ్గు తీసే సామర్థ్యం ఉంది. ఇలాంటి సమస్యల నేపథ్యంలో ఎస్డీఎల్ యంత్రాల స్థానంలో కంటిన్యూయస్ మైనర్ యంత్రాలను ప్రవేశపెట్టాల నే ఆలోచనతో యాజమాన్యం ఉంది. మరిన్ని గనుల్లో ఏర్పాటుకు అవకాశం ఇందులో భాగంగానే ఇటీవల సింగరేణి డెరైక్టర్ మనోహర్‌రావు, ఇతర అధికారులు, గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాలకు చెందిన తొమ్మిది మంది సభ్యులతో కూడిన సింగరేణి బృందాన్ని అమెరికాలోని బొగ్గుగనుల సందర్శనకు పం పించింది. వీరు అక్కడి ఆధునిక యంత్రాలతో నడుస్తున్న పలు బొగ్గుగనులు, ప్రాజెక్టులు, కంటిన్యూయస్ మైనర్ యంత్రాలను తయారు చేసే క్యాటర్ఫిల్లర్ సంస్థను సందర్శించి యం త్రాలను పరిశీలించారు. సింగరే ణిలో ప్రస్తుతం భూగర్భగనుల్లో గ్రేడియంట్లో హెచ్చు తగ్గులు ఉన్నారుు. వాటికి అనుగుణంగా కంటిన్యూయస్ మైనర్ యంత్రాలను తయారు చేయడానికి క్యాటర్ఫిల్లర్ సంస్థ సుముఖంగా ఉన్నట్లు తెలియడంతో సింగరేణి బృందం ఆ విషయా న్ని సీఎండీ శ్రీధర్ దృష్టికి తీసుకువెళ్లింది. భూగర్భగనుల్లో కంటిన్యూయస్ మైనర్ యంత్రాల ను ప్రవేశపెట్టడానికి సీఎండీ సానుకూలత చూపినట్లు సమాచారం. ప్రస్తుతం జీడీకే-11, వీకే-7 గనుల్లో కంటిన్యూయస్ మైనర్ యం త్రాలు నడుస్తున్నాయి. ఈ ఏడాది మందమర్రి ఏరియూ పరిధి శాంతిఖని గనిలో ప్రవేశపెట్టనున్నారు. యాజమాన్యం చర్యలు తీసుకుంటే రానున్న రోజుల్లో మరిన్ని కంటిన్యూయస్ మైనర్ యంత్రాలు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి లో కీలకంగా పనిచేయనున్నాయి. -
వారసత్వం’ ప్రకటించకుంటే సమ్మె తప్పదు
► ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి ► వి.సీతారామయ్య శ్రీరాంపూర్(ఆదిలాబాద్) : వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణ ప్రకటన జూన్ 2న వెలువడకుంటే సింగరేణిలో సమ్మె తప్పదని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వి.సీతారామయ్య హెచ్చరించారు. కార్మికుల డిమాండ్లపై బుధవారం కంపెనీ వ్యాప్తంగా ఉన్న అన్ని గనులపై యూనియన్ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహిం చే మేనేజర్లకు వినతిపత్రాలు సమర్పించారు. ఏరియూలోని ఆర్కే-6 గనిపై జరిగిన కార్యక్రమంలో సీతారామయ్య మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాయకులు నేడు ప్రజాప్రతినిధులుగా పదువులు అనుభవిస్తుం డగా సకల జనుల సమ్మెతో జీతాలు పోగొట్టుకున్న కార్మికులకు ప్రభుత్వం అన్యాయం చే స్తోందన్నారు. కార్మికులు సొంతింటి పథకంపై తాము యాజమాన్యంతో ఒప్పందం చేసుకుం టే నేడు టీబీజీకే ఎస్ నాయకులు గొడవ వల్ల అమలుకు నోచుకోలేదన్నారు. భూగర్భగను ల్లో ఉత్పత్తిని ప్రైవేటు పరం చేస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ల్యేగల శ్రీనివాస్, ఎస్కే.బాజీసైదా, సదానందం, ముస్కె సమ్మ య్య, వేణుమాధవ్, బోయిన ఓదెలు, రాజేశ్వర్‌రావు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
భూగర్భ గనులకు తెర
బెల్లంపల్లి(ఆదిలాబాద్) : సింగరేణి చరిత్రలో రెండో బొగ్గుట్టగా ప్రసిద్ధిగాంచిన బెల్లంపల్లి ఏరియాలో భూగర్భ గనుల ప్రస్థానానికి తెరపడింది. బొగ్గు ఉత్పత్తి యాగంలో తొమ్మిది దశాబ్దాలు పూర్తి చేసుకోబోతున్న ఏరియాలో పూర్తిగా భూగర్భ గనులు లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అపారమైన బొగ్గు నిక్షేపాలు కలిగిన ఏరియాలో భూగర్భ గనుల ఉనికి లేకుండా పోవడంతో కార్మికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. తాండూర్ కోల్‌మైన్స్ పేరుతో.. జిల్లాలో ప్రథమంగా బెల్లంపల్లి ప్రాంతంలోనే బొగ్గు గనుల తవ్వకాలు ఆరంభమయ్యాయి. తాండూర్ కోల్‌మైన్స్ పేరుతో బొగ్గు గనుల తవ్వకాలు చేపట్టారు. బెల్లంపల్లిలో 1927లో బొగ్గు గనుల తవ్వకాలకు అంకురార్పణ జరిగింది. ‘మార్గన్స్‌ఫిట్’పేరుతో తొలి భూగర్భ గనిని ప్రారంభించి బొగ్గు ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత 44 డీప్, 24 డీప్, సౌత్క్రాస్ కట్, నం.2 ఇంక్లైన్, శాంతిఖని గనులను బెల్లంపల్లి కేంద్రంగా ప్రారంభించారు. ఆ తదుపరి తాండూర్ మండలంలో బోయపల్లి, ఎంవీకే-1, 2, 3, 5, 6 గనులను తర్వాత గోలేటి-1,1ఎ భూగర్భ గనుల విస్తరణ చేపట్టారు. సింగరేణి కాలరీలోనే అత్యధిక భూగర్భ గనులు కలిగి ఉన్న ఏరియాగా బెల్లంపల్లి అప్పట్లోప్రసిద్ధిగాంచింది. ఆయా గనుల ఏర్పాటుతో 1975 నుంచి 1995 వరకు రెండు దశాబ్దాలపాటు బెల్లంపల్లి ఏరియా సింగరేణికి మకుటాయమానంగా విలసిల్లింది. ఇక్కడ ఉత్పత్తి చేసిన బొగ్గుతో వచ్చిన లాభాల నుంచి ఇతర ప్రాంతాలలో గనుల ఏర్పాటుకు యాజమాన్యం చర్యలు చేపట్టింది. కొత్త ప్రాంతాలలో బొగ్గు గనుల విస్తరణకు బెల్లంపల్లి ఏరియా మార్గదర్శకంగా నిలిచింది. అంతటి విశిష్టత, మరెంతో ఖ్యాతి గడించిన బెల్లంపల్లి ఏరియా యాజమాన్యం తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలతో ప్రస్తుతం పతనావస్థకు చేరుకుంది. బొగ్గు నిక్షేపాలు ఉన్నా.. ఏరియాలో మూతపడిన ప్రతి భూగర్భ గనిలోనూ బొగ్గు నిక్షేపాలు ఉన్నప్పటికీ మూసివేతకే అధికారులు ఆసక్తి చూపారనే ఆరోపణలు ఉన్నాయి. గని ప్రమాదాన్ని సాకుగా చూపి సౌత్క్రాస్ కట్ గనిని, నీటి ప్రవాహం, సైడ్ పాల్స్తో బోయపల్లి గనిని, విచ్ఛలవిడిగా సమ్మెలు చేస్తున్నారనే కారణంతో ఎంవీకే-3ని, భూగర్భ గనుల భౌగోళిక పరిస్థితులు ప్రతికూలంగా మారాయనే నెపంతో మార్గన్స్‌ఫిట్, ఎంవీకే-1, 2, 5, 6, గోలేటి-1, 1ఎ గనులను ఏకపక్షంగా మూసివేశారనే ఆరోపణలు ఉన్నాయి. అనాలోచిత విధానాలతో.. ఏరియాలో ఉన్న భూగర్భ గనులు నాలుగు దశాబ్దాల నుంచి మూసివేతకు గురవుతూ వస్తున్నాయి. సింగరేణి అధికారులు కొందరు తీసుకున్న అనాలోచిత వి ధానాలు, భూగర్భ గనుల భౌగోళిక ప్రతికూల పరిస్థితులు, సాంకేతిక సమస్యలను సాకుగా చూపి ఒక్కొక్కటిగా మూసివేస్తూ వస్తున్నారు. తొలుత సౌత్క్రాస్ కట్ గని, ఆ తర్వాత బోయపల్లి, ఎంవీకే-1, 2, 3, 5, 6 గనులు మూతపడ్డాయి. అంతకుముందు నం.2 ఇంక్లైన్, 24 డీప్, 44 డీప్ ఏరియా గనులను మూసివేశారు. పదకొండేళ్ల క్రితం గోలేటీ-1 గనిని, తాజాగా ఏరియాలో ఉన్న ఏకైక భూగర్భ గని గోలేటి-1ఎ 2015-16 ఆర్థిక సంవత్సరం ముగింపు రోజైన మా ర్చి 31వ తేదీన మూసివేశారు. ఆ గనినీ మూసివేయడంతో బెల్లంపల్లి ఏరియాలో భూగర్భ గనుల ఉనికి లేకుండా పోయింది. ప్రస్తుతం కైరిగూడ, డోర్లి-1,2 ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులతో ఏరియాలో బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులపై ఉన్న మక్కువతో ఏరియాలోని భూగర్భ గనుల జీవిత కాలాన్ని అర్ధంతరంగా, అనాలోచితంగా చిదిమివేశారు. -
లక్ష్యానికి చేరువలో..
► బొగ్గు ఉత్పత్తిలో దూసుకుపోతున్న సింగరేణి ► మూడు రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగింపు ► శ్రీరాంపూర్, బెల్లంపల్లి డివిజన్లు ముందంజ ► అట్టడుగున మందమర్రి శ్రీరాంపూర్ : ఉత్పత్తిలో ఈ ఆర్థిక సంవత్సరం సింగరేణి తమ లక్ష్యానికి చేరువలో ఉంది. మూడు రోజుల్లో ముగియనున్న ఆర్థిక సంవత్సరంలో మిగతా లక్ష్యాన్ని కూడా పూర్తి చేసి వంత శాతం సాధించేలా ముందుకు కదులుతున్నారు. సింగరేణి చరిత్రలో కంపెనీ వ్యాప్తంగా వార్షిక ఉత్పత్తి లక్ష్యం 60.03 మిలియన్ టన్నులుగా నిర్దేశించారు. కాగా.. ఆదివారం నాటికి 59.59 మిలియన్ టన్నులు సాధించడం విశేషం. మరో మూడు రోజుల్లో 4 లక్షల 40 వేల టన్నుల లక్ష్యాన్ని సాధించాల్సి ఉంది. సోమవారం, మంగళవారాల ఉత్పత్తితో 100 శాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ లెక్కన రెండు రోజుల ముందే కంపెనీ వార్షిక లక్ష్యం సాధించే అవకాశాలూ లేకపోలేదు. ఇదిలా ఉంటే జిల్లాలోని బెల్లంపల్లి రీజియన్‌లోని శ్రీరాంపూర్, బె ల్లంపల్లి డివిజన్లు 100 శాతం ఉత్పత్తి లక్ష్యాలను నమోదు చేసుకుంటుండగా.. మందమర్రి మాత్రం చాలా వెనుకడి ఉంది. డివిజన్ల వారీగా.. బెల్లంపల్లి డివిజన్లో మొత్తం 3 ఓసీపీలు, ఒక భూగర్భ గని ఉంది. ఇందులో ఈ నెల 31 నాటికి నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యం 62.60 లక్షల టన్నులు ఉండగా ఈ నెల 27 నాటికి 64.12 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించి 104 శాతం లక్ష్యాన్ని నమోదు చేసుకొంది. దీంతో రీజియన్‌లోనే వార్షిక ఉత్పత్తి ముందే సాధించిన డివిజన్‌గా నిలిచింది. శ్రీరాంపూర్ డివిజన్‌ను పరిశీలిస్తే అధిక భూగర్భ గనులు ఉన్నాయి. మొత్తం 9 భూగర్భ గనులు, ఒక ఓసీపీ ఉంది. ఈ డివిజన్లో నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యం 53.95 లక్షల టన్నులు. ఇందులో 53.51 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించారు. సోమవారం, మంగళవారం ఉత్పత్తి కలిపితే 100 శాతం ఉత్పత్తి నమోదు కానుంది. దీంతో ఇది కూడా ముందస్తుగా ఉత్పత్తి సాధించే అవకాశాలు ఉన్నాయి. ఆర్కే న్యూటెక్‌లో షార్ట్‌వాల్ టె క్నాలజీ నిలిచిపోకుంటే వారం ముందే 100 శాతం ఉత్పత్తిని నమోదు చేసుకునే అవకాశం ఉండేదని అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే మందమర్రి డివిజన్ బొగ్గు ఉత్పత్తిలో అధ్వానంగా ఉంది. ఈ డివిజన్లో మొత్తం 6 భూగర్భ గనులు, ఒక ఓసీపీ ఉంది. ఏటా ఉత్పత్తి లక్ష్య సాధనలో ఈ డివిజన్ వెనుకంజలోనే ఉంటోంది. ఈ సారి కూడా అదేబాటన ఉంది. వార్షిక ఉత్పత్తి లక్ష్యం 27 లక్షల టన్నులు కాగా.. ఇప్పటికి 16.47 లక్షలు మాత్రమే సాధించింది. దీంతో 62 శాతం ఉత్పత్తిని మాత్రమే నమోదు చేసుకొంది. కంపెనీలోనే అన్ని డివిజన్ల కంటే ఉత్పత్తి లక్ష్యంలో వెనుకబడిన డివిజన్‌గా మందమర్రి నిలిచింది. -
డబుల్ ట్రబుల్
► రెండు రకాల విధులతో పనిభారం ► చిన్న పొరపాటు జరిగినా పనిష్మెంట్లు ► ఆందోళన చెందుతున్న మైనింగ్ స్టాఫ్ కాసిపేట(ఆదిలాబాద్) : సింగరేణి భూగర్భగను ల్లో హ్యండ్‌సెక్షన్ పనులు కనుమరుగయ్యూరుు. ఆయూ విధులు నిర్వర్తిం చే మైనింగ్ స్టాఫ్(సర్దార్, షార్ట్‌ఫైరర్)తో అధికారులు మిషన్ పనులు చేయిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. సింగరేణి వ్యాప్తంగా మైనింగ్ స్టాఫ్ సుమారు 2000 మంది ఉన్నారు. సర్దార్, షార్ట్ ఫైరర్ విధులు ఒక్కరికే అప్పగించడం వల్ల పనిభారం, మానసిక ఒత్తిడితో నలిగిపోతున్నామని అంటున్నారు. ఇంతచేసినా మైనింగ్ స్టాఫ్‌గా పరిగణించే తమను అటు అధికారులుగా, ఇటు కార్మికులుగా కాకుండా చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో హ్యండ్‌సెక్షన్ వద్ద 25 మంది పనిచేసే చోట సర్ధార్, షార్ట్‌ఫైరర్ విధులు నిర్వహిం చేదని, ప్రస్తుతం ఎస్‌డీయల్ యంత్రాల వద్ద పనులు చేస్తున్న వారికి అదే నియ మం వర్తింపచేస్తున్నారని తెలిపారు. రెండు మూడు యంత్రాలు నడిచే డిస్ట్రిక్‌లో సైతం ఒక్కరికే విధులు కేటారుుస్తుండడంతో అన్ని పనులు చూసుకోలేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి పోరపాటు జరిగినా బాధ్యులను చేస్తూ పనిష్మెంట్లు ఇవ్వడం వల్ల మానసిక ఒత్తిడికి తట్టుకోలేక పోతున్నామని పేర్కొంటున్నారు. గతంలో ఓటీ(ఓవర్‌టైం) కట్టించడంతో ఇబ్బంది కలి గినా గత్యంతరం లేక పనులు చేశామని, ప్రస్తుతం ఓటీ లేకుండా బలవంతంగా పనిచేయిస్తున్నారని, డీజీఏంఎస్ ఆదేశాలు పట్టించుకుకే వారే లేరని అన్నారు. సర్ధార్ పనులు పర్యవేక్షించాలి.. షార్ట్ ఫైరర్ బ్లాస్టింగ్లు చేరుుంచాలి.. రెండు పనులు ఒక్కరితోనే చేరుుంచడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సిబ్బం ది కొరత సాకుతో పనిభారం మోపడం సరికాదని, ఉత్పత్తిలో కీలకపాత్ర పోషించే తమను ఇబ్బందులకు గురిచేయడం తగదని మైనింగ్ స్టాఫ్ కోరుతున్నారు. -
భూగర్భగనుల్లో పుంజుకున్న ఉత్పత్తి
గోదావరిఖని(కరీంనగర్) : భూగర్భగనుల్లో బొగ్గు ఉత్పత్తి పుంజు కుంటోంది. పెరిగిన యంత్రాల వినియోగం, కార్మికులకు కంపెనీ ప్రకటించిన ప్రోత్సాహకా లు ఇందుకు దోహదం చేస్తున్నారుు. సంస్థ పరిధిలో మొత్తం 31 భూగర్భ గనులుండగా గతంలో కొన్ని మాత్రమే నూరుశాతం ఉత్పత్తి సాధించేవి. డిసెంబర్ నెలలో 12 గనుల్లో వంద శాతానికి పైగా బొగ్గు ఉత్పత్తి జరిగింది. నవంబర్‌తో పోల్చితే లక్ష్యానికి మించి బొగ్గు వెలికితీశారు. బెల్లంపల్లి రీజియన్ శ్రీరాంపూర్ ఏరియూ పరిధిలోని భూగర్భ గనులన్నీ ఉత్పత్తి లో పరుగులు తీస్తున్నాయి. జనవరిలో మిగతా గనుల్లో సైతం ఉత్పత్తి పెంచడానికి యాజమా న్యం అవసరమైన చర్యలు చేపట్టింది. పెరిగిన యంత్ర వినియోగం నష్టాలను తగ్గించి, లాభాలను పెంచుకోడానికి యూజమాన్యం కేవలం యాంత్రీకరణపై ఆధారపడి బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. కంపెనీ వ్యాప్తం గా 21 భూగర్భ గనుల్లో 155 ఎస్డీఎల్, మరో 10 భూగర్భ గనుల్లో 31 ఎల్‌హెచ్‌డీ యంత్రా లు కలిసి రోజుకు 20వేల టన్నుల పైబడి బొగ్గు ఉత్పత్తి చేస్తున్నాయి. వార్షిక లక్ష్యాల సాధనకు ఇన్సెంటివ్ వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించడానికి యూజమాన్యం మార్చికి నాలుగు నెలల ముందు నుంచి ఇన్సెంటివ్స్ ప్రకటిస్తోంది. ఈ ఏడాది 60.03 మిలియన్ టన్నుల లక్ష్యం చేరుకోవడానికి గాను గత ఏడాది ప్రకటించిన ఇన్సెంటివ్ బోనస్ మొత్తాన్ని పెంచింది. అంతే కాకుండా ఎన్.శ్రీధర్ సీఎండీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఉత్పత్తి, కార్మిక సంక్షేమం పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అలాగే కంపెనీ విషయంలో కార్మికులకు అవగాహన కల్పించడంలో సఫలీకృతులయ్యూరు. డిసెంబ ర్ నాటికి 43 మిలియన్ టన్నుల రికార్డు స్థాయిలో ఉత్పత్తి నమోదైంది. మిగిలిన మూడు నెలల్లో భూగర్భ గనులతోపాటు ఓసీపీల నుంచి 17 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేపట్టేందుకు నవంబర్ నుంచి ప్రత్యేక ఇన్సెంటివ్ను ప్రకటించగా సత్ఫలితాలు ఇస్తున్నట్లు కనిపిస్తోంది. 75 శాతం పనితీరుతో ఒక రకంగా.. వంద శాతం పనితీరుతో మరొక రకంగా ఇన్సెంటివ్ పెంచడంతో కార్మికులు, ఉద్యోగులు ఉత్సాహంగా పనిచేస్తున్నారు. -
మిగిలింది 27 రోజులే..
శ్రీరాంపూర్ : సింగరేణిలో ఉత్పత్తి కౌంట్ డౌన్ మొదలైంది. 2014-15 ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగియనుంది. ఈ లోగా కంపెనీ నిర్దేశించిన లక్ష్యా న్ని సాధించడం కష్టంగానే కనిపిస్తోంది. ముఖ్యంగా కార్మికులు అధికసంఖ్యలో పని చేస్తున్న ఆదిలాబాద్ జిల్లా గనులపై ఉత్పత్తి భారం ఎక్కువగా ఉంది. కా నీ.. పరిస్థితి చూస్తే అనుకున్న లక్ష్యాన్ని సాధించేలా కనిపించడం లేదు. అయినా.. యాజమాన్యం ఉత్ప త్తి కోసం అధికారుల నుంచి మొదలుకుని కార్మికుల వరకు ఉరుకులు పరుగులు పెటిస్తోంది. మొదటి మూడు త్రైమాసికాల్లో శ్రద్ధచూపని యాజమాన్యం ఇప్పుడు ఒక్కసారిగా లక్ష్య సాధనకు కార్మికులపై ఒత్తిడి తెస్తోంది. జిల్లాలో మూడు డివిజన్లు.. బెల్లంపల్లి రీజియన్ పరిధిలో బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ డివిజన్లు ఉన్నాయి. వీటి పరిధిలో 15 భూగర్భ గనులు, 4 ఓసీపీలు ఉన్నాయి. రీజియన్ వ్యాప్తంగా ఉత్పత్తిని పరిశీలిస్తే ఈ మూడు డివిజన్లు 100 శాతం ఉత్పత్తి లక్ష్యాలను సాధించడం అనుమానే అనిపిస్తోంది. ఈ మూడు ఏరియాల్లో ఒక్క శ్రీరాంపూర్ మాత్రమే 102 శాతంతో లక్ష్యాన్ని నమోదు చేసుకుంటూ ముందుకు వెళ్తుండగా.. మిగిలిన మందమర్రి, బెల్లంపల్లి చాలా వెనుకంజలో ఉన్నాయి. రీజియన్ మొత్తం మార్చి 3 నాటికి నిర్దేశించిన లక్ష్యం 123.39 లక్షల టన్నులు ఉంటే.. అందులో కేవలం 100.47 లక్షల టన్నులు మాత్రమే సాధించారు. దీంతో కేవలం 80 శాతం ఉత్పత్తి మాత్రమే సాధ్యమైంది. బెల్లంపల్లి ఏరియాలో.. బెల్లంపల్లి వార్షిక లక్ష్యం 54 లక్షల టన్నులుగా ఉంది. కానీ.. ఇప్పటికీ అందులో సాధించింది 37.85 లక్షల టన్నులు మాత్రమే సాధించారు. ఇంకా 16.15 లక్షల టన్నుల లోటు ఉంది. ఇదిలా ఉంటే రోజు వారి ఉత్పత్తి లక్ష్యం ఈ డివిజన్లో 21 వేలు ఉంది. కానీ.. ఇందులో 14 వేల టన్నులు మాత్రమే వస్తోంది. రోజుకు 6 వేల టన్నుల లోటుతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటి వరకు ఉత్పత్తి లక్ష్యం పరిశీలిస్తే(3 తేదీ నాటికి) 55.63 లక్షల టన్నులుంటే.. అందులో కేవలం 37.85 లక్షల టన్నులు మాత్రమే సాధించారు. దీంతో కేవలం 68 శాతం ఉత్పత్తి నమోదైంది. ఉన్న ఓసీపీల్లో అనుకున్నంత బొగ్గు రావడం లేదు. ఓబీ సమస్య ప్రధాన కారణంగా ఉంది. మందమర్రి డివిజన్లో.. మందమర్రి డివిజన్‌కు మార్చి 31 నాటికి నిర్దేశించిన లక్ష్యం 21.8 లక్షల టన్నులు ఉంది. కానీ.. ఈ లక్ష్యాన్ని అధిగమించే అవకాశాలే లేవు. డివిజన్ రోజువారి ఉత్పత్తి లక్ష్యం 9 వేల టన్నులు ఉంది. ఇందులో 7500 టన్నులు మాత్రమే వస్తోంది. ఎక్కుగా భూగర్భ గనులు ఉండడం, దీనికితోడు ఉత్పత్తికి దిక్కనుకున్న ఆర్కేపీ ఓసీపీలో కూడా ఆశించినంత బొగ్గు ఉత్పత్తి లేకపోవడంతో లక్ష్యానికి ఆమడ దూరంలో ఉన్నారు. ఈ నెల 3వ తేదీ నాటికి ఉన్న లక్ష్యాన్ని పరిశీలిస్తే 20.03 లక్షల టన్నులకు గాను 14.09 టన్నులు మాత్రమే సాధించి 70 శాతం లక్ష్యాన్ని సాధించింది. దీంతో మిగిలిన లక్ష్యంతోపాటు ఉన్న లోటును భర్తీ చేయడం కష్టతరమే అని అధికారులు పేర్కొంటున్నారు. శ్రీరాంపూర్ డివిజన్లో.. శ్రీరాంపూర్ డివిజన్ ఉత్పత్తి లక్ష్యంతో ముందుకు దూసుకెళ్తోంది. ఈ డివిజన్ వార్షిక ఉత్పత్తి లక్ష్యం 52.60 లక్షల టన్నులు. ఇది మార్చి 31 వరకు సాధిం చాలి. రీజియన్‌లో ఉత్పత్తి లక్ష్యం సాధించే డివిజన్ ఇది ఒక్కటేనని అర్థమవుతోంది. ఈ డివిజన్ గనుల్లో రోజువారి ఉత్పత్తి లక్ష్యం 23వేల టన్నులుంటే.. అం తే ఉత్పత్తిని సాధిస్తూ వస్తోంది. మిగిలిన 27 రోజు ల్లో కూడా ఇదే ఉత్పత్తితో ముందుకెళ్తే అనుకున్న లక్ష్యం సాధించడం ఖాయమని అధికారులు పేర్కొం టున్నారు. ఈ నెల 3 నాటికి నిర్దేశించిన లక్ష్యం 47.71 లక్షల టన్నులకు గాను 48.52 టన్నులు సాధించి 102 శాతం ఉత్పత్తిని నమోదు చేసుకుంది. ఉత్పత్తి నష్టానికి అనేక కారణాలు.. ఇదిలా ఉంటే ఉత్పత్తి రాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఓసీపీల్లో వర్షాకాలంలో కురిసిన వర్షాలతో ఉత్పత్తికి ఎక్కువగా నష్టం వాటిల్లింది. ఇటీవల జరిగిన దేశ వ్యాప్త సమ్మె కూడా కొంత కారణంగా చెప్పవచ్చు. దీనికి తోడు ప్రస్తుతం జరుగుతున్న కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె కూడా ఉత్పత్తిపై ప్రభావం చూపింది. సమ్మెతో ఓసీపీల్లో ఓబీ పనులకు ఆటకం కలిగి దాని ప్రభావం ఉత్పత్తిపై పడుతోంది. దీనికితోడు భూగర్భ గనుల్లో వర్కింగ్ ప్లేస్‌లు లేకపోవడంతో దీనికి తోడు మొదటి మూడు త్రైమాసికాల్లో కూడా ఉన్న అనిశ్చిత పరిస్థితుల్లో ఉత్పత్తి ప్రభావం చూపాయి. గాడితప్పిన పాలనతో ఉత్పత్తిపై పైస్థాయి అజమాయిషి కొరవడింది. కొత్తగా సీఅండ్ఎండీగా శ్రీధర్ వచ్చిన తరువాత నే కంపెనీ మెల్లిమెల్లిగా గాడిల పడిందని పలువురు విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనా ఉత్పత్తి లక్ష్యంలో రీజియన్ ఈ సారి వెనుకబడుతుందనే సంకేతాలే కనిపిస్తున్నాయి. -
భూగర్భ గనులపై సింగరేణి దృష్టి
కొత్తగూడెం(ఖమ్మం) : సింగరేణి సంస్థలోని భూగర్భగనుల్లో బొగ్గు ఉత్పత్తి వ్యయం రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో ఆయూ గనులు నష్టాల్లో ఉన్నాయి. కంపెనీ వ్యాప్తంగా 11 ఏరియాల్లో 34 భూ గర్భ గనులు ఉన్నాయి. వాటిలో ఎల్‌హెచ్‌డీ, ఎస్డీఎల్, కంటిన్యూయస్ మైనర్ వంటి భారీ యంత్రాల ద్వారా బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు. భూగర్భ గనుల్లో కార్మికుల వినియోగం ఎక్కువగా ఉండటం, యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగించకపోవడం ఈ పరిస్థితులకు కారణంగా యూజమాన్యం అంచనా వేసింది. భూ గర్భ గనిలో సగటున ఒక టన్నుబొగ్గు ఉత్పత్తికి రూ.4,071 ఖర్చవుతుండగా విక్రయించేది రూ.2,419లకు. దీనినిబట్టి చూస్తే టన్నుకు రూ.1,652 నష్టం వాటిల్లుతోంది. ఈ ఆర్థిక సం వత్సరంలో డిసెంబర్ వరకు భూగర్భ గనులపై రూ.1,151 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం భూగర్భ గనుల్లో ఉన్న పరిస్థితిని మార్చేందుకు సింగరేణి సీఎండీ శ్రీధర్ ప్రణాళికలు రూపొం దిస్తున్నారు. ఇప్పటికే మల్టీ డిపార్ట్మెంట్ టీం పేరు తో ఫిబ్రవరి 12 నుంచి 18వ తేదీ వరకు అన్ని ఏరియాల్లోని గనులు, డిపార్ట్మెంట్ల వద్ద కార్మికులకు అవగాహన కల్పించారు. ఉత్పత్తి, ఉత్పాదకతల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరిం చి దానిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కార్మికులకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా వివరించారు. భూగర్భ గనుల్లో ఉత్పాదక స్థాయి ప్రస్తుతం ఉన్నదానికంటే ఒక్క శాతం పెరిగినా నష్టంలో రూ.26.33 కోట్లు తగ్గించుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఓపెన్‌కాస్టు గనుల్లో నూ షావెల్స్ వినియోగం ఒక్కశాతం పెరిగినా రూ.8.5 కోట్ల నష్టం నుంచి బయటపడవచ్చు. కార్మికులు, సూపర్వైజర్లు, అధికారులు పనివిధానాన్ని మెరుగుపర్చుకుని అవసరం మేరకు కృషి చేయూలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. ఉత్పత్తిని పెంచేందుకు భూగర్భ గనుల్లో ఎస్డీఎల్, ఎల్‌హెచ్‌డీ యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని యోచిస్తున్నారు. భూగర్భ గని కార్మికులు, మెషనరీ షిఫ్టు కార్మికులు రోజుకు కనీసం ఆరు గంటలు పనికి వినియోగించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. కార్మికులు గైర్హాజరు శాతాన్ని తగ్గించుకోవాలని, యంత్రాలను పూర్తిగా వినియోగించుకోవాలని సీఎండీ శ్రీధర్ విజ్ఞప్తి చేస్తున్నారు. ఏది ఏమైనా సింగరేణిలో భూగర్భ గనుల ద్వారా వచ్చే నష్టాన్ని పూడ్చుకునే చర్యలకు యాజమాన్యం పూనుకుంది. -
కార్మిక శ్రేయస్సుకే పెద్దిపీట
పోలాండ్ దేశంలోని 14 భూగర్భగనులు, 4 ఓపెన్‌కాస్ట్‌లు పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే 135 సంవత్సరాలుగా నడుస్తున్నాయి. భూగర్భ గనుల్లో ఏటవాలుతనం ఎక్కువ గా ఉన్నప్పటికీ కంటిన్యూయస్ మైనర్, లాంగ్ వాల్ విధానాల ద్వారా బొగ్గు ఉత్పత్తి చేస్తున్నా రు. సింగరేణిలో సరాసరి 325 మీటర్ల లోతు లో బొగ్గు ఉత్పత్తి చేస్తుంటే.. ఇక్కడ 940 మీటర్ల లోతులోని బొగ్గును వెలికితీస్తున్నారు. అంతలోతున కూడా ఏసీలను బిగించి పనిచేసే ఉద్యోగులకు గాలి సక్రమంగా అందిస్తున్నారు. సింగరేణిలో ఒక ఓసీపీలో ఏటా తీసే బొగ్గును అక్కడ ఒక భూగర్భ గని ద్వారా తీస్తున్నారు. భూగర్భ గనిలో పనిప్రదేశానికి వెళ్లడానికి వీలు గా ప్రత్యేకమైన కార్లున్నాయి. పనిస్థలంలో బొగ్గు దుమ్ము పడితే ఎత్తడానికి మూడు షిఫ్టు లు ఉద్యోగులు పనిచేస్తారు. ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులలో ఎక్కడా డంపర్లు కనిపించవు. ఇన్ఫిట్ క్రషర్ల ద్వారా బొగ్గు ఉత్పత్తి జరిగిన వెంటనే బెల్ట్ ద్వారా ఉపరితలానికి పంపిస్తారు. ఇక్కడి గనుల్లో సింగరేణితో పోల్చితే మా నవ వనరుల సంఖ్య తక్కువ. పోలాం డ్లో అధికారులు, ఉద్యోగులందరు ఒకే దుస్తులు ధరించాలి. ఇంటి వద్ద నుంచి ఏసీ బస్సులలో గనుల వద్దకు తీసుకెళ్తారు. వేతనాలు ఎక్కువగానే ఉన్నప్పటికీ సంక్షేమం విషయంలో ఉద్యోగులకు క్వార్టర్లు, ఆసత్రి సౌకర్యం ఉండదు. ఉద్యోగులే ప్రైవేటుగా ఇళ్లలో ఉండి.. ఆ అద్దెబిల్లును, ఆస్పత్రికి వెళితే ఆ బిల్లును సమర్పిస్తే యా జమాన్యం ఆ బిల్లులను వేతనంలో కలిపి ఇస్తుంది. ఉద్యోగులపై ఇక్కడ ఇన్సూరెన్స్ చేస్తారు. వారు ఒక వేళ మరణించినా.. గాయపడ్డా ఆ మేరకు ఇన్సూరెన్స్‌ను వర్తింపజేస్తారు. ఇక్కడ ఏ వృత్తి పనివారితో ఆ పనులే చేయిస్తారు. ఒకవేళ ఉద్యోగ విరమణ చేస్తే ఆ రోజు వరకు కూడా వేతనం జమచేసి మూడు రోజు ల్లోగా పూర్తి డబ్బులు చెల్లిస్తారు. గనులపై ప్రత్యేకంగా క్యాంటీన్లలో తినుబండారాల సౌకర్యం ఉండదు. కేవలం కూల్‌డ్రింక్స్ తప్ప వేటిని అందుబాటులో పెట్టరు. భూగర్భ గనిలో ఉద్యోగులు తెచ్చుకున్న భోజనాన్ని భుజించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. దక్షిణాఫ్రికాలో కూడా అపారమైన బొగ్గు నిల్వలుండగా.. భారతదేశంలో కోల్ఇండియా, సింగరేణిలో చేస్తున్నట్టుగానే బొగ్గు గనులు, ఓసీపీల ద్వారా బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు. మోజాంబిక్‌లో పరిస్థితులు దారుణం.. మోజాంబిక్‌లో బొగ్గు నిల్వలున్నప్పటికీ ఇక్కడి పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఇది చిన్నదేశమైనా మొత్తం ప్రైవేటు కంపెనీల ఆధ్వర్యంలోనే బొగ్గు ఉత్పత్తి జరుగుతుంటుంది. ఇక్కడ విద్యుత్ ప్లాంట్లు అసలే లేవు. ప్రస్తుతం చైనా దేశానికి చెందిన కంపెనీల ఆధ్వర్యంలో 64 శాతం బొగ్గు ఉత్పత్తి చేస్తుంటే.. భారతదేశానికి చెందిన కంపెనీల ఆధ్వర్యంలో 9 శాతం బొగ్గు ఉత్పత్తి జరుగుతున్నది. ఓపెన్‌కాస్ట్‌లలో 35 మీటర్ల లోతులోనే నాణ్యమైన బొగ్గు అందుబాటులోకి వస్తుండడంతో ఈ దేశంపై వివిధ దేశాలు కన్నేశాయి. భారతదేశానికి చెందిన జిందాల్ కంపెనీ ఒక ఓసీపీని నిర్వహిస్తుండగా.. వారే 400 కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గం ద్వారా ట్రక్కులలో బొగ్గును రవాణా చేసి, అక్కడి నుంచి మరో 300 కిలోమీటర్ల దూరం వరకు ట్రాక్‌లైన్ నిర్మాణం చేసుకుని బొగ్గును తమ సొంత విద్యుత్ ప్లాంట్‌కు రవాణా చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ దేశంలో 80 శాతం మేర విద్యుత్ ఉండని ప్రాంతాలున్నాయి. ప్రైవేటు కంపెనీ కావడంతో డంపర్లు నిలిచిపోయేందుకు అక్కడి యాజమాన్యం అంగీకరించదు. నిరంతరం వాటిని నడుపుతూనే ఉండాలి. ఒక ఇక్కడి ఓసీపీలో ఒక్క భారతీయుడిని ఉద్యోగంలోకి తీసుకుంటే మోజాంబిక్ దేశస్తులను మరో 10 మందిని ఉద్యోగాల్లోకి తప్పకుండా తీసుకోవాలి. ఇలాంటి కారణాల వల్ల ఇక్కడ బొగ్గు ఉత్పత్తి తీయడానికి వ్యయం ఎక్కువగా అవుతున్నది. అయితే ఎవరైనా బొగ్గు గనులను, ఓసీపీలను ప్రారంభించడానికి కంపెనీలకు అవసరమైన పర్యావరణ అనుమతులు మాత్రం వేగవంతంగా ఇస్తారు. ప్రస్తుతం మోజాంబిక్‌లో కోల్ఇండియా, ఆఫ్రికా సంయుక్తంగా ప్రాజెక్టును తీసుకోగా...బొగ్గు ఉత్పత్తి ఇంకా వెలికితీయలేదు. -
భూ సేకరణ వేగవంతం
కాసిపేట : కాసిపేట మండలంలోని పల్లంగూడ, కనికలాపూర్ గ్రామాల మధ్య చేపట్టనున్న కాసిపేట 2 ఇంక్లైన్ నూతన గని నిర్మాణానికి సంబంధించి భూసేకరణను రెవెన్యూ, సింగరేణి అధికారులు వేగవంతం చేశారు. నిర్వాసిత రైతులకు ఎలాగోలా నచ్చజెప్పి ఒప్పించడంలో అధికారులు సఫలమయ్యారు. గనికి 82 ఎకరా లు అవసరం కాగా.. 49 మంది రైతులకు చెందిన భూమి తీసుకోనున్నారు. నూతన భూే సకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని రైతులు పట్టుపట్టిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు దిగి వచ్చి నూతన భూసేకరణ చట్టం ప్రకారం చెల్లిస్తామని హా మీ ఇచ్చారు. అయితే నూతన చట్టం మార్గదర్శకాలు వెల్లడి కానందున రైతులు వెల్లడి అయిన తరువాత భూమి ఇస్తామని దాటవేస్తూ వచ్చారు. నూతన భూగ ర్భ గనులకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో అధికారులు పనులు వేగవంతం చేశారు. మంచిర్యాలలో చర్చలు ఇందులో భాగంగా మూడు రోజుల క్రితం నిర్వాసిత రైతులను మంచిర్యాల ఆర్డీవో కార్యాలయానికి పిలిచి ఆర్డీవో, సింగరేణి అధికారులు చర్చలు నిర్వహించా రు. నూతన చట్టం ప్రకారం పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, స్థానికులకు కాంట్రాక్టు ఉద్యోగాలు తదితర డిమాండ్లు నిర్వాసితులు అధికారుల ముందు పెట్టారు. దీనిపై అధికారులు ప్రస్తుతం ఉద్యోగాలు ఇవ్వడం తమ పరిధిలో లేదని సీఅండ్ఎండీతో మా ట్లాడి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగాలు స్థానికులకు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్ర స్తుతం నిర్ణయించిన ధర కాకుండా కొత్త చట్టం అమ లు ప్రకారం భూములకు పరిహారం చెల్లించనున్నట్లు తెలిపారు. అప్పటి వరకు పాత ధర కంటే అధికంగా రూ.3.69 లక్షలు చెల్లించనున్నట్లు ఆర్డీవో తెలిపారు. ప్రస్తుతం రూ.4 లక్షలు చెల్లించాలని, మిగతా సొమ్ము నూతన చట్టం ప్రకారం చెల్లించాలని కోరగా... ఉన్నతాధికారులతో మాట్లాడి సానుకూల నిర్ణయం తీసుకుంటామని తెలుపడంతో నిర్వాసితులు అంగీకరిం చారు. గ్రామాల అభివృద్ధితో పాటు సమస్యల పరిష్కారానికి యాజమాన్యంతో ఒ ప్పందం కుదిరితే అభ్యంతరం లేదని చెప్పారు. దీం తో అభివృద్ధిపై యాజమాన్యం హామీ ఇచ్చి రైతుల ద్వారా అగ్రిమెంటు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. అక్టోబర్ నాటికి ప్రారంభించాలని... అన్ని అడ్డంకులు తొలగించుకొని ఈ సంవత్సరం అక్టోబర్ వరకు నూతన గని పనులు ప్రారంభించనున్నారు. సింగరేణి వ్యాప్తంగా ఆరు నూతన గనులు ఏర్పాటు కానుండగా కాసిపేట 2 ఇంక్లైన్ గని మొదటగా ఉత్పత్తి సాధించనుంది. కాసిపేట గని ద్వారా కాసిపేట, ముత్యంపల్లి గ్రామాలు నష్టపోయిన కారణంతో ఓపెన్‌కాస్టు, గనులకు స్థానికులు అడ్డంకులు సృష్టించినా నూతన గని విషయంలో అడ్డంకులు తీరడంతో అధికారులు ఆనందంలో నిర్మాణానికి ముందుకు వస్తున్నారు. -
ఆదరించాం.. ఆదుకోండి..!
మంచిర్యాల సిటీ, న్యూస్‌లైన్ : సింగరేణి సమస్యల పుట్టగా మారింది. కార్మికులు కష్టాల కొలిమిలో సతమతం అవుతున్నారు. తమ బాధలు తీర్చి.. సమస్యలు పరిష్కరించే వారి కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటుతో కొత్త ప్రజాప్రతినిధులను ఎన్నుకున్నారు. తమ సమస్యలు తీరుస్తారని ఆశిస్తున్నారు. సింగరేణి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. వీటి పరిధిలో భూగర్భ గనులు, 15 ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులు ఉన్నాయి. దాదాపు 64 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. కోల్‌బెల్ట్‌లో 11 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి, చెన్నూర్, ఆసిఫాబాద్, మంచిర్యాల.. కరీంనగర్ జిల్లాలోని మంథని, రామగుండం.. వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి.. ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం అసెంబ్లీ స్థానాలను.. అదేవిధంగా ఐదు పార్లమెంటు స్థానాలకు ఆదిలాబాద్, వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి పార్లమెంటు స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను సింగరేణి కార్మికులు గెలిపించారు. మెజార్టీ ప్రజాప్రతినిధులతోపాటు గుర్తింపు సంఘం కూడా టీఆర్ఎస్కు అనుబంధం కావడంతో కార్మికులు వీరిపై ఆశలు పెట్టుకున్నారు. కార్మికుల సమస్యలు తీర్చడంతోపాటు సింగరేణి సంస్థ అభివృద్ధిపై కూడా కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఆశలతో ఎదురు చూస్తున్నారు. గుర్తింపు సంఘం సింగరేణి కార్మిక గుర్తింపు సంఘంగా టీఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజీకెఎస్ 2012 జూన్‌లో గెలిచింది. గెలిచిన కొద్ది రోజులకే సంఘంలో గ్రూపు తగాదాలు తలెత్తి కార్మికుల సమస్యలు పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. సంఘం అంతర్గత కలహాలను ఆసరా చేసుకుని యాజమాన్యం కార్మికులను వేధింపులకు గురిచేస్తోందని సంఘం కార్యకర్తలే ఆరోపిస్తున్నారు. సంఘం ఆధిపత్య పోరు కాస్త కోర్టు వరకు వెళ్లి అంతర్గత ఎన్నికల్లో బలాబలాలు చూసుకోవాల్సిన పరిస్థితి మొట్ట మొదటిసారిగా సింగరేణి చరిత్రలో తెచ్చి నమ్మిన కార్మికులకు తలవంపులు తెచ్చిపెట్టారు. ఈ సమస్యను పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు చొరవ తీసుకొని అంతర్గత గొడవను పరిష్కరించినచో అధికారుల నుంచి వేధింపులు తగ్గుతాయని కార్మికులు ఆశపడుతున్నారు. స్ట్రక్చర్ సమావేశం అధికారులకు, కార్మికులకు మధ్య ఆరోగ్యకరమైన వాతావరణం ఉండటానికి ఈ సమావేశం ఎక్కువగా ఉపయోగపడుతుంది. సింగరేణి ఉన్నతాధికారులతో గుర్తింపు సంఘం దశలవారీగా సమావేశం నిర్వహించి గని, ఏరియా, సింగరేణిస్థాయి సమస్యలు పరిష్కరించాలి. చివరి సమావేశం తేదీ 05-03-2013న జరిగింది. అప్పటినుంచి సమావేశం లేదు. దీంతో కార్మికుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంలా తయారైంది. గడిచిన 14 నెలల నుంచి యాజమాన్యంతో చర్చలు లేవంటే కార్మికుల పరిస్థితి ఏ మేరకు ఉందో తెలిసి పోతుంది. రక్షణ వారోత్సవాలు సింగరేణి వ్యాప్తంగా గనులు, డిపార్ట్మెంటులవారీగా ఏటా యాజమాన్యం రక్షణ వారోత్సవాలు నిర్వహించాలి. ప్రతి డిసెంబర్ నుంచి జనవరి వరకు వారోత్సవాలను కార్మికుల సమక్షంలో జరిపి వారికి రక్షణ పై అవగాహన కల్పిస్తారు. దీంతో గనిలో ప్రమాదాలు అరికట్టడంతోపాటు నివారించడానికి అవగాహన ఉపయోగ పడుతుంది. ఈ ఏడాది సింగరేణిలో ఎక్కడ కూడ రక్షణ వారోత్సవాలను గుర్తింపు సంఘం గ్రూపు తగాదాల నేపథ్యంలో అధికారులు నిర్వహించలేక పోయారనే ఆరోపణలు కార్మికుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. జన్మభూమి పథకం ప్రతి గనిలో జన్మభూమి పథకం పేరిట అధికారులు కార్మికుల హోదాతో సంబంధం లేకుండా ఉపరితల పనులను అదనంగా చేయిస్త్తున్నారు. మస్టరు పడగానే వారివారి పనిలోకి వెళ్లే ముం దు ఉపరి తలం పైన ఉన్న అదనపు పనులను కార్మికులచే చేయించడాన్ని గుర్తింపు సంఘం పట్టించు కోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పథకం అమలు తీరుపై కార్మికులు సంఘంపై గుర్రుగా ఉన్నారు. గాలి సరఫరా భూగర్భ గనిలో కార్మికులకు సరిపడేంత పరిశుభ్రమైన గాలిని సరఫరా చేసే బాధ్యత ఆ గని ఉన్నతాధికారులది. మూడు బదిలీల సమయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కార్మికులకు సరిపడేంత గాలి, సరి పడేంత పర్యవే క్షణలో సరిచూసుకోవాలి. ఈ సమస్యపై కార్మికులు గగ్గోలు పెట్టినా అధికారులు, గుర్తింపు సంఘం నాయకులు పట్టించుకోవడం లేదు. పనిముట్లు బొగ్గు ఉత్పత్తికి ఉపయోగపడే వస్తువులతోపాటు కార్మికులకు ఇవ్వాల్సిన పనిముట్లు కూడా సకాలంలో ఇవ్వకుండా కార్మికులపై అధికారులు పనిభారం పెంచినా నాయకులు పట్టించుకోక పోవడంపై కార్మికులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మికులకు నాణ్యమైన బూట్లు, డ్రిల్ రాడ్, బిట్స్, ఏకరూప దుస్తులు, నూతన సాంకేతిక పరిజ్ఞానంకు సరిపడే ఎలక్ట్రికల్, ఫిట్టర్ పనిముట్లు నేటికి కార్మికులకు సకాలంలో సరఫరా కావడం లేదు. దీంతో కార్మికులపై పనిభారం పడుతోంది. విజిలెన్స్ సింగరేణిలో అవినీతిని అరికట్టడానికి ఈ విభాగాన్నియాజమాన్యం నియమించింది. అవినీతిని పక్కకు పెట్టి ఆకాశరామన్న ఉత్తరాలకే ప్రధాన్యతను ఇస్తూ అమాయక కార్మికులను వేధించడానికి మాత్రమే ఈ విభాగం పనిచేస్తున్నదనేది జగమెరిగిన సత్యం. ఇటీవల బొగ్గు కుంభకోణమే విజిలెన్స్ పని విధానానికి తార్కాణం. దీన్ని అరికట్టని నేపథ్యంలో కార్మికులు బలి కాక తప్పదు. ఆదాయపు పన్ను జాతీయ స్థాయిలో ఎయిర్ ఫోర్స్, నేవీ, రక్షణ విభాగాల్లో పనిచేసే వారికి ఆదాయపు పన్ను మినహాయింపు ఉంది. అంత కంటే ప్రమాధకర పరిస్థితుల్లో కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి కూడా ఆదాయపు పన్ను మినహాయింపు చట్టాన్ని తీసుకొస్తామని టీఆర్ఎస్ నాయకులు హామీ ఇచ్చారు. ఈ హామీకి కట్టుబడి గెలిచిన నాయకులు ఉండాలి. డిపెండెంట్ ఉద్యోగాలు సింగరేణిలో రద్దయిన డిపెండెంట్ ఉద్యోగాలను మళ్లీ పునరుద్ధరిస్తామని గుర్తింపు సంఘం ఎన్నికలతోపాటు, ఇటీవలి ఎన్నికల్లో టీఆర్ఎస్ నాయకులు కార్మికులకు హామీ ఇచ్చారు. 2002 రద్దయిన ఈ పథకం నేటికి అమలుకు నోచుకోలేదు. దీనిని అమలు చేయాల్సిన బాధ్యత గెలిచిన ప్రజాప్రతినిధులపై ఉంది. వైద్య, విద్య సింగరేణిలో ఉన్న ప్రస్తుల ఆస్పత్రులను కార్పొరేట్ స్థాయిలో అన్ని వసతులతో తీర్చిదిద్ది కార్మికులకు అందుబాటులోకి తీసుకురావల్సిన అవసరం ఉంది. మెరుగైన చికిత్స కోసం ప్రస్తుతం యాజమాన్యం హైదరాబాద్ పంపి చేతులు దులుపుకుంటుంది. అదే విధంగా కార్మికులు తమ పిల్లల నాణ్యమైన విద్య కోసం కార్పొరేటు పాఠశాలలను ఆశ్రయిస్తున్నారు. దీనిని అరికట్టడానికి సింగరేణి పాఠశాలలను ఆధునికీకరించాలి. కొత్త గనులు సింగరేణిలో ఉపరితల గనుల నిర్మాణం నిలిపివేయాలి. భూగర్భ గనుల నిర్మాణం చేపట్టి యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలి. దీంతోపాటు బొగ్గు ఆధారిత పరిశ్రమలను స్థాపించి యువతకు ఉపాధి చూపే విధంగా ఎంపీలు, ఎమ్యెల్యేలు చొరవ చూపాలి. సమ్మె వేతనం తెలంగాణ రాష్ట్రం అవతరణ కోసం కార్మికులు సకల జనుల సమ్మెలో నెల రోజులపాటు పాల్గొని ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ఈ సమ్మె వేతనాన్ని ఇప్పిస్తామని నాయకులు హామీ ఇచ్చారు. అమలు చేయాల్సిన బాధ్యత గెలిచిన నాయకుల అందరిపై ఉంది. -
భూగర్భ గనుల శాఖ ఏడీ సెస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్: భూగర్భ గనుల శాఖకు చెందిన సహాయ సంచాలకులు(ఏడీ) ఎం. సుబ్రమణ్యం సస్పెండ్ అయ్యారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే అభియోగంపై సుబ్రమణ్యంను ఏసీబీ అధికారులు అక్టోబర్ 7న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేస్తూ జ్యుడీషియల్ కస్టడీకి వెళ్లినప్పటి నుంచి ఇది వర్తిస్తుందని పేర్కొంది. ఈ మేరకు భూగర్భ గనుల శాఖ కార్యదర్శి సవ్యసాచి ఘోష్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్‌లో ఉన్నప్పటికీ అనుమతి లేనిదే విశాఖపట్నం విడిచి వెళ్లరాదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.