పోలాండ్ దేశంలోని 14 భూగర్భగనులు, 4 ఓపెన్‌కాస్ట్‌లు పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే 135 సంవత్సరాలుగా నడుస్తున్నాయి. భూగర్భ గనుల్లో ఏటవాలుతనం ఎక్కువ గా ఉన్నప్పటికీ కంటిన్యూయస్ మైనర్, లాంగ్ వాల్ విధానాల ద్వారా బొగ్గు ఉత్పత్తి చేస్తున్నా రు. సింగరేణిలో సరాసరి 325 మీటర్ల లోతు లో బొగ్గు ఉత్పత్తి చేస్తుంటే.. ఇక్కడ 940 మీటర్ల లోతులోని బొగ్గును వెలికితీస్తున్నారు.
అంతలోతున కూడా ఏసీలను బిగించి పనిచేసే ఉద్యోగులకు గాలి సక్రమంగా అందిస్తున్నారు. సింగరేణిలో ఒక ఓసీపీలో ఏటా తీసే బొగ్గును అక్కడ ఒక భూగర్భ గని ద్వారా తీస్తున్నారు. భూగర్భ గనిలో పనిప్రదేశానికి వెళ్లడానికి వీలు గా ప్రత్యేకమైన కార్లున్నాయి. పనిస్థలంలో బొగ్గు దుమ్ము పడితే ఎత్తడానికి మూడు షిఫ్టు లు ఉద్యోగులు పనిచేస్తారు.
ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులలో ఎక్కడా డంపర్లు కనిపించవు. ఇన్‌ఫిట్ క్రషర్ల ద్వారా బొగ్గు ఉత్పత్తి జరిగిన వెంటనే బెల్ట్ ద్వారా ఉపరితలానికి పంపిస్తారు. ఇక్కడి గనుల్లో సింగరేణితో పోల్చితే మా నవ వనరుల సంఖ్య తక్కువ. పోలాం డ్‌లో అధికారులు, ఉద్యోగులందరు ఒకే దుస్తులు ధరించాలి. ఇంటి వద్ద నుంచి ఏసీ బస్సులలో గనుల వద్దకు తీసుకెళ్తారు. వేతనాలు ఎక్కువగానే ఉన్నప్పటికీ సంక్షేమం విషయంలో ఉద్యోగులకు క్వార్టర్లు, ఆసత్రి సౌకర్యం ఉండదు.
ఉద్యోగులే ప్రైవేటుగా ఇళ్లలో ఉండి.. ఆ అద్దెబిల్లును, ఆస్పత్రికి వెళితే ఆ బిల్లును సమర్పిస్తే యా జమాన్యం ఆ బిల్లులను వేతనంలో కలిపి ఇస్తుంది. ఉద్యోగులపై ఇక్కడ ఇన్సూరెన్స్ చేస్తారు. వారు ఒక వేళ మరణించినా.. గాయపడ్డా ఆ మేరకు ఇన్సూరెన్స్‌ను వర్తింపజేస్తారు. ఇక్కడ ఏ వృత్తి పనివారితో ఆ పనులే చేయిస్తారు. ఒకవేళ ఉద్యోగ విరమణ చేస్తే ఆ రోజు వరకు కూడా వేతనం జమచేసి మూడు రోజు ల్లోగా పూర్తి డబ్బులు చెల్లిస్తారు.
గనులపై ప్రత్యేకంగా క్యాంటీన్లలో తినుబండారాల సౌకర్యం ఉండదు. కేవలం కూల్‌డ్రింక్స్ తప్ప వేటిని అందుబాటులో పెట్టరు. భూగర్భ గనిలో ఉద్యోగులు తెచ్చుకున్న భోజనాన్ని భుజించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. దక్షిణాఫ్రికాలో కూడా అపారమైన బొగ్గు నిల్వలుండగా.. భారతదేశంలో కోల్‌ఇండియా, సింగరేణిలో చేస్తున్నట్టుగానే బొగ్గు గనులు, ఓసీపీల ద్వారా బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు.
మోజాంబిక్‌లో పరిస్థితులు దారుణం..
మోజాంబిక్‌లో బొగ్గు నిల్వలున్నప్పటికీ ఇక్కడి పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఇది చిన్నదేశమైనా మొత్తం ప్రైవేటు కంపెనీల ఆధ్వర్యంలోనే బొగ్గు ఉత్పత్తి జరుగుతుంటుంది. ఇక్కడ విద్యుత్ ప్లాంట్లు అసలే లేవు. ప్రస్తుతం చైనా దేశానికి చెందిన కంపెనీల ఆధ్వర్యంలో 64 శాతం బొగ్గు ఉత్పత్తి చేస్తుంటే.. భారతదేశానికి చెందిన కంపెనీల ఆధ్వర్యంలో 9 శాతం బొగ్గు ఉత్పత్తి జరుగుతున్నది.
ఓపెన్‌కాస్ట్‌లలో 35 మీటర్ల లోతులోనే నాణ్యమైన బొగ్గు అందుబాటులోకి వస్తుండడంతో ఈ దేశంపై వివిధ దేశాలు కన్నేశాయి. భారతదేశానికి చెందిన జిందాల్ కంపెనీ ఒక ఓసీపీని నిర్వహిస్తుండగా.. వారే 400 కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గం ద్వారా ట్రక్కులలో బొగ్గును రవాణా చేసి, అక్కడి నుంచి మరో 300 కిలోమీటర్ల దూరం వరకు ట్రాక్‌లైన్ నిర్మాణం చేసుకుని బొగ్గును తమ సొంత విద్యుత్ ప్లాంట్‌కు రవాణా చేయాల్సిన పరిస్థితి ఉంది.
ఈ దేశంలో 80 శాతం మేర విద్యుత్ ఉండని ప్రాంతాలున్నాయి. ప్రైవేటు కంపెనీ కావడంతో డంపర్లు నిలిచిపోయేందుకు అక్కడి యాజమాన్యం అంగీకరించదు. నిరంతరం వాటిని నడుపుతూనే ఉండాలి. ఒక ఇక్కడి ఓసీపీలో ఒక్క భారతీయుడిని ఉద్యోగంలోకి తీసుకుంటే మోజాంబిక్ దేశస్తులను మరో 10 మందిని ఉద్యోగాల్లోకి తప్పకుండా తీసుకోవాలి.
ఇలాంటి కారణాల వల్ల ఇక్కడ బొగ్గు ఉత్పత్తి తీయడానికి వ్యయం ఎక్కువగా అవుతున్నది. అయితే ఎవరైనా బొగ్గు గనులను, ఓసీపీలను ప్రారంభించడానికి కంపెనీలకు అవసరమైన పర్యావరణ అనుమతులు మాత్రం వేగవంతంగా ఇస్తారు. ప్రస్తుతం మోజాంబిక్‌లో కోల్‌ఇండియా, ఆఫ్రికా సంయుక్తంగా ప్రాజెక్టును తీసుకోగా...బొగ్గు ఉత్పత్తి ఇంకా వెలికితీయలేదు.
కార్మిక శ్రేయస్సుకే పెద్దిపీట
Published Thu, Nov 6 2014 4:18 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
Advertisement
Advertisement