వారసత్వం’ ప్రకటించకుంటే సమ్మె తప్పదు
► ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి
► వి.సీతారామయ్య
శ్రీరాంపూర్(ఆదిలాబాద్) : వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణ ప్రకటన జూన్ 2న వెలువడకుంటే సింగరేణిలో సమ్మె తప్పదని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వి.సీతారామయ్య హెచ్చరించారు. కార్మికుల డిమాండ్లపై బుధవారం కంపెనీ వ్యాప్తంగా ఉన్న అన్ని గనులపై యూనియన్ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహిం చే మేనేజర్లకు వినతిపత్రాలు సమర్పించారు. ఏరియూలోని ఆర్కే-6 గనిపై జరిగిన కార్యక్రమంలో సీతారామయ్య మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాయకులు నేడు ప్రజాప్రతినిధులుగా పదువులు అనుభవిస్తుం డగా సకల జనుల సమ్మెతో జీతాలు పోగొట్టుకున్న కార్మికులకు ప్రభుత్వం అన్యాయం చే స్తోందన్నారు.
కార్మికులు సొంతింటి పథకంపై తాము యాజమాన్యంతో ఒప్పందం చేసుకుం టే నేడు టీబీజీకే ఎస్ నాయకులు గొడవ వల్ల అమలుకు నోచుకోలేదన్నారు. భూగర్భగను ల్లో ఉత్పత్తిని ప్రైవేటు పరం చేస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ల్యేగల శ్రీనివాస్, ఎస్‌కే.బాజీసైదా, సదానందం, ముస్కె సమ్మ య్య, వేణుమాధవ్, బోయిన ఓదెలు, రాజేశ్వర్‌రావు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.