
సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై విచారణ వాయిదా
హైదరాబాద్:
సింగరేణి వారసత్వ ఉద్యోగాలకు సంబంధించి హైకోర్టులో నిరుద్యోగులు వేసిన పిల్ గురువారం విచారణకు వచ్చింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వం ఏ ప్రాతిపదికన సింగరేణి వారసత్వ ఉద్యోగాలు ప్రకటించిందో తెలపాలని కోరింది.
వారు చేసిన మార్గదర్శకాలను అఫిడవిట్ ద్వారా తెలియజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 6వ తేదీకి వాయిదా వేసింది.