sccl
-
సింగరేణి ఉద్యోగుల రూ.కోటి ప్రమాద బీమా పథకం ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కీలకపాత్ర పోషించిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. గతంలో బీజేపీతో.. బీఆర్ఎస్ ప్రభుత్వం కుమ్మక్కు అయ్యి సింగరేణి సంస్థ భవిష్యత్‌ను ప్రశ్నార్ధకం చేశారని మండిపడ్డారు. తెలంగాణ సచివాలయంలో సింగరేణి ఉద్యోగులకు రూ. కోటి ప్రమాద బీమా పథకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ‘నేటికి రాష్ట్ర ప్రభుత్వ అప్పు రూ. 7 లక్షల కోట్లు. ప్రతీ సంవత్సరం రూ. 70 వేల కోట్ల అప్పు కట్టాల్సిన ఆర్థిక సంక్షోభం కేసీఆర్ తీసుకొచ్చారు. పదేళ్ల లో అన్ని వ్యవస్థ లను విధ్వంసం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో డిసెంబర్ నుంచి అక్టోబర్ వరకు రైతు బంధు వేశారు. మేము మార్చి 31 లోపు పూర్తి చేస్తామని చెప్పాం. కేటీఆర్, హరీష్‌రావులు అబద్దాలతోనే ఇంకా మోసం చేస్తున్నారు. కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్, కవిత తప్ప ఇంకోకరు మాట్లాడడం లేదు. రోజు వారి ఆదాయాన్ని అంచనా వేసి చెల్లింపులు చేస్తున్నాం. ఉద్యోగ నియామకాలు చేపడుతే.. నియామకపత్రాలు ఎందుకు ఇవ్వలేదు. 70 రోజుల్లో 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. మార్చి 6 న మరో 6 వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. ...అన్నారం, మేడిగడ్డ బ్యారేజ్‌లు కుంగిపోయాక నీళ్లు ఎత్తిపోయడం సాధ్యమయ్యేపనేనా. కృష్ణా నది జలాలు ఎవరు కేంద్రానికి అప్పగించారో ప్రజలకు తెలుసు. బీఆర్ఎస్ ,బీజేపీ పదేళ్ల లో ఇచ్చిన హామీలు, మా గ్యారెంటీలపై అసెంబ్లీ సమావేశాలలో చర్చించేందుకు సిద్దమా. బీఆర్ఎస్ నేతల మాటలనే కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. రైతుల ఆదాయం రెట్టింపు, సంవంత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాల సంగతి ఏమైంది. రాష్ట్ర సమస్యలపై ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులను కలిశాం. రాష్ట్ర బీజేపీ నేతలు ప్రజా సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు కలవడం లేదు. పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా ఢిల్లీలో కాల్చి చంపారు. హైదరాబాద్ వరదలు వస్తే కేంద్రం సహాయం ఎందుకు చేయలేదు. రేపు సాయంత్రం 500లకు గ్యాస్, పేదలకు 200 యూనిట్ల ఉచిత కరెంటును ప్రారంభించబోతున్నాం. బీజేపీ, బీఆర్ఎస్లకు రాజకీయ స్వార్థం ఉంది . ...రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ ,రాష్ట్రాన్ని కాపాడేది కాంగ్రెస్. మమ్మల్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. వడ్డీ కట్టడానికి అప్పు తేవాల్సిన పరిస్థితి ఉంది. నిరుద్యోగులకు విశ్వాసం కల్పించే ప్రయత్నం జరుగుతుంది. ప్రతీ నియోజకవర్గంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. పోటీ పరిక్షలకు సిద్ధం అయ్యే వారికి డిజిటల్ క్లాసులు నిర్వహిస్తాం. వైట్ రేషన్ కార్డు ప్రమానికంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో హైవేలకు, గుట్టలకు రైతు బంధు ఇచ్చారు. కేటీఆర్ ఔట్ సోర్సింగ్ పర్సన్’అని సీఏం రేవంత్‌రెడ్డి అన్నారు. -
SCCL: సింగరేణి నియామకాల్లో అవకతవకలు.. రంగంలోకి ఏసీబీ..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పీడ్ పెంచింది. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, పలు అక్రమాలపై ప్రభుత్వం సీరియస్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే సింగరేణిలో జరిగిన పలు నియామకాల్లో అక్రమాలపై దృష్టి సారించింది. దీంతో, పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వివరాల ప్రకారం.. సింగరేణిలో మెడికల్ ఇన్వాలిడేషన్ నియామకాల్లో అవకతవకలు జరిగినట్టు ఎండీ బలరాం తెలిపారు. ఈ క్రమంలో నియామకాల పేరుతో పలువురు ఉద్యోగులు డబ్బు వసూలు చేసినట్టు స్పష్టం చేశారు. దీంతో, ఇప్పటికే పలువురిని సింగరేణి యాజమాన్యం సస్పెండ్ చేసిందని చెప్పారు. ఇక తాజాగా, ఎండీ బలరాం సింగరేణి అంశంపై ఏసీబీకి లేఖ రాశారు. దీంతో, ఏసీబీ డీఎస్పీ రమేష్ నేతృత్వంలో విచారణ చేపట్టింది. సింగరేణిలో నియామకాలపై దర్యాప్తు చేస్తోంది. -
బీఆర్ఎస్ కు షాక్..టీబీజీకేఎస్ కు అగ్రనేతల రాజీనామా
-
సింగరేణి ఎన్నికలు.. హైకోర్టును ఆశ్రయించిన కేంద్రం..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సింగరేణి ఎన్నికలపై మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. సింగరేణి ఎన్నికలపై కేంద్ర కార్మిక శాఖ తాజాగా రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. కార్మిక సంఘం ఎన్నికలకు సింగరేణి యాజమాన్యం సహకరించడంలేదని కేంద్ర కార్మిక శాఖ పిటిషన్ దాఖలు చేసింది. వివరాల ప్రకారం.. సింగరేణి ఎన్నికలపై కేంద్ర కార్మిక శాఖ హైకోర్టును ఆశ్రయించింది. సింగరేణిలో కార్మిక సంఘం ఎన్నికలకు సంస్థ యాజమాన్యం సహకరించడంలేదని హైకోర్టులో పిటిషన్ వేసింది. గత నెల 27న మీటింగ్‌కు సింగరేణి యాజమాన్యం హాజరుకాలేదని కేంద్రం పిటిషన్లో పేర్కొంది. సింగరేణి తుది ఓటర్ల జాబితాను ప్రకటించలేదని తెలిపింది. కోర్టు ఆదేశాలతో ఈనెల 28న ఎన్నికలు నిర్వహించేలా షెడ్యూల్ చేశామని కేంద్రం వెల్లడించింది. సింగరేణి సహాయ నిరాకరణ వల్ల ఎన్నికలకు వెళ్లలేకపోతున్నామని కేంద్రం పేర్కొంది. ఎన్నికల నిర్వహణకు సహకరించాలని సింగరేణి, ప్రభుత్వాన్ని ఆదేశించాలని కేంద్రం పిటిషన్లో కోరింది. ఇక, సింగరేణి అప్పీల్‌తో కలిపి కేంద్ర కార్మికశాఖ పిటిషన్‌పై ఈనెల 11న విచారణ చేపట్టనున్నట్టు హైకోర్టు తెలిపింది. అంతకుముందు.. కార్మిక సంఘాల ఎన్నికలు వాయిదా వేయాలని సింగరేణి యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో అక్టోబర్ 5న విచారణ జరిగిన విషయం తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అయ్యే వరకు కార్మిక సంఘాల ఎన్నికలు వాయిదా వేయాలని సింగరేణి యాజమాన్యం కోరింది. అయితే, ఈ నెలాఖరులోగా కార్మిక సంఘాల ఎన్నికలు పూర్తి చేయాలని ఇప్పటికే సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని సింగరేణి డివిజన్ బెంచ్‌ను సింగరేణి సంస్థ కోరింది. సింగరేణి యాజమాన్యం అభ్యర్థనపై స్పందన తెలపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేస్తూ సింగరేణి అప్పీలుపై తదుపరి విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర కార్మిక శాఖ హైకోర్టును ఆశ్రయించింది. ఇది కూడా చదవండి: దసరా హాలీడే ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. ఏరోజున అంటే? -
ఎన్ఎండీసీ చైర్మన్‌గా శ్రీధర్ నియామకం
సాక్షి, హైదరాబాద్: సింగరేణి సీఎండీ నడిమెట్ల శ్రీధర్‌కు మరో గౌవరం దక్కింది. నేషనల్ మినరల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NMDC) చైర్మన్‌గా శ్రీధర్ నియామకమయ్యారు. వివరాల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలెక్షన్ బోర్డు ఎన్ఎండీసీ చైర్మన్‌గా శ్రీధర్‌ను నియమించాలని సిఫారసు చేసింది. దీంతో కేంద్రం శ్రీధర్‌ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా, శ్రీధర్ ప్రస్తుతం సింగరేణి సీఎండీగా కొనసాగుతున్నారు. శ్రీధర్ 1997 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. తెలంగాణ ఏర్పాట తర్వాత నుంచి 2015 జనవరి ఒకటి నుంచి ఇప్పటి వరకు సింగరేణి కంపెనీ కాలరీస్ లిమిటెడ్ సీఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తూ వస్తున్నారు. ఇది కూడా చదవండి: నాగ్‌పూర్ టూ విజయవాడ: ఎకనమిక్ కారిడార్‌కు లైన్‌క్లియర్ -
ఇదెక్కడి విడ్డూరం..! ఎద్దు మూత్రం పోసిందని కేసు పెట్టడమేంటి?
సాక్షి, ఖమ్మం: మనుషులే రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేస్తున్నా ఎవరూ పట్టించుకోని పరిస్థితులు ఉన్నాయి. అలాంటిది ఓ ఎద్దు రోడ్డుపై మూత్రం పోసిందని అధికారులు కేసు పెట్టారు. యజమానికి కోర్టు రూ.100 ఫైన్ కూడా వేసింది. ఎద్దు ముత్రం పోస్తే ఫైన్ ఏంటని ఆలోచిస్తున్నారా? అవును నిజమే. ఈ విడ్డూరం భద్రాద్రి కొత్తగూడం జిల్లాలో వెలుగు చూసింది. ఇంతకీ ఏం జరిగిందంటే? సింగరేణి గనులకు పుట్టినిల్లు జిల్లాలోని ఇల్లందు పట్టణం. అక్కడే ఉండే సుందర్ లాల్ అనే ఓ రైతు తన ఎద్దుల బండిని కిరాయికి తోలుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సింగరేణి జీఎం కార్యాలయానికి సమీపంలో నివస్తుండటంతో రోజూ ఆఫీసు ముందు నుంచి వెళ్తాడు. అయితే, ఒకరోజు జీఎం కార్యాలయం ముందు ఎద్దు మూత్రం పోసింది. దానిని గమనించిన అక్కడి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌ను అందించి ఎద్దుల యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిని తీవ్రంగా పరిగణించిన పోలీసులు సుందర్ లాల్‌ను స్టేషన్‌కు పిలిపించారు. ఎన్నడూ పోలీస్ స్టేషన్ ముఖం చూడని సుందర్ లాల్ భయం భయంగానే వెళ్లి ఏం జరిగిందని ఆరా తీయగా.. అసలు విషయం చెప్పారు. నీ ఎద్దు జీఎం ఆఫీసు ముందు మూత్రం పోసింది. గతంలోనూ నీ ఎద్దు ఇలానే చేసిందటా అని వెల్లడించారు. దీంతో సుందర్ లాల్ అవక్కయ్యాడు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. విచారించిన న్యాయమూర్తి సుందర్‌లాల్‌కు రూ.100 జరిమానా విధించారు. అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్ రూ.100 ఇచ్చి ఫైన్ చెల్లించడం గమనార్హం. . అసలు విషయం వేరే ఉందా? రైతు సుందర్ లాల్‌ను ఇబ్బంది పెట్టడానికి వెనుక మరో కారణం ఉన్నట్లు తెలుస్తోంది. ఓ భూమికి సంబంధించి సింగరేణి నుంచి తనకు పరిహారం ఇవ్వాలని సుందర్ లాల్ డిమాండ్ చేస్తున్నారు. తన భూమిని బలవంతంగా తీసుకున్నారని, చాలా ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నానని సుందర్‌లాల్ ఆవేదన వ్యక్తం చేశాడు. సాధారణంగా ఎద్దులు మూత్రం చేస్తుండగా నడవవని, తాను మూత్ర విసర్జన చేయమని చెప్పలేదన్నారు. సింగరేణి వల్ల తనకు అన్యాయం జరిగిందనే బ్యానర్లను ఎద్దుల బండికి కట్టి నగరంలో తిరుగుతున్నాడు సుందర్ లాల్. తమ సంస్థకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారనే కావాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతు వాపోయాడు. తనకు న్యాయం చేయకపోయినా తప్పుడు కేసులు పెట్టొద్దని ఆయన కూతురు విజ్ఞప్తి చేసిన ఓ వీడియో సైతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. హైదరాబాద్ పోలీస్ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా ! @CPHydCity @TelanganaDGP@shohumayunnagar @DCPCZHyd సాధారణ రైతు తన ఎడ్ల బండిని తోలుకుంటూ వెళ్తుంటే, ఎద్దు తమ ఆఫీస్ ముందు పాస్ పోసుకుందని, సింగరేణి యాజమాన్యం Brown మేనేజర్, ఆ రైతు మీద పోలీస్ కేసు నమోదు చేయించారట. తెలంగాణ (1/2) pic.twitter.com/pjlvgIHbuY — Vijay Gopal (@VijayGopal_) December 6, 2022 జీఎం ఏమన్నారంటే? సింగరేణి జీఎం ఎం షలీం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..‘2005లో జేకే-5 ఓపెన్ కాస్ట్ మైన్ కోసం భూములు తీసుకున్నాం. సుందర్ లాల్‌కు చెందిన కొంత భూమి అందులో ఉంది. పట్టాదారుకు భూసేకరణ అధికారులు నగదు చెల్లించారు. దీనిపై సుందర్ లాల్ కోర్టుల్లో కేసులు వేశారు. సుప్రీం కోర్టు సైతం ఆయన ఫిర్యాదును తోసిపుచ్చింది. అప్పటి నుంచి ఆఫీసు వద్ద ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఇబ్బంది పెడుతున్నాడు. అధికారులు, పోలీసులు చెప్పినా వినకుండా అలానే ప్రవర్తిస్తున్నాడు.’ అని తెలిపారు జీఎం. మరోవైపు.. ఈ విషయం తెలిసిన జనాలు.. చేసే పనులు సరిగా చేయరు.. కానీ ఇలాంటి పనికి మాలిన విషయాల్లో అత్యుత్సాహం చూపడం ఏంటని చర్చించుకుంటున్నారు. #Telangana: Bull urinates at SCCL GM office, owner bookedhttps://t.co/16yO4iRn7n pic.twitter.com/NtR2fi4Are — TOI Hyderabad (@TOIHyderabad) December 6, 2022 ఇదీ చదవండి: సింగరేణి గనిలో కూలిన బండ -
సింగరేణిలో ‘గుర్తింపు’ ఎప్పుడో?
సాక్షి,పెద్దపల్లి: సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల ఊసులేకుండా పోయింది. కోల్‌బెల్ట్ ప్రాంతం, ఎమ్మెల్యే, ఎంపీల భవిష్యత్‌తో ముడిపడి ఉన్న ఈ ఎన్నికలను ఆచితూచి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుండగా, కేంద్రం మాత్రం సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలనే పట్టుదలతో ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిలిచే ఈ ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. గుర్తింపు ఎన్నికల గడువు దాటి నాలుగేళ్లు అవుతోందని, త్వరగా ఎన్నికలు నిర్వహించాలని జాతీయ కార్మిక సంఘాలు పట్టుబడుతున్నాయి. ప్రస్తుతం గుర్తింపు యూనియన్‌గా ఉన్న టీబీజీకేఎస్ కూడా ఎన్నికలకు సిద్ధమని ప్రకటించింది. 11 ఏరియాలు 42 వేల మంది కార్మికులు సంస్థ పరిధిలోని 11 ఏరియాల్లో సుమారు 42 వేల మంది కారి్మకులు పనిచేస్తున్నారు. ఆరు కార్మిక సంఘాలు పోటీలో ఉంటున్నాయి. 1998లో మొదటిసారి రెండేళ్ల కాలపరిమితితో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఆ తర్వాత నాలుగేళ్లకోసారి నిర్వహించారు. ఈసారి కోవిడ్ కారణంగా గుర్తింపు ఎన్నికలు ఆలస్యం అయ్యాయి. కోవిడ్ సెకండ్‌వేవ్ తగ్గిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని జాతీయ కార్మిక సంఘాలు కోరినప్పటికీ యాజమాన్యం ఆసక్తి చూపించలేదు. ఈ క్రమంలో బొగ్గుగని కారి్మకుల సమస్యల పరిష్కారం కోసం కోలిండియావ్యాప్తంగా సమ్మె చేపట్టారు. దీనిపై స్పందించిన సింగరేణి యాజమాన్యం బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ మినహాయించి మిగతా డిమాండ్లపై చర్చలకు ఆహ్వానించింది. చర్చల సమయంలో సింగరేణిలో సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని అన్ని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే ఉత్పత్తి లక్ష్యాల సాధనకు మార్చి చివరినెల కావడంతో యాజమాన్యం స్పందించలేదు. దీంతో ఎన్నికల ప్రక్రియ మళ్లీ వెనక్కివెళ్లింది. కార్మిక సంఘాల పట్టు సింగరేణి గుర్తింపు సంఘం గడువు ముగిసిన నేపథ్యంలో వెంటనే ఎన్నికలు నిర్వహించాలని టీబీజీకేఎస్, జాతీయ కార్మిక సంఘాలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో గుర్తింపు యూనియన్ టీబీజీకేఎస్, అలాగే ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, బీఎంఎస్, సీఐటీయూ, ఐఎన్టీయూసీ ఎన్నికలకు ముందే కారి్మకులకు దగ్గర కావాలని చూస్తున్నాయి. బస్సుయాత్ర, జీపుయాత్ర, శిక్షణతరగతులు, జనరల్‌బాడీ సమావేశాల పేరుతో ఇప్పటికే గనుల్లో ఈ సంఘాల నేతలు పర్యటించారు. ఇంకా తేల్చని యాజమాన్యం సింగరేణి గుర్తింపు ఎన్నికలపై యాజమాన్యం ఇంకా తేల్చలేదు. మార్చి¯ నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత ఎన్నికలుంటాయని కార్మిక సంఘాలు భావించినా ఎలాంటి నిర్ణయం వెలుబడలేదు. సింగరేణిలో గుర్తింపు ఎన్నికల పక్రియ ప్రారంభిస్తే ఒక్కో షిఫ్టుకు రెండు గంటల మేర అంతరాయం ఉంటుందని యాజమాన్యం భావిస్తోంది. దీంతో ఉత్పత్తికి విఘాతం కలుగుతుందని ఆలోచిస్తోంది. ఎన్నికలు ఎప్పుడొస్తాయో దేవునికే ఎరుక సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు ఎప్పుడొస్తాయో దేవుడికే ఎరుక. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేము సిద్ధం. గుర్తింపు యూనియన్లకు సంబంధించిన పత్రాలన్నీ ఎప్పుడో సమర్పించాం. – వెంకట్రావ్, టీబీజీకేఎస్ అధ్యక్షుడు -
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. లాభాల బోనస్ ప్రకటన
సాక్షి, హైదరాబాద్: సింగరేణి ఉద్యోగులకు సీఎం కేసీఆర్ దసరా కానుక ప్రకటించారు. సంస్థ లాభాల్లో 30 శాతం వాటాను ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దసరా పండుగ లోపు ఈ వాటాను ఉద్యోగులకు చెల్లించాలని సీఎం ఆదేశించారు. దీంతో అర్హులైన కార్మికులకు రూ. 368 కోట్లను సింగరేణి సంస్థ చెల్లించనుంది. సింగరేణి కాలరీస్ సంస్థ, 2021 -22 సంవత్సరానికి గాను సాధించిన లాభాల్లో 30 శాతం వాటాను, సింగరేణి ఉద్యోగులకు దసరా కానుకగా అందించాలన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సింగరేణి కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహకాన్ని దసరాలోపు వెంటనే చెల్లించాల్సిందిగా, సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్‌కు సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావు ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా పరిస్థితుల్ని అధిగమించి.. దేశంలో గత రెండేళ్లుగా నెలకొన్న కరోనా విపత్కర పరిస్థితులను అధిగమించి 2021-22 లో రికార్డు స్థాయిలో 26,607 కోట్ల రూపాయల టర్నోవర్ ను సాధించింది సింగరేణి. మొత్తం టర్నోవర్ పై పన్నులు విధించడానికి ముందుకు 1,722 కోట్ల రూపాయల లాభాలను ఆర్థించినట్లు సంస్థ ఛైర్మన్ అండ్ ఎండీ శ్రీ ఎన్.శ్రీధర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సింగరేణి సంస్థ బొగ్గు, విద్యుత్ అమ్మకాల ద్వారా సాధించిన టర్నోవర్ పై నికర లాభాలు రూ.1,227 కోట్లుగా (పన్నులు చెల్లించిన తర్వాత) ఉన్నట్లు తెలిపారు. అలాగే గత ఏడాది పన్నుల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 3,596 కోట్లను చెల్లించినట్లు వెల్లడించారు. అక్టోబర్ 1వ తేదీన లాభాల వాటా చెల్లింపు సింగరేణి సాధించిన లాభాల్లో కార్మికులకు 30 శాతం వాటాను ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. గత ఏడాది కంటే ఒక శాతం పెంచుతూ సింగరేణి కార్మికులకు లాభాల వాటాను దసరా కానుకగా ప్రకటించిన ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా కార్మికులందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు సీ అండ్ ఎండీ. ఈ ఏడాది లాభాల వాటాగా కార్మికులు రూ.368 కోట్లను అందుకోనున్నారని వివరించారు. దాదాపు 44 వేల మంది ఉద్యోగులకు లాభాల వాటాను అక్టోబర్ 1వ తేదీన (శనివారం) చెల్లించనున్నట్లు ఆయన ప్రకటించారు. 70 మిలియన్ టన్నుల లక్ష్యంతో.. 2021-22 లో సింగరేణి సంస్థ రికార్డు స్థాయిలో 650 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 655 లక్షల టన్నుల రవాణా చేసిందన్నారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ద్వారా 88.08 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను గ్రిడ్ కు సరఫరా చేసినట్లు వివరించారు. అలాగే ఈ ఏడాది నిర్దేశించుకున్న 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యానికి ప్రతీ ఒక్కరూ పునరంకితమై పనిచేయాలని, తద్వారా రికార్డు స్థాయి టర్నోవర్, లాభాలు సాధించవచ్చని తద్వారా మరిన్ని ఎక్కువ లాభాలు మరియు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులందరికీ బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. -
సింగరేణి సంస్థకు షాకిచ్చిన హైకోర్టు.. ఆ పోస్టుల భర్తీ నిలిపివేయండి!
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్– 2 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిలిపివేయాలని సంస్థ ఉన్నతాధికారులను హైకోర్టు శనివారం ఆదేశించింది. పరీక్షలో అవకతవకలపై కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. పిటిషనర్లు వాదనకు సరిపడా ఆధారాలు చూపించారని, తదుపరి నిర్ణయం వెలువడే వరకు ఉద్యోగాల భర్తీని నిలిపివేయాలని సింగరేణి రిక్రూట్మెంట్ సెల్‌కు ఆదేశాలు జారీచేసింది. జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి హైదరాబాద్‌తో సహా 8 జిల్లాలోని 187 కేంద్రాల్లో ఈనెల 4న రాత పరీక్ష నిర్వహించారు. అయితే పరీక్షలు సజావుగానే నిర్వహించామని సింగరేణి, జేఏన్టీయూ అధికారులు చెబుతున్నా.. కొందరు అభ్యర్థులను గోవా తీసుకెళ్లి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారని, అక్కడ పేపర్ లీకైందని ఆరోపణలు వచ్చాయి. వీటిని కొట్టిపారేసిన సింగరేణి, జేఎన్టీయూ అధికారులు హడావిడిగా ఫలితాలు విడుదల చేశారు. 78 వేల మంది పరీక్ష రాయగా, 49 వేల మంది అర్హత సాధించారని పేర్కొంటూ వారి మార్కులు, ర్యాంకులు వెల్లడించారు. అయితే, పరీక్ష రాసిన అభ్యర్థులంతా తమకెన్ని మార్కులు వచ్చాయో తెలుసుకోవాలని ఆరాటపడుతుంటారని, కానీ సింగరేణి అధికారులు అలా విడుదల చేయలేదని, అందరి మార్కులు వెల్లడించిన తర్వాతే ర్యాంకులు విడుదల చేయాల్సి ఉండగా అర్హత పేరుతో 49 వేల మంది ఫలితాలు మాత్రమే విడుదల చేయడం అనుమానాలకు తావిస్తోందని విమర్శలు వెల్లువెత్తాయి. వీటన్నింటినీ పరిశీలించకుండా ఫలితాలు విడుదల చేయడాన్ని హైకోర్టు తప్పపట్టింది. అభ్యర్థుల పేర్లకు బదులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, డిగ్రీ మొదలైన పేర్లతో హాల్‌టికెట్లు ఎలా పంపిణీ చేశారని, పరీక్ష సమయంలో అభ్యర్థి పేరు రాస్తే ఎలా పరిగణనలోకి తీసుకున్నారని కోర్టు ప్రశ్నించింది. కాగా, పరీక్షకు 15 రోజుల ముందే సింగరేణిలో కీలకమైన డైరెక్టర్(పా) పోస్టును చంద్రశేఖర్ అనే వ్యక్తికి ఇచ్చారని, ఐదు నెలల తర్వాత ఉద్యోగ విరమణ పొందే ఆ వ్యక్తికి ఇప్పుడా పదవి కట్టబెట్టడంతో పరీక్షల నిర్వహణపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
విషాదం: సింగరేణి బొగ్గు గని ప్రమాదం.. ముగ్గురు మృతి
సాక్షి, పెద్దపల్లి/రామగిరి/గోదావరిఖని: మూడు రోజుల రెస్క్యూ ఆపరేషన్ ఎట్టకేలకు ముగిసింది. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి పరిధిలోని ఏపీఏ అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు (ఏఎల్పీ)లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. అసిస్టెంట్ మేనేజర్ తేజ, సెఫ్టీ ఆఫీసర్ జయరాజ్, కార్మికుడు శ్రీకాంత్ మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ముగ్గురి మృతదేహాలను రెస్క్యూ టీమ్ బయటకు తీసింది. ఈ ప్రమాదంలో చిక్కుకున్న ఏడుగురిలో నలుగురు క్షేమంగా ఉన్నారని, ముగ్గురు మృతి మరణించారని అధికారులు తెలిపారు. ఏఎల్పీ బొగ్గుగనిలో 86వ లెవల్ వద్ద రూఫ్ బోల్డ్ పనులు చేస్తుండగా ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఏరియా సేఫ్టీ ఆఫీసర్, డిప్యూటీ మేనేజర్‌సహా మరో ఐదుగురు కార్మికులు ప్రమాదంలో చిక్కుకోగా.. ముగ్గురిని సోమవారమే బయటకు తీసుకొచ్చారు. రవీందర్‌ను రెస్క్యూ టీం మంగళవారం కాపాడింది. సంబంధిత వార్త: ఆ ముగ్గురూ ఎక్కడ? -
వచ్చే నెలలో భద్రాచలం– సత్తుపల్లి రైల్వే లైన్ పూర్తి
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కాలరీస్–దక్షిణ మధ్య రైల్వే సంయుక్తంగా చేపట్టిన 54 కిలోమీటర్ల భద్రాచలం–సత్తుపల్లి రైల్వే లైన్ పనులు వచ్చే నెలాఖరుకు పూర్తయ్యేలా చూడాలని అధికారులను సింగరేణి డైరెక్టర్లు ఎన్.బలరామ్, డి.సత్యనారాయణరావు ఆదేశించారు. సంబంధిత కాంట్రాక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ లైన్ మార్గం పూర్తయితే పర్యావరణ హితంగా బొగ్గు రవాణా చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. సత్తుపల్లి వద్ద నిర్మిస్తున్న అతి పెద్ద సీహెచ్‌పీ నిర్మాణం కూడా మార్చికల్లా పూర్తి కావాలని స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 68 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవడానికి వీలుగా ఉపరితల గనుల్లో రోజూ 15 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ను వెలికి తీయాలని ఓబీ కాంట్రాక్టర్లను డైరెక్టర్లు ఆదేశించారు. -
దసరా కానుక: ఒక్కో కార్మికుడికి రూ.1.15 లక్షలు
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థ కార్మికులకు ప్రకటించిన 29 శాతం లాభాల బోనస్ సొమ్మును ఈ నెల 11న చెల్లించనున్నట్టు సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీని కింద రూ.79.07 కోట్లను కార్మికులకు పంపిణీ చేస్తామన్నారు. అలాగే ఇటీవల ప్రకటించిన దీపావళి బోనస్ (ప్రొడక్షన్ లింక్డ్ రివార్డ్ బోనస్)ను నవంబర్ 1న కార్మికుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. ఇందుకోసం సంస్థ రూ.300 కోట్లను వెచ్చిస్తోందని, ప్రతి కార్మికుడు రూ.72,500 అందుకోనున్నాడని వివరించారు. ఇక పండుగ అడ్వాన్స్ కింద ప్రతి కార్మికుడికి రూ.25 వేల చొప్పున సంస్థ ప్రకటించిందని, ఈ డబ్బును ఈ నెల 8వ తేదీన చెల్లించనుందని పేర్కొన్నారు. పై రెండు రకాల బోనస్‌లు, పండుగ అడ్వాన్స్ కలిపి కార్మికులు సగటున రూ.1.15 లక్షల వరకు రానున్న మూడు వారాల్లో అందుకోనున్నారని తెలిపారు. ఈ మొత్తాన్ని దుబారా చేయకుండా వినియోగించుకోవాలని, పొదుపు చేయడం లేదా గృహావసరాలకు వాడుకోవాలని సూచించారు. రానున్న రోజుల్లో మరింతంగా ఉత్సాహంగా, కలిసికట్టుగా పనిచేస్తూ నిర్దేశిత లక్ష్యాలు సాధించాలని, తద్వారా ఈ ఏడాది మరింత మెరుగైన బోనస్‌లు, సంక్షేమం అందుకోవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా సింగరేణి ఉద్యోగుల తరపున రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. కార్మికులకు దసరా, దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. చదవండి: సాగర్‌ను పరిశీలించిన కేఆర్ఎంబీ ఇంజనీర్లు -
సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ దసరా కానుక
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన లాభాల్లో కార్మికులకు 29 శాతం వాటాను ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. గత ఏడాది.. లాభాల్లో 28% వాటాను కార్మికులకు ప్రకటిం చగా, ఈ ఏడాది దసరా కానుకగా దానిని 29 శాతానికి పెంచినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రగతి భవన్లో సింగరేణిపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశం వివరాలను సీఎంఓ ఆ ప్రకటనలో వెల్లడించింది. కార్యకలాపాలు విస్తరించాలి సింగరేణి లాభాల్లో వాటాను పండుగకు ముందే కార్మికులకు చెల్లించాలని సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్‌ను సీఎం ఆదేశించారు. సింగరేణి కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటిం చారు. కార్మికుల భవిష్యత్తు దృష్ట్యా సంస్థ కార్యకలాపాలను బొగ్గు తవ్వకంతో పాటు ఇసుక, ఇనుము, సున్నపురాయి తదితర ఖనిజాల తవ్వకాల్లోకి విస్తరించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. కార్మికుల నైపుణ్యాన్ని ఆయా ఖనిజాల తవ్వకాలలో కూడా వినియోగించుకోవాల్సిన సందర్భం వచ్చిందన్నారు. ఇందుకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రిటైర్డ్ కార్మికులను ఉపయోగించుకుందాం ‘ప్రైవేట్, కార్పొరేట్ కంపెనీలు రిటైర్డ్ సింగరేణి కార్మికులను వినియోగించుకుని బొగ్గు తదితర ఖనిజాల గనులను నిర్వహిస్తూ లాభాలు గడిస్తున్నాయి. మనమే ఎందుకు ఆ పని చేయకూడదు? వారి నైపుణ్యాన్ని, శక్తిని తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా వినియోగించుకుంటుంది. బొగ్గుతో పాటు రాష్ట్రంలోని ఇతర మైనింగ్ రంగాలను నిర్వహిస్తూ కార్మికులకు పని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా చర్యలు చేపడుతుంది..’అని సీఎం స్పష్టం చేశారు. సాయంపై సానుకూల స్పందన: రిటైర్డ్ సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా అందుతున్న పింఛను నెలకు రూ.2 వేల లోపే ఉందని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం చేసేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన విజ్జప్తిపై సీఎం సానుకూలంగా స్పందించారు. ఎటువంటి చర్యలు చేపట్టడం ద్వారా వారికి సాయం చేయగలమో.. నివేదికను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశం అనంతరం లాభాల్లో వాటా ను ప్రకటించినందుకు ముఖ్యమంత్రికి సింగరేణి కోల్ బెల్టు ఏరియా ప్రజా ప్రతినిధులు, టీజీబీకేఎస్ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు, టీబీజీకేఎస్ నేతలు పాల్గొన్నారు. ఒక్కో కార్మికుడికి రూ.18 వేలు హైదరాబాద్: సింగరేణి సంస్థ గత ఆర్థిక సంవత్సరం ఆర్జించిన లాభాల్లో 29 శాతం వాటా ను కార్మికులకు అందజేస్తే .. సంస్థలో పనిచేస్తున్న 43 వేల మంది కార్మికులు సగటున రూ.18 వేలు పొందనున్నారు. సింగరేణి సంస్థ గత ఆర్థిక సంవత్సరం (2020–21)లో రూ.272 కోట్ల నికర లాభాలను మాత్రమే ఆర్జించింది. ఇందులో 29 శాతం అంటే రూ.79 కోట్లను కార్మికులకు లాభా ల్లో వాటాగా పంచనున్నారు. మూడు రకాలుగా కార్మికులకు లాభాల్లో వాటాల చెల్లింపులుంటలాయి. భూగర్భ గనుల కార్మికులకు కొంత అధికంగా, ఉపరితల గనుల కార్మికులకు మధ్యస్తంగా, ఇతర సివిల్ విభాగాల్లో పనిచేసే వారికి కొంత తక్కువగా వాటాలు చెల్లిస్తారు. పనిచేసే గనులు/విభాగం, పనిచేసిన రోజుల ఆధారంగా ఒక్కో కార్మికుడికి రూ.17 వేల నుంచి రూ.25 వేల వరకు లాభాల్లో వాటా వచ్చే అవకాశముందని సింగరేణి అధికారవర్గాలు తెలిపాయి. కరోనా ఎఫెక్ట్: కరోనా ప్రభావం సింగరేణి సంస్థ లాభాలపై పడింది. 2019–20లో సంస్థ రూ.999.86 కోట్ల లాభాలు ఆర్జించింది. ఆ ఏడాది లాభాల్లో 28 శాతం అనగా రూ.278 కోట్లను కార్మికుల వాటాగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఒక్కో కార్మికుడు సగటున రూ.60,468 వాటాను అందుకున్నాడు. ఈసారి లాభాల్లో వాటాను 29 శాతానికి పెంచినా కార్మికులకు లభించేది సగటున రూ.18 వేలు మాత్రమే కావడం గమనార్హం. -
సింగరేణిలో భారీగా ఉద్యోగాలు!
సాక్షి, ఎడ్యుకేషన్: తెలంగాణ రాష్ట్రంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(SCCL) శుభవార్త అందించింది. త్వరలో దాదాపుగా 2087 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తాజాగా వెల్లడించింది. ఈ 2087 ఉద్యోగాల్లో 651 ఎక్స్టర్నల్ పోస్టులు, 1436 ఇంటర్నల్ పోస్టులు ఉన్నట్లు తెలిపింది. ఎక్స్టర్నల్ పోస్టుల విభాగంలో దాదాపు 177 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయని పేర్కొంది. ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టుకి గ్రాడ్యుయేషన్ చేసిన ప్రతి ఒక్కరూ అర్హులే. సాక్షి ఎడ్యుకేషన్ ఆన్లైన్ కోచింగ్... సింగరేణి సంస్థ త్వరలోనే నోటిఫికేషన్ విడదల చేసినప్పటికీ, కోవిడ్19 పరిస్థితుల దృష్ట్యా ఈ ఉద్యోగ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు... కోచింగ్ ఇన్స్టిట్యూట్ వెళ్లి చదువుకొనే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ విపత్కర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థుల సౌలభ్యం కోసం సాక్షి ఎడ్యుకేషన్.కామ్(www.sakshieducation.com) ''ఆన్లైన్ కోచింగ్'' కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కార్యక్రమంలో భాగంగా ప్రముఖ కోచింగ్ ఇన్స్టిట్యూట్ల సహకారంతో... తక్కువ ధరలకే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ఆన్లైన్ ద్వారా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. వివరాల కోసం www.sakshieducation.comను చూడండి. -
సింగరేణి సీఎండీగా శ్రీధర్ ఇంకెంతకాలం?
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ పదవీకాలం పొడిగింపు పట్ల కేంద్ర ప్రభుత్వం మరోసారి అభ్యంతరం తెలిపింది. కొత్తగూడెంలోని సింగరేణి కార్పొరేట్ కార్యాలయంలో గత నెల 30న నిర్వహించిన వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో శ్రీధర్ పదవీకాలం పొడిగింపునకు వ్యతిరేకంగా తమ శాఖ అండర్ సెక్రటరీ ఆల్కా శేఖర్ ఓటు వేశారని, ఈ విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి నుంచి తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ అందింది. ఈ నెల 8న లేఖ అందిన విషయాన్ని రాష్ట్ర ఇంధన శాఖ, సింగరేణి సంస్థ అధికారవర్గాలు ధ్రువీకరించాయి. 2015 జనవరి 1 నుంచి సంస్థ సీఎండీగా శ్రీధర్ కొనసాగుతున్నారు. చదవండి: సింగరేణికి సోలార్ సొబగులు ఈ నెల 31తో శ్రీధర్ పదవీకాలం ముగియనుండగా, ప్రభుత్వం తదుపరి ఆదే శాలు జారీ చేసే వరకు ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలని గత నెల నిర్వహించిన ఏజీఎంలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కేంద్రం వ్యతిరేకించినా, రాష్ట్ర ప్రభుత్వ వాటాదారుల మద్దతుతో ఆమోదం పొందింది. సింగరేణి సంస్థలో రాష్ట్ర ప్రభుత్వానికి 51 శాతం, కేంద్రానికి 49 శాతం వాటాలుండటంతో మెజారిటీ ఓట్ల మద్దతుతో ఈ తీర్మానం నెగ్గింది. తర్వాత శ్రీధర్ పదవీకాలాన్ని మరో ఏడాదికాలం పాటు పొడిగిస్తూ ఈ నెల 5న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2017లో రెండేళ్ల పదవీకాలం పూర్తిచేసుకున్న శ్రీధర్‌కు అప్పటినుంచి ఎక్స్టెన్షన్ ఇస్తూ వస్తున్నారు. అలా మొత్తం ఆరేళ్లు పనిచేసిన శ్రీధర్‌ను మరో ఏడాది కొనసాగించడంపై కేంద్రం సుముఖంగా లేదు. శ్రీధర్ పదవికి ప్రమాదం లేదు సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ పదవికి ఎలాంటి ప్రమాదం లేదని, మరో ఏడాది పాటు ఆయనే సీఎండీగా కొనసాగుతారని రాష్ట్ర ప్రభుత్వ అధికారవర్గాలు తెలిపాయి. సీఎండీ కొనసాగింపు పట్ల కేంద్రం వ్యతిరేకత చూపుతున్నా, మెజారిటీ వాటాదారుడిగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం. -
సింగరేణికి సోలార్ సొబగులు
సాక్షి, హైదరాబాద్: ఏళ్ల తరబడి నిరుపయోగంగా ఉన్న సింగరేణికి చెందిన భూములిప్పుడు సౌరకాంతులు విరజిమ్మనున్నాయి. సింగరేణి వ్యాప్తంగా మూసేసిన భూగర్భ గనులు, ఓపెన్ కాస్టులు, నిరుపయోగంగా ఉన్న భూముల్లో ఆ సంస్థ సోలార్ యూనిట్లు ఏర్పాటు చేస్తోంది. దీంతో 1,500 ఎకరాల భూమి వినియోగంలోకి రానుంది. విద్యుత్ అవసరాల కోసం సంస్థ ఏటా రూ.486 కోట్లు ఖర్చు చేస్తోంది. 300 మెగావాట్ల సౌర విద్యుత్ వినియోగంలోకి వస్తే ఏటా రూ.300 కోట్ల భారం తగ్గనుంది. 25 ఏళ్ల జీవిత కాలంతో నిర్మిస్తున్న ఈ ప్లాంట్లకు మొత్తం రూ.1,399 కోట్ల పెట్టుబడి అవుతోంది. అయితే.. ఏటా రూ.300 కోట్ల ఆర్జనతో మొదటి ఐదేళ్లలోనే ఈ పెట్టుబడి తిరిగి రానుంది. మొదటి దశ బీహెచ్ఈఎల్ నిర్మాణ పనులు చేస్తుండగా.. మిగతా రెండు దశల ప్లాంట్ల నిర్మాణం అదాని సంస్థ కాంట్రాక్టు దక్కించుకుంది. వచ్చే 25 ఏళ్లు ఈ సంస్థలే ప్లాంట్ల నిర్వహణ బాధ్యతలు చూడనున్నాయి. సింగరేణి సౌర్యం సౌర విద్యుత్ ఉత్పాదనలో కొత్తపుంతలు తొక్కుతున్న ‘సింగరేణి’.. వచ్చే రెండేళ్లలో మూడు దశల్లో 300 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే దిశగా పనులు ముమ్మరం చేసింది. రెండేళ్ల క్రితం మొదలైన ఈ పనుల్లో ఈ ఏడాది కరోనాతో జాప్యం జరగగా.. మళ్లీ పనులు పుంజుకున్నాయి. మొదటి దశలో మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (ఎస్టీపీపీ)లోని 50 ఎకరాల్లో 10 మెగావాట్లు, మణుగూరులో 150 ఎకరాల్లో 30 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. మొదటి దశలో చాలాచోట్ల పనులు పూర్తయి ఉత్పత్తికి సిద్ధంగా ఉండగా.. రెండు, మూడో దశ పనులు కొనసాగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పరిధిలో జేకే–5 ఓపెన్ కాస్ట్ పరిసరాల్లో 230 ఎకరాల్లో 39 మెగావాట్లకు గాను 15 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. మరో 24 మెగావాట్లు ఈ నెలాఖరులో పూర్తి కానుంది. ప్రాజెక్టులపై 500 మెగావాట్లు ఈ మూడు దశలు విజయవంతమైతే సాగునీటి ప్రాజెక్టుల్లో నీటిపై తేలియాడే (ఫ్లోటింగ్ సోలార్) ఫలకాలతో 500 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేయాలని సింగరేణి సంస్థ ప్రణాళిక రూపొందించింది. గోదావరి, అనుబంధ నదులపై భారీ ప్రాజెక్టులు, రిజర్వాయర్లపై సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే ఆలోచనలున్నాయి. ప్రయోగాత్మకంగా మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని థర్మల్ పవర్ ప్లాంట్‌లో మూడు టీఎంసీల సామర్థ్యం ఉన్న రెండు రిజర్వాయర్లపై 10 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి పనులు మొదలయ్యాయి. వీటితో పాటు ఓసీపీల్లో నీటి ఉపరితలాల పైనా తేలియాడే సౌర ఫలకాలు బిగించి సౌర విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. -
‘కేంద్ర బడ్జెట్ రాష్ట్రాలను ఆదుకునెలా ఉండాలి’
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ (2021–22) రాష్ట్రాలను ఆదుకొనేలా ఉండాలని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. ఆర్థిక సంఘం సిఫారసుల అమలు నుంచి వికలాంగులకు అందించే సాయం వరకు కేంద్రం అనుసరించాల్సిన విధానాలపై రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలను ఆయన నిర్మలా సీతారామన్‌కు వివరించారు. బడ్జెట్ రూపకల్పనలో భాగంగా నిర్మలా సీతారామన్ సోమవారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో మాట్లాడారు. రాష్ట్రం నుంచి హరీశ్‌రావుతో పాటు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె. రామకృష్ణారావు, కార్యదర్శి రొనాల్డ్ రోస్, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారుడు జీఆర్ రెడ్డి, ఇతర అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. భేటీలో హరీశ్‌రావు వెలిబుచ్చిన అభిప్రాయాలు... ⇔ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన గ్రాంట్లను బడ్జెట్లో పొందుపరిచి సంపూర్ణంగా అమలు చేయడం సంప్రదాయంగా వస్తోంది. అందులో కొన్నింటిని కేంద్రం అంగీకరించట్లేదు. 15వ ఆర్థిక సంఘం సిఫారసులను అమలు చేయకపోవడం వల్ల 2020–21లో తెలంగాణ రూ. 723 కోట్లు నష్టపోయింది. ఈ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలి. ఆర్థిక సంఘం సిఫారసులను యథాతథంగా అమలుపరిచే సంప్రదాయాన్ని కొనసాగించాలి. ⇔ కేంద్రం వసూలు చేస్తున్న సెస్, సర్‌చార్జీలను రాష్ట్రాలకు ఇచ్చే పన్నుల వాటాలో కలపట్లేదు. దీంతో రాష్ట్రాలు ఆర్థికంగా నష్టపోతున్నాయి. వచ్చే బడ్జెట్ నుంచి సెస్, సర్‌చార్జీలను రద్దు చేసి వాటి స్థానంలో రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే పన్నుల రేట్లను పెంచి అధిక నిధులు వచ్చేలా బడ్జెట్‌ను రూపొందించాలి. ⇔ కరోనా వల్ల నష్టపోయిన సంపదను కూడదీసుకోవడంలో భాగంగా జీఎస్డీపీలో 2 శాతం అదనంగా రాష్ట్రాలకు రుణాలు తీసుకొనే అవకాశమిచ్చారు. అన్ని రాష్ట్రాల్లో ప్రజా పెట్టుబడి (పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్)ను ప్రోత్సహించాలి. ఎలాంటి షరతులు లేకుండా ఈ అదనపు రుణాలు తీసుకొనే వెసులుబాటును వచ్చే బడ్జెట్లోనూ కొనసాగించాలి. ⇔ పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాష్ట్రంలోని వెనుకబడిన ›ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం సాయం అందించాలి. గత రెండేళ్లకు కలిపి రూ. 900 కోట్లు వెంటనే విడుదల చేయాలి. వచ్చే ఐదేళ్లపాటు ఈ సాయాన్ని కొనసాగించాలి. ⇔ మహిళా సంఘాలకు ఇస్తున్న వడ్డీ రాయితీ పథకాన్ని దేశవ్యాప్తంగా 50 శాతం జిల్లాలకు మాత్రమే వర్తింపజేస్తున్నారు. గత బడ్జెట్ ప్రసంగంలో ఈ రాయితీ 100 శాతం జిల్లాల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు అమలు కాలేదు. దీన్ని వెంటనే అమలు చేయాలి. ఇందుకు సంబంధించిన బకాయిలు విడుదల చేయాలి. ⇔ బిహార్‌లో ప్రకటించిన విధంగా కరోనా టీకాలను దేశమంతా ఉచితంగా పంపిణీ చేయాలి. ⇔ వికలాంగులు, వృద్ధులు, వితంతువులకు కేంద్రం ఎన్నో ఏళ్ల నుంచి కేవలం రూ. 200 మాత్రమే ఎన్ఎస్ఏపీ కింద సాయం చేస్తోంది. దీన్ని రూ. వెయ్యికి పెంచాలి. జీఎస్టీ పరిహారాన్ని సత్వరమే రాష్ట్రాలకు విడుదల చేయాలి. -
సింగరేణికి సుప్రీం కోర్టు మొట్టికాయలు!
న్యూఢిల్లీ : భూపాలపల్లి నివాస ప్రాంతంలోని సింగరేణి ఓపెన్ మైనింగ్ పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సింగరేణి యాజమాన్యం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఓపెన్‌కాస్ట్ మైనింగ్‌పై సుప్రీం కోర్టు శుక్రవారం విచారణ చెపట్టింది. ఈ విచారణలో భూపాలపల్లి బాధితుల తరపు న్యాయవాది శ్రవణ్ వాదిస్తూ.. సింగరేణి ఒపెన్‌కాస్ట్ మైనింగ్ బాంబు పేలుళ్ల వల్ల ప్రజలకు ప్రమాదాలు జరుగుతున్నాయని కోర్టుకు తెలిపారు. ప్రమాదాలు జరగకుండా సురక్షిత చర్యలు తీసుకోవాలని సింగరేణి యాజమాన్యాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. కాగా ఈ పటిషన్‌పై విచారణ చెపట్టిన జస్టిస్ నాగేశ్వరరావు ధర్మాసనం ఓపెన్ కాస్ట్ మైనింగ్‌పై తనిఖీ నిర్వహించి కోర్టుకు నివేదికను సమర్పించింది. ఈ క్రమంలో సింగరేణి యాజమాన్యం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదిక తమకే అనుకూలంగా ఉందని కోర్టుకు తెలిపింది. అయితే బాధితుల తరపు న్యాయవాది కాలుష్య మండలి నివేదికలో వాయు, ధ్వని, జల కాలుష్యం ఉందని శ్రవణ్ కోర్టుకు వివరించారు. అయితే కేంద్ర పర్యావరణ శాఖ ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేసేందుకు రెండు రోజులు సమయం కావాలని సుప్పీం కోర్టును కోరింది. దీంతో తదుపరి విచారణను సెప్టెంబర్ 5వ తేదికి వాయిదా వేస్తున్నట్లు సుప్రీం కోర్టు ప్రకటించింది. -
నల్ల సూర్యులకు నిరాశే!
సాక్షి, గోదావరిఖని(పెద్దపల్లి) : ఇన్‌కంటాక్స్ మాఫీ కోసం ఆశగా ఎదురుచూసి సింగరేణి కార్మికులకు ఈసారి బడ్జెట్లోనూ నిరాశే ఎదురైంది. భూమి పొరల్లోకి వెళ్లి నల్లబంగారాన్ని వెలికితీస్తూ దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి కార్మికులను సరిహద్దు సైనికులతో సమానంగా పరిగణించి ఇన్‌కంటాక్స్ రద్దు చేయాలనే డిమాండ్ రెండు దశాబ్దాలుగా నెరవేరడంలేదు. 48 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో చాలా మంది కార్మికులు ఇన్‌కంటాక్స్ రూపంలో యేటా నెల నుంచి రెండు నెలల వేతనం కేంద్ర ప్రభుత్వానికి తిరిగి చెల్లిస్తున్నారు. ప్రకృతికి విరుద్ధంగా బొగ్గు గనుల్లోకి వెళ్లి నల్ల బంగారాన్ని వెలికితీస్తున్న నల్లసూరీలకు ఇన్‌కంటాక్స్ మాఫీ లేకపోవడంతో అసంతృప్తికి గురవుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంపీ అభ్యర్థుల సింగరేణి ప్రాంతంలో జరిగిన ప్రచారంలో కార్మికులకు ఇన్‌కంటాక్స్ రద్దుపై హామీ ఇచ్చారు. ఈక్రమంలో ఈసారైన కేంద్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులపై కనికరం చూపుతుందని భావించారు. పార్లమెంట్లో శుక్రవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో బొగ్గుగని కార్మికుల ఊసే ఎత్తకపోవడంతో కార్మికులు నిరాశకు గురయ్యారు. అయితే గతేడాది రూ.3.50 లక్షల వరకు ఉన్న పన్ను మినహాయింపు పరిమితిని ఈసారి రూ.5 లక్షల వరకు పెంచడం కాస్త ఊరటనిచ్చే విషయం. ఈపరిమితి సంస్థలో 20 శాతం మందికి మాత్రమే వర్తిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. రూ.5 లక్షలు దాటితే టాక్స్.. గత ఆర్థిక సంవత్సరంలో ఇన్‌కంటాక్స్ మినహాయింపు పరిమితి రూ.3.50 లక్షలకు పెంచారు. రూ.3.50 లక్షల కన్నా ఎక్కువ ఆదాయం ఉంటే ఇన్‌కంటాక్స్ పరిధిలోకి తీసుకువచ్చారు. ఈసారి బడ్జెట్లో ఆ పరిమితిని రూ.5 లక్షలకు పెంచారు. రూ.5 లక్షలకన్నా ఒక్కరూపాయి ఎక్కువ ఆదాయం ఉన్నా మొత్తం పన్ను చెల్లించేలా నిర్ణయం ఉంటుందని అంటున్నారు. ‘ఏడాదంతా కష్టపడి సంపాదించిన జీతంలో ఏటా రెండు నెలలు జీతం ఇన్‌కంటాక్సే కడుతున్న. కష్టపడి పనిచేసినా ఫలితం లేకుండా పోతోంది. ఇన్‌కంటాక్స్ రద్దు హామీ.. హామీగానే మిగులుతుంది. ఈసారి బడ్జెట్లో అయినా హామీ నెరవేరుస్తారని భావించినం. కనీసం సింగరేణి కార్మికుల కోసం పరిధి పెంచుతారని అనుకున్నం. కానీ మళ్లీ నిరాశే మిగిలింది. ఏటా రూ.2 లక్షల వరకు ఇన్‌కంటాక్స్‌కే చెల్లిస్తున్న’ -వెంకటస్వామి ఓసీపీ–3 సీనియర్ ఈపీ ఆపరేటర్ నిరాశే మిగిల్చింది.. ఈసారి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ మాకు నిరాశే మిగిల్చింది. ఇన్‌కంటాక్స్ పూర్తిగా రద్దు చేస్తారని ఆశించినా కేంద్రం మొడిచేయే చూపింది. కనీసం సింగరేణి కార్మికులకైనా పన్న పరిమితి పెంచుతారని భావించాం. కేంద్రం నిర్ణయంతో ఏటా రూ.1.50 లక్షలు ఇన్‌కంటాక్స్‌కే చెల్లించాల్సి వస్తోంది. – కొంగర రవీందర్, ఈపీ ఆపరేటర్, ఓసీపీ–3, ఆర్జీ–2 కష్టపడిన సొమ్ము టాక్స్‌కే.. కష్టపడిన సొమ్మంతా ఇన్‌కంటాక్స్‌కు చెల్లిస్తున్నాం. యేటా నెలన్నర జీతం ఇన్‌కంటాక్స్‌కే చెల్లించాల్సి వస్తోంది. ఈవిషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని సింగరేణి కార్మికులకు మినహాయింపు ఇవ్వాలి. ప్రకృతికి విరుద్ధంగా పనిచేసే మా విషయంలో సానుకూలంగా ఆలోచించాలి. – వెంకట తిరుపతిరెడ్డి, ఈపీ ఆపరేటర్, మేడిపల్లి ఓసీపీ -
ఎస్‌సీసీఎల్‌కి మరో ప్రతిష్టాత్మక అవార్డు
సాక్షి, హైదరాబాద్ : సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్)కి మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. అమెరికాకు చెందిన బెర్క్ షైర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ వారు 2018 సంవత్సరానికిగానూ ఇండియాస్ బెస్ట్ కంపెనీ అవార్డుకు ఎస్‌సీసీఎల్‌ని ఎంపిక చేశారు. అద్భుతమైన వృద్ధిరేటుతోపాటూ అసాధారణమైన పనితీరుతో సింగరేణి కాలరీస్‌ని ఈ అవార్డుకు ఎంపిక చేశారు. మార్చి 8న ముంబైలో లీలా హోటల్ లో జరిగే కార్యక్రమంలో అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ మేరకు సింగరేణి సీఎండీ ఎన్ . శ్రీధర్ ను బెర్క్ షైర్ మీడియా సీఈవో హేమంత్ కౌశిక్ , వైస్ ప్రసిడెంట్ ఎమిలీ వాల్ష్ ఆహ్వానించారు. SCCL Wins prestigious " India's best company award ", awarded by US consultancy firm Berkshire Media https://t.co/7rGutPG6rw, for its amazing growth rate and extraordinary performance. pic.twitter.com/ibfj447paA — Singareni Public Relations (@PRO_SCCL) February 15, 2019 -
కార్మికులకు ఊరట
సింగరేణి(కొత్తగూడెం) : హైకోర్టు తీర్పు సింగరేణి కార్మికులకు ఊరట కలిగించింది. మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకునే కార్మికులకు యాజమాన్యం విధించిన రెండు సంవత్సరాల నిబంధన రద్దు చేయాలని, ఎలాంటి కొర్రీలు పెట్టకుండా అనారోగ్యంతో ఉన్న కార్మికులందరినీ ఇన్వాలిడేషన్ చేయాలని ఈ నెల 5న ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చినట్లు కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ఆ తీర్పును వెంటనే అమలు చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని కోరుతున్నాయి. అయితే తమకు ఎలాంటి సమాచారం లేదని సింగరేణి అధికారులు చెబుతున్నారు. ఆ నిబంధన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం.. ఈ నెల 5న ఇచ్చిన తీర్పులో అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికుడికి జబ్బు ఉందా లేదా అని నిర్ధారణ చేసుకున్న యాజమాన్యం వెంటనే ఇన్వాలిడేషన్ చేయకుండా, అతనికి రెండు సంవత్సరాల సర్వీసు ఉందా? ఉన్న జబ్బు ఎంత శాతం ఉంది? అనే నిబంధనలు విధించటం కార్మికులను వేధింపులకు గురిచేయటమే అవుతుందని, కానీ కార్మిక కుటుంబాలకు సహాయ కారిణి కాదని, ఇది రాజ్యాంగా స్ఫూర్తికి విరుద్ధమని, ఈ నిబంధనను పూర్తిగా కొట్టివేస్తున్నట్లు కోర్టు పేర్కొంది. రెండేళ్ల నిబంధనతో అన్యాయం ఎనిమిది నెలలక్రితం సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల నియామకాల స్థానంలో మెడికల్ ఇన్వాలిడేషన్తో కారుణ్య నియామకాల ప్రక్రియ ప్రారంభమైంది. కారుణ్యం తమకు ఆసరా అవుతుందని కార్మిక కుటుంబాలు ఆశపడ్డాయి. కానీ రెండేళ్ల సర్వీస్ నిబంధన విధించడంతో చాలా మంది కార్మికులు మెడికల్ ఇన్వాలిడేషన్కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత కోల్పోయారు. రెండేళ్లకు వారం, పదిరోజులు, పక్షంరోజులు తక్కువగా ఉన్నా, వారు తీవ్ర అనారోగ్యానికి గురైనప్పటికీ యాజమాన్యం మెడికల్ బోర్డుకు పిలవడంలేదు. ఈ క్రమంలో తమకు అన్యాయం జరుగుతోందని కొందరు కార్మికులు హైకోర్టును ఆశ్రయించారు. ఈక్రమంలో పుర్వపరాలు పరిశీలించిన పిదప యాజమాన్యంను తప్పుపడుతూ తీర్పు నిచ్చినిన్తూ రెండేళ్ల సర్వీసు నిబంధన సరైందికాదని, వెంటనే ఈ నిబంధనను ఉపక్రమించి కార్మికులకు న్యాయం చేయాలని ఆదేశించింది. -
‘సంస్కృతికి ప్రతిబింబం బతుకమ్మ’
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమని సింగరేణి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.కిషన్‌రావు అన్నారు. బుధవారం సింగరేణి భవన్లో జరిగిన సద్దుల బతుకమ్మ సంబరాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బతుకమ్మ పండుగను సింగరేణి కాలరీస్ ప్రాంతాల్లో ఈ ఏడాది వైభవంగా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఇలాంటి పండుగల ద్వారా ఉద్యోగుల్లో మరింత అంకిత భావం నెలకొనాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రజా కవి జయరాజును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ ప్రేమ్‌కుమార్, జనరల్ సెక్రటరీ రాజశేఖర్, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ బి.భాస్కర్ , సింగరేణి భవన్ ఉద్యోగులు పాల్గొన్నారు. -
సింగరేణి కార్మికులకు సీఎం వరాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి కార్మికులకు వరాల జల్లు కురిపించారు. సింగరేణి కార్మికుల లాభాల వాటాను ప్రతీ ఏటా పెంచుతూ వస్తున్న సీఎం కేసీఆర్.. ఈ ఏడాది కూడా వారికి శుభవార్త చెప్పారు. 2017-18సంవత్సరానికి గాను కార్మికులకు 2 శాతం లాభాల వాటాను పెంచారు. దీంతో గత ఏడాది 25శాతం లాభాల వాటా అందుకున్న కార్మికులు.. ఈ ఏడాది 27 శాతం వాటా అందుకోబోతున్నారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకెఎస్) గౌరవ అధ్యక్షురాలు, ఎంపీ కవిత నేతృత్వంలో కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్, టీబీజీకేఎస్ నాయకులు ప్రగతి భవన్ లో సీఎంతో సుమారు 45 నిమిషాలపాటు పలు అంశాలపై చర్చించారు. అనంతరం కార్మికుల లాభాల వాటా పెంచినందుకు సీఎంకు కవిత కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా ప్రకటించిన లాభాల వాటాను ఏయే తేదీల్లో కార్మికుల ఖాతాల్లో డిపాజిట్ చేయబోతున్నారన్న దానికి సంబంధించి స్పష్టమైన వివరాలేవి వెల్లడి కాలేదు. సీఎం నుంచి సింగరేణి సీఎండీ శ్రీధర్‌కు ఆదేశాలు జారీ అయిన వెంటనే ఆ వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే డిపెండెంట్ ఉద్యోగాలకు బదులు సింగరేణిలో కారుణ్య నియామకాలు కొనసాగుతున్నాయి. మెడికల్ అన్‌ఫిట్ అయ్యే కార్మికుల స్థానంలో వారి వారసులకు ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, ఈటల రాజేందర్, ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
6 ఏరియాలు.. వెనుకంజ
యైటింక్లయిన్‌కాలనీ (పెద్దపల్లి జిల్లా) : నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల సాధనకు మరో 48 రోజులు గడువు మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లో ఇప్పటి వరకు 55.59మిలియన్ టన్ను ల ఉత్పత్తి లక్ష్యం కాగా 50.16 మిలియన్ టన్నులు(90శాతం) మాత్రమే సాధించింది. ఉత్పత్తిలో వెనుకబడిం ది. సింగరేణి వ్యాప్తంగా ఆరు ఏరియాలు వెనకంజలో ఉన్నాయి. భూగర్భ గనులు ఎక్కువగా ఉండటానికి తోడు, ఓసీపీల్లో ఓబీ వెలికితీతలో జాప్యం జరగడం.. వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యా ల సాధనపై ప్రభావం చూపుతోంది. సంస్థలో అడ్య్రాల లాంగ్వాల్ ప్రాజెక్ట్ కేవలం 18 శాతమే బొగ్గు ఉత్పత్తి సాధించి సంస్థలోనే చివరిస్థానంలో నిలిచింది. 60శాతం ఉత్పత్తితో మందమర్రి ఏరియా చివరినుంచి రెండో స్థానంలో ఉంది. వేసవి కాలం అనుకూల ప్రభావం చూపేనా! ఓసీపీలు ఉన్న ఆర్జీ–2, శ్రీరాంపూర్, భూపాలపల్లి ఏరియాల్లో వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను చేరుకునే అవకాశం కన్పిస్తుండగా, భూగర్భగనులు అధికంగా ఉన్న మిగితా ఏరియాల్లో లక్ష్యాలను సాధించడం కొంచెం కష్టంగానే ముందుకు సాగే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. వేసవికాలం ఓసీపీల్లో ఉత్పత్తికి అనుకూలంగా ఉండే అవకాశం కన్పిస్తుండటంతో ఎలాగైనా వార్షిక లక్ష్యాలను సాధించాలని పట్టుదలతో అధికారులు, ఉద్యోగులు ముందుకు సాగుతున్నారు. వందశాతం ఉత్పత్తి లక్ష్యాల్లో.. సింగరేణి వ్యాప్తంగా నిర్దేశిత లక్ష్యాలను అధిగమించి ఆర్జీ–3 ఏరియా 115శాతం బొగ్గు ఉత్పత్తితో ముందంజలో నిలవగా, 105శాతం ఉత్పత్తితో రెండోస్థానంలో మణుగూరు, 103శాతం తో బెల్లంపల్లి మూడోస్థానంలో, వందశాతం ఉత్పత్తితో కొత్తగూడెం నాలుగోస్థానంలో నిలిచాయి. 97శాతంతో ఆర్జీ–1 ఐదోస్థానంలో ఉంది. ఉత్పత్తి వివరాలు లక్షల టన్నుల్లో.. (09.02.18 నాటికి) ఏరియా లక్ష్యం సాధించింది శాతం ఇల్లెందు 46.90 36.49 78 ఆర్జీ–2 61.83 56.14 91 ఏపీఏ 28.20 5.19 18 భూపాలపల్లి 32.66 28.23 86 మందమర్రి 40.15 24.04 60 శ్రీరాంపూర్ 46.32 40.68 88 -
వారసత్వ ఉద్యోగాలు సాధిద్దాం
కొత్తగూడెం : సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. సింగరేణిలో సమ్మె చేసైనా వారసత్వ ఉద్యోగాలు సాధిద్దామని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ తెలిపారు. సోమవారం పీవీకే 5ఇంక్లైన్ గనిలో హెచ్ఎంఎస్ పిట్ సెక్రెటరీ రాంశంకర్ కోరి ఆధ్వర్యంలో జరిగిన గేట్ మీటింగ్‌కు హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ హాజరై మాట్లాడారు. 2002 సంవత్సరంలో వారసత్వ ఉద్యోగాలు పూర్తిగా పోవుటకు ఒక్క ఏఐటీయూసీ నుంచి ఏడుగురు సంతకాలు పెట్టి పోగొట్టారన్నారు. ఈనెల 27వ తేదీన ఆర్ఎల్సీ దగ్గర వారసత్వంపై చర్చలు విఫలమైతే కార్మికులు సమ్మెకు సిద్ధంగా ఉండాలన్నారు. సమావేశంలో నాయకులు ఆంజనేయులు, నజీర్, అజీమ్, శ్రీనివాస్, క్రిష్ణమూర్తి, సుధాకర్, సహదేవ్, చిరంజీవి, దేవసహయం, రాము పాల్గొన్నారు.