
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పీడ్ పెంచింది. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, పలు అక్రమాలపై ప్రభుత్వం సీరియస్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే సింగరేణిలో జరిగిన పలు నియామకాల్లో అక్రమాలపై దృష్టి సారించింది. దీంతో, పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
వివరాల ప్రకారం.. సింగరేణిలో మెడికల్ ఇన్‌వాలిడేషన్ నియామకాల్లో అవకతవకలు జరిగినట్టు ఎండీ బలరాం తెలిపారు. ఈ క్రమంలో నియామకాల పేరుతో పలువురు ఉద్యోగులు డబ్బు వసూలు చేసినట్టు స్పష్టం చేశారు. దీంతో, ఇప్పటికే పలువురిని సింగరేణి యాజమాన్యం సస్పెండ్ చేసిందని చెప్పారు. ఇక తాజాగా, ఎండీ బలరాం సింగరేణి అంశంపై ఏసీబీకి లేఖ రాశారు. దీంతో, ఏసీబీ డీఎస్పీ రమేష్ నేతృత్వంలో విచారణ చేపట్టింది. సింగరేణిలో నియామకాలపై దర్యాప్తు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment