సాక్షి, హైదరాబాద్: సింగరేణి కాలరీస్–దక్షిణ మధ్య రైల్వే సంయుక్తంగా చేపట్టిన 54 కిలోమీటర్ల భద్రాచలం–సత్తుపల్లి రైల్వే లైన్ పనులు వచ్చే నెలాఖరుకు పూర్తయ్యేలా చూడాలని అధికారులను సింగరేణి డైరెక్టర్లు ఎన్.బలరామ్, డి.సత్యనారాయణరావు ఆదేశించారు. సంబంధిత కాంట్రాక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ లైన్ మార్గం పూర్తయితే పర్యావరణ హితంగా బొగ్గు రవాణా చేయడానికి అవకాశం ఉంటుందన్నారు.
సత్తుపల్లి వద్ద నిర్మిస్తున్న అతి పెద్ద సీహెచ్‌పీ నిర్మాణం కూడా మార్చికల్లా పూర్తి కావాలని స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 68 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవడానికి వీలుగా ఉపరితల గనుల్లో రోజూ 15 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్‌ను వెలికి తీయాలని ఓబీ కాంట్రాక్టర్లను డైరెక్టర్లు ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment