sattupalli
-
సత్తుపల్లి అమ్మాయి.. స్పెయిన్ అబ్బాయి
ఖమ్మం: వారి ప్రేమ ఖండాంతరాలు దాటి వివాహ బంధంతో ఏకమైంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన విద్యాభారతి కళాశాల డైరెక్టర్ మందడపు సత్యనారాయణ – సుజని దంపతుల కుమార్తె లావణ్య నాలుగేళ్లుగా స్పెయిన్ దేశంలోని బార్సిలోనలో ఓ కంపెనీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రంగంలో స్టాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. ఆమెకు అదే కంపెనీ సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన స్పెయిన్ దేశానికి చెందిన మార్క్ మన్సిల్లాతో మూడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారడంతో ఇరుపక్షాల తల్లిదండ్రులను పెళ్లికి ఒప్పించారు. సత్తుపల్లిలోని శ్రీసాయిబాలాజీ ఫంక్షన్ హాల్లో బుధవారం అర్ధరాత్రి 12.53 నిమిషా లకు ఈ ప్రేమ జంట పెళ్లితో ఒకటయ్యారు. ఇవి చదవండి: శ్రీలంక అమ్మాయి.. కరీంనగర్ అబ్బాయి ఒక్కటయ్యారు -
ఖమ్మంలో విషాదం.. రన్నింగ్ బస్సులో డ్రైవర్‌కు గుండెపోటు
ఖమ్మం: జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ కన్నుమూశాడు. సత్తుపల్లి నుంచి ఖమ్మం బయల్దేరిన బస్సులో డ్రైవర్ శ్రీనివాసరావుకు ఛాతీలో నొప్పి వచ్చింది. అయితే ఆయన ఆలస్యం చేయలేదు. ప్రయాణికులతో ఉన్న ఆ బస్సును వెంటనే పక్కకు ఆపారు. ఆపై దగ్గరిలోని ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. గుండెపోటుతోనే ఆయన కన్నుమూసినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరావు స్వస్థలం వేంసూరు మండలం రామన్నపాలెంగా తెలుస్తోంది. -
ఒక్కసారి ఆలోచించి ఓటు వేయండి..
-
ధరణి లేకుంటే రైతుబంధు డబ్బులకు ఇబ్బంది పడాల్సిందే
-
మంత్రి అంబటి రాంబాబుకు తప్పిన ప్రమాదం
సాక్షి, ఖమ్మం: మంత్రి అంబటి రాంబాబుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. మంత్రి రాంబాబు ప్రయాణిస్తున్న కారుపై లారీలో నుంచి గోధుమ బస్తా పడిపోయింది. దీంతో, కారు ముందు భాగం స్వల్పంగా దెబ్బతిన్నది. వివరాల ప్రకారం.. సత్తుపల్లి పట్టణ శివారులో మంత్రి అంబటి రాంబాబుకు తృటిలో ప్రమాదం తప్పింది. రాజమండ్రి వైపు నుండి ఖమ్మం వైపు వెళ్తున్న అంబటి రాంబాబు కాన్వాయ్‌పై లారీ నుండి గోధుమ బస్తాలు కిందపడిపోయాయి. ఈ ప్రమాదంలో అంబటి రాంబాబు కారు ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది. దీంతో, ఆయన మరో కారు ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇది కూడా చదవండి: చంద్రబాబు ఎప్పుడు నిజం చెప్పారు?.. నారా భువనేశ్వరికి అంబటి చురకలు -
లొల్లి చేస్తే దవడ పగలగొడతా: రేణుకా చౌదరి
సాక్షి, ఖమ్మం: ఖమ్మం జిల్లా సత్తుపల్లి కాంగ్రెస్‌లో టిక్కెట్ల పంచాయతీ తారాస్థాయికి చేరింది. బుధవారం జరిగిన వాగ్వాదం.. చివరకు కుర్చీలు విసురుకొని కొట్టుకునే వరకు వచ్చింది. ఈ గొడవతో చిర్రెత్తుకొచ్చిన సీనియర్ నేత రేణుకా చౌదరి.. దవడ పగలకొడతానంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించి బుధవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో రసాభస నెలకొంది. మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరితో పాటు అబ్జర్వర్ మహ్మద్ అరిఫ్ ఖాన్,సత్తుపల్లి టికెట్ ఆశిస్తున్న మట్టా దయానంద్, మానవతారాయ్ హాజరయ్యారు. ఈ క్రమంలో మట్టా దయానంద్, మానవతరాయ్ వర్గాలకు సంబంధించిన అనుచరులు తమ నేతకు టికెట్ కేటాయించాలంటే తమ నేతకు టికెట్ కేటాయించాలని పోటాపోటీ నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన తమకే టికెట్ రావాలని మానవతారాయ్ వర్గానికి సంబంధించిన అనుచరులు అబ్జర్వర్ మహ్మద్ అరిఫ్ ఖాన్‌ను కోరారు. అటు మట్ట దయానంద్ వర్గం కూడా తమకే టికెట్ కేటాయించాలని సూచించడంతో పరస్పరం రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.. రెండు వర్గాలు ఒకరికొకరు కుర్చీలు విసురుకోవడంతో కొందరు కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి..తో సమావేశం మధ్యలో నుంచే రేణుక చౌదరి వెళ్లిపోయారు. అనంతరం ఆమె ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాయలంలో ప్రెస్ మీట్ పెట్టారు. ‘‘కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లో ఇంకోసారి గొడవపడితే ఊరుకోం. గొడవపడితే నేనే దవడ పగలకొడతా. కార్యకర్తల బలంలేని నాయకులే ఎక్కువగా మొరుగుతారు’’ అంటూ తీవ్ర స్థాయిలో గ్రూప్ రాజకీయాలపై మండిపడ్డారామె. మరోవైపు ఇప్పటికే సత్తుపల్లి కాంగ్రెస్‌లో నాలుగు గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారు టికెట్ ఆశిస్తున్నారు. కొండూరు సుధాకర్, మానవతారాయ్, మాజీ మంత్రి సంబాని చంద్రశేఖ, మట్టా దయానంద్ టికెట్ తనకొస్తుందంటే తనకొస్తుందని ధీమాతో ఉన్నారు. చదవండి: కిషన్‌రెడ్డి నిరాహార దీక్ష.. కేసీఆర్‌పై సీరియస్ -
బేగంపేట సభా వేదికపై ప్రధాని మోదీ
-
హైదరాబాద్ నుంచి కొందరు రెచ్చగొడుతున్నారు: ప్రధాని మోదీ
PM Modi RFCL Visit: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రామగుండం పర్యటన అప్డేట్స్ 04: 39 PM రామగుండం బహిరంగ సభలో మోదీ ప్రసంగం ►సోదర, సోదరీమణులకు నమస్కారాలంటూ ప్రధాని మోదీ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు ►ఈ సభకు వచ్చిన రైతులందరికీ నమస్కారాలు ►70 నియోజకవర్గాల్లో రైతు సోదరులు ప్రసంగం వింటున్నారు ►ఈ ఒక్కరోజే 10 వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం ►రైల్వేలు, రోడ్ల విస్తరణతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ►గత రెండున్నరేళ్లుగా కరోనాతో పోరాడుతున్నాం ►సంక్షోభంలోనూ ఆత్మవిశ్వాసంతో అడుగులు వేశాం ►కష్టకాలంలోనూ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాం ►గత 8 ఏళ్లలో దేశం రూపురేఖలు మారిపోయాయి ►అభివృద్ధి పనుల మంజూరులో వేగం పెంచాం ►నిరంతరం అభివృద్ధి కోసమే తపిస్తున్నాం ►ఎరువులు కోసం గతంలో విదేశాలపై ఆధారపడేవాళ్లం ►రైతులు లైన్లలో నిలబడేవాళ్లు, లాఠీ దెబ్బలు తినేవారు ►ఇప్పుడు ఈ ఫ్యాక్టరీతో ఎరువులు కొరత తీరుతుంది ►ఎరువులు కోసం గతంలో విదేశాలపై ఆధారపడేవాళ్లం ►టెక్నాలజీ అప్‌గ్రేడ్ కాకపోవడంతో గతంలో ఈ కంపెనీ మూతపడింది ►కొత్త టెక్నాలజీతో కంపెనీ పునఃప్రారంభమయింది ►సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు. ►బొగ్గు గనులపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు ►హైదరాబాద్ నుంచి కొందరు రెచ్చగొడుతున్నారు ►పదేపదే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ►సింగరేణిలో 51 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానిదే ►కేంద్రం వాటా 49 శాతం మాత్రమే ►ప్రైవేటీకరణ చేసే అధికారం కేంద్రానికి ఉండదు 04: 22 PM భద్రాచలం రోడ్-సత్తుపల్లి రైల్వేలైన్‌ను ప్రారంభించిన ప్రధాని భద్రాచలం రోడ్-సత్తుపల్లి రైల్వేలైన్‌ను వర్చువల్‌గా ప్రధాని మోదీ ప్రారంభించారు. కాగా, రూ.990 కోట్లతో 54.10 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మాణం చేపట్టారు. అలాగే, మెదక్-సిద్దిపేట-ఎల్కతుర్తి, బోధన్-బాసర-భైంసా, సిరోంచా-మహదేవ్పూర్ హైవే విస్తరణ పనులకు మోదీ శంకుస్థాపన చేశారు. ఇక, రూ.2,268 కోట్లతో మూడు జాతీయ రహదారుల నిర్మాణాలు జరుగనున్నాయి. 04: 07 PM ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేసిన ప్రధాని ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్‌ను ప్రధాని మోదీ సందర్శించారు. ఆయన వెంట గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఉన్నారు. ఎరువుల ఫ్యాక్టరీని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. రూ.6,338 కోట్లతో ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణ జరిగింది. 03: 49 PM ► రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పరిశీలించిన ప్రధాని మోదీ 03: 09 PM ► రామగుండం చేరుకున్న ప్రధాని మోదీ 2:47 PM ప్రధాని నరేంద్ర మోదీ రామగుండం బయలుదేరారు. కాసేపట్లో రామగుండం చేరుకోనున్నారు. 2:28 PM రామగుండం బయల్దేరిన ప్రధాని మోదీ ప్రధాని నరేంద్ర మోదీ రామగుండం బయలుదేరారు. కాసేపట్లో RFCL(Ramagundam Fertilizers and Chemicals Limited) ప్లాంట్ సందర్శించి.. జాతికి అంకితం చేస్తారు. వర్చువల్‌గా.. భద్రాద్రికొత్తగూడెం జిల్లా కొత్తగూడెం (భద్రాచలం రోడ్) రైల్వే స్టేషన్- సత్తుపల్లి వరకు నిర్మించిన రైల్వే లైన్‌ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 1:20PM బేగంపేట సభావేదిక.. ప్రధాని నరేంద్ర మోదీ స్పీచ్ ►భారత్ మాతాకీ జై అంటూ మోదీ ప్రసంగం ప్రారంభం ►తెలంగాణ అభివృద్ధిలో పాల్గొనడం సంతోషకరంగా ఉంది ►తెలంగాణ బీజేపీ కార్యకర్తలు పోరాటం చేస్తున్నారు ►తెలంగాణ కార్యకర్తలతో నేనెంతో ప్రభావితం అయ్యాను ►మీరు ఒక యుద్ధం చేస్తున్నారు..ఒక పోరాటం చేస్తున్నారు ►తెలంగాణ పేరుతో కొందరు అధికారం పొంది తమ జేబులు నింపుకుంటున్నారు ►తెలంగాణలో త్వరలోనే అంధకారం పోతుంది ►తెలంగాణకు త్వరలోనే సూర్యోదయం రాబోతుంది ►తెలంగాణలో ప్రతిభావంతులను వెనుకబడేస్తున్నారు ►తెలంగాణ ప్రజలకు మీ నాయకులు అన్యాయం చేస్తున్నారు ►ఎప్పుడు చీకటి కమ్ముకుంటుందో.. నాలుగు దిక్కుల నుంచి చిమ్మచీకట్లు ముసురుకుంటాయో అటువంటి సమయంలోనే కమలం వికసిస్తుంది ►బీజేపీ కార్యకర్తల పోరాటంతో తెలంగాణలో చీకట్లు తొలగిపోవడం ప్రారంభమైంది ►మునుగోడులో బీజేపీ కార్యకర్తల పోరాటం ఎంతో అభినందనీయం ►గత కొన్ని రోజులుగా జరిగిన ఉప ఎన్నికల్లో ఒకే విషయం స్పష్టమవుతోంది ►కష్టకాలంలో కూడా మా పార్టీని తెలంగాణ ప్రజలు వదిలిపెట్టలేదు ►1984లో బీజేపీ కేవలం ఇద్దరు ఎంపీలే ఉన్నప్పుడు.. తెలంగాణలో హన్మకొండ నుంచి జంగారెడ్డిని గెలిపించారు ►హైదరాబాద్ ఇన్ఫరేషన్ టెక్నాలజీకి కోట లాంటింది ►తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే మూడ నమ్మకాలను ప్రోత్సహిస్తోంది ►తెలంగాణ ప్రజలకు మాటిస్తున్నా.. అవినీతి ప్రభుత్వాన్ని కూలదోస్తాం ►కొందరు భయంతో మోదీని బూతులు తిడుతున్నారు ►ఆ బూతులను నేను పట్టించుకోను ►బీజేపీ కార్యకర్తలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ►నన్ను తిట్టినా పట్టించుకోను కానీ..తెలంగాణ ప్రజలను తిడితే ఊరుకునేది లేదు ►తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే సహించేది లేదు ►పరిణామాలు తీవ్రంగా ఉంటాయి ►తెలంగాణ ప్రజల ఆకాంక్షలతో ఆడుకుంటే ప్రతిఫలం తప్పదు ►తెలంగాణలో ప్రధానిమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు నిర్మించకుండా అడ్డుకున్నారు ►డబుల్ బెడ్రూమ్ పేరుతో ఇళ్లు ఇస్తామని మోసం చేశారు ►బీజేపీ యువకుల పార్టీ.. పేదలకు అనుకూలంగా పాలన చేసే పార్టీ ►తెలంగాణను కుటుంబ పాలన, అవినీతి నుంచి విముక్తి చేయడం మా బాధ్యత 1:14 PM కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పీచ్ ►తెలంగాణ ప్రభుత్వానికి కనీస మర్యాద లేదు ►ప్రధాని తెలంగాణకు వస్తే ప్రభుత్వం మర్యాద పాటించలేదు ►దేశంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి లేదు ►సీఎం కేసీఆర్‌ది నిజాం రాజ్యాంగం ►సీఎం కేసీఆర్ వైఖరితో తెలంగాణకు నష్టం జరుగుతోంది ►తెలంగాణ ముఖ్యమంత్రికి అభివృద్ధి పట్టదు ►తెలంగాణ.. కుటుంబ పాలనలో బందీ అయ్యింది ►రాష్ట్రంలో కుటుంబ, రాచరిక పాలన నడుస్తోంది 01:12 PM ► షెడ్యూల్ కంటే ముందుగానే ప్రధాని మోదీ హైదరాబాద్‌కు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ బయట బీజేపీ ఏర్పాటు చేసిన స్వాగత సభ వేదికపైకి చేరుకున్న ప్రధాని మోదీ. కార్యక్రమంలో వేదికపై మంత్రి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్, డాక్టర్ లక్ష్మణ్, రాజగోపాల్‌రెడ్డి, పొంగులేటి, డీకే అరుణ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా శ్రీరాముడు-మోదీతో కూడిన ఓ చిత్రపటాన్ని ప్రధాని మోదీకి బహూకరించిన బీజేపీ శ్రేణులు. 12:49 PM ► బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు ప్రధాని మోదీ.. స్వాగతం పలికిన గవర్నర్, మంత్రి తలసాని, బీజేపీ శ్రేణులు 12:46 PM ► కాసేపట్లో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కి ప్రధాని మోదీ 12:40 PM ► ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు గవర్నర్ తమిళిసై బేగంపేటకు చేరుకున్నారు. ► ప్రధాని మోదీ రాక నేపథ్యంలో.. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు బీజేపీ శ్రేణులు భారీ ఎత్తున్న చేరుకుంటున్నాయి. ► తెలంగాణలోని రామగుండం పర్యటనలో భాగంగా.. దేశంలో వ్యవసాయ రంగానికి కావాల్సిన యూరియా డిమాండ్‌ను తీర్చేందుకు పునరుద్ధరించిన ఆర్ఎఫ్సీఎల్(రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్) ప్లాంటును ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఏటా 12.7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను ఈ పరిశ్రమ ఉత్పత్తి చేయనుంది. ► రామగుండం వేదికగానే.. దాదాపు రూ.1000 కోట్లతో నిర్మించిన భద్రాచలం రోడ్–సత్తుపల్లి రైల్వే లైన్‌ను దేశ ప్రజలకు అంకితం చేయనున్నారు. ► దాదాపు రూ.9,000 కోట్ల పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. వీటిలో ఎన్‌హెచ్ 765 డీజీకి చెందిన మెదక్–సిద్దిపేట–ఎల్కతుర్తి సెక్షన్, ఎన్ హెచ్ 161 బీబీకి చెందిన బోధన్– బాసర–భైంసా సెక్షన్, ఎన్‌హెచ్ 353సీకి చెందిన సిరోంచా– మహాదేవపూర్ సెక్షన్లున్నాయి. ► తెలంగాణలోని రామగుండం పర్యటన కోసం దేశ ప్రధాని నరేంద్ర మోదీ శనివారం హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు ముందుగా చేరుకుంటారు. ► ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. బేగంపేట పరిసరాల్లో 1,500 మంది పోలీసులను మోహరించారు. మరో 100 కేంద్ర బలగాలు నిఘా నిర్వహిస్తున్నాయి. ► ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో.. హైదరాబాద్ బేగంపేట పరిసరాల్లో మధ్యాహ్నాం 12 గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. ► ఆంధ్రప్రదేశ్‌లో పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు వస్తున్న ప్రధాని మోదీ.. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించనున్నారు. ఆపై అక్కడి నుంచే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. 12:25 PM ► ఏపీ విశాఖలో ముగిసిన ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన.. హైదరాబాద్‌కు ప్రయాణం అయ్యారు. పర్యటన సాగేదిలా.. ► ముందుగా బేగంపేట ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు. ► ఎయిర్ పోర్ట్ బయట ఏర్పాటు చేసిన స్వాగత సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. ► ఆపై రామగుండం బయలుదేరతారు. ► RFCL(Ramagundam Fertilizers and Chemicals Limited) ప్లాంట్ సందర్శించి.. జాతికి అంకితం చేస్తారు. ► వర్చువల్‌గా.. భద్రాద్రికొత్తగూడెం జిల్లా కొత్తగూడెం (భద్రాచలం రోడ్) రైల్వే స్టేషన్- సత్తుపల్లి వరకు నిర్మించిన రైల్వే లైన్‌ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ► అనంతరం రామగుండంలో నిర్వహించే సభలో ప్రసంగిస్తారు. ► కార్యక్రమం ముగించుకుని.. రామగుండం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరుతారు. ► సాయంత్రం బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుని.. ఢిల్లీకి తిరుగు పయనం అవుతారు -
పట్టించుకోవట్లేదని ప్రియుడి కళ్లలో కారం కొట్టింది!
ఖమ్మం: జిల్లాలోని సత్తుపల్లి పట్టణంలో చోద్యం చోటుచేసుకుంది. స్థానికంగా బిర్యానీ సెంటర్ నడుపుతున్న ఒక వ్యక్తిపై.. ఓ మహిళ కారం పొడితో దాడికి పాల్పడింది. అయితే దాడికి పాల్పడింది అతని ప్రియురాలే అని సమాచారం. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం మల్లేశ్వరం గ్రామానికి చెందిన యువరాజు.. సత్తుపల్లిలో ధమ్ బిర్యానీ సెంటర్ నడుపుతున్నాడు. అతని భార్య కస్తూరి స్వగ్రామంలోనే ఉంటుంది. ఈ క్రమంలో యువరాజు తన హోటల్లో పనిచేస్తున్న సత్వవతి అనే మహిళతో మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. అయితే కొన్నిరోజులుగా ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో బిర్యానీ సెంటర్ దగ్గరికి వచ్చి మరీ కారం పొడితో దాడి చేసింది సత్యవతి. తన వల్లే యువరాజు ఈ స్థాయికి వచ్చాడని, అలాంటి తననే ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తున్నాడంటూ సత్యవతి ఆందోళన చేపట్టింది. అడ్డుకోవడానికి ప్రయత్నించిన కొందరిపైనా ఆగ్రహం వెల్లగక్కింది. పైగా డబ్బులు మొత్తం అతని భార్య పిల్లలకే పంపిస్తున్నాడంటూ గోల చేసింది. ఈ క్రమంలో ఇరువురు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. -
వచ్చే నెలలో భద్రాచలం– సత్తుపల్లి రైల్వే లైన్ పూర్తి
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కాలరీస్–దక్షిణ మధ్య రైల్వే సంయుక్తంగా చేపట్టిన 54 కిలోమీటర్ల భద్రాచలం–సత్తుపల్లి రైల్వే లైన్ పనులు వచ్చే నెలాఖరుకు పూర్తయ్యేలా చూడాలని అధికారులను సింగరేణి డైరెక్టర్లు ఎన్.బలరామ్, డి.సత్యనారాయణరావు ఆదేశించారు. సంబంధిత కాంట్రాక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ లైన్ మార్గం పూర్తయితే పర్యావరణ హితంగా బొగ్గు రవాణా చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. సత్తుపల్లి వద్ద నిర్మిస్తున్న అతి పెద్ద సీహెచ్‌పీ నిర్మాణం కూడా మార్చికల్లా పూర్తి కావాలని స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 68 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవడానికి వీలుగా ఉపరితల గనుల్లో రోజూ 15 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ను వెలికి తీయాలని ఓబీ కాంట్రాక్టర్లను డైరెక్టర్లు ఆదేశించారు. -
రైతు పక్షపాతిగా సీఎంలు జగన్, కేసీఆర్: ఆర్.నారాయణమూర్తి
సత్తుపల్లి: ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్.జగన్మోహన్రెడ్డి, కె.చంద్రశేఖర్‌రావు రైతు పక్షపాతిగా అనేక పథకాలు అమలు చేస్తున్నారని సినీ నటుడు, దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తి కొనియాడారు. వీరి తరహాలోనే ఢిల్లీ, కేరళ సీఎంలు కూడా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇటీవల ఆయన నటించి, నిర్మించిన రైతన్న సినిమా విడుదల సందర్భంగా గురువారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో నారాయణమూర్తి పర్యటించారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రైతుబీమా, రైతుబంధు, ఉచిత విద్యుత్ వంటి మంచి పథకాలతో రైతులకు మేలు చేస్తున్న సీఎంలను ఎవరూ మరువలేరని తెలిపారు. కాగా, ముప్ఫైఆరేళ్లుగా తాను అనేక సినిమాలు తీశానని తన సినిమాలను చూడాలని ఎప్పుడూ కోరలేదని తెలిపారు. అయితే, కేంద్రప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు వరాలు కాదు..శాపాలని చెప్పేందుకే రైతన్న సినిమా తీశానని వెల్లడించారు. ఈ సినిమా ప్రజల్లో వెళ్లాలని, రైతుల కష్టాలను అందరూ గుర్తించాలనే భావనతో ప్రచారం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
పెరుగుతున్న నిరుద్యోగం: ‘ఆయా పోస్టు కూడా మేం చేస్తామయ్యా..’
సత్తుపల్లి టౌన్ : చిన్నపిల్లలను ఇంటి నుంచి తీసుకురావడం.. వారి ఆలనాపాలనా చూస్తూనే పౌష్టికాహారం వండిపెట్టడం.. ఆ తర్వాత ఇంటి వద్ద వదలడం.. ఇవీ అంగన్వాడీ కేంద్రాల్లో ఆయాల విధులు. ఈ పోస్టుకు కనీస విద్యార్హత పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కానీ ఇటీవల జిల్లాలోని కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తే పెద్దసంఖ్యలో దరఖాస్తులు రాగా.. ఇందులో ఉన్నత విద్యావంతులు కూడా ఉండడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. చదవండి: టీఆర్ఎస్ మీటింగ్‌ల్లో పస లేదు.. నాకే బ్రహ్మరథం ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు రాకపోవడం.. ఒకవేళ వచ్చినా కుటుంబాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి లేని కారణంగా ఉన్న ఊరిలోనే పనిచేయొచ్చనే భావనతో ఈ పోస్టుకు పోటీపడుతున్నట్లు దరఖాస్తులు చెబుతున్నారు. అసలు ఈపోస్టుకు అర్హత ఏమిటంటే.. అంగన్వాడీ ఆయా పోస్టుకు పదో తరగతి ఉత్తీర్ణులైన మహిళలు మాత్రమే అర్హులు, అంగన్వాడీ కేంద్రం పరిధిలోని చిన్నారులను కేంద్రానికి తీసుకురావటం, ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా వంట సిద్ధం చేసి చిన్నారులతో పాటు బాలింతలు, గర్భిణులకు వడ్డించడం వీరి విధి. ఆ తర్వాత కేంద్రాన్ని శుభ్రం చేయటం, పనివేళలు ముగిశాక పిల్లలను ఇంటివద్దకు పంపించి రావాల్సి ఉంటుంది. గతంలో ఆయాలకు నెలకు రూ.6వేల వేతనం ఇస్తుండగా, పీఆర్సీ అమలుతో ఈ వేతనం రూ.7,800కు పెరగనుంది. ఫలితంగా చిన్న పోస్టులో పని ఎలా ఉంటుందనే భావన పక్కన పెట్టి ఉన్నత విద్యావంతులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. 120 పోస్టుల భర్తీకి దరఖాస్తులు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 120 పోస్టులు భర్తీ చేసేందుకు అధికారులు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. ప్రాజెక్టుల వారీగా దరఖాస్తుల పరిశీలన, అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలించాక జాబితా తయారీలో నిమగ్నమయ్యారు. దరఖాస్తుదారుల్లో అర్హులను కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ఈనెల మొదటి వారంలో ఎంపిక చేయనుంది. అయితే, పరిశీలన సందర్భంగా అధికారులు కొందరి దరఖాస్తులు, సర్టిఫికెట్లను చూసి విస్తుపోయారు. దరఖాస్తుదారుల్లో పలువురు డిగ్రీ, పీజీ పూర్తిచేసి ఉండడంతో ఆశ్చర్యపోయిన వారు వివరాలు ఆరా తీశారు. వేతనం తక్కువైనా సరే.. సొంతూరిలో పనిచేసే అవకాశం ఉండడానికి తోడు కేంద్రంలోని ఇతర పిల్లలతో పాటు తమ పిల్లల ఆలనాపాలనా కూడా చూసుకోవచ్చనే భావనతో ఆయా పోస్టుకు దరఖాస్తు చేసుకున్నట్లు పలువురు చెప్పారని సమాచారం. అంతేకాకుండా ఇతర ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రాకపోవడం, ఒకవేళ నోటిఫికేషన్ వచ్చి ఎంపికైనా పోస్టింగ్ ఎక్కడ వస్తుందోనన్న భావనతో వెనుకడుగు వేస్తున్నారని తెలుస్తోంది. ఇలా రకరకాల కారణాలతో అంగన్వాడీ కేంద్రాల్లో గరిటె తిప్పేందుకు ఉన్నత విద్యావంతులు సిద్ధమైనట్లు చెబుతున్నారు. చదవండి: యువ రైతు కన్నీటి వ్యథ: 13 ఎకరాల్లో పంట నీట మునక.. తట్టుకోలేక కుటుంబాన్ని వదిలి వెళ్లలేక.. నేను ఎంబీఏ పూర్తి చేసి ఆరేళ్లు అయింది. నా భర్త సురేష్ వ్యవసాయం చేస్తాడు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూలి పనులు చేయలేను. అలాగని కుటుంబానికి దూరంగా ఉద్యోగానికి వెళ్లలేను. అందుకే అందుబాటులో ఉన్న ఆయా పోస్టుకు దరఖాస్తు చేసుకున్నా. ఇక్కడైతే నా పిల్లలతో పాటు కేంద్రానికి వచ్చే పిల్లల ఆలనాపాలనా చూసుకునే అవకాశం లభిస్తుంది. ఈ పోస్టు వస్తే అదృష్టంగా భావిస్తా. - హెచ్చు కల్పన, కాకర్లపల్లి, సత్తుపల్లి మండలం సొంతూరిలో ఉండొచ్చని... ఎమ్మెస్సీ కెమిస్ట్రీ పూర్తిచేశా. నా భర్త వీరబాబు ఉపాధిహామీ పథకంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. మాకు ఇద్ద రు కుమారులు. మాది పేద కుటుంబమైనందున ఆయా పోస్టు చిన్నదా, పెద్దదా అని చూడలేదు. సొంత ఊళ్లో ఉపాధి లభిస్తుందని మాత్రమే ఆలోచించా. - నడ్డి కృష్ణవేణి, కాకర్లపల్లి, సత్తుపల్లి మండలం ఏర్పాట్లు చేస్తున్నాం.. శనివారం నుండి బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలని ఆదేశాలు అందాయి. కలెక్టర్ గౌతమ్, అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్ ఆదేశాలతో మండల కేంద్రాలకు చీరలు పంపించాం. అక్కడి నుంచి తహసీల్దార్ల పర్యవేక్షణలో గ్రామపంచాయతీలకు పంపిస్తాం. ఆహారభద్రత కార్డులో పేరు ఉండి 18 ఏళ్లు పైబడిన మహిళలందరికీ చీరలు అందిస్తాం. - ఎం.విద్యాచందన, డీఆర్డీఓ శుభ పరిణామం.. ఆయా పోస్టులకు ఉన్నత విద్యావంతులు కూడా దరఖాస్తు చేసుకోవటం శుభపరిణా మం. యూజీ, పీజీ పూర్తిచేసిన వారు ఎంపికైతే చిన్నారులకు ప్రీ స్కూల్ కార్యక్రమాలు టైం టేబుల్ ప్రకారం అందించడానికి ఉపయోగపడుతుంది. అలాగే, వర్క్‌బుక్స్ కూడా చదివించడం, రాయించడం, మెరుగైన విద్య అందించేందుకు దోహదం చేస్తాయి. - సీహెచ్ సంధ్యారాణి, ఐసీడీఎస్ పీడీ, ఖమ్మం -
Photo Feature: కారు గాలికి కొట్టుకుపోయింది..
రోడ్డుపై ఎదురుగా వచ్చిన వాహనం బలంగా ఢీకొడితే ఇలా జరిగిందా? ప్రమాదవశాత్తు బోల్తా పడిపోయిందా?.. అనేది సందేహమా?. ఇది ఈదురుగాలులు సృష్టించిన బీభత్సం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో మంగళవారం రాత్రి వీచిన ఈదురుగాలులకు స్థానిక డాక్టర్ అపార్ట్మెంట్లో పార్కింగ్ చేసిన వేముల మల్లికార్జున్‌రావు కారు గాలికి కొట్టుకుపోయి ఇలా బోల్తాపడింది. -
4 నెలలు 116 కిలోమీటర్లు
సాక్షి, హైదరాబాద్: సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ఏడాది వానాకాలంలో ఎట్టిపరిస్థితుల్లోనూ నీటిని ఎత్తిపోయాలని భావిస్తున్న ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా ఆయకట్టు ప్రాంతం ఎక్కువగా ఉన్న సత్తుపల్లి ట్రంక్ కెనాల్ పనులను శరవేగంగా చేయించే పనిలో పడింది. సీతారామ లోని మూడు పంప్‌హౌస్‌లు పూర్తయినా... ప్రధాన కాల్వ పరిధిలో పెద్దగా ఆయకట్టు లేనందున ఎత్తి పోతలు మొదలుపెట్టినా ఉపయోగం ఉండదు. కాబట్టి సత్తుపల్లి ట్రంక్ కెనాల్ కింద నిర్ణయించిన ఆయకట్టులో లక్ష ఎకరాలౖకైనా నీటిని అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే కేవలం నెల రోజుల కిందటే ఈ కెనాల్ పనులు మొదల య్యాయి. దానికి తోడు భూసేకరణలో ఇబ్బం దులు, కోర్టు కేసులు, తీవ్రరూపం దాల్చుతున్న ఎండలు ఇరిగేషన్ శాఖకు పరీక్ష పెడుతున్నాయి. సవాల్ విసురుతున్న సమస్యలు సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నుంచి 70 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తూ 6.74 లక్షల ఎకరాలకు నీరందించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే 114 కిలోమీటర్ల ప్రధాన కాల్వతోపాటు 3 పంప్‌హౌస్‌ల నిర్మాణం చేస్తున్నారు. ఈ ప్రధాన కాల్వ పనులు పూర్తి కావస్తున్నాయి. మొదటి, రెండో పంప్ హౌస్‌లో ఆరేసి మోటార్లు ఉండగా, వీటన్నింటినీ సిద్ధం చేశారు. మూడో పంప్‌హౌస్‌లో 4 మోటార్లు సిద్ధం కాగా, మరో 3 మోటార్ల బిగింపు ప్రక్రియ కొనసాగుతోంది. మే చివరికి పంప్‌హౌస్‌లన్నీ సిద్ధం చేయనున్నారు. అయితే ఈ ప్రధాన కాల్వ పరిధిలో పెద్దగా ఆయకట్టు లేని దృష్ట్యా.. మూడో పంప్‌హౌస్ దిగువ నుంచి 116.70 కి..మీ. సత్తుపల్లి ట్రంక్ కెనాల్ పనులను 4 ప్యాకేజీలుగా విభజించి రూ.1,238 కోట్లతో చేపట్టారు. ఈ కెనాల్ పూర్తయితే సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజక వర్గాల్లో 1.24 లక్షల ఎకరాల నూతన ఆయకట్టుకు నీరందడంతోపాటు మరో 22 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. అయితే కెనాల్ తవ్వేందుకు మొత్తం 1,639 ఎకరాల భూ సేకరణ జరగాల్సి ఉండగా, 976 ఎకరాల మేర అవార్డు అయ్యింది. ఇందులో 898 ఎకరాలకు సంబంధించి రూ.31 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇక 1,202 ఎకరాల అటవీ భూములు అవసరం ఉండగా, ఈ భూమి ఇప్పటికే ఇరిగేషన్ శాఖకు బదిలీ అయింది. ఈ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని నెల రోజుల కిందట నిర్వహించిన సమీక్ష సందర్భంగా సీఎం ఆదేశించడంతో పనులు వేగిరమయ్యాయి. ఇంకా కోటి క్యూబిక్ మీటర్ల మట్టిపని ముఖ్యంగా అటవీ భూములు ఉన్న చోట్ల పనులు వేగిరం చేశారు. ఇప్పటికే కెనాల్‌లోని ప్యాకేజీ– 9లో 8 లక్షల క్యూబిక్ మీటర్లు, ప్యాకేజీ–10లో 4 లక్షలు, ప్యాకేజీ–12లో 6 లక్షల క్యూబిక్ మీటర్ల మేర మట్టి పని పూర్తి చేశారు. ప్యాకేజీ–11 పనులు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. అయిన ప్పటికీ మరో కోటి క్యూబిక్ మీటర్లకు పైగా మట్టి పని చేయాల్సి ఉంది. ఈ పనులను మరింత వేగి రం చేయాలన్న ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్‌కుమార్ ఆదేశాల మేరకు సీఈ శ్రీనివాస్‌రెడ్డితో పాటు ఇతర ఇంజనీర్లంతా క్షేత్రస్థాయిలోనే ఉంటూ ఏజెన్సీలతో సమన్వయం చేస్తూ మిషనరీని పెంచి పనులు చేయిస్తున్నారు. అయితే ఎండలు మండిపోతుండటం పనులపై ప్రభావం చూపు తోంది. ఇక దీనికి తోడు భూసేకరణ కాని చోట్ల పనులు ఇంకా మొదలవ్వలేదు. భూసేకరణ బాధ్యతను నెత్తికెత్తుకున్న ప్రాజెక్టు ఇంజనీర్లు రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుం టున్నారు. అయితే భూసేకరణ బిల్లుల చెల్లిం పుల్లో జాప్యం సైతం ఆటంకాలు సృష్టిస్తోంది. వీటికి తోడు చాలా చోట్ల కెనాల్ చిన్నచిన్న వాగులను దాటాల్సి వస్తోంది. ఈ వాగులు దాటే క్రమంలో అనేక స్ట్రక్చర్ల నిర్మాణం చేయాల్సి ఉంది. ఈ సమస్యల మధ్య సత్తుపల్లి కెనాల్ పనులు పూర్తి చేయడం ప్రాజెక్టు ఇంజనీర్లకు పెద్ద సవాల్‌గానే మారనుంది. -
చీపుర్లు పట్టిన టీచర్లు
సత్తుపల్లి టౌన్:పారిశుద్ధ్య కార్మికులు లేకపోవడంతో సత్తుపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో చెత్తా చెదారం పేరుకుపోయింది. గురువారం ఉదయం వచ్చిన ఇద్దరు మహిళా ఉపాధ్యాయులు అది చూసి మాకెందుకులే అనుకోలేదు.. చీపుర్లు పట్టి పాఠశాల ప్రాంగణాన్ని ఊడ్చి శుభ్రం చేశారు. దీనిపై పీఆర్టీయూ రాష్ట్ర నేత చిత్తలూరి ప్రసాద్ మాట్లాడుతూ.. చాలా పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్మికులు లేకపోవటంతో పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయన్నారు. దీంతో ఉపాధ్యాయులే చీపుర్లు పట్టి శుభ్రం చేసుకోవాల్సిన దుస్థితి తలెత్తిందని చెప్పారు. -
ఈ ముఖ్యమంత్రికి సోయి లేదు: భట్టి
సాక్షి, సత్తుపల్లి : ముఖ్యమంత్రి కేసీఆర్ కు సోయి, జ్ఞానం లేవని, ఎవరు చెప్పినా వినే రకం కాదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలు విమర్శలు చేశారు. నోటికి వచ్చినట్లు బూతులు మాట్లాడే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరేనని భట్టి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎవరినైనా కొనగలనన్న నమ్మకం, మూర్ఖత్వం ఉన్న కేసీఆర్ కు రైతులు, ప్రజలు కర్రుకాల్చి బుద్ధ వచ్చేలా వాతలు పెట్టాలన్నారు.రైతులతో ముఖాముఖీలో భాగంగా సత్తుపల్లి నియోజకవర్గం తల్లాడలో రైతులతో భట్టి సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భట్టి విక్రమార్కతో పాటు మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ వీ హనుమంతరావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు పుచ్చకాల వీరభద్రం, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు మొక్కా శేఖర్ గౌడ్, తదితర స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దేశమంతా వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందన్నారు. రైతాంగ సమస్యలు వదిలిస్తే.. దేశవ్యయసాయ రంగం అగమ్యగోచరంలా తయారవుతందన్నారు. ఈ పరిస్థితులను ముందుగానే గమినించి ఉత్తర భారత రైతులు వారి ప్రాణాలు ఫణంగా పెట్టి.. 55 మంది చనిపోయినా.. పోరాటం చేస్తున్నారని భట్టి వివరించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు నల్ల చట్టాలు దేశానికి అత్యంత ప్రమాదకరమని భట్టి రైతులకు చెప్పారు. దేశాన్ని కాపాడేది జవాన్.. దేశ ప్రజలకు అన్నం పెట్టేది కిసాన్.. అని కాంగ్రెస్ పార్టీ.. ఈ ఒక్క నినాదంతోనే తమ విధానం స్పష్టం చేసిందని అన్నారు. మోదీ విధానాలతో రైతుల పరిస్థితి, భవిష్యత్ ఆందోళణకరంగా మారుతుందని అన్నారు. దేశంలో 95 శాతం మంది రైతులు 5 ఎకరాల లోపు వారేనని.. వారు తమ పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చంటే.. ఎక్కడ అమ్ము కుంటారని భట్టి ప్రశ్నించారు. ఇక్కడ స్థానికంగా పండించే మిర్చి, పత్తి, పసుపు పంటను మండల కేంద్రానికి తీసుకెళ్లి అమ్ముకవడానికి ఇబ్బందులు పడుతుచాన్న సమయంలో.. కల్లాల్లోనే అమ్ముకుంటున్నారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఏ మహారాష్ట్రకో, గుజరాత్ కో పంటను తీసుకెళ్లి రైతు అమ్ముకునే పరిస్థితులు ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఏ నినాదం వెనుక.. ఎవరి ప్రయోజనాలు ఉన్నాయన్న సంగతిని కాస్త లోతుగా ఆలోచిస్తే.. ఈ చట్టాలు రైతుల కోసం కాదు.. కేవలం బహుళజాతి సంస్థల కోసమో అన్న వాస్తవం తెలుస్తుందన్నారు. దేశ వ్యవసాయ రంగం మొత్తం కార్పరేట్ ల చేతుల్లో పెట్టడం కోసమే ఈ చట్టాలు తీసుకువచ్చారన్నది స్పష్టమైన అంశమని చెప్పారు. ఇది నిజంగా రైతుల కోసమే తెచ్చిన చట్టాలు అయితే.. వారు వద్దని ఢిల్లీ సరిహద్దులో ప్రాణాలను లెక్కచేయకుండా దీక్ష చేస్తుంటే.. వెంటనే వాటిని వెనక్కు తీసుకునేవారినన్నారు. కాంట్రాక్టు ఫార్మింగ్ తో భూములను, పంటలను కార్పొరేట్ చేతుల్లో పెట్టేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు. అంబానీ, అదానీ వంటి వారితో సామాన్య రైతులు పోరాటం చేయలేరని... అన్నారు. ఆహర ధాన్యాలు అందరికీ అందుబాటులో ఉంచాలని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎసెన్షియల్ కమెడిటీస్ చట్టం తీసుకువచ్చిందని.. దానివల్ల ధరల నియంత్రణ ఉంటుందని అన్నారు. కానీ దానిని ఎత్తేయడం వల్ల ఎవరైనీ ఎంతైన ఆహార పదార్థాలను, పంటలను గోడౌన్ల్లో దాచేస్తే.. అవి అందక.. ధరలు ఆకాశంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. దీని వల్ల ఇటు వినియోగదారుడు.. అటు.. రైతులు తీవ్రంగా నష్టపోతారని భట్టి ప్రజలకు వివరించారు. ఇప్పటికే దేశవ్యాప్తగా అనే ఎఫ్.సీ.ఐ గోడౌన్లను అదానీ సంస్థకు కేంద్రం లీజుకు ఇచ్చిందని చెప్పారు. ఈ మూడు చట్టాలవల్ల దేశ రైతులకు అత్యంత ప్రమాదకరమని చెప్పారు. దేశ స్వాతంతరం వచ్చిన తరువాత గణతంత్ర దినోత్సవం నాడు.. కేవలం సైనికుల కవాతు మాత్రమే ఉండేది.. కానీ మొదటిసారు.. రైతులు బటయకు వచ్చి కవాతు చేశారుని చెప్పారు. ఈ పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా రైతులంతా పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని భట్టి ఇది దుస్తితి.. మనమం విక్రమార్క చెప్పారు. అప్పుడే పాలకులు దిగివస్తారని చెప్పారు. మోడీ, కేసఆర్ లు కేవలం బహుళజాతి సంస్థల కోసం మాత్రమే పని చేస్తున్నారు.. బీజేపీ స్వాతంత్ర పోరాటంలో పాల్గొనలేదు.. ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన.. వారికి లేదని చెప్పారు. మోడీ, కేసీఆర్ లకు ప్రజల సంక్షేమం అవసరం లేదని.. కేవలం కార్పొరేట్ల కోసమో పనిచేస్తున్నారని ఆగ్రహంగా చెప్పారు. వారిద్దరికీ అధికారం తప్ప మరేమీ అవసరం లేదని చెప్పారు. అదే సమయంలో ఈ మధ్య మద్దతు ధర ఉన్న సమయంలో.. మొక్కలు క్వింటాలకు రూ.1800 ధర పలికింది.. అదే మద్దతు ధర లేకపోతే.. వెంటనే రూ.900 కి పడిపోయింది. దీంతో రైతులకు క్వింటాలుకు రూ. 1000 నష్టపోయిన పరిస్థితి అని చెప్పారు. మద్దతు ధర లేకపోతే ఒక్క పంటకే ఇలా ఉంటే.. మొత్తంగా అసలు మద్దతు ధర లేకపోతే.. రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహకే అందడం లేదని భట్టి విక్రమార్క చెప్పారు. ఢిలీ సరిహద్దుల్లో 85 రోజలుగా జరగుతున్న రైతు ఉద్యమం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. కొనుగోలు కేంద్రాలు ఎత్తేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వ్యవసాయాన్ని పూర్తిస్థాయిలో కార్పొరేట్ చేసేలా కేంద్రం ప్రయత్నిస్తోంది. మార్కెట్ యార్డులను ఎత్తేసేలా కుట్రలు చేస్తున్నారు. దేశంలో 60 శాతం ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు.. వారికి మద్దతు ధర లేకపోతే.. ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గిట్టుబాటు, మద్దతు ధర కల్పించింది. - దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మంథని ఢిల్లీలో రైతులు మూడు నెలల నుంచి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఇప్పటికీ దాదాపు 53 మంది చనిపోయినా.. రైతులు పోరాటం ఆపడం లేదు. రైతులకు కనీస మద్దతు ధర లేకపోతే.. రైతులు తీవ్రంగా నష్టపోతారు. కేసీఆర్ కూడా మోదట చట్టాలను వ్యతిరేకించినా.. తరువాత యూటర్న్ తీసుకున్నాడు. ఈ బిల్లు వల్ల కార్పొరేట్లకు తప్ప.. రైతులకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. - వి.హనుమంతరావు, మాజీ ఎంపీ భట్టి విక్రమార్క మల్లు నేత్రుత్వంలో చేస్తున్న రైతు వ్యతిరేక చట్టాలపై సీఎల్పీ బ్రుందం చేస్తున్న పోరాటం చాలా గొప్పది. ఈ పోరాటంలో భట్టి గారికి మేము అండగా ఉంటాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేశాయి. కేసీఆర్.. చెప్పేవన్నీ అబద్దాలే. పేదలకు సేవచేసింది కాంగ్రెస్ మాత్రమే. మాట తప్పిన వాళ్లను ఏమి చేయాలో ప్రజలే నిర్ణయిస్తారు. సంభాని చంద్రశేఖర్, మాజీ మంత్రి -
ఊయల మెడకు చుట్టుకుపోవడంతో..
సాక్షి, సత్తుపల్లి : ఆనందంగా ఆడుకుంటున్న చిన్నారికి ఊయలే ఉరి తాడైంది. పట్టణంలోని ఎన్వీఆర్ కాంప్లెక్స్ రోడ్లో నివాసం ఉంటున్న వలపర్ల రవికుమార్, కవితలకు స్వర్ణిక, సాత్విక ఇద్దరు కుమార్తెలున్నారు. దివ్యాంగుడైన రవికుమార్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట బడ్డీకొట్టు, స్వర్ణిక జిరాక్స్‌సెంటర్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరిది కల్లూరులోని అంబేడ్కర్‌నగర్. గురువారం మధ్యాహ్నం పిల్లలకు భోజనం తినిపించి తల్లిదండ్రులు ఇంట్లో భోజనం చేస్తున్నారు. ఆ సమయంలో వరండాలో చీరతో కట్టిన ఊయలలో పెద్దకుమార్తె స్వర్ణిక(7) కూర్చొని గుండ్రంగా తిరుగుతూ ఆడుకుంటుంది. ఈ క్రమంలో ఊయల ఆమె మెడకు చుట్టుకొని బిగుసుకుపోయి తల వేలాడుతుంది. అదే సమయంలో ఆ వీధిలో వెళ్తున్నవారు చిన్నారి వేలాడుతున్న విషయాన్ని గమనించి తల్లిదండ్రులను పిలిచారు. ఊయలలో నుంచి చిన్నారి స్వర్ణికను దింపి చూడగా.. కదలికలు లేకపోవడంతో చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు. హెడ్‌కానిస్టేబుల్ ప్రతాప్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి స్వర్ణిక మృతదేహం వద్ద తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుండడంతో చూపరులను కంటతడి పెట్టించింది. -
దాన్ని చంపేశాను.. నువ్వు రావాల్సిన అవసరం లేదు!
సాక్షి, సత్తుపల్లి: సత్తుపల్లి పట్టణ పరిధిలోని అయ్యగారిపేటలో బుధవారం ఓ వివాహిత హత్య సంఘటన వెలుగుచూసింది. విశ్వసనీయ కథనం ప్రకారం.. మండల పరిధిలోని కాకర్లపల్లి గ్రామానికి చెందిన పంతంగి వాణి(24) సత్తుపల్లిలోని ఓ దుకాణంలో పనిచేస్తోంది. మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో దుకాణంలో పని ముగించుకుని ఆటోలో సత్తుపల్లికి చెందిన ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ సందీప్‌తో కలిసి వెళ్లినట్లు సీసీ పుటేజీల్లో రికార్డయింది. ఆటోలో అయ్యగారిపేటలోని పామాయిల్ తోట వరకు వెళ్లారు. మళ్లీ ఫోన్ చేసినప్పుడు రావాలని ఆటో డ్రైవర్‌కు చెప్పి పంపించారు. బుధవారం ఉదయం మహిళ మృతి చెందిపడి ఉన్న ట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చా రు. సంఘటన స్థలాన్ని సందర్శించిన పోలీసులు.. పంతంగి వాణిగా గుర్తించారు. చున్నీతో మెడకు చుట్టి హత్య చేసినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. సంఘటనా స్థలంలో పెనుగులాట జరిగినట్టు ఆనవాళ్లు ఉన్నాయి. చేతి గాజులు పగిలి, దుస్తులు చిరిగి కన్పించాయి. (అత్తయ్యతో కలిసి నటి టిక్‌టాక్ ఛాలెంజ్ ) ఆటో డ్రైవర్ గంట తర్వాత సందీప్‌కు ఫోన్ చేసి ఆటో తీసుకురావాలా? అని అడిగాడు. ‘దాన్ని చంపేశాను.. నువ్వు రావాల్సిన అవసరం లేదు.. నీ డబ్బులు మళ్లీ కలిసినప్పుడు ఇస్తా’అని సందీప్ చెప్పినట్టు సమాచారం. దీంతో భయభ్రాంతులకు గురైన సత్తుపల్లి పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్ జరిగిన విషయాలను బంధువులకు వివరించటంతో పాటు సత్తుపల్లి పోలీసులకు సమాచారం అందించినట్టు తెలిసింది. అప్పటివరకు అనుమానాస్పద కేసుగా భావించిన పోలీసులు.. సందీప్ హత్య చేసినట్టు అనుమానించి ఇంటికి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. ఫోన్ కాల్‌డేటా ఆధారంగా సందీప్ కదలికలను గుర్తించినట్టు సమాచారం. మహిళను హత్య చేసి ఏమీ తెలియనట్టు విధులకు కూడా హాజరైనట్టు తెలిసింది. భార్యను వేధించటం వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు సందీప్‌పై ఇప్పటికే ఓ కేసు ఉంది. (ఆర్థిక లావాదేవీలతోనే ఆనంద్‌రెడ్డి హత్య) ఇద్దరు పిల్లల మూగరోదన పంతంగి వాణి, శ్రీనివాసరావులకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. భర్త చెవిటి, మూగవాడు. కూలి పనులకు వెళ్తుంటాడు. మృతురాలు పంతంగి వాణిది పశ్చిమగోదావరిజిల్లా లింగపాలెం మండలం ముచ్చర్ల గ్రామం. వీరికి ఆరేళ్ల పాప, ఐదేళ్ల బాబు ఉన్నారు. పంతంగి వాణి విగతజీవిగా పడి ఉండటంతో పిల్లలకు ఏమీ అర్థంకాగా బిత్తరపోయి చూస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. నాలుగు నెలల క్రితం నుంచే సత్తుపల్లిలోని దుకాణంలో పని చేస్తోంది. మృతదేహానికి సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు సత్తుపల్లి రూరల్ సీఐ కరుణాకర్ తెలిపారు. -
సత్తుపల్లి ఓటర్ తీర్పు విలక్షణం!
సాక్షి, సత్తుపల్లి(ఖమ్మం): సత్తుపల్లి పట్టణ ఓటర్ తీర్పు విలక్షణంగా ఉంటుంది.. పట్టణ రాజకీయాలు ఎప్పటికప్పుడు వాడీవేడిని పుట్టిస్తుంటాయి.. అధికార పార్టీ హవా నడుస్తున్నా.. నిశ్శబ్ద తీర్పుతో ముచ్చెమటలు పట్టించిన చరిత్ర ఉంది. సత్తుపల్లి నియోజకవర్గానికే గుండెకాయలాంటి మున్సిపాలిటీ ఓటరు తీర్పుపై అన్ని రాజకీయ పక్షాలు ఆసక్తిగా గమనిస్తుంటాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఒకరకంగా.. పార్లమెంట్ ఎన్నికల్లో మరో రకంగా.. పంచాయతీ ఎన్నికల్లో ఇంకో రకంగా విలక్షణంగా ఓటు వేయడం ఇక్కడి ఓటర్ల ప్రత్యేకత. సత్తుపల్లి పట్టణ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటే గెలుపు సునాయసనమని రాజకీయ పార్టీలు అంచనా వేస్తారు. సత్తుపల్లి మున్సిపాలిటీ అధికారం చేతిలో ఉంటే సగం పాలన ఉన్నట్టేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తుంటారు. ఓటరు ఎదురు తిరిగితే.. సత్తుపల్లి పట్టణ ఓటర్ల తీర్పు అధికార పార్టీకి భిన్నంగా ఇవ్వడం.. దీంతో రాజకీయ సమీకరణలు మారిపోవడం లాంటి ఘటనలు అనేకం ఉన్నాయి. మాజీ మంత్రి జలగం ప్రసాద్‌రావు అధికారం చలాయించే సమయంలో జరిగిన 1992 ఎన్నికల్లో టీడీపీకి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ఉండేది. అప్పుడు జరిగిన సొసైటీ ఎన్నికల్లో టీడీపీకి చెందిన సీనియర్ నేతలు రంగంలోకి దిగి పోటీ చేయడం ఆ ప్యానల్ ఘన విజయం సాధించటం టీడీపీకి బలాని్నచి్చనట్లైంది. తర్వాత జరిగిన పంచాయతీ, అసెంబ్లీ ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు విజయానికి బాట వేసినట్లయింది. తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా అధికారం శాసిస్తున్న సమయంలో 2001లో జరిగిన సత్తుపల్లి పంచాయతీ ఎన్నికల్లో అధికార టీడీపీ బలపరిచిన అభ్యర్థి కొత్తూరు ప్రభాకర్‌రావును కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కోటగిరి మురళీకృష్ణారావు ఓడించి సంచలనం సృష్టించారు. 2001లో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా సత్తుపల్లి పట్టణంలోని ఆరు ఎంపీటీసీలకు నాలుగు ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకొని సంచలన విజయం నమోదు చేసింది. తర్వాత 2004 అసెంబ్లీ ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు జలగం వెంకటరావు చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. సత్తుపల్లి పట్టణ ఓటర్ల విలక్షణమైన తీర్పుతోనే రాజకీయ పీఠాలు కదిలిపోతాయని విశ్లేషకులు అంచనా వేస్తుంటారు. 2009 నుంచి.. సత్తుపల్లి ఎస్సీ నియోజకవర్గం అయినప్పటి నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మూడో సారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి పట్టణ ఓటర్ల మొగ్గుతోనే విజయం సాధిస్తున్నారు. 2009, 2019 ఎన్నికల్లో సత్తుపల్లి పట్టణ ఓటర్లు సండ్ర వెంకటవీరయ్యకు మద్దతుగా నిలవడంతో మంచి మెజార్టీ లభించింది. 2014 ఎన్నికల్లో స్థానికుడైన మట్టా దయానంద్ విజయ్‌కుమార్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేయటంతో సత్తుపల్లి పట్టణ ఓటర్లు ఆయనకు మద్దతు ఇవ్వటంతో సండ్ర వెంకటవీరయ్యకు మెజార్టీ పడిపోయింది. 2014లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సండ్ర వెంకటవీరయ్య నాయకత్వంలో నగర పంచాయతీలోని 20 వార్డులకు గాను 17 వార్డులు గెలుచుకున్నారు. ఈ సారి ఓటర్లు ఏం తీర్పు ఇస్తారో వేచి చూడాల్సిందే. పంచాయతీ సర్పంచ్‌లు వీరే.. సత్తుపల్లి పంచాయతీ ఏర్పడినప్పుడు తొలి సర్పంచ్‌గా మొరిశెట్టి రాజయ్య (1961–66), గాదె నర్సయ్య(1966–1970), అనుమోలు నర్సింహారావు (1970–83), కొత్తూరు ప్రభాకర్‌రావు (1983–88), కోటగిరి మురళీకృష్ణారావు (1988–95), కొత్తూరు పార్వతి (1995–2001), కోటగిరి మురళీకృష్ణారావు (2001–2005)లు సర్పంచ్‌గా పని చేశారు. నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా.. 2005 సత్తుపల్లి నగరపంచాయతీగా అప్‌గ్రేడ్ అయిన తర్వాత ఎస్టీ జనరల్‌కు చైర్మన్ పదవి రిజర్వ్ అయింది. తొలి చైర్‌పర్సన్‌గా పూచి యశోద (2005–2010) ఎన్నికయ్యారు. రెండోసారి బీసీ మహిళకు రిజర్వ్ అయింది. చైర్‌పర్సన్‌గా దొడ్డాకుల స్వాతి (2014–2019) ఎన్నికయ్యారు. మూడోసారి మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయి ఎన్నికలు జరుగుతున్నాయి. -
మోసాలు.. అప్పులతో జల్సాలు..చివరికి..
సాక్షి, ఖమ్మం(సత్తుపల్లి) : మోసాలు.. అప్పులతో జల్సాలు చేసుకుంటూ తిరుగుతున్న మోసగాడ్ని వలపన్ని పట్టుకుని నడి సెంటర్లో కట్టేసిన సంఘటన సత్తుపల్లిలో గురువారం చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన చిట్టూరి రాజేష్ ఏడేళ్ల క్రితం పినపాక మండలం వచ్చి నర్సరీ నిర్వహిస్తున్నాడు. ఆ సమయంలో నర్సరీ మొక్కలకు వచ్చిన పినపాక మండలం మంగతోగుకు చెందిన బాడిశ పార్వతితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఆరు నెలల నుంచి సహజీవనం చేస్తున్నాడు. పార్వతి తండ్రి ముత్తయ్య ఇటీవలే పదవీ విరమణ చేయటంతో వచ్చిన రూ.10లక్షల్లో రూ.5 లక్షలు నర్సరీ వ్యాపారాన్ని అభివృద్ధి చేద్దామని తీసుకున్నాడు. శ్రీరామ్ చిట్‌ఫండ్‌లో పల్సర్ మోటారు సైకిల్‌ను ముత్తయ్య పూచీకత్తుతో తీసుకున్నాడు. దీనికి వాయిదాలను కూడా చెల్లించటం లేదు. అప్పులు చేసి.. పరారీలో.. చిట్టూరి రాజేష్ నర్సంపేట, పినపాకలో అప్పులు చేసి పరారీలో ఉన్నాడు. అప్పులిచ్చిన వాళ్లందరు బాడిశ పార్వతి వద్ద మొర పెట్టుకుంటున్నారు. బాడిశ పార్వతి చిట్టూరు రాజేష్ గురించి వాకబు చేయగా.. ముందే పెళ్లి అయిందని తెలిసింది. మోసగాడి ఆటను కట్టించాలని ఫోన్లో తరచూ సంభాషిస్తూ ఎక్కడ ఉన్నాడో కనుక్కుంది. రాజేష్ ఆ ప్రాంతంలో అప్పులు ఎక్కువ అయ్యాయని.. మీ నాన్న వద్ద ఉన్న రూ. 5 లక్షలు పట్టుకొని రా.. ఇద్దరం కలిసి నర్సరీ పెడదామంటూ నమ్మబలికాడు. సరే వస్తానని చెప్పి.. రాజేష్‌కు అప్పులు ఇచ్చిన వాళ్లందరిని పిలుచుకొని సత్తుపల్లి వచ్చింది. పార్వతిని చూసిన రాజేష్ దగ్గరకు వచ్చి అప్పుల వాళ్లను చూసి పల్సర్ మోటారుసైకిల్‌పై పారిపోతుండటంతో అందరు పట్టుకొని సత్తుపల్లి బస్టాండ్ రింగ్ సెంటర్లోని బోస్‌బొమ్మ విగ్రహం రైలింగ్‌కు కట్టేశారు. ఇంతలో పోలీసులు వచ్చి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రాజేష్‌పై ఏడూళ్లబయ్యారం, పినపాక, నర్సంపేట పోలీస్స్టేషన్లలో ఇప్పటికే పలు కేసులు నమోదు అయి ఉండటంతో సత్తుపల్లి పట్టణ సీఐ టి.సురేష్ అక్కడి ఎస్హెచ్ఓలతో మాట్లాడి కానిస్టేబుళ్లను ఇచ్చి పంపించారు. -
భర్త ఇంటి ముందు వివాహిత నిరసన
సాక్షి, ఖమ్మం(సత్తుపల్లిటౌన్) : మాయమాటలు చెప్పి ప్రేమపెళ్లి చేసుకొని ఉడాయించాడని ఓ మహిళ భర్త ఇంటి ముందు నిరసన దీక్షకు దిగిన సంఘటన సత్తుపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. బాధితురాలు కథనం ప్రకారం.. అశ్వారావుపేట మండలం అనంతారం గ్రామానికి చెందిన బాణోతు పద్మజ 2017లో సత్తుపల్లిలో ఇంటర్ చదివేటప్పుడు.. సత్తుపల్లిలోని శ్రీనివాసా టాకీస్‌రోడ్‌లోని షేక్ ఖుర్షీద్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. హైదరాబాద్‌లో చదువుకునేందుకు వెళ్లి ఇరువురు కలిసి తిరిగారు. రెండేళ్లు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పద్మజను మతమార్పిడి చేయించాడు. ఇరువైపుల పెద్దలకు తెలియకుండానే హైదరాబాద్‌లోని మోతినగర్‌లోని ఓ ఫంక్షన్హాల్లో ఎనిమిది నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. పెళ్లి తరువాత కొన్నిరోజులు హాస్టల్లో ఉండమని చెప్పి.. కాపురం పెట్టేందుకు ఆమె వద్ద నుంచి పొలం అమ్ముకొని వచ్చిన రూ.15 లక్షలను తీసుకొని సత్తుపల్లి వచ్చాడు. ఆ తర్వాత ఆమె ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించటం లేదని వాపోయింది. మతం మారటంతో తన కుటుంబ సభ్యులు కూడా తనను ఇంటికి రానివ్వటంలేదని కన్నీళ్లు పెట్టింది. దీంతో సోమవారం నేరుగా సత్తుపల్లిలోని అతని ఇంటికి వచ్చింది. దీంతో ఖుర్షీద్ కుటుంబ సభ్యులు తమకు సంబంధం లేదంటూ దూషించటంతో ఆమె ఇంటి ముందే నిరసనకు దిగింది. సత్తుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ టి.సురేష్ తెలిపారు. -
భయం.. భయంగా..
సాక్షి, సత్తుపల్లి(ఖమ్మం జిల్లా): సత్తుపల్లిలోని జేవీఆర్ ఓసీలో బొగ్గు తవ్వకాలతో ఎన్టీఆర్ కాలనీకి ముప్పు ఏర్పడింది. కాలనీ ఓపెన్‌కాస్ట్‌కు కిలోమీటరు దూరంలో ఉంటుంది. ఎన్టీఆర్ కాలనీలో సుమారు 579 ఇళ్లు ఉన్నాయి. వీటిలో ముప్పావంతుకు పైగా దెబ్బతిన్నాయి. గనిలో బొగ్గు వెలికితీతకు బాంబులు పేల్చేటప్పుడు భూమి కంపిస్తోంది. శ్లాబులు పెచ్చులూడి పడిపోతున్నయి. ఇళ్లు ఊగిపోతున్నాయి. చాలా మంది కర్రలు పోటుపెట్టి బతుకీడుస్తున్నారు. బాంబుల తీవ్రత తగ్గిం చాలని పలుమార్లు ఆందోళనలు చేసినా ఎవరూ పట్టించుకోవడంలేదు. ఈసమస్యను స్థానిక ఎమ్మె ల్యే సండ్ర వెంకటవీరయ్య అసెంబ్లీలో ప్రస్తావించారు. మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి శాసన మండలిలో ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. అయినా ప్రభుత్వం కానీ, సింగరేణి సంస్థ కానీ స్పందించడంలేదు. సీఎం క్యాంప్ ఆఫీస్, సింగరేణి సీఎండీ శ్రీధర్, సింగరేణి డైరెక్టర్‌కు పలు మార్లు విజ్ఞప్తులు పంపించామని, అయినా ఫలి తం కన్పించటం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశీలనలతోనే సరి ఎన్టీఆర్నగర్ కాలనీ వాసులు పలుమార్లు ఆందోళనలు చేపట్టారు. అధికారులు మొక్కబడిగా దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి పోతున్నారు. ఐదేళ్లుగా ఇదే తంతు కొనసాగుతోంది. సింగరేణి ఏరియా జీఎం, పీఓ వచ్చి పరిశీలించి వెళ్లారు. కానీ ఎలాం టి చర్యలూ తీసుకోలేదు. ఇటీవల స్థానికులు ఖమ్మం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాలతో బుధవారం రెవెన్యూ, మైనింగ్, సర్వే సిబ్బంది దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. న్యాయం చేస్తామని కానీ, పరిహారం ఇస్తామనికానీ హామీ ఇవ్వలేదు. ఇంటింటి సర్వే నిర్వహించి ఆర్అండ్బీ ఇంజనీర్లతో పరిశీలన చేయించాలని, ఇల్లు ఎంతమేరకు దెబ్బతిన్నాయి..? నివాస యో గ్యానికి పని చేస్తాయా..? తదితర అంశాలను స్పష్టంగా తేల్చాలని బాధితులు కోరుతున్నారు. దెబ్బతిన్న ఇళ్లను తొలగించి కొత్త ఇళ్లను కట్టించాలని, లేని పక్షంలో సింగరేణి స్వాధీనం చేసుకొని ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వర్తింప చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాలుష్యంతో జబ్బులు సింగరేణి బొగ్గు తవ్వకాలతో వాతావరణం కలుషితమై కాలుష్యం పెరిగిపోయి రోగాల బారినపడుతున్నారు. ఛర్మ వ్యాధులు, కిడ్ని, శ్వాసకోశ, కణితులు, దృష్టిలోపం, లీవర్ వంటి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే బొగ్గు నుసితో నల్లగా మారిపోతున్నాం. మంచినీళ్లతో సహా అన్నీ కలుషితం అవుతున్నాయి. ఇప్పటికే చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. సింగరేణి యాజమాన్యానికి పలుమార్లు మొరపెట్టుకోగా కంటితుడుపు చర్యగా మెడికల్ క్యాంప్‌లు నిర్వహించారు కానీ ఎటువంటి ప్రయోజనం కలగలేదు. సింగరేణి సంస్థ ఇంటింటి సర్వే నిర్వ హించి హెల్త్‌కార్డులు ఇచ్చి సింగరేణి ఆస్పత్రిలో ఉచిత వైద్యం సహాయం అందించాలని ప్రజల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. -
ఎన్నికల విధుల్లో ఉద్యోగి మృతి
సాక్షి, సత్తుపల్లిటౌన్: ఎన్నికల విధులకు హాజరైన ఓ ఉద్యోగి, గుండెపోటుతో మృతిచెందారు. వైరాకు చెందిన ఎదునూరి నాగరాజు(35), మధిరలోని నీటి పారుదల శాఖ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు ఎలక్షన్ డ్యూటీ పడింది. సత్తుపల్లిలోని జ్యోతి నిలయం పాఠశాలలో ఏర్పాటైన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రానికి బుధవారం ఉదయం చేరుకున్నారు. సత్తుపల్లి మండలం కిష్టారంలోని 199 పోలింగ్ స్టేషన్‌ను ఇతనికి అధికారులు కేటాయించారు. పోలింగ్ సామాగ్రి తీసుకున్న తరువాత, మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఛాతీలో నొప్పిగా ఉన్నదంటూ అక్కడే ఉన్న వైద్య శిబిరానికి వెళ్లారు. ఆయనను డాక్టర్ చింతా కిరణ్‌కుమార్ పరీక్షించి, వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని సూచించి, హెల్త్ అసిస్టెంట్ డి.శ్రీనివాస్ తోడుగా ద్విచక్ర వాహనంపై సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి పంపించారు. అక్కడ ఆయనకు వెంటనే డాక్టర్ శివకృష్ణ ఈసీజీ పరీక్షలు నిర్వహించారు. గుండెపోటుగా నిర్థారించి వైద్యం చేస్తుండగదానే నాగరాజు కుప్పకూలిపోయారు, ప్రాణాలొదిలారు. ఆయనకు ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. భార్య కృష్ణవేణి, కుమార్తెలు వెన్నెల, మనన్వి ఉన్నారు. మృతదేహాన్ని కుటుంబీకులకు సత్తుపల్లి తహసీల్దార్ కె.విజయ్‌కుమార్, ఆర్ఐలు విజయ్‌భాస్కర్, జగదీష్ అప్పగించారు. పిల్లల్ని ఎండకు పంపొద్దని చెప్పి... సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రిలో భర్త నాగరాజు మృతదేహంపై పడి భార్య కృష్ణవేణి, తల్లి గుండెలవిసేలా రోదించారు. ‘‘పిల్లలను ఎండకు పంపించొద్దు. ఇంటి దగ్గర జాగ్రత్త అని చెప్పి, డ్యూటీకి వెళ్లారు. ‘‘తాను తిరిగి రాలేననే... ఇన్ని జాగ్రత్తలు చెప్పారేమో’’నని ఆమె విలపిస్తుంటే... చూపరుల కళ్లల్లో తడి చేరింది. మృతదేహాన్ని అంబులెన్స్‌లో స్వగ్రామం వైరాకు తరలించారు. -
అమరుల త్యాగాలతోనే భోగాలు : సండ్ర
సాక్షి, సత్తుపల్లి: తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానం చేసిన శ్రీకాంతాచారికి వేదికపై కనీసం నివాళి అర్పించలేదని, ఉద్యమకారులను గౌరవించలేదని, అమరుల త్యాగాలతో భోగాలు అనుభవిస్తున్నారని టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య ఆరోపించారు. సత్తుపల్లిలోని కాకర్లపల్లిరోడ్ చంద్రాగార్డెన్స్‌లో ఏర్పాటు చేసి చంద్రబాబు బహిరంగ సభ ఏర్పాట్లను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబునాయుడు ప్రాజెక్టులు అడ్డుకుంటున్నారంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని, ఎక్కడ అడ్డుకున్నారో బయటపెట్టాలని సవాల్ చేశారు. సత్తుపల్లి అభివృద్ధి టీడీపీ హయాంలోనే జరిగిందని, వ్యక్తులు ద్వారా కాదన్నారు. మాతృభూమి బిడ్డగా తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడటంతో ముందుంటామని, అయినా తెలంగాణ ఎగువ ప్రాంతమని, ఆంధ్రా దిగువ ప్రాంతమని వివరించారు. సత్తుపల్లి జిల్లాను అడ్డుకుంది కేసీఆర్ అని.. జిల్లా సాధన జేఏసీకి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని, వేదికమీద ఆ ఊసే లేదని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ గిరిజన అభ్యర్థినే వేదికపై నుంచి నెట్టిన ఘనతను మూటగట్టుకుందన్నారు. నేడు చంద్రబాబు రాక.. సత్తుపల్లి పట్టణంలో ఉదయం 10 గంటలకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పర్యటిస్తారన్నారు. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ కేంద్రమంత్రి రేణుకాచౌదరి, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ వస్తున్నారన్నారు. రేవంత్‌రెడ్డి అరెస్ట్‌కు ఖండన.. ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత స్వేచ్ఛను హరించే విధంగా ప్రభుత్వం రెవంత్రెడ్డిని తలుపులు బద్ధలుకొట్టి మరీ అరెస్ట్ చేయటాన్ని సండ్ర వెంకటవీరయ్య తీవ్రంగా ఖండించారు. ఇది మంచిపద్ధతి కాదని.. తప్పుడు పద్ధతుల్లో వ్యవహరించటం ప్రజాస్వామ్యానికి తగదన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల, పట్టణ అధ్యక్షులు దొడ్డా శంకర్రావు, కూసంపూడి మహేష్, కూసంపూడి రామారావు, కొత్తూరు ఉమామహేశ్వరరావు, వీరపనేని బాబి, సుమంత్, రతికంటి గిరిగోవర్ధన్, మల్లూరు మోహన్, కాలినేని నర్సింహారావు, వల్లభవనేని పవన్ పాల్గొన్నారు. సండ్రను భారీ మెజార్టీతో గెలిపించాలి.. తల్లాడ: ప్రజాకూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి కోరారు. తల్లాడలో టీడీపీ కార్యాలయంలో ఆయన ప్రజాకూటమి కార్యకర్తలను కలిసి మాట్లాడారు. వెంకటవీరయ్యకు భారీ మెజార్టీ వచ్చే విధంగా కార్యకర్తలు పని చేయాలన్నారు. రాష్ట్రంలో రానున్నది ప్రజా కూటమి ప్రభుత్వమేనని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పగడాల లచ్చిరెడ్డి, దగ్గుల వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రజా కూటమిదే ప్రభుత్వం .. కల్లూరురూరల్: రాష్ట్రంలో ప్రజాకూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని, కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితం అయ్యే పరిస్థితి ఏర్పడిందని టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని చిన్నకోరుకొండిలో మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది సీట్లు గెలుస్తామన్నారు. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ నియంతృత్వ పాలనకు చివరి రోజులు వచ్చాయన్నారు. కేసీఆర్ మోసాలు ఎంతోకాలం సాగవని, ప్రజలు ఓటు ద్వారా తీర్పు ఇవ్వనున్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు పెద్దబోయిన దుర్గాప్రసాద్, బూదాటి నారపురెడ్డి, రెడ్డి నర్సింహారావు, తోట జనార్ధన్, నామా మైసయ్య, భూక్యా శివకుమార్ నాయక్, ఉన్నం రాజ, దుర్గం కృష్ణ, ఎస్కే షమి పాల్గొన్నారు. -
సత్తుపల్లి: తెలంగాణ యాసతో మంగ్లీ
సాక్షి, సత్తుపల్లిటౌన్/సత్తుపల్లిరూరల్: రేలా.. రేలా.. రేలారే.. తెలంగాణ, ఉస్మానియా యూనివర్సిటీలో ఉదయించిన కిరణమా.. ఇలా పాటలు ఆలపిస్తూ తెలంగాణ యాసతో టీవీ యాంకర్ మంగ్లీ ఉర్రూతలూగించారు. సత్తుపల్లి జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు ముందుగా యాంకరింగ్ చేయాల్సి ఉంది. కాని ట్రాఫిక్ జామ్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించిన అనంతరం తళుక్కుమని స్టేజీ ఎక్కి.. అందరిని హలో.. హలో.. అక్కలు.. తమ్ముళ్లు.. అన్నలు.. సారీ.. లేటైంది.. అంటూ పలకరించారు. తెలంగాణ యాసతో అలరించింది. ఇంతలోనే జనం చేరుకోవటం.. స్టేజీ పైన కూడా నిండిపోవటంతో అసహనానికి లోనైంది. అనంతం పట్టణంలో టీఆర్ఎస్ అభ్యర్థి పిడమర్తి రవితో కలిసి ప్రచారం చేశారు. -
సత్తుపల్లి మండలంలో బీజేపీ నాయకుల ప్రచారం
సాక్షి,సత్తుపల్లిటౌన్: బీజేపీ అభ్యర్థి నంబూరి రామలింగేశ్వరరావును గెలిపించాలని కోరుతూ శుక్రవారం పట్టణంలోని వెంగళరావునగర్‌లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు భూక్యా శ్యాంసుందర్‌నాయక్, కె.రాజా, శివ, రహీం, ఆనంద్, పుల్లారావు, సుధాకర్, గణేష్, గోపి పాల్గొన్నారు. సత్తుపల్లి మండలంలో.. సత్తుపల్లిరూరల్: మండల పరిధిలోని కిష్టాపురం, తుంబూరు గ్రామాల్లో బీజేపీ అభ్యర్థి నంబూరి రామలింగేశ్వరరావును గెలిపించాలని కోరుతూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కూసంపూడి రవీంద్ర ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. రాష్ట్రంలో ఏ ఒక్కరికి కూడా సొంత ఇంటి స్థలంలో ఒక్క ఇళ్లు నిర్మించిన దాఖలాలు లేవన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నాయుడు రాఘవరావు, పాలకొల్లు శ్రీను పాల్గొన్నారు. -
మిత్రులు..ప్రత్యర్థులు..
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనేది నానుడి. సత్తుపల్లి నియోజకవర్గంలో రాజకీయాలు ఈ కోవలోకే వస్తాయి. సుదీర్ఘకాలంలో రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న నేతలు ఒకే పార్టీలో చేరడం, ఒకే వేదిక మీదకు వచ్చి మాట్లాడటం.. ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకోవటం.. రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. సాక్షి, సత్తుపల్లి: టీడీపీ తాజా మాజీ ఎమ్మెల్యే, సత్తుపల్లి కూటమి అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య, మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్ పాలేరులో మూడు సార్లు, సత్తుపల్లిలో రెండుసార్లు.. మొత్తం 5 సార్లు ప్రత్యర్థులుగా తలపడ్డారు. పాలేరులో సంబాని రెండుసార్లు, సండ్ర ఒకసారి గెలిచారు. 2009 పునర్విభజనలో సత్తుపల్లి నియోజకవర్గం ఎస్సీకి రిజర్వ్ చేశారు. ఇక్కడ రెండుసార్లు వెంకటవీరయ్యే విజయం సాధించారు. 2018లో సీన్మారిపోయింది. రెండున్నర దశాబ్దాలుగా ప్రత్యర్థులుగా తలపడిన సంభాని చంద్రశేఖర్,సండ్ర వెంకటవీరయ్యలు ప్రజాకూటమి పేరుతో మిత్రులుగా ఒక్కటయ్యారు.ఇద్దరు ఒకే వేదికను పంచుకోవటం రాజకీయ వర్గాలలో చర్చానీయాంశమైంది. సండ్ర–సంబాని .. టీడీపీలో తుమ్మల నాగేశ్వరరావుతో సండ్ర వెంకటవీరయ్యకు సాన్నిహిత్యం ఉండేది. 2009 ఎన్నికల్లో సండ్ర వెంకటవీరయ్యను సత్తుపల్లి టీడీపీ నేతలకు పరిచయం చేసి గెలిపించా ల్సిన బాధ్యతను భుజస్కంధాలపై పెట్టారు. ఆనాటి నుంచి ఇద్దరి మధ్య బంధం మరింత బలపడింది. 2014 ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ నుంచి సండ్ర వెంకటవీరయ్య ఒక్కరే గెలిచారు. ఖమ్మంలో తుమ్మల ఓటమి చెందారు. అనంతరం ఆయన టీఆర్ఎస్లో చేరారు. మంత్రి పదవి చేపట్టారు. తుమ్మ ల నాగేశ్వరరావును సండ్ర వెంకటవీరయ్య అనుసరించక పోవటంతో ఇద్దరి మధ్య రాజకీయ విబేధాలు తలెత్తాయి. 2018 ఎన్నికల్లో సండ్రకు వ్యతిరేకంగా తుమ్మల అనుచరులు టీఆర్ఎస్లో పనిచేస్తున్నారు. ఒకప్పుడు అందరు కలిసి వ్యూహా లు రచించినవారు ఇప్పుడు వైరి పక్షంగా మారారు. తుమ్మల–సండ్ర .. తుమ్మల–జలగం .. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జలగం ప్రసాదరావు, జలగం వెంకటరావులకు దశాబ్దాలుగా రాజకీయ వైరం ఉంది. సత్తుపల్లిలో టీడీపీ నుంచి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ నుంచి జలగం ప్రసాదరావు రెండుసార్లు తలపడ్డారు. ఒకసారి తుమ్మల, ఒకసారి ప్రసాదరావు గెలిచారు. ప్రస్తుతం వీరిద్దరూ టీఆర్ఎస్లో ఉన్నారు. తుమ్మలపై జలగం ప్రసాదరావు సోద రుడు జలగం వెంకటరావు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2009లో సత్తుపల్లి ఎస్వీ రిజర్వ్‌గా మారడంతో వీరిద్దరూ మరోసారి ఖమ్మంలో తలపడ్డారు. జలగం వెంకటరావు(ఇండిపెండెంట్)పై తుమ్మల విజయం సాధించారు. అనంతర పరి ణామాల్లో 2014 సాధారణ ఎన్నికల కంటే ముందే జలగం వెంకటరావు టీఆర్ఎస్ లో చేరారు. కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2015లో తుమ్మల కూడా టీఆర్ఎస్లో చేరారు. దీంతో జలగం వెంకటరావుతో కలిసి పనిచేయాల్సి వచ్చింది. ఇటీవలే మాజీ మంత్రి జలగం ప్రసాదరావు కూడా టీఆర్ఎస్లో చేరారు. దశాబ్దాలుగా ప్రత్యర్థులుగా ఉన్న జలగం సోదరులు, తుమ్మల నాగేశ్వరరావు ఒకే పార్టీలో ఒకే వేదికను పంచుకోవటం రాజకీయ విశ్లేషణకు దారితీసింది. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి రాజకీయ ప్రవేశం చేసిన ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా టీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు అందరు కలిసి టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగటం రాజకీయ వర్గాల్లో చర్చానీయాంశమైంది. -
కాంగ్రెస్‌లో దక్కని చోటు.. బీజేపీ నుంచి పోటీ?
సాక్షి, హైదరాబాద్ : అసంతృప్తుల నిరసనలు కాంగ్రెస్ పార్టీకి కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలలో తన పేరు లేకపోవడంతో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేత మానవతారాయ్ తీవ్ర అసంతృత్తి వ్యక్తం చేస్తున్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని విద్యార్థులందరికీ వివరిస్తానని.. మహాకూటమికి వ్యతిరేకంగా విద్యార్థి లోకాన్ని ఏకం చేస్తానని ఆయన ప్రకటించారు. కాగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఓయూ విద్యార్థులకు సీట్ల కేటాయింపుల్లో మహాకూటమి తీవ్ర అన్యాయం చేసిందని ఓయూ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మానవతారయ్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి స్థానాన్ని ఆశించిన విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా ఆసీటు టీడీపీకి కేటాయించడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మరోసారి పోటీలో నిలిచారు. మరోవైపు మానవతారాయ్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరతారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై తన అనుచరులతో చర్చించిన అనంతరం తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని ఆయన తెలిపారు. బీజేపీ నుంచి కంటోన్మెంట్ స్థానంలో బరిలో నిలిచే అవకాశం ఉందని సమాచారం. -
సుభాని మృతదేహం లభ్యం
సత్తుపల్లి: సత్తుపల్లి పట్టణానికి చెందిన నాటు కోళ్ల వ్యాపారి ఎస్కె. మహబూబ్ సుభాని(35) మృతదేహం శనివారం మండలంలోని రుద్రాక్షపల్లి శివారులో లభ్యమైంది. డాగ్‌స్క్వాడ్ సాయంతో అతడి శవాన్ని పోలీసులు గుర్తించారు. ఎస్కె. మహబూబ్ సుభాని బుధవారం సాయంత్రం నాటుకోళ్ల కోసం ఎప్పటిలాగే వెళ్లాడు. రెండురోజులు గడిచినా సుభాని ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు సత్తుపల్లి పోలీస్‌స్టేషన్‌లో గురువారం రాత్రి ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి శివారులో చినడొంక దారిలో రక్తపు మరకలు, చొక్కా గుండీలు, చెప్పులు, హెల్మెట్, సెల్ కవర్, పర్సు, కాంటా రాళ్లు కన్పించటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. మిస్సింగ్ అయిన సుభానికి సంబంధించిన వస్తువులుగా మామయ్య బాజీ గుర్తించారు. ఆ పరిసర ప్రాంతాలలో బంధువులు, పోలీసులు గాలింపు చేపట్టినా ఆచూకీ లభించలేదు. డాగ్‌స్క్వాడ్ ప్రవేశంతో.. మహబూబాబాద్ జిల్లాకు చెందిన డాగ్‌స్క్వాడ్ బృందాన్ని సత్తుపల్లి ఎస్సై నరేష్‌బాబు శనివారం ఉదయం రుద్రాక్షపల్లిలోని చిన్నడొంక ప్రదేశంలోని రక్తపు మరకలు ఉన్న వద్దకు తీసుకెళ్లారు. మహబూబ్ సుభాని చెప్పులు, వస్తువులను వాసన చూపించటంతో డాగ్‌స్క్వాడ్ సుమారు 200 మీటర్ల దూరంలోని కల్వర్టు వద్దకు వెళ్లి ఆగిపోయింది. చుట్టు పక్కల అంతా వరిపొలాల్లో నీళ్లు ఉండటంతో కొద్దిసేపు డాగ్‌స్క్వాడ్ అక్కడక్కడే తిరుగుతుండటంతో పోలీసులు సమీపంలోని వరి పొలాలను క్షుణ్ణంగా పరిశీలించే క్రమంలో దుర్వాసన వెదజల్లింది. అనుమానం వచ్చి వరిదుబ్బలను తొలగిస్తుండగా మహబూబ్ సుభాని మృతదేహం కన్పించింది. మూడురోజులు కావటంతో మృతదేహం బాగా ఉబ్బిపోయి చర్మం ఊడిపోయింది. అక్కడే ప్రభుత్వ వైద్యులు నర్సింహారావును పిలిపించి పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. నాటుకోళ్ల లావాదేవీలే.. రుద్రాక్షపల్లి గ్రామానికి చెందిన ఓ నాటుకోళ్లు దొంగతో మహబూబ్ సుభానికి వ్యాపార లావాదేవీలు ఉన్నట్లు సమాచారం. జనవరి నెలలో బుగ్గపాడు, రుద్రాక్షపల్లి పరిసర ప్రాంతాల్లో పందెం కోళ్లు పెద్ద ఎత్తున దొంగలించబడ్డాయి. ఇటీవలే ఆ యువకుడు తన సొంత ద్విచక్ర వాహనం రూ.8 వేలకు తాకట్టు పెట్టి జూదం ఆడి డబ్బులు పోగొట్టుకున్నట్లు తెలిసింది. డబ్బుల కోసం ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో మహబూబ్ సుభాని మృతి చెందినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనలో ఇంకా ఎంతమంది ఉన్నారో తెలుసుకునేందుకు పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సత్తుపల్లి పట్టణ సీఐ ఎం.వెంకటనర్సయ్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
చెరువులోకి దూసుకెళ్లిన కారు
అలుగు చూసేందుకు వెళ్లగా ప్రమాదం సత్తుపల్లి రూరల్: స్నేహితుల దినోత్సవం సందర్భంగా మిత్రులతో సరదాగా గడుపుదా మని వచ్చిన ఓ స్నేహితుడు ప్రమాదం బారిన పడి ఆ కుటుంబంలో విషాదం నింపాడు. సత్తుపల్లికి చెందిన సింగరేణి ఉద్యోగి మల్లిశెట్టి కొండేశ్వరరావు తనయుడు హిమకిరణ్, కృష్ణాజిల్లా తిరువూరుకు చెందిన గోల్డ్‌షాపు యజమాని కొక్కొండ గిరిబాబు తనయుడు వినోద్(22) మంచి మిత్రులు. ఆదివారం బేతుపల్లి చెరువు అలుగును చూసేందుకు వెళ్లగా.. కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. అందు లోని ఇద్దరు కారు డోర్లు తీసుకొని కారుపైకి వచ్చారు. స్థానికులు రక్షించేందుకు చెరువులోకి వెళ్లి ఒడ్డుకు తీసుకొస్తుండగా.. వినోద్ చేతిలోని సెల్‌ఫోన్ పడిపోవడంతో దానిని తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా జారి చెరువులో పడిపోయాడు. పట్టుకునేందుకు స్థానికులు ప్రయత్నం చేసినా చిక్కలేదు. హిమకిరణ్‌ను క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. ఆదివారం రాత్రి 8 గంటల వరకు గాలింపు చర్యలు కొనసాగాయి. -
ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారుల మృతి
సత్తుపల్లి: చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడిన సంఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేజర్ల గ్రామంలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. దీంతో రేజర్ల గ్రామంలో ఒక్కసారిగా విషాదచాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది. -
ట్రాక్టర్ పై నుంచి పడి ఇద్దరి మృతి
సత్తుపల్లి: ట్రాక్టర్ పై నుంచి పడి ఇద్దరు కూలీలు మృతిచెందిన సంఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేజర్ల గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కూలీలు ట్రాక్టర్‌పై పొలాలకు ఎరువు తరలిస్తున్న సమయంలో చెరువు కట్ట వద్దకు చేరుకోగానే ట్రక్ పై ఉన్న నలుగురు కూలీలు జారి కిందపడ్డారు. అది గమనించని డ్రైవర్ అలాగే ముందుకు పోనివ్వడంతో.. వెంకటేశ్వర్రావు(45), సత్యావతి(40) అనే ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.4 లక్షల సొత్తు చోరీ
సత్తుపల్లి : ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్ణణంలో దొంగలు శనివారం రాత్రి ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. కిష్టారం రోడ్డులో నివసించే ప్రసాద్ అనే వ్యక్తి కిన్లే వాటర్ ప్లాంట్‌లో రాత్రి షిఫ్ట్‌లో పనిచేస్తున్నాడు. అతని ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గమనించిన దొంగలు తాళం పగులగొట్టి లోపలున్న బంగారు ఆభరణాలు, రూ.85వేల నగదు కలిపి మొత్తం రూ.4 లక్షల సొత్తును ఎత్తుకుపోయారు. దీనిపై ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
రోడ్డు పక్కన రేషన్ కందిపప్పు ప్యాకెట్ల గుట్ట
నిరుపేదలకు అందించాల్సిన సబ్సిడీ కందిపప్పును రేషన్ డీలర్లు అక్రమంగా షాపులకు తరలిస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం కాకర్లపల్లి రోడ్డు గాడుదల వాగు వద్ద రోడ్డు పక్కన సోమవారం ఉదయం రేషన్ కందిపప్పు ఖాళీ ప్యాకెట్లు గుట్టగాలుగా పడి ఉన్నాయి. ఈ ఏడాది జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి ఈ ప్యాకెట్లపై తయారీ ముద్రలు ఉన్నాయి. వీటిని గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. రెవెన్యూ అధికారులు ఆర్ఐ హుస్సేన్, వీఆర్వోలు కె.శ్రీధర్, వెంకటేశ్వర్లు హడావుడిగా ఆ ఖాళీ ప్యాకెట్లను బస్తాలలో కుక్కి స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి తరలించారు. మండలంలో మూడు నెలల నుంచి సరిగా సబ్సిడీ కందిపప్పు పంపిణీ చేయటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు ధర రూ.120 నుంచి రూ.140వరకు ఉండటంతో అదే అదనుగా భావించిన కొందరు రేషన్ డీలర్లు నిరుపేదల పొట్టగొట్టి షాపులకు విక్రయిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. సత్తుపల్లి పట్టణంలోని ఐదు రేషన్ దుకాణాల్లో విచారణ నిర్వహిస్తామని సివిల్ సప్లై డీటీ కరుణాకర్ తెలిపారు. అవసరమైతే పక్క మండలాల చౌక ధరల దుకాణలపైన కూడా విచారణ చేస్తామని అన్నారు. -
ధీమా ఇవ్వని బీమా
సత్తుపల్లి : ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతింటే రైతులు నష్టపోకుండా ఉండేందుకు బ్యాంకర్లు ‘ పంటల బీమా- రైతుకు ధీమా’ నినాదంతో కొంత మొత్తాన్ని ఇన్సూరెన్స్ కింద వసూలు చేశారు. అయితే పరిహారం ఇవ్వడం మాత్రం మరిచారు. దీంతో దిక్కుతోచని రైతులు తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. గతేడాది ఖరీఫ్‌లో జిల్లాలో మూడు లక్షల ఎకరాలలో వరిసాగు చేశారు. ఇందులో సుమారు 30 వేల ఎకరాలలో బెరుకులు(తాలు) వచ్చి అన్నదాత కుదేలయ్యాడు. పంట నష్టం వాటిల్లిన ఆ పొలాలను అప్పటి మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వ్యవసాయశాఖ శాస్త్రవేత్తలు, జిల్లా అధికారులు పరిశీలించారు. పంటల బీమా పథకం కింద రైతులకు నష్ట పరిహారం ఇప్పిస్తామని హామీలు గుప్పించారు. నష్టపోయిన పంట వివరాలను నమోదు చేయించుకోవాలని, రైతుల పట్ల అధికారులు సానుభూతితో వ్యవహరించాలని అధికారులకు సూచించారు. అయితే ఏడాది కావస్తున్నా.. ఇప్పటి వరకు ఎటువంటి సహాయం అందక పోవటం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తుపాను, తెగుళ్ల దెబ్బకు పంటలకు నష్టం వాటిల్లితే ఇన్సూరెన్స్ ఇస్తామని ప్రకటించిన అధికారులు ఇప్పుడు తమను పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. రుణాలు ఇచ్చే సమయంలో రూ.100కు రూ.2.50 పైసలు ఇన్సూరెన్స్ కింద బ్యాంకర్లు వసూలు చేశారు. వీటిని జాతీయ వ్యవసాయ పథకం కింద ఇన్సూరెన్స్‌కు పంపిస్తామని, పంటలు నష్టపోయినప్పుడు ఇన్సూరెన్స్ వర్తింస్తుందని చెప్పారు. కానీ ఏడాది గడిచినా ఎలాంటి పరిహారమూ చెల్లించకపోవడంతో దానికోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. నష్ట పరిహారం అంచనాలిలా.. ప్రతి ఏడాది 500 ఎకరాల్లో ఎనిమిది చోట్ల రెవెన్యూ శాఖకు చెందిన సహాయ గణాంక అధికారి (ఎఎస్వో) పంటకోత ప్రయోగాలు చేపట్టి నమూనాలను సేకరిస్తారు. ఒక ఎకరంలో ఐదు సెంట్ల పంట కుప్పనూర్చి ఎంత దిగుబడి వచ్చిందో ఎకరంతో కలిపి లెక్కిస్తారు. 6 కేజీల పైనవస్తే పంట బాగా పండినట్లే.. లోపు వస్తే పంట దిగుబడి తగ్గినట్లుగా భావిస్తారు. ఆ నివేదికను చీఫ్ డ్రాయింగ్ అధికారి ద్వారా హైదరాబాద్‌కు పంపిస్తారు. అక్కడి నుంచి సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీలకు పంపిస్తే.. అక్కడ నుంచి నేరుగా నష్టపరిహారం రైతుల ఖాతాలో చేరుతుంది. అయితే ఇన్సూరెన్స్ చెల్లించేటప్పడు రెండేళ్ల నుంచి పంటల పరిస్థితిని పరిశీలిస్తారు. వరికి గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుంటే మొక్కజొన్నకు మండలాన్ని యూనిట్‌గా తీసుకొని పంట కోత ప్రయోగాలను చేపడతారు. మామిడి పంటలకూ అతీగతీ లేదు.. జిల్లాలో 48 వేల హెక్టార్లలో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. మూడేళ్ల నుంచి వరుసగా పంటలు దెబ్బతింటున్నా.. అధికారులు తమను పట్టించుకోవటం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. పెద్ద మామిడి చెట్టుకు రూ.46, చిన్న చెట్టుకు రూ.36 చొప్పున ఇన్సూరెన్స్ వసూలు చేశారని, ఎకరాకు 40 చెట్లకు రూ.1800 చెల్లించామని వారు చెపుతున్నారు. అయితే 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తేనే నష్ట పరిహారం వస్తుందని, ఇది రిఫరల్ వెదర్ స్టేషన్లో నమోదు కావాలని, అప్పుడే కేంద్ర ప్రభుత్వం నష్ట పరిహారం అందిస్తుందని అధికారులు అంటున్నారు. ఇలా అనేక నిబంధనలు విధించి ప్రభుత్వం, బ్యాంకు అధికారులు తమకు మొండిచేయి చూపుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. -
ఔరా.. ఎంత తేడా!
సత్తెనపల్లి, న్యూస్‌లైన్ : గ్రామ సర్పంచి నుంచి పార్లమెంట్ సభ్యులకు వరకు అంతా ప్రజా ప్రతినిధులే.. ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్నవారే.. వారు బాధ్యతలు నిర్వర్తించే పరిధిలోనే తేడా. ఎంపీ, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తే జెడ్పీటీసీ జిల్లాకు, ఎంపీపీ మండలానికి, సర్పంచ్ తన గ్రామ పంచాయతీకి బాధ్యులుగా వ్యవహరిస్తుంటారు. ఎంపీ, ఎమ్మెల్యేలకు ఇచ్చే గౌరవవేతన ం లక్షల రూపాయల్లో ఉంటుంది. స్థానిక ప్రజా ప్రతినిధులకు మాత్రం మరీ దారుణం. జెడ్పీటీసీ సభ్యులకైతే మండల పరిషత్‌లో కూర్చునేందుకు కనీసం కుర్చీ కూడా కేటాయించకపోవడం మన వ్యవస్థలోని లోపాల్ని ఎత్తి చూపుతోంది. పార్లమెంట్, శాసనసభ సభ్యులుగా గెలుపొందిన వారికి విలాస వంతమైన భవనాల్లో నివాసం, కార్లు, రైళ్లు, విమానాల్లో ప్రయాణాలు, రాయితీపై వైద్యం, టెలిఫోన్ సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుంది. ఒక్కసారి పోటీచేసి గెలిస్తే జీవితాంతం లభించే పింఛను, ఇలా ఎన్నో సదుపాయాలు కల్పిస్తున్నారు. ఎంపీకి నెలకు అన్నీ కలిపి రూ. 2 లక్షలకు పైగా చెల్లిస్తుండగా,ఎమ్మెల్యేకు రూ. లక్ష వరకు అందుతుంది. ఏటా ఎంపీ నిధుల ద్వారా రూ.5 కోట్ల వరకు అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలకు రూ. 50 లక్షల నుంచి కోట్ల రూపాయలు మంజూరు చేయించుకోవచ్చు. జిల్లా, మండల పరిషత్ సమావేశాలకు హాజరైతే వీరికి మరికొంత అదనంగా చెల్లిస్తారు. ఎంపీపీకి రూ. వందల్లోనే... స్థానిక ప్రజాప్రతినిధులుగా గెలిచిన జెడ్పీటీసీ సభ్యులకు నెలకు రూ. 2,250 వేతనం చెల్లిస్తారు. అదే ఎంపీపీకి రూ. వెయ్యి మాత్రమే చెల్లిస్తారు. జిల్లా, మండల సర్వసభ్య సమావేశాలకు హాజరైతే రవాణా భత్యం రూ. వందల్లో చెల్లిస్తారు. జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేస్తున్నవారు నామినేషన్ ఫీజుగా ఎస్సీ, ఎస్టీ, బీసీలైతే రూ. 2,500 చెల్లించాలి. ఇతరులు రూ. 5వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఎంపీపీ స్థానానికి పోటీచేయాలనుకునేవారు ఎస్సీ, ఎస్టీ, బీసీలైతే రూ. 1250, ఇతరులు రూ.2,500 చెల్లించాలి. ఎన్నికల ఖర్చు కింద జెడ్పీటీసీ అభ్యర్థులు రూ. 2 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు. ఎంపీటీసీ అభ్యర్థులు రూ. లక్షలోపు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎన్నికల్లో గెలిచిన జెడ్పీటీసీకి రూ. 2,250 చెల్లిస్తుండగా, ఏడాదికి రూ. 27వేలు చొప్పున ఐదేళ్ళల్లో రూ. 1.35 లక్షలు మాత్రమే అందుతాయి. ఎంపీపీకి నెలకు రూ. వెయ్యి చెల్లిస్తుండగా, ఏడాది రూ. 12వేలు చొప్పున ఐదేళ్లకు రూ. 60 వేలు అందుతాయి. ఎంపీపీలు జిల్లా సమావేశాలకు హాజరయ్యేందుకు నెలకు రూ. 500 చొప్పున చెల్లిస్తారు. ఈ లెక్కన చూసుకుంటే జెడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థులకు ఐదేళ్లలో చెల్లిస్తున్న జీతాలు మొత్తం ఎన్నికల్లో వెచ్చించిన ఖర్చులకంటే చాలా తక్కువ. జెడ్పీటీసీ సభ్యుడికి మండల పరిషత్ కార్యాలయంలో కనీసం కుర్చీ కూడా ఉండదు. అరకొర వేతనం ఇస్తున్నా సర్దుకుపోతున్న జెడ్పీటీసీ సభ్యులకు కనీసం కుర్చీ కూడా కేటాయించలేదని గతంలో పలువురు సభ్యులు వాపోయిన సంఘటనలున్నాయి. -
పోస్టింగ్‌ల కోసం ప్రదక్షిణలు!
సత్తుపల్లి, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించనుంది...నూతన ప్రభుత్వమూ అధికారంలోకి రానుంది...ఇక మంచి పోస్టింగ్‌ల కోసం అధికారులు హైదరాబాద్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అధికారపార్టీ నేతలను ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. పలువురు అధికారులు తమకు తెలిసిన టీఆర్ఎస్ నేతలను వెంటబెట్టుకొని అగ్రస్థాయి నేతల వద్దకు వెళ్లి తెలంగాణ ఉద్యమం, సకలజనుల సమ్మెలో ఎట్లా పని చేశామో ఏకరువు పెడుతూ తమ బయోడేటాలను వాళ్ల ముందు ఉంచుతున్నారు. ఎన్నికల సంఘం నిబంధనలతో జిల్లాలో పనిచేస్తున్న తహశీల్దార్లు, ఎంపీడీఓలు, ఏఓలు ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు బదిలీపై వెళ్లాల్సి వచ్చింది. కొద్ది రోజుల్లో మళ్లీ జిల్లాకు వచ్చే అవకాశం ఉండటంతో మంచి పోస్టింగ్‌ల కోసం పైరవీలు ప్రారంభించారు. ఎవరిని పట్టుకుంటే పని అవుతుందో ఆరాతీస్తూ... తమ పనిని చేయించుకునేందుకు ఎవరి ప్రయత్నాల్లో వారున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా పోలీస్ శాఖలో కూడా బదిలీలు జరగవచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది. జూన్ పది తరువాతనే.... జూన్ 2 అపాయింటెడ్ డే రోజున కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పరిపాలనపై పూర్తి పట్టు సాధించేందుకు అధికార యంత్రాంగం కూర్పుపై ఆయన దృష్టిసారించే అవకాశం ఉంది. జూన్ 10వ తేదీ నుంచి ఇతర జిల్లాల్లో పని చేసిన అధికారులను సొంత జిల్లాలకు బదిలీపై తిరిగి పంపించే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ఈలోగానే తమతమ పరిచయాలతో మంచి పోస్టింగ్‌లు దక్కించుకునేందుకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అదే విధంగా ఇక్కడకు బదిలీపై వచ్చిన అధికారులు కూడా ఆయా జిల్లాల్లో కలెక్టర్‌కు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. అయితే వారిలో కొందరు అధికారులు ఈ జిల్లాలోనే పని చేసేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. మొత్తంగా ప్రభుత్వ కార్యాలయాలలో ఇప్పుడు ఎక్కడ విన్నా బదిలీల మాటే. ఎవరు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతారు.. కొత్తవారు ఎవరు పోస్టింగ్ తెచ్చుకుంటారోనని చర్చలు జోరుగా సాగుతున్నాయి. -
ఖరీఫ్‌కైనా నీరందేనా..?
సత్తుపల్లి, న్యూస్‌లైన్ : ‘మే నెలాఖరుకు బేతుపల్లి ప్రత్యామ్నాయ కాలువ పనులు పూర్తి చేస్తాం.. వచ్చే ఖరీఫ్ నాటికి వేంసూరు మండలానికి సాగునీరు అందిస్తాం..’ అని ఆర్భాటంగా ప్రకటించిన అధికారులు ఆచరణలో విఫలమయ్యారు. వారి నిర్లక్ష్యం కారణంగా ఏళ్ల తరబడి ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయని.. భూసేకరణకు అడ్డంకులు తొలగించటంలో రెవెన్యూ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. పాత ఎన్టీఆర్ కాలువ సింగరేణి ఓపెన్‌కాస్టు విస్తరణలోకలిసిపోతున్నందున.. వేంసూరు మండలానికి సాగునీరు అందించే లక్ష్యంతో బేతుపల్లి ప్రత్యామ్నాయ కాలువ పనులు చేపట్టారు. ఈ కాలువ ద్వారా మండలంలోని 41 చెరువులను నింపి, 40 వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2007 నవంబర్‌లో ప్రారంభించిన పనులు 2009లోనే పూర్తి కావాల్సి ఉంది. అయితే సాంకేతిక కారణాలతో కాల్వ డిజైన్ మార్చి మళ్లీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. దీనికి ఆమోదం లభించడానికి రెండేళ్లకు పైగా పట్టింది. అసైన్డ్ భూమలకు పరిహారం ఇవ్వకపోవటంతో... అసైన్డ్ భూములకు పరిహారం ఇవ్వటంలో రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో భూనిర్వాసితులు పనులను అడ్డుకుంటున్నారు. సత్తుపల్లి మండలం రేజర్లలో మూడు ఎకరాలు, వేంసూరు మండలం లింగపాలెంలో మూడు ఎకరాలకు పరిహారం చెల్లించాల్సి ఉంది. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు ‘సర్వేలు చేశాం.. రిపోర్టులు సమర్పిస్తున్నాం’ అని చెపుతున్నారే తప్ప తమకు మాత్రం పరిహారం అందడం లేదని భూ నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా రెండేళ్లు గడుస్తున్నా అధికారుల సమన్వయ లోపంతో మట్టి కాలువ నిర్మాణ పనులు ఒక్క అంగుళం కూడా ముందుకు సాగలేదు. కాగా, కాల్వ నిర్మాణ పనుల కోసం 103 ఎకరాల పట్టాభూమిని కూడా సేకరించి, సంబంధిత రైతులకు రూ.6 కోట్లు పరిహారం చెల్లించారు. అయితే స్ట్రక్చర్ల నిర్మాణానికి 50 మీటర్ల భూమి అవసరం కాగా, తొలుత 40 మీటర్లు మాత్రమే సేకరించి పరిహారం అందించారు. ఆ తర్వాత మిగితా 10 మీటర్ల మేర కూడా భూమి తీసుకున్నప్పటికీ.. సంబంధిత రైతులకు పరిహారం ఇవ్వడంలో జాప్యం చేశారు. చివరకు ఆయా రైతులు పనులపై అభ్యంతరం వ్యక్తం చేయడం, నిర్మాణాన్ని అడ్డుకోవడంతో ఎట్టకేలకు గత ఏడాది ఎకరాకు రూ.5.50 లక్షల చొప్పున ధర నిర్ణయించి వారికి రావాల్సిన మొత్తాన్ని అందజేశారు. ఇది కూడా పనుల జాప్యానికి ఓ కారణమైంది. ఇక అసైన్డ్ రైతులకు నేటికీ పరిహారం ఇవ్వకపోవడంతో వారు కూడా పనులు అడ్డుకుంటున్నారు. నిధులు పుష్కలంగా ఉన్నప్పటికీ.. ఇలా అధికారుల అలసత్వంతో పనులు ముందుకు సాగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బ్రిడ్జి పనులకు ఆటంకం... సత్తుపల్లి పట్టణ శివారులో బేతుపల్లి ప్రత్యామ్నాయ కాలువపై హైలెవల్ వంతెన నిర్మాణ పనులు చేపట్టారు. అయితే ఇసుక కొరతతో మూడు నెలలకుపైగా పనులు నిలిచిపోయాయి. ఇటీవలే రవాణాకు క్లియరెన్స్ రావటంతో ఇసుక తోలుతున్నారు. బేతుపల్లి చెరువు నుంచి వేశ్యకాంతల చెరువుల వరకు 3.5 కిలోమీటర్లు కెనాల్ బ్యాంకింగ్ (బండ్ కాలువ) పనులు కూడా చేపడుతున్నారు. బండ్(మట్టితో కట్ట) కాలువకు ఇరువైపులా 50 మీటర్ల వెడల్పు, 9 అడుగుల ఎత్తులో కాలువ 12 మీటర్ల వెడల్పుతో కాలువ నిర్మాణం చేపట్టి రాయితో రివిటింగ్ పనులు చేస్తున్నారు. ఇవి 90 శాతం మేర పూర్తి కావచ్చాయి. -
అంతుచిక్కని మున్సి‘పల్స్’
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలోని పట్టణ ఓటర్లు విలక్షణ తీర్పునిచ్చారు. సోమవారం వెలువడిన ఫలితాలను చూస్తే....నాలుగు మున్సిపాలిటీలకు గాను ఒక్క సత్తుపల్లి మినహా మిగిలిన మూడు చోట్ల ఏ పార్టీకీ మున్సిపల్ పీఠంపై కొలువుతీరేన్ని స్థానాలు రాలేదు.సత్తుపల్లిలో తెలుగుదేశం పార్టీ స్పష్టమైన ఆధిక్యం కనపర్చగా, కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. ఇక్కడ స్వతంత్రుల మద్దతు అనివార్యం కానుంది. ఇల్లెందులో కాంగ్రెస్, సీపీఐ కూటమి అధికారానికి దగ్గరగా రాగా, మధిరలో మాత్రం హంగ్ ఫలితం వచ్చింది. ఇక్కడ వైఎస్సార్సీపీ, సీపీఎంల మద్దతు కీలకం కానుంది. ఈ రెండు పార్టీల నిర్ణయం మేరకే ఇక్కడ మున్సిపాలకవర్గం ఏర్పాటు కానుందని ఫలితాలు చెబుతున్నాయి. ఈ ఫలితాలను బట్టి చూస్తే జిల్లాలోని పట్టణ ప్రజల నాడి రాజకీయ పార్టీలకు అంతుచిక్కలేదని స్పష్టమవుతోంది. అభ్యర్థుల గుణగణాలతో పాటు పార్టీల ప్రభావం కూడా కొంత మేర ఉండే మున్సిపల్ ఎన్నికలలో ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో ఇప్పుడు దృష్టంతా ఎంపీటీసీ, జడ్పీటీసీ, సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై పడనుంది. అయితే, జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల ఫలితాన్ని బట్టి సార్వత్రిక ఫలితాలను అంచనా వేయలేమని, ఈ ప్రభావం సార్వత్రికంపై ఉండదనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇల్లెందులో ఆ ‘ఇద్దరే’ కీలకం మున్సిపాలిటీల వారీగా పరిశీలిస్తే... ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్, సీపీఐ కూటమికి అత్యధిక స్థానాలు లభించాయి. ఇక్కడ మొత్తం 24 వార్డులుండగా, ఈ రెండు పార్టీలకు కలిపి 11 స్థానాలు వచ్చాయి. పాలకవర్గాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మరో ఇద్దరు స్వతంత్రులే ఇక్కడ కీలకపాత్ర పోషించనున్నారు. అయితే, ఇండిపెండెంట్లుగా గెలిచిన వారిలో ఒకరు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్పర్సన్ శిబిరంలో ఉన్నారు. సదరు అభ్యర్థి ఎన్నికల ఖర్చు కూడా వారే భరించినట్టు సమాచారం. ఇక మరో ఇండిపెండెంట్ మద్దతు కూడా కాంగ్రెస్, సీపీఐ కూటమికి సునాయాసంగా లభించవచ్చు. మిగిలిన పార్టీలకు వచ్చిన స్థానాలను బట్టి చూస్తే అన్నీ కలిసినా ఇక్కడ కొలువుతీరే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ కాంగ్రెస్, సీపీఐ కూటమి అధికారం దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధిరలో రసకందాయం కొత్తగా ఏర్పడిన మధిర నగరపంచాయతీ ఎన్నికలు తొలిసారే రసకందాయంలో పడ్డాయి. ఇక్కడ ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాలేదు. మొత్తం 20 స్థానాలకు గాను ఏడు చోట్ల వైఎస్సార్ సీపీ, సీపీఎం కూటమి అభ్యర్థులు గెలవగా, కాంగ్రెస్ నాలుగు, టీడీపీ ఆరు చోట్ల గెలిచింది. వైఎస్సార్ సీపీ, సీపీఎం కూటమికి చెందిన రెబల్ అభ్యర్థి కూడా విజయం సాధించారు. కాంగ్రెస్, టీడీపీలకు కలిపి 10 స్థానాలు రావడంతో ఇక్కడ ఈ రెండు పార్టీలు అవగాహనకు వస్తాయని, చెరి రెండున్నరేళ్ల పాటు చైర్మన్‌గిరీ దక్కేలా అధికారాన్ని పంచుకుంటారని ప్రచారం జరుగుతోంది. అయితే రెండు పార్టీలు కలిసినా వైఎస్సార్సీపీ, సీపీఎం ఇక్కడ కీలకం కానున్నాయి. ఈ పరిస్థితుల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత మధిర రాజకీయం మరింత వేడెక్కుతుందని, ఇక్కడ క్యాంపు రాజకీయాలకు కూడా ఆస్కారం ఉందని, కాంగ్రెస్, టీడీపీలు ఇందుకు సిద్ధం కావచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొత్తగూడెం పద్ద కష్టమేమీ కాదు కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో కూడా ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాకపోయినా, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ గిరీని దక్కించుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ మొత్తం 33 వార్డులకు గాను 12 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. మెజార్టీకి మరో ఐదు స్థానాలు అవసరం కాగా, వైఎస్సార్సీపీ, ఇండిపెండెంట్ల మద్దతు కూడగట్టుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చైర్‌పర్సన్‌ను దక్కించుకునే అవకాశం ఉంది. అయితే, కాంగ్రెస్‌లో కూడా చైర్మన్‌గిరీ కోసం పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. సత్తుపల్లిలో గెలిచి ఓడిన టీడీపీ ఇక సత్తుపల్లిలో మాత్రం తెలుగుదేశం పార్టీకి స్పష్టమైన మెజార్టీ లభించింది. మొత్తం 20 స్థానాలకు గాను 17 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక్కడ మూడు చోట్ల వైఎస్సార్సీపీ గెలుపొందింది. అయితే, ఇక్కడ టీడీపీ మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా ప్రకటించిన కందిమళ్ల నాగేశ్వరమ్మ ఓటమిపాలు కావడం ఆ పార్టీ శ్రేణులను నైరాశ్యంలో ముంచింది. మొత్తంమీద ఇక్కడ తెలుగుదేశం పార్టీ పాలకవర్గం ఏర్పాటు లాంఛనమే కానుంది. ఓట్ల కోసం పోటాపోటీ జిల్లాలోని పట్టణ ఓటర్ల ప్రసన్నం కోసం రాజకీయ పార్టీలు విపరీతంగా శ్రమించాయి. అయితే, ఈ పోటీలో జిల్లా వ్యాప్తంగా చూస్తే టీడీపీ, కాంగ్రెస్‌లు మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. మొత్తం దాదాపు లక్ష ఓట్లకు గాను 26వేలకు పైగా టీడీపీ, 23వేలకు పైగా కాంగ్రెస్‌లు సాధించాయి. అయితే, టీడీపీకి ఒక్క సత్తుపల్లిలోనే 12వేలకు పైగా పోలయ్యాయి. వైఎస్సార్సీపీ, సీపీఎం కూటమికి కూడా గణనీయంగానే ఓట్లు లభించాయి. ఈ రెండు పార్టీలకు కలిపి దాదాపు 14వేల ఓట్లు లభించాయి. సీపీఐకి 11వేలకుపైగా, టీఆర్ఎస్కు ఆరువేల వరకు ఓట్లు లభించాయి. అయితే, ఈ ఫలితాలు సార్వత్రిక ఎన్నికల ఫలితంపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం లేదని రాజకీయ వర్గాలంటున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు నెలరోజుల ముందు మున్సిపల్ ఎన్నికలు అకస్మాత్తుగా జరగడం, ఆ సమయంలో కనీసం సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ రాకపోవడం, పొత్తులు, ఎత్తులు ఖరారు కాకపోవడం లాంటి అంశాలు పరిగణనలోనికి తీసుకుంటే సార్వత్రిక ఫలితాలు భిన్నంగా రావచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కాగా, మున్సిపల్ నూతన పాలక వర్గాలు జూన్ 5వ తేదీలోగా కొలువుదీరనున్నాయి. -
ఇంటర్లో ‘సర్కారు’ సత్తా
సత్తుపల్లి టౌన్, న్యూస్‌లైన్: ఇంటర్మీడియెట్‌లో సత్తుపల్లి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినులు ప్రతిభ చూపారు. 83.58 శాతం ఫలితాలతో కళాశాల రికార్డు స్థాయి ఉత్తీర్ణతను సాధించింది. తెలుగుమీడియం గ్రూప్‌ల్లో తిరుగులేని శక్తిగా నిలిచింది. ఎంపీసీ టీఎంలో నూరుశాతం ఫలితాలు పొందింది. బైపీసీలో 58.33 శాతం, సీఈసీలో 80శాతం, హెచ్ఈసీలో 92 శాతం ఫలితాలు సాధించింది. ఎంపీసీ విభాగంలో తిరువాయిపాటి కల్పనాదేవి 869 మార్కులు, బైపీసీలో ఎం.వసంద్రిక 731, సీఈసీలో దారావతు సౌజన్య 761, హెచ్ఈసీలో తాటి కుమారి 818 మార్కులు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎన్.విజయకుమారి తెలిపారు. ఏటేటా పైపైకి.. అధ్యాపకుల అంకితభావం, విద్యార్థుల పట్టుదలతో కళాశాల కీర్తి ఏటేటా పైపైకి పాకుతోంది. ప్రైవేట్ కళాశాలలకు దీటుగా ఫలితాలు సాధిస్తోంది. 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ కళాశాలను ప్రారంభించారు. అప్పటి నుంచి ఏటేటా వసతులను మెరుగుపర్చుకుంటూ.. అదే రీతిలో ఫలితాలను సాధిస్తోంది. విశాల ప్రాంగణం, పక్కా భవనం, అధునాతన ల్యాబ్‌లతో కాలేజీలో మెరుగైన వసతులు ఉన్నాయి. ఈ ఏడాది ఇంటర్ మొదటి సంవత్సరంలో కళాశాల విద్యార్థినులు 51.8 శాతం ఉత్తీర్ణ సాధించారు. ఎంపీసీ ఇంగ్లిష్‌మీడియంలో రామిశెట్టి దుర్గాభవాని 93 శాతం, తెలుగుమీడియం బైపీసీలో కె.నాగలక్ష్మి 73 శాతం, సీఈసీలో యు.కృష్ణవేణి 79.4 శాతం, హెచ్ఈసీలో తడికమళ్ల సులోచన 75.8 శాతం మార్కులు సాధించారు. -
పోస్టల్ బ్యాలెట్ల సందడి
నేటితో దరఖాస్తుకు గడువు పూర్తి సత్తుపల్లి టౌన్ , న్యూస్‌లైన్: ఈ నెల 30న జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ఓటర్లతో పాటు ఉద్యోగుల ఓట్లు కూడా కీలకం. వందల సంఖ్యలో ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉండడంతో రాజకీయ పార్టీల దృష్టి వీరిపై పడింది. అసెంబ్లీ, పార్లమెంట్‌కు జరిగే ఈ ఎన్నికల్లో ఈ ప్రాంత ఉద్యోగులు సుదూరప్రాంతాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉద్యోగులు.. ఇతర పార్లమెంట్ ప్రాంతానికి గానీ, సమీప జిల్లాల్లో గానీ పని చేయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు శిక్షణ కార్యక్రమంలోనే వారికి బ్యాలెట్ పత్రాల దరఖాస్తు చేసుకునేందుకు ఫాం-12, ఫాం-12ఏలను అందించారు. పోస్టల్ అడ్రస్, పోలింగ్ స్టేషన్ నంబర్ తదితర వివరాలతో ఈ దరఖాస్తులు పూర్తి చేసి స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఈ నెల 15లోగా అందించాల్సి ఉంది. ఉద్యోగుల కోసం బ్యాలెట్ పత్రాలు.. సార్వత్రిక ఎన్నికలకు ఈవీఎంలను వినియోగిస్తున్నప్పటికీ ఎన్నికల్లో పాల్గొనే ఉద్యోగుల కోసం బ్యాలెట్ పత్రాలు ముద్రించి వారి చిరునామాలకు పోస్టులో పంపిస్తారు. ఉద్యోగులు తమకు నచ్చిన అభ్యర్థి గుర్తుపై పెన్నుతో టిక్ చేసిన తర్వాత బ్యాలెట్ పత్రాలు తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసే బ్యాలెట్ బాక్స్‌లో వేయాలి. ఈ నెల 30లోపే ఈ ప్రక్రియ పూర్తి అవ్వాలి. గడువు ఒక్కరోజు మాత్రమే ఉండడంతో ఉద్యోగులతో సత్తుపల్లి రెవెన్యూ కార్యాలయం సందడిగా మారింది. పోస్టల్ బ్యాలెట్ ఇంటికి పంపితే ఒత్తిడి తప్పదు.. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ విధానంలో మార్పు చేసినట్లు సమచారం. రెవెన్యూ కార్యాలయంలో బ్యాలెట్ పత్రాలు ఇస్తారు. ఓటు వేసి వెంటనే అక్కడే ఉన్న బ్యాలెట్ బాక్స్‌లో వేయాలి. అయితే ఈ విధానం వల్ల ఉద్యోగులు స్వేచ్ఛగా, రహస్యంగా ఓటు వేసుకోవచ్చని భావిస్తున్నారు. కానీ బ్యాలెట్ పత్రాలు ఇంటికే పంపించినట్లయితే ఉద్యోగులకు రాజకీయ పార్టీల నుంచి ఒత్తిడి తప్పదని వాపోతున్నారు. ఇప్పటికే కొందరు ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్లను సేకరించి అభ్యర్థుల నుంచి తగిన ఫలాన్ని పొందేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. -
నేడే పురపోరు
సాక్షి, ఖమ్మం: మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది....కొత్తగూడెం, ఇల్లెందు, సత్తుపల్లి, మధిరలలో ఆదివారం పోలింగ్ జరగనుండగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. మొత్తం 97 వార్డుల్లో 143 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికలు జరిగే రెండుమున్సిపాలిటీలు, రెండు నగరపంచాయతీలలో మొత్తం 97 వార్డుల్లో 523 మంది బరిలో నిలవడంతో అన్నిచోట్ల పోటీ తీవ్రంగానే ఉంది. నాలుగు చోట్ల 1,35,235 మంది ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 66,176 మంది, మహిళలు 69,053 మంది ఉన్నారు. కొత్తగూడెంలో అధికంగా 61,266 మంది, మధిరలో తక్కువగా 20,367 మంది ఓటర్లు ఉన్నారు. కొత్తగూడెంలో 33 వార్డులకు 190 మంది, ఇల్లెందులో 24 వార్డులకు 173 మంది అభ్యర్థులు బరిలో నిలవడంతో ఇక్కడ గెలుపును అభ్యర్థులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి 166 ఈవీఎంలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తరలించిన ఈవీఎంలు మొరాయిస్తే ప్రత్యామ్నాయంగా మరికొన్ని ఈవీఎంలను అందుబాటులో ఉంచుతూ అధికారులు చర్యలు తీసుకున్నారు. నిఘా నీడలో.. పోలీస్ భారీ బందోబస్తు నడుమ ఈ ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపల్ ఎన్నికలకు గతంలో కన్నా ఈసారి భద్రతను పెంచారు. నాలుగు కేంద్రాల్లో మొత్తం 108 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నట్లు పోలీస్, రెవెన్యూ అధికారులు గుర్తించారు. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో అన్నీ సమస్యాత్మక ప్రాంతాలే. వీటిలో 34 పోలింగ్ కేంద్రాలు అతి సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. అలాగే ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలో 17 పోలింగ్ కేంద్రాలు, మధిర నగర పంచాయతీ పరిధిలో 8, సత్తుపల్లి నగర పంచాయతీలో 17 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించి కట్టుదిట్టంగా భద్రతను నిర్వహిస్తున్నారు. 53 కేంద్రాల్లో వెబ్, వీడియోగ్రఫీ ద్వారా ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. 41 కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణలో ఎన్నికలు జరగనున్నాయి. మైక్రో అబ్జర్వర్లుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను నియమించారు. పోలింగ్ ప్రక్రియలో 796 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా శనివారమే ఆయా మున్సిపాలిటీల పరిధిలో రిపోర్టు చేశారు. అలాగే పోలీస్ సిబ్బంది కూడా పోలింగ్ కేంద్రాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఓటరు తీర్పుపైనే ఆశలు.. వరుస ఎన్నికల నేపథ్యంలో ముందుగా జరుగుతున్న మున్సిపల్ తీర్పుపై రాజకీయపార్టీలన్నీ ఆశలుపెట్టుకున్నాయి. అభ్యర్థులు సైతం విజయం కోసం చివరి క్షణం వరకూ అన్ని యత్నాలూ చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన గీత దాటకుండా.. పోలింగ్ కేంద్రానికి దూరంలో అభ్యర్థుల వారీగా కేంద్రాలు ఏర్పాటు చేసుకొని ‘గుర్తు.. గుర్తుంచుకోండి..’ అంటూ చివరి అస్త్రాన్ని ఉపయోగించుకునేందుకు సమాయత్తమయ్యారు. ఈ ఎన్నికల రణ రంగంలో ఓటరన్న చివరకు ఎవరికి పట్టం కడతారో ఫలితాల తర్వాతే తేలనుంది. -
ప్ర‘లాభం’!
సత్తుపల్లి, న్యూస్‌లైన్: ఒకప్పుడు వారిది సామాన్యకుటుంబం. ఎప్పుడైతే బుకీలుగా అవతారం ఎత్తారో వారి లైఫ్‌స్టైలే మారిపోయింది. ఒక్కసారిగా కోట్లకు పడగలెత్తారు. అందరి దృష్టినీ ఆకర్షించారు. వారి ఫాలోవర్స్ (అనుచరుల) సంఖ్య కూడా పెరిగిపోయింది. ఓ రాజకీయపార్టీ అండదండలతో ఏకంగా ఈసారి నగరపంచాయతీ ఎన్నికల బరిలో వారి కుటుంబ సభ్యుల్లో ఒకరిని నిలబెట్టారు. డబ్బులు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు పెడుతుండటంతో సత్తుపల్లిలో ఇదో హాట్ టాపిక్‌గా మారింది. పెద్ద పెద్ద కార్లు, ఖరీదైన మోటారు సైకిళ్లు, సెల్ఫోన్లతో వార్డులో తిష్టవేసి ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బుకీల సోకులు చూసి సామాన్య ప్రజలు తమ అవసరాలకు డబ్బులు వస్తున్నాయనే ఆలోచనతో వాళ్ల ఇంటిముందు పడిగాపులు పడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఏడాది నుంచే వ్యూహాత్మకంగా... ఏడాది నుంచే ఆ వార్డుపై బుకీ బ్రదర్స్ దృష్టిపెట్టారని సమాచారం. అప్పటినుంచి అక్కడి యువకులను మద్యం మత్తులో ముంచేసి హల్చల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మద్యం మత్తులో ఇళ్లల్లో ఘర్షణలు పడుతున్నారని..ఈ మాయదారి ఎన్నికలు మా కుటుంబాల్లో చిచ్చు పెట్టేందుకే వచ్చాయంటూ పలువురు మహిళలు దుమ్మెత్తిపోస్తున్నారు. కొందరు యువకులు వారం, పదిరోజుల నుంచి ఇళ్లకు వెళ్లటం కూడా మానేసి మద్యం మత్తులో జోగుతున్నట్లు తెలిసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా వారు ఇప్పటికే లక్షలాది రూపాయలు పంపిణీ చేసినట్లు సమాచారం. ఎక్కువ ఓట్లున్న పెద్దకుటుంబాలపై దృష్టిసారించి లక్షల రూపాయలు ఎరవేసి ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు ప్రచారం. ఆ పార్టీకి చెందిన ఇతర అభ్యర్థుల్లో టెన్షన్.. బుకీల హల్చల్ ప్రభావం తమపై పడుతోందని ఆ పార్టీలోని ఇతర అభ్యర్థులు పైస్థాయి నాయకుల వద్ద మొరపెట్టుకుంటున్నారు. ఒక్కో ఓటుకు కనీసం రూ.5వేల నుంచి రూ.10వేల వరకు వారు ఖర్చు చేస్తుండటంతో తమను కూడా అడుగుతున్నారంటూ ఆ పార్టీ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎక్కడి నుంచి తెచ్చివాలని వాపోతున్నట్లు సమాచారం. తమ కుటుంబీకులకు వైస్ చైర్మన్ పదవి కట్టబెడితే కోటి రూపాయల వరకు ఖర్చుపెడతామని బహిరంగంగానే ఆ బుకీలు ప్రకటించినట్లు ప్రచారం సాగుతోంది. బుకీల సంబంధీకులు పోటీలో నిలబడి లక్షలాది రూపాయలు ఖర్చుపెడుతున్నా.. ఎన్నికల నిఘా యంత్రాంగం ఏం చేస్తున్నట్లు అని ప్రజాస్వామికవాదులు ప్రశ్నిస్తున్నారు. పరిస్థితులు ఇలాగే ఉంటే సామాన్యపౌరుడు ఎన్నికల్లో నిలిచే పరిస్థితి ఉండదని వాపోతున్నారు. -
మూడోరోజు జోరు
సాక్షి, ఖమ్మం: మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు జోరందుకున్నాయి. నామినేషన్లు ప్రారంభమైన తొలి రెండురోజులు ఈ ప్రక్రియ మందకొడిగా సాగింది. మూడోరోజు బుధవారం అభ్యర్థులు ఉత్సాహంతో నామినేషన్లు వేశారు. ఇల్లెందు, కొత్తగూడెం, మధిర, సత్తుపలి నగర పంచాయతీలకు మొత్తం 118 నామినేషన్లు దాఖలయ్యాయి. కానీ మధిరలో తొలిరోజు నామినేషన్ల స్వీకరణ నుంచి ఇప్పటి వరకు ఒకటే నామినేషన్ దాఖలవడం గమనార్హం. ఈనెల 10 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైనా రెండు రోజులు మాత్రం నామినేషన్లు అంతగా దాఖలు కాలేదు. బుధవారం మంచిరోజు కావడంతో అభ్యర్థులు కోలాహలంగా నామినేషన్లు దాఖలు చేశారు. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో పలు వార్డులకు 40 నామినేషన్లు, ఇల్లెందులో 53, సత్తుపల్లిలో 24 నామిషన్లు దాఖలు కాగా మధిరలో మాత్రం ఒకే ఒక నామినేషన్ వేశారు. మధిర నగరపంచాయతీ పరిధిలో 20 వార్డులు ఉన్నాయి. పదో వార్డుకు స్వతంత్ర అభ్యర్థిగా తిమ్మినేని రామారావు నామినేషన్ దాఖలు చేశారు. రెండు రోజులుగా ఒక నామినేషన్ కూడా దాఖలు కాలేదు. నామినేషన్ల స్వీకరణ నుంచి ఇప్పటి వరకు పార్టీల పరంగా ఒక్క అభ్యర్థి కూడా మధిర నగర పంచాయతీలోని వార్డులకు నామినేషన్ వేయలేదు. స్థానికంగా పొత్తులు ఇంకా ఖరారు కాకపోవడంతో బరిలో నిలవాలనుకుంటున్న అభ్యర్థులు హైరానాపడుతున్నారు. వార్డు సభ్యుడిగా తమకు అవకాశం కల్పించాలని ఆశావాహులు తమ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొత్తగూడెం, సత్తుపల్లిలో ఎస్సీ, ఎస్జీ జనరల్, మహిళలకు రిజర్వు అయిన వార్డుల్లో అసలు అభ్యర్థులు దొరకక పార్టీల నేతలు వెదుకులాట ప్రారంభించారు. పార్టీ కార్యకర్తలు కూడా లేకపోవడంతో ఏమి చేయాలో నేతలకు పాలుపోవడం లేదు. రిజర్వు అయ్యి పార్టీ పరంగా కార్యకర్తలు లేనిచోట...అసలు పార్టీల్లో తిరగని విద్యావంతులపై నేతలు కన్నేశారు. తుది గడువు నాటికి వారిని ఒప్పించి నామినేషన్ వేయించడానికి కసరత్తు చేస్తున్నారు. నామినేషన్ల స్వీకరణ తుది గడువు దగ్గర పడుతుండటంతో అభ్యర్థుల విషయంలో పలు పార్టీలది ఇదే పరిస్థితి. ఇప్పటికే ఖరారైన వారు చివరిరోజు 14న సందడితో నామినేషన్లు వేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. -
సత్తుపల్లి ఇక రెవెన్యూ డివిజన్!
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: సత్తుపల్లి కేంద్రంగా జిల్లాలో కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కాబోతోంది. రాష్ట్ర భూ పరిపాలన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయం ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం జిల్లాలో 47 మండలాలకు నాలుగు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఖమ్మంలో 17 మండలాలు, పాల్వంచలో 10 , భద్రాచలంలో 8 , కొత్తగూడెంలో 11 మండలాలతో డివిజన్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఖమ్మం రెవెన్యూ డివిజన్ పరిధిలో 17 మండలాలు ఉండటంతో పాలనా పరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారులు డివిజన్ చివర్లో ఉన్న మండలాలకు వెళ్లడం ఇబ్బంది అవుతోంది. గతంలో ప్రజా ప్రతినిధులు కల్లూరును రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని పలుమార్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆ విషయం మరుగునపడింది. తాజాగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో మళ్లీ ప్రభుత్వం పాలనా పరమైన ఇబ్బందులను తొలగించేందుకు, జనాభా, భౌగోళిక విస్తీర్ణం దృష్ట్యా మరో నూతన డివిజన్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రక్రియ మొదలైంది. దీనిలో భాగంగానే సత్తుపల్లి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసేందుకు కలెక్టర్ శ్రీనివాసశ్రీనరేశ్ ఫైల్ సిద్ధం చేస్తున్నారు. ఈ ఫైల్‌కు గ్రీన్‌సిగ్నల్ లభిస్తే జిల్లాలో రెవెన్యూ డివిజన్ల సంఖ్య ఐదుకు చేరుతుంది. డివిజన్ ఇలా.... జిల్లాలో నూతనంగా సత్తుపల్లి రెవెన్యూ డివిజన్‌ను ఎనిమిది మండలాలతో ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదిస్తున్నారు. ఖమ్మం డివిజన్లో 17 మండలాలకు ఆరు, పాల్వంచ డివిజన్లోని పది మండలాలకు రెండింటితో ఈ నూతన డివిజన్ ఏర్పడనుంది. అదే జరిగితే ఖమ్మం డివిజన్లో 11, పాల్వంచ డివిజన్లో 8 మండలాలు మాత్రమే ఉంటాయి. ఖమ్మం డివిజన్లోని మండలాలైన కల్లూరు, సత్తుపల్లి, వైరా, తల్లాడ, పెనుబల్లి, వేంసూరు, పాల్వంచ డివిజన్లోని దమ్మపేట, అశ్వారావుపేట మండలాలతో కొత్తగా సత్తుపల్లి రెవెన్యూ డివిజన్ కేంద్రం ఏర్పడనుంది. ఈ డివిజన్ పరిధిలోనికి సత్తుపల్లి, అశ్వారావుపేట, వైరా నియోజకవర్గాలు రానున్నాయి. కొత్తగా రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేయాలనుకునే మండలాల్లో జనాభా, భౌగోళిక విస్తీర్ణం తదితర వివరాలను జిల్లా అధికారులు సేకరిస్తున్నారు. నూతన డివిజన్ విస్తీర్ణం, నైసర్గిక స్వరూపం ఎలా ఉంటుందనే ఆధారాలతో కూడిన మ్యాప్‌ను పంపాలని స్థానిక అధికారులను ఆదేశించారు. అధికారులు ఆయా వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. వారం రోజుల్లో జిల్లాస్థాయిలో కసరత్తు పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు రెవెన్యూ వర్గాలు తెలిపాయి. గతంలో కల్లూరు కేంద్రంగా ప్రతిపాదనలు జిల్లాలో కల్లూరు కేంద్రంగా వైరా, తల్లాడ, పెనుబల్లి, వేంసూరు, సత్తుపల్లి, దమ్మపేట, అశ్వారావుపేటలతో నూతన రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని పదేళ్ల క్రితమే ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. కల్లూరు కాకుండా సత్తుపల్లిలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తేనే అనుకూలంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. పాలనాపరమైన అంశాలతోపాటు నియోజకవర్గ కేంద్రంలో రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఏర్పాటు చేస్తే అధికారులు అందరూ అందుబాటులో ఉంటారని చెబుతున్నారు. నూతన భవన నిర్మాణాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండదని, పాత భవనాల్లోనే పాలన కొనసాగించేందుకు వీలుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇలా పలురకాల కారణాలతో సత్తుపల్లి కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారని సమాచారం. -
ఉనికి కోల్పోతున్న ఐడీసీ!
సత్తుపల్లి, న్యూస్‌లైన్: రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ(ఐడీసీ) ఉనికి కోల్పోతోంది. 1976వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు మెట్టభూములకు సాగునీటి సౌకర్యం కల్పించే ఉద్దేశంతో ఐడీసీని స్థాపించారు. మొదట్లో బోర్‌వెల్స్ వేసి పంట భూములకు సాగునీరు అందించారు. కాలక్రమేణ భూగర్భజలాలు అడుగంటుతున్నాయనే కారణంతో బోర్‌వెల్స్‌ను నిలిపివేశారు. కేవలం ఎత్తిపోతల పథకాల రూపకల్పన, నిర్వహణ చేపట్టారు. 1997లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఐడీసీలో వీఆర్ఎస్ ప్రవేశపెట్టి బలవంతంగా ఉద్యోగులను పదవీ విరమణ చేయించారు. ఎవరైనా వ్యతిరేకిస్తే తప్పనిసరిగా తొలగిస్తామని చెప్పటంతో చాలామంది ఉద్యోగులు ఇంటిబాట పట్టారు. మిగిలిన ఉద్యోగులకు జీతభత్యాలు కూడా నాలుగైదు నెలలకోసారి ఇచ్చారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి కాగానే... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అధికారంలోకి రాగానే అవసాన దశలో ఉన్న ఐడీసీకి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రయత్నించారు. వేతన బకాయిలు కూడా చెల్లించారు. ఎత్తిపోతల పథకాలకు ఉచిత విద్యుత్ అందించి.. కొత్త ఎత్తిపోతల పథకాలకు నిధులు కేటాయించి జీవం పోశారు. ఉద్యోగులకు ప్రతి నెల వేతనాలు అందేలా చర్యలు తీసుకోవటంతో వైఎస్ఆర్ హయాం సువర్ణయుగంగా గడిచిందని రైతులు, ఉద్యోగులు గుర్తు చేసుకుంటున్నారు. వైఎస్ఆర్ మరణానంతరం పైసా నిధులు విడుదల చేయకుండా కిర ణ్ సర్కార్ చంద్రబాబు బాటలో పయనిస్తూ ఐడీసీని నిర్వీర్యం చేస్తూ మూసివేసే దశకు తెచ్చిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అభివృద్ధికి కేటాయించిన నిధుల్లోనే... జిల్లాలో ఖమ్మం, సత్తుపల్లి, భద్రాచలం సబ్ డివిజన్లలో 32 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. 375 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. వీటి కింద సుమారు 50వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 2009 నుంచి జిల్లాకు నిధులు కేటాయింపులు నామమాత్రంగానే ఉంటున్నాయి. నోరు ఉన్నోడిదే రాజ్యం.. అన్న రీతిలో ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అభివృద్ధికి కేటాయించిన నిధుల్లోనే 15శాతం సిబ్బంది జీతభత్యాలకు చెల్లిస్తున్నారు. కొత్త పథకాలకు ప్రతిపాదనలు పంపినా మోక్షం కలగటం లేదు. నిధులు విడుదల కాకపోవటంతో ఎత్తిపోతల పథకాలు, కార్యాలయాల నిర్వహణ అధికారులకు తలకు మించిన భారంగా మారింది. కేవలం విద్యుత్ బిల్లులు మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తోంది. భవిష్యత్తు ఏమిటి...? ఐడీసీలో ఉద్యోగ నియామకాలు నిలిపివేసి సుమారు 15 ఏళ్లు కావస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 385 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. తెలంగాణలో 135 మంది, 250 మంది సీమాంధ్రలో ఉన్నారు. కొత్తగా ఏర్పడిన చత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో ఐడీసీని ఎత్తేశారు. ఉద్యోగులకు వీఆర్ఎస్ వర్తింప చేసి ఇంటికి పంపించారు. 400మందికి పైగా ఉంటేనే కార్పోరేషన్ ఉంటుందని.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంటుందా.. మూసివేస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2015కల్లా సుమారు 50శాతం పైగా ఉద్యోగులు పదవీవిరమణ చేసే అవకాశాలు ఉన్నాయని ఐడీసీ వర్గాలు తెలిపాయి. దీంతో మిగిలిన సిబ్బందితో ఎంత వరకు ఐడీసీ ఉంటుందో చెప్పలేని పరిస్థితి ఉందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐడీసీ ఉద్యోగులను వేరేశాఖలకు పంపిస్తారో.. పాత వీఆర్ఎస్ పథకం అమలు చేస్తారో అర్థంకాక ఉద్యోగులు డోలాయమాన పరిస్థితిలో ఉన్నారు. -
టెన్షన్.. టెన్షన్
సత్తుపల్లి/సత్తుపలి ్లరూరల్, న్యూస్‌లైన్: ఓపెన్‌కాస్ట్ పరిధిలో భూములు కోల్పోతున్న కొమ్మేపల్లి, కిష్టారం గ్రామాలకు చెందిన సింగరేణి భూ నిర్వాసితులు అఖిలపక్షం ఆధ్వర్యంలో బుధవారం తలపెట్టిన ఓసీ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. తెల్లవారుజాము నుం చే పోలీసులు ఓపెన్‌కాస్టు పరిసర ప్రాంతాలలో భారీగా మోహరించటంతో టెన్షన్ వాతావర ణం నెలకొంది. మంగళవారం అర్ధరాత్రి నుంచే అరెస్ట్‌ల పర్వం కొనసాగడంతో నిర్వాసితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపైకి రాగానే అరెస్ట్ చేస్తుండడంతో పోలీసులతో పలువురు వాగ్వాదానికి దిగా రు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం 22 రోజు లుగా రిలే నిరాహారదీక్షలు చేస్తున్నా అధికారులు స్పందించడం లేదని, ఇప్పుడు ముట్టడి కార్యక్ర మం చేపడితే వారికి తొత్తులుగా మారిన పోలీసు లు తమను ఇబ్బంది పెట్టడం ఏంటని మండిపడ్డారు. పోలీసులకు, కలెక్టర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒకదశలో పోలీసులు జీపు కదల నీయకుండా ఆందోళనకారులు చుట్టుముట్టారు. వ్యూహాత్మకంగా ముట్టడి.. పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్‌లు చేస్తుంటే.. ఆందోళన కారులు వ్యూహాత్మకంగా వ్యవహరించి ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. కొమ్మేపల్లి, కిష్టారం నుంచి ఒకేసారి పెద్ద సంఖ్యలో మహిళలు సింగరేణి వై జంక్షన్ కు చేరుకున్నారు. ఊహించని ఈ పరిణామంతో అవాక్కైన పోలీ సులు భారీగా వైజంక్షన్‌కు చేరుకున్నారు. అయితే అప్పటికే అక్కడికి చేరుకున్న పలువురు జంక్షన్ వద్ద బైఠాయించి ఆందోళన నిర్వహించారు. కాగా, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, టీడీపీ ఆధ్వర్యంలో సుమారు 200 మంది వై జంక్షన్ వద్దకు ప్రదర్శనగా వస్తుండగా పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ముట్టడిని భగ్నం చేసేందుకు సత్తుపల్లి డీఎస్పీ బి.అశోక్‌కుమార్ పర్యవేక్షణలో అశ్వారావుపేట, సత్తుపల్లి టౌన్, రూరల్ సీఐలు, పలువురు ఎస్సైలు, ఇతర సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఓసీ వద్దకు ఎవరినీ వెళ్లనీయకుండా బారికేడ్లను ఏర్పాటుచేశారు. నిలిచిన బొగ్గు రవాణా.. ఓపెన్‌కాస్టు ముట్టడితో బొగ్గు రవాణాకు ఆటం కం ఏర్పడింది. ఉదయం నుంచే లోడింగ్‌ను నిలిపివేశారు. సుమారు 5వేల టన్నుల బొగ్గు రవాణాకు అంతరాయం ఏర్పడినట్లు సింగరేణి పీఓ ఎస్.సూర్యనారాయణ తెలిపారు. అయితే ఉత్పత్తికి మా త్రం ఎలాంటి అంతరాయం ఏర్పడలేదన్నారు. అర్ధరాత్రి అరెస్ట్‌లు.. అశ్వారావుపేట/ దమ్మపేట, న్యూస్‌లైన్: వారు ప్రజల సొమ్మును లూటీ చేయలేదు.. పేదల నెత్తిన కుచ్చుటోపీ పెట్టేవారూ కాదు.. నిర్వాసితుల కోసం ప్రభుత్వంతో శాంతి యుత పోరాటం చేస్తున్న రాజకీయ నాయకులు.. అలాంటి వారిని తీవ్రవాదులను నిర్బంధించినట్లుగా సత్తుపల్లి పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేసి దమ్మపేట స్టేషన్‌కు తరలించారు. ఇదేమంటే అవాంఛనీయ ఘటన లు జరగకుండా స్టేషన్ మార్చామంటూ సమర్థించుకుంటున్నారు. సత్తుపల్లి జేవీఆర్ ఓసీ విస్తరణలో భాగంగా కిష్టారం, కొమ్మేపల్లి, జగన్నాధపురం గ్రామాల రైతుల భూములు, గ్రామాలను సింగరేణి యాజమాన్యం స్వాధీనపరుచుకోనుంది. రైతులు కూడా భూములు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే కొత్త భూసేకరణ చట్టం ప్రకా రం నష్టపరిహారం ఇవ్వాలని శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో బుధవారం ఓసీని ముట్టడికి నిర్ణయించారు. వారికి అన్ని పార్టీలూ మద్దతు ప్రకటించాయి. సొంతపూచీకత్తుపై విడుదల.. నిర్వాసితులకు మద్దతుగా పోరాడుతున్న వైఎస్ఆర్ సీపీ సత్తుపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మట్టా దయానంద్ విజయ్‌కుమార్, కోటగిరి మురళీకృష్ణారావు, జ్యేష్ట లక్ష్మణ్‌రావు, కాంగ్రెస్ నాయకులు ఉడతనేని అప్పారావు, టీడీపీ మండల అధ్యక్షుడు చల్లగుళ్ల నర్సింహారావు, సీపీఐ డివిజన్, మండల కార్యదర్శులు దండు ఆదినారాయణ, తడికమళ్ల యోబు, న్యూడెమోక్రసీ నేత ఎ.రాములును మంగళవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకుని దమ్మపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తామేం చేశామని ప్రశ్నిస్తే ‘మా సార్ చెప్పారు.. మిమ్మల్ని ఇక్కడ ఉంచుతున్నాం..’ అనే సమాధానం మినహా పోలీసులు ఇంకేమీ చెప్పడం లేదు. చివరకు బుధవారం మధ్యాహ్నం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. పిరికిపంద చర్యే..: ఇది ముమ్మాటికీ పోలీసుల పిరికిపంద చర్యే.. శాంతియుతంగా నిరసన చేస్తున్న రైతులకు మద్దతిచ్చిన మమ్మల్ని అత్యంత దిగజారుడు తనంగా దమ్మపేట పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించారు. మమ్మల్ని సత్తుపల్లిలో ఉంచే ధైర్యం పోలీసులకు ఎందుకు లేదో చెప్పాలి. వారు ఎన్ని కుట్రలు పన్నినా.. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందించేంత వరకు మా పోరాటం ఆగదు. -డాక్టర్ దయానంద్ విజయ్‌కుమార్, వైఎస్ఆర్ సీపీ సత్తుపల్లి నియోజకవర్గ సమన్వయకర్త రజాకార్లలా వ్యవహరించారు..: పోలీసులు వ్యవహరించిన తీరు రజాకార్లను గుర్తుచేస్తోంది. రైతుల సమస్యలపై న్యాయబద్ధంగా పోరాడుతున్న మమ్మల్ని పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేసి తీసుకురావడం పద్ధతికాదు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థనా.. తుపాకీ పాలననా.. అర్థం కావడం లేదు. - ఉడతనేని అప్పారావు కాంగ్రెస్ నాయకులు -
‘పుంజు’కుంటున్న కోడి పందేలు
అశ్వారావుపేట, న్యూస్‌లైన్: అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో కోడి పందేలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అధికార పార్టీ నాయకులు, వారి అనుచరులు జోరుగా పందేలు నిర్వహిస్తున్నా.. పోలీసులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. అశ్వారావుపేట ఎమ్మెల్యే వగ్గెల మిత్రసేన స్వగ్రామంలో సోమవారం మూడు కోళ్లు.. ఆరుకత్తులు అన్న చందంగా కోడిపందేలు జోరుగా సాగాయి. పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు పత్రికలు, లోకల్ కేబుల్ ద్వారా హెచ్చరికలు జారీచేసినా ఎమ్మెల్యే గ్రామస్తులు, అధికార పార్టీ నాయకులు ఖాతరు చేసినట్లు లేరు.. ఎంచక్కా రెండు బిర్రులు కట్టి.. కంచెలతో దడులు నిర్మించి మరీ కోడిపందేలు నిర్వహించారు. మామిళ్లవారిగూడెం- సున్నంబట్టి గ్రామాల మధ్య బీటీ రోడ్డు నుంచి పొలాల్లోకి వెళ్లేందుకు వరిమడులను చెరిపేసి బిర్రుల వరకు మార్గాన్ని శుభ్రం చేశారు. జూదరుల కోసం మద్యం, తాగునీరు, స్టఫ్‌గా కోడి పకోడి.. ఇలా అన్నింటి కీ వేలంపాట పెట్టి అందుబాటులో ఉంచారు. సోమవారం మధ్యాహానికి కోడిపందేల వాసన తగటడంలో మండలంలోని పలు గ్రామాల జూదరులు సున్నంబట్టి చేరుకున్నారు. ‘ఎంతెచ్చు.. ఐదెచ్చు.. పదెచ్చు.. ’ అంటూ హోరాహోరీగా పందెం కాశారు. బడా జూదరులు పశ్చిమానికే.. పందేలు నిర్వహిస్తే చర్యలు తప్పవనే పోలీసుల ప్రకటనలు చూసి భయాందోళనకు గురయిన పెద్ద పందెగాళ్లు, పందెంలో నిపుణులైన పలువురు కుక్కుటశాస్త్రం పుస్తకాలు పట్టుకుని తెల్లవారేసరికే పశ్చిమగోదావరి జిల్లాలోని శ్రీనివాసపురం, చింతపల్లి, పోతునూరు, భీమవరం పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు. పెద్ద పందగాళ్లు పక్క జిల్లాకు వెళ్లిపోవడంతో రూ.1000 లోపు పందెం వేసేవారు, పండుగల సమయంలో మాత్రమే ఆడేవారు స్థానికంగా నిర్వహించిన పోటీల్లో పాల్గొన్నారు. ఊరూరా కూరపందేలు... గిరిజన గ్రామాల్లో నగదు పందేలు వేయకుండా, కత్తులు కట్టకుండా కూర పందేలను నిర్వహిస్తున్నారు. పందెంలో పాల్గొన్న కోడిని వెంటనే కోసుకుని తినటం ఇక్కడి కొందరి ఆచారం. అదీ సంక్రాంతి పండగ నాలుగు రోజులు ఇలా సరదాగా ఊళ్లో వాళ్లంతా పందెం వేసుకుని కోళ్లను కోసుకుంటుంటారు. ఐతే కూరపందేల పేరుతో లక్షల రూపాయల జూదం కొన్ని చోట్ల జరిగింది. ఒక్కో జోడు కోళ్లు పందెంలో కత్తులు కట్టుకుని తలపడుతుంటే.. రూ.వంద నుంచి వెయ్యి దాకా బిర్రు బయట ఉండి పై పందేలు కట్టారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం అటుగా రాలేదు. అయితే పందేల జోలికి వెళ్లవద్దని ఉన్నతాధికారుల నుంచి వారికి ఆదేశాలు వచ్చి ఉంటాయని పలువురు అనుమానం వ ్యక్తం చేస్తున్నారు. లింగగూడెంలో జోరుగా... పెనుబల్లి : మండల పరిధిలోని లింగగూడెంలో సోమవారం జోరుగా కోడిపందేలు నిర్వహించారు. గ్రామ శివారు వావిళ్లపాడులోని ఓ మామిడి తోటకు వందకుపైగా పుంజులను తీసుకొచ్చి వేలాది రూపాయలు పెట్టి పందేలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన ఈ తతంగమంతా పోలీస్‌స్టేషన్‌కు కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలోనే కావడం గమనార్హం. కోడి పందేలు నిర్వహిస్తారనే అనుమానంతో సంక్రాంతికి ఐదుగురిపై బైండోవర్ కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఇప్పుడు చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తుండడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
ఓపెన్‌కాస్టులకు వ్యతిరేకంగా ఉద్యమించాలి
సత్తుపల్లి, న్యూస్‌లైన్: సింగరేణి ఓపెన్‌కాస్టులకు వ్యతి రేకంగా ప్రజలు ఉద్యమించాలని న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు కోరారు. సత్తుపల్లిలో సింగరేణి ఓపెన్‌కాస్ట్ భూనిర్వాసితుల రిలేనిరాహార దీక్షలు శనివారం ఐదోరోజుకు చేరాయి. దీక్ష శిబిరాన్ని ఆయన శనివా రం సందర్శించి సంఘీభావం ప్రకటించారు. శిబిరాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. భూసేకరణ కొత్త చట్టం అమలులోకి రావడానికి కొన్ని గంటల ముందుగానే భూములను ఎందుకు స్వాధీనపర్చుకుందీ ప్రభుత్వాధికారులు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘మీరు (అధికారులు) ప్రజలపక్షమా.. పెట్టుబడిదారులపక్షమా..?’ అని ప్రశ్నించా రు. ఓపెన్‌కాస్టులతో ప్రజారోగ్యం దెబ్బతింటుం్దని, పంట భూములు బొందల గడ్డలుగా మారతాయని ఆందోళన వ్యక్తం చేశారు. భూనిర్వాసితులకు తగిన నష్ట పరిహారం ఇప్పించటంలో ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని విమర్శిం చారు. ‘పోడు కొడితే పర్యావరణం దెబ్బతింటుందని ప్రచారం చేసే పాలకులు... వేల ఎకరాల పంట భూములను ఓపెన్‌కాస్టులతో విషతుల్యం చేస్తుంటే ఎందుకు స్పందించడం లేదు?’ అని ప్రశ్నిం చారు. సత్తుపల్లిలో థర్మల్ పవర్ స్టేషన్‌కు అనుమతి ఇవ్వకుండా, బొగ్గు మొత్తాన్ని ఇతర ప్రాంతాలకు తరలించటం సరికాదని అన్నారు. భూసేకరణకు సంబంధించి కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులు రద్దయ్యేంత వరకు నిర్వాసితులతో కలిసి ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొం టామన్నారు. దీక్షలకు సంఘీభావం తెలిపిన వారిలో న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావు, పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు కూకలకుంట రవి, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎ.వెంకన్న తదితరులు ఉన్నారు. మంత్రి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సంఘీభావం సింగరేణి భూనిర్వాసితుల దీక్షలకు మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. దీక్ష చేస్తున్న నిర్వాసితులతో వారు ఫోన్లో మాట్లాడుతూ.. సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని, జనరల్ అవార్డుతో జరిగిన నష్టాన్ని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. నిర్వాసితులకు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నూకల నరేష్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు దిండిగాల రాజేందర్ సంఘీభావం తెలిపారు. వారు మాట్లాడుతూ.. రైతుల పక్షాన టీఆర్ఎస్ ఉద్యమిస్తుందన్నారు. బీజేపీ నాయకులు దుగ్గి అప్పిరెడ్డి, వందనపు భాస్కర్‌రావు కూడా సంఘీభావం ప్రకటించారు. -
పార్టీని వీడే ప్రసక్తే లేదు
సత్తుపల్లి, న్యూస్‌లైన్: తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నానంటూ వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సత్తుపల్లిలోని పార్టీ కార్యాలయంలో శనివారం రాత్రి ఆ పార్టీ ఖమ్మంపార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్ఆర్ సీపీకి రాజీనామా చేసినట్లు ఎలక్ట్రానిక్ మీడియాలో స్క్రోలింగ్స్ రావటం తనను తీవ్ర మనస్తాపానికి గురి చేసిందని, కనీసం తనతో సంప్రదించకుండా స్క్రోలింగ్స్ వేయటం దారుణమని శ్రీనివాసరావు అన్నారు. తన రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేకే ఈవిధమైన అసత్య ప్రచారానికి పూనుకున్నారని, దీనిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. పార్టీని వీడే ప్రసక్తే లేదని ఆయన చెప్పారు. శనివారం మధ్యాహ్నం వరకు పార్టీ రాష్ట్రకమిటీ పిలుపునిచ్చిన కార్యక్రమాలలో పాల్గొనటమే కాక.. పార్టీ సంస్థాగత కార్యక్రమాలలో బిజీగా గడిపినట్లు తెలిపారు. రాజకీయ పార్టీలో టిక్కెట్ ఆశించేవారు నియోజకవర్గానికి ఇద్దరు ముగ్గురు ఉండటం సహజమని, గెలుపు అవకాశాలు ఉండేవారికే పార్టీ టిక్కెట్ కేటాయిస్తుందని ఒక ప్రశ్నకు సమాధానంగా బదులిచ్చారు. పార్టీలో అందరికి టిక్కెట్లు ఇవ్వటం సాధ్యం కాదని, టిక్కెట్ రానివారికి ప్రాధాన్యత క్రమంలో ఎమ్మెల్సీ, కార్పొరేషన్ పదవులు ఇస్తామని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ సమావేశాలలో చెప్పారని పేర్కొన్నారు. సీటు వచ్చినా.. రాకపోయినా.. పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తగా, జిల్లా పార్టీ కన్వీనర్‌గా తన వంతు బాధ్యతలను నెరవేరుస్తానని మచ్చా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సత్తుపల్లి, అశ్వారావుపేట, పినపాక, భద్రాచలం నియోజకవర్గాల వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తలు మట్టా దయానంద్‌విజయ్‌కుమార్, తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు, డాక్టర్ తెల్లం వెంకట్రావ్, పార్టీ నాయకులు మలిరెడ్డి మురళీరెడ్డి, ఎస్కె మౌలాలి తదితరులు పాల్గొన్నారు. -
15 వేల ఎకరాల భూపంపిణీ
సత్తుపల్లి టౌన్, న్యూస్‌లైన్ : ఏడో విడత భూ పంపిణీ కార్యక్రమంలో రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలో 15 వేల ఎకరాల భూమి పంపిణీ చేసినట్లు కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ తెలిపారు. సత్తుపల్లిలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో 568 మంది లబ్ధిదారులకు 711.25 ఎకరాలకు సంబంధించిన పాస్‌పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూమి పొందిన వారికి రుణ సదుపాయం కల్పించేందుకు బ్యాం కర్లతో సమావేశాలు నిర్వహించామన్నారు. వచ్చే ఖరీఫ్‌లో రుణాలు ఇచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఇందిర జలప్రభ ద్వారా కూడా ఈ భూముల అభివృద్ధికి ప్రతిపాదనలు పంపిస్తున్నామని తెలిపారు. రోడ్లపై ఫుల్‌వీల్స్‌తో ట్రాక్టర్లు తిరగటంతో రోడ్లు మరమ్మతులకు గురవుతున్నాయని, అలా తిరగకుండా ఉండేందుకు జిల్లాస్థాయిలో అధికారులతో సమావేశాలు ఏ ర్పాటు చేసి చర్యలు చేపడతామని వివరించారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సత్తుపల్లిలో భూమిని గుర్తించామని, త్వరలో ఈ సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. రచ్చబండలో వచ్చిన సమస్యలన్నీ ఆన్లైన్ చేసి పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ నెలాఖరులోగా వికలాంగుల శిబిరా లు పూర్తి అవుతాయని, 20 నుంచి 40 శాతం ఉన్న వికలాంగులకు కూడా పెన్షన్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా నిరుపేదలకు భూమిపై హక్కులు కల్పించటం శుభ పరిణామన్నారు. సత్తుపల్లి మండలం యాతాలకుంటలో గిరిజనులకు, అటవీ శాఖకు మధ్య భూ వివాదం సాగుతోందని, దీనిపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. కార్యక్రమంలో ఆర్డీఓ సంజీవరెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు, తహశీల్దార్లు జి.నర్సింహారావు, అమర్నాథ్, సాంబశివరావు, వెంకటేశ్వరరావు, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదు
సత్తుపల్లి, న్యూస్‌లైన్: కాంగ్రెస్ పార్టీపట్ల ప్రజలు ద్వేషంగా ఉన్నారని, ఇక ఆ పార్టీకి భవిష్యత్తు లేదని సీపీఎం రాష్ర్ట కార్యదర్శి బి.వి.రాఘవులు అన్నారు. కాంగ్రెస్‌పై ఉన్న వ్యతిరేకతతో బలపడాలని బీజేపీ చూస్తోందని, అయితే ఆపార్టీ కూడా కేంద్రంలో సొంతంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని చెప్పారు. దీంతో కొత్తమిత్రుల కోసం వెంపర్లాడుతోందని, ఈ క్రమంలో చంద్రబాబు వంటివారితో కలిసి పనిచేయాలని చూస్తోందని అన్నారు. సత్తుపల్లిలో శుక్రవారం ‘వర్తమాన రాజకీయాలు-సీపీఎం వైఖరి’ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. మతతత్వ పార్టీలవైపు వెళ్లకుండా ఉండేందుకు ఇటీవల ఢిల్లీలో ఏర్పాటు చేసిన లౌకిక పార్టీల సమావేశానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును ఆహ్వానించినా రాలేదని, బీజేపీతో కలిసి పనిచేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీకి గుజరాత్లో రెండువేల మంది ముస్లింలను ఊచకోత కోసిన చరిత్ర ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌పై ద్వేషంతో నరేంద్రమోడీ వైపు మొగ్గుచూపితే మరింత ప్రమాదమేనని హెచ్చరించారు. మోడీ అధికారంలోకి వస్తే విదేశీ పెట్టుబడులు దేశంలోకి స్వేచ్ఛగా ఆహ్వానించవచ్చని కార్పొరేట్ సంస్థలు ఆశిస్తున్నాయని, అందుకే అదేపనిగా మోడీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ, లౌకిక పార్టీలతో కలిసి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేస్తున్నామని వివరించారు. భద్రాచలంపై బలమైన వాణి వినిపించటంలేదు.. భద్రాచలం డివిజన్‌ను ఖమ్మం జిల్లాలోనే ఉంచాలని జీఓఎంకు తాము స్పష్టంగా చెప్పామని, ఈ విషయంలో మిగితా పార్టీలు ఢిల్లీలో బలంగా వాణి వినిపించటం లేదని అన్నారు. పోలవరం కోసమే భద్రాచలం డివిజన్‌ను అడుగుతున్నారని, ఈ ప్రాజెక్టు డిజైన్‌ను మార్చి ముంపును తగ్గించాలని సీపీఎం ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తోందని చెప్పారు. 250 ఆదివాసీ గ్రామాలను ముంచి ప్రాజెక్టు ఎక్కడ నిర్మిస్తారని ప్రశ్నించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, నున్నా నాగేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు తాతా భాస్కర్‌రావు, కొక్కెరపాటి పుల్లయ్య, నాయకులు మోరంపూడి పుల్లారావు, రావుల రాజబాబు, మోరంపూడి పాండు, చలమాల విఠల్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సత్తుపల్లి నియోజకవర్గ సమన్వయకర్తలు డాక్టర్ మట్టా దయానంద్‌విజయ్‌కుమార్, నంబూరి రామలింగేశ్వరరావు, మున్సిపల్ కన్వీనర్ కోటగిరి మురళీకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.