ఈ ముఖ్యమంత్రికి సోయి లేదు: భట్టి | Batti Vikramarka Fires On CM KCR With Farmers Meet In Sattupalli | Sakshi
Sakshi News home page

ఈ ముఖ్యమంత్రికి సోయి లేదు: భట్టి

Published Sun, Feb 21 2021 5:03 PM | Last Updated on Sun, Feb 21 2021 6:13 PM

Batti Vikramarka Fires On CM KCR With Farmers Meet In Sattupalli - Sakshi

సాక్షి, సత్తుపల్లి : ముఖ్యమంత్రి కేసీఆర్ కు సోయి, జ్ఞానం లేవని, ఎవరు చెప్పినా వినే రకం కాదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలు విమర్శలు చేశారు. నోటికి వచ్చినట్లు బూతులు మాట్లాడే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరేనని భట్టి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎవరినైనా కొనగలనన్న నమ్మకం, మూర్ఖత్వం ఉన్న కేసీఆర్ కు రైతులు, ప్రజలు కర్రుకాల్చి బుద్ధ వచ్చేలా వాతలు పెట్టాలన్నారు.రైతులతో ముఖాముఖీలో భాగంగా సత్తుపల్లి నియోజకవర్గం తల్లాడలో రైతులతో భట్టి సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భట్టి విక్రమార్కతో పాటు మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ వీ హనుమంతరావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు పుచ్చకాల వీరభద్రం, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు మొక్కా శేఖర్ గౌడ్, తదితర స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దేశమంతా వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందన్నారు. రైతాంగ సమస్యలు వదిలిస్తే.. దేశవ్యయసాయ రంగం అగమ్యగోచరంలా తయారవుతందన్నారు. ఈ పరిస్థితులను ముందుగానే గమినించి ఉత్తర భారత రైతులు వారి ప్రాణాలు ఫణంగా పెట్టి.. 55 మంది చనిపోయినా.. పోరాటం చేస్తున్నారని భట్టి వివరించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు నల్ల చట్టాలు దేశానికి అత్యంత ప్రమాదకరమని భట్టి రైతులకు చెప్పారు. దేశాన్ని కాపాడేది జవాన్.. దేశ ప్రజలకు అన్నం పెట్టేది కిసాన్.. అని కాంగ్రెస్ పార్టీ.. ఈ ఒక్క నినాదంతోనే తమ విధానం స్పష్టం చేసిందని అన్నారు.

మోదీ విధానాలతో రైతుల పరిస్థితి, భవిష్యత్ ఆందోళణకరంగా మారుతుందని అన్నారు. దేశంలో 95 శాతం మంది రైతులు 5 ఎకరాల లోపు వారేనని.. వారు తమ పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చంటే.. ఎక్కడ అమ్ము కుంటారని భట్టి ప్రశ్నించారు. ఇక్కడ స్థానికంగా పండించే మిర్చి, పత్తి, పసుపు పంటను మండల కేంద్రానికి తీసుకెళ్లి అమ్ముకవడానికి ఇబ్బందులు పడుతుచాన్న సమయంలో.. కల్లాల్లోనే అమ్ముకుంటున్నారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఏ మహారాష్ట్రకో, గుజరాత్ కో పంటను తీసుకెళ్లి రైతు అమ్ముకునే పరిస్థితులు ఉన్నాయా? అని ప్రశ్నించారు. 

ఏ నినాదం వెనుక.. ఎవరి ప్రయోజనాలు ఉన్నాయన్న సంగతిని కాస్త లోతుగా ఆలోచిస్తే.. ఈ చట్టాలు రైతుల కోసం కాదు.. కేవలం బహుళజాతి సంస్థల కోసమో అన్న వాస్తవం తెలుస్తుందన్నారు. దేశ వ్యవసాయ రంగం మొత్తం కార్పరేట్ ల చేతుల్లో పెట్టడం కోసమే ఈ చట్టాలు తీసుకువచ్చారన్నది స్పష్టమైన అంశమని చెప్పారు. ఇది నిజంగా రైతుల కోసమే తెచ్చిన చట్టాలు అయితే.. వారు వద్దని ఢిల్లీ సరిహద్దులో ప్రాణాలను లెక్కచేయకుండా దీక్ష చేస్తుంటే.. వెంటనే వాటిని వెనక్కు తీసుకునేవారినన్నారు. కాంట్రాక్టు ఫార్మింగ్ తో భూములను, పంటలను కార్పొరేట్ చేతుల్లో పెట్టేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు.

అంబానీ, అదానీ వంటి వారితో సామాన్య రైతులు పోరాటం చేయలేరని... అన్నారు. ఆహర ధాన్యాలు అందరికీ అందుబాటులో ఉంచాలని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎసెన్షియల్ కమెడిటీస్ చట్టం తీసుకువచ్చిందని.. దానివల్ల ధరల నియంత్రణ ఉంటుందని అన్నారు. కానీ దానిని ఎత్తేయడం వల్ల ఎవరైనీ ఎంతైన ఆహార పదార్థాలను, పంటలను గోడౌన్ల్లో దాచేస్తే.. అవి అందక.. ధరలు ఆకాశంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. దీని వల్ల ఇటు వినియోగదారుడు.. అటు.. రైతులు తీవ్రంగా నష్టపోతారని భట్టి ప్రజలకు వివరించారు. ఇప్పటికే దేశవ్యాప్తగా అనే ఎఫ్.సీ.ఐ గోడౌన్లను అదానీ సంస్థకు కేంద్రం లీజుకు ఇచ్చిందని చెప్పారు. ఈ మూడు చట్టాలవల్ల దేశ రైతులకు అత్యంత ప్రమాదకరమని చెప్పారు.

దేశ స్వాతంతరం వచ్చిన తరువాత గణతంత్ర దినోత్సవం నాడు.. కేవలం సైనికుల కవాతు మాత్రమే ఉండేది.. కానీ మొదటిసారు.. రైతులు బటయకు వచ్చి కవాతు చేశారుని చెప్పారు. ఈ పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా రైతులంతా పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని భట్టి ఇది దుస్తితి.. మనమం విక్రమార్క చెప్పారు. అప్పుడే పాలకులు దిగివస్తారని చెప్పారు. మోడీ, కేసఆర్ లు కేవలం బహుళజాతి సంస్థల కోసం మాత్రమే పని చేస్తున్నారు..  బీజేపీ స్వాతంత్ర పోరాటంలో పాల్గొనలేదు.. ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన.. వారికి  లేదని చెప్పారు. మోడీ, కేసీఆర్ లకు ప్రజల సంక్షేమం అవసరం లేదని.. కేవలం కార్పొరేట్ల కోసమో పనిచేస్తున్నారని ఆగ్రహంగా చెప్పారు. వారిద్దరికీ అధికారం తప్ప మరేమీ అవసరం లేదని చెప్పారు. 

అదే సమయంలో ఈ మధ్య మద్దతు ధర ఉన్న సమయంలో.. మొక్కలు క్వింటాలకు రూ.1800 ధర పలికింది.. అదే మద్దతు ధర లేకపోతే.. వెంటనే రూ.900 కి పడిపోయింది. దీంతో రైతులకు క్వింటాలుకు రూ. 1000 నష్టపోయిన పరిస్థితి అని చెప్పారు. మద్దతు ధర లేకపోతే ఒక్క పంటకే ఇలా ఉంటే.. మొత్తంగా అసలు మద్దతు ధర లేకపోతే.. రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహకే అందడం లేదని భట్టి విక్రమార్క చెప్పారు. 

ఢిలీ సరిహద్దుల్లో 85 రోజలుగా జరగుతున్న రైతు ఉద్యమం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. కొనుగోలు కేంద్రాలు ఎత్తేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వ్యవసాయాన్ని పూర్తిస్థాయిలో కార్పొరేట్ చేసేలా కేంద్రం ప్రయత్నిస్తోంది. మార్కెట్ యార్డులను ఎత్తేసేలా కుట్రలు చేస్తున్నారు. దేశంలో 60 శాతం ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు.. వారికి మద్దతు ధర లేకపోతే.. ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గిట్టుబాటు, మద్దతు ధర కల్పించింది. 
- దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మంథని

ఢిల్లీలో రైతులు మూడు నెలల నుంచి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఇప్పటికీ దాదాపు 53 మంది చనిపోయినా.. రైతులు పోరాటం ఆపడం లేదు. రైతులకు కనీస మద్దతు ధర లేకపోతే.. రైతులు తీవ్రంగా నష్టపోతారు. కేసీఆర్ కూడా మోదట చట్టాలను వ్యతిరేకించినా.. తరువాత యూటర్న్ తీసుకున్నాడు. ఈ బిల్లు వల్ల కార్పొరేట్లకు తప్ప.. రైతులకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. 
- వి.హనుమంతరావు, మాజీ ఎంపీ

భట్టి విక్రమార్క మల్లు నేత్రుత్వంలో చేస్తున్న రైతు వ్యతిరేక చట్టాలపై సీఎల్పీ బ్రుందం చేస్తున్న పోరాటం చాలా గొప్పది. ఈ పోరాటంలో భట్టి గారికి మేము అండగా ఉంటాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేశాయి. కేసీఆర్.. చెప్పేవన్నీ అబద్దాలే. పేదలకు సేవచేసింది కాంగ్రెస్ మాత్రమే. మాట తప్పిన వాళ్లను ఏమి చేయాలో ప్రజలే నిర్ణయిస్తారు. 
సంభాని చంద్రశేఖర్, మాజీ మంత్రి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement