
సాక్షి, ఖమ్మం: మంత్రి అంబటి రాంబాబుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. మంత్రి రాంబాబు ప్రయాణిస్తున్న కారుపై లారీలో నుంచి గోధుమ బస్తా పడిపోయింది. దీంతో, కారు ముందు భాగం స్వల్పంగా దెబ్బతిన్నది.
వివరాల ప్రకారం.. సత్తుపల్లి పట్టణ శివారులో మంత్రి అంబటి రాంబాబుకు తృటిలో ప్రమాదం తప్పింది. రాజమండ్రి వైపు నుండి ఖమ్మం వైపు వెళ్తున్న అంబటి రాంబాబు కాన్వాయ్‌పై లారీ నుండి గోధుమ బస్తాలు కిందపడిపోయాయి. ఈ ప్రమాదంలో అంబటి రాంబాబు కారు ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది. దీంతో, ఆయన మరో కారు ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇది కూడా చదవండి: చంద్రబాబు ఎప్పుడు నిజం చెప్పారు?.. నారా భువనేశ్వరికి అంబటి చురకలు
Comments
Please login to add a commentAdd a comment