సాక్షి, ఖమ్మం జిల్లా: భద్రాచలం వద్ద నీటిమట్టం పెరుగుతోంది. మళ్లీ మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 43 అడుగులు కాగా, 9,18,164 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది.
కాగా, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి తదితర ఉపనదులు, వాగులు, వంకల్లో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో గోదావరినదిలో వరద ప్రవాహం క్రమేపీ తగ్గుతూ వచ్చింది. గోదావరి శాంతిస్తుండటంతో తీర, లోతట్టు ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజీకి చేరుతున్న ప్రవాహం 5.12 లక్షల క్యూసెక్కులకు తగ్గింది.
వచ్చిన వరదను వచ్చినట్టుగా మేడిగడ్డ బ్యారేజ్ నుంచి దిగువకు వదిలేస్తున్నారు. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. అయితే మళ్లీ నీటిమట్టం పెరగడంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం భద్రాచలం నుంచి అన్ని వైపులకు రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment