Updates: భారీ వర్షాల ఎఫెక్ట్‌.. రేపు పలు జిల్లాల్లో స్కూల్స్‌కు సెలవు | AP Telangana Heavy Rains Flood Updates Sep 8 2024 Latest News Telugu | Sakshi
Sakshi News home page

Updates: భారీ వర్షాల ఎఫెక్ట్‌.. రేపు పలు జిల్లాల్లో స్కూల్స్‌కు సెలవు

Published Sun, Sep 8 2024 8:27 AM | Last Updated on Sun, Sep 8 2024 6:22 PM

AP Telangana Heavy Rains Flood Updates Sep 8 2024 Latest News Telugu

AP And Telangana Floods News Latest Updates In Telugu

పలు జిల్లాల్లో రేపు పాఠశాలలకు సెలవు..

  • భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం.
  • శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి, విశాఖ జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ.
  • రేపు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు.

 

విశాఖలో భారీ వర్షం.. 

  • విశాఖపట్నం..
  • ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం.
  • విశాఖ నగరంలో అత్యధికంగా వర్షపాతం.
  • జలమయమైన రోడ్లు, లోతట్టు ప్రాంతాలు.
  • అనకాపల్లి జిల్లాలో పలుచోట్ల వర్షాలతో నీట మునిగిన పంటలు.
  • గరిష్ట నీటి మట్టానికి చేరుకున్న పెద్దేరు, కోణం, రైవాడ కళ్యాణపులోవ తాండవ, మేఘాద్రి గడ్డ రిజర్వేయర్లు.
  • ఏజెన్సీలో పొంగిపొర్లుతున్న వాగులు వంకలు.
  • అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి.


ఉధృతంగా ప్రవహిస్తున్న బుడమేరు..

  • కృష్ణా..
  • ఉప్పులూరు వద్ద బుడమేరు ప్రాంతాన్ని పరిశీలించిన కలెక్టర్ బాలాజీ, ఎస్పీ గంగాధర రావు.
  • కంకిపాడు - గన్నవరం మార్గంలో వాహనాలకు అనుమతి ఇవ్వొద్దని ఆదేశాలు
  • బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తుంది
  • అధికారులు అప్రమత్తంగా ఉండాలి
  • అలసత్వం వహిస్తే సహించేది లేదు.
  • మంతెన, తెన్నేరు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
     

ప్రకాశం బ్యారేజ్‌ 70 గేట్లు ఎత్తివేత..

  • విజయవాడ
  • ప్రకాశం బ్యారేజ్ ఫ్లడ్ అప్‌డేట్‌..
  • ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
  • ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 4,28,322 క్యూసెక్కులు
  • 70 గేట్లు పూర్తిగా ఎత్తివేత

విశాఖపట్నం..

  • గోపాలపట్నంలో విరిగిపడుతున్న కొండ చరియలు.
  • రెండు ఇళ్ళు కూలిపోయే ప్రమాదం.
  • ఇంట్లో వారిని ఖాళీ చేయిస్తున్న అధికారులు.
     

కృష్ణాజిల్లా:

  • గన్నవరం మండలం కేసరపల్లి వద్ద గత రాత్రి బుడమేరు కాలువలో చిక్కుకున్న కారు
  • కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి గల్లంతు
  • పెడన మండలం హుస్సేన్ పాలెంకు చెందిన ఫణి కృష్ణగా గుర్తింపు
  • సంఘటనా స్థలానికి చేరుకున్న గుడివాడ ఆర్డీవో పద్మావతి
  • ఫణి కృష్ణ కోసం గాలిస్తున్న అధికారులు

విజయవాడ వరదల్లో భారీ ప్రాణ నష్టం

  • 45 మంది మృత్యువాత
  • 45 మంది మరణించినట్టు అధికారికంగా ప్రకటించిన ప్రభుత్వం
  • ఒక్క విజయవాడ నగరం, రూరల్ లోనే 25 మంది మృతి
  • ఎన్టీఆర్ జిల్లాలో వరదలకు 35.మంది మృతి
  • ఇంకా మరణాలు పెరిగే అవకాశం
  • 8 రోజులుగా వరద ముంపులోనే ప్రజలు
  • ప్రభుత్వం వరదలు సమాచారం ఉన్నా అప్రమత్తం చేయకపోవడం తో సంభవించిన మరణాలు

విజయవాడకు బుడమేరు టెన్షన్‌

  • గన్నవరం-కంకిపాడు రహదారిపైకి బుడమేరు వరద
  • గన్నవరం-కంకిపాడు రోడ్డులో నిలిచిన రాకపోకలు

బంగాళాఖాతంలో వాయుగుండం

  • వాయుగుండంగా బలపడిన తీవ్ర అల్పపీడనం..
  • ఉత్తర ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ వద్ద తీరాన్ని తాకే అవకాశం
  • వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతిబారీ వర్షాలు..
  • ఏపీలో 5 జిల్లాలకు రెడ్ అలర్ట్‌
  • ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
  • మరో రెండు రోజులపాటు కొనసాగనున్న భారీ వర్షాలు
  • తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు
  • కొనసాగుతున్న మత్స్యకారుల హెచ్చరికలు

కృష్ణానది వరద ఉధృతి

  • కాసేపట్లో ప్రకాశం బ్యారేజి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
  • శ్రీశైలం డ్యామ్‌ వద్ద ఇన్ ఫ్లో 2.86, ఔట్ ఫ్లో 3.09 లక్షల క్యూసెక్కులు
  • నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 2.99లక్షల క్యూసెక్కులు
  • పులిచింతల  వద్ద ఇన్ ఫ్లో 2.75 ఔట్ ఫ్లో 2.97 లక్షల క్యూసెక్కులు
  • ప్రకాశం బ్యారేజ్ వద్ద  ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3.88 లక్షల క్యూసెక్కులు
  • వాగులు, వంకలు పొంగిపోర్లుతాయి జాగ్రత్తగా ఉండాలి
  • లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: విపత్తుల నిర్వహణ సంస్థ

ఖమ్మం చేరుకున్న డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క

  • ఖమ్మం పట్టణంలోని స్వర్ణ భారతి పునరావాస శిబిరంలో వరద ముంపు బాధితులను పరామర్శించిన డిప్యూటీ సీఎం
  • ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయ సహకారాలపై ఆరా తీసిన భట్టి
  • ప్రజలకు ఇబ్బందులు రాకుండా అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించిన డిప్యూటీ సీఎం

మళ్లీ మొదలైన భారీ వర్షాలు

  • ఎన్టీఆర్ జిల్లా: నందిగామ నియోజకవర్గవ్యాప్తంగా మళ్లీ మొదలైన భారీ వర్షాలు
  • పొంగిపొర్లుతున్న నందిగామ మున్నేరు
  • లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
  • వర్షాలు మళ్లీ భారీగా పడటంతో ఆందోళన చెందుతున్న రైతన్నలు
  • బిక్కుబిక్కుమంటూ భయం గుప్పెట్లో లోతట్టు ప్రాంత ప్రజలు

ఖమ్మం జిల్లాలో భారీ వర్షం

  • మున్నేరు వాగుకు పొంచిఉన్న వరద ముప్పు
  • లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన పోలీసులు
  • మైక్‌ల ద్వారా ప్రజలకు పోలీసులు సూచనలు
  • పరివాహక ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలింపు
  • అధికారులను అప్రమత్తం చేసిన మంత్రులు తుమ్మల, పొంగులేటి
  • కలెక్టర్లతో మాట్లాడి పరిస్థితి తెలుసుకుంటున్న మంత్రులు
     

కోస్తా జిల్లాల్లో కుండపోత వాన

  • విశాఖ, ఎన్టీఆర్, ఉభయ గోదావరి జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం
  • 5 జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ
  • మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడన
  • నేడు వాయుగుండంగా మారే అవకాశం
  • ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్‌
  • కొనసాగుతున్న మత్స్యకారుల హెచ్చరికలు
  • మరో రెండు రోజులు కొనసాగనున్న వర్షాలు

ప్రకాశం బ్యారేజ్‌కు మళ్లీ పెరుగుతున్న వరద

  • ఎగువ నుంచి భారీగా కృష్ణానదికి వచ్చి చేరుతున్న వరద
  • నందిగామ వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు  
  • లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
  • భారీ వర్షాల నేపథ్యంలో తిరువూరు, నందిగామ, విజయవాడ రూరల్ మండలాల తహసీల్దార్లను, జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, కొండపల్లి మున్సిపల్ కమిషనర్లను అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.సృజన
  • లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు
  • ఓ వైపు వరద.. మరోవైపు వర్షాలతో భయపడుతున్న బెజవాడ ప్రజలు
  • బుడమేరు గండ్లు పూడ్చినప్పటికీ భారీ వర్షంతో వరద ముంపు ప్రాంతాల్లో ఆందోళన

విజయవాడలో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. దీంతో బెజవాడ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వరదలతో విజయవాడ అతలాకుతలమైంది. 8 రోజులుగా నగర వాసులు వరద కష్టాలు పడుతున్నారు. ఇంకా వరద ముంపులోనే పలు కాలనీలు ఉన్నాయి.

ఇదీ చదవండి: సాయం సున్నా.. ప్రచార ఆర్భాటం వంద!

ఎన్టీఆర్‌ జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. గడిచిన 24 గంటల్లో తిరువూరులో 10 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఏపీలో నేడు భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఎనిమిది జిల్లాలకు రెయిన్‌ అలర్ట్‌ జారీ చేసింది. అల్లూరి, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ అయ్యింది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణాకు ఆరెంజ్‌ అలర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement