AP And Telangana Floods News Latest Updates In Telugu
తూర్పుగోదావరి జిల్లా:
- ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద భారీగా పెరిగిన గోదావరి వరద
- 15.10 అడుగులకు చేరుకున్న వరద నీటిమట్టం
- 15 లక్షల 6 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలో విడుదల
- కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక
- కోనసీమలో పోటెత్తి ప్రవహిస్తున్న గౌతమి,వశిష్ట, వైనతేయ నదులు
- నీట మునిగిన కాజ్వేలు
- లంక గ్రామాలకు నిలచిపోయిన రాకపోకలు
కృష్ణాజిల్లా
భారీవర్షాలు , వరదలతో కృష్ణాజిల్లాకు భారీ నష్టం
- జిల్లాలో 1200 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేసిన అధికారులు
- జిల్లా వ్యాప్తంగా 2 లక్షల 37వేల మంది పై ప్రభావం
- వ్యవసాయం (44521 హెక్టార్లు) 385.24 కోట్లు నష్టం
- హార్టికల్చర్ (4070.26 హెక్టార్లు) 108 కోట్లు నష్టం
- ఆక్వాకల్చర్ 4.23 కోట్లు నష్టం
- పశుసంవర్ధక(పశువులు , గొర్రెలు ,కోళ్లు) 22.1 లక్షలు నష్టం
- పరిశ్రమలకు నష్టం 34.43 లక్షలు
- ఇరిగేషన్ కు నష్టం 506 కోట్లు
- రోడ్లు , భవనాలు 69 కోట్లు నష్టం
- పంచాయతీరాజ్ 60 కోట్లు నష్టం
- గ్రామీణ నీటి సరఫరా విభాగం 51.40 కోట్లు
- విద్యుత్ శాఖకు 15 కోట్లు నష్టం
- మున్సిపాల్టీలకు 2.03 కోట్లు నష్టం
- శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు
- ఇన్ ఫ్లో : 1,41,879 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో : 68,210 క్యూసెక్కులు
- పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు
- ప్రస్తుతం : 884.10 అడుగులు
- పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు
- ప్రస్తుతం : 210.5133 టీఎంసీలు
- కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
అల్లూరి సీతారామరాజు జిల్లా
కూనవరం గిన్నెల బజారులో వరద బాధితుల నిరసన...
నడుము లోతు వరద నీటిలో నివాసాల ముందు నిర్వాసితుల జలదీక్ష...
తక్షణం పోలవరం పరిహారం, పునరావాసం కల్పించి, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని డిమాండ్
ప్రభుత్వం, అధికారులు తమను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్న బాధిత మహిళలు
కృష్ణా జిల్లా :
విజయవాడ రూరల్ మండలం గుడవల్లి వద్ద బుడమేరు కాలువలో వ్యక్తి గల్లంతు.
కేసరపల్లికి చెందిన నాగరాజు అనే వ్యక్తిగా గుర్తింపు.
చేపలు వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు బుడమేరులో గల్లంతైన వ్యక్తి
ఘటనా స్థలానికి చేరుకొని ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులు.
జల దిగ్బంధంలో చింతూరు ఏజెన్సీ
అల్లూరి జిల్లా: విలీన మండలాలను చుట్టుముట్టిన శబరి, గోదావరి నదులు
నాలుగు మండలాల్లో 37 ప్రాంతాల్లో ముంపునకు గురైన ప్రధాన, అంతర్గత రహదారులు
సుమారు 80కు పైగా గ్రామాలకు నిలిచిన రాకపోకలు
పూర్తిగా ముంపునకు గురైన 18 గ్రామాలలోని 1467 కుటుంబాలు
వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలింపు
చింతూరు మండలంలో ఎన్ హెచ్-30, 326 లపై ప్రవహిస్తున్న వరద నీరు
ఆంధ్రా-తెలంగాణా-ఒడిశా-ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మధ్య స్థంభించిన రవాణా వ్యవస్థ.. భారీగా నిలిచిన వాహనాలు
ముకునూరు వద్ద రహదారిపై ప్రవహిస్తున్న సోకిలేరు వాగు
చింతూరు-వీఆర్ పురం మండలాల మధ్య పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు బంద్
కూనవరం మండలం, పోలిపాక వద్ద కూనవరం-భద్రాచలం ప్రధాన రహదారిపై చేరిన గోదావరి వరద
ఆంధ్రా-తెలంగాణా రాష్ట్రాల మధ్య నిలిచిన రాకపోకలు
పండ్రాజుపల్లి వద్ద ప్రధాన రహదారిపై చేరిన వరద... కూనవరం-చింతూరు మధ్య రాకపోకలు బంద్
కొండ్రాజుపేట కాజ్‌వే పై ప్రవహిస్తున్న వరదనీరు.. పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు బంద్
వీఆర్ పురం మండలంలో పూర్తిగా వరదలకు ప్రభావితమైన శ్రీరామగిరి, రామవరం, చిన్నమాట్టపల్లి, తుమ్మిలేరు, జీడిగుప్ప గ్రామాలు
గ్రామాల మధ్య నిలిచిన రాకపోకలు
వరదల దృష్ట్యా విలీన మండలాల్లోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన అధికారులు
పోటెత్తుతున్న గోదావరి
- తూర్పుగోదావరి జిల్లా: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పోటెత్తుతున్న గోదావరి
- ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 14.2 అడుగులకు చేరుకున్న వరద నీటిమట్టం
- 13 లక్షల 37వేల క్యూసెక్కుల నీరు సముద్రంలో విడుదల
- బ్యారేజీ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక
- కోనసీమలో ఉదృతంగా ప్రవహిస్తున్న గౌతమి, వశిష్ట, వైనతేయ నదులు
- కోనసీమలో పలుచోట్ల నీట మునిగిన కాజ్‌వేలు
- లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేసిన అధికారులు
- అమలాపురం కలెక్టరేట్ కార్యాలయంతో ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు
⇒గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. మంగళవారం రాత్రి 8 గంటలకు ధవళేశ్వరం బ్యారేజీకి 10,31,640 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి మట్టం 12.10 అడుగులకు చేరుకుంది. దాంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 10,28,640 క్యూసెక్కులను బ్యారేజీ 175 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. గోదావరి వరద ఉద్ధృతికి శబరి తోడవడంతో కూనవరం వద్ద అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
⇒వరద నీటితో రహదారులు మునిగిపోవడంతో చింతూరు నుంచి చట్టి, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లకు అలాగే ఎటపాక, చింతూరు, వీఆర్‌పురం, కూనవరం మండలాల్లో సుమారు 80 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పోలవరం ప్రాజెక్టులోకి 10.31 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. ఏలేరు, వంశధార, నాగావళి నదుల్లో వరద ఉధృతి కొనసాగుతోంది.
⇒మంగళవారం రాత్రి ఏలేరు రిజర్వాయర్‌లోకి 19,813 క్యూసెక్కులు చేరుతుండగా.. స్పిల్ వే గేట్లు ఎత్తి 18,760 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. వంశధార నుంచి గొట్టా బ్యారేజీలోకి 24,700 క్యూసెక్కులు చేరుతుండగా 27,283 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. నారాయణపురం ఆనకట్ట నుంచి 12,900 క్యూసెక్కుల నాగావళి జలాలు సముద్రంలోకి కలుస్తున్నాయి.
⇒పరివాహక ప్రాంతంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణాలో వరద మరింత తగ్గింది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ప్రకాశం బ్యారేజీలోకి 1,93,237 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు 1,512 క్యూసెక్కులు వదులుతున్న అధికారులు మిగులుగా ఉన్న 1,91,725 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు.
ఉత్తరాంధ్ర: వర్షాలు తగ్గుముఖం పట్టినా..
భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో నదులు, వాగులు, చెరువులు, గెడ్డలు పొంగిపొర్లాయి. ఈ వర్షాలు మంగళవారం తగ్గుముఖం పట్టినా.. ఇంకా నదులు, కాలువలు పొంగిపొర్లుతునే ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని నాగావళి, వంశధార ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడడంతో పరివాహక ప్రాంతాల్లోని వాగులు, ఏర్లు పొంగి ప్రవహించాయి. పలుచోట్ల చెరువులు దెబ్బతిన్నాయి. అనేకచోట్ల గండ్లు పడ్డాయి. ఫలితంగా వేల ఎకరాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఏడువేల ఎకరాలకు పైగా పంట నష్టం సంభవించినట్లు ప్రాథమిక అంచనా.
Comments
Please login to add a commentAdd a comment