khammam Crime: Sathupalli Woman Sprinkle Chilli Powder To Man Over Money Issue - Sakshi
Sakshi News home page

Khammam Crime: పట్టించుకోవట్లేదని ప్రియుడి కళ్లలో కారం కొట్టింది!

Published Wed, Apr 6 2022 12:42 PM | Last Updated on Wed, Apr 6 2022 2:14 PM

khammam Sathupalli Woman Split Chilli Powder Man Over Money Issue - Sakshi

ఖమ్మం: జిల్లాలోని సత్తుపల్లి పట్టణంలో చోద్యం చోటుచేసుకుంది. స్థానికంగా బిర్యానీ సెంటర్ నడుపుతున్న ఒక వ్యక్తిపై.. ఓ మహిళ కారం పొడితో దాడికి పాల్పడింది. అయితే దాడికి పాల్పడింది అతని ప్రియురాలే అని సమాచారం.

పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం మల్లేశ్వరం గ్రామానికి చెందిన యువరాజు.. సత్తుపల్లిలో ధమ్  బిర్యానీ సెంటర్ నడుపుతున్నాడు. అతని భార్య కస్తూరి స్వగ్రామంలోనే ఉంటుంది. ఈ క్రమంలో యువరాజు తన హోటల్‌లో పనిచేస్తున్న సత్వవతి అనే మహిళతో మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. అయితే కొన్నిరోజులుగా ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో బిర్యానీ సెంటర్‌ దగ్గరికి వచ్చి మరీ కారం పొడితో దాడి చేసింది సత్యవతి. 

తన వల్లే యువరాజు ఈ స్థాయికి వచ్చాడని, అలాంటి తననే ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తున్నాడంటూ సత్యవతి ఆందోళన చేపట్టింది. అడ్డుకోవడానికి ప్రయత్నించిన కొందరిపైనా ఆగ్రహం వెల్లగక్కింది. పైగా డబ్బులు మొత్తం అతని భార్య పిల్లలకే పంపిస్తున్నాడంటూ గోల చేసింది. ఈ క్రమంలో ఇరువురు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement