Duddilla Sridhar Babu
-
అమెరికా ఎన్ఆర్ఐ కుటుంబానికి భారీ పరిహారం
హైదరాబాద్: విదేశాల్లో ఉన్న భారత విద్యార్థుల హక్కులను పరిరక్షించడంలో కోర్ ట్రాకర్ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. అమెరికాలోని కాన్సాస్ రాష్ట్రంలోని లివ్ అపార్ట్మెంట్స్ స్విమ్మింగ్ పూల్ వద్ద జరిగిన ఘటనలో మృతి చెందిన ఎన్ఆర్ఐ విద్యార్థి కొల్లి మణిదీప్ కుటుంబానికి ఆ సంస్థ స్ఫూర్తిదాయకమైన సేవలను అందించిందంటూ సంస్థ చైర్మన్ విక్రంసాగర్ పసాలను అభినందించారు.శనివారం మాదాపూర్ టీ హబ్‌లో జరిగిన కార్యక్రమంలో మణిదీప్ కుటుంబానికి భారీ నష్టపరిహారం (5.4 కోట్ల రూపాయలు) చెక్కును మంత్రి ఆందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ ఐటీ టెక్నాలజీ సంస్థ కోర్ ట్రాకర్ కృషి ఫలితంగా బాధిత కుటుంబానికి నష్టపరిహారం అందిందని పేర్కొన్నారు. అమెరికాలో ప్రముఖ న్యాయవాది, హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్ క్యూ ఆరిఫ్ బలమైన ఆధారాలు సేకరించి అపార్ట్మెంట్ నిర్వాహకుల నిర్లక్ష్యమే ఈ దుర్ఘటనకు కారణమని వాదనను సమర్థవంతంగా వినిపించారని కొనియాడారు.చదవండి: కెనడా నుంచి అమెరికాలోకి.. చొరబాటుదారుల్లో ఇండియన్సే ఎక్కువ -
రఘువంశీ ఏరోస్పేస్ విస్తరణతో 1200 కొత్త ఉద్యోగాలు: మంత్రి శ్రీధర్ బాబు
విమాన ఇంజన్ల కీలక విడిభాగాలు, రక్షణరంగ ఉత్పత్తుల తయారీలో గణనీయ వృద్ధిని సాధించిన రఘువంశీ ఏరోస్పేస్ భారీ విస్తరణపనులకు శ్రీకారం చుట్టింది. గురువారం నాడు శంషాబాద్ ఏరోస్పేస్ పార్క్‌లో ఈ సంస్థ కొత్త కర్మాగారం నిర్మాణానికి ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శంకుస్థాపన చేసారు. రూ.300 కోట్ల వ్యయంతో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమయ్యే ఈ పరిశ్రమ రానున్న మూడేళ్లలో 1200 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తుందని ఈ సందర్భంగా శ్రీధర్ బాబు వెల్లడించారు.రఘువంశీ ఏరోస్పేస్ చేతిలో ఉన్న రూ.2 వేల కోట్ల ఆర్డర్లకు సంబంధించిన పరికరాలు ఈ నూతన సదుపాయంలో ఉత్పత్తి అవుతాయని ఆయన తెలిపారు. ఎయిర్ బస్ ఏ320, బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల ఇంజన్లకు, జిఇ ఏరోస్పేస్, రోల్స్ రాయిస్, ప్రాట్ అండ్ విట్నీ, సఫ్రన్, హానీవెల్ విమాన ఇంజన్లను తయారు చేసే సంస్థలకు రఘువంశీ కీలకమైన విడిభాగాలను సరఫరా చేస్తుందని శ్రీధర్ బాబు వెల్లడించారు.2002లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమగా ప్రారంభమైన రఘువంశీ ప్రస్థానం ప్రపంచ ప్రఖ్యాత విమాన తయారీ సంస్థలకు ఫ్యూయల్ పంపులు, ల్యాండింగ్ గేర్ల లాంటి ముఖ్య పరికరాలను ఉత్పత్తి చేసే స్థాయికి చేరి ఏరోస్పేస్ రంగంలో రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింప చేసిందని శ్రీధర్ బాబు ప్రసంసించారు. డిఆర్ డిఓ, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ , భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లాంటి ప్రభుత్వరంగ సంస్థలకు పరికరాలు, విడిభాగాలను అందజేస్తోందని ఆయన వివరించారు.ముడి చమురు, సహజవాయువును వెలికితీసే పరిశ్రమలకు, ఆరోగ్య రంగంలో వినియోగించే పరికరాలను తయారు చేస్తోందని వెల్లడించారు. హైదరాబాద్ ఏరోస్పేస్ ఎస్ ఇ జెడ్ లో టాటా, భారత్ ఫోర్జ్, ఆదానీ లాంటి ప్రఖ్యాత కంపెనీలు కూడీ వైమానిక, రక్షణ, అంతరిక్ష వాహనాల ఉత్పత్తులను తయారు చేస్తున్నాయని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈ ఏరోస్పేస్ సంస్థలకు రకరకాల విడిభాగాలను అందించే 1500 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయని ఆయన చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఎంఎస్ ఎమ్ఇ పాలసీ ప్రకారం ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో ఏర్పాటు చేసే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తామని శ్రీధర్ బాబు వెల్లడించారు. కార్యక్రమంలో రఘువంశీ ఏరోస్పేస్ డైరెక్టర్ వంశీ వికాస్, డిఆర్ డిఓ క్షిపణి, వ్యూహాత్మక వ్యవస్థల డైరెక్టర్ రాజబాబు, సిఐఐ ఛైర్మన్ డా.సాయి ప్రసాద్, టిజిఐఐసి ఎండీ డా. ఇ. విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర ఏరోస్సేస్, డిఫెన్స్ విభాగం డైరెక్టర్ పిఏ ప్రవీణ్, టిజిఐఐసి సిఒఓ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. -
చారిత్రక వైభవానికి ఇబ్బంది రావద్దు
సాక్షి, హైదరాబాద్: అసఫ్‌జాహీల నిర్మాణ కౌశలం కొనసా గాలని, పాత అసెంబ్లీ భవన చారిత్రక వైభవానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పునరుద్ధరించాలని రాష్ట్ర ఆర్ అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆగాఖాన్ నిర్మాణ సంస్థ ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. పాత అసెంబ్లీ భవన పునరుద్ధరణ పనులపై శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి మంగళవారం అసెంబ్లీ స్పీకర్ చాంబర్లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు, ఆర్అండ్బీ అధికారులు, ఆగాఖాన్ ట్రస్టు ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ రాబోయే మూడు నెలల్లో ఈ భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని, చారిత్రక వైభవానికి ఎక్కడా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సూచించారు. ఆగాఖాన్ ట్రస్ట్ కు రూ.2 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్న విషయం తెలియడంతో వెంటనే స్పందించిన మంత్రి.. సమావేశం నుంచే ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కతో మాట్లాడి నిధులు విడుదల చేయించారు.బిల్లుల కోసం ప్రజోపయోగ పనులను ఆపవద్దని అధికారులకు సూచించారు. ఏవైనా బిల్లులు పెండింగ్‌లో ఉన్నా, ఇతర సమస్యలేమి ఉన్నా తనకు లేదా మంత్రి శ్రీధర్‌బాబుకు చెప్పాలని కోరారు. ఈ భవనం అందుబాటులోకి వస్తే కౌన్సిల్‌హాల్‌ను అసెంబ్లీ భవనంలోకి మార్చవచ్చన్నారు. శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ పాత అసెంబ్లీ భవన పునరుద్ధరణ పనుల పర్యవేక్షణ కోసం ఎస్ఈ స్థాయి అధికారిని నియమించాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు.అదో పెద్ద జోక్: మంత్రి కోమటిరెడ్డిఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, విద్యుత్ చార్జీల అంశంపై కేటీఆర్ ఈఆర్సీ దగ్గరకు వెళ్లడం పెద్ద జోక్ అని అన్నారు. ఆయనో జోకర్ అని, పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు రాకుండా ప్రజలు ఓడించినా వారికి బుద్ధి రాలేదన్నారు. 200 యూనిట్ల వరకు పేదలకు తమ ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ అందజేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డిలు రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. -
బీఆర్ఎస్ హయాంలోనే మూసీకి సరిహద్దులు: మంత్రి శ్రీధర్ బాబు
సాక్షి, హైదరాబాద్: పేదలు, మధ్యతరగతి ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. మూసీ ప్రక్షాళనపై విపక్షాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ తెచ్చిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని తెలిపారు. మూసీలో అక్రమ కట్టడాలు గుర్తించాలని గతంలో కేసీఆర్ ఆదేశించలేదా అని ప్రశ్నించారు. మూసీని కాలుష్య రహితంగా చేయాలని కేసీఆర్ చెప్పలేదా అని మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ నేతలు చేసిన పనులు మర్చిపోయినట్లున్నారని సెటైర్లు వేశారు.ఈ మేరకు మంత్రి మంగళవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. 2021లో మూసీపై కేసీఆర్ ప్రభుత్వం సమావేశాలు పెట్టిందని తెలిపారు. మూసీకి 50 మీటర్ల దూరంలో బఫర్ జోన్‌ను నిర్ణయించారన్నారు. మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాలని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారని ప్రస్తావించారు. బీఆర్ఎస్ హయాంలోనే మూసీకి సరిహద్దులను ఫిక్స్ చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు మూసీ ప్రక్షాళన ఎందుకని బీఆర్ఎస్ వాళ్లు ప్రశ్నిస్తున్నారని అన్నారు. -
అమెరికా వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, సాక్షి: రాష్ట్రానికి కొత్త పెట్టుబడులను ఆకర్షించడం కోసం ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనకు బయల్దేరారు. ఈ ఉదయం శంషాబాద్ నుంచి ఆయన అమెరికా వెళ్లారు. ఆయన వెంట మంత్రి డి.శ్రీధర్‌బాబు, సీఎస్ శాంతికుమారి కూడా ఉన్నారు. న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, శాన్‌ఫ్రాన్సిస్కోతో పాటు దక్షిణ కొరియా సియోల్ నగరంలోనూ రేవంత్ బృందం పర్యటించనుంది.తన పర్యటనలో భాగంగా.. తొలుత ఈనెల 4న న్యూజెర్సీలో జరిగే ప్రవాస తెలంగాణీయులతో జరిగే సమావేశంలో ఈ బృందం పాల్గొంటుంది. 5, 6 తేదీల్లో న్యూయార్క్‌లో వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై చర్చిస్తారు. 6న పెప్సికో, హెచ్‌సీఏ కంప్యూటర్స్ ప్రతినిధులతో భేటీ అవుతారు. మధ్యాహ్నం వాషింగ్టన్ డీసీకి చేరుకుని అక్కడ ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. 7న డల్లాస్‌లో వ్యాపార సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు. అదే రోజు అక్కడ గాంధీ స్మృతి కేంద్రాన్ని సందర్శిస్తారు.8న శాన్ఫ్రాన్సిస్కోలో యాపిల్ ఉత్పాదక బృందం, ట్రైనెట్ సీఈఓ, ఇతర వ్యాపార సంస్థల ప్రతినిధులతో భేటీ అయి చర్చించనున్నారు. 9న గూగుల్, అమెజాన్ తదితర సంస్థల ప్రతినిధులతో సమావేశం అవుతారు. శాన్ఫ్రాన్సిస్కోలో సాయంత్రం జరిగే ప్రవాస తెలంగాణీయుల భేటీలో పాల్గొంటారు. అటు నుంచే సియోల్‌కు..10న శాన్ఫ్రాన్సిస్కో నుంచి బయల్దేరి 11న దక్షిణ కొరియా రాజధాని సియోల్‌కు చేరుకుంటారు. 12, 13 తేదీల్లో ఎల్జీ, శామ్సంగ్తో పాటు .. ఇతర వ్యాపార సంస్థల ప్రతినిధులతో భేటీ అయి పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించనున్నారు. 13న రాత్రి 11.50 గంటలకు సియోల్ నుంచి బయల్దేరి 14న ఉదయం 10.50 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటారు. -
తెలంగాణ బడ్జెట్ ముఖ్యాంశాలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో నేడు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. శాసన సభలో బడ్జెట్‌పై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, మండలిలో మంత్రి శ్రీధర్ బాబు ప్రసంగించారు. ఇక, 2024-25 గాను తెలంగాణ బడ్జెట్: రెండు లక్షల 91వేల 191 కోట్లు కాగా, రెవెన్యూ వ్యయం రూ.2.20,945 కోట్లు. మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా ఉంది. బడ్జెట్ కేటాయింపులు ఇలా..సాగునీటి పారుదల శాఖకు రూ.26వేల కోట్లు.విద్యాశాఖకు రూ.21,292 కోట్లు.ప్రజాపంపిణీకి రూ.3836 కోట్లుఆరోగ్యశ్రీని రూ.10లక్షలకు పెంచాం.సంక్షేమానికి రూ.40వేల కోట్లు.రోడ్లు, భవనాలకు రూ.5790 కోట్లు.ఐటీ శాఖకు రూ.774 కోట్లు.హార్టీకల్చర్కు రూ.737 కోట్లు.పరిశ్రమల శాఖకు రూ.2762 కోట్లు.ట్రాన్స్‌కో, డిస్కంలకు రూ.16,410 కోట్లు.గృహజ్యోతికి రూ.2418 కోట్లు.500 రూపాయల గ్యాస్ సిలిండర్‌కు రూ.723 కోట్లు.అడవులు, పర్యావరణ శాఖకు రూ.1064 కోట్లు.ఎస్టీ సంక్షేమానికి రూ.17056 కోట్లు.ట్రిపుల్ ఆర్ఆర్ఆర్కు రూ.1525 కోట్లు.ఎస్సీ సంక్షేమానికి రూ.33.124 కోట్లుట్రాన్స్కో, డిస్కంలకు రూ.16,410 కోట్లు.వైదారోగ్య శాఖకు రూ.11468 కోట్లు.ఓఆర్ఆర్కు రూ.200 కోట్లు.ఎయిర్‌పోర్టు వరకు మెట్రో విస్తరణకు రూ.100 కోట్లు.హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్‌కు రూ.500 కోట్లు.హెచ్ఎండీఏ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రూ.500 కోట్లు.హోంశాఖకు రూ.9564 కోట్లు.పంచాయతీరాజ్ శాఖకు రూ.29,816 కోట్లు.బీసీ సంక్షేమానికి రూ.9200 కోట్లు.మైనార్టీ శాఖకు రూ.3003 కోట్లు.మెట్రోవాటర్ వర్క్స్ కోసం రూ.3385 కోట్లు.కొత్త ఏర్పాటు చేసిన హైడ్రాకు రూ.200 కోట్లు.మొత్తం హైదరాబాద్ అభివృద్ధికి రూ.10వేల కోట్లు. పశుసంవర్థక శాఖకు రూ.1980 కోట్లు.విద్యాశాఖకు రూ.21,292 కోట్లు.స్త్రీ శిశు సంక్షేమశాఖకు రూ.2736 కోట్లు.ఓల్డ్ సిటీ మెట్రో విస్తరణకు రూ.500 కోట్లు.అడవులు, పర్యావరణ శాఖకు రూ.1064 కోట్లు.విద్యుత్ శాఖకు రూ.16,410 కోట్లు.రూ.2లక్షల రుణమాఫీ కోసం రూ.31వేల కోట్లు.ఇందిరా మహిళా శక్తి పథకానికి రూ.50.41 కోట్లు. మహాలక్ష్మి ఉచిత రవాణాకు రూ.723కోట్లు.మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్‌కు రూ.1500 కోట్లు.ఎస్సీ, ఎస్టీ గృహ లబ్ధిదారులకు రూ.6 లక్షల సాయం. మల్టీ మోడల్ సబర్బన్ రైలు ట్రాన్స్‌పోర్టు సిస్టంకు రూ.50 కోట్లు. మంత్రి భట్టి విక్రమార్క ప్రసంగిస్తూ.. పదేళ్ల అస్తవ్యస్త పాలనకు తెలంగాణ ప్రజలు చరమగీతం పాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడు పది రేట్లు పెరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఉద్యోగాలు, నీళ్లు దక్కలేదు. బంగారు తెలంగాణ చేస్తామని ఉత్తరకుమార ప్రగల్బాలు పలికారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పులపాలైంది. వామనావతారం లెక్క అప్పలు పెరిగాయి. గత ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. కొత్త ఉద్యోగాలు..గత ప్రభుత్వం మాదిరిగా దుబారా ఖర్చు ఆపేసి ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నాం. ఒంటెద్దు పోకడలతో ఆర్ధిక వ్యవస్థను నిర్వీర్యం చేశారు. అప్పులు పెరగడంతో పాటుగా బిల్లులు బకాయిలు భారీగా పెరిగిపోయాయి. కొత్త ఉద్యోగాలు సృష్టించడం కాదు.. ఉన్న ఉద్యోగాలే ఇవ్వలేదు. దశాబ్ద కాలంలో తెలంగాణ పురోగమించలేదు. జీతాలు, పెన్షన్లు చెల్లింపులు కూడా చేయలేని పరిస్థితి. రాష్ట్రంలో ఏర్పడిన పదేళ్ల తర్వాత వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టాం. నా తెలంగాణ కోటి రతనాల వీణ. ఎన్నో ఏళ్లు ప్రజలు ఉద్యమం చేశారు.రైతులకు మేలు..ఆయిల్ పామ్ సాగుకు రైతులకు అవసరమైన సాయం అందిస్తాం. రాష్ట్రంలో లక్ష ఎకరాల ఆయిల్ పామ్ సాగును లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు, పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రోను విస్తరిస్తాం. మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు మెట్రోను విస్తరిస్తాం. ఉచిత బస్సులు పథకం రాష్ట్ర అభివృద్ధి సాయపడుతోంది. అప్పులకు వడ్డీల కోసం రూ.17,729 కోట్లు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా అభివృద్ధిని ఆపలేదు. ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన పథకంలో చేరాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వంతో కలిసి ప్రీమియం అంతా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైతులకు ఇది ఎంతోగానో ఉపయోగపడుతుంది. రైతులు చెల్లించాల్సిన ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుంది.ఇందిరమ్మ ఇళ్లు..త్వరలో భూమిలేని రైతు కూలీలకు ఏటా రూ.12వేలు అందిస్తాం. ఏదో గెలవాలని మేం ఎన్నికల హామీలు ఇవ్వలేదు. ఈ ఏడాది మార్చి వరకు 2,26,740 ధరణి అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. కొత్తగా మరో 1,22,774 ధరణి దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు 1,79,143 దరఖాస్తులను పరిష్కరించాం. రూ.2లక్షల వరకు రుణం ఉన్న రైతులకు త్వరలో రుణమాఫీ. రైతు భరోసా పథకం కింద ఎకరాకి రూ.15వేలు ఇవ్వాలన్నది మా సంకల్పం. ఇందిరమ్మ ఇళ్ల ద్వారా పేదలకు రూ.5లక్షల సాయం. ఎస్సీ, ఎస్టీ గృహ లబ్దిదారులకు రూ.6 లక్షల సాయం. ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు. రాష్ట్రంలో మొత్తం నాలుగు లక్షల 50వేల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు.డ్వాక్రా మహిళలకు జీవిత బీమాస్వయం సహాయక సంఘాల్లోని 63.86 కోట్ల మంది మహిళా సభ్యులకు జీవిత బీమా. వీరికి రూ.10 లక్షల జీవిత బీమా. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సకాలంలో చెల్లింపులు. గత ఆరు నెల్లలో బకాయిపడిన కస్టమ్ మిల్లర్స్ నుంచి రూ.450 కోట్లు వసూలు చేశాం.గత ప్రభుత్వం రైతుబంధుకు రూ.80వేల కోట్లు ఖర్చు చేసింది. రైతుబంధు ద్వారా అనర్హులకే అధికారంగా లబ్ధి చేకూరింది.తలసరి ఆదాయం ఇలా..తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,47,299. జాతీయ తలసరి ఆదాయంలో పోల్చితే లక్షా 64వేలు అధికం. అత్యధికంగా రంగారెడ్డి తలసరి ఆదాయం రూ.9,46,862. అత్యల్పంగా వికారాబాద్ తలసరి ఆదాయం రూ.1,80,241. తెలంగాణ జీఎస్డీపీ రూ.14,63,963 కోట్లు. గతేదాడితో పోల్చితే 11.9 శాతం జీఎస్డీపీ వృద్ధిరేటు. 2023-24 తెలంగాణ వృద్ధిరేటు 7.4 శాతం. ఇదే సమయంలో జాతీయ వృద్ధి రేటు 7.6 శాతం. హైదరాబాద్‌పై స్పెషల్ ఫోకస్..ఓఆర్ఆర్ పరిధిలో కొత్త వ్యవస్థ ఏర్పాటు. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్(TCUR) ఏర్పాటు. టీసీయూఆర్ పరిధిలో జీహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలు ఉంటాయి. హైదరాబాద్‌లో విపత్తుల నివారణ, ఆస్తుల పరిరక్షణకు హైడ్రా. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కు అధిక ప్రాధాన్యత. మూసీ చుట్టూ రిక్రియేషన్ జోన్లు, పీపుల్స్ ప్లాజాలు, చిల్డ్రన్ పార్కులు, ఎంటర్టైన్మెంట్ జోన్లు. మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతాం. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను మారుస్తాం. డ్రగ్స్ నిర్మూలనకు అవగాహన సదస్సులు. హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ టౌన్‌షిప్‌లు. టౌన్‌షిప్‌లు అన్ని సౌకర్యాలు ఉండేలా ప్రణాళికలు. వారికి వేల్ఫేర్ బోర్డులు..ఈ సంవత్సరం రంజాన్ పండుగ కోసం రూ.33కోట్లు కేటాయింపు. కల్లు గీత కార్మికులు ప్రమాదాలకు గురికాకుండా కొత్త పరికరాల పంపిణీ. కొత్తగా ముదిరాజ్, యాదవ్, కురుమ, మున్నూరు కాపు, పద్మశాలి, లింగాయత్, గంగపుత్రుల కార్పొరేషన్లు ఏర్పాటు. ఆర్థికంగా వెనుకబడిన కులాల సంక్షేమం కోసం వేల్ఫేర్ బోర్డు ఏర్పాటు. ఆరోగ్యశ్రీ పథకంలో కొత్తగా 163 రకాల వ్యాధులను చేర్చాం. నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా అందించాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. తీవ్ర వేసవిలో కూడా నిరంతరాయంగా విద్యుత్‌ను అందించాం. అడవులు, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. అర్హులైన వారికి రైతుభరోసా ఇస్తాం. అసెంబ్లీలో రైతుభరోసా విధి విధానాలపై చర్చిస్తాం అని అన్నారు. మరోవైపు.. అసెంబ్లీలో భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంపై బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. భట్టి ప్రసంగానికి సభలో నిరసన నినాదాలు. బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని పార్టీ నేతలు భట్టి వ్యాఖ్యలను ఖండించారు. -
ఏఐ.. పార్కింగ్ ఎక్కడోయ్
షాపింగ్ కోసం కోఠి వెళ్లారు. అదసలే బిజీ ఏరియా.. ఫుల్ ట్రాఫిక్.. కారు పార్క్ చేయడానికి స్థలం లేదు. దగ్గరలో ఎక్కడ పార్కింగ్ ఉందో తెలియదు. రోడ్డు పక్కనే పార్క్ చేస్తే.. ట్రాఫిక్‌కు అంతరాయం. పోలీసుల కంట్లో పడితే ఫైన్ కట్టక తప్పదు. అదే ఓ యాప్ ఉండి, దగ్గరలో పార్కింగ్ ఎక్కడుందో తెలిస్తే..? అదీ పార్కింగ్ స్లాట్ బుక్ చేసుకుని, నేరుగా వెళ్లి పార్క్ చేసేసుకోగలిగితే..? ఈ తిప్పలన్నీ తప్పుతాయి కదా.బిజీ ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాల ఏర్పాటుతోపాటు ఇలాంటి వెసులుబాట్లు తెస్తే.. వాహనదారులకు ప్రయోజనం కలుగుతుంది. ట్రాఫిక్ చిక్కులకు చెక్ పడుతుందని నిపుణులు చెప్తున్నారు. ఈ తరహా ఏర్పాట్లపై ‘ఈజీపార్క్ ఏఐ’ అనే సంస్థ ఇటీవల ఐటీ మంత్రి శ్రీధర్‌బాబుకు ప్రజెంటేషన్ కూడా ఇచి్చంది. ఐటీ, కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో పార్కింగ్ సమస్యను పరిష్కరించవచ్చని ప్రతిపాదన చేసింది.సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ నగరం ఇప్పటికే వాహనాలతో కిక్కిరిసిపోయింది. ఏటా పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. అవన్నీ రోడ్లపై తిరగడం సంగతి పక్కనపెడితే.. ఎక్కడో ఓ చోట పార్క్ చేయక తప్పదు. షాపింగ్ కోసం వెళ్లినా, ఏదైనా పని మీద వెళ్లినా.. పార్కింగ్ కోసం తిప్పలే. కార్లే కాదు బైకులు పెట్టడానికీ ఎక్కడా స్థలం లేని దుస్థితి. దీనితో షాపుల ముందు, రోడ్ల పక్కన, గల్లీల్లో వాహనాలను పార్క్ చేస్తున్నారు. దీనితో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు, ప్రభుత్వం ఎంతగా ప్రయత్నించినా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం సమస్యగా మారుతోంది. ఉదయం, సాయంత్రం సమయాల్లో ఈ ఇబ్బంది మరింత ఎక్కువగా ఉంటోంది. పర్యాటక ప్రదేశాలు, ఆలయాలు, సాయంత్రాలు ఆహ్లాదంగా గడపడానికి వెళ్లే చోట్ల పార్కింగ్ పెద్ద ప్రహసనంగా మారింది.ఎలా పనిచేస్తుంది..కృత్రిమ మేధ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) సాయంతో పార్కింగ్ సమస్యను పరిష్కరించే విధానాన్ని ఈజీపార్క్ ఏఐ సంస్థ రూపొందించింది. ఆ వివరాల మేరకు.. పార్కింగ్ స్థలం నిర్వహించే వారికి ఒక డాష్ బోర్డు ఏర్పాటు చేస్తారు. వాహనాలు ఎన్ని వస్తున్నాయి? ఆక్యుపెన్సీ ఎంత ఉంది? ఎంతసేపు వాహనాలు పార్క్ చేస్తారన్న డేటాను దాని ద్వారా అందిస్తుంది. అలా అన్ని పార్కింగ్ స్థలాల వివరాలను ఒకచోట క్రోడీకరిస్తుంది.ఈ వివరాలను ఓ యాప్ సాయంతో వాహనదారులకు అందుబాటులో ఉంచుతుంది. ఈ యాప్ ద్వారా ఎక్కడెక్కడ పార్కింగ్ స్థలాలు అందుబాటులో ఉన్నాయనేది తెలుస్తుంది. ముందుగానే పార్కింగ్ స్లాట్లను బుక్ చేసుకుని, నేరుగా వెళ్లి పార్క్ చేసుకోవచ్చు. పార్కింగ్ ఫీజును కూడా ఆన్లైన్ ద్వారానే చెల్లించేయొచ్చు. ఒకవేళ ఆ ప్రాంతానికి వెళ్లకపోతే.. స్లాట్‌ను క్యాన్సిల్ చేసుకోవచ్చు. పార్కింగ్ ప్రదేశాల్లో ఇంటర్నెట్ ఆధారిత కెమెరాలతో నిఘా ఉంటుంది. వాహనానికి సంబంధించిన అలర్ట్స్ వస్తాయి. దొంగతనం, మరేదైనా జరిగితే వెంటనే అప్రమత్తం చేసే ఏర్పాట్లు ఉంటాయి. వాహనాలు వెళ్లిపోయి పార్కింగ్ స్లాట్లు ఖాళీ అయితే.. వెంటనే యాప్‌లో అప్డేట్ అయి ఖాళీగా చూపిస్తుంది. కావాల్సిన వారు బుక్ చేసుకోవచ్చు. పార్కింగ్ స్థలం వద్ద వాహనాలు బయటికి వెళ్లడం, లోపలికి రావడం ప్రత్యేక పరికరాలతో నమోదవుతూ ఉంటుంది. ఆటోమేటిగ్గా వాటి నంబర్లను గుర్తించి అప్డేట్ చేసే వ్యవస్థ ఉంటుంది.మల్టీలెవల్ పార్కింగ్తో.. అలాగే హైదరాబాద్‌లో భూముల విలువలు విపరీతంగా పెరిగిపోయాయి. దీనికితోడు ప్రధాన ప్రాంతాల్లో స్థలాలకు కొరత ఉండటంతో.. మలీ్టలెవల్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇలా ఏర్పాటు చేసినా.. అవి ఎక్కడున్నాయో అందరికీ తెలిసే అవకాశం తక్కువ. తెలిసినా పార్కింగ్ ఖాళీగా ఉందో లేదో తెలియదు. అక్కడిదాకా వెళ్లి ఖాళీ లేకుంటే.. మళ్లీ మరోచోటికి వెళ్లాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే పార్కింగ్ ఖాళీగా ఉందో, లేదో తెలిసి.. ముందే స్లాట్ బుక్ చేసుకునే అవకాశం ఉంటే బాగుంటుందన్న ఆలోచనతో ‘ఈజీపార్క్ ఏఐ’ అనే సంస్థ ముందుకొచి్చంది. ఇటీవల దీనిపై రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు ప్రజెంటేషన్ కూడా ఇచ్చింది.భవనాల్లో పార్కింగ్ సరిగా లేక.. హైదరాబాద్‌లో 80 లక్షలకుపైగా వాహనాలు ఉన్నాయి. కార్లు, టూ వీలర్లతోపాటు విద్యాసంస్థల వాహనాలు, ఆటోలు వంటివీ భారీగా ఉన్నాయి. ఇందులో కార్లు, టూవీలర్ల పార్కింగ్ కోసం ఇబ్బంది వస్తోంది. ట్రాఫిక్‌లో ఎలాగోలా గమ్యస్థానానికి చేరుకున్న వాహనదారులకు పార్కింగ్ విషయంలో తిప్పలు తప్పట్లేదు. పార్కింగ్‌కు అనుగుణంగా భవన నిర్మాణాలు చేపట్టకపోవడం ఈ సమస్యకు ప్రధాన కారణమని నిపుణులు చెప్తున్నారు.పార్కింగ్ సమస్యపై జనం ఏమంటున్నారు?సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో పార్కింగ్ సమస్యను పరిష్కరించడంపై ఫోకస్ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి గతంలో ఓ సమీక్ష సందర్భంగా ప్రకటించారు. ‘ఈజీపార్క్ఏఐ’ సంస్థ ప్రజెంటేషన్ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. పార్కింగ్ సమస్య పరిష్కారానికి ఐటీని వినియోగించాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఐటీ, కృత్రిమ మేధ (ఏఐ)ను ఉపయోగించి వాహనాల పార్కింగ్ సమస్యను పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఐటీ శాఖ ఇంజనీర్లను ఆదేశించారు కూడా. ఎక్కడికెళ్లినా పార్కింగ్‌కు ఇబ్బందే.. హైదరాబాద్‌లో, ముఖ్యంగా బిజీ ఏరియాల్లో పార్కింగ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటోంది. చాలాసేపు వెతికితే కానీ బండి పెట్టుకోవడానికి ప్లేస్ కనబడటం లేదు. చాలా షాపింగ్ కాంప్లెక్స్‌లలో పార్కింగ్ ఉండట్లేదు. అంతా రోడ్లపైనే పార్కింగ్ చేస్తున్నారు. అది ట్రాఫిక్‌కు ఇబ్బందిగా మారుతోంది. – నరేశ్‌గౌడ్ లోడి, అంబర్పేటప్రభుత్వం చొరవ తీసుకోవాలి హైదరాబాద్‌లో పార్కింగ్ పెద్ద సమస్యగా మారింది. పార్కింగ్ విషయంలో ప్రభుత్వం సరైన పాలసీ రూపొందించాలి. షాపింగ్ కాంప్లెక్స్‌లు, దుకాణాలకు, వాహనదారులకు అవగాహన కలి్పంచాలి. అప్పుడే నగరవాసులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. – కల్యాణ్, దిల్సుఖ్నగర్ -
లబ్ధికోసమే బీఆర్ఎస్ నీటి రాజకీయం : దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
పెద్దపల్లి: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల చేతిలో భంగపడ్డ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మరోసారి తెలంగాణ ప్రజలు, రైతులను మోసగించి పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకే ‘నీళ్ల’ రాజకీయం చేస్తున్నారని రాష్ట్రమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మండిపడ్డారు. జిల్లా కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు విజయరమణారావు, ఠాకూర్ మక్కాన్‌సింగ్‌తో కలిసి మాట్లాడారు. అధికారంలో ఉన్న పదేళ్లలో రైతులను ఏనాడూ పట్టించుకోని కేసీఆర్‌కు ఇప్పుడు వారి కష్టాలు గుర్తుకొచ్చాయని మొసలికన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. అయినా రైతులు ఆయనను నమ్మడం లేదన్నారు. కాంగ్రెస్ అఽధికారంలోకి రాగానే బీఆర్ఎస్ పాలనలో చేసిన మోసాలు, పాపాలు బయటకు వస్తున్నాయని, వాటినుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తాం.. వ్యవసాయ రంగంలో సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తామని, అలాగే పాలకుర్తి మండలంలో ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటించారు. తమ ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమం కోసం పాటుపడుతోందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీలన్నీ పక్కాగా అమలు చేస్తామని అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటికే 35కోట్ల మంది అక్కాచెల్లెళ్లు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సాగించారని అన్నారు. 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ అర్హులందరికీ అందిస్తామని తెలిపారు. సాంకేతిక కారణాలతో పొరపాట్లు దొర్లినా ఇబ్బంది పడొద్దని, వారి నుంచి విద్యుత్ అధికారులు బిల్లులు వసూలు చేయరాదని సూచించారు. జిల్లా ప్రజలకు ఆరోగ్యశ్రీ ద్వారా రూ.15కోట్ల విలువైన వైద్యసేవలు అందించామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేసిన బీఆర్ఎస్ పాలకుల తప్పిదాలను గాడిన పెట్టేందుకే సమయం పడుతోందని తెలిపారు. సమావేశంలో నాయకులు శంకర్, రమేశ్‌గౌడ్, సారయ్య, ప్రకాశ్‌రావు, మహేందర్, సంపత్, మల్లయ్య, శ్రీనివాస్, మస్రత్, కుమార్, ఈర్ల స్వరూప, కుమారస్వామి, అక్బర్అలీ పాల్గొన్నారు. ఇవి చదవండి: దానం నాగేందర్‌ను గెలిపించడమే మా బాధ్యత: కోమటిరెడ్డి -
నిజాం షుగర్స్ పునఃప్రారంభానికి కట్టుబడి ఉన్నాం
బోధన్: నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి, నిజాం షుగర్స్ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నా రు. సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో జరిగిన సమావేశంలో ఫ్యాక్టరీలను తెరిపించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఫ్యాక్టరీ సందర్శనకు వచ్చామని పేర్కొన్నారు. శనివారం బోధన్‌లోని ఫ్యాక్టరీని కమిటీ సభ్యులు సందర్శించారు. స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి అధ్యక్షతన ఫ్యాక్టరీ ఆవరణలో చెరుకు రైతులతో సమావేశమై వారి అభిప్రాయాలను సేకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రైతులు, కార్మికుల శ్రేయస్సు కోసం ఫ్యాక్టరీని తెరిపించి లాభాల బాటలో నడిపేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. రైతులకు మేలు చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇప్పటికే వ్యవసాయ, పారిశ్రామికరంగ నిపుణులతో చర్చిస్తున్నామని వివరించారు. రైతులకు సబ్సిడీ విత్తనాలు, పెట్టుబడి సాయం, వడ్డీ లేని రుణాలు వర్తింపజేసేలా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఫ్యాక్టరీలను ప్రభుత్వమా లేక సహకార విధానంలోనా లేక ప్రైవేటు రంగంలోనా ఎలా నడపాలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. నిపుణులతో చర్చించి తుది నిర్ణయం తీసుకొనేందుకు ఆలోచించకపోతే నిజాం షుగర్స్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులా అవుతుందని వ్యాఖ్యానించారు. మార్పు చేసి చూపుతాం.. ప్రజలు ఆకాంక్షించిన మార్పును చేసి చూపుతామని శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ నెల 27న రూ. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను ఏఐసీసీ నాయకురాలు ప్రియాంకా గాంధీ ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. హైదరాబాద్ శివారులో జిల్లాలు, ముఖ్య పట్టణాలను కలుపుతూ రీజినల్ రింగ్‌రోడ్డు (ఆర్ఆర్ఆర్) నిర్మించేందుకు ముందుకు వెళ్తున్నామన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్, రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, నిజాం షుగర్స్ ఎండీ డాక్టర్ మక్సూద్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పాల్గొన్నారు. -
317 జీవోపై కేబినెట్ సబ్ కమిటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కొత్త జోన్లు, కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల సర్దుబాటు కోసం ఉద్దేశించిన జీవో నంబర్ 317పై ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల అభ్యంతరాల దృష్ట్యా మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్‌గా మంత్రి దామోదర, సభ్యులుగా మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ ఉంటారు. 2021లో ఇచ్చిన జీవో 317, జీవో 46పై వివాదాలు, ఉద్యోగుల అభ్యంతరాలపై ఈ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది. పీఆర్టీయూటీఎస్ హర్షం గత ప్రభుత్వం జారీ చేసిన జీవో 317పై ఉద్యోగుల అభ్యంతరాలను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేబ్‌నెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం పట్ల పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. 317 జీవోతో ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోయారు: టీఎస్‌యూటీఎఫ్ ఉద్యోగుల శాశ్వత కేటాయింపు కోసం గత ప్రభు త్వం జీవో 317 ద్వారా ఏకపక్షంగా విడుదల చేసిన మార్గదర్శకాల కారణంగా పలువురు ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోయారని టీఎస్‌యూటీఎఫ్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి పేర్కొన్నారు. ఇప్పుడు ఆ సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారాలను సిఫారసు చేయటం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. జీవో 46పై సబ్ కమిటీతో నిరుద్యోగులకు న్యాయం: బల్మూరి వెంకట్ జీవో నంబర్ 46పై కేబినెట్ సబ్ కమిటీ వేయడాన్ని ఎంఎల్‌సి బల్మూరి వెంకట్ స్వాగతించారు. జీవో 46 వల్ల గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి తాము సూచనలు, సల హాలు చేసినా పట్టించుకోలేదని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ప్రజా ప్రభుత్వం సబ్ కమిటీ వేసిందని వెంకట్ హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో నిరుద్యోగులకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి ఉద్యోగ అవకాశాల్లో ఎలాంటి అన్యా యం జరగకుండా సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పీఆర్ కమిషనర్‌కు టీపీఎస్ఏ వినతిపత్రం ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు అంశాలు, బదిలీలపై గత సర్కార్ ఇచ్చిన జీవో 317తో ముడిపడిన సమస్యల పరిశీలనకు సీఎం రేవంత్‌రెడ్డి కేబినెట్ సబ్‌కమిటీని నియమించడం పట్ల తెలంగాణ పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్ (టీపీఎస్ఏ) హర్షం ప్రకటించింది. ఈ జీవో కారణంగా పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్‌కు టీఎస్పీఏ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శనివారం పీఆర్ కమిషనరేట్‌లో కమిషనర్‌కు టీఎస్పీఏ ప్రతినిధులు మధుసూదన్‌రెడ్డి, .శ్రీనివాస్, పండరీనాథ్ వినతిపత్రం సమర్పించారు. ఈ జీవో వల్ల కొందరు కార్యదర్శులు స్థానికతను కోల్పోయి కుటుంబాలకు దూరంగా ఇబ్బందులుపడుతున్నారని కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. -
పారిశ్రామిక భూముల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పారిశ్రామిక భూముల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పరిశ్రమల విస్తరణ, అభివృద్ధి నేపథ్యంలో టీఎస్ఐఐసీ విభాగపు అధికారులతో మంత్రి శ్రీధర్‌బాబు బషీర్‌బాగ్‌లోని సంస్థ కార్యాలయంలో శనివారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో సంస్థ కార్యకలాపాలు, విభాగాల పనితీరు, ల్యాండ్ బ్యాంకు, భూ కేటాయింపులు, వాటి వినియోగం తదితర అంశాలపై పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, సంస్థ ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి, అధికారులతో కలిసి సమీక్షించారు. రాష్ట్ర విభజనకు ముందు, తర్వాత జరిగిన కేటాయింపులపై మంత్రి దృష్టిసారించారు. 2014 తర్వాత జరిగిన భూ కేటాయింపులు, ఏయే కంపెనీలు ఎంత మేర, ఏ అవసరాల కోసం భూమి పొందిందీ.. ప్రస్తుత వినియోగం ఎంత, నిరుపయోగంగా ఉన్న భూముల వ్యవహారాలపై మంత్రి ఆరా తీశారు. ఏళ్లు గడిచినా సంబంధిత కంపెనీలు భూములు వినియోగించుకోకపోవడం.. భూములు పొందిన సంస్థలు వారి ప్రయోజనాలకు కాకుండా థర్డ్ పారీ్టలకు లీజుకు ఇచ్చిన అంశాలపై అధికారుల ద్వారా ఆరా తీశారు, అలా థర్డ్ పారీ్టలకు జరిగిన లీజు అగ్రిమెంట్లు, పొందుతున్న ఆదాయం అంశాలపై నివేదిక సమర్పించాలని సంస్థ ఉన్నతాధికారులను ఆదేశించారు. గతంలో భూములు పొంది, ఈడీ , సీబీఐ లాంటి సంస్థలు జప్తు చేసిన భూములపై హక్కు తిరిగి పొందేలా న్యాయస్థానాల్లో పోరాటం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని మంత్రి అధికారులకు సూచించారు. జాయింట్ వెంచర్లో భాగంగా పలు సంస్థలు, కంపెనీలు డివిడెండ్, షేర్ హోల్డ్ అమౌంట్ చెల్లించని అంశాలపై నివేదిక అందించాలని ఆదేశించారు. రాష్ట్ర అభివృద్ధిలో పరిశ్రమల శాఖ అధికారుల కృషి చాలా ఉందని, మరింతగా సంస్థ అభివృద్ధి కోసం సూచనలు, సలహాలతో పాటు సమస్యలు కూడా లిఖిత పూర్వకంగా ఇవ్వాలని ఉద్యోగులకు మంత్రి చెప్పారు. ప్రతి అధికారి ఫీల్డ్ విజిట్ చేసి సంబంధిత కంపెనీలకు సంబంధించిన భూములపై అన్ని వివరాలతో త్వరితగతిన నివేదిక అందించాలని సంస్థ ఎండీని మంత్రి ఆదేశించారు. -
ఫిబ్రవరి నుంచి 200 యూనిట్ల ఉచిత కరెంట్ హామీ అమలు: మంత్రి కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ సర్కార్ నిర్వాకం వల్ల తెలంగాణ అప్పులపాలైందన్నారు రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అందువల్లే ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో జాప్యం జరుగుతోందన్నారు. ఫిబ్రవరి నెల నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు హామీ అమలు చేస్తామని చెప్పారు. నిరుద్యోగ భృతి మొదలుకొని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వరకు అన్ని హామీలను గత ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదన్న మంత్రి.. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు అన్ని అక్రమాలపై విచారణ కొనసాగుతుందని తెలిపారు. కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ భేటీ మంగళవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జ్ దీపదాస్ మున్శి , ఏఐసీసీ ప్రొఫెషనల్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఏఐసీసీ మ్యానిఫెస్టోలో తెలంగాణ నుంచి చేర్చాల్సిన అంశాలపై చర్చించారు. అన్ని రాష్ట్రాల్లో తిరిగి అభిప్రాయాలను సేకరిస్తున్న కేంద్ర మేనిఫెస్టో కమిటీ.. తెలంగాణ మేనిఫెస్టో కమిటీ నుంచి కూడా అభిప్రాయాలను సేకరించింది. నాలుగైదు కామన్ స్కీములతో పాటు.. రాష్ట్రాల కోసం ప్రత్యేక అంశాలను మేనిఫెస్టోలో పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయం నిర్ణయించింది. చదవండి: కేటీఆర్, హరీశ్‌రావుపై బీజేపీ నేత రఘునందన్ రావు ఫైర్ ప్రతిపక్షాలవి తొందరపాటు విమర్శలు మేనిఫెస్టోతోనే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలించిందని అన్నారు పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు. అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని చెప్పారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఎంతో విశ్వసాన్ని చూపారని అన్నారు. ప్రతిపక్ష పార్టీ చేస్తున్న విమర్శలు చాలా తొందరపాటుగా ఉన్నాయని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఏఐసీసీ మ్యానిఫెస్టోకు టీ కాంగ్రెస్ సాయం తీసుకుంటాం మేనిఫెస్టో అంటే ప్రజలకు దగ్గరగా, అమలుకు నోచుకునే విదంగా ఉండాలని ఏఐసీసీ ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి తెలిపారు. తెలంగాణలో మంచి మేనిఫెస్టో అందించారని.. అందుకే రాష్ట్ర ప్రజలు విశ్వసించారని పేర్కొన్నారు. ఏఐసీసీ మేనిఫెస్టో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం నేతృత్వంలో రూపొందుతుందని చెప్పారు. మ్యానిఫెస్టో పబ్లిక్ ఫ్రెండ్లీగా, క్రోని కాపిటల్కు దూరంగా ప్రజావసరాలకు దగ్గరకు ఉండాలన్నారు. ఏఐసీసీ మ్యానిఫెస్టోకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సహకారం తీసుకుంటామన్నారు. -
WEF: దావోస్ బయల్దేరిన సీఎం రేవంత్‌రెడ్డి
ఢిల్లీ, సాక్షి: తెలంగాణకు భారీ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్(స్విట్జర్లాండ్) పర్యటనకు బయల్దేరారు. సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి నేరుగా ఆయన దావోస్‌కు వెళ్తున్నారు. నేటి నుంచి 19వ తేదీ వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 54వ సమావేశంలో సీఎం రేవంత్ నేతృత్వంలోని అధికారిక బృందం పాల్గొననుంది. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, బలాబలాలు, ప్రాధాన్యతలను ఈ వేదిక ద్వారా చాటి చెప్పాలని రాష్ట్ర బృందం నిర్ణయించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశానికి వెళ్తున్న రాష్ట్ర అధికారిక బృందానికి ముఖ్యమంత్రి నేతృత్వం వహించడం ఇది తొలిసారి. ఈ బృందంలో ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతోపాటు ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రెటరీ కూడా ఉన్నారు. రాష్ట్ర బృందం ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో భాగంగా దేశ, విదేశ పారిశ్రామికవేత్తలను కలసి కొత్త ప్రభుత్వ విజన్, ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించనుంది. ఐటీ రంగంలో అగ్రగామిగా, లైఫ్ సైన్సెస్ రంగానికి హబ్‌గా ఉన్న తెలంగాణ బలాలను ప్రపంచానికి చాటి చెప్పి పెట్టుబడులను ఆకర్షించాలని భావిస్తోంది. మూడు రోజుల దావోస్ పర్యటనలో 70మందికిపైగా పారిశ్రామికవేత్తలతో రాష్ట్ర బృందం భేటీ కానుంది. -
T Congress: సీతక్కకు సవాల్.. ఆయనకేమో సులువు?
సాక్షి, ఆదిలాబాద్: వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ గురి పెట్టింది. జనవరిలో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పార్లమెంటు పరిధిలో పార్టీని పటిష్టం చేయడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్చార్జీలను నియమించింది. ఆదిలాబాద్‌కు రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను, పెద్దపల్లికి ఐటీ, అసెంబ్లీ వ్యవహా రాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబును నియమించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగింటిలో బీజేపీ గెలిచింది. రెండుచోట్ల బీఆర్ఎస్, ఒకచోట కాంగ్రెస్ విజయం సాధించాయి. ఇక పెద్దపల్లి లోక్‌సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అన్నీ కాంగ్రెస్ కై వసం చేసుకుంది. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో పార్టీని గెలిపించడం శ్రీధర్‌బాబు పెద్దకష్టం కాదని ప్రచారం సాగుతోంది. శ్రీధర్‌బాబుకు సులువేనా.. ఇక పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జీగా నియమితులైన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఇదే నియోజకవర్గ పరిధిలోని మంథని శాసనసభ్యుడు. గతంలో కాంగ్రెస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. స్థానిక నేతలపై పట్టు ఉంది. అయితే గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ హవాతో అభ్యర్థి బొర్లకుంట వెంకటేశ్‌నేత ఎంపీగా గెలిచారు. ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను కాంగ్రెస్ క్లీన్‌స్వీప్ చేసింది. చెన్నూర్, మంచిర్యాల, మంథని, రామగుండం, పెద్దపల్లి, ధర్మపురిలో హస్తం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక ఆరు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ రెండో స్థానంలో, మంచిర్యాల నియోజకవర్గంలో మూడో స్థానంలో నిలవడం గమనార్హం. దీంతో రాబోయే పార్లమెంట్ ఎన్నికలు ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ ఉత్సాహం చూపుతుండగా, బీఆర్ఎస్ 2019 ఫలితాలను పునరావృతం చేయాలని చూస్తోంది. అయితే ఇక్కడ పార్టీని గెలిపించడం శ్రీధర్‌బాబుకు సులువే అన్న చర్చ సాగుతోంది. ఈ బాధ్యత ఇన్‌చార్జీలదే.. ఈ రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు బాధ్యతలను కూడా ఇన్‌చార్జీలే తీసుకోనున్నారు. అయితే ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఆరుచోట్ల ఎమ్మెల్యేలు లేకపోవడంతో అక్కడ ఆ పథకాల అమలు పరంగా ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వారిని పరిగణలోకి తీసుకుని ముందుకెళ్తారా.. లేక ఇతర ముఖ్య నాయకుల కు ప్రాధాన్యతనిస్తారనేది చూడాలి. ఇక పెద్దపల్లిలో అందరూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండడంతో సంక్షే మ పథకాల అమలులో ఆ పార్టీకి పెద్దగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేదు. డిసెంబర్ 28 నుంచి గ్రామసభలు నిర్వహించి పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపిక చేయనున్నారు. ఈ క్రమంలో ఇన్చార్జీలు కీలకం కానున్నారు. సీతక్కకు సవాలే.. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జీగా నియమితులైన సీతక్కకు ఇక్కడ సవాళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ విజయఢంకా మోగించింది. ఎంపీగా సోయం బా పూరావు విజయం సాధించారు. గడిచిన శాస న సభ ఎన్నికల్లో ఈ లోక్‌సభ పరిధిలోని ఆది లాబాద్, నిర్మల్, ముథోల్, సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గాలు కమలం ఖాతాలో చేరా యి. బోథ్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో బీ ఆర్ఎస్ పార్టీ తమ ప్రాబల్యం నిలుపుకుంది. కేవలం ఖానాపూర్ నియోజకవర్గంలో మాత్ర మే కాంగ్రెస్ గెలిచింది. ఇదిలా ఉంటే గతంలో సీతక్క ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరి ధిలో పలుమార్లు పర్యటించారు. నాయకులు, పార్టీ స్థితిగతులపై అవగాహన ఉంది. అ యితే ప్రతికూల పరిస్థితుల నుంచి విజయాన్ని అందుకోవాల్సిన పరిస్థితుల నేపథ్యంలో లోక్‌సభ సీటును గెలిపించడం సీతక్కకు సవాలే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇవి చదవండి: కొలిక్కిరాని మేడిగడ్డ పునరుద్ధరణ! -
సర్కారు ఖజానాలో పైసల్లేవ్.. క్రమశిక్షణతో ఆదాయం పెంచుతాం!
జగిత్యాల/పెద్దపల్లి: ప్రస్తుతం సర్కారు ఖజానాలో పైసల్లేవని, క్రమశిక్షణతో ఆదాయం పెంచుకుంటామని ఐటీ, పరిశ్రమలు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం పది రోజుల్లో మరో రెండు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. మంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన శ్రీధర్‌బాబు ఆదివారం జిల్లాలో పర్యటించారు. తొలుత సుల్తానాబాద్ మండలానికి చేరుకున్న ఆయన.. పెద్దపల్లి, కమాన్‌పూర్, సెంటినరీకాలనీ మీదుగా మంథని చేరుకున్నారు. అడుగడగునా ఆయనకు కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, రామగుండం ఎమ్మెల్యే ఠాకూర్ మక్కాన్‌సింగ్ మంత్రి వెంట ఉన్నారు. యువతకు ఉద్యోగాలు ఇస్తాం! జిల్లా కేంద్రంగా మారిన పెద్దపల్లి రూపురేఖలు మార్చుతామని, అభివృద్ధిలో ముందు వరుసలో నిలుపుదామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. జిల్లాలో పరిశ్రమలు ఉన్న రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అవసరం మేరకు మరిన్ని పరిశ్రమలు స్థాపిస్తామని హామీ ఇచ్చారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ, నియోజకవర్గానికి మంత్రి శ్రీధర్‌బాబు అండదండలు ఉండాలన్నారు. గతంలోనూ తనకెంతో సహకారం అందించారని గుర్తుచేశారు. స్పందించిన మంత్రి శ్రీధర్‌బాబు.. సీఎం రేవంత్‌రెడి ఎమ్మెల్యే విజ్జన్నకు అత్యంత సన్నిహితులన్నారు. తామంతా కలిసే జిల్లా అభివృద్ధికి పాటుపడతామని తెలిపారు. జిల్లాతో తనకెంతో అనుబంధం ఉందని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. మంత్రి ఆదేశాలు అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నారు. ఆరు గ్యాంరెటీలు అమలు చేస్తాం! ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఇప్పటికే రెండు గ్యారెంటీలు అమలు చేస్తున్నామని, మరో 15 రోజుల్లో ఇంకో రెండు అమలు చేస్తామన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ , పెద్దపల్లికి బైపాస్ రోడ్డు, బస్ డిపో, జిల్లా కోర్టు, 50 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి మంజూరు చేయిస్తామన్నారు. కాగా, సుల్తానాబాద్ ర్యాలీలో పలువురు దొంగలు చేతివాటం ప్రదర్శిస్తూ నాయకులు, ప్రజాప్రతినిధుల పర్సులు చోరీచేశారు. ప్రజలు శాంతి కోరుకున్నారు.. కమాన్‌పూర్ మండలం గొల్లపల్లె వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంత్రికి ఘనస్వాగతం పలికారు. కమాన్‌పూర్ ఎక్స్ రోడ్డు మంత్రి మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో మంథని నియోజకవర్గంలో రౌడీయిజం రాజ్యామేలిందన్నారు. ప్రజలు శాంతియుత వాతావరణం కోరుకుని కాంగ్రెస్‌కు ఓట్లేసి గెలిపించారని అన్నారు. నాయకులు వైనాల రాజు, ఇనగంటి భాస్కర్‌రావు, కోలేటి మారుతి, తొట్ల తిరుపతియాదవ్, ఆకుల ఓదెలు, కట్కం రవీందర్, తొగరి అన్నపూర్ణ పాల్గొన్నారు. ఇవి చదవండి: అడవిబిడ్డకు అపూర్వ స్వాగతం.. మల్లంపల్లిలో మాట్లాడుతున్న సీతక్క! -
పాలనలో మార్పు చూపిస్తాం! : దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
కరీంనగర్: ప్రజలు మార్పు కోరుకొని, కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారని, తాము పాలనలో మార్పు చూపిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. కష్టకాలంలో పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను గుర్తుంచుకుంటామని తెలిపారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆదివారం తొలిసారి మంథనికి వెళ్తూ మార్గమధ్యలో కరీంనగర్‌కు చేరుకున్న ఆయనకు పార్టీ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏ లక్ష్యాలు, ఏ ఆశయాల కోసం తెలంగాణ సాధించుకున్నామో వాటిని బీఆర్ఎస్ విస్మరించిందని ఆరోపించారు. అందుకే ప్రజలు ఆ పార్టీని గద్దెదించారన్నారు. పీసీసీ నాయకుడు వైద్యుల అంజన్‌కుమార్, ఎండీ.తాజ్, సమద్ నవాబ్, కమ్రొద్దీన్, వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఇవి చదవండి: ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తా! : మేయర్ వై.సునీల్‌రావు -
హైదరాబాద్‌లో ‘గింబల్స్’ తయారీ పరిశ్రమ
సాక్షి, హైదరాబాద్: భారత రక్షణ దళాలకు అవసరమయ్యే ఆధునిక ‘గింబల్స్’తయారీ పరిశ్రమను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాల్సిందిగా ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. హైదరాబాద్‌కు చెందిన హెచ్‌సీ రోబోటిక్స్ ఫ్రెంచ్ కంపెనీ మేరియోతో కలిసి ఆధునిక గింబల్స్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్రెంచ్ కంపెనీ మేరియోకు చెందిన అత్యున్నతస్థాయి ప్రతినిధి బృందం సంస్థ సీఈవో రెమీప్లెనెట్ నేతృత్వంలో శుక్రవారం మంత్రిని కలిసి హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఆసక్తిని తెలియజేసింది. హైదరాబాద్‌లో మేరియో కార్యకలాపాలకు ప్రభుత్వపరంగా మద్దతును ఇస్తామని మంత్రి హామీనిచ్చారు. మేరియో ప్రతినిధి బృందం భారత పర్యటనలో భాగంగా కేంద్ర రక్షణ శాఖ అధికారులతోపాటు ఇతర రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ సంస్థలతో సమావేశమైంది. శ్రీధర్‌బాబును కలిసిన ప్రతినిధి బృందంలో హెచ్‌సీ రోబోటిక్స్ సీఈవో వెంకట్ చుండి, డైరెక్టర్ డాక్టర్ రాధాకిషోర్ ఉన్నారు. -
జిల్లాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల బారులు
-
24 గంటల ఉచిత విద్యుత్ కాంగ్రెస్ తోనే సాధ్యం
-
పుట్టకే టికెట్.. మంథనిలో ఉత్కంఠ పోరు!
మంథని నియోజకవర్గంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది ప్రధానమంత్రి అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు మూడుసార్లు మంథని నియోజక వర్గ ఎమ్మెల్యేగా గెలుపొంది స్పీకర్‌గా సేవలందించారు. అనంతరం దుద్దిల్ల శ్రీధర్ బాబు నాలుగు సార్లు గెలుపొంది వివిధ శాఖలకు మంత్రిగా, ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ► నియోజకవర్గం గురించి ఏవైనా ఆసక్తికర అంశాలు: మధుకర్ హత్య, న్యాయవాదులైన గట్టు వామన్ రావు - నాగమణి దంపతుల హత్య. ► ఈ నియోజకవర్గంలో ఎన్నికలను ప్రభావితం చేసే అత్యంత కీలకమైన అంశం కాళేశ్వరం ప్రాజెక్ట్ మంథని ఎమ్మెల్యేగా ఉన్న దుద్ధిళ్ల శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కావడం, అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన పుట్ట మధు ప్రస్తుతం పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌గా ఉన్నాడు. బీజెపి నుంచి మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి తనయుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డి పార్టీ బలోపేతం చేస్తూ ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ అవుతున్నాడు. కాంగ్రెస్ నుంచి శ్రీధర్ బాబు, బీజెపి పార్టీ నుంచి సునీల్ రెడ్డికి పోటీ ఎవరూ లేకపోవడం పార్టీ టికెట్ కన్ఫాం కావడంతో గెలుపు కోసం ఎవరి ప్రచారాలు వారు చేసుకుంటూ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఆశావాహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది... ప్రస్తుత పెద్దపెల్లి జెడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఇన్‌చార్జీగా ఉన్న పుట్ట మధుపై హైకోర్టు న్యాయవాద గట్టు వామన్ రావు - నాగమణి దంపతులు హత్య అనంతరం వచ్చిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆ సమయంలో పుట్టమధు పది రోజులు కనిపించకుండపోవడం నియోజకవర్గ వ్యాప్తంగా చర్చకు దారితీసాయి. తన రాజకీయ అస్తిత్వం కాపాడుకోవడానికి పుట్టమధు బహుజనవాదం, బీసీ వాదాన్ని భుజానికెత్తుకున్నారు. కాటారం సింగిల్ విండో చైర్మన్‌గా ఉన్న చల్ల నారాయణరెడ్డి ఇటీవల రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఆయా శుభకార్యాలకు నియోజకవర్గ వ్యాప్తంగా తిరుగుతున్నాడు. పార్టీ అధిష్టానంతో నిత్యం టచ్‌లో ఉంటూ, బీఆర్ఎస్ అసంతృప్త నేతలను చేరదీస్తూ పార్టీ టికెట్ ఇస్తే పోటీ చేస్తానంటున్నాడు... రెండు రోజుల క్రితం పెద్దపెల్లి మాజీ ఎంపీ చేలిమల సుగుణ కుమారి మంథని, పెద్దపల్లిలో పర్యటించారు. చాలా సంవత్సరాలుగా విదేశాల్లో ఉంటున్న మాజీ ఎంపీ సుగుణకుమారి ఒక్కసారిగా ప్రత్యక్షం కావడంతో పొలిటికల్ సర్కిల్లో ఆమె రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఆమె మద్దతుదారులు అంటున్నారు. అయితే సుగుణ కుమారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? ఎంపీగా పోటీ చేస్తారా?.. పెద్దపెల్లి పార్లమెంటు పరిధిలోని ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు.. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు.. ఇలా వివిధ రకాల గాసిప్స్ స్టార్ట్ అయ్యాయి. రాజకీయ పార్టీల వారీగా ఎవరెవరు ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్నారు? దుదిల్ల శ్రీధర్ బాబు (కాంగ్రెస్ పార్టీ). చంద్రుడు పట్ల సునీల్ రెడ్డి (బిజెపి పార్టీ). పుట్ట మధుకర్ (బీఆర్ఎస్ పార్టీ) మంథని నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలు: మంథని నియోజవర్గంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాపకంగా నిర్వహించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ కారణంగా పంట పొలాలు నీట మునుగుతుండటం. అన్నారం బ్యారేజీ బ్యాక్ వాటర్‌తో గోదావరి నదిని ఆనుకొని ఉన్న గ్రామాలైన ఖాన్ సాయిపేట, ఆరెంద, మల్లారం, ఖానాపూర్, ఉప్పట్ల, విలోచవరం, పోతారం తదితర గ్రామాల్లో గత నాలుగు సంవత్సరాలుగా పంటలు పండలేని పరిస్థితి. గోదావరినదిని ఆనుకొని కరకట్ట నిర్మించాలని లేని పక్షంలో భూసేకరణ చేయాలని కోరుతున్న రైతులు. ఇసుక క్వారీలతో వందలాది లారీలు నిత్యం రాకపోకలతో కాటారం- మంథని ప్రధాన రహదారులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి, దీంతో ప్రజలు ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నాయి. అంతేకాదు తరచూ లారీల రాకపోకల కారణంగా అక్కడ రోడ్డు ప్రమాదాలు జరగడంతో ఇంటి పెద్దలను కొల్పోయి ఎన్నో కుటుంబాలు ఆసరా కోల్పోతున్నాయి. మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న మంథని, మున్సిపాలిటీగా మారడంతో పనులు లేక ఉపాధి కోల్పోయిన పేద మధ్యతరగతి కుటుంబాలు. పేరు గొప్ప ఊరు దిబ్బగా మారిన మంథని మున్సిపాలిటీ పరిధిలో చూస్తే మాత్రం ఎక్కడ చూసినా విగ్రహాలే ఎక్కడికక్కడే పేరుకపోయిన సమస్యలు. పట్టణం లోని మాతాశిశు హాస్పిటల్ ముందున్న డంపింగ్ యార్డ్ లో కాల్చిన చెత్త వలన వచ్చే పొగతో అనారోగ్య బారినపడుతున్న ప్రజలు. రామగిరి మండలంలో ప్రధానంగా సింగరేణి భూ నిర్వాసితుల సమస్యలు, భూ నిర్వాసితులకు ఇటు సింగరేణి పరంగా అటు ప్రభుత్వ పరంగా రావలసిన బెనిఫిట్స్ రాకపోవడం రెంటికి చెడ్డ రేవడిలా మారింది... మంథని నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రం వచ్చాక పెద్దగా అభివృద్ధి పనులు ఏమీ జరగలేదని, మిషన్ భగీరథ పేరుతో ఉన్న రోడ్లను ధ్వంసం చేశారని, సహజ వనలను దోచుకుపోతున్నారనేది మాత్రం వాస్తవం... ముఖ్యంగా రైతుబంధు, రైతు భీమా లాంటి పథకాలు రావడంలేదని ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు: వృత్తిపరంగా రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా సింగరేణి బోగ్గు కార్మికులు ఎక్కువ. నదులు: గోదావరి, ప్రాణహిత ఆలయాలు: ప్రముఖ పుణ్యక్షేత్రం కాలేశ్వరంలోని కాలేశ్వర ముక్తేశ్వర దేవాలయం, మంథనిలో పురాతన ఆలయాలు. పర్యాటకం: కాలేశ్వరం ప్రాజెక్ట్, రామగిరి ఖిల్లా, కాటారం మండలంలోని ప్రతాపగిరి కొండ -
Karimnagar: ఉగాది వేళ.. జాతకాల్లో అదృష్టం వెతుక్కుంటున్న నేతలు
సాక్షి, కరీంనగర్: తెలుగువారి కొత్త సంవత్సరాది ఉగాది. శోభకృత్ నామ సంవత్సరం సందర్భంగా ప్రతీ ఒక్కరూ తమ జాతకాన్ని కొత్త పంచాంగంలో వెతుక్కుంటున్నారు. ఈ ఉగాది సాధారణ ప్రజల కంటే.. రాజకీయ నాయకులకు ఎంతో కీలకమైంది. అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు, ప్రతిపక్షంలో ఉన్న ప్రత్యర్థులు, ఈసారి ఎన్నికల బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకునే ఆశావహులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో అధికార–ప్రతిపక్ష నేతలంతా నూతన పంచాంగంలో తమ జాతకాలలో ఆదాయ వ్యయాల మాట ఎలా ఉన్నా.. రాజ్యపూజ్యంపైనే కన్నేశారు. అవమానాల మాట పక్కనబెట్టి.. రాజ్యపూజ్యం దక్కుతుందా? లేదా అన్న అంశంపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితిని ఒకసారి పరిశీలిస్తే.. కరీంనగర్: బీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్ తీగల వంతెన, ఎమ్మారెఫ్, స్మార్ట్ సిటీ పనులతో కరీంనగర్‌పై ఫోకస్ పెట్టారు. హిందుత్వం, మార్పు అన్న ఎజెండాతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నుంచి పోటీ ఎదరవనుంది. బీజేపీ నుంచి కొత్త జయపాల్‌రెడ్డి కూడా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి ఎమ్మెస్సార్ మనవడు రోహిత్, నగరాధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. వైస్సార్టీపీ నుంచి డాక్టర్ నగేశ్ బరిలో నిలవనున్నారు. చొప్పదండి: ప్రస్తుతం ఎమ్మెల్యే రవిశంకర్ (బీఆర్ఎస్)కు ఇంటిపోరు తప్పేలా లేదు. అదేపార్టీ నుంచి గజ్జెల కాంతం, కత్తెరపాక కొండయ్య, కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ టికెట్ రేసులో ఉన్నారు. ఈసారి మేడిపల్లి సత్యం (కాంగ్రెస్) నుంచి గట్టి పోటీ ఇవ్వనున్నారు. బీజేపీ నుంచి బొడిగె శోభ, సుద్దాల దేవయ్యల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వైఎస్సార్టీపీ నుంచి అక్కెనపల్లి కుమార్ బరిలో నిలవనున్నారు. మానకొండూరు: ఇక్కడ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రసమయి బాలకిషన్‌కు ఈసారి ఇంటి పోరు తీవ్రంగానే ఉంది. మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, ఇక్కడే నుంచే పోటీ చేసిన ఓరుగంటి ఆనంద్ కూడా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి కవ్వంపల్లి సత్యనారాయణ, బీజేపీ గడ్డం నాగరాజు, దరువు ఎల్లన్న బరిలో నిలవనున్నారు. హుజూరాబాద్: గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఈటల రాజేందర్ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. బీఆర్ఎస్ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి ఈసారి బరిలో దిగనున్నారు. కాంగ్రెస్ నుంచి ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సిరిసిల్ల: ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్‌కు ప్రత్యర్థులు పెద్దగా లేరు. కాంగ్రెస్ నుంచి కె.కె.మహేందర్‌రెడ్డి మినహా ఇక్కడ ఆయనకు గట్టి వైరిపక్షం కానరావడం లేదు. ఈసారి బీజేపీ మాత్రం సెలబ్రెటీని రంగంలోకి దించుతారన్న ప్రచారం సాగుతోంది. రామగుండం: ప్రస్తుతం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు, ఈసారి కాంగ్రెస్ నేత ఠాకూర్ మక్కాన్ సింగ్ (కాంగ్రెస్) గట్టి పోటీ ఎదురవనుంది. వీరితోపాటు సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ (బీజేపీ) కూడా బరిలో ఉండటంతో పోరు రసవత్తరంగా మారనుంది. వేములవాడ: ప్రస్తుత ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ (బీఆర్ఎస్)కు చిరకాల ప్రత్యర్థి ఈసారి కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ నుంచి చెన్నమనేని విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్ పేరు వినిపిస్తుండగా.. తాను స్వతంత్రంగానైనా పోటీచేస్తానని అదే పార్టీ నేత తుల ఉమ ఇప్పటికే ప్రకటించారు. ఎన్నారైలు గోలి మోహన్ (ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు), మరో ఎన్నారై తోట రాంకుమార్ కూడా బరిలో నిలిచేందుకు ఆసక్తిగా ఉన్నారు. జగిత్యాల: డాక్టర్ సంజయ్ ఇప్పటికే వరుసగా గ్రామాల్లో పర్యటిస్తూ.. పల్లె నిద్ర పేరుతో ప్రజలకు చేరవవుతున్నారు. ఇక మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి (కాంగ్రెస్) కూడా పోటాపోటీగా పర్యటనలు చేస్తున్నారు. ఇటీవల భోగశ్రావణి బీజేపీ నుంచి బరిలోకి దిగేందుకు ఆసక్తిగా ఉన్నారు. కోరుట్ల: ప్రస్తుత ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు(బీఆర్ఎస్) వరుసగా అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు అంటూ పర్యటిస్తున్నారు. ఈసారి జువ్వాడి నర్సింగరావు (కాంగ్రెస్) గట్టి పోటీ ఇచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నారు. మార్పులు జరిగితే వీరిద్దరు కుమారులను బరిలో దింపుతారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ధర్మపురి: ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ (బీఆర్ఎస్)కు ఈసారి గట్టి పోటీ ఉంది. ఇక్కడ నుంచి అడ్లూరి లక్ష్మణ్ (కాంగ్రెస్), మాజీ ఎంపీ గడ్డం వివేక్ (బీజేపీ) కూడా బరిలోకి దిగుతారని ప్రచారం సాగుతోంది. పెద్దపల్లి: ప్రస్తుత ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి (బీఆర్ఎస్)కి సొంత పార్టీ నుంచే తీవ్ర పోటీ ఉంది. ఎమ్మెల్యే టికెట్ కోసం.. సొంత పార్టీకే చెందిన ఎన్నారై నల్ల మనోహర్‌రెడ్డి, జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ నేత విజయరమణారావు నుంచి వీరికి గట్టి పోటీ ఎదురవనుంది. బీజేపీ నుంచి గుజ్జుల రామక్రిష్ణారెడ్డి, దుగ్యాల ప్రదీప్‌రావు, గొట్టిముక్కల సురేశ్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. బీఎస్పీ నుంచి దాసరి ఉష బరిలో ఉన్నారు. మంథని: ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు (కాంగ్రెస్)కు, పుట్ట మధు (బీఆర్ఎస్)కు ఈసారి హోరాహోరీ పోరు నడవనుంది. ఇక్కడ వీరిద్దరు మినహా మూడో పార్టీ అభ్యర్థులెవరూ ఇంతవరకూ ఆసక్తి చూపలేదు. -
అసత్యాలను వినసొంపుగా చెప్పారు
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్ అసత్యాలను వినసొంపుగా చెప్పారని కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే బీజేపీకి బీఆర్ఎస్, రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలుపుతున్నట్టు కనిపిస్తోందన్నారు. తమ పార్టీ నేత భారత్ జోడో ప్రస్తావనను సభలో తేవడంతో పాటు దానిపై కేటీఆర్ ఇష్టంవచ్చినట్టు వ్యాఖ్యలు చేయడం దీనికి బలం చేకూరుస్తోందని, గతంలో రాష్ట్ర సర్కార్‌ను విమర్శించిన గవర్నర్ సైతం ప్రశంసల్లో ముంచెత్తడాన్ని బట్టి ఈ విషయం స్పష్టమవుతోందని పేర్కొన్నారు. శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, ప్రతిపక్ష సభ్యులుగా తమకు ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఉందని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ ఇష్టారీతిన కామెంట్స్ చేయడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రగతి గురించి గొప్పగా చెబుతూ రాష్ట్రానికి రూ.5 లక్షల కోట్లకుపైగా అప్పులు, కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్‌లో అత్యధిక ధరలున్న రాష్ట్రంగా నిలవడం, నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉండడం, వ్యవసాయరంగ సమస్యలు, కరెంట్‌కోతలు వంటి వాటిని పూర్తిగా విస్మరించారని విమర్శించారు. తనతోపాటు వస్తే భూపాలపల్లి, పెద్దపల్లిలలో కరెంట్ కోతలున్న విషయాన్ని నిరూపిస్తామని, అసెంబ్లీలో ఆన్ రికార్డ్ ఈ అంశం చెబుతున్నామన్నారు. కాళేశ్వరంను అతిపెద్ద ప్రాజెక్ట్‌గా ప్రచారం చేస్తున్నారని, దానివల్ల ఎంతమందికి ప్రయోజనం కలిగింది, అదనంగా ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. బడ్జెట్లో ఈ లిఫ్ట్స్కీంలకు, విద్య, వైద్యం తదితర కీలకరంగాలకు కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు. పత్రికల్లో వచ్చిన వార్తలను బట్టి గతేడాది 107 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. గత ఎన్నికల సందర్భంగా నిరుద్యోగులకు రూ.3,016 భృతి ఇస్తామన్న హామీ అమలు ఏమైందని ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీలో నమోదు చేసుకున్న నిరుద్యోగులే 26 లక్షల మంది ఉంటారన్నారు. -
కాళేశ్వరం ఫొటోలు గూగుల్‌లో పెట్టండి: శ్రీధర్‌బాబు
కాళేశ్వరం: ‘కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచ దేశాల్లో గొప్ప కట్టడమని గూగుల్‌లో చూడాలని కేటీఆర్ ఎక్కడికెళ్లినా చెబుతున్నారు. ఇప్పుడు నీట మునిగిన కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ పంప్‌హౌస్, అన్నారంలోని సరస్వతీ పంప్‌హౌస్, గ్రావిటీ కాల్వల ప్రస్తుత ఫొటోలను గూగుల్‌లో పెట్టండి’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మంత్రి కేటీఆర్‌కు సూచించారు. మంగళవారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పరిధిలోని లక్ష్మీ పంప్‌హౌస్‌లోకి తన కార్యకర్తలతో వెళ్లేందుకు రాగా కాళేశ్వరం ఎస్సైలు లక్ష్మణ్‌రావు, నరేశ్ అడ్డుకున్నారు. కొంత సమయం తర్వాత డీఈఈ సూర్యప్రకాశ్.. ఎమ్మెల్యే వద్దకు చేరుకుని అనుమతి లేదని, ఉన్నతాధికారుల ఆదేశాలున్నాయని, పంప్‌హౌస్ బాగానే ఉందని చెప్పి వెళ్లారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఇంజనీరింగ్ వైఫల్యంతో నీట మునిగిందని, మరమ్మతులు చేస్తున్నట్లు ఇంజనీర్లు చెబుతున్నారని, కానీ నిర్వహణా లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందన్నారు. ప్రజాధనాన్ని వృథా చేసి, నాసిరకం పనులు చేయడంతో అవినీతి జరిగిందని మండిపడ్డారు. క్లౌడ్ బరస్ట్పైన సీఎం కేసీఆర్‌కు ఏమైనా సమాచారం ఉంటే కేంద్ర నిఘా బృందాలకు అందించాలన్నారు. -
ఏఐసీసీ కార్యదర్శిగా దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
సాక్షి, న్యూఢిల్లీ: ఏఐసీసీ కార్యదర్శిగా ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబును కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నియమించారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. శ్రీధర్‌బాబుతో పాటు మరో నలుగురు ఏఐసీసీ కార్యాదర్శులకు కర్ణాటక బాధ్యతలు అప్పగించారు. -
తెలంగాణ కాంగ్రెస్‌లో మరో తుపాన్..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్‌లో మరో తుపాన్ మొదలైంది. నేతల అసమ్మతి మరోమారు బయటపడింది. టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి వ్యవహారశైలిపై చర్చించేందుకు పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు సోమవారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి నివాసంలో కాంగ్రెస్ విధేయుల ఫోరం పేరుతో జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డిలతోపాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోదండరెడ్డి, గోపిశెట్టి నిరంజన్, కమలాకర్‌రావు, శ్యాంమోహన్ తదితరులు హాజరయ్యారు. దాదాపు 3 గంటలకుపైగా జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీలో జరుగుతున్న పరిణామాలు, రేవంత్‌రెడ్డి వ్యవహారశైలి, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు గురించి వారు చర్చించినట్టు తెలిసింది. ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి పనితీరు పార్టీ ఐక్యతను దెబ్బతీసేలా ఉందని నేతలు అభిప్రాయపడినట్టు సమాచారం. రేవంత్ ఏకపక్ష నిర్ణయాలు, ప్రకటనలతో పార్టీలోని సీనియర్లతోపాటు ముఖ్యనేతలందరినీ అవమానపరిచే తరహాలో వ్యవహరిస్తున్నారని పలువురు నేతలు ఈ సమావేశంలో పేర్కొన్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే రేవంత్ వన్‌మ్యాన్ షోను కట్టడి చేయాలని కోరుతూ ‘కాంగ్రెస్ పార్టీని కాపాడుకుందాం’ పేరిట.. త్వరలోనే నేతలందరూ ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించినట్టు సమాచారం. రేవంత్‌ను కట్టడి చేయాలని అధిష్టానం పెద్దలను కోరాలని భావిస్తున్నట్టు తెలిసింది. పార్టీ బలోపేతం కోసమే..: శ్రీధర్‌బాబు మర్రి శశిధర్‌రెడ్డి నివాసం నుంచి నేతలు బయటికి వచ్చిన సమయంలో ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఒకసారి తన నివాసానికి వచ్చి వెళ్లాలని సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి ఆహ్వానించారని చెప్పారు. తమ భేటీలో ప్రత్యేకత ఏమీ లేదని, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై చర్చించామని చెప్పారు. అయితే తమ సమావేశంలో పార్టీ బలోపేతం కోసం చర్చ జరిగిందని శ్రీధర్‌బాబు పేర్కొనడం గమనార్హం. కాగా పార్టీలో పరిణామాలు, సీనియర్ల విషయంలో జరుగుతున్న అవమానాలపై చర్చించామని మాజీ ఎంపీ వీహెచ్ తెలిపారు. అన్ని విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామన్నారు. పార్టీకి పూర్వవైభవం రావాలి: మర్రి శశిధర్‌రెడ్డి కాంగ్రెస్‌లో సంస్థాగత మార్పులు జరగాలని పార్టీ వర్కింగ్ కమిటీ సోనియా గాంధీని కోరిందని.. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ ఏవిధంగా ప్రజల విశ్వాసం పొందుతుందనే దానిపై నిర్ణయాలు ఉండాలని సూచించిందని మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలోనూ పార్టీకి పూర్వ వైభవం రావాలన్నారు. పార్టీ వ్యవహారాలు చూస్తున్నవారు పార్టీకి అనుబంధంగా ఉన్నారా లేదా అనేది చూడాలని.. దీనిపై తాము చర్చించామని వెల్లడించారు. అన్నీ మీడియాకు చెప్పలేం: జగ్గారెడ్డి ఆదివారం ఢిల్లీలో సోనియా గాంధీ సమావేశం ఏర్పాటు చేసిన అంశంపై చర్చించామని.. బయట జరుగుతున్న ఊహాగానాలు సరికాదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. పార్టీతో కొన్ని సంవత్సరాలుగా అనుబంధం కొనసాగుతున్న నేతలం కలిసి మాట్లాడుకున్నామని.. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నాయకత్వం ఉండాలని కోరుకున్నామని తెలిపారు. వీహెచ్ చెప్పిన అంశాలు చర్చకు వచ్చాయని, కానీ అవన్నీ మీడియాకు చెప్పలేనని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు రెట్టింపు బలం కోసం ఏ విధంగా పనిచేయాలనే దానిపై చర్చించామన్నారు. రేవంత్ ‘పాదయాత్ర’ ప్రకటనతో మళ్లీ దుమారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆదివారం కొల్లాపూర్‌లో జరిగిన సభలో.. తాను రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలు, 33 జిల్లాల్లో తిరుగుతానని, పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకుంటానని ప్రకటించడం రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో దుమారం రేపుతోంది. రాష్ట్రంలోని పార్టీ ముఖ్య నాయకులతో చర్చించకుండా, అటు టీపీసీసీ కార్యవర్గంలోగానీ, రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలోగానీ మాట్లాడకుండా, అధిష్టానానికి చెప్పి అనుమతి తీసుకోకుండా రేవంత్ ఈ ప్రకటన చేశారని.. ఇది ఇతర నేతలను అవమానించడమేనని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సోమవారం కాంగ్రెస్ సీనియర్ నేతల భేటీకి కూడా ఈ ప్రకటనే కారణమని అంటున్నారు. భట్టి కూడా చేస్తున్నా.. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పేరుతో మధిర నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. ఆయన కూడా పార్టీలో ఎలాంటి చర్చ లేకుండా పాదయాత్ర చేపట్టారని.. అయితే ఎమ్మెల్యే హోదాలో తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితమై యాత్రలు చేయడంలో ఎలాంటి తప్పు లేదని కొందరు నేతలు పేర్కొంటున్నారు. మరోవైపు భట్టి పాదయాత్ర చేస్తుంటే లేనిది రేవంత్ చేస్తే తప్పేంటని మరికొందరు వాదిస్తున్నారు. ‘పాదయాత్ర’లకు పోటీ వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీలో ఎప్పట్నుంచో ఉంది. అదే సమయంలో యాత్రకు నాయకత్వం వహించేందుకు పోటీ పడుతున్న నేతల జాబితా కూడా చాంతాడంత ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీ అధిష్టానంతో చర్చించి పాదయాత్ర చేసే నేతల పేర్లను ప్రకటించాకే రాష్ట్రవ్యాప్త యాత్ర చేపట్టాలనే అభిప్రాయం పార్టీవర్గాల్లో ఉంది. అందులో భాగంగానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందు జరిగిన సీఎల్పీ సమావేశంలో పాదయాత్ర అంశంపై చర్చించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్చార్జుల అభిప్రాయం సేకరించాలని భావించినా.. సమయాభావం వల్ల సాధ్యం కాలేదని తెలిసింది. ఇలాంటి సమయంలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ‘సర్వోదయ పాదయాత్ర’ప్రారంభం కావడం, తెలంగాణలో 26 రోజుల పాటు జరిగే ఈ యాత్రలో ఏదో ఒక రోజు రాహుల్‌గాంధీ పాల్గొంటారన్న అంశం కీలకంగా మారింది. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంతో రాహుల్ సమావేశమై.. పాదయాత్ర చేసేవారిని ఫైనల్ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఇవేమీ జరగకుండానే రేవంత్‌రెడ్డి కొల్లాపూర్ సభలో పాదయాత్ర ప్రకటన చేయడం కాంగ్రెస్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో తెలియడం లేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.