సాక్షి, మహాముత్తారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మారుమూల ప్రాంతమైన సింగంపల్లి, కనుకునూర్ గ్రామాల్లో కరోనా బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి వెళ్తున్న ఓ వాహనం మంగళవారం వాగులో దిగబడిపోయింది. ఆ సమయంలో అదే దారిలో మరో వాహనంలో వెళ్తున్న మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆ దృశ్యాన్ని చూసి ఆగిపోయారు. తన కార్యకర్తలతో కలసి ఆయన వాగులోకి దిగి వాహనం బయటకొచ్చేలా సహకరించారు.
ఈ ఫొటో చూడగానే వరి కోశాక మిగిలిన కొయ్య కాళ్ల మాదిరి కనిపిస్తున్నాయి కదూ..! కానీ, ఇవి గడ్డి మొక్కలకు సంబంధించి బెండు కర్రలు. పాడి పశువులకు పోషకాలను మెండుగా అందించే సూపర్ నేపియర్ గడ్డి పెంపకంపై రైతులు ఇటీవల ఆసక్తి చూపుతున్నారు. మొదట ఏపీకే పరిమితమైన ఈ రకం గడ్డి పెంపకం కరీంనగర్, సిద్ధిపేట జిల్లాలకు విస్తరించగా.. ప్రస్తుతం జనగామ జిల్లా చిల్పూరు మండలం కృష్ణాజీగూడెం గ్రామానికి చెందిన రైతు సాదం రమేష్ కూడా నాటాడు.
ఇది విత్తనంగా కాకుండా రూ.1కి ఒకటి చొప్పున జానెడు పొడవుతో దొరికే బెండుకర్రలు నాటాల్సి ఉంటుందని ఆయన తెలిపాడు. పోషకాలు ఎక్కువగా ఉండే ఈ గడ్డి.. పాడి పశువులకు వేయడం వల్ల మొక్కజొన్న చొప్పలా మెత్తగా ఉండటంతో ఇష్టంగా తింటాయని, పాల ఉత్పత్తి కూడా పెరుగుతోందని వెల్లడించారు.
– చిల్పూరు (జనగామ)
Comments
Please login to add a commentAdd a comment