ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్‌చార్జి మంత్రి సీతక్క, పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్ బాబు
సాక్షి, ఆదిలాబాద్: వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ గురి పెట్టింది. జనవరిలో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పార్లమెంటు పరిధిలో పార్టీని పటిష్టం చేయడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్‌చార్జీలను నియమించింది. ఆదిలాబాద్‌కు రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను, పెద్దపల్లికి ఐటీ, అసెంబ్లీ వ్యవహా రాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబును నియమించారు.
ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగింటిలో బీజేపీ గెలిచింది. రెండుచోట్ల బీఆర్‌ఎస్, ఒకచోట కాంగ్రెస్ విజయం సాధించాయి. ఇక పెద్దపల్లి లోక్‌సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అన్నీ కాంగ్రెస్ కై వసం చేసుకుంది. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో పార్టీని గెలిపించడం శ్రీధర్‌బాబు పెద్దకష్టం కాదని ప్రచారం సాగుతోంది.
శ్రీధర్‌బాబుకు సులువేనా..
ఇక పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జీగా నియమితులైన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఇదే నియోజకవర్గ పరిధిలోని మంథని శాసనసభ్యుడు. గతంలో కాంగ్రెస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. స్థానిక నేతలపై పట్టు ఉంది. అయితే గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ బీఆర్‌ఎస్ హవాతో అభ్యర్థి బొర్లకుంట వెంకటేశ్‌నేత ఎంపీగా గెలిచారు. ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను కాంగ్రెస్ క్లీన్‌స్వీప్ చేసింది.
చెన్నూర్, మంచిర్యాల, మంథని, రామగుండం, పెద్దపల్లి, ధర్మపురిలో హస్తం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక ఆరు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ రెండో స్థానంలో, మంచిర్యాల నియోజకవర్గంలో మూడో స్థానంలో నిలవడం గమనార్హం. దీంతో రాబోయే పార్లమెంట్ ఎన్నికలు ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ ఉత్సాహం చూపుతుండగా, బీఆర్‌ఎస్ 2019 ఫలితాలను పునరావృతం చేయాలని చూస్తోంది. అయితే ఇక్కడ పార్టీని గెలిపించడం శ్రీధర్‌బాబుకు సులువే అన్న చర్చ సాగుతోంది.
ఈ బాధ్యత ఇన్‌చార్జీలదే..
ఈ రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు బాధ్యతలను కూడా ఇన్‌చార్జీలే తీసుకోనున్నారు. అయితే ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఆరుచోట్ల ఎమ్మెల్యేలు లేకపోవడంతో అక్కడ ఆ పథకాల అమలు పరంగా ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వారిని పరిగణలోకి తీసుకుని ముందుకెళ్తారా.. లేక ఇతర ముఖ్య నాయకుల కు ప్రాధాన్యతనిస్తారనేది చూడాలి. ఇక పెద్దపల్లిలో అందరూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండడంతో సంక్షే మ పథకాల అమలులో ఆ పార్టీకి పెద్దగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేదు. డిసెంబర్ 28 నుంచి గ్రామసభలు నిర్వహించి పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపిక చేయనున్నారు. ఈ క్రమంలో ఇన్‌చార్జీలు కీలకం కానున్నారు.
సీతక్కకు సవాలే..
ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జీగా నియమితులైన సీతక్కకు ఇక్కడ సవాళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ విజయఢంకా మోగించింది. ఎంపీగా సోయం బా పూరావు విజయం సాధించారు. గడిచిన శాస న సభ ఎన్నికల్లో ఈ లోక్‌సభ పరిధిలోని ఆది లాబాద్, నిర్మల్, ముథోల్, సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గాలు కమలం ఖాతాలో చేరా యి. బోథ్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో బీ ఆర్‌ఎస్ పార్టీ తమ ప్రాబల్యం నిలుపుకుంది.
కేవలం ఖానాపూర్ నియోజకవర్గంలో మాత్ర మే కాంగ్రెస్ గెలిచింది. ఇదిలా ఉంటే గతంలో సీతక్క ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరి ధిలో పలుమార్లు పర్యటించారు. నాయకులు, పార్టీ స్థితిగతులపై అవగాహన ఉంది. అ యితే ప్రతికూల పరిస్థితుల నుంచి విజయాన్ని అందుకోవాల్సిన పరిస్థితుల నేపథ్యంలో లోక్‌సభ సీటును గెలిపించడం సీతక్కకు సవాలే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇవి చదవండి: కొలిక్కిరాని మేడిగడ్డ పునరుద్ధరణ!
Comments
Please login to add a commentAdd a comment