
వరికుచ్చులను మెచ్చుకున్న సీఎం
నిర్మల్: తెలంగాణ దశాబ్ది వేడుకల్లో జిల్లా నుంచి ప్రదర్శనలో ఉన్న ధాన్యపు కుచ్చులు ప్రత్యేక ఆకర్షణగా నిలువడమే కాకుండా.. సీఎం రేవంత్‌రెడ్డి స హా ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ఆదివారం సాయంత్రం నిర్వహించిన దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వీటిని ప్రదర్శించారు. జిల్లాకు చెందిన డీఆర్‌డీఓ విజయలక్ష్మి, డీఆర్‌డీఏ, సెర్ప్ సిబ్బంది కలిసి వరికుచ్చులను ప్రత్యేకంగా తయారు చేశారు.
చేనేత, ఇతర కళాకృతుల కంటే ఈసారి ధాన్యపుసిరిని కళ్లకు కట్టించే వరికుచ్చులు అందరినీ ఆకట్టుకున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, సెర్ప్ సీఈఓ, కమిషనర్ అనితా రామచంద్రన్, సంగీత దర్శకుడు కీరవాణి పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment