కాంగ్రెసోళ్లను ప్రజలే ఉరికిచ్చి కొట్టే రోజులు దగ్గరపడ్డాయి | Ktr fires on congress party | Sakshi

కాంగ్రెసోళ్లను ప్రజలే ఉరికిచ్చి కొట్టే రోజులు దగ్గరపడ్డాయి

Oct 25 2024 4:46 AM | Updated on Oct 25 2024 4:46 AM

Ktr fires on congress party

రుణమాఫీ, రైతు భరోసా, రైతుబీమా ఇచ్చే దాకా ప్రభుత్వంపై పోరాడతాం 

చంద్రబాబుతోనే కొట్లాడినం.. ఈ చిట్టినాయుడు ఎంత?

సీఎంను చూసి భయపడం  

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా అక్కడి బంధువులకు కాంగ్రెస్‌ మోసాలను వివరించండి 

ఆదిలాబాద్‌ రైతుపోరు సభలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

సాక్షి, ఆదిలాబాద్‌: ప్రజలే మర్లవడి కాంగ్రెసోళ్లను ఉరికిచ్చి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ జోస్యం చెప్పారు. గరీబులు, రైతులు, విద్యార్థులతోపాటు తనపై కేసులు పెడతానంటే ఊరుకొనేవారెవరూ లేరన్నారు. ఈ ప్రభుత్వం ఎవరినీ వదలకుండా అందరినీ మోసం చేసిందని ధ్వజమెత్తారు.

ప్రభుత్వం రుణమాఫీ, రైతు భరోసా, రైతుబీమా ఇచ్చే దాకా.. కాంగ్రెస్‌ పార్టీకి బుద్ధి వచ్చే వరకు పోరాడదామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వంపై ఆదిలాబాద్‌ నుంచే అగ్గి అంటుకుందని.. ఈ సర్కారుపై మూడేళ్లు కొట్లాడేది ఉందని.. అందుకు పోరాట తోవ చూపారన్నారు. గురువారం ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ నిర్వహించిన రైతు పోరుబాట సభలో కేటీఆర్‌ పాల్గొన్నారు. 

ప్రజలు కేసులు పెడితే ఒక్క కాంగ్రెసోడైనా మిగులుతాడా? 
రుణమాఫీ కాలేదని రైతులు ప్రభుత్వ దిష్టి»ొమ్మలు దహనం చేస్తే పోలీసులు వారిని జైల్లో పెడుతున్నారని కేటీఆర్‌ మండిపడ్డారు. వంద రోజుల్లో అన్నీ చేస్తామని మాట తప్పిన వారిని జైల్లో పెట్టాలా లేక పేద ప్రజలను జైల్లో పెట్టాలా అని ప్రశ్నించారు. 

మహిళలు, రైతులు, నిరుద్యోగులు వరుసపెట్టి కేసులు పెడితే ఒక్క కాంగ్రెసోడైనా మిగులుతాడా అంటూ ధ్వజమెత్తారు. తమ పార్టీకి శక్తినిస్తే రైతుల పక్షాన పోరాడతామని, జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమని కేటీఆర్‌ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ అంటే.. భారత రాష్ట్ర సమితే కాకుండా భారత రైతు సమితి కూడా అని ఆయన పేర్కొన్నారు. 

అధికారులు చట్టప్రకారం నడుచుకోవాలి.. 
‘పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు చట్టబద్ధంగా నడుచుకోవాలి. లేదంటే మా టైమ్‌ వ స్తది. ఎవరైనా ఎక్కువ చేస్తే పేర్లు రాసి పెట్టుకోండి. మిత్తితో సహా చెల్లిస్తాం. పెద్ద పెద్దోళ్లను చూసినం.. చంద్రబాబుతోనే కొట్లాడినం.. ఈ చిట్టినాయుడు ఎంత? అతన్ని చూసి మనం భయపడాల్నా?’అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. 

ఆదిలాబాద్‌ పక్కనే ఉన్న మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా అక్కడి బంధువులు, శ్రేయోభిలాషులకు కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో చేసిన మోసాల గురించి వివరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

మన పత్తికి సైతం గుజరాత్‌ ధర ఇవ్వాల్సిందే.. 
కాంగ్రెస్‌ కంటే బీజేపీ నేతలు మరింత ప్ర మాదకారులని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఆదిలాబా ద్‌ ఎమ్మెల్యే, ఎంపీ బీజేపీ నేతలేనని వివరించా రు. ‘గుజరాత్‌లో పత్తి క్వింటాల్‌కు రూ. 8,800 ఇ స్తున్నారు. అక్కడికన్నా తెలంగాణలో పత్తి నాణ్య మైనదని పరిశ్రమ వర్గాల వారే నేను మంత్రిగా ఉన్నప్పుడు చెప్పారు. 

అందుకే గుజరాత్‌లో ఇచ్చినట్టే పత్తికి ఇక్కడ కూడా ధర ఇవ్వాలని బీజేపీపై కొట్లాడాలి’అని బీఆర్‌ఎస్‌ శ్రేణులకు కేటీఆర్‌ పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీ రెండు దొందూ దొందేనన్నారు. పీఎం మోదీ ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తామని మోసగిస్తే.. రేవంత్‌రెడ్డి రూ. 15 వేలు రైతుల ఖాతాల్లో వేస్తానని వేయలేదని విమర్శించారు. 

ఈ సభలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాడి కౌసిక్‌రెడ్డి, అనిల్‌ జాదవ్, సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దుర్గం చిన్నయ్య, జెడ్పీ మాజీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్, లోలం శ్యామ్‌సుందర్‌ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement