సాక్షి, తెలంగాణ భవన్: సూటు కేసు కంపెనీలకు డబ్బులు పంపిన వ్యవహారంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ జైలు పోవటం ఖాయమన్నారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. సీఎం రేవంత్ కాదు కాదా.. భగవంతుడు కూడా వివేక్‌ను కాపాడలేరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
బీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..చెన్నూరు నియోజకవర్గానికి ఉప ఎన్నికలు పక్కా జరుగుతాయి. సూటు కేసు కంపెనీలకు డబ్బులు పంపిన వ్యవహారంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ జైలు పోవటం ఖాయం. సీఎం రేవంత్ రెడ్డి.. వివేక్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కాదు కదా.. భగవంతుడు కూడా వివేక్‌ను కాపాడలేడు.
ఈడీ కేసు జరుగుతుంటే.. తెలంగాణ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. వివేక్ కేసు వ్యవహారంలో సుప్రీంకోర్టు వరకు వెళ్తాం. వివేక్.. అక్రమంగా వందల కోట్ల రూపాయలను ఖర్చు చేసి ఎన్నికల్లో గెలిచాడు. తెలంగాణ పోలీసులకు స్వామి భక్తి ఎక్కువైంది. పోలీసులు.. రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు. అత్యుత్సాహం ప్రదర్శిస్తోన్న పోలీసులు భవిష్యత్తులో బలికాక తప్పదు. ఈడీ విచారణ జరుగుతున్న కేసును పోలీసులు క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
ఇదిలా ఉండగా.. ఈ ఏడాది జనవరిలో చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్.. ఈడీ విచారణకు హాజరయ్యారు. విశాఖ ఇండస్ట్రీస్, ఎంఎస్ విజిలెన్స్ సెక్యూరిటీస్ లావాదేవీల వ్యవహారంలో ఈడీ విచారణకు హాజరయ్యారు. రూ. 8కోట్ల బ్యాంకు లావాదేవీలపై గతంలో తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఎన్నికల సమయంలో విశాఖ ఇండస్ట్రీస్, ఎంఎస్ విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ మధ్య జరిగిన రూ.100 కోట్ల లావాదేవీల వ్యవహారంలో మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. దీనిపై వివేక్‌ను ఈడీ ప్రశ్నించింది. గత ఏడాది నవంబర్‌లో విశాఖ సంస్థల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ బోగస్ సంస్థ అని గుర్తించి కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక తీర్పు
Comments
Please login to add a commentAdd a comment