తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలకు గతంలో కాంగ్రెస్ పాలనే కారణమని ఎంపీ బాల్క సుమన్ విమర్శించారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలకు గతంలో కాంగ్రెస్ పాలనే కారణమని ఎంపీ బాల్క సుమన్ విమర్శించారు. ఆయనిక్కడ మంగళవారం కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి కాంగ్రెస్ నేతల్లో వణుకు మొదలైందన్నారు. మరో వైపు రైతుల సమస్యలంటూ కిషన్ రెడ్డి మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. తెలంగాణలోని ఒక్క ప్రాజెక్టు కు కేంద్రం జాతీయన హోదా కల్పించలేదన్నారు. బంగారు తెలంగాణ సాధన కోసం కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన తెలిపారు.