రైతులను కాల్చి చంపింది టీడీపీయే! | tdp government ordered for firing over farmers, says balka suman | Sakshi
Sakshi News home page

రైతులను కాల్చి చంపింది టీడీపీయే!

Published Tue, Oct 7 2014 3:46 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

రైతులను కాల్చి చంపింది టీడీపీయే! - Sakshi

రైతులను కాల్చి చంపింది టీడీపీయే!

కరెంటు ఛార్జీలు పెంచి, రైతులను కాల్చి చంపించిన చరిత్ర తెలుగుదేశం పార్టీదేనని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ మండిపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ నేతలపై ఆయన తీవ్రంగా విమర్శలకు దిగారు. చంద్రబాబు పాలన, కేసీఆర్ పాలనపై బహిరంగ చర్చకు లోకేష్ సిద్ధమేనా అని ఆయన ప్రశ్నించారు.

విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన షబ్బీర్ అలీకి తెలంగాణలో విద్యుత్ సమస్యలకు కారణం కాంగ్రెస్ పార్టీయేనన్న విషయం తెలియదా అని బాల్క సుమన్ నిలదీశారు. త్వరలోనే రేవంత్ రెడ్డి సహా అందరి అవినీతిని బయటపెడతామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement