gaddam vivek
-
చెన్నూరులో ఉప ఎన్నిక ఖాయం: బాల్క సుమన్
సాక్షి, తెలంగాణ భవన్: సూటు కేసు కంపెనీలకు డబ్బులు పంపిన వ్యవహారంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ జైలు పోవటం ఖాయమన్నారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. సీఎం రేవంత్ కాదు కాదా.. భగవంతుడు కూడా వివేక్‌ను కాపాడలేరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..చెన్నూరు నియోజకవర్గానికి ఉప ఎన్నికలు పక్కా జరుగుతాయి. సూటు కేసు కంపెనీలకు డబ్బులు పంపిన వ్యవహారంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ జైలు పోవటం ఖాయం. సీఎం రేవంత్ రెడ్డి.. వివేక్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కాదు కదా.. భగవంతుడు కూడా వివేక్‌ను కాపాడలేడు.ఈడీ కేసు జరుగుతుంటే.. తెలంగాణ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. వివేక్ కేసు వ్యవహారంలో సుప్రీంకోర్టు వరకు వెళ్తాం. వివేక్.. అక్రమంగా వందల కోట్ల రూపాయలను ఖర్చు చేసి ఎన్నికల్లో గెలిచాడు. తెలంగాణ పోలీసులకు స్వామి భక్తి ఎక్కువైంది. పోలీసులు.. రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు. అత్యుత్సాహం ప్రదర్శిస్తోన్న పోలీసులు భవిష్యత్తులో బలికాక తప్పదు. ఈడీ విచారణ జరుగుతున్న కేసును పోలీసులు క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు.ఇదిలా ఉండగా.. ఈ ఏడాది జనవరిలో చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్.. ఈడీ విచారణకు హాజరయ్యారు. విశాఖ ఇండస్ట్రీస్, ఎంఎస్ విజిలెన్స్ సెక్యూరిటీస్ లావాదేవీల వ్యవహారంలో ఈడీ విచారణకు హాజరయ్యారు. రూ. 8కోట్ల బ్యాంకు లావాదేవీలపై గతంలో తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఎన్నికల సమయంలో విశాఖ ఇండస్ట్రీస్, ఎంఎస్ విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ మధ్య జరిగిన రూ.100 కోట్ల లావాదేవీల వ్యవహారంలో మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. దీనిపై వివేక్‌ను ఈడీ ప్రశ్నించింది. గత ఏడాది నవంబర్‌లో విశాఖ సంస్థల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ బోగస్ సంస్థ అని గుర్తించి కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.ఇది కూడా చదవండి: హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక తీర్పు -
TS: మంత్రి పదవి కోసం అన్నదమ్ముల మధ్య పోటీ?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రాష్ట్ర మంత్రి వర్గంలో మన ఎమ్మెల్యేల్లో ఎవరికి చోటు దక్కుతుందనే ఉత్కంఠ వీడడం లేదు. రాష్ట్రంలో తొలి మంత్రివర్గ కూర్పులో ఉమ్మడి జిల్లా నుంచి ఎవరికీ అవకాశం దక్కలేదు. తాజాగా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌కు ముందే మంత్రివర్గ విస్తరణ చేపడతారని పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి. ఈ క్రమంలో ఎవరికి కేబినెట్లో బెర్త్ దక్కుతుందనే ఆసక్తి అధికార పార్టీతో పాటు ప్రజల్లోనూ ఉంది. ఉమ్మడి జిల్లాలో 10 స్థానాల్లో నాలుగు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. ఖానాపూర్, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో చేరాయి. పార్టీలో సీనియర్ నాయకుడు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుకు మొదటి కూర్పులోనే కేబినెట్లో చోటు దక్కుతుందనే ప్రచారం జరిగినా అవకాశం రాలేదు. ఇక గడ్డం సోదరులైన బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ కూడా అమాత్య పదవిపై ఆశలు పెట్టుకున్నారు. వీరి ముగ్గురి మధ్య పోటీ నెలకొంది. అన్నదమ్ముల్లోనే పోటీ మాజీ మంత్రి, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ఇద్దరూ అన్నదమ్ములు. వీరిరువురూ మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. 2004నుంచి 2009 మధ్య చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా పనిచేశానని, తనకే మళ్లీ అవకాశం ఇవ్వాలని వినోద్ కోరుతున్నారు. ఇందుకోసం రెండునెలల క్రితమే ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీని కలిసి విన్నవించారు. ఇక్కడ సీఎం రేవంత్‌రెడ్డిని తరచూ కలుస్తున్నారు. గడ్డం వివేక్ కూడా మంత్రి పదవిపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇద్దరూ పదవిపై పోటీ పడుతూ ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారు. వంశీ ఎంపీ టికెట్‌తో లింకు? లోక్ సభ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి బరిలో దిగాలని వివేక్ తనయుడు వంశీకృష్ణ అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి ఎమ్మెల్యే టికెట్లు, ఒకరికి ఎంపీ టికెట్, మళ్లీ అదే కుటుంబం నుంచి మంత్రి పదవి కూడా ఇస్తే ఇబ్బందులు ఎదురవుతాయనే కోణంలో పరిశీలన చేస్తున్నట్లు నాయకులు చెప్పుకొంటున్నారు. ఇక వంశీకి లోక్‌సభ టికెట్ కావాలని అడుగుతున్న క్ర మంలో టికెట్ ఇస్తే, మంత్రి పదవి వదులుకుంటా రా? లేక టికెట్‌తో పాటు కేబినెట్లో చోటు కోసం పట్టుబడుతారా? అనేది తేలాల్సి ఉంది. ఈ క్రమంలో లోక్‌సభ ఎన్నికలయ్యే దాకా ఈ సమస్య తేల్చ కుడా, మంత్రివర్గ విస్తరణ వాయిదా వేసే అవకాశం ఉందని కొందరు నాయకులు భావిస్తున్నారు. ఉమ్మ డి జిల్లాలో పాలన పరంగా ఇబ్బంది లేకుండా, స్థా నికంగా మంత్రి ఎవరూ లేకపోవడంతో ఆ స్థానంలో మంత్రి సీతక్కను ఇన్చార్జిగా నియమించారు. దీంతో ఆమెతోనే పాలన కొనసాగిస్తారా? లేక ఇక్క డి ఎమ్మెల్యేల్లో ఎవరికై నా అవకాశం కల్పిస్తారా?.. అనే విషయం తేలేవరకూ వేచిచూడాల్సిందే. ‘పీఎస్సార్’కు పెద్దల హామీ! ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పదేళ్లుగా కాంగ్రెస్ అధికారంలో లేకున్నా పార్టీని బలోపేతం చేశార నే మంచి పేరు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుకు ఉంది. కష్టకాలంలో పార్టీలో కేడర్‌ను కాపాడినట్లు చెప్పుకొంటారు. ఆ సమయంలో గడ్డం సోదరులు ఇంకా కాంగ్రెస్‌లో చేరలేదు. రెండేళ్ల క్రితం బీఎస్పీ నుంచి వినోద్, ఇటీవల అ సెంబ్లీ ఎన్నికల ముందు వివేక్ కాంగ్రెస్‌లో చేర డం తెలిసిందే. వీళ్లిద్దరి కంటే పార్టీలో సీనియర్‌గా ఉండి, పార్టీ కోసం కష్టపడ్డారని, పీఎస్సార్‌కే మంత్రి పదవి ఇవ్వాలని ఆయన వర్గీయులు పట్టుబడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‘దళిత గిరిజన దండోరా’ బహిరంగ సభ సక్సెస్ చేసి పార్టీలో ఉత్తేజం నింపారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన ‘హాత్ సే హాత్ జోడో యాత్ర’ను సక్సెస్ చేశారు. మంచిర్యాలలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జునఖర్గేతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆ సభ వేదికపైనే పీఎస్సార్ వచ్చే ప్రభుత్వంలో మంచిహోదాలో ఉంటారని హామీ ఇచ్చారు. తర్వాత పార్టీ ఎన్నికల వ్యూహ కమిటీ చైర్మన్‌గా పని చేశారు. ఈ క్రమంలో ఆయన కూడా గట్టిగానే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. -
హెచ్‌సీఏ అక్రమాలపై ఈడీ విచారణ.. మాజీ అధ్యక్షుడు వినోద్‌కు నోటీసులు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరెట్) విచారణ చేపట్టింది. ఉప్పల్ క్రికెట్ స్టేడియం నిర్మాణంలో రూ.20 కోట్ల మేర జరిగిన అవకతవకలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో శనివారం హెచ్‌సీఏ మాజీ అధ్యక్షులు, కార్యదర్శులను ఈడీ విచారించింది. మాజీ క్రికెటర్లు ఆర్షద్ అయూబ్, శివలాల్ యాదవ్‌లను కూడా ఈడీ ప్రశ్నించింది. హెచ్సీఎ మాజీ అధ్యక్షుడు, చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి మొదటి వారంలో హాజరుకావాలని వినోద్ కు నోటీస్‌లో పేర్కొంది. చదవండి: Test team of the year 2023: అత్యుత్తమ టెస్టు జట్టు ఇదే.. కోహ్లి, రోహిత్‌లకు నో ఛాన్స్ -
మంత్రి పదవికి ‘గడ్డం’ సోదరుల పోటీ.. అన్నదమ్ముల్లో గెలిచేదెవరో?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో ‘మంత్రి’పదవి కోసం సీనియర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మంత్రివర్గ మొదటి విస్తరణ లో ఉమ్మడి జిల్లా నుంచి ఎవరికీ ప్రాతినిధ్యం దక్కలేదు. దీంతో అంతా రెండో విడత విస్తరణపైనే ఆశలు పెట్టుకున్నారు. మరికొద్ది రోజుల్లోనే రెండో విడ త కేబినెట్ విస్తరణ జరగనుంది. ఈ క్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరికి వారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం పలు జిల్లాల నుంచి నలుగురు ఎమ్మెల్యేలను ప్రభుత్వ విప్‌లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విప్ పదవుల్లోనూ ఉమ్మడి జిల్లా నుంచి ఎవరూ లేరు. దీంతో మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, ఖానాపూర్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో కేబినేట్తోపాటు ఇతర కీలక పదవుల్లో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఖానా పూర్ ఎమ్మెల్యేగా గెలిచిన వెడ్మ బొజ్జుతోపాటు మరో ముగ్గురు సీనియర్ నాయకులు పోటీలో ఉన్నారు. ప్రధానంగా ముగ్గురి మధ్యే పోటీ ఉంది. ‘గడ్డం’ సోదరుల పోటీ.. ‘గడ్డం’ సోదరులు ఇద్దరూ మంత్రి పదవిపై న మ్మకం పెట్టుకున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి గెలిచిన గడ్డం వినోద్, చెన్నూరు నుంచి గెలిచిన వివేక్ ఒకరితో ఒకరు పదవి కోసం పోటీ పడుతున్నారు. ఒక దశలో వివేక్‌కు మొదటి కేబినెట్ విస్తరణలోనే బెర్త్ ఖాయమని ఆయన అనుచరులు చె ప్పుకున్నారు. కానీ.. మంత్రివర్గంలో ఆయన పేరు లేదు. అదే సమయంలో తనకే మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ వినోద్ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీని ఢిల్లీకి వెళ్లి కలిసి వచ్చారు. దీంతో ఇద్దరు అన్నదమ్ములు అమాత్య పదవి కోసం పోటీ పడడం కనిపిస్తోంది. ఈ ఇద్దరన్నదమ్ముల్లో ఎవరిని పార్టీ అధిష్టానం పరిగణనలోకి తీసుకుంటుందోనని కేడర్‌లో చర్చ జరుగుతోంది. -
TS Elections Result: చెన్నూర్‌లో నువ్వా? నేనా?
సాక్షి, మంచిర్యాల: హీటెక్కించిన విమర్శలు.. హోరెత్తించేలా ప్రచారాలు.. ఎవరికి వారే ఓటర్లను ప్రసన్నం తంటాలు. కచ్చితంగా తామే గెలుస్తామనే ధీమా. అభివృద్ధి తామే చేశామని.. మరో అవకాశం ఇస్తే ఇంకా చేస్తామని, చేసిందేమీలేదని.. తమకు అధికారం ఇస్తే సిసలైన అభివృద్ధి చూపిస్తామని.. ఇలా హామీల మీద హామీలతో ‘సై’ అంటూ ఎన్నికల సమరంలో దూకారు. మరి చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజా తీర్పు ఎలా ఉండబోతుందో.. ప్రజలు ఎవరిని అసెంబ్లీకి పంపిస్తారో.. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని మంచిర్యాల జిల్లా పరిధిలోని నియోజకవర్గం. బీఆర్ఎస్ నుంచి యువనేతగా గుర్తింపు ఉన్న బాల్క సుమన్ మరోసారి పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ తరఫున సీనియర్ నేత గడ్డం వివేక్ వెంకటస్వామి బరిలో నిలవడం ఇక్కడ తీవ్ర చర్చకు దారి తీసింది. పెద్దపల్లి మాజీ ఎంపీలుగా.. స్థానికతను చూపిస్తూ ప్రచారం చేసుకున్నారు ఇద్దరూ. ఇక బీజేపీ తరఫున దుర్గం అశోక్ పోటీలో నిలిచారు. చెన్నూరులో పురుష ఓటర్లు 91,969.. మహిళా ఓటర్లు 92,141.. ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఏడు.. సర్వీస్ ఎలక్టోర్లు 133.. మొత్తంగా మొత్తం ఓటర్ల సంఖ్య 1,84,250. చెన్నూర్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ 82.57 శాతం ఓటింగ్ రికార్డ్ కాగా.. ఈసారి ఎన్నికల్లో 79.97 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఈ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో కోల్‌బెల్ట్ ఏరియా ఓట్లు ఇక్కడ కీలకం కానున్నాయి. -
కోట్లు కుమ్మరిస్తున్న వినోద్.. ఈసారైనా గెలుపుతీరం చేరుతారా?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: బెల్లంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి గడ్డం వినోద్‌కు సొంత పార్టీలో కొందరి నాయకుల అత్యుత్సాహం పక్కలో బల్లెంల మారిందా? మనమే గెలుస్తామనే భ్రమ ఆయనకు మరోసారి చేటు చేస్తుందా? అనే ప్రశ్నలకు జవాబులు వెతకాల్సిన పరిస్థితి ఏర్పిడింది. ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకుంటూ ఊపు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి బెల్లంపల్లిలో మాత్రం ఆ గాలి ఎటు వైపు వీస్తు్ందోనని సందేహాలు వస్తున్నాయి. వినోద్ ఆర్థికంగా ఉన్న నాయకుడిగా జనంతోపాటు నాయకులు, కార్యకర్తల్లో ముద్రపడ్డారు. ఎన్నికల వేళ పార్టీలో చేరుతున్న వారిలో ఎక్కువగా ఏదో ఆశించి చేరుతున్నారని ఆ పార్టీ లీడర్లే అంటున్నారు. కొందరు అభిమానంతో ఉన్నారు. ఇంకొందరు ఆయన ప్రత్యర్థితో వైరంతో ఇటు వైపు చేరారు. మరోవైపు ఇన్నాళ్లు టికెట్ ఆశించి భంగపడిన గ్రూప్‌లో పనిచేసిన వారంతా ఇప్పటికిప్పుడు వినోద్ గెలుపు కోసం మనస్ఫూర్తిగా పని చేస్తున్నారా? అంటే చెప్పలేని పరిస్థితి ఉంది. వినోద్ గెలిస్తే తమ రాజకీయ భవిష్యత్‌కు ఇబ్బంది కలుగుతుందని భావించేవారు ఆయన వెనకాలే ఉండి ఏం చేస్తారనే సందేహాలు ఉన్నాయి. నమ్మకం ఎంతవరకు? నియోజకవర్గంలో కొందరు నాయకులు ఎవరు ఎటు వైపు పని చేస్తున్నారో ప్రశ్నార్థకంగా మారింది. పైకి జై కొడుతూనే అటు, ఇటు అన్నట్లు వ్యవహారిస్తున్నారు. పూటకో పార్టీ మార్చుతూ అనుమానాస్పదంగా మారారు. ధనవంతుడనే ఆశతో ఎన్నికల వేళ లబ్ధి కోరి చేరి, తీరా అనుకున్నది దక్కకపోతే మేలు కంటే కీడు చేసే వారు లేకపోలేదు. ఈ క్రమంలో గత ఎన్నికల్లో లాగే ఆయన్ని మళ్లీ ముంచేస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2018ఎన్నికల్లో వినోద్ చెన్నూరు నుంచి టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశించారు. టికెట్ దక్కక ఆ పార్టీ వీడి కాంగ్రెస్ నుంచి పోటీకి ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. చివరకు బీఎస్పీ నుంచి తొలిసారిగా బెల్లంపల్లి బరిలో నిలిచారు. నాడు, నేడు ప్రధాన ప్రత్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చేతిలో వినోద్ ఓటమి పాలయ్యారు. చిత్రంగా ఆ సమయంలో వినోద్ పక్కాగా గెలుస్తారని ప్రచారం జరిగింది. సర్వేలు అదే విషయం వెల్లడించాయి. ముఖ్యంగా ఏపీకి చెందిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పోలింగ్‌కు ముందు చేసిన ప్రీపోల్ సర్వేలో తెలంగాణ ఫలితాలు అంచనా వేస్తూ, బెల్లంపల్లిలో వినోద్ గెలుపు పక్కా అని చెప్పడంతో అంతా అదే భ్రమలో ఉండిపోయారు. కానీ ఫలితాల్లో బోల్తా పడ్డారు. సొంత నాయకులే డబ్బులు తీసుకుని తనను ఓడగొట్టారని వినోద్ ఆవేశంగా మాట్లాడిన ఘటనలు ఉన్నాయి. తాజాగా నాటి పరిస్థితులకు భిన్నంగా ఇప్పుడేమి లేవనే విశ్లేషకులు భావిస్తున్నారు. అదే ఎన్నికల్లో మహాకూటమి తరఫున పోటీ చేసిన సీపీఐ సీనియర్ నాయకుడు గుండా మల్లేశ్‌కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినా ఘోరంగా ఓడిపోయారు. ప్రస్తుతం సీపీఐ మద్దతు ఇస్తున్న, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయనేది ఆసక్తికరమైన అంశంగా మారింది. చల్లారని లోకల్ ‘చిచ్చు’ వినోద్ నియోజకవర్గంలో ఉండరనే పెద్ద అపవాదు మూటగట్టుకున్నారు. ఈసారి ప్రచారంలో నేను ఇక్కడే ఉంటానని పదే పదే చెబుతూ ప్రమాణాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇదే తీరుగా ఇక్కడే ఉంటాననే హామీలు ఇచ్చి కనిపించకుండాపోయి, ఎన్నికల సమయానికే వచ్చారని నాయకులే అంటున్నారు. ఇప్పటికీ బెల్లంపల్లిలో కాకుండా మంచిర్యాల నుంచే ప్రచారానికి వస్తూ వెళ్తున్నారు. మరోవైపు ఇ క్కడే ఉంటామని వినోద్ సతీమణి రమాదేవి, కూతురు వర్షతో ప్రచారం చేయిస్తున్నారు. ఈ ప్రమాణాలను ఓటర్లు ఎంతవరకు నమ్ముతున్నారనేది వచ్చే ఫలితాలే చెప్పనున్నాయి. స్థా నికంగా ఉన్నవారికే గెలిపించాలనే ప్రత్యర్థి వర్గం ప్రచారం చేస్తున్న తరుణంలో ఓట్లు ఎటు మల్లుతాయో వేచి చూడాలి. రూ.కోట్లు కుమ్మరిస్తున్న వినోద్ ఈసారైనా గెలుపు తీరం చేరుతారా? అని నియోజకవర్గంలో చర్చ నడుస్తోంది. -
బీజేపీకి గడ్డం వివేక్ రాజీనామా.. కాంగ్రెస్‌లో చేరిక
సాక్షి, హైదరాబాద్: పెద్దపల్లి మాజీ ఎంపీ గడ్డం వివేక్‌వెంకటస్వామి బీజేపీకి రాజీనామా చేసి.. కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి పంపించారు. మరోవైపు తెలంగాణ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన తనయుడు వంశీతో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీలో ఉన్నంతకాలం ఇచ్చిన మద్దతుకు కృతజ్ఞతలు తెలియజేసిన వివేక్.. బీజేపీకి తన రాజీనామాకు గల కారణాల్ని మాత్రం లేఖలో వివరించలేదు.వివేక్ కాంగ్రెస్‌లో చేరతారని ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే అది ఉత్త ప్రచారమేనన్న ఆయన.. బీజేపీ తరఫున పెద్దపల్లి లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తానంటూ ప్రకటించారు. అయితే.. ఇప్పుడు రాజీనామా ప్రకటించి కాంగ్రెస్‌లో చేరిపోయారు. కాంగ్రెస్‌లోకి బీజేపీకి రాజీనామా ప్రకటించిన వివేక్.. గంటల వ్యవధిలో కాంగ్రెస్‌లో చేరారు. తెలంగాణ ఎన్నికల ప్రచారం కోసం రాహుల్ గాంధీ హైదరాబాద్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. శంషాబాద్ నోవాటెల్‌లో ఉన్న రాహుల్‌తో వివేక్ భేటీ అయ్యారు. కొడుకు గడ్డం వంశీతో కలిసి ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కొడుకు కోసమే కాంగ్రెస్‌లోకి.. కాంగ్రెస్‌లోకి తిరిగి వివేక్ చేరికపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. కాంగ్రెస్‌వైపు మొగ్గు చూపడానికి కొడుకే కారణమని ప్రచారం వినిపిస్తోంది. కేవలం రాజకీయ వారసత్వాన్ని కొడుకుకు అందించే ఏర్పాట్లలో భాగంగానే ఆయన సొంత గూటికి తిరిగి చేరుకున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ విశ్లేషణకు తగ్గట్లే.. వంశీ కూడా గత కొద్ది రోజులుగా పొలిటికల్ పోస్టులతో రాజకీయాల్లో చేరడంపై సంకేతాలిస్తూ వస్తున్నాడు. గడ్డం వంశీ 22 ఏళ్లకే విశాఖ ఇండస్ట్రీస్‌లో చేరి జేఎండీ బాధ్యతలు చేపట్టాడు. కంపెనీకి సంబంధించిన ఆవిష్కరణలలో భాగం కావడంతో పాటు సొంత యూట్యూబ్ ఛానెల్‌తో పలువురు ప్రముఖుల్ని ఇంటర్వ్యూలు సైతం చేశాడు. అయితే.. గత కొంతకాలంగా రాజకీయ అంశాలపై వంశీ పోస్టులు పెడుతూ వస్తున్నాడు. ముఖ్యంగా మణిపూర్ అల్లర్ల సమయంలో మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వంశీ పెట్టిన పోస్టులు(ఆ తర్వాత డిలీట్ చేశాడు) పెట్టడం చర్చనీయాంశంగా మారింది. వివేక్ తండ్రి గడ్డం వెంకటస్వామి ప్రయాణం కాంగ్రెస్‌లోనే జరిగింది. దీంతో. తాత బాటలోనే కాంగ్రెస్‌లోకే వెళ్దామని కొడుకు వంశీ నుంచి గడ్డం వివేక్‌పై ఒత్తిడి నెలకొందని, అందుకే ఆయన పార్టీ మారారని గుసగుసలు వినిపిస్తున్నాయి. -
కాషాయ పార్టీలో కోల్డ్‌వార్!.. ఈటల, వివేక్ మధ్య విభేదాలకు కారణం?
తెలంగాణలో జెండా పాతేస్తామని కమలం పెద్దలు చెబుతున్నారు. ఇక్కడేమో పార్టీ నాయకులు గ్రూప్‌లుగా విడిపోయి రచ్చకెక్కుతున్నారు. వ్యక్తిగత వైరాలతో పార్టీ పరువు బజారుకీడుస్తున్నారని టాక్. నేతల మధ్య విభేదాలు కొంప ముంచుతాయని కేడర్ ఆందోళన చెందుతోంది. ఇంతకీ తెలంగాణలో రచ్చకెక్కిన ఆ ఇద్దరు ఎవరు? అసలు వారి మధ్య గొడవకు కారణం ఏంటి..? తెలంగాణలో అధికారమే లక్ష్యమని కమలం పార్టీ అధినాయకత్వం ఎప్పటి నుంచో చెబుతోంది. రాష్ట్రానికి ఎవరు వచ్చినా వచ్చే ఎన్నికల్లో అధికారం తమదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాజకీయాలను ఒక కుదుపు కుదుపుతామని..అమిత్ షా ఇక్కడి నుంచే పోటీ చేయబోతున్నారని ప్రచారం చేస్తున్నారు. కానీ, రాష్ట్రంలోని ముఖ్య నాయకులు గ్రూపులు కడుతూ కేడర్‌ను అయోమయానికి గురి చేస్తున్నారు. ముఖ్యంగా ఇద్దరు నాయకుల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయని బీజేపీ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది. ఇద్దరూ కరీంనగర్ నేతలే.. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎంపీ గడ్డం వివేక్ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోందని బీజేపీ ఆఫీస్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇద్దరూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారే. హుజురాబాద్ ఎన్నికల సమయంలో కలిసి మెలిసి తిరిగిన ఈటల, వివేక్ మధ్య.. ఆ తర్వాత ఎక్కడో వ్యవహారం బెడిసి కొట్టింది. వివేక్ కాల్ చేసినా ఈటల రాజేందర్ ఫోన్ లిఫ్ట్ చేయలేదని ప్రచారం నడుస్తోంది. దీంతో, పంచాయితీ కాస్తా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ మెంబర్ లక్ష్మణ్ ముందుకు వెళ్ళినట్టు సమాచారం. కారణాలపై పార్టీ పెద్దల ఆరా.. ఇక, సీనియర్ నాయకులతో మాట్లాడుకుంటూనే.. ఈటల రాజేందర్, వివేక్ పరస్పరం అరుచుకున్నట్లు సమాచారం. అయితే, అప్పుడే అనుకోకుండా అక్కడికి తెలంగాణ మంత్రి ఒకరు రావడంతో నేతల పంచాయితీ మధ్యలో ఆగిపోయినట్టు తెలుస్తోంది. ఇద్దరు నేతల మధ్య విభేదాలు ఇంతగా రచ్చ కెక్కడానికి కారణాలేంటో పార్టీ పెద్దలు ఆరా తీస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ఎప్పటికప్పుడు కేంద్ర పెద్దలు రాష్ట్ర నాయలకులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. అప్పుడే అధికారంలోకి వచ్చేసినట్లుగా కొందరు నేతలు ఫీలవుతున్నారని.. అందుకే పార్టీలో గ్రూప్‌లో తయారవుతున్నాయని కేడర్ నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఢిల్లీ పెద్దల దగ్గర ప్రాధాన్యం పెరగడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే సమయంలో ఈటల, వివేక్ మధ్య విభేదాలు బయటికొచ్చాయి. అయితే, ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో పార్టీ అధికారంలోకి రావాలనే లక్ష్యం నిర్దేశించుకున్న సమయంలో నాయకుల మధ్య ఇలాంటి గొడవలు ఏమాత్రం మంచిది కాదని హైకమాండ్ గట్టిగా క్లాస్ పీకినట్లు సమాచారం. హైకమాండ్ చొరవతో అయినా ఇద్దరి మధ్య సయోధ్య కుదురుతుందా? లేదో వేచి చూడాల్సిందే. -
హైదరాబాద్: ఈటల రాజేందర్‌కు బీజేపీ ఆహ్వానం
-
Etela Rajender: బీజేపీ వైపు ఈటల?
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజకీయ భవిష్యత్తుపై సస్పెన్స్ కొనసాగుతున్న సమయంలో.. ఆయన రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతో జరుపుతున్న భేటీలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బీజేపీవైపు ఆయన అడుగులు పడుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈటల సోమవారం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ ముఖ్యనేత యోగేంద్ర యాదవ్‌లతో భేటీ అయినట్టు వార్తలు వచ్చాయి. కానీ అలాంటిదేమీ లేదని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే గతంలో టీఆర్ఎస్లో క్రియాశీలంగా పనిచేసి ప్రస్తుతం బీజేపీలో ఉన్న మాజీ ఎంపీలు ఏపీ జితేందర్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామితో ఈటల రాజేందర్ ఇటీవల భేటీ అయినట్టు సమాచారం. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన మొదట్లో జితేందర్‌రెడ్డిని కలిసిన ఈటల.. తాజాగా గత ఆదివారం రాత్రి మరోసారి సమావేశమైనట్టు తెలిసింది. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తర్వాత మొయినాబాద్‌లోని తన వ్యవసాయ క్షేత్రంలోనే ఉంటున్న జితేందర్‌రెడ్డితో జరిగిన ఈ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్టు సమాచారం. ఈటల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఉప ఎన్నికలో ఓటమి పాలైతే రాజకీయ భవిష్యత్తు సమాప్తమవుతుందనే అభిప్రాయాన్ని జితేందర్‌రెడ్డి వ్యక్తం చేసిన ట్టు తెలిసింది. వివేక్‌తో జరిగిన భేటీలో ఈటల బీజేపీలో చేరే అంశం చర్చకు వచ్చినట్టు సమాచారం. కలవడంలో తప్పేమీ లేదన్న కిషన్‌రెడ్డి ఈటల రాజేందర్ తనను కలుస్తానంటూ ఫోన్ చేసి, మాట్లాడిన విషయం నిజమేనని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మంగళవారం ధ్రువీకరించారు. తాము 15 ఏళ్ల పాటు ఎమ్మెల్యేలుగా కలిసి పనిచేశామని, కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. బీజేపీలో చేరిక, హుజూరాబాద్ ఉప ఎన్నిక వంటి అంశాలేవీ తమ ఫోన్ సంభాషణలో ప్రస్తావనకు రాలేదన్నారు. కాగా.. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయ్యాక వివిధ పార్టీలు, సంఘాల నేతలను కలుస్తున్న క్రమంలోనే బీజేపీ నేతలతోనూ ఈటల భేటీ అవుతున్నారని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. గతంలో టీఆర్ఎస్లో క్రియాశీలంగా పనిచేసి ప్రస్తుతం బీజేపీలో ఉన్న నేతలను కలిసి రాష్ట్ర రాజకీయాలపై చర్చిస్తున్నట్టు సమాచారం. ఈటలపై వరుస ఆరోపణలు, విచారణల నేపథ్యంలో.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం లేకపోలేదనే అభిప్రాయం వినిపిస్తోంది. కాగా.. ఎమ్మెల్యే పదవికి ఇప్పట్లో రాజీనామా చేసే యోచనలో ఈటల లేరని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. -
కేసీఆర్‌కు ఫ్యాషన్‌గా మారింది: వివేక్
సాక్షి, పెద్దపల్లి : అబద్దాలు చెప్పడం, ఇచ్చిన హామీలను విస్మరించడం సీఎం కేసీఆర్‌కు ఫ్యాషన్‌గా మారిందని మాజీ ఎంపీ గడ్డం వివేక్ విమర్శించారు. కమీషన్ల కోసం ప్రాజెక్టుల దందాను కొనసాగిస్తున్నారని ఆరోపించారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రాజెక్టుల రీ డిజైన్ చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేస్తున్నారని మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు వ్యవహారంలో ప్రతిపక్షాలను కేసీఆర్ నిందించడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 12 కిలోల బియ్యంలో 10 కిలోలు కేంద్ర ప్రభుత్వమే పంపిణీ చేస్తోందని తెలిపారు. రైతుల ధాన్యం కొనుగోలు కూడా కేంద్రమే బరిస్తోందని గుర్తుచేశారు. రైతు బంధును నిలిపివేసే కుట్రలో భాగంగానే పంటలపై సీఎం కేసీఆర్ ఆంక్షలను విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతల పట్ల వారి సమస్యల పట్ల నిజంగా చిత్తశుద్ది ఉంటే రూ. లక్ష వరకు రుణమాఫీని ఒకే దఫాలో అమలు పరచాలని డిమాండ్ చేశారు. చదవండి: కరోనా: ఇంటి అవసరం.. ఇంకా పెరిగింది! కరోనాకు ప్రైవేట్ వైద్యం -
కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీమంత్రి వినోద్
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ మంత్రి గడ్డం వినోద్ తిరిగి సొంతగూటికి చేరారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆర్సీ కుంతియా, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమక్షంలో ఆయన శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో బెల్లంపల్లి నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థిగా జి.వినోద్ పోటీ చేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం వినోద్ మాట్లాడుతూ..‘గతంలో కాంగ్రెస్ పార్టీని వీడడం అపరిపక్వ నిర్ణయం. తిరిగి సొంతగూటికి చేరడం సంతోషంగా ఉంది. ఇది నా అదృష్ఠంగా భావిస్తున్నాను. గతంలో కొన్ని పొరపాట్ల వలన పార్టీ మారాల్సి వచ్చింది. 35 ఏళ్ల నుంచి నాకు కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉంది. కాంగ్రెస్ మా సొంత పార్టీ. మా నాన్న వెంకటస్వామి ప్రోత్సహంతో రాజకీయాల్లోకి వచ్చాను. కొన్ని కారణాల వలన ఇండిపెండెట్‌గా పోటీ చేశాను. నా సోదరుడు వివేక్ బీజేపీలో చేరడం ఆయన వ్యక్తిగత విషయం. వివేక్ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు. అందుకే నేను కాంగ్రెస్ లో చేరాను’ అని పేర్కొన్నారు. కాగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం పతాక స్థాయికి చేరిన సమయంలో కాంగ్రెస్ నుంచి వినోద్, వివేక్ బ్రదర్స్ తొలుత 2013 జూన్ 2న టీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత 2014 మార్చి 31న బ్రదర్స్ ఇద్దరూ తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ నుంచి పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా వివేక్, చెన్నూరు అసెంబ్లీకి వినోద్ పోటీచేసి ఓడిపోయారు. అనంతరం రాజకీయ పునరేకీకరణ పేరుతో టీఆర్ఎస్ చేపట్టిన ఆపరేషన్‌లో 2016లో మరోసారి వీరిద్దరు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వివేక్‌కు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హోదా లభించింది. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటు, సార్వత్రిక ఎన్నికల్లో కూడా సోదరులిద్దరికీ టిక్కెట్లు ఇవ్వకుండా టీఆర్ఎస్ మొండిచేయి చూపించింది. దీంతో వినోద్ ఒంటరిగా చెన్నూరు నుంచి పోటీ చేయగా.. వివేక్ ఎన్నికల అనంతరం భారతీయ జనతా పార్టీలో చేరారు. -
మొదలైన పోలింగ్.. అధ్యక్షుడు ఎవరో?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఎన్నికల పోలింగ్ శుక్రవారం ఉదయం నుంచి ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకే ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ ఎన్నికల్లో 230 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తిచేసినట్లు అధికారులు తెలిపారు. హెచ్‌సీఏ అధ్యక్షపదవి కోసం టీమిండియా మాజీ సారథి అజారుద్దీన్, దిలీప్ కుమార్, ప్రకాష్‌చంద్ జైన్లు ప్రధానంగా పోటీపడుతుండగా.. ఉపాధ్యక్ష పదవి కోసం జాన్ మనోజ్, సర్దార్ దల్దీత్ సింగ్‌లు రేసులో ఉన్నారు. హాట్ ఫేవరేట్‌గా అజారుద్దీన్.. హెచ్‌సీఏ అధ్యక్ష పదవి కోసం ముగ్గురు పోటీ పడుతున్నా.. అందరి చూపు టీమిండియా మాజీ సారథి అజారుద్దీన్‌పైనే ఉంది. అజారుద్దీన్ కూడా తన గెలుపుపై ధీమాగా ఉన్నారు. అయితే తన నామినేషన్ తిరస్కరణ కావడంతో హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు గడ్డం వివేక్ వెంకటస్వామి అజారుద్దీన్‌కు వ్యతిరేకంగా ప్రకాష్ ప్యానెల్‌కు మద్దతు ఇస్తున్నారు. దీంతో ఈ సారి అధ్యక్షుడు ఎవరనే దానిపై అందిరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇక ఈ ఎన్నికల్లో అంతర్జాతీయ మాజీ క్రికెటర్లు అజారుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్, వెంకటపతి రాజు, శివలాల్ యాదవ్, అర్షద్ ఆయుబ్, నోయల్ డేవిడ్, సాండ్రా బ్రగాంజ్, రజనీ వేణుగోపాల్, పూర్ణిమా రావు, డయానా డేవిడ్‌లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. -
బీజేపీలోకి మాజీ ఎంపీ; కేసీఆర్‌పై విమర్శలు
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ఎంపీ గడ్డం వివేక్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో శుక్రవారం కాషాయ పార్టీలో చేరారు. నరేంద్ర మోదీ పరిపాలన నచ్చడంతోనే బీజేపీలో చేరానని ఆయన చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని వెల్లడించారు. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తేవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. కేసీఆర్‌ను గద్దె దింపి, ప్రజాస్వామిక తెలంగాణ సాధిస్తామని ఉద్ఘాటించారు. ఉద్యమకారులంటే కేసీఆర్‌కు భయమని, అందుకే పార్టీ నుంచి బయటకు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఎంపీ టికెట్ ఇస్తానని చెప్పి కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. మాట తప్పడం ఆయనకు అలవాటయిందని చురకలంటించారు. ఉత్తర ప్రగల్భాలు.. వివేక్ రాకతో బీజేపీ మరింత బలోపేతం అవుతుందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. ఆయనకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. త్వరలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు. చాలామంది నాయకులు తమతో టచ్‌లో ఉన్నారని వెల్లడించారు. మరింతమంది నాయకులు.. వివేక్ బీజేపీలో చేరడం పార్టీకి మరింత ఊతమిస్తుందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆయన బలమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చారని గుర్తు చేశారు. భవిష్యత్తులో మరింత మంది నాయకులు బీజేపీలో చేరబోతున్నారని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరేస్తామని ఎంపీ అరవింద్ అన్నారు. తెలంగాణలో 15 సీట్లు గెలువడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. వివేక్ చేరిక బీజేపీకి మరింత బలాన్ని ఇస్తుందన్నారు. -
అమిత్ షా సమక్షంలో బీజేపీలోకి వివేక్
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో మాజీ ఎంపీ జి.వివేక్ శుక్రవారం కాషాయ కండువా కప్పుకున్నారు. కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో ఆయన బీజేపీలో చేరారు. కాగా టీఆర్ఎస్ను వీడిన అనంతరం వివేక్... బీజేపీలో చేరతారా? కాంగ్రెస్‌లో చేరతారా? అన్న గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. ఆ గందరగోళానికి ఆయన ఎట్టకేలకు తెరదించారు. కాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేరిక సాంకేతిక కారణాలతో ఆగిపోయిందని, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కూడా తమ పార్టీలోకి రావాల్సిన వారేనని, దారి తప్పి అటు వెళ్లారని బీజేపీ ముఖ్య నేత ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. -
నిలకడలేని నిర్ణయాలతో...వివేక్ దారెటు..?
సాక్షి,కరీంనగర్ : ‘రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవు’ అనేది జగమెరిగిన సత్యం. అతి విశ్వాసం, నిలకడ లేని నిర్ణయాలతో రాజకీయ కూడలిలో నిలబడ్డ మాజీ ఎంపీ గడ్డం వివేక్‌ను చూస్తే మరోసారి అది నిజమే అనిపిస్తోంది. మొన్నటి పార్లమెంటు ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ను వీడిన వివేక్‌కు అప్పట్లో పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ పార్టీ టికెట్టు ఇచ్చేందుకు బీజేపీ ముందుకు వచ్చినా, గతంలో ఎదురైన చేదు అనుభవాలతో భయపడి వెనక్కి తగ్గారు. ఆ ఎన్నికల్లో పెద్దపల్లిని ఆనుకొని ఉన్న మూడు లోక్‌సభ స్థానాల్లో బీజేపీ గెలిచింది. ఆ ఎన్నిక తర్వాత బీజేపీ హవా పెరగడం, రాష్ట్రంలో నాలుగు సీట్లు గెలిచి ఊపు మీదుండడంతో వివేక్ సైతం ఆ పార్టీలోకి వెళ్లాలని భావించారు. గత నెల 23న ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను తన కుమారుడు వంశీతోపాటు కలిసినప్పుడు బీజేపీలో చేరుతారని అందరూ అనుకున్నారు. అయితే అందుకు విరుద్ధంగా రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం సచివాలయం, అసెంబ్లీలను కూల్చి, కొత్త నిర్మాణాలు జరిపేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని ఓ వినతిపత్రం ఇచ్చి వెనుదిరిగారు. ఇది జరిగిన ఐదు రోజులకు జులై 28న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్వయంగా వివేక్ ఇంటికి వెళ్లి ‘బీజేపీలో చేరొద్దు. తిరిగి కాంగ్రెస్‌లోకి రండి’ అని ఆహ్వానించారు. దీంతో ఆయన ఏ పార్టీలో చేరుతారో తెలియని విచిత్ర పరిస్థితిలో చిక్కుకున్నారు. ఈలోపు ఆయన వెంట ఉన్న పెద్దపల్లి లోక్‌సభ పరిధిలోని అనుచర వర్గం ఎవరి దారి వారి చూసుకుంటున్నారు. నిలకడలేని నిర్ణయాలతో... తుది వరకు కాంగ్రెస్‌వాదిగా, ఇందిరాగాంధీ కుటుంబానికి విశ్వాసపాత్రుడిగా ఎన్నో పదవులు అలంకరించిన గడ్డం వెంకటస్వామి వారసుడిగా పదేళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చిన వివేక్ ఇప్పటికీ తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. రాజకీయంగా ఉన్నత స్థాయి పదవుల్లో ఉండాలనే ఆలోచనతో ఎప్పటికప్పుడు కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు వికటించి అసలుకే ఎసరు తెచ్చాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున 2009లో పెద్దపల్లి ఎంపీగా విజయం సాధించిన వివేక్ తెలంగాణ ఉద్యమం ఎగిసిపడుతున్న దశలో కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రకటించిన తరువాత సరిగ్గా 2014 ఎన్నికల ముందు తిరిగి కాంగ్రెస్‌లోకి వెళ్లారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని సోనియాగాంధీ చేసిన ప్రకటనకు ఆకర్షితుడై టీఆర్ఎస్ను వీడినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసి విద్యార్థి నాయకుడిగా పోటీ పడ్డ బాల్క సుమన్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. 2014లో తొలి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కేసీఆర్‌తో సఖ్యతతో మెలిగిన ఆయన 2017లో సింగరేణి ఎన్నికలకు ముందు మరోసారి టీఆర్ఎస్లో చేరారు. 2018లో అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఆయన పోషించిన పాత్ర వివాదాస్పదమైంది. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే... అనే ఆలోచనతో టీఆర్ఎస్లోనే ఉంటూ పలువురు కాంగ్రెస్ అభ్యర్థులకు ఆర్థిక సాయం చేశారనేది ఆరోపణ. ప్రస్తుతం మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురితోపాటు పెద్దపల్లి, చెన్నూరు, మంథని, రామగుండం, మంచిర్యాల నియోజకవర్గాలలో సిట్టింగ్ అభ్యర్థుల ఓటమికి పనిచేశారని ఆరోపణ. మంథని, రామగుండం సీట్లు టీఆర్ఎస్ కోల్పోవడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూర్చింది. ఈ నేపథ్యంలో పంచాయితీ కేటీఆర్ వద్దకు వెళ్లినా, ఎమ్మెల్యేలు వినలేదు. చివరికి పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి లోక్‌సభ టికెట్‌కే ఎసరొచ్చింది. విచిత్రం ఏంటంటే బాల్క సుమన్‌ను ఓడించేందుకు కాంగ్రెస్ అభ్యర్థి బోర్లకుంట వెంకటేష్ నేతకు సాయపడ్డారని వివేక్ మీద ఆరోపణ కాగా, ఆ ఎన్నికల్లో తనపై ఓడిపోయిన వెంకటేష్ నేతను గెలిచిన సుమన్ టీఆర్ఎస్లోకి తీసుకొచ్చి టికెట్టు ఇప్పించడం. బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఉంటే..? పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్టు ఇవ్వకపోవడంతో వివేక్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కాంగ్రెస్ నుంచి పోటీ చేద్దామంటే ఆ పార్టీ అప్పటికే చంద్రశేఖర్‌కు బీఫారంతో నామినేషన్ దాఖలు చేశారు. ఈ పరిస్థితిలో బీజేపీ ముందుకొచ్చింది. పార్టీ అప్పటికే ఎస్.కుమార్ పేరును పెద్దపల్లి అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ, వివేక్ కోసం రెండు రోజులు బీఫారం ఇవ్వకుండా ఆపింది. పార్టీ జిల్లా, రాష్ట్ర నాయకులు ఎంత నచ్చచెప్పినా, పోటీ చేసేందుకు వివేక్ ఒప్పుకోలేదు. గతంలో ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరి పోటీ చేస్తేనే ఓట్లు పడలేదని, ఈసారి బీజేపీ నుంచి చేస్తే ఎవరు ఓటేస్తారని ఆయన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారు. చివరికి బీజేపీ జాతీయ నేత రాంమాధవ్‌తో కూడా పలు మార్లు భేటీ అయి ఇదే విషయం చెప్పడంతో ఎస్.కుమార్‌ను అభ్యర్థిగా నిలిపింది. అయితే ఆ ఎన్నికల్లో బీజేపీ నాలుగు స్థానాల్లో గెలిచింది. అన్నింటికన్నా ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో పెద్దపల్లి చుట్టున్న కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఎంపీ స్థానాలను గెలవడం. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఉంటే టీఆర్ఎస్ మోసం చేసిందనే సానుభూతితోపాటు మోదీ హవా, కరీంనగర్, ఆదిలాబాద్ ప్రభావం కూడా పెద్దపల్లిపై పడేవని, అన్నింటికన్నా ముఖ్యంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఇద్దరూ కొత్తవారు కావడం లాభించేదని రాజకీయ విశ్లేషకుల వాదన. ఇప్పుడెటు..? టీఆర్ఎస్లో తనకు అండగా నిలిచిన కొందరు రామగుండం నాయకులు ఇటీవల బీజేపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ సైతం కమలం కండువా కప్పుకున్నారు. రేపటి మునిసిపల్ ఎన్నికలను ఆయన సవాల్‌గా తీసుకోబోతున్నారు. వివేక్ కాంగ్రెస్ పార్టీలో చేరికను మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. శ్రీధర్‌బాబు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ వ్యతిరేక వర్గం కాబట్టే తనకు పడని వివేక్‌ను ఆహ్వానించేందుకు వెళ్లారనేది ఆయన వర్గీయుల వాదన. ఈ పరిస్థితుల్లో ఆయన ఏ పార్టీలో చేరుతారో వేచిచూడాల్సిందే. -
జంతర్‌మంతర్ వద్ద నేతన్నల ధర్నా
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణలో చేనేత కార్మికుల మరణాలను నిరసిస్తూ నేతన్నల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద చేనేత కార్మికులు ధర్నా నిర్వహించారు. మాజీ ఎంపీ గడ్డం వివేక్ వెంకటస్వామి, సీపీఐ రాజ్యసభ ఎంపీ రాగేష్ నేతన్నల ధర్నాకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక ఇప్పటి వరకూ దాదాపు 350 మంది చేనేత కార్మికులు చనిపోయారని తెలిపారు. మరణించిన నేత కార్మికుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
కాషాయ గూటికి..!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పార్లమెంటు ఎన్నికల్లో సాధించిన అనూహ్య ఫలితాల నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీని విస్తరించాలని నిర్ణయించుకున్న బీజేపీ చూపు కరీంనగర్ ఉమ్మడి జిల్లాపై పడింది. కరీంనగర్ పార్లమెంటు స్థానంలో బండి సంజయ్‌కుమార్ ఘన విజయం నేపథ్యంలో ‘ఆపరేషన్ ఆకర్ష’ను ఈ జిల్లా నుంచే మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పార్టీ జాతీయ నేత రాంమాధవ్ ఈ మేరకు హైదరాబాద్‌లో మకాం వేసి వ్యూహం రూపొందిస్తున్నారు. తొలుత కాంగ్రెస్‌లోని ముఖ్య నాయకులు, మాజీ ప్రజాప్రతి నిధులను పార్టీలోకి తీసుకొనే ఆలోచనతో అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. కాంగ్రెస్‌తోపాటు తెలుగుదేశంలో మిగిలిన ఒకరిద్దరు ప్రముఖ నాయకులను పార్టీలోకి ఆహ్వానించే ఆలోచనతో బీజేపీ నాయకత్వం ఉంది. ఈ రెండు పార్టీల కథ ముగిసిన తరువాతే అధికార టీఆర్ఎస్పై గురి పెట్టనున్నారు. చారిత్రాత్మక తప్పిదంగా భావిస్తున్న వివేక్ పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ అధిష్టానం మాజీ ఎంపీ గడ్డం వివేక్‌కు టికెట్టు ఇవ్వలేదు. ఎమ్మెల్యేలు వ్యతిరేకించడంతో చెన్నూరు అసెంబ్లీకి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన బొర్లకుంట వెంకటేశ్ నేతను టీఆర్ఎస్లోకి తీసుకొని పెద్దపల్లి టికెట్టు ఇచ్చారు. ఈ ప్రక్రియలో చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, మంత్రి కొప్పుల ఈశ్వర్ కీలక పాత్ర పోషించగా, మిగతా ఎమ్మెల్యేలు సహకరించారు. అదే సమయంలో బీజేపీ వివేక్‌పై కన్నేసింది. జాతీయ నేత రాంమాధవ్ స్వయంగా వివేక్‌తో మాట్లాడి హైదరాబాద్ పిలిపించుకొని పెద్దపల్లి అభ్యర్థిగా బీజేపీ నుంచి పోటీ చేయమని కోరారు. అప్పటికే జాతీయ నాయకత్వం పెద్దపల్లి టికెట్టును ఎస్.కుమార్‌కు ప్రకటించినప్పటికీ, వివేక్ కోసం బీఫారంను నామినేషన్ల చివరి రోజు వరకు ఆపారు. అయితే అప్పటివరకు టీఆర్ఎస్లో ఉన్న తాను బీజేపీ నుంచి పోటీ చేస్తే ఓట్లు పోలవుతాయో లేదోనని భయపడ్డ వివేక్ పోటీకి నిరాకరించారు. తనకు బదులు సోదరుడు వినోద్‌కు సీటివ్వమని కోరగా, అందుకు అధిష్టానం ఒప్పుకోలేదు. చివరికి ఫలితాల్లో అనూహ్యంగా చివరి నిమిషంలో ఆదిలాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సోయం బాపూరావు ఘన విజయం సాధించారు. కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్‌లలో బీజేపీ విజయఢంకా మోగించింది. పెద్దపల్లి నుంచి పోటీ చేస్తే తాను కూడా గెలిచేవాడినని ఫలితాల అనంతరం ఆయన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో బీజేపీ బలమైన శక్తిగా మారుతుందని భావించిన ఆయన ఆపార్టీలో చేరేందుకు సన్నద్ధమయ్యారు. ఇటీవల రాంమాధవ్‌ను కలిసి తన అభీష్టాన్ని తెలియజేసినట్లు సమాచారం. వివేక్ చేరికను కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కూడా ప్రోత్సహిస్తున్నారు. రాంమాధవ్‌ను కలిసిన రమ్యారావు కేసీఆర్ కుటుంబానికి చెందిన రేగులపాటి రమ్యారావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌తో బుధవారం హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్లో పార్టీ నేత రాంమాధవ్‌ను కలిశారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ గత ఎన్నికల ముందు రాజీనామా చేసిన రమ్యారావు ఏ పార్టీలో చేరలేదు. వారం రోజుల్లో బీజేపీలో చేరనున్నట్లు ఆమె ధ్రువీకరించారు. రాష్ట్రంలో టీడీపీ ఉనికిలో లేకుండా పోవడంతో ఆ పార్టీ నేత ఇనుగాల పెద్దిరెడ్డి బీజేపీలో చేరేందుకు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే ఆయన పార్టీ అగ్రనేతలను కలిశారు. వీరితోపాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నాయకత్వ లేమి ఉన్న కొన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్‌కు చెందిన ముఖ్య నాయకులను చేర్చుకునే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఎంపీ బండి సంజయ్ నేతృత్వంలో.. కరీంనగర్ ఎంపీగా విజయం సాధించిన బండి సంజయ్‌కుమార్ నేతృత్వంలోనే కొత్త చేరికలకు ముహూర్తం ఖరారు కానున్నట్లు సమాచారం. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో సంజయ్ శుక్రవారం ఢిల్లీకి వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో బీజేపీలోకి ఎవరిని ఆహ్వానిస్తే ప్రయోజనకరంగా ఉంటుందనే విషయాన్ని ఆయన అగ్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. నియోజకవర్గాల్లో ప్రజాబలం ఉన్న నాయకులను పార్టీలోకి తీసుకోవాలని భావిస్తున్న ఆయన ఆ మేరకు ఓ జాబితాను తయారు చేసినట్లు తెలిసింది. కాంగ్రెస్ చేరికల తరువాత టీఆర్ఎస్కు చెందిన అసంతృప్తి వాదులు, మాజీలపై దృష్టి పెట్టనున్నట్లు తెలిసింది. -
పెద్దపల్లిపై వీడని ఉత్కంఠ!
సాక్షి, హైదరాబాద్: పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి మాజీ ఎంపీ వివేక్‌ను పోటీలో నిలిపే అంశంపై బీజేపీలో ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అక్కడి నుంచి ఎస్.కుమార్‌ను బీజేపీ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ఖరారు చేసినా ఆయనకు బీ–ఫారం ఇవ్వలేదు. మిగతా అన్ని నియోజకవర్గాల్లో ప్రకటించిన అభ్యర్థులకు బీ–ఫారాలను అందజేసింది. మాజీ ఎంపీ వివేక్‌ను పెద్దపల్లి నుంచి పోటీలో నిలపాలన్న ఆలోచనతోనే ఎస్.కుమార్‌కు బీ–ఫారం నిలిపేసినట్లు తెలిసింది. మరోవైపు వివేక్‌తో బీజేపీ ముఖ్యనేతలు రెండు రోజులుగా మంతనాలు జరుపుతూనే ఉన్నారు. అయితే కొన్ని అంశాల్లో పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా నుంచి హామీ కోసం వివేక్ ఎదురుచూస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న వివేక్.. అమిత్‌షాతో భేటీ అయ్యాకే పోటీపై స్పష్టత రానుంది. మరోవైపు మెదక్ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిని పోటీలో నిలిపేందుకు బీజేపీ నేతలు మంతనాలు జరిపారు. అయితే ఆమె నుంచి సానుకూలత లభించకపోవడంతో పార్టీ నాయకుడు రఘునందన్‌రావుకు ఆదివారం బీ–ఫారం అందజేశారు. వరంగల్ నుంచి పార్టీ నేత చింతా సాంబమూర్తి పేరును ఖరారు చేశారు. అయితే మాజీ మంత్రి విజయరామారావుతో బీజేపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. అంగీకారం కుదిరితే వరంగల్ అభ్యర్థిగా ఆయన పేరు ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. -
బీజేపీలోకి వివేక్?
సాక్షి, హైదరాబాద్/కరీంనగర్: పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్.. బీజేపీలో చేరడం దాదాపు ఖాయమైంది. ఆయన్ను పార్టీలో చేర్చుకుని పెద్దపల్లి నుంచే ఎంపీగా పోటీ చేయించాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు సఫలమైనట్టు సమాచారం. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ స్వయంగా వివేక్‌తో మాట్లాడి పార్టీలోకి ఆహ్వానించగా.. పలు తర్జనభర్జనల అనంతరం కాషాయ గూటికి చేరేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. పెద్దపల్లి జిల్లా రామగుండంలో శనివారం తన అనుచరులతో సమావేశమైన వివేక్.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరు పై విమర్శలు గుప్పించారు. నమ్మించి గొంతు కోశారని ఆరోపించారు. బానిస సంకెళ్లు తెగిపోయినట్టేనని వ్యాఖ్యానించారు. దీంతో ఆయన టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినట్టేనని స్పష్టమవుతోంది. బీజేపీ శనివారం విడుదల చేసిన రెండో జాబితాలో పెద్దపల్లి అభ్యర్థిగా గోదావరిఖనికి చెందిన ఎస్.కుమార్‌ను ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో వెంటనే అప్రమత్తమైన రాష్ట్ర బీజేపీ నేతలు హుటాహుటిన జాతీయ నాయకత్వంతో మాట్లాడి పెద్దపల్లి అభ్యర్థి ఎంపికను నిలిపి ఉంచారు. కాగా, బీజేపీ అగ్ర నేతల ఆహ్వానం మేరకే వివేక్ హైదరాబాద్ వెళ్లినట్లు చెబుతున్నారు. పార్టీలో చేరడానికి మూడు డిమాండ్లను వివేక్ ప్రతిపాదించగా.. రెండింటికి బీజేపీ అంగీకరించిందని సమాచారం. మొత్తమ్మీద ఆదివారం ఆయన కాషాయ కండు వా కప్పుకోవడం ఖాయమని, అనంతరం పెద్దపల్లి నుంచి బరిలోకి దిగుతారని అంటున్నారు. సునీతా లక్ష్మారెడ్డి కోసం ప్రయత్నాలు.. ఇక మెదక్ నుంచి మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిని బరిలో దింపేందుకు బీజేపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఇంకా కొలిక్కి రాలేదు. ఆమెను పోటీకి ఒప్పించేందుకు రాష్ట్ర బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఆమె నుంచి ఇంకా స్పష్టమైన సమాధానం రాలేదని సమాచారం. ఈ నేపథ్యంలో మెదక్ లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిని ప్రకటించకుండా పెండింగ్‌లో ఉంచారు. నమ్మించి గొంతుకోస్తారనుకోలే.. మాజీ ఎంపీ వివేక్ ఆవేదన గోదావరిఖని: ‘ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కన కూర్చోబెట్టుకుని ఎంపీ టికెట్ ఇస్తామన్నారు.. కానీ ఇలా నమ్మించి గొంతు కోస్తారనుకోలేదు’అని మాజీ ఎంపీ వివేక్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలోని తన నివాసంలో కార్యకర్తలు, అభిమానులతో భేటీ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎంపీ టికెట్ ఇస్తారన్న విశ్వాసంతో అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించడానికి తన శాయశక్తుల కృషి చేశానని పేర్కొన్నారు. ఇప్పుడేమో తక్కువ ఓట్లు వచ్చాయనే కారణంతో తనకు అన్యాయం చేశారని వాపోయారు. తాను ఎప్పుడూ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయలేదని, ఒకవేళ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కేటీఆర్‌కు చెప్పానని తెలిపారు. -
సముచిత స్థానం కల్పిస్తే ద్రోహం చేస్తావా?
గోదావరిఖని/మంచిర్యాల: మాజీ ఎంపీ వివేక్‌కు టీఆర్ఎస్ పార్టీ ద్రోహం చేయలేదని, ఆయన పార్టీకి తీరని ద్రోహం చేశారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. శనివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో విలేకరులతో, మంచిర్యాలలో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల ఓటమికి వివేక్ కుట్ర చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులతో టచ్‌లోనే ఉంటూ, వారికి ఆర్థికంగా సాయం చేయడం వల్లనే ధర్మపురిలో తన గెలుపు కష్టసాధ్యమైందని మంత్రి పేర్కొన్నారు. ఈ విషయమై తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, అందుకే సీఎంతో మాట్లాడి, పార్టీ ద్రోహులకు టికెట్టు ఇవ్వొద్దని కోరినట్లు చెప్పా రు. 2013లో టీఆర్ఎస్లోకి వచ్చిన వివేక్.. 2014లో కాంగ్రెస్‌లోకి జంపు చేశారని, ఎంపీగా ఓడిపోయిన ఆయన్ను , సీఎం కేసీఆర్ పార్టీలోకి చేర్చుకుని గౌరవప్రదమైన ప్రభుత్వ సలహాదారు పదవిని ఇచ్చి సముచిత స్థానం కల్పించారని గుర్తు చేశారు. దళితుడివి కాదు ధనికుడివి: సుమన్ ‘వివేక్..నీవు దళితుడివి కాదు ధనికుడివి.. నీవు దళితులకు ఏమి చేశావు? డబ్బు ఉందనే అహంకారంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించావ్. నిజమైన దళితులం మేమే’అని ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. వివేక్‌కు టీఆర్ఎస్ పార్టీ ఏం ద్రోహం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. -
నమ్మించి గొంతు కోశారు.. వివేక్ ఫైర్!
సాక్షి, పెద్దపల్లి : తెలంగాణ రాష్ట్ర సమితి తీరుపై పెద్దపల్లి మాజీ ఎంపీ గడ్డం వివేకానంద ఫైర్ అయ్యారు. మొన్నటి వరకు తనకు టికెట్ ఇస్తానని చెప్పి, నమ్మించి గొంతు కోశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా పని చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. పెద్దపల్లి పార్లమెంటులో టీఆర్ఎస్ పార్టీకి జీవం పోసింది తానేనన్నారు. గెలిచిన ఎమ్మెల్యేలు తనపై తప్పుడు సమాచారం ఇచ్చారని, తనపై బురద చల్లి టికెట్ ఇవ్వకుండా నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్నుంచి బయటికి రావడంతో బానిసత్వం నుంచి స్వేచ్ఛ వచ్చినట్లు ఉందన్నారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. ఎస్సీఐ నిర్మాణం కోసం కేంద్రంతో మాట్లాడి 10 వేల కోట్ల రూపాయల రుణ మాఫీ చేయించానని చెప్పారు. పెద్దపల్లి జిల్లాకు తన తండ్రి పేరు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. పెద్దపల్లి టికెట్ ఇవ్వమని అడగలేదని.. వాళ్లే ఇస్తామన్నారని వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా తిరిగి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. తనకు టికెట్ ఇవ్వకుండా తెలంగాణ ఉద్యమకారునికి టికెట్ ఇస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఇతర పార్టీల నుంచి టికెట్ ఇస్తామంటున్నారని, కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానన్నారు. చదవండి : కేసీఆర్‌కు షాక్ ఇచ్చిన వివేక్ -
రణమా... శరణమా!
సాక్షి, ఆదిలాబాద్: సుదీర్ఘకాలం పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడిగా వ్యవహరించిన దివంగత గడ్డం వెంకటస్వామి(కాకా) వారసత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. వ్యాపార రంగంలో ఉంటూ వెంకటస్వామి వారసుడిగా 2009లో రాజకీయాల్లోకి వచ్చీ రాగానే ఎంపీ అయిన గడ్డం వివేకానంద్ కేవలం ఐదేళ్లు మాత్రమే ఎంపీగా కొనసాగారు. రాజకీయంగా నిలకడ లేని నిర్ణయాలతో ఇబ్బందిపడిన వివేకానంద టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన షాక్‌తో అయోమయానికి గురయ్యారు. కేసీఆర్ గురువారం ప్రకటించిన లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో వివేక్‌కు చోటు దక్కలేదు. ఈ జాబితాలో గత ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ తరపున చెన్నూరు నుంచి పోటీకి దిగి టీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ చేతిలో 28వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన బోర్లకుంట వెంకటేశ్ నేతను అదృష్టం వరించింది. దీంతో వివేకానంద్ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. కాకా వారసుడిగా వచ్చిన వివేక్ పదేళ్లలోనే ఒడిదొడుకులు ఎదుర్కొని చివరికి రాజకీయంగా పతనం అంచులకు చేరడాన్ని వెంకటస్వామి అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో తన రాజకీయ భవిష్యత్‌పై సన్నిహితులతో చర్చించిన వివేక్ శనివారం ఉదయం 11 గంటలకు ఎన్టీపీసీలోని తన నివాసంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన వివేక్ వర్గీయులు, కాకా అభిమానులను సమావేశానికి ఆహ్వానించారు. ఈ సమావేశంలో వచ్చే సూచనలకు అనుగుణంగా భవిష్యత్ ప్రణాళికపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. సుమన్ నేతృత్వంలో ఎమ్మెల్యేల ప్రణాళిక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన డిసెంబర్లోనే పెద్దపల్లి లోక్‌సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల పరిధిలో ముసలం పుట్టిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ సిట్టింగ్‌లను ఓడించేందుకు వివేక్ కాంగ్రెస్ అభ్యర్థులతో కుమ్మక్కయ్యారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న అంచనాలతో ఉభయ తారకంగా కాంగ్రెస్ నేతలతోనూ ఆయన సన్నిహిత సంబంధాలు కొనసాగించారని కేసీఆర్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. ఇక వివేక్ అండతోనే ఆయన సోదరుడు వినోద్ ఏకంగా బీఎస్పీ నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య ఓటమికి ప్రయత్నించారని ప్రభుత్వ నిఘావర్గాలు సమాచారాన్ని చేరవేశాయి. ఈ నేపథ్యంలో గత జనవరి నుంచే వివేక్‌కు వ్యతిరేకంగా ప్రస్తుత మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను ముందు పెట్టి చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పావులు కదిపారు. వీరికి మిగతా ఎమ్మెల్యేలు కూడా పూర్తిస్థాయిలో సహకరించడంతో కేసీఆర్ పెద్దపల్లి సీటు పోటీ నుంచి వివేక్‌ను తప్పించారు. అయితే తనపై ఓడిపోయిన వెంకటేష్‌ను టీఆర్ఎస్లోకి తీసుకొచ్చి టికెట్ ఇప్పించడంలో కూడా బాల్క సుమన్ పాత్రే కీలకం. సామాజిక సమీకరణాల పేరుతో నేతకాని వర్గానికి చెందిన దుర్గం చిన్నయ్య ద్వారా మంత్రాంగం నడిపించారు. మంత్రి, ఎమ్మెల్యేలు ఒకే మాటపై ఉండి వివేక్ స్థానంలో వెంకటేశ్‌కు సీటు ఇవ్వాలని కోరడంతో వారి మాటకు విలువిచ్చిన కేసీఆర్ వెంకటేశ్‌ను పెద్దపల్లి అభ్యర్థిగా ఖరారు చేశారు. ఈ మేరకు గురువారం పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్, మంచిర్యాల గ్రంథాలయసంస్థ చైర్మన్, వెంకటేశ్ నేత ఎన్నికల ఏజెంట్ రేణికుంట్ల ప్రవీణ్ కలెక్టరేట్‌కు వెళ్లి టీఆర్ఎస్ అభ్యర్థి వెంకటేశ్ తరపున నామినేషన్ దాఖలు చేశారు. ఈనెల 25న వేలాది మందితో ర్యాలీగా వచ్చే వెంకటేష్ మరో సెట్ నామినేషన్ వేయనున్నట్లు సుమన్ ‘సాక్షి’కి తెలిపారు. తక్షణ కర్తవ్యం? పెద్దపల్లి ఎంపీ టికెట్ హామీతోనే రెండుసార్లు టీఆర్ఎస్లోకి వచ్చిన తనకు అన్యాయం జరిగిందని వివేక్ తన సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు సమాచారం. చెన్నూరులో బాల్క సుమన్‌ను ఓడించడానికి వెంకటేశ్ నేతకు తాను సహకరించానని ప్రచారం చేస్తున్న సుమన్.. అదే వెంకటేశ్‌కు ఇప్పుడు టికెట్ ఎలా ఇప్పిస్తారని కూడా ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. పెద్దపల్లిలో తనను రాజకీయంగా బలిపశువును చేయాలనే ఈ కుట్రకు తెరలేపారని ఆయన సన్నిహితులతో వ్యాఖ్యానిస్తున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో రాజకీయంగా ఎలాంటి అడుగు వేయాలనే దానిపై ఆయన మల్లగుల్లాలు పడుతున్నారు. 2013లో తండ్రి వెంకటస్వామి చెప్పినా వినకుండా టీఆర్ఎస్లో చేరడం, 2014 ఎన్నికల్లో తనకు ఎంపీ సీటు ఇచ్చినా చెన్నూరు సీటును సోదరుడు వినోద్‌కుమార్‌కు ఇవ్వని కారణంగా పార్టీని వీడి తిరిగి కాంగ్రెస్‌లో చేరడం, ఆ తర్వాత 2017లో మరోసారి టీఆర్ఎస్లోకి రావడం ప్రతిష్టకు భంగం కలిగించాయని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. ఇక తాజా అసెంబ్లీ ఎన్నికల్లో సోదరుడు వినోద్ బీఎస్పీ తరఫున పోటీ చేయడం తన రాజకీయ భవిష్యత్‌కు గొడ్డలిపెట్టుగా మారిందని కూడా ఆయన కొందరు నాయకుల వద్ద వ్యాఖ్యానించారని సమాచారం. ఈ పరిస్థితుల్లో మరోసారి పార్టీ మారి వేరే గుర్తు మీద పోటీ చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయనే అంశంపై ఆయన దృష్టి సారించారు. ఈ మేరకు శనివారం జరగనున్న సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. ఎదురుచూపుల్లో బీజేపీ టీఆర్ఎస్లో పెద్దపల్లి టికెట్‌పై ఊహాగానాలు వస్తున్న సమయంలో బీజేపీ అప్రమత్తమైంది. పార్టీ రాష్ట్ర నేతలు ఇప్పటికే వివేక్‌తో మాట్లాడగా.. ఆయన పార్టీ మారే విషయమై స్పష్టత ఇవ్వలేదని తెలిసింది. గతంలో కాంగ్రెస్ నుంచి రెండుసార్లు టీఆర్ఎస్లోకి రావడం, వినోద్ 2018లోనే మరో సారి పార్టీ మారి నగుబాటుకు గురైన నేపథ్యంలో ఆయన ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలిసిం ది. కాగా హైదరాబాద్‌లోనే మకాం వేసిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ వివేక్‌ను ఢిల్లీకి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ నాయకుడొకరు తెలిపారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులను పరిశీలిస్తే వివేక్ బీజేపీ నుంచి పోటీ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని ఆయన పేర్కొనడం గమనార్హం. కాగా వివేక్ బీజేపీ తరఫున పోటీకి నిరాకరిస్తే పెద్దపల్లి బీజేపీ అభ్యర్థిగా మాల సామాజిక వర్గానికే చెందిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కుమార్, దళితమోర్చా రాష్ట్ర కార్యదర్శి క్యాతం వెంకటరమణల్లో ఒకరికి అవకాశం దక్కొచ్చు. ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా పెద్దపల్లి నుంచి టీఆర్ఎస్ టికెట్ దక్కక పోవడంతో వివేక్ రాష్ట్రప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సీఎం కేసీఆర్‌కు పంపించారు. ‘2019 లోక్‌సభ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి పోటీ చేసే అవకాశం ఇస్తాననే హామీతోనే టీఆర్ఎస్లోకి ఆహ్వానించా రు. తెలంగాణ సాధన క్రమంలో నా చురుౖకైన భాగస్వామ్యానికి మెచ్చి పార్టీలోకి తీసుకున్నారు. కానీ నాకు ఇచ్చిన హామీ మేరకు టికెట్ ఇవ్వలేదు. నేను ఆ హోదాలో ఎలాంటి ఆర్థిక ప్రయోజనం పొందలేదు. నా రాజీనామాను ఆమోదించగలరు’ అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. -
కేసీఆర్‌కు షాక్ ఇచ్చిన వివేక్
సాక్షి, హైదరాబాద్ : పెద్దపల్లి మాజీ ఎంపీ, ప్రభుత్వ సలహాదారుడు గడ్డం వివేకానంద తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు షాక్ ఇచ్చారు. పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్డ్ సీటు బరి నుంచి తనను తప్పించిన నేపథ్యంలో వివేక్ తెలంగాణ ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను శుక్రవారం సీఎం కేసీఆర్‌కు పంపారు. పెద్దపల్లి ఎంపీ టిక్కెట్ ఆశించిన వివేక్.. ఆ సీటు తనకు కాకుండా కొత్తగా పార్టీలో చేరిన వెంకటేష్ నేతకు కేటాయించటంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే తన పదవికి రాజీనామా చేశారు. కాగా తన రాజకీయ భవిష్యత్ కార్యచరణపై వివేక్ ఎలాంటి స్పష్టత నివ్వకపోవటం గమనార్హం. చదవండి : వివేక్ ఔట్.. వెంకటేశ్‌కే టికెట్ అన్న రాజకీయాల కోసం.. తమ్ముడి తప్పటడుగులు! -
వివేక్ ఔట్.. వెంకటేశ్‌కే టికెట్
సాక్షి, కరీంనగర్: పెద్దపల్లి మాజీఎంపీ, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుడు గడ్డం వివేకానందకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ షాకిచ్చారు. పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్డ్ సీటు బరి నుంచి వివేక్‌ను తప్పించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బాల్క సుమన్ చేతిలో ఓడిపోయిన బోర్లకుంట వెంకటేశ్ నేతకు ఈ సీటు కేటాయించారు. అనూహ్యంగా టీఆర్ఎస్లో చేరిన తొలిరోజే ఎంపీ అభ్యర్థిగా బోర్లకుంట వెంకటేష్ నేత టికెట్ దక్కించుకున్నారు. ఆయనకు కేసీఆర్ శుక్రవారం బీఫారం అందజేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముసలం.. అసెంబ్లీ ఎన్నికల అనంతరం పెద్దపల్లి లోక్‌సభ టీఆర్ఎస్లో పుట్టిన ముసలం చివరికి వివేక్ పుట్టిముంచింది. పెద్దపల్లి లోక్‌సభ అభ్యర్థిగా 2017లో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన వివేక్‌కు కేసీఆర్ తగిన ప్రాధాన్యత ఇచ్చారు. వివేక్‌కు ఎలాంటి ఆటంకం కలగకూడదని పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బాల్క సుమన్‌ను చెన్నూరు అసెంబ్లీ నుంచి పోటీ చేయించారు. విచిత్రం ఏంటంటే అదే సుమన్ తనచేతిలో ఓడిపోయిన వెంకటేష్ నేతకు ఎంపీటికెట్ ఇప్పించడంలో కీలకపాత్ర పోషించడం. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ లోక్‌సభ పరిధిలోని ఏడు సీట్లలో టీఆర్ఎస్ రెండు సిట్టింగ్‌లను కోల్పోయింది. మంథనిలో పుట్ట మధు, రామగుండంలో సోమారపు సత్యనారాయణ ఓడిపోగా.. ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ కేవలం 500లోపు ఓట్లతో అతికష్టంగా విజయం సాధించారు. మంచిర్యాలలో టీఆర్ఎస్ అభ్యర్థి నడిపెల్లి దివాకర్‌రావు కేవలం 4800 ఓట్లతో గెలవగా.. పెద్దపల్లిలో మనోహర్‌రెడ్డిది 10 వేలలోపు మెజారిటీనే. బెల్లంపల్లిలో ఏకంగా వివేక్ సోదరుడు గడ్డం వినోద్ టీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్యకు ప్రధాన ప్రత్యర్థిగా పోటీ చేసి కేవలం 10వేల ఓట్లతో ఓడిపోయారు. చెన్నూరులో మిన హా ఈ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ సీట్లలో స్వల్ప మెజారిటీనే దక్కింది. ఈ పరిణామంతో గెలిచిన ఎమ్మెల్యేలతోపాటు ఓడిన సిట్టింగ్‌లూ తీవ్రంగా స్పందించా రు. ధర్మపురిలో కార్యకర్తల సమావేశంలో కొప్పుల వర్గీయులు తొలిసారిగా వివేక్‌పై నిప్పులు చెరిగారు. ఈశ్వర్‌ను ఓడించడానికి కాంగ్రెస్ అభ్యర్థికి వివేక్ రూ.3 కోట్లు ఇచ్చారని ఆరోపించారు. ధర్మపురిలో మొదలైన ముసలం ఎమ్మెల్యేలు బాహాటంగా అసంతృప్తి వెళ్లగక్కేవరకూ వెళ్లింది. ఈ పరిణామాలపై ‘సాక్షి’ ప్రధాన సంచికలో కథనాలు రావడంతో చివరికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించి వివేక్, మంత్రి కొప్పుల, ఎమ్మెల్యే సుమన్‌ను పిలిపించి రాజీకుదిర్చే ప్రయత్నాలు చేశారు. కేటీఆర్ సమక్షంలోనే ఎన్నికల్లో జరిగిన పరిణామాలన్నింటినీ ఈశ్వర్, సుమన్ ఏకరువు పెట్టడం, మిగతా ఎమ్మెల్యేలు సైతం వంత పాడడంతో వివేక్‌పై వేటు ఖాయమని తేలింది. టికెట్ల కేటాయింపు తుదిదశకు చేరుకున్న సమయంలో గురువారం పెద్దపల్లి లోక్‌సభ పరిధిలోని ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఇక్కడా తమ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా కుండబద్దలు కొట్టిన ఎమ్మెల్యేలు ప్రత్యామ్నాయంగా నేతకాని సామాజికవర్గానికి చెందిన బోర్లకుంట వెంకటేష్‌నేత పేరును తెరపైకి తెచ్చినట్లు సమాచారం. ఎస్సీల్లోని ఉప కుల సమీకరణలు, ఎమ్మెల్యేల మద్దతు, కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని పరిగణనలోకి తీసుకుని వెంకటేష్ నేతకు సీటు ఖరారు చేశారు. పార్టీలో చేరకుండానే చక్రం తిప్పిన వెంకటేష్ అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన వెంకటేష్ నేత పెద్దపల్లి లోక్‌సభ పరిధిలోని టీఆర్ఎస్లో జరుగుతున్న పరిణామాలను గమనించి పావులు కదిపారు. అప్పుడే పెద్దపల్లి లోక్‌సభపై కన్నేసిన వెంకటేష్ కాంగ్రెస్‌కు దూరమయ్యారు. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు వివేక్‌ను ఒంటరిని చేయడంతో ఆ స్థానంలోకి వెళ్లేందుకు తొలుత నేతకాని సామాజి క వర్గాన్ని అస్త్రంగా ఉపయోగించుకున్నారు. బెల్లంపల్లి, చెన్నూరు, పెద్దపల్లి, మంచిర్యాల అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉండడంతో అదే వర్గానికి చెందిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ద్వారా నరుక్కుంటూ వచ్చారు. తనను ఓడించిన సుమ న్కు దగ్గరైన వెంకటేష్ ఆయన మద్దతు కూడగట్టుకున్నా రు. మంత్రి ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే చందర్‌ను కలిసి అవకాశం ఇప్పించాలని కోరారు. కేటీఆర్ సిఫారసుతో ముఖ్యమంత్రి కేసీఆర్ టికెట్ ఖరారు చేశారు. గురువారం మధ్యాహ్నం సుమన్‌తో కలిసి టీఆర్ఎస్లో చేరిన వెంకటేష్ నేత అభ్యర్థిగా బీఫారం దక్కించుకుని రాజకీయాల్లో కొత్త చరిత్ర సృష్టించారు. వివేక్ భవితవ్యం ఎటు? పెద్దపల్లి సీటు చేజారిన వివేక్ రాజకీయ భవిష్యత్తు చిక్కుల్లో పడింది. 2013లో తెలంగాణ ఉద్యమం చివరి దశలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎంపీగా ఉంటూనే తన సోదరుడు వినోద్‌తో కలిసి టీఆర్ఎస్లో చేరిన ఆయన ఎన్నికలముందు తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. అప్పట్లో వివేక్‌కు ఎంపీ సీటు ఖరారైనప్పటికీ.. తన సోదరుడు వినోద్‌కు చెన్నూరు టికెట్ ఇవ్వని కారణంగా పార్టీని వీడారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యంతో పెద్దపల్లి టికెట్ హామీతో మరోసారి టీఆర్ఎస్లో చేరారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా తన సోదరుడికి టికెట్ విషయంలో కేసీఆర్ ఆగ్రహానికి గురయ్యారు. వినోద్ బీఎస్పీ నుంచి పోటీ చేయగా, టీఆర్ఎస్ అభ్యర్థి చిన్నయ్యకు వ్యతిరేకంగా తన సోదరుడిని గెలిపించేందుకు కృషి చేశారని ప్రభుత్వ నిఘావర్గాలు కేసీఆర్‌కు సమాచారం ఇచ్చాయి. అదే సమయంలో మిగతా ఎమ్మెల్యేలు కూడా తమను ఓడించేందుకు వివేక్ ప్రయత్నించారని చేసిన ఫిర్యాదులతో ఆయన సీటుపై వేటు పరిపూర్ణమైంది. ఇప్పుడు మరో పార్టీలోకి వెళ్లే సాహసం చేస్తారా..? లేదా..? అనేది అర్థం కావడం లేదు. బీజేపీ నేతలు ఇప్పటికే వివేక్‌తో టచ్‌లో ఉండి, పెద్దపల్లి సీటుకు అభ్యర్థిని ప్రకటించలేదు. వివేక్ బీజేపీలో చేరితే టికెట్ ఇచ్చేందుకు అధిష్టానం సిద్ధంగా ఉంది. అయితే గతంలో ఎదురైన అనుభవాల నేపథ్యంలో మరోసారి సాహసం చేస్తారా..? లేదా..? అనేది చూడాల్సిందే.