
సాక్షి, తిరుపతి : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టికెట్ కోసమే మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూటమికి అనుకూలంగా సర్వే ఫలితాలను ఇస్తున్నారని తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు జీ.వివేక్ ఆరోపించారు. సర్వేలతో ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలని ఆయన ప్రయత్నిస్తున్నారని, ఎవరిని గెలిపించాలో తెలంగాణ ప్రజలకు స్పష్టమైన అవగాహన ఉందన్నారు. సోమవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ప్రజానికం మరోసారి టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టారని వివేక్ అభిప్రాయపడ్డారు. త్వరలోనే కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత లాభం కోసమే కూటమికి అనుకూలంగా లగడపాటి సర్వేలు చేస్తున్నారని వివేక్ మండిపడ్డారు. కాగా మహాకూటమికి అత్యధిక స్థానాలు వస్తాయని ఇదివరకే ఆయన సర్వే ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment